Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
రాళ్లిచ్చి రాజధానిలో నేల!
07-10-2018 03:20:06
 
636744792059811155.jpg
  • క్వారీ గోతులపై మట్టి కప్పాడు.. చేపల చెరువులుగా మార్చాడు
  • ల్యాండ్‌ పూలింగ్‌లో సీఆర్డీఏకి..
  • గన్నవరం ఎయిర్‌పోర్టుకిచ్చిన 5.70 ఎకరాలపై వివాదం
  • సీఎం, విజిలెన్స్‌కు ఫిర్యాదు
విజయవాడ, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): క్వారీ గోతులను మట్టితో పూడ్చారు. తిరిగివాటిని నీటితో నింపారు. అవే చేపల చెరువులని రుణం కోసం సర్టిఫికెట్‌ సంపాదించారు. ఈ లోగా విమానాశ్రయ విస్తరణ కోసం భూ సమీకరణ నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో ఆ భూములనే భూ సమీకరణకు ఇచ్చి రాజధానిలో విలువైన ప్లాట్లు పొందేందుకు స్కెచ్‌ వేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు వెళ్లింది. కొంత మంది రైతులు గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌కు కూడా ఫిర్యాదు చేయడంతో ఆయన విజిలెన్స్‌ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం పరిధిలోని అజ్జంపూడి గ్రామ పరిధిలో సర్వే నంబర్లు 141/2, 141/7, 141/8, 141/9, 149/11 పరిధిలో 5.70 ఎకరాల భూమి ఉంది. 2000లో ఎన్‌హెచ్‌ 5 విస్తరణ కాంట్రాక్టు పొందిన మధుకాన్‌ సంస్థ, ఈ భూములను కొనుగోలు చేసింది. అందులోని మట్టిని 18 అడుగుల వరకు తవ్వి రోడ్డు పనుల కోసం వాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్‌ చేసిన తరువాత ఆ భూమిపై హ క్కులు ప్రభుత్వానికే చెందాలి. అయితే, ఈ విషయంలో రెవెన్యూ అధికారులు అలసత్వం ప్రదర్శించారు.
 
గోతులుగా ఉన్న ఈ భూమిని 2007లో మాజీ జడ్‌పీటీసీ ఎంవీఎల్‌ ప్రసాద్‌ కొనుగోలు చేశారు. అజ్జంపూడిలోని భూములను విమానాశ్రయానికి తీసుకుంటున్నట్టు తెలియడంతో ప్రసాద్‌, అక్కడ నుంచి ఈ భూముల వ్యవహారాన్ని అనేక మలుపులు తిప్పారు. అనుమతులు లేకుండానే ఆ భూమిలో చేపల చెరువులు ఉన్నట్టుగా ప్రసాద్‌ సర్టిఫికెట్‌ సంపాదించారు. వాస్తవానికి, మైనింగ్‌ కోసం తవ్విన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. అయినా ఆ భూమిపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపారు. విమానాశ్రయ విస్తరణకు గన్నవరం గ్రామాలలో రైతుల నుంచి తీసుకున్న భూములకు రాజధాని పరిధిలో ప్లాట్లు కేటాయిస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన వారిలో మరి న్ని ఆశలు పెంచింది. అప్పటికే దీనికోసం రంగం సిద్ధం చేసుకొన్న ప్రసాద్‌, ఎందుకూ పనికిరాని క్వారీ గోతుల భూమిని మట్టితో నింపి సీఆర్డీఏకు ఇచ్చారు. ఆ సంస్థ ఆయన ఇచ్చిన 5.70 ఎకరాల భూమికిగాను రాజధాని లో రూ.25 కోట్ల విలువైన 9,400గజాలు ఇవ్వాల్సి ఉంది.
 
