Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

From Andhrajyothy

 

చెన్నైకు నూతన ఎయిర్‌ సర్వీసు ప్రారంభం
01-09-2017 08:56:23

 

గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయి హోదా రావటంతో ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు విమానాలను నడిపేందుకు ఆయా సంస్థలు ముందుకు వస్తు న్నాయని ఎయి ర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధు సూ ధనరావు అన్నా రు. ఎయి రిండియా చెన్నై నుంచి గన్న వరం ఎయిర్‌ పోర్టుకు నూతన సర్వీసును గురు వారం ప్రార ంభించారు. దీనికి జ్యోతిని వెలిగించి తొలి ప్రయాణకుడికి బోర్డింగ్‌ పాస్‌ ను అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రయాణికుల ఆదరణ ఉన్న నగరాలకు విమాన సర్వీసులు నడుపు తున్నామన్నారు. ఎయిరిండియా స్టేషన్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ వారంలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం 12.15కి వచ్చి తిరిగి 12.35కు చెన్నై వెళుతుందన్నారు. 70 సీట్లు సామర్ధ్యం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎయిరిండియా ఇక్కడ నుంచి ఢిల్లీ, హైదరాబాద్‌, వైజాగ్‌, తిరుపతి, బెంగళూర్‌, చెన్నైకు వారానికి 56 సర్వీసులను నడుపుతున్నామన్నారు. త్వరలో ముంబై నుంచి మరో సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చే పట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ జీఎం రామాచారి, ఎయిర్‌పోర్టు ముఖ్య భద్రత అధికారి ఎం.రాజా, టెర్మినల్‌ మేనేజర్‌ వెంకటచలం, ఏసీబీ రాజీవ్‌కుమార్‌, పలువురు ఎయిరిండి యా సిబ్బంది పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
గన్నవరం నుంచి చెన్నైకి విమాన సర్వీసు

గన్నవరం, న్యూస్‌టుడే: విజయవాడ విమానాశ్రయం నుంచి చెన్నైకి కొత్త విమాన సర్వీసును గురువారం ప్రారంభించారు. ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్‌ ఎయిర్‌... విజయవాడ నుంచి చెన్నైకి వెళ్లే ఏటీఆర్‌ 72 రకం విమానాన్ని ప్రారంభించింది. గన్నవరం విమానాశ్రయం ప్రాంగణంలోని నూతన టెర్మినల్‌లో విమానాశ్రయ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు ప్రయాణికులకు బోర్డింగ్‌ పాస్‌లు అందజేశారు. తొలుత చెన్నైలో ప్రారంభమైన ఈ విమానంలో 37 మంది ఇక్కడకు వచ్చారు. అదే విమానంలో గన్నవరం నుంచి 58 మంది ప్రయాణికులు చెన్నైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించినప్పటి నుంచి గన్నవరంలో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పలు సంస్థలు సర్వీసులను ప్రారంభిస్తున్నాయని తెలిపారు. ఎయిర్‌ ఇండియా స్టేషన్‌ మేనేజరు రాజశేఖర్‌ మాట్లాడుతూ.. కొత్త విమానం ప్రతి రోజు 12:15 గంటలకు చెన్నై నుంచి విజయవాడ వస్తుందని, తిరిగి 12:35 గంటలకు బయలుదేరి చెన్నై వెళుతుందన్నారు. ఎయిర్‌ ఇండియా సంస్థ ఇప్పటికే గన్నవరం నుంచి దిల్లీ, హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరులకు విమాన సర్వీసులు నడుపుతోందన్నారు. అతి త్వరలో ముంబయి-గన్నవరం సర్వీసును ప్రారంభించేందుకు సమాయాత్తం అవుతున్నట్లు వివరించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

http://www.andhrajyothy.com/artical?SID=472430

 

