Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply


  • తొలి త్రైమాసికం ఫలితాలు విడుదల
  • 1,64,148 మంది ప్రయాణికుల
  • రాకపోకలు
  • 2,945 విమానాల రాకపోకలు
  • ప్రయాణీకులలో 14.28 ు,
  • విమానాలలో 8.83 ు వృద్ధి
  • సర్వీసులు రద్దు, కుదింపు
  • జరగక పోతే మరింత వృద్ధి
  • ఇండిగోపై భవిష్య ఆశలు..
  • విదేశీ సర్వీసులపైనా ఆసక్తి

 

విమానాలు రద్దు.. సర్వీసుల కుదింపు.. ఇవేమీ నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధికి అడ్డు కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మిలియన్‌ ప్రయాణికులను చేరవేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విజయవాడ ఎయిర్‌పోర్టు తొలి త్రైమాసికంలో క్లిష్ట పరిస్థితిల్లోనూ వృద్ధి సాధించి మిలియన్‌ లక్ష్యంపై ఆశలు చిగురింపచేస్తున్నాయి. 2017 - 18 ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను చూస్తే 14.28 శాతం వృద్ధిని నమోదు చేయటం గమనార్హం.

(విజయవాడ): అంతర్జాతీయస్థాయి అందుకున్న తర్వాత తొలి త్రైమాసిక ఫలితాలు విజయవాడ విమానాశ్రయ భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. అంతర్జాతీయ హోదా సాధించే ముందు అనూహ్య పరిణామాలు సంభవించాయి. ఎయిర్‌కోస్తా విమానాలు రద్దు అయ్యాయి. స్పైస్‌జెట్‌ సంస్థ విమాన సర్వీసులను కుదించింది. హైదరాబాద్‌కు గణనీయంగా సర్వీసులు తగ్గాయి. ముంబై, జైపూర్‌లకు విమాన సర్వీసులను నడుపుతామని ముందుకు వచ్చినా.. వెనకడుగు వేయటం జరిగింది. అంతర్జాతీయ హోదా అందుకోక ముందు ఇన్ని ప్రతికూల అంశాలు ఎదు రైనా.. తొలి త్రైమాసికంలో 1,64,148 మంది ప్రయాణికులు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించారు. విమానాల కదలికల విషయానికి వస్తే.. మొత్తం 2945 సర్వీసులు నడిచాయి. ప్రతికూల పరిస్థితు ల్లోనూ వృద్ధి సాఽధించటం అంటే సామాన్య విషయం కాదు. అందుబాటులో ఉన్న విమాన సర్వీసులకు ప్రయాణికుల నుంచి అమిత ఆదరణ ఉండటంతోనే ఈ ఫలితాలు సాధించటానికి దోహదపడింది.

 

శుభ సంకేతాలు..

ఈ క్వార్టర్‌ సంగతి పక్కన పెడితే.. ప్రస్తు తం మంచి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశీయ ప్రైవేటు దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో విజయవాడ ఎయిర్‌పోర్టుపై దృష్టి సారించింది. ఆ సంస్థకు సంబంధించిన అత్యున్నత బృందం ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు వచ్చి పరిశీలన జరిపింది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తమ ఆపరే షన్స్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచా రాన్ని ఇక్కడి ఉన్నతాధికారులకు ఇవ్వలేదు. కానీ, ఇండిగో సంస్థ ఇటీవలే నగరంలోని ఒక హోటల్‌లో భారీ ఎత్తున స్థానికంగా ఉన్న వారిని రిక్రూట్‌ చేసుకుంది. విజయవాడ నుంచి పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులను నడపటానికి అవసరమైన రిక్రూట్‌మెంట్‌ను జరిపిందని తెలుస్తోంది.

