Jump to content

Buckingham Canal inland waterways


Recommended Posts

బకింగ్‌హామ్‌ కెనాల్‌ లో జలరవాణా పునరుద్ధరణకు సర్వే
 
636123693828092903.jpg
  • జలరవాణాకు సిద్ధమైన ప్రాజెక్టు రిపోర్టు
గుంటూరు, తెనాలి: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలరవాణా ప్రాజెక్టు కార్యాచరణదిశగా కదులుతోంది. త్వరలో కాకినాడ- పుదుచ్చేరి మధ్య జలరవాణాలో తొలిఅడుగు వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జాతీయ జలమార్గం- 4గా గుర్తించిన బకింగ్‌హామ్‌ కెనాల్‌పై జలరవాణా పునరుద్ధరణకు సంబంధించిన సర్వే పూర్తయింది. సీతానగరం (ప్రకాశం బ్యారేజీ) నుంచి చినగంజాం వరకు 112 కి.మీ మేర సర్వే పూర్తిచేసి నివేదిక రూపొందించారు. ఈ నివేదికను ఆమోదం కోసం కేంద్ర డిజైన్ల సంస్థ (సీడీవో)కు పంపారు. నివేదికలో జలరవాణా పునరుద్ధరణకు సంబంధించి పలు అంశాలను పొందుపరిచారు. వీటి ప్రకారం జలరవాణా పునరుద్ధరణకు 654 ఎకరాల ప్రైవేట్‌ భూమి సేకరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే బకింగ్‌హామ్‌ కెనాల్‌ కింద 2615 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇవి పోను 654 ఎకరాలు మాత్రమే జలరవాణా ప్రాజెక్టు కోసం సేకరించాల్సి వస్తుందని భావిస్తున్నారు.
తొమ్మిది చోట్ల లంగరు కేంద్రాలు..
బకింగ్‌హామ్‌ కెనాల్‌లో జలరవాణా ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది చోట్ల లంగరు కేంద్రాలు (వార్ఫ్‌) ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కేంద్రాల్లోనే పడవలు ఆగి సరుకు లోడింగ్‌, అన లోడింగ్‌ చేసుకుంటాయి. సీతానగరం, తాడేపల్లి, వడ్డేశ్వరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు, పాండ్రపాడు, కారంచేడు, చినగంజాం, సంతరావూరులలో లంగరు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.
మలుపులు ఉన్నచోట మరింత వెడల్పు...
జలరవాణా పునరుద్ధరణలో భాగంగా బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో ఒక భాగంగా ఉన్న కొమ్మమూరు కెనాల్‌ పలుచోట్ల మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుంది. వీటిలో దుగ్గిరాల, కొలకలూరు వంటి చోట్ల ఉన్న మలుపులను 700 మీటర్ల రేడియేషనలో వెడల్పు చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. ఇలా చేస్తేనే భారీ పడవలు సులభంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. గతంలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో చిన్న పడవల ద్వారా మాత్రమే జలరవాణా జరిగేది. ప్రస్తుతం వెయ్యి మెట్రిక్‌ టన్నులకు తగ్గకుండా జలరవాణాను ప్రవేశ పెట్టనున్నారు. ఇందుకు అనుగుణంగా కెనాల్‌ను వెడల్పు చేయడంతో పాటు కట్టడాలను తిరిగి నిర్మించేందుకు నివేదికలో చేర్చారు.
ఏడు లాకుల ఆధునికీకరణ అవశ్యం...
జలరవాణాలో భాగంగా ఏడు లాకులను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ప్రాజెక్టు రిపోర్టులో స్పష్టంచేశారు. సీతానగరం, కొమ్మమూరు, సంగంజాగర్లమూడి, కొల్లిమర్ల, నల్లమడ, సంతరావూరు, పెదగంజాం లాకులను ఆధునికీకరించి జలరవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
పెదగంజాం వరకు మంచి నీటి కాల్వ.. దిగువన ఉప్పు నీటి కాల్వ
జలరవాణా జరిగే బకింగ్‌హామ్‌ కెనాల్‌ సీతానగరం నుంచి పెదగంజాం వరకు మంచినీటి కాల్వగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానది నీటిని పెదగంజాం వరకు తీసుకువెళుతుండటంతో అక్కడివరకు మంచినీటి కాల్వగా దీనిని ప్రాజెక్టు రిపోర్టులో పేర్కొన్నారు. గంజాం నుంచి చెన్నై వరకు ఉప్పునీటి కాల్వగా పరిగణించారు. గంజాం దిగువన కాల్వలో నీటిప్రవాహం కోసం రొంపేరు, ఇతర డ్రెయిన్ల నుంచి నీటిని తీసుకోవడంతోపాటు సముద్రం నుంచి వచ్చే బ్యాక్‌ వాటర్‌తో నింపి పడవలు నడపాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం సీతానగరం నుంచి సంగంజాగర్లమూడి వరకు కాల్వ జలరవాణాకు అనుగుణంగా ఉంది. అక్కడి నుంచి గంజాం వరకు 40 మీటర్ల బెడ్‌ విడ్త్‌ ఉండే విధంగా చేయాలని నిర్ణయించారు.
ఇదీ జలరవాణా మార్గం...
కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయ జలరవాణా మార్గం- 4గా గుర్తించిన ఈ మార్గంలో కాకినాడ కెనాల్‌, ఏలూరు కెనాల్‌, కొమ్మమూరు కెనాల్‌, నార్త్‌ బకింగ్‌హామ్‌ కెనాల్‌, సౌత్‌ బకింగ్‌ హామ్‌ కెనాల్‌, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఈ మార్గం నిడివి 971 కి.మీ.గా ఉంది. ఇందులో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో, 84 కి.మీ. తమిళనాడులో విస్తరించి ఉంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ పోర్టు నుంచి కృష్ణపట్నం రేవు వరకు జల రవాణా ద్వారా అనుసంధానం చేయనున్నారు. ముఖ్యమైన ఈ రెండు పోర్టులను అను సంధానం చేయడం ద్వారా జలరవాణా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వెయ్యి మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణాను ప్రవేశపెట్టనున్నారు. దీంతో కాల్వలను, లాకులను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంటుందని నివేదికలో పొందుపరిచారు. కేంద్ర డిజైన్ల సంస్థ నుంచి ఆమోదం రాగానే ప్రాజెక్టు పనులను చేపట్టే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
జలరవాణాలో..తొలి అడుగు
 
