Jump to content

kondaveedu fort and golden temple


Recommended Posts

  • Replies 192
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
  • 2 months later...
కొండలపై రిసార్ట్స్‌, జూపార్కు, హెల్త్‌ వర్సిటీ
 
636235179677894293.jpg
  • రెండు నెలల్లో ఘాట్‌ రోడ్డు పనుల పూర్తి 
  • మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
కొండవీడుకోట(యడ్లపాడు): ‘కొండవీడు ఘాట్‌రోడ్డు పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తాం. ఈ పనులు పూర్తయిన వెంటనే కొండవీడు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మండలంలోని కొండవీడుకోట ఘాట్‌రోడ్డు పనులను, కొండపై ఉన్న చారిత్రక కట్టడాలను మంత్రి రావెల, కలెక్టర్‌ కాంతిలాల్‌దండే, ఆర్కియాలజీ, అటవీ, సీఆర్డీఏ, పర్యాటక శాఖల అధికారులతో కలసి మంత్రి పుల్లారావు గురువారం సందర్శించారు. ఘాట్‌రోడ్డు మీదుగా కొండవీడుకొండలపైకి వెళ్ళి రెడ్డిరాజుల కాలంనాటి పురాతన కట్టడాలు, దేవాలయాలను సందర్శించారు. ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనుల వివరాలను ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధికి ఎటువంటి కమిటీలను ఏర్పాటు చేయలేదని, ప్రభుత్వమే అన్ని అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నదన్నారు. కొండవీడుకోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపుదిద్ది పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కొండవీడు కొండలపై ఫైవ్‌స్టార్‌ రిసార్ట్స్‌, జూపార్కు, హెల్త్‌ వర్సిటీ వంటి బృహత్తర ప్రాజెక్టులు ఏర్పాటు చేసి పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పనులకు 873 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతుందని గుర్తించమన్నారు. కేంద్ర అటవీశాఖ నుంచి త్వరలోనే అనుమతులు రానున్నాయని తెలిపారు. సీఆర్డీయే 38 హెక్టార్లలో, పురావస్తుశాఖ 121 హెక్టార్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. కొండపై ఉన్న ఆరు దేవాలయాలను, మూడు చెరువులను అభివృద్ది చే యడం జరుగుతుందన్నారు. తాగునీటి సౌకర్యం, ఘాట్‌రోడ్డుకు విద్యుత్‌ సదుపాయం కల్పించేందకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా అటవీశాఖాధికారి మోహన్‌రావు, సీఆర్డీఏ, పురావస్తు శాఖల అధికారులు, ఆర్డీవో రవీందర్‌, యార్డు చైర్మన్‌ సదాశివరావు, ఎంపీపీ స్టీఫెన్‌ కరుణాకర్‌, జడ్పీటీసీ సాయిబాబు, జీడీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ కుర్రా రత్తయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కొండవీడు కోటపై 82 హెక్టార్లలో ఎకో టూరిజం
 
636235176198873887.jpg
గుంటూరు, కొండవీడుకోట(యడ్లపాడు) : కొండ వీడుకోటపై 82హెక్టార్లలో ఎకో టూరిజంను ఏర్పాటు చేసి అభివృద్ది చేయనున్నట్లు కొండ వీడు ప్రాజెక్ట్‌ కన్సల్టెంట్‌ ఇనగంటి రవికుమార్‌ తెలిపారు. గురువారం కొండవీడుఘాట్‌ రోడ్డు పనులను పర్యవేక్షించిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు జిల్లా అధి కారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్‌ల అభివృద్దికి సంబంధించి కావలసిన భూములు, కొండపై ఉన్న దేవాలయాల అభివృద్ది, చెక్‌ డ్యాం నిర్మా ణం, విద్యుత తదితర విషయాలపై సమీక్ష జరిపారని రవికుమార్‌ తెలిపారు. ముఖ్యంగా ఘాట్‌రోడ్డు నిర్మాణం 5.09 కి.మీల మేరలో అప్రోచరోడ్డు, కాంక్రీట్‌ గోడల నిర్మాణం పూర్తయిందన్నారు. బీటీరోడ్డును వేయాల్సి ఉందని తెలిపారు. కొండపై భాగాన 1.5కి.మీల మేర రహదారి నిర్మాణం జరపాల్సి ఉందని ఇందుకు 5 హెక్టార్ల భూమి అవసరం అన్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి అటవీ అధికారు లకు పంపాలని మంత్రి ప్రత్తిపాటి ఆదేశిం చినట్లు తెలిపారు. ఇక 34 హెక్టార్ల భూమి కావాలని సీఆర్డీఏ అధికారులు కోరినట్లు చెప్పారు. కొండ పైభాగాన దేవాలయాల పునఃనిర్మాణానికి ఇప్పటికే రూ.40లక్షలు పురా వస్తుశాఖకు దేవాదాయశాఖ చెల్లించడం జరిగిందని, మరో రూ.50లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పనులు కూడా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశిం చినట్లు తెలిపారు. భవిష్యత మంచినీటి అవ సరాల కోసం కొండపై చెక్‌డ్యాం నిర్మాణం జర పాలని ఆర్‌అండ్‌బి, ఫారెస్ట్‌, ఎనఆర్‌ఈజీఎస్‌ అధికారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే కొండ దిగువ భాగంలో ఉన్న మేజర్‌ కెనాల్‌ నుంచి పైకి పైపులైన నిర్మాణం జరిపేందుకు అయ్యే ఖర్చుకు సంబందించిన ప్రతిపాదనలు తయారు చేయాలని ఆర్‌డబ్య్లుఎస్‌ అధికారు లను ఆదేశించినట్లు చెప్పారు. ఇక విద్యుత సబ్‌ స్టేషన నిర్మాణానికి అవసరమైన 50 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని నరస రావుపేట ఆర్డీవో రవీందర్‌ను ఆదేశించి నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కలె క్టర్‌ కాంతిలాల్‌ దండే, గుంటూరు యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, అటవీ శాఖ అధికా రులు సూర్యనారాయణ, మోహనరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