 

ఇక్కడి నుంచి విమా నాలు నడిపే ఉద్దేశ్యం లేకపోతే స్థానికంగా ఉన్నవారిని భర్తీ చేసు కునే అవకాశాలు ఎంత మాత్రం ఉండదు. స్పైస్‌జెట్‌ వర్గాల నుంచి అనధికారికంగా వస్తున్న సమాచారం చూ స్తుంటే విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కనీవినీఎరుగని స్థాయిలో ఆ సంస్థ ఆపరేషన్స్‌ చేపడుతున్నట్టు తెలుస్తోంది. వ్యాపార విస్తరణలో భాగంగా విజయవాడ కేంద్రంగా ఆపరేషన్స్‌ నిర్వహిం చాలని ఆ సంస్థ భావి స్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కొచ్చిన్‌, త్రివేండ్రం, జైపూర్‌, కోల్‌కతా తదితర ప్రాం తాలకు ఈ సంస్త విమానయాన ఆపరేషన్‌ నిర్దేశించుకు న్నట్టు తెలుస్తోంది. తమ ఆపరేషన్‌ ఏమిటన్నదానిపై ఇండిగో నుంచి ఎప్పుడు సమాచారం వస్తుందా అని ఎయిర్‌పోర్టు అధికారులు ఎదురుచూస్తు న్నారు. ఇండిగో రావటం విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎంతో మేలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతోపాటు అం తర్జాతీయ హోదా వల్ల ఈ ఆర్థిక సంవ త్సరంలో ఆసియా, గల్ఫ్‌ దేశాలకు విమాన సర్వీసులు నడిచే అవకాశం కూడా కనిపిస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఇప్పటికే కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ సర్వీసు కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మరికొద్ది రోజుల్లో ఇది సాకారం కానుంది. దీంతో పా టు ఎయిర్‌ ఇండియా కూడా తమ విమాన సర్వీసులను పెంచటానికి కృషి చేస్తోంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కూడా విమానాల ఆపరేషన్స్‌కు శ్రీకారం చుడుతు న్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే తొలి అర్థ సంవత్సరం నాటికి మరింతగా విమాన ప్రయాణీకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రెండవ అర్థ సంవత్సరం నాటికి అనుకున్న మిలియన్‌ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించటానికి దోహదపడనుంది.

 

కిందటేడాది త్రైమాసికం కంటే బెటర్‌

కిందటి ఆర్థిక సంవత్సరం 2016 - 17 లో ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ నెలాఖరు వరకు చూస్తే.. 1,43,638 మంది ప్రయాణీకులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. అదే విమాన సర్వీసుల విషయానికి వస్తే.. రాకపోక కలిపి మొత్తం 2706 సర్వీసులు తిరిగాయి.

 అదే ఈ ఆర్థిక సంత్సరం 2017-18 లో ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ మాసాంతానికి 1,64,148 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. అదే విమాన సర్వీసుల విషయానికి వస్తే రాక, పోక కలిపి 2945 సర్వీసులు నడిచాయి. కిందటి ఆర్థిక సంవత్సర త్రైమాసికం కంటే ఈ ఏడాది త్రైమాసికంలో ప్రయాణీకుల పరంగా 14.28 శాతం వృద్ధి కనిపించింది. 20,510 మంది ప్రయాణీకులు అదనంగా పెరిగారు. అలాగే విమాన సర్వీసులకు సంబంధించి చూస్తే 8.83 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. కేవలం 239 సర్వీసులు మాత్రమే అదనంగా నడిచాయి. కిందటి సర్వీసులు అన్నీ ఉండి ఉంటే వృద్ధి ఇంకా ఎక్కువుగా ఉండేది.

 

భవిష్యత్తు ఆశాజనకం..

కిందటి ఆర్థిక సంవత్సర తొలి త్రైమా సికంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి కనిపిస్తున్నా.. మేము ఆశించినంత లేదు. కొన్ని సర్వీసులు రద్దు కావటం, కుదిం చటం వంటి కారణాల వల్ల అనుకున్నంత రాలేదని భావిస్తున్నాం. ఏదేమైనప్పటికి రానున్న రోజుల్లో మంచి వృద్ధిని సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఇండిగో సంస్థ నుంచి మంచి కబురు కోసం ఎదురు చూస్తున్నాం. అంతర్జాతీయ హోదా వల్ల త్వరగా విదేశీ సర్వీసుల విషయంలో కూడా పురోగతి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచు కుంటే దేశీయంగా మరిన్ని సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. తొలి అర్థసంవత్సరం కానీ, సంవత్సరాంతానికి కానీ మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం మాకుంది.

