Jump to content

kondaveedu fort and golden temple


Recommended Posts

కోటకు బాట!
కొండవీడుపై విహారానికి మార్గం సుగమం
ఘాట్‌రోడ్డు నిర్మాణంతో పర్యటక అభివృద్ధి
చారిత్రక కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. ఈనెలాఖరుకు నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. కొండ శిఖరాగ్రం నుంచి దిగువ భాగంలో కొండల మధ్యన ఉన్న మైదాన ప్రాంతంలోని పర్యటక ప్రదేశంలోని చారిత్రక కట్టడాల వద్దకు పర్యటకులు చేరుకోవడానికి ఘాట్‌రోడ్డును పొడిగిస్తూ రెండో దశ నిర్మాణానికి అటవీ శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో కొండవీడు పర్యటకంగా అభివృద్ధి చెందనుంది.
KOpGJGv.jpg

కొండవీడు కోట అభివృద్ధిలో కీలకమైన ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం నుంచి కొండ మీదకు 5.1 కి.మీ దూరం ఘాట్‌రోడ్డు నిర్మిస్తున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో రెండున్నర ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించారు. నిధులు విడుదలలో జాప్యం కారణంగా గుత్తేదారు గతేడాది అర్ధాంతరంగా నిర్మాణ పనులను నిలిపివేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చొరవ తీసుకొని నిధుల విడుదలకు కృషి చేశారు. నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖాధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. కొండ దిగువ భాగం నుంచి రక్షణ గోడల నిర్మాణం, 17 మలుపుల వద్ద ఇరువైపులా భారీ రక్షణ గోడల నిర్మాణం పూర్తిచేశారు. పర్యటకులు తమ వాహనాలు పార్కింగ్‌ చేసుకోవడానికి వీలుగా ఘాట్‌రోడ్డు మధ్యలో కాంక్రీటు ప్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. 50 ఎం.ఎం. మందంలో ఒక లేయర్‌ తారురోడ్డు నిర్మాణం పూర్తయింది. 30 ఎం.ఎం మందంలో మరో లేయర్‌ తారురోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

రెండో దశ పనులకు అనుమతులు
ప్రస్తుతం నిర్మిస్తున్న ఘాట్‌రోడ్డు కొండ శిఖరాగ్రంలో ఉన్న బురుజు వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి కొండల మధ్యన ఉన్న దేవాలయాలు, చెరువులు, బురుజులు ఉన్న మైదాన ప్రాంతానికి చేరుకోవడానికి కొంత దూరం నడక దారిన కొండ దిగి కిందకు రావాలి. ప్రస్తుతం ఘాట్‌రోడ్డును మైదాన ప్రాంతం వరకు కొనసాగించడం వలన పర్యాటకులు వాహనాలతో దేవాలయాల వద్దకు చేరుకునే సౌకర్యం లభిస్తుంది. అప్పుడే కొండవీడుకు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొండ మీద చారిత్రక కట్టడాల పరిరక్షణకు, నూతన  కట్టడాల చేపట్టడానికి వాహనాలు చేరుకొనే అవకాశం ఉంటుంది. ఘాట్‌రోడ్డు రెండో దశ    నిర్మాణానికి ఇటీవల అటవీశాఖ నుంచి అనుమతులు లభించాయి. పనులు చేపట్టేందుకు తమ శాఖ నుంచి రూ.11.05 కోట్ల నిధులు మంజూరయ్యాయని రహదారుల, భవనాలశాఖ డీఈ నాగిరెడ్డి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 192
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 2 weeks later...
ఇక వడివడిగా..
ఇస్కాన్‌ మందిరానికి పూర్తయిన పునాది
రాజస్థాన్‌ కళాకారులతో ప్రాంగణ నిర్మాణం
gnt-sty2a.jpg

అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం (ఇస్కాన్‌) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్వర్ణహంస దేవాలయ నిర్మాణం పునాది దశ దాటింది. దేవాలయాన్ని నిర్ణీత ఎత్తులో నిర్మించాల్సి ఉన్నందున పునాదులను పూడ్చడానికి సరిపడినంత గ్రావెల్‌ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకు పనుల్లో కాస్త జాప్యం జరిగింది. నిర్మాణంలో కీలకమైన పునాది దశ దాటడంతో ఇకపై పనుల వేగం పెరుగుతుందని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తిచేస్తామని వివరిస్తున్నారు.

