Jump to content

AndhraPradesh Tourism

Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

పర్యాటకనామ సంవత్సరం! 

విశాఖలో అరకు, మధురవాడ, విజయవాడలో భవానీ ద్వీపాల అభివృద్ధి 

కడపలో పెన్నానదిపై తీగల వంతెన 

శ్రీకాకుళంలో బీచ్‌ రిసార్ట్‌ 

బృహత్తర ప్రణాళికలు, ప్రతిపాదనలను ఆమోదించిన ప్రభుత్వం 

ఈనాడు అమరావతి: కొత్త సంవత్సరంలో రాష్ట్రం సరికొత్త పర్యాటక కళను సంతరించుకోనుంది.విశాఖలో అరకు అందాలు కనువిందు చేయనున్నాయి. పెన్నాపై తీగల వంతెన అలరించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌), ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పర్యాటక, వారసత్వ ప్రాధికార బోర్డు ఆమోదముద్ర వేసింది.

పర్యాటక గమ్యస్థానంగా మధురవాడ.. 

మొత్తం 240 ఎకరాల కొండ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో 48 ఎకరాల స్థలంలో ప్రకృతి రమణీయతను చాటేలా ఆహ్లాదకరమై పచ్చిక (గ్రీన్‌ జోన్‌).. తూర్పు, పశ్చిమ భాగాల్లో సాహస, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. 42 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌, మలుపులను కలుపుతూ రహదారుల అభివృద్ధి.. 115 ఎకరాల్లో హోటళ్లు, కన్వెన్షన్‌ కేంద్రం, గ్రీన్‌ బిల్డింగ్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. 15 ఎకరాల స్థలాన్ని భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి కోసం కేటాయిస్తారు. 11 ఎకరాల్లో హస్తకళల గ్రామం, గ్రీన్‌, ఆర్గానిక్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌, 8 ఎకరాల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కేంద్రం అభివృద్ధి చేస్తారు.

సముద్ర మ్యూజియంగా విరాట్‌ 

విశాఖలోని రుషికొండలో రూ.350 కోట్ల అంచనా వ్యయంతో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధ నౌకను సముద్ర మ్యూజియంగా మారుస్తారు. దీనిని 15 నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇందులో 750 మంది సామర్థ్యంతో కన్వెన్షన్‌ కేంద్రం, 2 రెస్టారెంట్లు, 148 హోటల్‌ గదులు, పై అంతస్తులో అవుట్‌డోర్‌ ఓపెన్‌ స్పేస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటివి ఉంటాయి. జలాంతర్గామికి సంబంధించి శిక్షణ సంస్థను ఇందులో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ప్రాజెక్టులను చేపట్టేందుకు డీపీఆర్‌ను (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సిద్ధం చేసేందుకు ప్రతిపాదనలు ఆహ్వానించనున్నారు.

అరకులో గిరిజన సర్క్యూట్‌ 

అరకు ఎకో టూరిజం గమ్యస్థానంగా నిలిచేలా గిరిజన సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నారు. రూ.163 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులో.. శృంగవరపుకోట వద్ద దారిపక్కన అభివృద్ధి పనులు, అనంతగిరిలోని హరిత రిసార్టులో అదనపు కాటేజీలు, 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈతకొలను, సాహస కృత్యాల ప్రాంతం(జోన్‌), 150 మీటర్ల పొడవున సస్పెన్సన్‌ వంతెన, వైద్య పర్యాటక కేంద్రం, బోటింగ్‌ ఎరీనా, ఆర్ట్‌ థియేటర్‌ తదితర ఏర్పాట్లు చేయనున్నారు.

అమరావతిలో... 

అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో మెగా శిల్పారామాన్ని శిల్పారామం సొసైటీ ఏర్పాటు చేయనుంది. చేతి వృత్తుల శిక్షణ కేంద్రాలు, ఉత్పత్తుల డిజైన్‌ అభివృద్ధి కేంద్రం, ఉత్పత్తి- ప్రత్యక్ష ప్రదర్శన కేంద్రం, క్రాఫ్ట్‌ బజార్‌, బహుళ ప్రయోజన హాళ్లు, యాంపీ థియేటర్లు, గ్రామ, ఆదివాసీ మ్యూజియం, నిర్మించి నిర్వహించి అప్పగించే (బీఓటీ) విధానంలో స్టార్‌ హోటల్‌ నిర్మిస్తారు.

భవానీ ద్వీపంలో... 

విజయవాడ కృష్ణా నదిలో ఉన్న ఏడు ప్రధాన ద్వీపాల్లో మొదటి విడతలో భవానీ ద్వీపంతోపాటు, 515 ఎకరాల్లో విస్తరించి ఉన్న మరో 3 ద్వీపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

గండి‘కోట’లో... 

కడప జిల్లా గండికోట వద్ద పెన్నానదిపై తీగల వంతెన (రోప్‌-వే) ఏర్పాటు చేసి, ప్యాసింజర్‌ కేబుల్‌ కార్‌ షికారుకు ఏర్పాట్లు చేస్తారు.

500 ఉద్యోగాలు కల్పించేలా... 

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌వద్ద రూ.200 కోట్లతో 500 ఉద్యోగాలను కల్పించేలా లగ్జరీ బీచ్‌ రిసార్ట్‌ ఏర్పాటు చేస్తారు.

Link to comment
Share on other sites

చలో బొర్రా 
గుహలకు ఏటా పెరుగుతున్న సందర్శకులు 
గతేడాది 7.66 లక్షల మంది రాక 
పర్యటక శాఖకు రూ. 5 కోట్ల ఆదాయం 
అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే
మన్యం పర్యటనకు వచ్చే వారిలో 95 శాతం మంది బొర్రా గుహలను చూసేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. గుహలను సందర్శించే పర్యటకుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఏడాదికి పది శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని పర్యటక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

vsp-sty2a.jpg

 ఏడాది అక్టోబరు 8న చిమిడిపల్లి - బొర్రా స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో కప్పువలస వంతెన పిల్లరు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో రెండు నెలలపాటు కేకే లైనులో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయినప్పటికీ ఆ ప్రభావం బొర్రా గుహలపై పెద్దగా పడలేదు. 2017 జనవరి నుంచి డిసెంబరు వరకు పర్యటకులు గుహల సందర్శన ద్వారా సుమారు రూ.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంతకు ముందెన్నడూ ఇంత మొత్తంలో బొర్రా గుహలకు ఆదాయం రాలేదని, ఇదే ప్రథమమని ఏపీటీడీసీ సిబ్బంది చెబుతున్నారు. 2016లో బొర్రా గుహలను 6,73,465 మంది సందర్శించగా.. 2017లో 7,66,342 మంది సందర్శించారు. మార్చి, ఏప్రిల్‌, జులై, ఆగస్టు నెలల్లో మినహా మిగిలిన నెలల్లో గుహలను సందర్శించిన పర్యటకుల సంఖ్య 50 వేలకు పైగానే ఉంది. గతేడాది నవంబరులో లక్ష మందికిపైగా గుహలను సందర్శించారు.

ఆదాయం బాగు: గతేడాది బొర్రా గుహలను అధిక సంఖ్యలో పర్యటకులు సందర్శించారు. దీంతో గుహలకు ఆదాయం పెరిగింది. రెండు నెలలకుపైగా కేకే లైనులో రైళ్లు నడవకపోయినా గుహలకు ఆదాయం తగ్గలేదు. రోడ్డు మార్గంలో పర్యటకులు వచ్చి గుహలను సందర్శించారు. కేకే లైనులో రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమైన తర్వాత కిరండూల్‌ పాసింజరుతోపాటు ప్రత్యేకంగా రైలును నడపడంతో పర్యటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

