Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
గన్నవరం నూతన రన్‌వే ప్రారంభం

12brk-gannavaram1a.jpg

గన్నవరం: గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే అందుబాటులోకి వచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు దిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా మంగళవారం ప్రారంభించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కామినేని శ్రీనివాస్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌ రావు పాల్గొన్నారు.

2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబు, నాటి కేంద్రమంత్రిగా ఉన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కలిసి రన్‌వే పనులను ప్రారంభించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన నేపథ్యంలో భారీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించేందుకు పొడవైన రన్‌వే అవసరం. దానికి తగ్గట్టుగా రన్‌వేను రూపొందించారు. గత డిసెంబర్‌ నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఆరంభమయ్యాయి. కొత్త రన్‌వే అందుబాటులోనికి రావడంతో ప్రస్తుతం ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది.

 

Link to comment
Share on other sites

3 minutes ago, Yaswanth526 said:

Vijayawada Airport Stats over the years

Year : Passengers Count - % Increase

2012-13 : 169,624
2013-14 : 195,714 - 15%
2014-15 : 233,617 - 19%
2015-16 : 404,464 - 73%
2016-17 : 622,353 - 54%
2017-18 : 746,392 - 20%
2018-19 : 1,000,000 - 34% (By February)

Crossed MILLION Mark :terrific:

Terrific ??

Link to comment
Share on other sites

బెజవాడ నుంచి భారీ బోయింగ్‌ విమానాలు
13-02-2019 08:12:20
 
636856423417428422.jpg
  • ఢిల్లీ నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు
  • ఇక .. భారీ బోయింగ్‌ 747, 777 విమానాల ల్యాండింగ్‌
  • విస్తృతం కానున్న అంతర్జాతీయయానం
  • సమష్టి కృషితోనే సాధ్యం అందుబాటులోకి..
నవ్యాంధ్రలోనే అతిపెద్ద రన్‌వే ఎయిర్‌పోర్టుగా బెజవాడ నిలిచింది. విజయవాడ విమానాశ్రయంలో భారీ బోయింగ్‌ విమానాలు దిగటానికి అనువుగా నూతన రన్‌వే అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఢిల్లీ నుంచి కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు నూతన్‌రన్‌వేను లాంఛనంగా ప్రారంభించారు.
 
ఢిల్లీ నుంచి రిమోట్‌తో నూతన రన్‌వేను ప్రారంభిస్తున్న సురేష్‌ ప్రభు
 
విజయవాడ /గన్నవరం (ఆంధ్రజ్యోతి): విజయవాడ విమానాశ్రయంలో నూతన రన్‌వేను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో రిమోట్‌ బటన్‌నొక్కి ప్రారంభించారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన వేదిక మీద భారీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్ర్కీన్‌పై ఢిల్లీలో ఏఏఐ కార్యాలయ చాంబర్‌ నుంచి పాల్గొన్న కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు, సహాయ మంత్రి జయంత్‌సిన్హా, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌ గజపతిరాజు, ఏఏఐ చైర్మన్‌ గురుప్రసాద్‌ మహాపాత్రో, ఎంపీలు కంభంపాటి హరిబాబు, మాగంటి మురళీమోహన్‌, గోకరాజు గంగరాజు, ఇతర అధికారులు లైవ్‌గా కనిపించారు. విజయవాడ నుంచి రాష్ట్ర వైద్య శాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఏఏఐ సౌత్‌జోన్‌ రీజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి కమిటీ సభ్యులు ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో చిన్నారులు అలరించారు.
 
 
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది..
విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి 700 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. రైతుల నుంచి ఈ భూములను సేకరించటానికి వారిని ఎంతగానో మోటివేట్‌ చేయాల్సి వచ్చింది. భూములు అప్పగించిన ఫలితం ఇప్పుడు చూస్తున్నాం.
- పి.అశోక్‌ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి
 
 
ఎయిర్‌ కార్గోకు విస్తృత అవకాశాలు..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాలను సేకరించటం సామాన్య విషయం కాదు. చాలా వేగంగా కూడా ఈ భూములను అప్పగించటం జరిగింది. సేకరించిన భూములను ప్రభుత్వం ఉచితంగా అందించింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కార్గోకు అవకాశాలు చాలా ఉన్నాయి. వీటిపై ఏఏఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
- కామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర మాజీ మంత్రి
 