చెంఘీజ్‌ఖాన్‌పేట(యడ్లపాడు), న్యూస్‌టుడే

యడ్లపాడు మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేట పరిధిలº 16 ఎకరాల విస్తీర్ణంలో 2015లో విజయదశమి పర్వదినాన స్వర్ణహంస దేవాలయానికి శంకుస్థాపన చేశారు. 2016 మార్చిలో దేవాలయాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రూ.వందల కోట్ల వ్యయంతో దేశంలోనే రెండో అతిపెద్ద దేవాలయంగా అత్యంత సుందరంగా దీనిని నిర్మించతలపెట్టారు. చుట్టూ కృష్ణలీలల విగ్రహాలు, ప్రాంగణం మధ్యలో రాధాకృష్ణుల దేవాలయం నిర్మిస్తున్నారు. దానికి అభిముఖంగా ఇస్కాన్‌ వ్యవస్థాపకులు భక్తివేదాంతస్వామి శ్రీలప్రభుపాదుల వారి దేవాలయం నిర్మింపతలపెట్టారు. ఆ రెండు ప్రధాన ఆలయాలు పునాదుల వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పూర్తిగా రాజస్థాన్‌ రాతిలో నిర్మిస్తున్న ప్రధాన దేవాలయాలు అదే రాష్ట్రానికి చెందిన నిపుణులైన కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు.. ప్రాంగణం చుట్టూ 102 మండపాలు నిర్మాణం పూర్తయింది. వాటిలో కృష్ణలీలలు, రామలీలలు, కృష్ణుని దశావతరాలు తదితర విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఆలయానికి ఆగ్నేయం మూలన నిర్మిసున్న వంటశాల నిర్మాణం పైకప్పు పూర్తయింది. కృష్ణుని ఆధ్మాత్మిక కథలను, డాక్యూమెంటరీ చిత్రాలను 3డీ, 4డీ యానిమేషన్‌ రూపంలో వీక్షించడానికి ప్రాంగణానికి నలువైపులా నాలుగు మినీ థియేటర్స్‌కు పైకప్పు నిర్మాణం పూర్తయింది. ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో సమావేశం మందిరం, వీఐపీ అతిథి గృహం, ప్రవచనాలు బోధించే మందిరాలకు పైకప్పు వరకు పనులు పూర్తయ్యాయి. కోనేరు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో దశలో మరికొన్ని ఆధ్యాత్మిక నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.తరలివస్తున్న భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు, కృష్ణభక్తులు నిర్మాణంలో ఉన్న దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఆలయ ఆకృతులు, నిర్మాణశైలి తదితర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భక్తుల సందేహాలను అక్కడ ఉంటున్న కృష్ణభక్తులు నివృత్తి చేస్తున్నారు. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో నిర్మించిన ప్రముఖ కృష్ణదేవాలయాలు వాటి విశిష్టత, స్థానికంగా నిర్మిస్తున్న స్వర్ణహంస దేవాలయం ప్రాముఖ్యతను పర్యాటకులకు వారు తెలియజేస్తున్నారు.

ఫైబర్‌తో విగ్రహాల నిర్మాణం: ఆలయ ప్రాంగణం చుట్టూ నిర్మించిన 102 మండపాల్లో నిర్మిస్తున్న రాధాకృష్ణుల విగ్రహాలను సిమెంట్‌ స్థానంలో ఫైబర్‌ వినియోగిస్తున్నారు. తొలుత సిమెంట్‌తో కొన్ని విగ్రహాలను నిర్మించారు. వాటికి పగుళ్లు వస్తుండటంతో సిమెంటు విగ్రహాల స్థానంలో ఫైబర్‌ విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఫైబర్‌తో తయారైన విగ్రహాలు చెక్కుచెదరకుండా శాశ్వతంగా ఉండేందుకు వాటిని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం 50 మండపాల్లో ప్రతిష్ఠించటానికి సరిపడా విగ్రహాల నిర్మాణాలు పూర్తయ్యాయి.

