Jump to content

panta sanjeevani (farm ponds)


Recommended Posts

  • 4 weeks later...
నీటి బొట్టు.. ఒడిసిపట్టి
636031103783982966.jpg
  • భారీగా పెరిగిన భూగర్భ జలాలు
  • సీమ జిల్లాల్లో 5.71 మీటర్ల వరకూ పెరుగుదల
  • అదే స్ఫూర్తితో మరిన్ని నిధులు
  • నీరు ప్రగతికి ఈ ఏడాది రూ.5,568 కోట్లు
హైదరాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెరువుల్లో పూడికతీత వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుగు పట్టి.. పారతో మట్టితీసి.. నెత్తినమోసి, పొక్లయిన్లను స్వయంగా నడిపి... అధికారులు, ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాలను అమలుచేసిన ప్రభుత్వం.. వాటిని ఇప్పుడు సమీక్షించుకుంటే ఆశించిన లక్ష్యం నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున 0.99 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. కరువు ప్రాంతమైన రాయలసీమలో అనూహ్యంగా 5.71 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. భూమ్మీదపడే ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకుని.. ఇంకిపోయేవిధంగా చేయడంతో ఇది సాధ్యమయింది. చెరువుల్లో పూడికతీత, ఇంకుడు గుంతల తవ్వకం, చెక్‌ డ్యాం నిర్మాణాలు, పంట సంజీవని పథకాలతో వచ్చిన ఫలితాలపై భూగర్భ జల వనరుల శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
 
ఈ కార్యక్రమాల కోసం 2015-16లో ప్రభుత్వం 2,466 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అధికారులు తెలిపారు. చెరువుల్లో పూడిక తీయడం ద్వారా 6.61 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్య్థం పెరిగిందని అధికారులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీనివల్ల 68,095 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరింది. చెరువుల్లో పూడికతీసిన మట్టిని రైతులు తమ పొలాలను మెరకచేసేందుకు ఉపయోగించుకున్నారు. ఇంకుడు గుంతలు తీసే కార్యక్రమం ద్వారా 7.70 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. పంట సంజీవని కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పొలాల్లో 1,14,882 పంట కుంటలను తవ్వించారు. తద్వారా వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల ఫలితాలు రాయలసీమలో ఎక్కువగా కనిపించాయి. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి.
 
బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి ఏర్పడింది. దాంతో సాగునీరుతోపాటు, తాగునీటికీ ఇబ్బందిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కరువు తాండవించింది. రైతులు అప్పులు చేసి తమ పొలాల్లో బోర్లు వేయిస్తే నీరుపడలేదు. వందల అడుగుల లోతున బోర్లు వేయించినా ఫలితం ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాయలసీమలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాయలసీమలో భూగర్భ జలాలు 5.71 మీటర్ల వరకు పెరిగాయి. గత ఏడాది మే నెలలో 21.95 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది మే 15వ తేదీ నాటికి 16.24 మీటర్ల లోతులోనే లభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే సగటున భూగర్భ జలాలు 0.99 మీటర్లు పెరిగాయి. గత ఏడాది మేలో 13.83 మీటర్లు ఉండగా, ఈ ఏడాది మే 15నాటికి 12.84 మీటర్లలో జలాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 16.66 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగి.. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కడప జిల్లాలో 8.42 మీటర్లు, నెల్లూరు జిల్లాలో 2.93 మీటర్లు, అనంతపురంలో 2.35 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయి. 2015 జూన నుంచి ఈ ఏడాది మే నెల వరకు రాష్ట్రం మొత్తం మీద భూగర్భంలో అదనంగా వంద టీఎంసీల నీరు నిల్వ అయింది. నీరు-ప్రగతి, పంట సంజీవని కార్యక్రమాల ద్వారా రైతులు, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఇది సాధ్యమయింది.
 
ఈ ఏడాది భారీ లక్ష్యాలు
గత ఏడాది వచ్చిన ఫలితాలతో ఈ ఏడాది ప్రభుత్వం ‘నీరు- ప్రగతి’కి 5,568 కోట్ల రూపాయలను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.05 లక్షల నీటి గుంటలను పొలాల్లో తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 33.305 చెరువులు మరమ్మతులు చేయించాలని, 12,612 వేల చెక్‌ డ్యాంలు నిర్మించాలని, భూగర్భ జలాలు రీఛార్జి అయ్యే నిర్మాణాలు 41 వేల వరకు చేపట్టాలని ప్రభుత్వం నిర్ధేశించింది. చెరువుల్లో పూడికతీత, లిఫ్ట్‌ ఇరిగేషన పథకాల ద్వారా 25 టీఎంసీల వరకు నీటి నిల్వలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
 
జల సంరక్షణతో సత్ఫలితాలు
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జల సంరక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జల సంరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తుండటంపై శనివారం ఆయన ట్వీటర్‌లో స్పందనను తెలిపారు. వేసవిలో చేపట్టిన ఇంకుడుగుంతల తవ్వకం, పంట సంజీవిని, నీరు-ప్రగతి వంటి కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో భూగర్భ జలమట్టం 5.71 మీటర్లకు పెరిగినట్లు చంద్రబాబు వివరించారు. 2015 మే నెలలో రాయలసీమలో భూగర్భ జలాలు 21.95 మీటర్ల లోతులో ఉండేవని, ఈ ఏడాది మేనాటికి 16.24 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలం 0.99 మీటర్లకు పెరిగిందని, దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు కలిగిందని తెలిపారు.
Link to comment
Share on other sites