 
ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కృషి
అమరావతిని దృష్టిలో ఉంచుకుని విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. మా కృ షితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సకాలంలో భూములు ఇచ్చి సహకారం అందించటం వల్లనే ఇది సాధ్యమైంది. విజయవాడ ఎయిర్‌పోర్టును అన్నివిధాలా అభివృద్ధి చేశాం. అంతర్జాతీయ స్థాయిని కల్పించాం. నూతన రన్‌వే అందుబాటులోకి రావటం ద్వారా మరిన్ని విమానాలు రాకపోకలు సాగించటానికి మార్గం ఏర్పడుతుంది.
- సురేష్‌ ప్రభు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
 
 
అభివృద్ధికి అందరూ కృషి చేశారు..
విమానాశ్రయ అభివృద్ధికి అందరూ కృషి చేశారు. విమా నాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భూ ములను సేకరించి సకా లంలో ఇచ్చింది. భూ ములు ఇవ్వటానికి రైతులు కూడా సహ కరించారు. మా పని మేము చేశాం. అందరి సహకారంతో విమానాశ్రయ అభివృద్ధి జరిగింది.
- జయంత్‌ సిన్హా, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి
 
 
భారీ విమానాలు నడపడానికి అవకాశం..
నూతన రన్‌వే వల్ల విమానయానం విస్తృతానికి దోహదపడనుంది. ముఖ్యంగా విదేశాలకు భారీ విమానాలు నడపటానికి అవకాశం ఉంటుంది. మరో రెండు నెలల్లో ఇక్కడి నుంచి దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు న డుస్తుంది. రన్‌వే కారణంగా అనేక దేశాలకు విమాన సర్వీసులు నడపటానికి అవకాశం ఉంటుంది.
- జి.మధుసూదనరావు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌
Link to comment
Share on other sites

Vijayawada airport now ready for wide-body aircraft operations

73894-vijayawada-airport-pti.jpg

Wide-body aircraft can now start operating from Vijayawada airport as the extension and strengthening of the existing runway has been completed, according to the Airports Authority of India (AAI). The strengthening as well as extension of the runway 8-26 to 3,360 metres from 2,286 metres and associated works have been done at a cost of Rs 145 crore.

“The airport will now be able to facilitate operations of wide-body aircraft,” the AAI said in a release on Tuesday. Besides, the existing runway 05/23 at Rajahmundry airport has been strengthened and extended to 3,165 metres from 1,750 metres. This along with other works cost around Rs 181.45 crore, the release said.

These projects in Andhra Pradesh were inaugurated on Tuesday by Civil Aviation Minister Suresh Prabhu through a video link from the national capital.

Besides, the minister laid the foundation stone for linear expansion of terminal building of Visakhapatnam airport. "The existing terminal area of 19,800 square metres will be expanded to 29,050 square metres at a cost of Rs 60 crore," the release said.

Link to comment
Share on other sites

కేరళయానం

గన్నవరం నుంచి కొచ్చికి విమాన సర్వీసు
మార్చి 01 నుంచి ఆరంభించనున్న స్పైస్‌జెట్‌
పర్యాటకులు, అయ్యప్ప భక్తులకు ప్రయోజనకరం
ఈనాడు, అమరావతి

amr-brk4a_56.jpg

న్నవరం విమానాశ్రయం నుంచి దేశీయంగా మరో కీలకమైన అడుగు పడబోతోంది. పర్యాటకానికి పెట్టింది పేరైన కేరళలోని కొచ్చి నగరానికి విజయవాడ నుంచి విమాన సర్వీసు ఆరంభం కాబోతోంది. మార్చి 1 నుంచి తిరుపతి మీదుగా కొచ్చికి ఈ నూతన సర్వీసును స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ ప్రారంభిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకూ టిక్కెట్‌ ధర ఉంది. ముందుగా బుక్‌ చేసుకుంటే రూ.3 వేల నుంచి టికెట్‌ ధర పడుతోంది. ప్రస్తుతం విజయవాడ నుంచి రైలులో కొచ్చి(యర్నాకులం జంక్షన్‌)కి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. విమాన సర్వీసు అందుబాటులోనికి వస్తే కేవలం మూడు గంటల్లో వెళ్లిపోవచ్చు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి మూడు జిల్లాల నుంచి ప్రయాణికులు ఏటా పెద్దఎత్తున కేరళకు పర్యాటకంగా వెళ్లి వస్తుంటారు. వేసవి వస్తే..కేరళలో సేదదీరి వచ్చేందుకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. శబరిమలకు సైతం ఏటా వేల సంఖ్యలో భక్తులు విజయవాడ నుంచే వెళుతుంటారు. కొచ్చికి ఇక్కడి నుంచి నేరుగా వెళ్లిపోతే.. అక్కడి నుంచి శబరిమలకు 150కిలోమీటర్ల దూరం మాత్రమే.  ఇప్పటివరకూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి కొచ్చికి విమాన సర్వీసులను అందుకుంటున్నారు. అక్కడికి వెళ్లాక.. విమాన సర్వీసు ఉంటే సరి లేదంటే.. వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యలో రెండుసార్లు భద్రతా తనిఖీలు చేయించుకుని.. లగేజీ తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. వీరందరికీ తాజాగా అందుబాటులోనికి రానున్న కొచ్చి విమాన సర్వీసు ఉపయోగకరంగా ఉండబోతోంది.