గ్రావెల్‌ కొరత సమస్యతో  కాస్త జాప్యం
స్వర్ణహంస దేవాలయాన్ని తగిన ఎత్తులో నిర్మించడానికి భారీగా గ్రావెల్‌ అవసరం. ప్రభుత్వ అనుమతితో పరిసర గ్రామాల్లోని చెరువుల్లోని గ్రావెల్‌ను ఇక్కడకు తరలించాం. అదికూడా సరిపోకపోవడంతో ఆలయం ప్రాంగణంలోని కోనేటి నిర్మాణానికి తవ్విన కుంటలోని మట్టిని కూడా ఉపయోగించాం. రెండు ప్రధాన ఆలయాల నిర్మాణానికి తీసిన భారీ పునాదులు గ్రావెల్‌తో పూడ్చడంతో అవి బేస్‌మెంట్‌ లెవెల్‌కు వచ్చాయి. ప్రధానమైన బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు నిర్మాణ పనులు పూర్తికావడంతో రెండు ప్రధాన ఆలయాలతో పాటు మిగిలిన అనుబంధ కట్టడాలను సంవత్సరంలోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.

- వేణుధారిదాస్‌, ఇస్కాన్‌ ప్రతినిధి
Link to comment
Share on other sites

  • 2 weeks later...
 
కొండవీడు... ఘాట్‌ చూడు...
09-07-2018 01:58:05
 
636666982839357205.jpg
ఆకుపచ్చ రంగేసిన కొండలు... వాటిని తాకుతూ నీలా నింగిలో మేఘాలు! కొండలను చుట్టేసిన భారీ కొండ చిలువలా నల్లగా మెరిసిపోతున్న తారు రోడ్డు! ఏ దేశంలోనిదీ సుందర దృశ్యం అనుకుంటున్నారా! ఇది మరెక్కడో లేదు! గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ‘కొండవీడు’ ఘాట్‌ రోడ్డు ఇది. కొండను తొలుస్తూ వేసిన ఈ మార్గం ఇటీవలే పూర్తయింది. చారిత్రక ప్రాధాన్యమున్న కొండవీడు కోటకు పర్యాటక శోభ తెచ్చేందుకు ఈ రహదారిని నిర్మించారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి ఘాట్‌ రోడ్డు వెంబడి పలు చోట్ల అప్పటికప్పుడు ‘జలపాతాలు’ కూడా ఏర్పడ్డాయి.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
కొండవీడు సిగలో ‘స్వర్ణహంస’ 
రాజస్థాన్‌ గులాబీ రాయితో  కృష్ణుని మందిర నిర్మాణం 
బంగారు తాపడంతో దేశంలో నిర్మించే తొలి ఇస్కాన్‌ ఆలయం 
యడ్లపాడు - న్యూస్‌టుడే 
26ap-main13a.jpg

పర్యాటక ప్రాంతమైన కొండవీడులో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్‌) నిర్మిస్తున్న స్వర్ణహంస మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలోనే తొలిసారి ఇక్కడ స్వర్ణ మందిరాన్ని ఇస్కాన్‌ సంస్థ నిర్మిస్తోంది. రూ.వందల కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు కృష్ణ మందిరం రూపుదిద్దుకుంటోంది.