పనికి రాని భూమికి పాస్‌
ప్రసాద్‌ తన భూములను కొంత మంది రైతులకు అమ్మి పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌ కోసం దరఖాస్తు చేశారు. గన్నవరం తహసీల్దార్‌ వాటిని క్వారీ భూములుగా పేర్కొంటూ, పాసు పుస్తకాల జారీకి నిరాకరించారు. ఈ కారణాలతో ఎంవీఎల్‌ ప్రసాద్‌ ఆ భూములపై యాజమాన్య హక్కు కోసం చేస్తున్న యత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో తనకు పాస్‌ పుస్తకాలు, ఎన్‌ఓసీ ఇప్పించాలంటూ ప్రసాద్‌ 2016లో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టుకు వెళ్లడానికి ముందే తనకు అనుకూలంగా కొన్ని పత్రాలను తయారు చేసుకున్నారు. క్వారీకి అధికారికంగా మైనింగ్‌ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం, 2011లో ఆ భూమిలో చేపల చెరువు ఉన్నట్టుగా అధికారుల నుంచి పొందిన సర్టిఫికెట్‌ను కోర్టుకు చూపించారు. కోర్టు తీర్పు ప్రసాద్‌కు అనుకూలంగా వచ్చింది. తర్వాత 2017లో కోర్టు ఆదేశాల ప్రకారం ప్రసాద్‌కు పాస్‌పుస్తకాలు అందించారు.
 
రిజిస్టరే కాని చెరువుకు మరమ్మతా?
అజ్జంపూడి భూమి వ్యవహారంపై ఈ ఏడాది మే 3న వెనిగళ్ల రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం మత్స్యశాఖ కమిషనర్‌ను విచారణ జరిపి నివేదిక ఇవ్వమని ఆదేశించారు. కృష్ణాజిల్లా మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ యాకూబ్‌ బాషా తాజాగా మరో నివేదిక పంపారు. 2016లో ఎంవీఎల్‌ ప్రసాద్‌ చేపల చెరువుల మరమ్మతులకు తమ శాఖ అనుమతి ఇచ్చినట్టు పేర్కొనటం నిజం కాదని పేర్కొన్నారు. ప్రసాద్‌కు డీఎల్‌సీ నుంచే అనుమతి లేదన్నారు. 2016 మార్చి 30న చేపల చెరువుల సాగుకు డీఎల్‌సీకి దరఖాస్తు చేసిన ప్ర సాద్‌, ఆ మరునాడు అంటే మార్చి 31నే చెరువు తాత్కాలిక మరమ్మతుల కోసం తమ శాఖకు లేఖ ఇచ్చారనటం అసంబద్ధంగా ఉందన్నారు. రిజిస్టర్‌ అయిన చెరువులు అయితే వాటి మరమ్మతులకు అనుమతే అవసరం లేదని రాశారు. ప్రసాద్‌ మార్చి 30న మీ-సేవలో చెరువుల క్రమబద్దీకరణ కోసం డీఎల్‌సీ చేసుకున్న దరఖాస్తుపై నలుగురు మండల స్థాయి అధికారులు కేత్రస్థాయి నివేదిక రాసి పంపారు.
 
విజిలెన్స్‌ ఆరా
గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్‌తో పాటు, రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్‌ ఎస్పీ హర్షవర్ధన్‌ నేతృత్వంలో తాజాగా అధికారులు ఈ భూములను పరిశీలించి ఆరా తీశారు.
Link to comment
Share on other sites

విజయవాడ-సింగపూర్ విమాన సర్వీసులపై సీఎం సమీక్ష
08-10-2018 19:44:37
 
636746246780343801.jpg
అమరావతి: విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ఉన్న అడ్డంకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సర్వీసు నడిపేందుకు తమకు మౌలిక వసతులు లేవని కస్టమ్స్ అధికారులతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పేచీ పెడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన సీఎం.. సమస్య పరిష్కారానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కస్టమ్స్ అధికారులతో చర్చించారు. ఈనెల 25 నుంచి ఎట్టిపరిస్థితుల్లో సింగపూర్‌కు ఇండిగో విమాన సర్వీసులు నడపాలని కస్టమ్స్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌ కింద రూ. 18 కోట్లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయినా విజయవాడ-సింగపూర్ సర్వీసులకు అనుమతి ఇవ్వకుండా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ కొర్రీలు పెడుతోంది. దీంతో ఈ వివాదంపై ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభుకు లేఖ రాయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Link to comment
Share on other sites