Farm ponds hmm 2002 lo MA Polam lo implement chesaamu.. varshalu leeks kunta nindaledhu.. Scheem water tho kunta ni nimpukuni Avasaram ayinapudu Motor tho polam ki drip irrigation dwara water pettevallam.. ala metta polalu lo Banana farming, Minimulu, Maze, Sugarcane crops vesaamu :dream:

Link to comment
Share on other sites

Farm ponds hmm 2002 lo MA Polam lo implement chesaamu.. varshalu leeks kunta nindaledhu.. Scheem water tho kunta ni nimpukuni Avasaram ayinapudu Motor tho polam ki drip irrigation dwara water pettevallam.. ala metta polalu lo Banana farming, Minimulu, Maze, Sugarcane crops vesaamu :dream:

You are great bro

Link to comment
Share on other sites

You are great bro

Ideas ma father n babai vi.. offcourse kunta tavvithe vurilo janam navvetollu.. ayina implement chesevallamu.. Guntur dist Thulluru mandal lo 1st drip irrigation tho farming chesindhii meme around 2002 lo. Ma polam lo Arati pelalu height n weight chusi andharu chudataniki vachetollu taruvata vala polam lo implement chesevallu.. ilanti experiments bane chesamu :shakehands:

Link to comment
Share on other sites

One of the best programs ... Hope modi promotes this across teh country.. Good work cbn :no1:

 

 

Ya really happy to see benefits came in less time

 

Coastal AP lo 2 dsts inka above 15 unayi West Godavari, Prakasham and Guntur 10.99 we need to reduce it.

 

Worst thing is lakhs of cusecs wasting vatilo 5% water use chesina West godavri ni below 10feet tesuku ravochu

 

I think better we need to take some villages into one cluster and whenever floods come all villages lo unna ponds ni fill cheyali and we can increase ground water for these we don't need 100's of crores below 50 crores with medium size pipes tho manam oka 1% water save chesina chalu

Link to comment
Share on other sites

  • 1 month later...

I think better way for Ananthapur, kurnool is interlink all panta kuntalu using pipes by near by canals.

 

whenever floods comes few water pumps petti water ni canals lo ki pampali and already installed pipes ni use chesi every time floods comes dani fill chesthe chalu per year 10 times fill ayithe 1 year rains lekuna no problem

 

I mean to say develop a Water Interlink Management System which helps farmers to fill all panta kuntalu freely

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
  • 1 month later...

పంట సంజీవనిలో ఎ.పి ఫస్ట్

 

 
 

farm-ponds-201122016.jpg

వేసవిని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం చెట్ల పెంపకంతోపాటు పంట సంజీవని పేరుతో పంట కుంటల తవ్వకాలను చేపట్టింది. వాటి ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి, భూగర్భ జలాలు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. అన్నదాతలకు నీటి కష్టాలు దూరమవ్వాలనే లక్ష్యంతో ప్రతి పొలంలోనూ వాన నీటిని ఒడిసి పట్టేలా పంట కుంటలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లో రైతులు తమ పొలాల్లో వీటిని ఏర్పాటు చేశారు. పంట సంజీవని, నీరు-ప్రగతి కార్యక్రమాలను చేపట్టింది.

ప్రతి వర్షపు నీటి బొట్టనూ ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ద్వారానే కరువును పారదోలగలమన్న దూరాలోచనతో పంట సంజీవని కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ పొలాల్లో నీటి కుంటలు తవ్వుకునేందుకు ప్రభుత్వమే ఆర్ధికంగా చేయూతనిస్తోంది. చిన్న సన్నకారు రైతుల మొట్ట పొలాల్లో వర్షపు నీరు నిలబడేలా కుంటలు తవ్వి భూగర్భ జలాలను పెంచాలని భావించింది. ఇందుకోసం "పంట సంజీవని పథకాన్ని అమలుచేస్తోంది.

ఏపిని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పంట సంజీవని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతులు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవగాహనా సద సులను కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గుంటలను తవ్వి రైతుకు లబ్ది చేకూర్చడంతోపాటు కూలీలకు పనిదినాలను కల్పించి వలసలను నివారించనున్నారు.

స్థానికులను ప్రభుత్వం భాగస్వాము లను చేయడంతో పంట సంజీవని కార్యక్రమానికి ఆదరణ లభిస్తోంది. పంట పొలాల్లో కుంటలు తవ్వడంలో రైతులు ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. రానున్న ఆరు నెలల్లో పంట కుంటల తవ్వకం ముమ్మరం చేయనున్నారు. 20 లక్షల ఎకరాల్లో 3.72 లక్షల పంట కుంటలను తవ్వనున్నారు. పంట సంజీవనిలోని లక్ష్యం 70 శాతం పూర్తయింది. మిగిలిన కుంటలను కూడా త్వరగా పూర్తిచేయనున్నారు. 2016-17లో ఆరు లక్షల పంట కుంటలను తవ్వేందుకు నిర్ణయించారు. ఇప్పటికే 1.8 లక్షల కుంటలను తవ్వారు. పంటకుంటలు తవ్వడంలో అనంతపురం జిల్లా మొదటి స్థానం, చితూరు, విజయనగరం రెండో స్థానంలో వన్నాయి.

ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా పంట సంజీవని పధకం అమలులో ఏ.పి ముందంజలో వుంది. జార్ఖండ్ ద్వితీయ, పశ్చిమ బెంగాల్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వార్ధా తుపాన్ కారణంగా పంట కుంటలు నిండు కుండల్లా మారాయి. నీటితో కళకళలాడుతున్న పంట కుంటలు చూసిన అన్నదాతల్లో ఆనందం నెలకొంది.

 
 
 
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...