   - గిరి మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌

Link to comment
Share on other sites

CM vasthey kaani coordinate chesukovana maata depts

ento e daridram ...anni places ki cm vellaledu e govt depts ilage work chesthey kashtam

dummy ministers Ni pedithe in there... Devineni uma lantollaki ..anteee excuses cheppakunda panulu cheyinchevallu
Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్టుకు దుర్బేధ్య రక్షణ గోడ
28-07-2017 08:27:00
 
636368272482651792.jpg
  • రూ.11 కోట్లతో నిర్మాణ పనులు
  • భూమి పూజ చేసిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ: అమరావతి రాజధాని ఎయిర్‌పోర్టుకు దుర్బేధ్యమైన రక్షణ గోడ నిర్మించటానికి గురువారం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు భూమి పూజ నిర్వహించారు. దుర్బేధ్య రక్షణ గోడకు రూ.11.30 కోట్ల వ్యయంతో ఇటీవలే టెండర్లు పిలిచారు. జేకేజీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ దీని టెండర్లను దక్కించుకుంది. రన్‌వే అభివృద్ధికి ఇటీవల ఎయర్‌పోర్టుకు 698 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. రన్‌వే విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుకు ఉన్న గోడను అనుసంధానం చేస్తూ మొత్తం 698 ఎకరాల చుట్టూ భారీ రక్షణ గోడను నిర్మించబోతున్నారు. దాదాపుగా 11.50 కిలోమీటర్ల మేర భారీ రక్షణ గోడను నిర్మించనున్నారు. ఎనిమిది అడుగుల ఎత్తున రక్షణ గోడను నిర్మిస్తారు.
Link to comment
Share on other sites

తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల్లో సౌర విద్యుత్తు

ఈనాడు, దిల్లీ: హరిత విమానాశ్రయాల పథకంలో భాగంగా విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల్లో 1 మెగావాట్‌ సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి జయంత్‌సిన్హా తెలిపారు. గురువారం లోక్‌సభలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటికే కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టును హరిత విమానాశ్రయంగా అభివృద్ధిచేసినట్లు తెలిపారు. అక్కడ పూర్తిగా సౌర విద్యుత్తే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 29 ఎయిర్‌పోర్టుల్లో 12.84 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

For the interim period, the Vijayawada Airport authorities are modifying the old terminal building to accommodate international operations. Emirates Airlines is set to launch international flights to and from the Vijayawada international airport. It is the first operator to have initiated a dialogue regarding bilateral traffic rights with the Airports Authority of India (AAI). If all goes well, the flights could be operational from the first week of September. The AAI has decided to invite tenders for the appointment of a Project Management Consultant (PMC) to prepare the detailed project report for the construction of an integrated terminal building at Vijayawada. For the interim period, the Vijayawada Airport authorities are modifying the old terminal building to accommodate international operations. According to a senior AAI officer, a bilateral Air Service Agreement (ASA) or Air Transport Agreement (ATA) is one whereby two nations allow their respective airlines to launch flights in each other’s territories. Bilateral rights are national assets; the two participating countries agree upon them not only enhance transport but also to deepen diplomatic ties. The rights are negotiated by the governments and stakeholders in the industry. The two countries set a capacity that they can each fly into the other’s territory. For example, India and Abu Dhabi are each allowed to fly 50,000 seats worth of people and cargo to and from each other’s territory per week. The agreement may also include details regarding flight frequencies and the kinds of aircraft that may be used. It also lists the points of call, which are a fixed set of cities in a country where the other’s airlines may fly into. Abu Dhabi has access to nine Indian cities as of now. According to the officer, the number of cities may be increased at a later stage. Indian carriers are in need of traffic rights abroad, and so these government-to-government negotiations will continue. The NDA government had also conducted auctions for imported gas, through an online portal, for gas-based power plants reeling under fuel shortage. The Ministry of Civil Aviation may adopt a similar strategy and auction air traffic rights as well. However, this may be restricted to countries within 5,000 km or seven-hours of flying time from India, which includes countries in the Gulf region, the Middle East and South East Asi