- బద్రి, మేనేజరు, బొర్రా యూనిట్‌
Link to comment
Share on other sites

Guest Urban Legend
ర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు 
ఆంధ్రప్రదేశ్‌ బయో డైవర్షిటీ బోర్డు అధ్యక్షుడు మిశ్రా 
eag-brk1a.jpg

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి పలు ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ బయోడైవర్షిటీ బోర్డు అధ్యక్షుడు ఎస్‌బీఎల్‌ మిశ్రా అన్నారు. మారేడుమిల్లిలోని ఉద్యానవన నర్సరీ, రైతు శిక్షణ కేంద్రం (హెచ్‌ఎన్‌టీసీ ఫాం)లో పర్యాటకాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. సుమారు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కాటేజీలు, ఈతకొలను, రెస్టారెంటు నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి రమణీయత, సహజ సిద్ధమైన వాతావరణంలో, దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య పర్యాటకాభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మారేడుమిల్లి ప్రాంతంలోని వాతావరణం పర్యాటకులను కట్టిపడేస్తుందని, మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏఎస్‌ దినేష్‌ కుమార్‌, ఏఈ ఫాతిమాభాను, పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

స్కూబా @ మన వైజాగ్‌

నిన్నమొన్నటి వరకు ఆ దారిన పడవలు నడిచేవి కావు!
వెళ్లినా భారంగా కదిలేవి. కడలి తరంగాలూ ఉవ్వెత్తున పోటెత్తేవి. భయంతో ఆ ప్రాంతం గురించి కథలు కథలుగా చెప్పుకొనేవారు కొందరు! ఇప్పుడవన్నీ కాకమ్మ కథలని తేలిపోయాయి. అలల జడి వెనుక ఏ మాయలూ లేవని తెలిసిపోయింది. దీంతో పాటు.. ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన ఓ అద్భుతం వెలుగు చూసింది. దాదాపు శతాబ్దం కిందట అక్కడ మునిగిన ఓ భారీ నౌక ఆనవాళ్లు బయటపడ్డాయి. వీటిని బయటపెట్టిన ఘనత మన విశాఖ స్కూబాడైవర్స్‌కు దక్కుతుంది.
స్కూబాడైవింగ్‌ కడలి లోపలి అందాలు కళ్లముందుంచే అద్భుత విన్యాసం. గోవా తీరంలో, అండమాన్‌ అంచుల్లో, పుదుచ్చెరి బీచ్‌లో బాగా డిమాండ్‌ ఉన్న సాహసక్రీడ. ఈ అడ్వెంచర్‌ ఆటకు ఇప్పుడు వైజాగ్‌ అడ్డాగా మారుతోంది. కొన్నేళ్లుగా స్కూబాడైవింగ్‌ పర్యాటకులకు అందుబాటులో ఉంది. నడి సంద్రంలోకి వెళ్లి.. డైవింగ్‌ సూటూ, బూటూ వేసుకొని.. ఆక్సిజన్‌ సిలిండర్‌ తగిలించుకొని.. నీటిలోకి దూకేయడం కాదు స్కూబా డైవింగ్‌ అంటే! సముద్రంలో తేలుతూ.. మన ముందు నుంచి వెళ్తున్న జలచరాలను కళ్లారా చూడటం, సాగరంలో ప్రకృతి పొదిగిన అందాలను మనసారా వీక్షించడం. గోవా నుంచి పుదుచ్చెరి దాకా ఎక్కడ స్కూబాడైవింగ్‌ చేసినా ఇలాంటి అనుభూతే కలుగుతుంది. విశాఖలో అంతకుమించిన ఆనందం సొంతమవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సముద్ర గర్భంలో.. ఎప్పుడో మునిగిన నౌక బయటపడటమే ఇందుకు కారణం. భీమునిపట్నం బీచ్‌కు దగ్గర్లో సముద్రం లోపల ఈ నౌకను కనుగొన్నారు. మునిగిపోయిన నౌక విడిభాగాలు 500 మీటర్ల వరకూ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని వైజాగ్‌ స్కూబాడైవర్స్‌ గుర్తించారు. అంతేకాదు నౌక ఆనవాళ్లు ఏడు మీటర్ల లోతులోనే ఉండటం మరో విశేషం.