కొండవీడు కోట చూసొద్దాం రండి...
 
636237847149556547.jpg
ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శతృ దుర్బేధ్యమైన రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్‌ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోటను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మరికొద్ది నెలల్లో కొండపైకి ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. దీంతో ఈ ఏడాదే కొండవీడు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
 
గుంటూరు, చిలకలూరిపేట/యడ్లపాడు: కాకతీయుల సామ్రాజ్యం ముగిశాక తెలుగు గడ్డను రక్షించుకునేందుకు కాకతీయ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న 74 మంది రాజులు ఏకతాటిపై ఉండి ముస్లిం పాలకుల చెర నుంచి కోస్తా ఆంధ్ర విముక్తికి ప్రతినబూనారు. రెడ్డి రాజులలో ప్రథముడు ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాజ్యంపై శత్రుమూకలు తరచూ దాడులు చేస్తుండడంతో కొండవీడును రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు.
 
అద్దంకి నుంచి కొండవీడుకు ..
ప్రోలయ వేమారెడ్డి కుమారుడు అనపోతారెడ్డి(క్రీ.శ 1353-64)రాజ్యపాలనను చేపట్టి రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు. కొండవీడును శతృదుర్బేఽధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది. అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి (క్రీ.శ 1364-86) రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం కుమారగిరిరెడ్డి (అనపోతారెడ్డ్డి కుమారుడు) 1386-1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్‌ వరకు విస్తరించాడు. క్రీ.శ 1402-1420 వరకు పరిపాలించిన అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఈయన ఆస్థానంలో శ్రీనాఽథ కవి విద్యాధికారిగా పనిచేశాడు. చివరి వాడైన రాచ వేమారెడ్డి (క్రీ.శ 1420-24) అసమర్థుడు కావడంతో రెడ్డిరాజుల పాలన అంతమైంది. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు.
 
శిఖరాలను తాకుతూ..
గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరాన్నుండి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ప్రాకారం ఉంది. శత్రువులు చొరబడకుండా రెండు కొండలను కలుపుతూ 50 అడుగుల ఎత్తు, వెడల్పు ఉండేలా మట్టికట్టను నిర్మించారు. కొండ దిగువ న చుట్టూ భారీ కందకాలను ఏర్పాటు చేసి వాటి నిండా నీటి ని నింపి మొసళ్ళను వదిలి అగడ్తగా రూపొందించారు. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్బుతం గా తీర్చిదిద్దారు. కోట రక్షణ కోసం కొండల అంచున 24 బురుజులను నిర్మించి సైనికులను కాపలాగా ఉంచేవారు. బురుజుల్లో ప్రధానమైనవి తారా బురుజు. దీనినే చుక్కల బురుజుగా వ్యవహరిస్తారు. వీటి తరువాత మహాద్వారం వైపున ఉన్న జెట్టి బురుజు, నెమళ్ళబురుజు, రమణాల్‌ బురు జు, సజ్జామహల్‌, బా-ఖిల్లా బురుజు, మిరియాలచట్టు బురుజులు ముఖ్యమైనవి. కొండలపైనే రాజు, రాణిల కోటలు, ధాన్యాగారం, వజ్రాగారం, కారాగారం, అశ్వ, గజ శాలలు, నేతి కొట్టు, తీర్పుల మందిరాలను ఏర్పాటు చేశారు. కొండలపై రాజప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందు లు తలెత్తకుండా ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు. వర్షాలు కురిసినప్పుడు ఒక దాని తరువాత ఒక టి నిండేలా వాటిని మలచడం, ఎక్కువైన నీటిని బయటకు పంపేందుకు మత్తిడిని (తూము) నిర్మించడం విశేషం.
 