636153068684832447.jpg
గుంటూరు, తెనాలి : కాకినాడ-పుదుచ్చేరి మధ్య జల రవాణాలో తొలి అడుగు పడింది. కృష్ణా నదిలో ముక్త్యాల నుంచి హరిశ్చంద్రాపురం వరకు జల మార్గంలో పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచి ఖరారు చేశారు. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ టెండర్లను దక్కించుకున్నాయి. అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీంతో జలరవాణా ప్రాజెక్టులో వేగం పుంజుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. కాకినాడ - పుదుచ్చేరి మధ్య జాతీయ జలమార్గం- 4గా గుర్తించిన బకింగ్‌హామ్‌ కెనాల్‌పై జల రవాణా పునరుద్ధరణకు సంబంధించిన సర్వే ఇప్పటికే పూర్తయింది. తొలిదశలో ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు జల రవాణా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జల రవాణాపై ఆసక్తిగా ఉండటంతో పాటు ఇందుకు సంబంధించిన అవగాహనపై ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఏడా దిలోనే తొలిదశ జల రవాణాను ప్రవేశ పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇది సాకారమైతే రెండో విడతలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో జల రవాణా పునర్ధురణకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
112 కి.మీ మేర పూర్తయిన సర్వే...
బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో సీతానగరం నుంచి చినగంజాం వరకు 112 కి.మీ మేర సర్వే పూర్తిచేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర డిజైన్ల సంస్థ ఆమోదం కోసం పంపారు. ఇందులో జల రవాణా పునర్ధురణకు 654 ఎకరాల ప్రైవేట్‌ భూమి సేకరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే బకింగ్‌ హామ్‌ కెనాల్‌ కింద 2615 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇవి పోను 654 ఎకరాలు మాత్రమే జలరవాణా ప్రాజెక్టు కోసం సేకరించాల్సి వస్తుందని అంచనా వేశారు.
లంగరు కేంద్రాలు గుర్తింపు
జల రవాణాలో భాగంగా బకింగ్‌ హామ్‌ కెనాల్‌పై సీతానగరం, తాడేపల్లి, వడ్డేశ్వరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు, పాండ్రపాడు, కారంచేడు, చినగంజాం, సంతరావూరులలో లంగరు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటితో పాటు సీతానగరం, కొమ్మమూరు, సంగం జాగర్లమూడి, కొల్లిమర్ల, నల్లమడ, సంతరావూరు, పెదగంజాం లాకులను ఆధునికీకరించి జల రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా గుర్తించిన జాతీయ జలమార్గంలో కాకినాడ పోర్టు నుంచి కృష్ణపట్నం రేవు వరకు అనుసంధానం చేయనున్నారు. ఈ మార్గంలో వెయ్యి మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణాను ప్రవేశ పెట్టనున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
కాకినాడ-పుదుచ్ఛేరి మధ్య త్వరలో జల రవాణా
 
636178123158920418.jpg
  • పడవపై.. పర్యాటకం
  • జల మార్గంలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు 
  • దారిపొడవునా రవాణాతో పాటు ఆహ్లాదకరమైన ప్రయాణం 
  • సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
తెనాలి : కాకినాడ-పుదుచ్ఛేరి మధ్య త్వరలో ప్రవేశ పెట్టనున్న జల రవాణాలో పర్యాటకానికి పెద్ద పీట వేయనున్నారు. ఒక వైపు సరుకు రవాణాతో పాటు మరో వైపు పర్యాటక రంగాన్ని జాతీయ జల మార్గం పొడవున అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దేశంలో నాల్గో జాతీయ జలమార్గంగా కాకినాడ-పుదుచ్చేరి మార్గాన్ని గుర్తించారు. 1078కి.మీ. దారి పొడవునా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. తద్వారా జల మార్గంలో సరుకు రవాణాతో పాటు ఆహ్లాదకరమైన ప్రయాణానికి అనువుగా తీర్చిది ద్దేందుకు యోచిస్తున్నారు.
పర్యాటక కేంద్రాలు..
కాకినాడ-పుదుచ్ఛేరి మార్గంలో కాకినాడ కెనాల్‌, ఏలూరు, కొమ్మమూరు, నార్త్‌, సౌత్‌ బకింగ్‌ హామ్‌ కెనాల్‌, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. వీటిలో గోదావరి, కృష్ణా నదులపై పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, భవా నీ ద్వీపం, కనక దుర్గమ్మ ఆలయం, నాగార్జున సాగర్‌ వంటి పర్యాటక ప్రాంతాలు న్నాయి. వీటితో పాటు జలమార్గం వెళ్లే దారి లో ఉన్న పోర్టులను కూడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి అవకాశాలను పరిశీలిస్తున్నారు. నాల్గో జాతీయ జల మార్గంలో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఈ దారి పొడవునా పలు ఆలయాలు కూడా ఉండ టం పర్యాటకానికి కలిసి రానుంది.
తొలి విడతగా ముక్త్యాల నుంచి
హరిశ్చంద్రాపురం వరకు పనులు

రాష్ట్రంలో 2345 కి.మీ నావిగేషనకు వీలయ్యే మార్గాలు ఉన్న ట్లు అంచనా వేశారు. ప్రస్తుతం జల రవాణా పునరుద్ధరించనున్న కాకినాడ-పుదుచ్ఛేరి మార్గంలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. 1897లో ఈ కాల్వను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 20వ శతాబ్దం వరకు ఈ కాల్వ ద్వారా మద్రాసు వరకు జల రవాణా జరిగింది. ఆ రోజులలో రోడ్డు, రైలు సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో జల మార్గాన్ని ముఖ్య రవాణా మార్గంగా ఉపయోగించారు. 1939-45 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్దం జరిగిన సమయంలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ద్వారా 12.27 లక్షల టన్నుల సరుకు రవాణా జరిగింది. సాధారణంగా రోడ్డు మార్గాన ఒక హార్స్‌ పవర్‌కు 150 కిలోలు, రైళ్ల ద్వారా 500 కిలోలు రవా ణా చేసేందుకు వీలుం ది. అదే జల మార్గానికి వస్తే ఒక హార్స్‌ పవర్‌తో నాలుగు వేల కిలోల సరుకు రవాణాకు అవకా శం ఉంది. దీని వల్ల రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కేం ద్ర ప్రభుత్వం జల రవాణాను మళ్లీ ప్రవేశ పెట్టేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. కాకినాడ-పుదుచ్చేరి జాతీయ జల మార్గంలో తొలి విడతగా ముక్త్యాల నుంచి హరిశ్చంద్రాపురం వరకు పనులు ప్రారంభించనున్నారు. తర్వాత బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో ఈ పనులు చేపడతారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపో ర్టు సిద్ధం చేశారు. ఇదే సందర్భంలో ఈ మార్గంలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి.
మొత్తం ఐదు మార్గాలు
దేశంలో ఇప్పటి వరకు జల రవాణాకు ఐదు మార్గాలను గుర్తించారు. ఇందులో జాతీయ జల రవాణా మార్గం-1 గంగా నది (1620 కి.మీ.), మార్గం -2 బ్రహ్మపుత్ర (891 కి.మీ,), మార్గం -3 కేరళలోని వెస్ట్‌ కోస్ట్‌ కెనాల్‌ సిస్టం (205 కి.మీ.), మార్గం -4 కాకినాడ- పుదుచ్చేరి (1078 కి.మీ.), మార్గం-5 ఒడిసాలో బ్రాహ్మణి నది, మహా నంది డెల్టా ఉన్నాయి.
Link to comment
Share on other sites

  • 1 month later...