ప్రస్తుతం అమెరికాలోని వెస్ట్‌ వర్జినియాలో మాత్రమే బంగారు తాపడంతో మందిరాన్ని ఇస్కాన్‌ నిర్మించింది. కొండవీడు వద్ద నిర్మిస్తున్న భారీ స్వర్ణ మందిరం చుట్టూ మండపాలతో పాటు ప్రధాన ఆలయానికి రాజస్థాన్‌లో లభ్యమయ్యే గులాబీ రాయి (పింక్‌ స్టోన్‌)ని వినియోగిస్తున్నారు. అక్కడే 108 మండపాలను చెక్కించి తెచ్చి ఇటీవల అమర్చారు. గర్భాలయాన్ని చెక్కే పనులు ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్నాయి. గర్భాలయానికి బంగారు తాపడం చేయనున్నారు. హంస ఆకృతిలో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

26ap-main13b.jpg

భక్తి భావనలు వెదజల్లేలా.. 
మండపాల్లో కృష్ణుడి లీలలు వీక్షించాక ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. ప్రాంగణంలోనే నలువైపులా 3డి, 4డి థియేటర్లను నాలుగింటిని ఏర్పాటు చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ, ఆచార వ్యవహారాలు, సనాతన కుటుంబ వ్యవస్థ.. తదితరాలను దృశ్య రూపంగా ఈ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. మందిరానికి సమీపంలోనే గోశాల నడుపుతున్నారు. గోవిశ్వవిద్యాలయం, వేద పాఠశాల, అనాథాశ్రమంతో పాటు  ఆసుపత్రిని  నిర్మించేందుకు ప్రణాళిక  రూపొందించారు.108 మండపాల్లో ‘భాగవతం’

మందిరాన్ని మొత్తం 16 ఎకరాల్లో చేపట్టారు. ఇందులో ప్రధాన ఆలయాన్ని ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. స్వర్ణహంస రెక్కలు ఆడిస్తూ ఎగురుతున్నట్లు కనిపించే నమూనా భక్తులను కనువిందు చేస్తోంది. హంస మెడ భాగం వద్ద ఇస్కాన్‌ గురువు భక్తి వేదాంతస్వామి ప్రభుపాదులవారి ఆలయం, దాని తరువాత స్వర్ణ గోపురంతో నిర్మించిన ఆలయంలో కృష్ణుడు కొలువుదీరనున్నారు. ఆలయ ప్రాకారం చుట్టూ నిర్మించే 108 మండపాల్లో భాగవతాన్ని, కృష్ణుడి లీలలను వివరించనున్నారు.

మార్చి నాటికి నిర్మాణం పూర్తి 
రూ.వందల కోట్ల వ్యయంతో కొండవీడు ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాం. నోట్ల రద్దు, జీఎస్టీ.. కారణంగా విరాళాలు తగ్గడంతో పనులు నెమ్మదించాయి. ఇప్పుడు పనులు వేగం పుంజుకున్నాయి. వచ్చే మార్చినాటికి స్వర్ణ మందిర నిర్మాణం పూర్తి చేస్తాం. ఇందుకు దాతల సాయం కోరుతున్నాం. గుంతకల్లు, ఒంగోలు, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెంలోనూ మందిరాలు నిర్మించనున్నాం.

- శ్రీమాన్‌ సత్యగోపినాథ్‌దాస్‌, ఇస్కాన్‌ దక్షిణ భారత ఛైర్మన్‌.
Link to comment
Share on other sites

Kondaveedu Fort in Andhra Pradesh is fast becoming a popular tourist destination

 

Times Travel Editor|TRAVEL NEWS, ANDHRA PRADESHAug 9, 2018, 16.23 IST

  •  
  •  
  •  
  •  
  •  
 
Kondaveedu Fort in Andhra Pradesh is fast becoming a popular tourist destination

The Kondaveedu Fort in Andhra Pradesh has turned into a tourist hotspot in recent times, and is one of the most favourite places to visit in Andhra Pradesh. The rush of tourists is causing roadblocks here on weekends, and the tourist demography is mostly made of young people.

The fort is set amidst nature, and provides a solace to get away from the city’s rush. It was built in the 14th century, and is located right in the heart of a reserve forest. The original fort is yet to be accessed, as the work for completion of the road is still in progress. As of now, people visiting the place are mostly interested in reaching the top of the hill, and enjoying the serenity of the place. Because this place is a thick forested area, it is usually cooler here than in the city.

As of now, even though there aren’t official provisions made for refreshments, vendors are coming in to sell water, food, and other items.