Read more at telugu360: Emirates to operate global flights from Vijayawada

Link to comment
Share on other sites

Emirates to operate global flights from Vijayawada August 7, 2017 1 Share on Facebook Tweet on Twitter Emirates to operate global flights from Vijayawada Emirates to operate global flights from Vijayawada For the interim period, the Vijayawada Airport authorities are modifying the old terminal building to accommodate international operations. Emirates Airlines is set to launch international flights to and from the Vijayawada international airport. It is the first operator to have initiated a dialogue regarding bilateral traffic rights with the Airports Authority of India (AAI). If all goes well, the flights could be operational from the first week of September. The AAI has decided to invite tenders for the appointment of a Project Management Consultant (PMC) to prepare the detailed project report for the construction of an integrated terminal building at Vijayawada. For the interim period, the Vijayawada Airport authorities are modifying the old terminal building to accommodate international operations. According to a senior AAI officer, a bilateral Air Service Agreement (ASA) or Air Transport Agreement (ATA) is one whereby two nations allow their respective airlines to launch flights in each other’s territories. Bilateral rights are national assets; the two participating countries agree upon them not only enhance transport but also to deepen diplomatic ties. The rights are negotiated by the governments and stakeholders in the industry. The two countries set a capacity that they can each fly into the other’s territory. For example, India and Abu Dhabi are each allowed to fly 50,000 seats worth of people and cargo to and from each other’s territory per week. The agreement may also include details regarding flight frequencies and the kinds of aircraft that may be used. It also lists the points of call, which are a fixed set of cities in a country where the other’s airlines may fly into. Abu Dhabi has access to nine Indian cities as of now. According to the officer, the number of cities may be increased at a later stage. Indian carriers are in need of traffic rights abroad, and so these government-to-government negotiations will continue. The NDA government had also conducted auctions for imported gas, through an online portal, for gas-based power plants reeling under fuel shortage. The Ministry of Civil Aviation may adopt a similar strategy and auction air traffic rights as well. However, this may be restricted to countries within 5,000 km or seven-hours of flying time from India, which includes countries in the Gulf region, the Middle East and South East Asia.

Read more at telugu360: Emirates to operate global flights from Vijayawada https://www.telugu360.com/?p=126148
Link to comment
Share on other sites

Emirates to operate global flights from Vijayawada
DECCAN CHRONICLE. | PATRI VASUDEVAN
Published Aug 7, 2017, 2:11 am IST
Updated Aug 7, 2017, 6:44 am IST
For the interim period, the Vijayawada Airport authorities are modifying the old terminal building to accommodate international operations.
dc-Cover-uelm20ouc8rslbmlo5ilakva92-2016
 Airports Authority of India (Photo: PTI/File)

Vijayawada: Emirates Airlines is set to launch international flights to and from the Vijayawada international airport. It is the first operator to have initiated a dialogue regarding bilateral traffic rights with the Airports Authority of India (AAI). If all goes well, the flights could be operational from the first week of September.

The AAI has decided to invite tenders for the appointment of a Project Management Consultant (PMC) to prepare the detailed project report for the construction of an integrated terminal building at Vijayawada. For the interim period, the Vijayawada Airport authorities are modifying the old terminal building to accommodate international operations.

According to a senior AAI officer, a bilateral Air Service Agreement (ASA) or Air Transport Agreement (ATA) is one whereby two nations allow their respective airlines to launch flights in each other’s territories. Bilateral rights are national assets; the two participating countries agree upon them not only enhance transport but also to deepen diplomatic ties. 

The rights are negotiated by the governments and stakeholders in the industry. The two countries set a capacity that they can each fly into the other’s territory. For example, India and Abu Dhabi are each allowed to fly 50,000 seats worth of people and cargo to and from each other’s territory per week.

The agreement may also include details regarding flight frequencies and the kinds of aircraft that may be used. It also lists the points of call, which are a fixed set of cities in a country where the other’s airlines may fly into. Abu Dhabi has access to nine Indian cities as of now. According to the officer, the number of cities may be increased at a later stage.

Indian carriers are in need of traffic rights abroad, and so these government-to-government negotiations will continue. The NDA government had also conducted auctions for imported gas, through an online portal, for gas-based power plants reeling under fuel shortage. 

The Ministry of Civil Aviation may adopt a similar strategy and auction air traffic rights as well. However, this may be restricted to countries within 5,000 km or seven-hours of flying time from India, which includes countries in the Gulf region, the Middle East and South East Asia.

Link to comment
Share on other sites

ఇండిగో..వస్తోంది..!
 