నవ్యాంధ్ర కేంద్రంగా ‘ఇండిగో’ మెగా ఆపరేషన్స్‌
05-10-2017 01:16:26

విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి భారీ షెడ్యూల్స్‌కు రూపకల్పన
50 ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌
తొలి దశలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు ఆరు విమానాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రప్రదేశ్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ సన్నాహాలు చేస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా దశల వారీగా మెగా ఆపరేషన్స్‌కు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో 50 ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు ఆ సంస్థ ఇటీవల ఆర్డర్‌ ఇచ్చింది. వీటిలో ఎక్కువ విమానాలు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచే నడపటానికి ఆ సంస్థ సన్నాహాలు చేస్తోంది. తొలి దశలో వచ్చే జనవరి నెల నుంచి ఆరు విమాన సర్వీసులను నడపటానికి ఇండిగో సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ విమాన సర్వీసులను నడపాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసుల షెడ్యూల్స్‌ టైమింగ్స్‌ను కూడా ఖరారు చేసినా.. అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎటిఆర్‌ విమానాలు చేతికి వచ్చే దానిని బట్టి విమాన సర్వీసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు ఉదయం సమయంలో, చెన్నైకు సాయంత్రం సమయంలో, హైదరాబాద్‌కు రాత్రి సమయంలో విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించారు.

ఆరు నెలల కిందటే అధ్యయనం
ఇండిగో విమానయాన సంస్థ ఆరు నెలల కిందటే విజయవాడ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడపటానికి అధ్యయనం ప్రారంభించింది. విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు ఎయిర్‌ ట్రాఫిక్‌ గురించి స్టడీ చేసింది. ఎయిర్‌ ట్రాఫిక్‌తో పాటు విజయవాడ విమానాశ్రయం నుంచి ఉన్న వసతులు, వనరులపై ఆమూలాగ్రం సర్వే చేసింది. ఇండిగో బృందాలు ఇక్కడికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలనలు కూడా జరిపాయి. సాంకేతిక వ్యవస్థలు, రన్‌వే, టెర్మినల్‌, పార్కింగ్‌ బేల వంటి వివరాలను తెలుసుకుని వెళ్లారు. రెండు నెలల కిందటే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో భారీ సంఖ్యలో ఇండిగో సంస్థ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట జరిపింది. విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ కొద్దికాలం మూతపడిన ‘ఎయిర్‌కోస్టా’ సిబ్బందిని కూడా ఇండిగో సంస్థ రిక్రూట్‌ చేసుకుని హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చింది.

అంతర్జాతీయ హోదా ప్రకటన తర్వాత.. అతి పెద్ద ఎయిర్‌ కనెక్టివిటీ
విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత ఒకే సంస్థ ఇంత భారీ సంఖ్యలో విమానాలు నడపటం ఇదే మొదటిసారి. దశల వారీగా విమాన సర్వీసులు నడుపుతామని, ప్రస్తుతం తొలి దశ షెడ్యూల్స్‌ను మాత్రమే ప్రకటించామని చెబుతున్న నేపథ్యంలో, మిగిలిన దశలలో కూడా భారీ స్థాయిలో ఇతర నగరాలకు కనెక్టివిటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్‌
విజయవాడ కేంద్రంగా ఎయిర్‌ ఇండియా, స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థల గుత్తాధిపత్యం నడుస్తోంది. ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా.. హైదరాబాద్‌కు స్పైస్‌జెట్‌ సంస్థ నిర్వహించే ఆపరేషన్స్‌ మోనోపలీగా ఉంటున్నాయి. దీంతో ఛార్జీలు కూడా భారీగా ఉంటున్నాయి. హైదరాబాద్‌కు అత్యవసరంగా వె ళ్లాల్సి వ స్తే.. రూ. 15 వేలను ఛార్జీ చేస్తున్నారు. అదే ఢిల్లీకి వెళ్లాలంటే ఎయిర్‌ ఇండియా సంస్థ సాధారణంగా రూ. 13 వేల నుంచి రూ. 17 వేల వరకు వసూలు చేస్తోంది. భారీ ఛార్జీలతో బెంబేలెత్తుతున్న విమాన ప్రయాణికులు ఢిల్లీకి నేరుగా కాకుండా హైదరాబాద్‌ వరకు వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్‌లో ఢిల్లీ వెళుతున్నారు. బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు పలు విమానయాన సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి కాబట్టి.. ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. ఇండిగో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విమానాలు నడపటంతో విమానయాన సంస్థల మధ్య పోటీ నెలకొని తక్కువ ధరకే ప్రయాణం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=472605

