Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

గన్నవరంతో.. రాష్ట్రానుసంధానం

స్థానిక విమానాశ్రయాలకు సర్వీసులపై దృష్టి

kri-top2a.jpg

అమరావతి: రాజధాని నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకూ విమాన అనుసంధానం ఏర్పడనుంది. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, రాజమండ్రి, కడపలో ప్రస్తుతం విమానాశ్రయాలున్నాయి. ఈ ఐదింటికీ రాజధాని నుంచి విమాన అనుసంధానం మరింత పెంచడంపై ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక్కడి నుంచి తేలికగా వచ్చిపోయేందుకు విమాన సర్వీసులు అత్యవసరమని గుర్తించి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ విమానాశ్రయ అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయంపై చర్చించారు. రాజధానికి రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల నుంచి విమాన కనెక్టివిటీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయించాలని లోకేష్‌ సూచించారు. ఐదింటిలో ఇప్పటికే విశాఖ, తిరుపతి నగరాలకు గన్నవరం నుంచి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విశాఖపట్నంకు ఇక్కడి నుంచి రెండు సర్వీసులు వెళుతుంటాయి. బుధవారం మినహా రోజూ మధ్యాహ్నం 12.55 గంటలకు ఒకటి వెళుతుండగా, మరొకటి వారంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 7.25కు వెళుతోంది. బుధవారం ఒక్కరోజు సాయంత్రం 3.35కు విశాఖకు విమాన సర్వీసు ఉంది. తిరుపతికి ప్రస్తుతం ఒకే సర్వీసు నడుస్తోంది. నిత్యం బుధవారం మినహా ఆరు రోజులు ఉదయం 9.55కు నడుస్తోంది.

తిరుపతి, విశాఖలకు నడుస్తున్న ఈ సర్వీసులకు మంచి డిమాండ్‌ ఉంటోంది. అందుకే వీటిని వారంలో కొన్ని రోజులు కాకుండా.. నిత్యం నడిచేలా చేయాలనేది ప్రణాళిక. రోజూ ఉదయం సాయంత్రం కనీసం రెండు సర్వీసులు నడిపేలా ఎలయన్స్‌ ఎయిర్‌ సంస్థతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎలయన్స్‌ ఎయిర్‌ సీఈవో సీ.ఎస్‌.సుబ్బయ్య మంత్రి లోకేష్‌తో జరిగిన సమావేశంలోనూ పాల్గొన్నారు. గన్నవరం కేంద్రంగానే ఒక సర్వీసును పూర్తిస్థాయిలో అన్ని నగరాలకూ నడపే యోచనలో ఉన్నట్టు సుబ్బయ్య సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. తక్కువ సీటింగ్‌ ఉండే ఏటీఆర్‌ సర్వీసులను గన్నవరం నుంచి రాష్ట్రంలోని మిగతా నాలుగు విమానాశ్రయాలకు అనుసంధానించే యోచనలో ఉన్నారు. కడపకూ ఏటీఆర్‌ సర్వీసునే మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రికి మాత్రం ఇప్పట్లో విమాన సర్వీసును నడిపే అవకాశం లేదు. విజయవాడకు కేవలం రెండు గంటల ప్రయాణ దూరంలో ఉండడం వల్ల ఎక్కువ మంది విమాన సర్వీసులపై ఆసక్తి చూపించరు. విజయవాడ నుంచి అరగంట ప్రయాణించి వెళ్లడం, అదికూడా విమాన సమయానికి గంట ముందు ఉండడం, ప్రయాణం అరగంట కలిపి.. మొత్తం రెండు గంటలు పడుతోంది. అదే.. జాతీయ రహదారిపై వెళ్లినా అంతే సమయంలో వెళ్లిపోతారు. అందుకే విమాన సంస్థలు విజయవాడ-రాజమండ్రి మధ్య సర్వీసులను నడిపే విషయంలో కొంత ఆలోచనలో పడుతున్నాయి.