 
636385568488520229.jpg
  • మూడు ఏటీఆర్‌ విమానాల కొనుగోలు
  • సెప్టెంబర్‌ నాటికి ఇండిగో చేతికి ఎయిర్‌క్రాఫ్ట్స్‌
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో .. నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టులో అడుగిడ డటానికి సన్నాహాలు చేసుకుంటోంది. అంతర్గతంగా ఇండిగో విమానయాన సంస్థ సన్నాహక కార్యక్రమాలు చేప డుతోంది. ఇండిగో విమానయాన సంస్థ విజయవాడ విమానాశ్రయానికి వచ్చి పరిశీలించి వెళ్లిన తర్వాత తన ఆపరే షన్స్‌కు సంబంధించి సమాచారాన్ని తెలుపుతుందని విజయవాడ విమానాశ్రయ అధికారులు భావించారు. ఇండిగో నుంచి అధికా రికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాకున్నా ఆ సంస్థ తెరవె నుక సమాయత్తమవుతున్న తీరుచూస్తే భారీ స్థాయిలో ఇక్కడి నుంచి ఆపరేషన్స్‌ నడపటానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలు స్తోంది. విజయవాడ విమానాశ్రయానికి వచ్చి పరిశీలించిన తర్వాత ఇండిగో సంస్థ ప్రత్యేకంగా ఏటీఆర్‌ విమానాల కొను గోలుకు ఆర్డర్‌ ఇవ్వటం గమనార్హం! విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ ఈ ఏటీఆర్‌ విమా నాలు నడపాలని ఇండిగో సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నూతన ఏటీఆర్‌ విమానాలు సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తాయని సమాచా రం. ఈ ఏటీఆర్‌ విమానాలు వచ్చాక షెడ్యూల్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇండిగో సంస్థ ఇటీవల నగరంలో భారీగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టింది. దేశ వ్యాప్తంగా విమానాలు నడపటానికి పైలట్లు, ఎయిర్‌హోస్టెస్‌, సాంకేతిక సిబ్బందిని భర్తీ చేసుకుంది. అయితే విజయవాడను దృష్టిలో ఉంచుకుని కూడా నియామకాలు చేపట్టినట్టు సమాచారం. ఇటీవల ఇండిగో సంస్థ జరిపిన రిక్రూ ట్‌మెంట్‌లో ఓ సంస్థ సిబ్బందిని కూడా తీసుకున్నారు. వీరికి ప్రస్తుతం హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. వీరందరికీ త్వరలో విజయవాడ నుంచి ఆపరేషన్స్‌ ప్రారంభిస్తామని, అక్కడ ప్రారం భించిన తర్వాత విజయవాడకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇండిగో రాక ఖాయమని తెలు స్తోంది. ఇండిగో అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ తన రాకకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవటంతో అధికారులు మధన పడుతున్నారు. వాస్తవానికి అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకున్న తర్వాతనే స మాచారం ఇవ్వాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇండిగో విమానయాన సంస్థ ప్ర తినిధులకు విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు పలు దఫాలు ఫోన్లు చేసినా వారు స్పందించటం లేదని తెలిసింది.
 
జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం ఎదురుచూపులు :
జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విజయవాడ నుంచి కార్యకలాపాలు ప్రారంభించటానికి మరికొద్ది రోజుల సమయం తప్పటం లేదు. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ఇటీవలే నూతన ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇంకా ఆ సంస్థకు నూతన ఎయిర్‌క్రాప్ట్స్‌ సమకూరకపోవటంతో ఆపరేషన్స్‌ జాప్యమౌతున్నాయి.
 
ముంబయికి ఎయిర్‌ ఇండియా :
ఎయిర్‌ ఇండియా సంస్థ ముంబయికి విమాన సర్వీసును నడపాలని భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి డీజీసీఏ నుంచి ఆ సంస్థ అనుమతులు కూడా తీసుకున్నట్టు సమా చారం. ఈ నూతన సర్వీసుకు సంబంధించి ఇంకా ఇక్కడి అధికారులకు సమాచారం అందించలేదు.
Link to comment
Share on other sites