 

అదిగో..ఇండిగో..
05-10-2017 08:49:58

అహో.. ఆకాశయానం
విమానయాన సంస్థల మోనోపలీకి ఇక చెక్‌ !
డిస్కౌంట్‌ రేట్లతో .. భారీ ఆఫర్స్‌
జనవరి నుంచి మెగా ఆపరేషన్స్‌ ప్రారంభం
తొలి విడతగా.. ఆరు విమానాలు
అంతర్జాతీయ హోదా అందుకున్న తర్వాత.. ‘మెగా ఫ్లైట్స్‌ ఆపరేషన్‌’కు విజయవాడ ఎయిర్‌పోర్టు సన్నద్ధమౌతోంది. విమానయాన సంస్థల మోనోపలీని నిలువరించటానికి.. విమానయాన చార్జీలను గణనీయంగా తగ్గించటానికి .. దేశీయ ప్రైవేటు దిగ్గజ విమానయాన సంస్థ ‘ఇండిగో’ ఇప్పుడు అమరావతి రాజధాని కేంద్రంగా విమానయాన సంస్థలకు సవాల్‌ విసరబోతోంది. ఈ డిసెంబర్‌ నాటికే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించటానికి సమాయత్త మౌతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధానికి తలమానికంగా ఉన్న విజయవాడ విమానాశ్రయం నుంచి భారీ సంఖ్యలో దేశీయంలోని ప్రధాన నగరాలన్నింటికీ విమాన సర్వీసులను నడపాలని ఇండిగో నిర్ణయించింది. ఒక్కసారిగా 50 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చిన ఇండిగో సంస్థ వాటిని సమకూర్చుకుంటోంది. దశల వారీగా విజయవాడ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు నడపాలని ఇండి గో సంస్థ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి దశలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు ఒకేసారి ఆరు విమాన సర్వీసులను నడపాలని ప్రాథమికంగా నిర్ణయించి షెడ్యూల్‌ను రూపొందించింది. విమానయాన సంస్థ అధికారులకు ఈ మేరకు సూచనప్రాయంగా సమాచారాన్ని అందించింది. ఒకేసారి ఆరు విమానాలను ఈ సంస్థ విజయవాడ నుంచి ప్రధాన నగరాలకు నడపటం అంటే ఆషామాషీ కాదు. ఈ విమాన సర్వీసులు రాక, పోక కలుపుకుంటే 12 ట్రిప్పులు వేస్తాయి. ఒక రోజులో ఒకే విమానయాన సంస్థకు చెందిన విమానాలు 12 ట్రిప్పులు వేయటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ల్యాండింగ్‌, టేకాఫ్‌లతో కళకళలాడుతున్న విమానాశ్రయ రన్‌వే ఒక్కసారిగా రద్దీగా మారిపోనుంది. ఇండిగో సంస్థ తొలిదశలోనే ఆరు విమానాలను నడపటం ఒక విశేషం అయితే.. మిగిలిన దశలలో ఇంకెన్ని విమానాలు నడుపుతుందన్నది ఆసక్తిగా ఉంది.

లాభ నష్టాలు చూసుకోకుండా..
విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కేంద్రంగా దేశ ప్రధాన నగరాలకు ఇండిగో ప్రవేశం ఒక సంచనలమైతే... ఈ సంస్థ ఇక్కడ పాతుకుపోవటానికి మహా ప్లాన్‌ వేస్తోందని తెలిసింది. లాభ, నష్టాలను దృష్టిలోకి తీసుకోకుండా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి తొలి దశ విమానాల ఆపరేషన్‌ చేపట్టాలని నిర్ణయించినట్టు సమా చారం. మరీ నష్టాలు కాకుండా నిర్వహణ వ్యయం బ్రేక్‌ ఈవెన్‌ వచ్చినా చాలునని భావిస్తోందని తెలుస్తోంది. విజయవాడ నుంచి డిమాండ్‌ ఉన్నా.. ఇండిగో ఎందుకిలా ఆలోచిస్తుందన్న దానికి పెద్ద కారణమే ఉంది. ఇప్పటి వరకు ఏ విమా నయాన సంస్థ కల్పించని అతి తక్కు వ ధరలకు ఆయా ప్రాంతాలకు విమాన ప్రయాణాన్ని కల్పిం చాలని ఇండిగో నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం వసూ లు చేస్తున్న ఛార్జీల కంటే తక్కువుగా ఉంటు న్నాయన్నది అధికారులకు ప్రాఽథమికంగా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ పరిణా మాన్ని విమానాశ్రయ అధికారులు కూడా స్వాగతిస్తున్నారు. చౌక విమా నయానం అందుబాటులోకి రావటం ద్వారానే విమానాశ్రయ అభివృద్ధి జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