 

మార్చి నెలలో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రూ.2000 కోట్లతో బకింగ్‌హమ్‌ కెనాల్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో 40 పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నామని ఇందులో రెండు ఏపీలోనే ఉన్నాయన్నారు. ఇందులో ఒకటి వైజాగ్‌-చెన్నై కారిడార్‌, మరొకటి బెంగళూరు-చెన్నై కారిడార్‌ అని కేంద్రమంత్రి వివరించారు. శ్రీకాకుళం నుంచి అమరావతి, అమరావతి నుంచి అనంతపురం దాకా రహదారులను అభివృద్ధి చేస్తామని, ప్రధానంగా ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని గడ్కరీ చెప్పారు.

 

Link to comment
Share on other sites

జల రవాణాకు,,గ్రీన్‌ సిగ్నల్
 
636212689141077223.jpg
  • కాకినాడ - పుదుచ్చేరి మధ్య జలరవాణా
  • ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత పనులు ప్రారంభం
  • విశాఖ భాగస్వామ్య సదస్సులో నితిన్ గడ్కరీ ప్రకటన
 తెనాలి : కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల రవాణా ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈ ఏడాది నుంచే కాకినాడ - పుదుచ్చేరి మధ్య జలరవాణాలో పనులు ప్రారంభించనున్నారు. విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు వేదికగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఈ విషయం ప్రకటించారు. ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే బకింగ్‌ హామ్‌ కెనాల్‌ అభివృద్ధి ప్రారంభించి జల రవాణా పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌లో జలరవాణా విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తావించిన మీదట గడ్కరీ ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో జల రవాణాలో తొలి అడుగు పడనుంది.
 
    జాతీయ జల మార్గం- 4గా గుర్తించిన బకింగ్‌ హామ్‌ కెనాల్‌పై జల రవాణా పునరుద్ధరణకు సర్వే ఇప్పటికే పూర్తయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి చినగంజాం వరకు 112 కి.మీ మేర సర్వే పూర్తి చేసి నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం జలరవాణాకు అవసరమయ్యే భూ సేకరణపై ఒక అంచనాకు వచ్చారు. 654 ఎకరాల ప్రైవేట్‌ భూమి సేకరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే బకింగ్‌ హామ్‌ కెనాల్‌ కింద 2615 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఇవి పోను 654 ఎకరాలు మాత్రమే జల రవాణా ప్రాజెక్టు కోసం సేకరించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ భూసేకరణ చాలా సులభ సాధ్యంగా భావిస్తున్నారు.
 
తొలిదశలో ముక్త్యాల నుంచి బ్యారేజీ వరకు
జల రవాణాలో భాగంగా ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు తొలిదశ కింద జల రవాణా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జల రవాణాపై ఆసక్తిగా ఉండటంతో పాటు ఇం దుకు సం బంధిం చిన అవగాహ నపై ఒప్ప ందం కూడా కుదుర్చుకుం ది.ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే తొలి దశ జల రవాణాను ప్రవేశ పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇది సాకారమైతే బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో జల రవాణా పునరుద్దరణకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ప్రకటన చేయడంతో జల రవాణా మార్గం సుగమం అవుతోంది. 
 
120 మీటర్ల వెడల్పులో..
జల రవాణాకు వీలుగా బకింగ్‌ హామ్‌ కెనాల్‌ను 120 మీటర్ల మేర వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎంత భూమి అవసరమవుతుందనే దానిపై అంతర్గత జల రవాణా విభాగం సర్వే చేసింది. ప్రభుత్వ భూములు పోను ప్రైవేట్‌గా ఎంత మేర భూ సేకరణ చేయాల్సి ఉంటుందనే దానిపై డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను సిద్ధం చేశారు. సీతానగరం నుంచి ప్రారంభమై పెదగంజాం వరకు ఉన్న కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వను బకింగ్‌ హామ్‌ కెనాల్‌గా పూర్వం నుంచి పరిగణిస్తున్నారు.
 
లంగరు కేంద్రాలు గుర్తింపు
జలరవాణా మార్గంలో లంగరు కేంద్రాలను కూడా ఇప్పటికే గుర్తించారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌పై సీతానగరం, తాడేపల్లి, వడ్డేశ్వరం, సంగం జాగర్లమూడి, చేబ్రోలు, పాండ్రపాడు, కారంచేడు, చినగంజాం, సంతరావూరులలో లంగరు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటితో పాటు సీతానగరం, కొమ్మమూరు, సంగం జాగర్లమూడి, కొల్లిమర్ల, నల్లమడ, సంతరావూరు, పెదగంజాం లాకులను ఆధునికీకరించి జల రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా గుర్తించిన జాతీయ జలమార్గంలో కాకినాడ పోర్టు నుంచి కృష్ణపట్నం రేవు వరకు అనుసంధానం చేయనున్నారు. ఈ మార్గంలో వెయ్యి మెట్రిక్‌ టన్నుల సామర్థ్యానికి తగ్గకుండా జల రవాణాను ప్రవేశ పెట్టనున్నారు.
 
ఇదీ జల రవాణా మార్గం..
కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయ జల రవాణా మార్గం-4గా గుర్తించిన ఈ మార్గంలో కాకినాడ కెనాల్‌, ఏలూరు కెనాల్‌, కొమ్మమూరు కెనాల్‌, నార్త్‌ బకింగ్‌ హామ్‌ కెనాల్‌, సౌత్‌ బకింగ్‌ హామ్‌ కెనాల్‌, గోదావరి, కృష్ణా నదులు ఉన్నాయి. ఈ మార్గం నిడివి 971 కి.మీ.గా ఉంది. ఇందులో 887 కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో, 84 కి.మీ. తమిళనాడులో విస్తరించి ఉంది. కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు 1078 కి.మీ.గా ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ పోర్టు నుంచి కృష్ణ పట్నం రేవు వరకు జల రవాణా ద్వారా అను సంధానం చేయనున్నారు. ముఖ్యమైన ఈ రెండు పోర్టులను అను సంధానం చేయడం ద్వారా జల రవాణా పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు.
Link to comment
Share on other sites