అద్భుత శిల్పాలు
కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తులబావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్నముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయంలోనే. కొండవీడు ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్బుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ శిల్పకళా సంపదను ఒకచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేసి కాపాడాల్సిన ఆవశ్యకత ఉంది. కొండవీడు కొండలపై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండలపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయం, మశీదు, దర్గాకొండ, దిగువన కొత్తపాలెంలోని వీరభద్రస్వామి ఆలయం, కొండవీడులోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట గ్రామం పరిధిలోని గోపీనాథస్వామి దేవాలయం, ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ కొండపై ఉన్న మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి.
 
కొండవీడుకు పూర్వ వైభవం..
కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూనుకుంది. 2007లో ఘాట్‌రోడ్‌ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభయ్యాయి. మరో రెండు నెలల్లో ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత కొండలపైన చదునుగా ఉన్న 2 వేల ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో కొండవీడు ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటక శాఖ కోట వద్ద ముఖద్వారాన్ని, మెట్ల మార్గం వద్ద సమాచార కేంద్రాన్ని నిర్మించింది. దేవాదాయ, ఆర్‌అండ్‌బీ, పురావస్తుశాఖలు వివిధ అభివృద్ది ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
 
బాలకృష్ణునికి బంగారు ఆలయం..
వెన్నముద్దల బాలకృష్ణుడికి స్వర్ణమందిరం నిర్మించేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్‌) ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్‌లో భాగంగా స్వర్ణమందిరం, వేద విశ్వవిద్యాలయం, ఆసుపత్రి, గో విశ్వవిద్యాలయంలను నిర్మించనున్నారు. ఈ పనుల నిమిత్తం ప్రభుత్వం 81 ఎకరాల దేవాదాయశాఖ భూములను ఇస్కాన్‌కు అప్పగించింది. కొండవీడు కోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి జాబితాలో చేర్చేందుకు యునెస్కో ప్రాథమిక అంగీకారాన్ని తెలియజేసింది. అందుకు అవసరమైన ఆధారాలతో నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
కొండవీడు మార్గాలు ఇలా..

కొండవీడుకోట యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట - గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం.5 నుంచి బోయపాలెం, చెంఘీజ్‌ఖానపేట మీదుగా కొండవీడుకు చేరుకోవచ్చు. గుంటూరు - నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్లమార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. జాతీయ రహదారి నెం.5కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కొండవీడుకోట ఉంది.
 
అభివృద్ధి కమిటీ అచంచల దీక్ష..
కొండవీడుకోట అభివృద్ధి 2004లో కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కల్లి శివారెడ్డి కన్వీనర్‌గా 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కొండవీడుకోట అభివృద్దికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేయడంతోపాటు పాలకులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. రెడ్డిరాజుల పరిపాలనా దక్షత, కళానైపుణ్యాన్ని భావి తరాలకు అందించాలనే సదుద్దేశంతో కొండవీడు కోట అభివృద్దికి కృషి చేస్తున్నట్లు కన్వీనర్‌ శివారెడ్డి వివరించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
కొండవీడులో..ఉద్యానవన కళాశాల, పరిశోధన కేంద్రం
 
636288769032008926.jpg
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
కొండవీడు పర్యాటక కేంద్రంలో మరో రాష్ట్రస్థాయి ప్రాజెక్టు రాబోతోంది. ఉద్యానవన కళాశాల, ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనలు ఇప్పటికి కార్యరూపం దాల్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ విశ్వవిద్యాలయ పాలక వర్గం... కొండవీడులో కాలేజీ, పరిశోధన కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను ఆ మోదించింది. సీఆర్‌డీఏ పరిధిలో ఉద్యానవన కళాశాల, పరిశోధనా కేంద్రం లేవు. దీనిపై పాలక మండలి సుదీర్ఘంగా చర్చించింది. అప్పటి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యాటక కేంద్రం కొండవీడులో దీనిని ఏర్పాటు చేయాలని సూచించారు. యడ్లపాడుకు చెందిన పోపూరి శివరామకృష్ణ ఉద్యానవన విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడిగా ఉన్నారు. శివరామకృష్ణ పాలకవర్గ సమావేశాల్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. గుం టూ రు జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఉంది. దీనికి సరైన స్థలం లేకపోవడంతో పరిశోధనలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొండవీడులో ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సముచితంగా ఉంటుందని పాలకవర్గం నిర్ణయించినట్లు డైరెక్టర్‌ శివరామకృష్ణ తెలిపారు. వెంకటరామన్నగూడెంలో సోమవారం పాలకవర్గ సమావే శం జరిగింద నీ, కొండవీడులో కళాశాల, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారనీ తెలిపారు.
 