మళ్లీ ముంబయి సర్వీసు కోసం.. : ముంబయి కేంద్రంగా ఉన్న చాలా ఐటీ కంపెనీలు అమరావతి పరిధిలో తమ శాఖలను నెలకొల్పేందుకు ప్రస్తుతం ముందుకొస్తున్నాయి. వాళ్లు ఇక్కడికి వచ్చి వెళ్లేందుకు కనీసం 18 గంటలు పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబయి నుంచి విమాన సర్వీసును ఏర్పాటు చేయాలని చాలా కంపెనీల ప్రతినిధులు కోరుతున్నారని.. ఐటీ మంత్రి విమానయాన సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. ముంబయి లాంటి మహా నగరాలకు ఇక్కడి నుంచి తప్పకుండా సర్వీసు ఉండాలని, దానికోసం ప్రయత్నాలు చేయమని ఆయన అధికారులకు సూచించారు. మళ్లీ జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థతో విమానాశ్రయ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి సర్వీసులను నడిపేందుకు జూమ్‌ ఎయిర్‌ సంస్థ ముందుకొచ్చినా అది అమలు జరగలేదు. ముంబయి విమానాశ్రయంలో ఈ సర్వీసు దిగేందుకు స్లాట్‌ దొరకకపోవడంతో ఈ ప్రతిపాదననురద్దు చేసుకుంది. ముంబయి విమానాశ్రయంలో అనుమతులు సంపాదించాలని లోకేష్‌ సూచించడంతో అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. మరో నెల రోజుల్లో ముంబయి సర్వీసును అనుకున్నట్టుగానే నడిపేందుకు మార్గం సుగమం కానుందని విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు. ఐటీ అభివృద్ధికి కీలకమైన ముంబయి సర్వీసును ఏర్పాటు చేస్తే.. ఇక్కడి వాణిజ్య వర్గాలకూ అనుకూలంగా ఉంటుందని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

బెజవాడ టు అరబ్‌ ఎమిరేట్స్‌!
 
 
636322482714530665.jpg
  • విమాన సర్వీసుకు కేంద్ర మంత్రి కృషి
  •  సానుకూలత తెలిపిన ఎమిరేట్స్‌ ప్రభుత్వం
  •  మంత్రి నారా లోకే్‌ష్ కు స్పష్టం చేసిన ఓఎస్ డీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అంతర్జాతీయ హోదా సాధించిన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అరబ్‌ ఎమిరేట్స్‌కు విమాన సర్వీసు నడిపేందుకు మార్గం సుగమం అవుతోంది. కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు దీనికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కేంద్రంతో అరబ్‌ ఎమిరేట్స్‌కు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడకు ప్రత్యేక సర్వీసు నడిపేలా ఆ దేశ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా దీనిపై సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు ఇటీవల రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌ష్ తో భేటీ అయిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. అశోక్‌ గజపతి రాజు నేతృత్వంలో విమానయాన సంస్థలతో ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానయాన సంస్థ ఆసక్తి చూపింది. నేడు విజయవాడకు అంతర్జాతీయ స్థాయి రావటంతో దానికి మార్గం సుగమం కానున్నది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు సోమవారం గన్నవరం రానున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ విమానాశ్రయంలో మంత్రి చెట్టును నాటనున్నారు. ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయస్థాయి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. అధికారులతో అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

From 1st August Vijayawada Airport will start operating as an International Airport, announces Civil Aviation Ministry. #AndhraPradesh pic.twitter.com/xWwzfYD2KL
DC7NaLIVYAApUB6.jpg