గుంటూరులో జల రవాణా పనులు షురూ
 
636216133097433461.jpg
గుంటూరు, తెనాలి : కేంద్ర బడ్జెట్‌లో జల రవాణాకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్డు, రైల్వే, జల మార్గాలకు కలిపి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. దీంతో జల రవాణా పనులు ఇక షురూ కానున్నాయి. ఇప్పటికే ఐదు రాషా్ట్రల ఎన్నికల తర్వాత జల రవాణా పనులు చేపడతామని కేంద్రం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించడంతో త్వరలోనే జల రవాణా కార్యరూపం దాల్చనుంది. జల రవాణాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో మొత్తం ఐదు జల మార్గాలను గుర్తించింది. వీటిలో కాకినాడ - పుదుచ్చేరి నాలుగో జాతీయ జల మార్గం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ మార్గంలో తొలి విడత పనులకు టెండర్లు పిలిచారు. దేశంలో జల రవాణాకు వీలుగా గుర్తించిన మార్గాలలో జాతీయ జలరవాణా మార్గం-1 గంగానది (1620 కి.మీ.), మార్గం -2 బ్రహ్మపుత్ర (891 కి.మీ,), మార్గం -3 కేరళలోని వెస్ట్‌ కోస్ట్‌ కెనాల్‌ సిస్టం (205 కి.మీ.), మార్గం -4 కాకినాడ- పుదుచ్చేరి (1078 కి.మీ.), మార్గం-5 ఒడిసాలో బ్రాహ్మణి నది, మహా నంది డెల్టా ఉన్నాయి. కాకినాడ - పుదుచ్చేరి మధ్య ఈ ఏడాది పనులు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం 654 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో భూ సేకరణ సులువు కానుంది.
Link to comment
Share on other sites

వేగంగా జలరవాణా ప్రాజెక్ట్ పనులు, 1078 కిలోమీటర్ల లో సాగనున్న జల రవాణా

వేగంగా జలరవాణా ప్రాజెక్ట్ పనులు, 1078 కిలోమీటర్ల లో సాగనున్న జల రవాణా Super User 02 February 2017 Hits: 330  
 

water-ways-02022017.jpg

ఆంధ్రప్రదేశ్ లో, అన్ని రకాల సర్వేలు పూర్తి చేసుకున్న, జాతీయ జల రవాణా ప్రాజెక్ట్, ఇక కార్యరూపం దాల్చనుంది. పనులు వేగవంతం అవుతున్నాయి. జాతీయ నాలుగో జల మార్గం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరున శ్రీకారం చుట్టనున్నారు. నాలుగో జాతీయ జల రవాణా ప్రాజెక్టులో భాగంగానే బకింగ్‌హామ్ కాలువ లోతు, వెడల్పు పెంచుతారు. చౌకగా జల రవాణా సౌకర్యం లభించడమే కాకుండా ప్రధానంగా పర్యాటకాభివృద్ధి ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

కృష్ణా- గోదావరి నదులను అనుసంధానం చేస్తూ, మొత్తం 1078 కిలోమీటర్ల పోడువుతో, పుదుచ్చేరి వరకు కొనసాగే ఈ కాలువ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. ఈ కాలువ ఒక్క ఎపిలోనే 888 కిలోమీటర్లు ఉంది. రాజధాని అమరావతితో ఈ ప్రాజెక్టును అనుసంధానం చేస్తూ జలరవాణా మార్గం పనులు చేపట్టారు.

ఫిబ్రవరి మొదటి వారంలోగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 50 కిలోమీటర్ల పరిధిలో 600 ఎకరాలు అవసరంగా గుర్తించారు. ధవళేశ్వరం, వేమగిరి, కడియం, మేడపాడు, తొస్సిపూడి, చింతపల్లి, కొవ్వాడ, కాకినాడ మీదుగా ఈ కాలువ ఉంది. ఈ మార్గంలో ఏడు లాకులు, 19 వంతెనలు నిర్మిస్తారు. కాకినాడ కాలువ పరిధిలో 227 హెక్టార్లు, ఏలూరు కాలువ పరిధిలో 524.3 హెక్టార్లు, కొమ్మలూరు కాలువ పరిధిలో 497 హెక్టార్లు, నార్త్ బకింగ్ హామ్ కాలు పరిధిలో 129 హెక్టార్లు, దక్షిణ బకింగ్ హామ్ కాల్వ పరిధిలో 298 హెక్టార్లు, పుదుచ్చేరి పరిధిలో 27 హెక్టార్లు అవసరమని గుర్తించారు.

 

ప్రాజెక్టులో భాగంగా సాగునీటి కాలువలను కూడా ఆధునికీకరించాల్సి ఉంది. దాదాపు 200 వంతెనలు, 48 లాకులను రవాణాకు అనువుగా నిర్మిస్తారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ మధ్య కాలువ పొడవు 139 కిలోమీటర్ల వరకు విస్తరిస్తారు. వజీరాబాద్ విజయవాడ వరకు కృష్ణా నది పరిధిలో 157 కిలో మీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉంది. భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం వరకు గోదావరి నది పరిధిలో ఈ కాలువ 171 కిలోమీటర్ల పరిధిలో ఉంది. గోదావరి నది పరిధిలో ప్రస్తుతం 40 టన్నుల సామర్ధ్యం కలిగిన పడవలు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ కాలువల సామర్ధ్యాన్ని 210 టన్నులకు పెంచి నిర్మించనున్నారు.

Link to comment
Share on other sites

నెల రోజుల్లో ‘బకింగ్‌హామ్‌’ పనులు
 
  • రూ.2 వేల కోట్లతో జల రవాణా
  • టెండర్‌ ప్రక్రియ పూర్తి: గడ్కరీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): బకింగ్‌హామ్‌ కాలువ పనులను నెల రోజుల్లోపు ప్రారంభిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ చెప్పారు. బడ్జెట్‌ కేటాయింపులపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం భాగస్వామ్య సదస్సులో కూడా ఈ కాలువ పనుల గురించి తాను వివరించానని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. రూ.2 వేల కోట్లతో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో జల రవాణాకు ఈ కాలువ ఉపయోగపడుతుందని చెప్పారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధాన మార్గం, ఇతర కాల్వల ద్వారా ఈ జల రవాణా జరుగుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముగిసిందని, త్వరలోనే పనుల్ని కేటాయించి ప్రారంభిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను ఏపీ తమకు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడిగా ఈ భూముల్ని వ్యవహరిస్తామని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు భూసేకరణ చేసి తమకు పెట్టుబడి కింద ఇవ్వాలన్నారు. జల రవాణా విభాగం, పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తామని, పోర్టుల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మల్టీమోడల్‌ ట్రాన్సపోర్టు విధానాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారని, రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందుతుందని తెలిపారు.
Link to comment
Share on other sites