ఉద్యాన పంటలపై ముమ్మరం కానున్న పరిశోధనలు
ప్రస్తుతం జిల్లాలో ఉద్యాన పంటలైన మిర్చి, పసుపు సాగు ఎక్కువగా ఉంది. ఈ రెండు పంటలకు మార్కెటింగ్‌ సౌకర్యం గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉంది. మిర్చి అమ్మకాలకు ప్రపంచంలోనే గుంటూరు యార్డు, పసుపు అమ్మకాలకు దుగ్గిరాల యార్డు కేంద్రాలుగా ఉన్నాయి. కొండవీడులో ఏర్పాటు చేసే ఉద్యాన పరిశోధన కేంద్రంలో పసుపు, మిర్చి తదితర పంటలపై హైబ్రిడ్‌ రకాలను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. చిలకలూరిపేట - గుంటూరు రోడ్డులో యడ్లపాడు మండలంలోని కొండవీడును ఇస్కాన్‌ సంస్థ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తోంది. సుమారు రూ.500 కోట్లతో వివిధ రకాల ఆధ్యాత్మిక ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొండవీడు కోటకు ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కావచ్చింది. కొండవీడులో ఏర్పాటు చేసే కళాశాల, పరిశోధనా కేంద్రాల వలన పంటల్లో ఉత్పత్తి, నాణ్యత పెరుగుతుంది. యడ్లపాడు మండలంలోని మైదవోలులో సుగంధ ద్రవ్యాల పార్కును ఏర్పాటు చేశారు. కొండవీడులో ఏర్పాటు చేసే కళాశాల, పరిశోధనా కేంద్రాల వలన ఉద్యానపంటల ఎగుమతులు, మార్కెటింగ్‌ వ్యవస్థలను స్పైసెస్‌ పార్కుకు అనుసంధానం చేస్తారు. దీంతో జిల్లాలో ఉద్యాన పంటల్లో సాగు ఊపందుకోనుంది.
 
అమరావతి అభివృద్ధికి దోహదం
కొండవీడులో ఏర్పాటు చేసే ఉద్యానవన కళాశాల, పరిశోధనా కేంద్రం రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. కొండవీడు ఉద్యాన పంటలకు అనువైన ప్రాంతం. ఇప్పటికే మైదవోలులోని స్పైసెస్‌ పార్కు వలన సుగంధ ద్రవ్యాల పంటల మార్కెటింగ్‌, ఎగుమతులకు మంచి అవకాశం కలిగింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటాం.
- పోపూరి శివరామకృష్ణ, ఉద్యాన విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు
Link to comment
Share on other sites

  • 4 weeks later...
కొండవీడుకోట మెట్లమార్గం అభివృద్ధి పనులకు సర్వే
 
 
గుంటూరు, కోట(యడ్లపాడు) : చారిత్రక కొండవీడు కోట మెట్ల మార్గం అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఆదివారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ నర్సరావుపేట డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వీరాస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం కొండవీడు కోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తోందని, అందులో భాగంగా కొత్తపాలెం వైపు నుంచి కొండలపైకి 5.1 కి.మీల పొడవైన ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపట్టిందన్నారు. ఘాట్‌రోడ్డుతోపాటు కోట గ్రామం వైపు నుంచి కొండలపైకి రెడ్డిరాజులు నిర్మించిన 2 కి.మీల పొడవైన మెట్ల మార్గాన్ని కూడా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ మార్గానికి పర్యాటక శాఖ రూ.1.50 కోట్లను కేటాయించిందన్నారు. ఇప్పటికే అంచనాలను పూర్తి చేశామని, గతంలో చేసిన సర్వేతోపాటు మరింత కచ్చితత్వం కోసం టోటల్‌ స్టేషన్‌ సర్వే విధానంలో మరోమారు సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెలలోనే పనులకు టెండర్లు పిలుస్తామని, టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సర్వే పనులను ఎస్‌ఈ జగత్‌కుమార్‌, డీఈ కుర్రా కేశవరావు, ఏఈ మన్మధరావులు, హైదరాబాద్‌కు చెందిన సాంకేతిక విభాగపు ఇంజనీర్లు పర్యవేక్షించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...