సింగపూర్‌-విజయవాడ మధ్య విమాన సర్వీసు

సింగపూర్‌ ప్రభుత్వం ప్రతిపాదన

సంయుక్త కార్యాచరణ గ్రూపు సమావేశంలో చర్చ

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న సింగపూర్‌ ప్రభుత్వం తమ దేశం నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. విజయవాడ నుంచి మొదటి అంతర్జాతీయ విమాన సర్వీసు తమ దేశానికే నడపాలన్న పట్టుదలతో ఉంది. ఆంధ్రప్రదేశ్‌-సింగపూర్‌ మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పురోగతిని పర్యవేక్షించేందుకు ఏర్పాటైన సంయుక్త అమలు కార్యాచరణ బృందం (జేఐడబ్యూజీ) రెండో సమావేశం తాజాగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ అధికారులు, అమరావతిలో స్టార్టప్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న సింగపూర్‌ కన్సార్టియం ప్రతినిధులతో ఏర్పాటైన ఈ బృందం... ఒప్పందంలోని అంశాల అమలు, స్టార్టప్‌ ప్రాజెక్టు పురోగతిపై కూలంకషంగా చర్చించినట్టు తెలిసింది. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధితో పాటు, పలు అంశాల్లో సింగపూర్‌ ప్రభుత్వం, సంస్థలు పాలు పంచుకుంటున్న నేపథ్యంలో... అటూ ఇటూ రాకపోకలకు నేరుగా విమాన సర్వీసు ఉంటే మంచిదని సింగపూర్‌ ప్రతినిధులు ప్రస్తావించినట్టు తెలిసింది. విజయవాడకు విమాన సర్వీసు నడిపేందుకు తమ దేశానికి చెందిన విమానయాన సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన అనుమతులు వేగంగా వచ్చేందుకు ప్రభుత్వ స్థాయిలో కృషి చేయాలని కోరినట్టు సమాచారం. రాజధానిలో స్టార్టప్‌ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కి, సింగపూర్‌ సంస్థల కన్సార్టియానికి మధ్య జరగాల్సిన ఒప్పందంపై సమావేశంలో చర్చించారు. ఈ నెలాఖరుకి ఈ ఒప్పందాన్ని ఒక కొలిక్కి తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధికి, తొలి దశలో చేపట్టనున్న 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల నిర్మాణానికి సంబంధించి తమ ప్రణాళికలను సింగపూర్‌ కన్సార్టియం ప్రతినిధులు వివరించారు. త్వరలోనే విజయవాడ కార్యాలయం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పినట్టు తెలిసింది.

Link to comment
Share on other sites

చెన్నైకు ఎయిరిండియా సర్వీసు

ఈ నెల 30 నుంచి అందుబాటులోకి...

kri-gen1a.jpg

విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నైకు మరో సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి నిత్యం రెండు సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంటోంది. టిక్కెట్లు సైతం దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నైకు నూతన సర్వీసును నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చింది. ఆగస్టు 30 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం చెన్నైకు నడుస్తున్న స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ సర్వీసులు రెండూ సాయంత్రం ఒకటి, రాత్రి 10 గంటలకు మరొకటి ఉన్నాయి. పగటి వేళ చెన్నైకు వెళ్లాలనుకునే వారికి విమాన సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం సమయంలో ఎయిరిండియా నూతన సర్వీసును చెన్నైకు నడపాలని భావిస్తున్నారు. గన్నవరం-చెన్నై ఎయిరిండియా సర్వీసుకు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో రానుందని విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం చెన్నైకు నడుస్తున్న రెండు సర్వీసుల్లోనూ టిక్కెట్ల ధరలు భారీగా ఉంటున్నాయి. ఒక్కోసారి రూ.11వేల వరకూ ధర ఉంటోంది. ఎయిరిండియా సర్వీసు వచ్చాక.. పోటీ పెరిగి టిక్కెట్‌ ధరలు రూ.3వేల వరకూ దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Link to comment
Share on other sites

Super.

Mundu aa Mumbai direct service tondaraga vaste inkochem better.

 

New York - Delhi - vijayawada connection super. Hayiga intikelli bojanam Cheyotchu and return service kuda bagundi

(Idi only with timings)

Same with SFO - Delhi - vijayawada

Link to comment
Share on other sites

  • 2 weeks later...
అంతర్జాతీయ సర్వీసులకు తొలి అడుగు
31-08-2017 08:21:54
 
636397645227925793.jpg
  • స్కూట్‌ ఎయిర్‌వేస్‌ ఆసక్తి
  • సీఎంవో కార్యాలయానికి ప్రతిపాదన
  • ఎయిర్‌పోర్టు అధికారులతో త్వరలో సమావేశం
  • అరబ్‌ ఎమిరేట్స్‌కు విమాన సర్వీసు
  • కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్చలు
  • ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా కాలుమోపనున్న సర్వీసులు
 