ఒక కిలోమీటరు 80 పైసలే ఖర్చు

కాకినాడ-పుదుచ్చేరికి జలమార్గం అభివృద్ధి

జిల్లాలో 59కి.మీ.ల ధవళేశ్వరం-కాకినాడ పోర్టుమార్గం అభివృద్ధి

న్యూస్‌టుడే, భానుగుడిసెంటర్‌(కాకినాడ)

eag-top2a.jpg

జిల్లాలో జలరవాణాకు ప్రభుత్వం పచ్చజెండా వూపింది... ఇన్‌లాండ్‌ వాటర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును నేషనల్‌ వాటర్‌ వే-4గా ప్రభుత్వం ప్రకటించింది. కాకినాడ నుంచి పుదుచ్చేరి (చెన్నై) వరకు గల 1095 కిలోమీటర్ల జలమార్గాన్ని పునరుద్ధరించి అందులో జలరవాణాను ప్రోత్సహించనుంది. దీంతో జిల్లాలో 59 కి.మీల జలమార్గం కొత్తరూపును సంతరించుకోనుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణను కూడా పూర్తిచేసి సంబంధిత దస్త్రాలను ఉన్నతాధికారులకు సమర్పించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

బ్రిటిష్‌ కాలంలో జలరవాణా ద్వారానే ఎగుమతులు, దిగుమతులు చేసేవారు. తరువాత రైలు, రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందటం, కాలువలు ఆక్రమణలకు గురికావటంతో జలరవాణా కనుమరుగైంది. కొన్ని దశాబ్దాలుగా చమురు ధరలు చుక్కలనంటుతోంది. రవాణాఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవటంతో ప్రభుత్వం మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుత రోడ్డు, రైలు రవాణాకు కిలోమీటరుకు రూ.3నుంచి 5వరకు ఖర్చవుతోంది. దీనితో పోలిస్తే జలరవాణాకు కిలోమీటరుకు 80 పైసలు మాత్రమే అవుతుండటంతో ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వాలు ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉన్న 1095 కిలోమీటర్ల బకింగ్‌హం కాలువలతో పాటు కృష్ణా, గోదావరి నదీపాయలను అభివృద్ధి చేయనున్నారు. (కాకినాడ-పాండిచ్చేరి 767కి.మీ(గోదావరి), రాజమహేంద్రవరం-భద్రాచలం 171(కృష్ణా), వజీరాబాద్‌ నుంచి విజయవాడ 157కీమీ మొత్తం 1095కీమీలు).

ప్రస్తుతం జిల్లాలో సిమెంటు, బియ్యం, బొగ్గు ఉత్పత్తులు ఎగుమతులు, దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. సిమెంటు పరిశ్రమకు కావాల్సిన ముడిసరకును ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేందుకు వ్యయం అధికమవుతోంది. అదే జలరవాణా ద్వారా దిగుమతి చేసుకుంటే ఖర్చు అతి తక్కువగా అవుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా సుమారు 20 లక్షల టన్నుల బియ్యం సింగపూర్‌, మలేషియా, జపాన్‌, ఐరోపాదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ బియ్యం 90 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచి సేకరించినవి కాగా 10 శాతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంది. ఎరువులు, సిమెంట్‌ ముడిసరుకు, బొగ్గు తదితర వస్తువులన్నీ సుమారు 30 లక్షల టన్నుల వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి ఎగుమతి చేస్తున్నాం. వీటిని కాకినాడ పోర్టుద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. దీనివల్ల రోడ్డు, రైలు మార్గాల ద్వారా రూ. కోట్లాదిగా ఖర్చవుతున్నాయి. అదే జలరవాణా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇవన్నీ తక్కువ ఖర్చుతో పోర్టు నుంచి ఎగుమతి చేయవచ్చు.. ఈ జలమార్గం ద్వారా 500 నుంచి వెయ్యి టన్నుల వరకు బరువును మోసే సామర్ధ్యం ఉండే మూడో తరగతి స్టాండర్డ్‌ బాడ్జీలు వెళ్లేలా అభివృద్ధి చేయనున్నారు.

జిల్లాలో కాకినాడ- రాజమహేంద్రవరం (ధవళేశ్వరం)కి 51కిలోమీటర్ల జలమార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాకినాడ జగన్నాథపురం నుంచి పోర్టు కలుపుకొని మరో 8కిలోమీటర్లు అంటే మొత్తం 59కిమీలు దీని పరిధిలోకి వస్తాయి. ధవళేశ్వరం, కడియం, జెడ్‌.మేడపాడు, తొస్సిపూడి, చింతపల్లి, అరట్లకట్ట, కొవ్వూరు, జగన్నాథపురం, ఉప్పుటేరు ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతంలో 14 వంతెనలను రీమోడల్‌ చేయటంతోపాటు కాలువలను సుమారు 110 మీటర్లు వెడల్పు చేయనున్నారు. వీటిలో 40 మీటర్ల కాలువలు, మిగతావి రోడ్లు, డ్రైనేజీలు వస్తాయి.

14 వంతెనల మధ్యలో ఏడు ఆటోమెటిక్‌ లాకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి జలరవాణా జరిగేటప్పుడు వాటంతట అవే తెరుచుకొని మళ్లీ మూసుకుంటాయి. బ్రిడ్జి ఎత్తును కూడా మార్చనున్నారు. ఓడలకు, బాడ్జీలకు క్లియరెన్స్‌ సరిపోయేలా ఏడు మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, ఉండేలా వీటిని డిజైన్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 260 ఎకరాల భూమిని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. జలరవాణా మార్గం అభివృద్ధి పనులకు ఇప్పటికే జలరవాణా ప్రాథికార సంస్థ టెండర్లు పిలిచింది. త్వరలోనే పనులు మొదలుపెడతారు. తొలిదశలో భాగంగా కాకినాడ-విజయవాడ మధ్య ఉన్న 189 కి.మీ జలమార్గాన్ని, ముక్త్యాల- విజయవాడ మధ్య ఉన్న 189 కి.మీల జలమార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.

అన్నిమార్గాలూ అనుసంధానం చేయాలి

జలరవాణా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంది. అన్ని కాలువలూ అనుసంధానం చేస్తేనే ఇటు ప్రజలకు, అటు వ్యాపారస్థులకు అన్నివిధాలా ఉపయోగపడుతుంది. ఈ మార్గంలో ప్రయాణించే బోట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకంగా డిజైన్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది.

- దంటు సూర్యారావు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు

2018-19కల్లా పూర్తిచేస్తాం...

జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే భూసేకరణను పూర్తిచేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి విజయవాడలో కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. 2018-19కి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నాం.