25 నుంచి సింగపూర్‌కు విమానం నడపాల్సిందే
అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
విమానయాన సంస్థ  కొర్రీలు వేస్తోందని విమర్శ

ఈనాడు-అమరావతి: ఈ నెల 25 నుంచి విజయవాడ విమానాశ్రయం నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ సింగపూర్‌కు ఇండిగో విమాన సర్వీసు నడపాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు కస్టమ్స్‌, భారత విమానయాన సంస్థ అధికారులను సోమవారం ఆదేశించారు. సింగపూర్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ఉన్న అడ్డంకులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతులపై కస్టమ్స్‌, విమానయాన సంస్థ అధికారుల మధ్య తలెత్తిన పేచీ ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ విజయవాడ నుంచి సింగపూర్‌ విమానం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.18 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చినా అనుమతులివ్వకుండా విమానయాన సంస్థ కొర్రీలు వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, విమానయానశాఖ మంత్రి సురేష్‌ ప్రభుకు లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.

Link to comment
Share on other sites

Vijayawada airport notified as International


VIJAYAWADA: Years of wait for international travelers of Vijayawada ended with Vijayawada airport getting notified as international by Customs on Thursday. The standoff between Airport Authority of India and the Customs is resolved. First international flight from Vijayawada will take off on October 25. Twice a week service will be operated by IndiGo with the support of viability gap funding provided by Andhra Pradesh government.

The stalemate was due to rule introduced in 2009 where the Customs wing management payments have to be dealt by Airports Authority of India (AAI). The issue got resolved after Chief Minister N Chandrababu Naidu shot off letter to civil aviation minister Suresh Prabhu requesting him to resolve the standoff. First international aircraft from Vijayawada will have 180 seats (A 320 type) will depart from Vijayawada at 6.20 pm.

Link to comment
Share on other sites

లెట్స్‌ గో సింగపూర్‌
20-10-2018 08:09:20
 
636756197589384348.jpg
  • 25 నుంచి సర్వీసు ప్రారంభించనున్న ఇండిగో
  • కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ విడుదలఫ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఏఏఐ
  • దుబాయ్‌కీ విమాన సర్వీసు ఆలోచన
విదేశీ విమాన కల సాకారం కానుంది. తొలి అంతర్జాతీయ సింగపూర్‌ సర్వీసుకు తలుపులు తెరుచుకున్నాయి. ఈనెల 25 నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభంకానుంది. ఈ మేరకు కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ జారీ కాగా, సింగపూర్‌కు తొలి ఇండిగో ఎయిర్‌లైన్‌ సర్వీసును సీఎం చంద్రబాబు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
విజయవాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ విమానాశ్రయాల చిత్రపటంలో ‘విజయవాడ ఎయిర్‌పోర్టు సగర్వంగా నిలవబోతోంది. అంతర్జాతీయ హోదా వచ్చిన 14 నెలల సుదీర్ఘ విరామం తరువాత తొలి అంతర్జాతీయ సర్వీసు సింగపూర్‌కు ఈ నెల 25న ‘ఇండిగో’ ఎయిర్‌లైన్స్‌ విమానం ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పట్టుదలతో వయబిలిటి గ్యాప్‌ ఫండింగ్‌ పద్ధతిలో శ్రీకారం చుట్టడం ద్వారా విదేశీ విమాన కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది.  దేశీయంగా అనూహ్యంగా విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధి సాధించింది. దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల ఎయిర్‌ పోర్టులను తలదన్నేలా వృద్ధి చెందుతోంది. దేశంలో పది లక్షలలోపు ప్రయాణికులను చేరవేసే ఎయిర్‌పోర్టులలో విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధిలో ప్రధమ స్ధానంలో నిలిచింది. దేశీయంగా ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగులూరు, హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. నెలకు సగటున లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో విదేశీ సర్వీసులకు కూడా ఇక్కడి నుంచి ఫుల్‌ డిమాండ్‌ ఉండే పరిస్ధితి ఉంది.
 
హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి 100 మంది ప్రయాణి కులలో 46 మంది కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల
నుంచి వెళుతున్నారన్నారు. ఇంతకు ముందు నిర్వహించిన ప్రయాణికుల ఫీడ్‌ బ్యాక్‌ సర్వేలో తేలింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడిస్తే మనవాళ్లెవరూ.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సింగపూర్‌లో డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్టు ఉంది కాబట్టి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కడికైనా చేరుకోవచ్చు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఇక్కడి ప్రాంతవాసులు వెళ్లే అవకాశం ఉండదు. పొరుగు రాష్ట్రం తెలంగాణాలోని ఖమ్మం జిల్లా వాసులకు కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకంటే విజయవాడ ఎయిర్‌పోర్టు అతిదగ్గరగా ఉంటుంది.
 
కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ విడుదల
సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభించటానికి వీలుగా ‘కస్టమ్స్‌’ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. కస్టమ్స్‌ ప్రాంతీయ అధికారులు ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధారిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఇండిగో ఎయిర్‌లైన్‌ 180 సీట్లు కలిగిన విమాన సర్వీసును నడపనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విమానాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. నాలుగైదు రోజుల్లో ఈ సంస్థ బుకింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉంది.
ఫ సింగపూర్‌కు డిమాండ్‌ను బట్టి దుబాయ్‌కు కూడా విమాన సర్వీసును ఇదే విధానంలో నడిపేందుకు ఏడీసీఎల్‌ భావిస్తోంది. విజయవాడ నుంచి దుబాయ్‌కు భారీగా డిమాండ్‌ ఉందని ఇంతకు ముందు సర్వేలో తేలింది.
 

Advertisement

Link to comment
Share on other sites

సింగపూర్‌కు ఎగిరిపోవచ్చిక
అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి
కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ విడుదల
నేటి నుంచి ఇండిగో టిక్కెట్ల విక్రయం
ఈనెల 25న తొలి సర్వీసు
kri-top2a.jpg
ఈనాడు, అమరావతి  : గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమయ్యే రోజొచ్చేసింది. ఏళ్ల తరబడి ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వారి కల నెరవేరబోతోంది. ఈనెల 25న తొలి సర్వీసు గాలిలోకి లేవబోతోంది. ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన.. కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఇక విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న గురువారం తొలి విమానం బయలుదేరబోతోంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం శనివారం నుంచి ఆరంభం కాబోతోంది. మరో ఆరు రోజులే సమయం ఉన్నందున.. నేడు ఇండిగో సంస్థ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన చేయనుందని అధికారులు వెల్లడించారు.

విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఆరు నెలల్లోనే విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌తో పాటు అన్ని సౌకర్యాలూ సిద్ధమైపోయాయి. అప్పటినుంచి పలురకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన వ్యవహారం.. ఇన్నాళ్లకు పట్టాలెక్కింది. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయ డైరెక్టర్‌ నుంచి ఇండిగో సంస్థకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ సమాచారం అందించారు. ఈనెల 25 నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ.. ఇండిగోకు తెలియజేశారు. దీంతో నేటి నుంచి టిక్కెట్ల విక్రయం ఆరంభం కాబోతోంది.  సాధారణంగా.. కనీసం 40 రోజుల ముందు టిక్కెట్ల విక్రయం ఆరంభించాల్సి ఉంటుంది. 180 సీట్ల ఇండిగో బోయింగ్‌ గన్నవరం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న బయలుదేరి వెళ్లనుంది. టిక్కెట్ల విక్రయం ఆరంభమవ్వగానే.. 25వేల మందికి సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారం వెళ్లిపోయే వ్యవస్థ ఇండిగోకు ఉంది. అందుకే టిక్కెట్ల విక్రయం పెద్ద సమస్య కాదని ఇండిగో, విమానాశ్రయం, ఏపీఏడీసీ అధికారులు భావిస్తున్నారు. హాట్‌కేకుల్లా టిక్కెట్లు అమ్ముడైపోనున్నాయన్నారు. వారంలో గురు, మంగళవారాల్లో తొలుత నడపనున్నారు. ఈనెల 25 గురువారం అయ్యింది. మంగళవారం 30న వస్తోంది. ఈలోగా రెండో సర్వీసుకు టిక్కెట్ల విక్రయానికి సమయం ఉంటుంది.