 
విజయవాడ: అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టులో ఒకవైపు అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ ముస్తాబవుతుంటే .. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులకు మార్గం సుగమం అవుతోంది. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత విదేశాలకు విమాన సర్వీసులు తిరగటానికి అవసరమైన కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ శాఖల ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతుండగా, విదేశాలకు విమాన సర్వీసులు తిప్పటానికి సింగపూర్‌, గల్ఫ్‌ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ ‘స్కూట్‌ ఎయిర్‌వేస్‌’ నేరుగా విజయవాడకు సర్వీసు నడపటానికి రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు గతంలో సింగపూర్‌ వెళ్లినపుడు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపటానికి ఉన్న అవకాశాల మీద చర్చించారు. సింగపూర్‌లో ఉన్న స్థానిక విమానయాన సంస్థలకు ఏపీలోని నూతన రాజధానిలోని విజయవాడ విమానాశ్రయానికి ఉన్న వనరులు, అవకాశాలకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తాజాగా సర్వీసును నడపటానికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. సీఎంవో కార్యాలయ స్థాయిలో ప్రస్తుతం ఈ విమాన సర్వీసు రాకకు సంబంధించి ఉత్తర ప్రత్తుత్తర ప్రక్రియ జరుగుతోంది. ఇంకా విజయవాడ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో ఈ సంస్థ సంప్రదింపులు జరపలేదు. త్వరలోనే ఈ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)లతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు సమావేశమయ్యేది వివరాలు తెలియాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరపటానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు విమాన సర్వీసు నడిపితే ప్రయాణికులు ఆస్థాయిలో లేకపోతే నష్టపోతామన్న భావనతో ప్రభుత్వం నుంచి తగిన గ్యారంటీని ఈ సంస్థ కోరుతున్నట్టు సమాచారం. ప్రాంతీయ కనెక్టివిటీలో భాగంగా తిరుపతి, కడప, హైదరాబాద్‌లకు సర్వీసులు నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌కు రాష్ట్రప్రభుత్వం మినిమం గ్యారంటీ ఇస్తోంది. ఆ స్థాయిలో సీట్లు బుక్‌ కాకపోతే గ్యారంటీ ఇచ్చిన సీట్ల వరకు తిరిగి ఆ సంస్థకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది. ఇదే తరహాలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో ఉండటం వల్ల ఇంకా ఒక కొలిక్కి రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గల్ఫ్‌దేశమైన అరబ్‌ ఎమిరేట్స్‌కు కూడా విమాన సర్వీసు నడటానికి మార్గం సుగమం అవుతోంది. కేంద్రప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అరబ్‌ ఎమిరేట్స్‌తో కేంద్రప్రభుత్వ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఆ దేశానికి సంస్థ ఆసక్తి చూపిస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రత్యేకంగా తీసుకుని అరబ్‌ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు సింగపూర్‌, అటు అరబ్‌ ఎమిరేట్స్‌కు విమానాలు ఏకకాలంలో ప్రారంభమైతే.. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు విమానాలు నడుస్తున్నట్టు అవుతుంది.
 
చెన్నైకు ఎయిర్‌ ఇండియా విమానం
ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకు నూతన సర్వీసును సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు ఉదయం, సాయంత్రాలలోనే చెన్నైకు విజయవాడ నుంచి విమానాలు ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా సర్వీసుతో మధ్యాహ్నం కూడా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసు ప్రారంభం అవుతుంది. చెన్నై నుంచి ఉదయం 10.55 గంటలకు విజయవాడ బయలు దేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12.25 కల్లా చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 12.35కు సర్వీసు బయలు దేరుతుంది. చెన్నైకు 1.55 కల్లా చేరుకుంటుంది. ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు నడుస్తుంది.