- ఎ.రవికుమార్‌, ప్రాజెక్టు ఏఈఈ

కాకినాడ-పుదుచ్చేరికి 1095 కి.మీ.ల జలమార్గం అభివృద్ధి

జిల్లాలో 59కీమీల జలమార్గం అభివృద్ధి

ఎనిమిది ప్రాంతాల పరిధిలో 14 వంతెనల ఆధునికీకరణ

ఏడు మానవ రహిత ద్వారాల ఏర్పాటు

కాల్వలను 110 మీటర్ల మేర వెడల్పు చేయనున్నారు

ఏటా 50లక్షల టన్నుల సరకును రోడ్డు, రవాణాద్వారా ఎగుమతి

50లక్షల టన్నులకు రూ.5 ఖర్చు

ఇకపై 80 పైసలే వ్యయం

ఈ మార్గంలో 500నుంచి 1000టన్నుల బాడ్జీలకు అనుమతి

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
జల రవాణాకు కృష్ణా పశ్చిమ డెల్టా అనుకూలం
 
636259389906069241.jpg
గుంటూరు, మంగళగిరి: కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ ప్రకాశం బ్యారేజి నుంచి మొదలై దుగ్గిరాల లాకుల వరకు 20.8 కి.మీల వరకు విస్తరించివుంది. డెల్టా ఆధునీకరణలో భాగంగా 2009 నుంచి డెల్టా కాలువల ఆధునికీకరణను చేపట్టారు. ఆ క్రమంలోనే పశ్చిమ ప్రధాన కాలువను రమారమి రూ.150 కోట్ల భారీ వ్యయంతో ఆధునికీకరించే విధంగా ప్రతిపాదనలను రూపొందించి టెండర్లను పిలిచినా ఆ ప్రక్రియ ముందడుగు వేయలేదు. ప్రస్తుతం జాతీయ జలరవాణా-4 కింద కాకినాడ నుంచి పుదుచ్ఛేరి వరకు 1095 కి.మీ పొడవున అభివృద్ధి చేసి తెలంగాణా, ఛత్తీస్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్ఛేరి రాషా్ట్రల మధ్య రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు 2006లోనే పురుడు పోసుకున్నా ఇప్పటివరకు అంచనాలు, సర్వేలతోనే కాలక్షేపం జరిగిపోతుంది. అంచనా వ్యయం కూడా పెరిగింది. అయినప్పటికీ రోడ్లు, రైల్వేలతో పోల్చుకుంటే ఈ జలరవాణా మార్గం అభివృద్ధి ఖర్చు తక్కువగానే వున్నందున దీనిని చేపట్టి తీరాలని ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పట్టుదలగా వుంది.
జలరవాణా అభివృద్ధిలో కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హమ్‌ కాలువ ప్రధానమైనవిగా మారనున్నాయి. జల రవాణాలో భాగంగా పశ్చిమ ప్రధాన కాలువను విస్తరించాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇది 120 మీటర్ల వెడల్పుతో చాలా విశాలంగా వుంది. తాడేపల్లి పట్టణ ప్రాంతంతో పాటు రేవేంద్రపాడు వరకు వున్న ఆక్రమణలను తొలగిస్తే సరిపోతుంది. అధికారులు ఇప్పటికే ఈ ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టారు. పశ్చిమ ప్రధాన కాలువ వెంబడి భూసేకరణ చేయాల్సిన పనిలేదు. కానీ కొమ్మమూరు కాలువ, బకింగ్‌ హామ్‌ కాలువ వెంబడి విస్తరణ చేయాల్సి వుంది. దీనికోసం 3,272 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో 2,615 ఎకరాలు ప్రభుత్వ భూములే వుండడంతో అదనంగా 657 ఎకరాలను సేకరిస్తే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. కానీ కృష్ణా పశ్చిమ కాలువలో కొద్దిమేర పూడికను తొలగించి కాలువలో ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ను నిర్మించి కాలువ కట్టలను బలోపేతం చేస్తూ వాటిపై రెండువైపులా డబుల్‌ లేన్‌ రోడ్లను నిర్మిస్తే సరిపోతుంది. వీటితో పాటు పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ, బకింగ్‌హామ్‌ కాలువలపై 605 కి.మీల నిడివిలో 776 కొత్త బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా పశ్చిమ ప్రధాన కాలువపై తాడేపల్లి, రేవేంద్రపాడుల వద్ద వున్న శిథిల వంతెనలను పునర్నిర్మిస్తారు. ఇదే సందర్బంలో 20.8 కి.మీ.ల పొడవున వున్న ఈ పశ్చిమ ప్రధాన కాలువను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తే అది రాజధాని అమరావతి శోభకు మరింత వన్నెను తీసుకువస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవతోంది. జల రవాణా జరగాలంటే కాలువలో నిత్యం రెండున్నర మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం వుండాలి. పట్టిసీమ, మరికొన్నాళ్లకు పోలవరం కాలువల ద్వారా పెద్దఎత్తున గోదావరి నీళ్లు ప్రకాశం రిజర్వాయర్‌కు రావడం ఖాయం కానున్నందున కాలువలకు నిరంతరం నీటి విడుదల సాగే అవకాశాలు మెరుగవుతాయి. దీంతో అన్నీ సీజన్‌లలోనూ జల రవాణా ఆటంకాలు లేకుండా సాగే అవకాశం వుంటుంది. దరిమిలా ప్రస్తుత అంచనాల ప్రకారం ఏటా 11 మిలియన్‌ టన్నుల ఉత్పత్తులను జల రవాణా చేసే వీలవుతుంది. ప్రధానంగా బొగ్గు, బియ్యం, సిమెంటు, ఎరువులు, అటవీ ఉత్పత్తులు, ఉప్పు తదితరాలను పెద్దఎత్తున చాల చౌకగా జల రవాణా చేయవచ్చు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

ముంపు నివారణ... జల రవాణా!
మరింత వెడల్పుగా కొండవీటివాగు, పాలవాగు
అదనంగా మరో కాలువ నిర్మాణం
మొత్తం 5 రిజర్వాయర్లు
రూ.809 కోట్ల అంచనాతో పనులు
జల ప్రణాళికకు ముఖ్యమంత్రి ఆమోదం
hhhh.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతికి కొండవీటివాగు, పాలవాగుల నుంచి వరద ముంపు నివారించేందుకు రూపొందించిన జల ప్రణాళిక (బ్లూ మాస్టర్‌ ప్లాన్‌)ను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఆమోదించారు. వరద ముంపును అరికట్టడంతోపాటు ఈ వాగుల్ని జల రవాణాకు అనుగుణంగా, పర్యాటక ఆకర్షక ప్రదేశాలుగానూ తీర్చిదిద్దే చర్యల్ని ప్రణాళికలో పొందుపరిచారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కాడిస్‌, భారత్‌కు చెందిన టాటా సంస్థలు సంయుక్తంగా ఈ ప్రణాళికను రూపొందించాయి. కొండవీటివాగు, పాలవాగుల్ని వెడల్పు చేయడంతో పాటు, వరద నీటి నిల్వకు రాజధాని పరిధిలో మూడు, రాజధానికి వెలుపల రెండు రిజర్వాయర్లు నిర్మించాలని బ్లూ కన్సల్టెన్సీ సంస్థ సూచించింది. గ్రావిటీ ద్వారా వరద నీరు ప్రవహించేలా 8 కి.మీ. పొడవైన మరో కాలువను నిర్మిస్తారు. వాగుల వెడల్పు, రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.809 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ప్రపంచబ్యాంకు నుంచి తీసుకునే రుణంతో ఈ పనులు చేపట్టనున్నారు.