విశాఖ అనుకూలం
విశాఖపట్నంలో స్కూబాడైవింగ్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇక్కడ సముద్రంలో విజన్‌ చాలా పారదర్శకంగా ఉంటుంది. 30 మీటర్ల వరకూ బాగా కనిపిస్తుంది. దీంతో జలచరాల కదలికలను స్పష్టంగా గమనించవచ్చు. దీనికి తోడు సముద్రంలో కొత్తగా బయటపడిన నౌకను చూసేందుకు స్కూబాడైవర్స్‌తో పాటు పర్యాటక ప్రియులూ విశాఖకు తరలివస్తారంటున్నారు ‘లైవ్‌ ఇన్‌ అడ్వెంచర్స్‌’ సంస్థ డైరెక్టర్‌ బలరామ్‌ నాయుడు. మన దేశంలో సముద్రంలో మునిగిపోయిన నౌక అవశేషాలు గుర్తించడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.  ఏపీ టూరిజం సౌజన్యంతో ఇక్కడ స్కూబా డైవింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. భీమునిపట్నం నుంచి సుమారు 30 నిమిషాల పాటు బోటులో ప్రయాణిస్తే నౌక మునిగిపోయిన ప్రాంతానికి చేరుకోవచ్చు. రానున్న రోజుల్లో స్కూబాడైవింగ్‌కు విశాఖ కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదు.

image.jpeg.2c65759fbdff70f819f18dfa216a7099.jpeg

ఈత రావాల్సిన పనిలేదు
వైజాగ్‌లో స్కూబాడైవింగ్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఏటా అక్టోబర్‌ నుంచి మార్చి వరకు స్కూబాడైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈత రాని వాళ్లు కూడా స్కూబాడైవింగ్‌ చేయవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే డైవింగ్‌కు తీసుకెళ్తాం. గత సీజన్‌లో దాదాపు 200 మంది, ఈ సీజన్‌లో వంద మందికిపైగా పర్యాటకులు సముద్రంలోకి వెళ్లారు. ప్రస్తుతానికి స్కూబాడైవింగ్‌ కోసం ఒక్కొక్కరికి రూ.5,000 ఛార్జ్‌ చేస్తున్నాం. ముందుగా స్విమ్మింగ్‌పూల్‌లో స్కూబాడైవింగ్‌ తర్ఫీదునిచ్చిన తరువాతే సముద్రంలోనికి తీసుకెళ్తాం. మా సహాయకులు వారికి అండగా ఉంటారు. ఈతరాని వాళ్లను ఏడు మీటర్ల లోతువరకు తీసుకెళ్తాం. దాదాపు 45 నిమిషాలు సముద్రంలో గడపవచ్చు. జలచరాల కదలికలను, ఆటలను చూడవచ్చు. పర్యాటకులకు సముద్రంలో ఫొటోలు, వీడియోలు కూడా తీసి ఇస్తున్నాం. స్కూబాడైవింగ్‌లో అనుభవం ఉన్న వారిని 40 మీటర్ల లోతు వరకూ తీసుకెళ్తాం.

Link to comment
Share on other sites

ఏపీ టూరిజం శాఖకు శుభవార్త
16-01-2018 18:19:26
 
అమరావతి: ఏపీ టూరిజంశాఖకు శుభవార్త. ఏపీ టూరిజం శాఖకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. పసిఫిక్ ప్రాంత పర్యాటక రచయితల సంస్థ ఈ అవార్డును అందించనుంది. ఈ మేరకు ప‌సిఫిక్ ప్రాంత ప‌ర్యాట‌క ర‌చ‌యితల సంస్ధ ఏపీకి అవార్డును అందించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 9న బెర్లిన్‌ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌మీనా ఈ కార్యక్రమానికి హాజరై అవార్డును అందుకోనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...