The fort went from ruler to ruler, and eventually was under the control of Vijaynagar kings, Gajapatis, Golkonda sultans, and then the French, and British. The fort is located at a height of 1050 ft, and is one of the strongest in the region that withstood the test of time. You can also see an embankment on the way to the fort, which used to work as a security ring to protect the family, and the houses inside the fort. The fort is located in Kondaveedu village.
Link to comment
Share on other sites

Guest Urban Legend
14 minutes ago, sonykongara said:

ikkada film city plan chesthe bagutundi emo

forest agrea anukunta ga brother kashtam anukunta 

may be zoo la edo plan chestunnatu vunnaru 

Link to comment
Share on other sites

23 minutes ago, Urban Legend said:

forest agrea anukunta ga brother kashtam anukunta 

may be zoo la edo plan chestunnatu vunnaru 

అటవీ భూముల మళ్లింపుపై కేంద్రం తాత్సారం 
నవంబరులోనే ప్రతిపాదన అందజేసినా స్పందన కరవు 
  కొండపల్లి భూములు ఇచ్చేది లేదని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని అటవీ భూముల మళ్లింపుపై కేంద్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూముల మళ్లింపునకు (ఇతర అవసరాలు, ప్రాజెక్టులకు వినియోగించుకునేందుకు మళ్లింపు) రాష్ట్ర ప్రభుత్వం గత నవంబరులోనే ప్రతిపాదన అందజేసింది. మొత్తం 24 బ్లాకుల్లోని 13,267 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపు కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు అందజేయగా... 2,089 హెక్టార్లకే అనుమతి ఇచ్చింది. మిగతా 22 బ్లాకులకు సంబంధించి 3 విడతల్లో ప్రతిపాదనలు అందజేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... తొలి విడతలో 10 బ్లాకుల్లో 4,235 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపునకు అనుమతి కోరింది. వాటిలో కొండపల్లి బ్లాక్‌ పరిధిలో 890 హెక్టార్ల మళ్లింపు ప్రతిపాదనను కేంద్ర అటవీశాఖ ఇటీవలే తోసిపుచ్చింది. వెంకటాయపాలెంలో రక్షణ పరిశోధన సంస్థలు, కొండవీడులో ఎకో టూరిజం ప్రాజెక్టులు, అటవీ అకాడమీ వంటివి ఏర్పాటు చేస్తామని కర్లపూడి, నిడుముక్కల్లో సైన్స్‌ సిటీ, పంచభూతాల కాన్సెప్ట్‌తో పార్కు, జీవ వైవిధ్య పార్కు వంటివి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మోతడక, పెదమద్దూరుల్లోనూ కొన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించింది. కొండపల్లిలో వ్యవసాయ పర్యాటకం, క్రీడలకు సంబంధించి ప్రాజెక్టులు చేపడతామని తెలిపింది. అయితే కొండపల్లి ప్రతిపాదనపై కేంద్ర అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టుల కోసం అటవీ భూముల్నే కేటాయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మిగతా 9 అటవీ బ్లాకులకు సంబంధించిన ప్రాజెక 
 ప్రతిపాదనలపై ఇంత వరకూ ఎలాంటి కదలికా లేదు. తాడేపల్లి, వెంకటాయపాలెంలలో మళ్లింపునకు అనుమతిచ్చిన 2,089 హెకార్లకుగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.220 కోట్లు చెల్లించాలి. ఇందులో రూ.200 కోట్లను ఇప్పటికే చెల్లించగా ఇంకా రూ.20 కోట్ల బకాయి ఉంది. అదీ చెల్లించాకే ఆ భూమిలో ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలవుతుంది.

Link to comment
Share on other sites

8 hours ago, Urban Legend said:

forest agrea anukunta ga brother kashtam anukunta 

may be zoo la edo plan chestunnatu vunnaru  

assala ala aduvula laanae vadileyyochuga ? paryavaranaani ki manchidhi ,  chakkaga raajadhaani pakkanae vaaraanthaalalo vellataaniki baavutundhi. abhivrudhi kosam bhumulu kaavali lae kaani, avi vere chota teesukuni, ee konda ni ila vadilesthae baavuntundhi ani naa uddesam

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...