జల ప్రణాళికలోని ముఖ్యాంశాలు..
* రాజధాని పరిధిలో కొండవీటివాగు పొడవు 21.3 కి.మీ., పాలవాగు పొడవు 16.7 కి.మీ. ఉంది. దీంతోపాటు 8 కి.మీ. పొడవైన కాలువను లాం నుంచి పెదపరిమి మీదుగా వైకుంఠపురం వరకు నిర్మిస్తారు.

* కొండవీటివాగుని ఉండవల్లి నుంచి నీరుకొండ వరకు (11 కి.మీ. పొడవు) వాగు అడుగు భాగంలో 75 మీటర్లు, పై భాగంలో 115 మీటర్లు వెడల్పు చేస్తారు. కాలువకు అటు 30 మీటర్లు, ఇటు 30 మీటర్ల ప్రాంతాన్ని హరిత వనాల అభివృద్ధికి కేటాయిస్తారు.

* నీరుకొండ నుంచి అనంతవరం వరకు (10.3 కి.మీ.) వాగు అడుగు భాగంలో 14 మీటర్లు, పై భాగంలో 65 మీటర్ల మేర వెడల్పు చేస్తారు. ఇరువైపుల 20 మీటర్ల హరిత వనాలుంటాయి. ఉండవల్లి నుంచి నీరుకొండ వరకు వాగు జల రవాణాకు అనుకూలంగా ఉంటుంది.

* పాలవాగుని కృష్ణాయపాలెం నుంచి సచివాలయం వరకు( 9.3 కి.మీ.) అడుగు భాగంలో 25 మీ., పైభాగంలో 65 మీ. వెడల్పు చేస్తారు. కాలువకి అటూ ఇటూ 20 మీటర్ల వరకు హరిత వనాలుంటాయి. జల రవాణాకు అనుకూలం.

* సచివాలయం నుంచి దొండపాడు వరకు (7.4 కి.మీ.) వాగు అడుగు భాగంలో 12 మీటర్లు, పై భాగం 45 మీటర్లు వెడల్పు చేస్తారు. వాగుకి అటుఇటు 30 మీటర్ల మేర హరిత వనాల కోసం విడిచిపెడతారు. జలరవాణా ఉండదు.

* వైకుంఠపురం వరకు నిర్మించే కాలువ (8కి.మీ) అడుగు భాగంలో 40 మీటర్లు, పై భాగంలో 70 మీటర్ల వెడల్పు ఉంటుంది. కాలువకి అటూఇటూ 20మీటర్ల చొప్పున హరిత ప్రదేశం ఉంటుంది. జల రవాణా ఉండదు.

* కొండవీటివాగుని వెడల్పు చేయడానికి 885 ఎకరాలు, పాలవాగుకి 433 ఎకరాలు, గ్రావిటీ కాలువకి 217 ఎకరాలు కావాలని అంచనా.

* నీరుకొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ, శాకమూరు వద్ద 0.2 టీఎంసీ సామర్థ్యంగల రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఈ మూడు జలాశయాలకు 690 ఎకరాలు కావాలి. రాజధానికి వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీలు, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీ, సామర్థ్యంగల రిజర్వాయర్లు నిర్మిస్తారు.

* కాలువలు, వాగులు, వాటి పక్కన హరిత వనాలకు కలిపి మొత్తం 2226 ఎకరాలు కావాలని అంచనా.

* ఐదు రిజర్వాయర్లలో 1.3 టీఎంసీ, వాగులు కాలువల్లో 0.31 టీఎంసీ జలాలు నిల్వ చేసేందుకు అవకాశం ఉంటుంది.

* అదనంగా వచ్చే వరద నీటిని ఉండవల్లి వద్ద పంపింగ్‌ ద్వారా 12,350 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి పంపిస్తారు. గ్రావిటీ ద్వారా పశ్చిమ డెల్టా కాలువల్లోకి 4000 క్యూసెక్కులు, వైకుంఠపురం వద్ద పంపింగ్‌ ద్వారా 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి పంపిస్తారు.దీనికి అనుగుణంగా కృష్ణా పశ్చిమ డెల్టా కాలువని లోతు చేస్తారు.

పటిష్ఠంగా వరద నియంత్రణ..: జల ప్రణాళిక ఆమోదం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడుతూ... రాజధాని పరిధిలో వరద నియంత్రణ చర్యల్ని పటిష్ఠంగా చేపట్టాలని ఆదేశించారు. 46 కి.మీ.మేర కాలువల్లో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నెదర్లాండ్స్‌ బృందంలో కలసి పనిచేయాలని సూచించారు. బ్లూ మాస్టర్‌ ప్లాన్‌ అమలుకి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడతామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

Link to comment
Share on other sites

  • 1 month later...

జలకల సాక్షాత్కారం!

రూ.వంద కోట్లతో ముక్త్యాల-విజయవాడ మార్గం

త్వరలో కృష్ణా నదిలో పూడికతీత పనుల ప్రారంభం

ఏడు టెర్మినళ్లతో జలరవాణాకు అనుగుణంగా నిర్మాణం

సరకు రవాణాలో ఈ మార్గం కీలకం

మూడు దశల్లో కాకినాడ-తడ మార్గం అభివృద్ధి

ఈనాడు - అమరావతి

12ap-main9a.jpg

అమరావతికి మణిహారంగా భావిస్తున్న జలరవాణా మార్గం సాకారం కానుంది. సాగరమాల ప్రాజెక్టులో కీలకమైన కాకినాడ-తడ మార్గం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. గతంలో బ్రిటిష్‌ కాలంలో సరకు రవాణాలో ఇది కీలక పాత్ర పోషించింది. తిరిగి ఈ మార్గాన్ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఇన్నాళ్లకు కొలిక్కి వచ్చాయి. జాతీయ జలరవాణా మార్గం 4లో కీలకమైన ఈ భాగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇది సరకు రవాణాతో పాటు పర్యాటకానికి దోహదపడనుంది. ఉమ్మడి భాగస్వామ్యంతో దశలవారీగా దీన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈలోగా కేంద్రం ముక్త్యాల-విజయవాడ మార్గాన్ని రూ.వంద కోట్లతో అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