 

http://www.andhrajyothy.com/artical?SID=458420

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

అంతర్జాతీయ సర్వీసులకు తొలి అడుగు

31-08-2017 08:21:54

 
636397645227925793.jpg
  • స్కూట్‌ ఎయిర్‌వేస్‌ ఆసక్తి
  • సీఎంవో కార్యాలయానికి ప్రతిపాదన
  • ఎయిర్‌పోర్టు అధికారులతో త్వరలో సమావేశం
  • అరబ్‌ ఎమిరేట్స్‌కు విమాన సర్వీసు
  • కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్చలు
  • ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా కాలుమోపనున్న సర్వీసులు
 
 
విజయవాడ: అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టులో ఒకవైపు అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ ముస్తాబవుతుంటే .. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులకు మార్గం సుగమం అవుతోంది. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత విదేశాలకు విమాన సర్వీసులు తిరగటానికి అవసరమైన కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ శాఖల ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతుండగా, విదేశాలకు విమాన సర్వీసులు తిప్పటానికి సింగపూర్‌, గల్ఫ్‌ దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థ ‘స్కూట్‌ ఎయిర్‌వేస్‌’ నేరుగా విజయవాడకు సర్వీసు నడపటానికి రాష్ట్రప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు గతంలో సింగపూర్‌ వెళ్లినపుడు అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపటానికి ఉన్న అవకాశాల మీద చర్చించారు. సింగపూర్‌లో ఉన్న స్థానిక విమానయాన సంస్థలకు ఏపీలోని నూతన రాజధానిలోని విజయవాడ విమానాశ్రయానికి ఉన్న వనరులు, అవకాశాలకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ తాజాగా సర్వీసును నడపటానికి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. సీఎంవో కార్యాలయ స్థాయిలో ప్రస్తుతం ఈ విమాన సర్వీసు రాకకు సంబంధించి ఉత్తర ప్రత్తుత్తర ప్రక్రియ జరుగుతోంది. ఇంకా విజయవాడ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో ఈ సంస్థ సంప్రదింపులు జరపలేదు. త్వరలోనే ఈ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)లతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు సమావేశమయ్యేది వివరాలు తెలియాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో స్కూట్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరపటానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికప్పుడు విమాన సర్వీసు నడిపితే ప్రయాణికులు ఆస్థాయిలో లేకపోతే నష్టపోతామన్న భావనతో ప్రభుత్వం నుంచి తగిన గ్యారంటీని ఈ సంస్థ కోరుతున్నట్టు సమాచారం. ప్రాంతీయ కనెక్టివిటీలో భాగంగా తిరుపతి, కడప, హైదరాబాద్‌లకు సర్వీసులు నడుపుతున్న దేశీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌కు రాష్ట్రప్రభుత్వం మినిమం గ్యారంటీ ఇస్తోంది. ఆ స్థాయిలో సీట్లు బుక్‌ కాకపోతే గ్యారంటీ ఇచ్చిన సీట్ల వరకు తిరిగి ఆ సంస్థకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తోంది. ఇదే తరహాలో సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌వేస్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ ప్రభుత్వ స్థాయిలో ఉండటం వల్ల ఇంకా ఒక కొలిక్కి రాలేదు. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గల్ఫ్‌దేశమైన అరబ్‌ ఎమిరేట్స్‌కు కూడా విమాన సర్వీసు నడటానికి మార్గం సుగమం అవుతోంది. కేంద్రప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అరబ్‌ ఎమిరేట్స్‌తో కేంద్రప్రభుత్వ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఆ దేశానికి సంస్థ ఆసక్తి చూపిస్తోంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు ప్రత్యేకంగా తీసుకుని అరబ్‌ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు సింగపూర్‌, అటు అరబ్‌ ఎమిరేట్స్‌కు విమానాలు ఏకకాలంలో ప్రారంభమైతే.. దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు విమానాలు నడుస్తున్నట్టు అవుతుంది.
 
చెన్నైకు ఎయిర్‌ ఇండియా విమానం
ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నైకు నూతన సర్వీసును సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు ఉదయం, సాయంత్రాలలోనే చెన్నైకు విజయవాడ నుంచి విమానాలు ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా సర్వీసుతో మధ్యాహ్నం కూడా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసు ప్రారంభం అవుతుంది. చెన్నై నుంచి ఉదయం 10.55 గంటలకు విజయవాడ బయలు దేరుతుంది. విజయవాడకు మధ్యాహ్నం 12.25 కల్లా చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 12.35కు సర్వీసు బయలు దేరుతుంది. చెన్నైకు 1.55 కల్లా చేరుకుంటుంది. ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు నడుస్తుంది.

 

http://www.andhrajyothy.com/artical?SID=458420

 

 

 

 

good

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...