చార్జీలు దిగివచ్చే అవకాశం..
ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలో కొన్ని సంస్థల మోనోపలీ ఉండటంతో ఛార్జీలు ఆకాశాన్న ంటుతున్నాయి. ఒకప్పుడు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కింగ్‌ఫిషర్‌, జెట్‌ ఎయి ర్‌వేస్‌, స్పైస్‌జెట్‌, ఎయిర్‌ కోస్తా వంటి సంస్థలు ఉండేవి. వీటి మధ్య పోటీ ఉండేది. కాల క్రమంలో కింగ్‌ఫిషర్‌ కనుమరుగైంది. ఆ తర్వాత వచ్చిన ఎయిర్‌కోస్తా కూడా కనుమరుగైంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు నడవటం లేదు. స్పైస్‌జెట్‌ సంస్థకు తోడుగా ఎయిర్‌ ఇండియా సంస్థలు మాత్రమే విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ట్రూజెట్‌ సర్వీసులు కూడా నడుస్తున్నా.. ఎక్కువుగా ప్రాంతీయ సర్వీసులుగా ఉండటం వల్ల ఈ రెండు సంస్థలకు పోటీ కాలేకపోతోంది. దీంతో ఎయిర్‌ ఇండియాఢిల్లీ రూట్‌లోనూ, స్పైస్‌జెట్‌ సంస్థ హైదరాబాద్‌ రూట్‌లోనూ మోనోపలీగా ఉంటున్నాయి. హైదరాబాద్‌కు అత్యవసరంగా వెళ్ళాలంటే రూ.17 వేలను వసూలు చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీకి వెళ్ళాలంటే రూ.13 నుంచి రూ.17 వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది. అదే హైదరాబాద్‌ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీకి రూ.5 వేల లోపే వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. దీంతో విమాన ప్రయాణీకులు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు.

బెంగళూరు, చెన్నైలకు కూడా ఇంత కాకపోయినా అధిక ధరలనే ఈ విమానయాన సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఒక్కసారిగా ఇండిగో ప్రవేశంతో విమానయాన సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఇండిగోకు చెందిన విమానాలు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు నడవనున్నాయి కాబట్టి.. ధరలు అమాంతం దిగి వస్తాయని విమానాశ్రయ అధికారులు అంటున్నారు. ఇండిగో విమానయాన సంస్థ ఢిల్లీకి కూడా విమాన సర్వీసును ప్రారంభించి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఢిల్లీ రూట్‌లో నడిపే మూడు విమానాలను ఎయిర్‌ ఇండియా తప్ప ఏ విమానయాన సంస్థ కూడా నడపటం లేదు. ఈ రూట్‌లో ఇండిగో విమానం నడిపితే.. పోటీ వల్ల ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

నవ్యాంధ్ర కేంద్రంగా ‘ఇండిగో’ ఎయిర్ లైన్స్ ఆపరేషన్స్‌...

 

 
indigo-05102017.jpg
share.png

అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మరో దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ, సర్వీసులు నడపటానికి సిద్ధమైంది. దేశంలోనే అతి పెద్ద చౌక ధరలు విమాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడంతో నవ్యాంధ్ర ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసులు నడపటమే కాదు, ఇక్కడ నుంచే దశల వారీగా మెగా ఆపరేషన్స్‌కు ఆ సంస్థ శ్రీకారం చుట్టింది.