టెండర్ల దశ దాటి..: జాతీయ జలరవాణా మార్గం 4 కింద రాష్ట్రంలో కాకినాడ-రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం-ఏలూరు, ఏలూరు-విజయవాడ, విజయవాడ-పెదగంజాం, పెదగంజాం-తడ వరకు కాలువలు ఉన్నాయి. గోదావరి నదిలో భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం, పులిచింతల నుంచి విజయవాడ వరకు కృష్ణా నదిలో పలు మార్గాలున్నాయి. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసేలా ఒప్పందం కుదిరింది. కేంద్ర జలరవాణా సంస్థ 51 శాతం, రాష్ట్రం 49 శాతం నిధులు భరించేలా ప్రతిపాదన రూపొందించి కేంద్రం ఆమోదానికి పంపారు. దీనికి ఆమోదముద్ర పడగానే జలమార్గాన్ని మూడు దశలలో అభివృద్ధి చేస్తారు. రాత్రి పూట కూడా రవాణాకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. దీనికంటే ముందు.. పూర్తిగా కేంద్ర నిధులతో కృష్ణా జిల్లా సరిహద్దున ఉన్న ముక్త్యాల నుంచి విజయవాడ వరకు మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి రూ.వంద కోట్లు వెచ్చించనున్నారు. ఈ పనులకు సర్వే, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి రెండు సంస్థలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. త్వరలో ఈ మార్గంలో పూడికతీత పనులు మొదలవుతాయి. ఇక్కడ దాదాపు 2.90 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక ఉంటుందని అంచనా వేస్తున్నారు.

చౌకగా సరకు రవాణా

రాజధానిలోని వివిధ నిర్మాణాలకు తుదిరూపు ఇచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ముక్త్యాల సమీపంలో నదికి రెండు వైపులా పెద్ద సిమెంటు కర్మాగారాలున్నాయి. వీటి నుంచి సిమెంటుతో పాటు ఇసుక, ఉక్కు, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ఖర్చుతో చేరవేయొచ్చు. రోడ్డు రవాణా వ్యయంతో పోలిస్తే జలరవాణాకు సగమే ఖర్చవుతుంది. పనులు పూర్తయితే సరకు రవాణా వూపందుకుంటుంది. ఈ మార్గంలో ఒక్కో విడత దాదాపు వెయ్యి టన్నుల సామర్థ్యం ఉన్న నౌకలు తిరగనున్నాయి. కృష్ణా తీరం వెంట ఉన్న పుణ్యక్షేత్రాలకు భక్తులను చేరవేసేందుకూ దీన్ని ఉపయోగించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏడు టెర్మినళ్లను నిర్మించనున్నారు. ఇందులో మూడు సరకు రవాణా టెర్మినళ్లు ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రపురంలలో నిర్మిస్తారు. దుర్గాఘాట్‌, భవానీ ద్వీపం, వేదాద్రి, అమరావతిలో ప్రయాణికుల టెర్మినళ్లను నిర్మించనున్నారు. ఈ పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం రైట్స్‌ అనే సంస్థకు అప్పగించింది.

* మూడు దశల్లో జలరవాణా మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. తొలి దశలో కాకినాడ-విజయవాడ మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికి సుమారు రూ.ఏడు వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇందులో కొత్తగా కాలువ వెంట వంతెనల నిర్మాణం, వెడల్పు చేయడం, అవసరమైన భూసేకరణకు ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3,500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరించాల్సి ఉంది.

ముఖ్యాంశాలు
Link to comment
Share on other sites

  • 2 weeks later...

‘సాగరమాల, బకింగ్‌హాం’లకు సూత్రప్రాయ ఆమోదం!

కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ భేటీ

పలు పెండింగ్‌ ప్రాజెక్టులపై సమీక్ష

29ap-main7a.jpg

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులు, జల రవాణాశాఖలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పెండింగ్‌ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీలు చర్చించారు. సోమవారమిక్కడ పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి రాజీవ్‌గాబా, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ యుద్‌వీర్‌ సింగ్‌ మాలిక్‌ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి మంత్రులిద్దరూ సమీక్ష నిర్వహించారు. సాగరమాల, బకింగ్‌హాం కాలువ పునరుద్ధణ పనులు, జాతీయరహదారుల విస్తరణ, అభివృద్ధి, అమరావతి వలయాకార రహదారి నిర్మాణానికి నిధుల విడుదల తదితర కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. సాగరమాల, బంకింగ్‌హాం కాలువ ప్రాజెక్టులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపామని, డీపీఆర్‌ పూర్తయిన వెంటనే మిగిలిన అంశాలను చేపడతామని గడ్కరీ తెలిపారు. ఏపీలో భారత్‌మాల పథకం కింద చేపట్టాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్‌ వచ్చే నెలఖారు నాటికి వస్తుందని, సాగరమాల పథకం కింద చేపట్టే ప్రాజెక్టుల డీపీఆర్‌ డిసెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణానికి నిధులు సమకూర్చడంపై రాష్ట్రం నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై మంత్రిత్వశాఖలో చర్చించామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకురాని నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీతో ఈ అంశంపై చర్చించాలని కేంద్రమంత్రులిద్దరూ నిర్ణయించారు.

పలు ప్రాజెక్టులపైనా..

*అమరావతి బాహ్యవలయ రహదారి సాధ్యాసాధ్యాలకు చెందిన తుది నివేదిక సెప్టెంబరుకల్లా రానున్న నేపథ్యంలో ఆ తర్వాత నిర్ణయం తీసుకొనే అవకాశం.

*నందిగామ, కంచికచర్ల బైపాస్‌ నాలుగు వరసల రహదారుల విస్తరణ, 16వ నంబరు జాతీయరహదారి విస్తరణ పనులుపై..

*రాజమండ్రిలోని మోరంపూడి కూడలి వద్ద పైవంతెన నిర్మాణం, జాతీయ జల రహదారి నంబరు 4కు నిధుల సమీకరణపై..

*విజయవాడ-గుండుగొలను మధ్య ఆరు వరసల రహదారి విస్తరణ ఈపీపీ విధానంలో చేపట్టేందుకు ఉన్న అవకాశాలు.

*రాష్ట్రంలో ప్రతిపాదించిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి వెంటనే పనులు చేపట్టే విషయంపైన..

*పూర్తిస్థాయి ఆధునిక సౌకర్యాలతో నిర్మించాల్సిన డ్రైవింగ్‌ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, ఏపీ అర్బన్‌ గ్రీనింగ్‌కు నిధుల విడుదలపై సమీక్ష.

Link to comment
Share on other sites

ఏపీలోని కాకినాడ నుంచి తమిళనాడులోని విల్లుపురం వరకు 796 కిలో మీటర్ల పొడవున బకింగ్‌హాం కాలువ పునరుద్ధరణ ప్రాజెక్టుతో పాటు సాగరమాల పథకంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ.. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టుల డీపీఆర్‌లు డిసెంబరు నాటికి అందుతాయని, భారతమాల కింద చేపట్టబోయే ప్రాజెక్టులకు ఈ నెలాఖరులోగా డీపీఆర్‌లు పూర్తవుతాయని వెల్లడించారు. రవాణా, షిప్పింగ్‌ శాఖలకు సంబంధించి ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులపై సోమవారం ఢిల్లీలో ఇరువురు మంత్రులు సమీక్షించారు

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...