Link to comment
Share on other sites

అధికారిక ముద్ర 

గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ హోదాకు మరో అడుగు 

అతి దగ్గరలోనే విదేశాలకు ఎగిరే రోజు 

ఈనాడు, అమరావతి 

amr-top1a.jpg

గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా సంతరించుకున్న నేపథ్యంలో మరో ముందడుగు పడింది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించిన నేపథ్యంలో తాజాగా రాష్ట్రపతి సైతం అధికారిక ముద్రను వేశారు. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ఎగిరే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన.. పనులు సైతం విమానాశ్రయంలో జోరందుకున్నాయి. భవన నిర్మాణంతో పాటూ రన్‌వే విస్తరణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ సాధారణ దేశీయ స్థాయి విమానాశ్రయంగా ఉన్న స్థితి నుంచి రాజధాని నేపథ్యంలో అనూహ్యంగా వసతులను సంతరించుకోనుంది. ప్రయాణికుల రద్దీ పెరిగిపోనుంది. రూ.162 కోట్లతో అంతర్జాతీయ వసతులున్న నూతన టెర్మినల్‌ భవనాన్ని ఏడాదిన్నర వ్యవధిలో నిర్మించారు. నూతన టెర్మినల్‌తో గన్నవరం విమానాశ్రయం రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఇదే సమయంలో విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించిన బృహత్తర ప్రణాళికను అమలు చేసేందుకు కొత్తగా 740 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో ఉన్న 535 ఎకరాలతో కలిపితే.. విమానాశ్రయం విస్తీర్ణం అమాంతం 1275 ఎకరాలకు పెరిగింది. కొత్తగా విమానాశ్రయానికి చుట్టుపక్కల ఉన్న ఆత్కూరు, పురుషోత్తమపట్నం, గన్నవరం, అజ్జంపూడి, అల్లాపురం, కేసరపల్లి, బుద్ధవరం, వీఎన్‌పురం, చినఅవుటుపల్లి, పెదఅవుటుపల్లి గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ భూమిని విమానాశ్రయానికి అప్పగించడంతో అత్యవసరంగా రన్‌వే విస్తరణ పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం రన్‌వేను 3360 మీటర్లకు పొడిగిస్తున్నారు. దీనివల్ల అతిపెద్ద విమానాలైన బి 747-400 రాకపోకలకు సైతం వీలు కలుగుతుంది. గత రెండున్నరేళ్లలో విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ సైతం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ హోదాకు అధికారిక ఆమోద ముద్ర పడటంతో.. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాలను ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాల్సి ఉందని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. గన్నవరం నుంచి ఏ నగరానికి సర్వీసును వేసినా.. 90శాతం ఆక్యుపెన్షీ ఉంటోంది. దీంతో సర్వీసులు ఒక్కొక్కటిగా పెరిగాయి. ప్రస్తుతం రోజూ 24 సర్వీసులకు పైగా నడుస్తున్నాయి. 2016-17 తొలి అర్ధ సంవత్సరంలోనే విమాన ప్రయాణికుల సంఖ్య 70శాతం పెరగడం గమనార్హం. ఏడాది కిందట దిల్లీకి విమాన సర్వీసును ప్రారంభించిన సమయంలో ప్రయాణికులు ఉంటారా అనే సందేహాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా విజయవాడ-దిల్లీ సర్వీసుకు ప్రస్తుతం 90శాతానికి పైగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు గన్నవరం నుంచి సర్వీసులు నడుస్తున్నాయి.

Link to comment
Share on other sites

న్నవరం నుంచి దుబాయ్‌కు తొలి సర్వీసు

ఈనాడు, అమరావతి, దిల్లీ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేయడంతో మరో మూడు నెలల్లో తొలి విమానం విదేశాలకు ఎగరనుంది. గన్నవరం నుంచి తొలుత దుబాయికి సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ సేవలను అందించేందుకు వీలుగా విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనాన్ని రూ.2.5కోట్లతో ఆధునికీకరిస్తున్నారు. జులై 31 నాటికి భవనం సిద్ధమవుతుంది. గన్నవరం నుంచి దుబాయ్‌కు తొలుత సర్వీసులను నడపాలనే యోచనతో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. దుబాయ్‌కు కనీసం వారంలో రెండు విమాన సర్వీసులను ఏర్పాటు చేయాలని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఉత్తర అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా సహా ప్రప¾ంచంలో ఎక్కడికైనా దుబాయ్‌ నుంచి తేలికగా విమాన కనెక్టివిటీ ఉందంటూ పౌరవిమానయానశాఖకు.. ఆంధ్రప్రదేశ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పలు లేఖలు రాసినటు ఛాంబర్‌ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ వెల్లడించారు.

గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల్ని అంతర్జాతీయ విమానాశ్రయాలుగా గుర్తిస్తూ గెజిట్‌ విడుదలైంది. ఈ విమానాశ్రయాలకు ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ హోదా రానుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...