 

ఈ భారీ విస్తరణలో భాగంగా, ఇండిగో రికార్డు స్థాయిలో 50 ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు ఆ సంస్థ ఇటీవల ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో ఎక్కవ విమానాలు గన్నవరం నుంచే నడవనున్నాయి.. తొలి దశలో, జనవరి నెల నుంచి ఆరు విమాన సర్వీసులను నడపటానికి ఇండిగో సంస్థ నిర్ణయించింది. గన్నవరం నుంచి, వివిధ నగరాలకి 12 ట్రిప్పులు వెయ్యనుంది... పూర్తి షడ్యుల్ తెలియాల్సి ఉంది..

ఇండిగో, కొన్ని నెలల క్రిందటే ఇక్కడ అవకాశాల పై అధ్యయనం చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం ఇవ్వటంతో, ఇక్కడ నుంచి సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించుకుని, భారీ సంఖ్యలో ఇండిగో సంస్థ ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట జరిపింది. మూతపడిన ‘ఎయిర్‌కోస్టా’ సిబ్బందిని కూడా ఇండిగో సంస్థ రిక్రూట్‌ చేసుకుని హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చింది.

ఇండిగో ఎయిర్ లైన్స్ కు, చౌక ధరలు విమాన సంస్థగా పేరు ఉంది... దీంతో, గన్నవరం నుంచి వివిధ నగరాలకు చార్జీలు మరింత తగ్గనున్నాయి..

Link to comment
Share on other sites

దుబాయ్ ఎమిరేట్స్ ప్రతినిధులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

636434188359611956.jpg


విజయవాడ: దుబాయ్ ఎమిరేట్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఎమిరేట్స్ ప్రతినిధి అద్నాన్ ఖాసిం, సింగపూర్ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి పాల్గొన్నారు. ఏపీ-దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి, విశాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై చర్చ జరిగింది. త్వరలో ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని అద్నాన్ ఖాసిం తెలిపారు. అనంతరం యూఏఈ పర్యటనలో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ మక్ధూమ్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబుతో సమావేశానికి మక్ధూమ్ ఆసక్తి చూపారు. మక్ధూమ్ దుబాయ్ రాజవంశీకునికి సమీప బంధువు.

Link to comment
Share on other sites

అమ‌రావ‌తికి రండి..

ఎమిరేట్స్ కు చంద్ర‌బాబు ఆహ్వానం

విజ‌య‌వాడ‌: అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్‌కు చెందిన‌ ‘ఎమిరేట్స్’ గ్రూపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.  విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఎమిరేట్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్–దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి-విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు ‘ఎమిరేట్స్’ గ్రూప్ ఎయిరోపొలిటికల్ ఎఫైర్స్ డివిజినల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అద్నాన్ ఖాజిమ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బృందాన్ని పంపి పెట్టుబడులకు ఉన్న‌ అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.

ఈనెల 22న యూఏఈ పర్యటనకు వెళ్ల‌నున్న చంద్రబాబుతో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్థూమ్‌ భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుబాయ్ రాజవంశీకునికి సమీప బంధువైన మక్థూమ్ ఎమిరేట్స్ సంస్థకు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎమిరేట్స్ తుది నిర్ణయం తీసుకోనుంది.

రాష్ట్రంలో విమానయానరంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు వున్నాయని, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తుండటం ఈ రంగం ఎదుగుదలను సూచిస్తోందని ‘ఎమిరేట్స్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చెప్పారు. విమాన ప్రయాణికుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుందని అన్నారు. భారత ప్రభుత్వం ‘ఎయిర్ ఇండియా’లో పెట్టుబడులను ఉపసంహరించుకునే యత్నాల్లో వుండటం ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు సువర్ణావకాశమని పేర్కొన్నారు.

దుబాయ్ ప్రభుత్వంతో గత 20 ఏళ్లుగా త‌మ‌కు మంచి సంబంధాలు వున్నాయని, హైదరాబాద్ అభివృద్ధిలో దుబాయ్ భాగస్వామి అయ్యేలా స్నేహ బంధం  కొనసాగించామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణంలోనూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో సింగపూర్ ప్రభుత్వం అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కార్యదర్శి ఎం. గిరిజా శంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి రఘు, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...