 
 

 

Link to comment
Share on other sites

It was in May last year, that the central government granted international status to the Vijayawada airport.
 
 
Vijayawada_Airport_new_Terminal_Wikimedi

The Vijayawada airport is all set to launch flights to Singapore from October 25, in what is being seen as a big leap in the civil aviation sector for the bifurcated state of Andhra Pradesh. According to media reports, the Vijayawada - Singapore IndiGo flights will be available twice a week on Tuesday and Thursday,

Principal secretary (infrastructure and investments) Ajay Jain in a press release said that the flights would commence operations on October 25 and said that the state government was fully geared up to promote the development of aviation infrastructure.

It may be noted that the State government has offered viability gap funding to the service providers to encourage the airlines to connect the capital region to the world. Vijayawada airport was declared as an international facility last year capable of handling wide-Modied aircraft and the infrastructure has since been augmented.

It was in May last year, that the central government granted international status to the Vijayawada airport.

The decision to upgrade the status of Vijayawada airport, as per the provisions of the Andhra Pradesh Reorganisation Act, 2014 was taken by the Union Cabinet, whose meeting was chaired by Prime Minister Narendra Modi.

"The proposal will add to improved connectivity to the state capital," the Union Cabinet said in a statement.

"It will provide wider choice of services at competitive costs to the air travellers and give a boost to domestic/international tourism and socio-economic development of Andhra Pradesh by bringing in international passengers and cargo traffic," the statement added.

The international tag came months after state Chief Minister N Chandrababu Naidu inaugurated a new terminal building at the airport.

The new terminal building at the airport, also known as Gannavaram airport, had been completed at a cost of Rs 135 crore, and had thrice the capacity of its predecessor.

At the time, Naidu also demanded that the Gannavaram airport, which would be renamed the Amaravati airport, be renamed the ‘NTR Amaravati Airport.’

 

Link to comment
Share on other sites

25 నుంచి సింగపూర్‌కు విమానం
గన్నవరం నుంచి మొదటి అంతర్జాతీయ సర్వీస్‌ ప్రారంభం

ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయం నుంచి మొదటి అంతర్జాతీయ సర్వీస్‌ ఈనెల 25న ప్రారంభం కానుంది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీ)ఇండిగోతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మంగళ, గురువారాల్లో (వారంలో రెండు రోజులు) సింగపూర్‌కు విమానాన్ని నడుపుతారు. కొత్త నిబంధనల ప్రకారం గన్నవరం విమానాశ్రయంలో సేవలు అందించే కస్టమ్స్‌ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులపై కొత్త సమస్య తలెత్తింది. అధికారుల మధ్య చర్చల తరువాత జీతాల చెల్లింపునకు భారత విమానయాన సంస్థ అంగీకరించడంతో కథ సుఖాంతమైందని’ రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ శుక్రవారం ఇక్కడ తెలిపారు.

నేటి నుంచి టిక్కెట్ల విక్రయం
గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఈనెల 25న గురువారం బయలుదేరనున్న తొలి అంతర్జాతీయ సర్వీసుకు టిక్కెట్ల విక్రయం శనివారం నుంచి ఆరంభమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు రోజులే సమయం ఉన్నందున నేడు ఇండిగో సంస్థ టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన చేయనుందని అధికారులు వెల్లడించారు. 180 సీట్ల బోయింగ్‌ గన్నవరం నుంచి సింగపూర్‌కు వెళ్లనుంది. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఆరంభమవ్వగానే 25వేల మందికి సంక్షిప్త సందేశాల రూపంలో సమాచారం వెళ్లిపోతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...