మూడు గంటల్లో దిగిపోవచ్చు..
విజయవాడలో నిత్యం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 6.05కు తిరుపతి వెళుతుంది. అక్కడ 20నిమిషాలు ఆగిన తర్వాత తిరిగి 6.25కు బయలుదేరి కొచ్చికి రాత్రి 7.40కు చేరుతుంది. కొచ్చిలో ఉదయం 9.10కు విమాన సర్వీసు బయలుదేరుతుంది. ఉదయం 10.40కు తిరుపతికి వస్తుంది. అక్కడి నుంచి ఉదయం 11.10కి బయలుదేరి విజయవాడకు మధ్యాహ్నం 12.20కు చేరుతుంది. మార్చి 1 నుంచి బెంగళూరుకు సైతం నిత్యం మరో సర్వీసును స్పైస్‌జెట్‌ నడుపుతోంది. విజయవాడలో మధ్యాహ్నం 1.05కు బయలుదేరి బెంగళూరుకు 2.25కు చేరుతుంది. బెంగళూరులో 3.05కు బయలుదేరి విజయవాడకు సాయంత్రం 4.30కు వస్తుంది.

తొమ్మిది నగరాలకు అనుసంధానం..
ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ, తిరుపతి, కడప, హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై ఎనిమిది నగరాలకు సర్వీసులు నడుస్తున్నాయి. తాజాగా కొచ్చితో కలిపితే గన్నవరం నుంచి తొమ్మిది నగరాలకు అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో దేశీయంగా కీలకమైన కీలక ప్రాంతాలకూ ఇక్కడి నుంచి సర్వీసులు అందుబాటులోనికి వచ్చినట్టే. మార్చి 1 నుంచి ఆరంభమయ్యే విజయవాడ-తిరుపతి-కొచ్చి సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదనరావు వెల్లడించారు.

 

Link to comment
Share on other sites

పోటా పోటీ
17-02-2019 09:07:29
 
636859912478211124.jpg
  • దుబాయ్‌ సర్వీసుకు ప్రముఖ విమానయాన సంస్థల టెండర్లు
  • జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌వేస్‌ల బిడ్లు
  • ఈ నెల 26 వరకు పొడిగించిన ఏడీసీఎల్‌
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుబాయ్‌కు విమాన సర్వీసును నడిపేందుకు విమానయాన సంస్థలు పోటీలు పడుతున్నాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌) పిలిచిన టెండర్లకు అనూహ్యంగా పోటీ నెలకొంది. ఈ నెల 11న టెండర్లు తెరవాల్సి ఉన్నప్పటికీ ఈ నెల 26వరకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌) గడువు పొడిగించింది. ఇప్పటివరకు చూస్తే నాలుగు ప్రముఖ విమానయాన సంస్థలు టెండర్లలో పాల్గొని బిడ్లను వేపినట్టు తెలుస్తోంది. వీటిలో జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌ వేస్‌లు ఉన్నాయి. వీటిలో ఏ సంస్థ అర్హత సాధిస్తుందన్నది వేచిచూడాలి. ప్రస్తుతం టెండర్లను పొడిగించిన నేపథ్యంలో, ఈ నెల 26వరకు విమానయాన సంస్థల నుంచి వచ్చే బిడ్లను కూడా ఏపీ ఏడీసీఎల్‌ స్వీకరించే అవకాశం ఉంది.
 
 
ఆ తర్వాత టెండర్ల స్ర్కూటినీ బృందం బిడ్లను పరిశీలించాల్సి ఉంది. బిడ్లను పరిశీలించిన తర్వాత అర్హత సాధించిన సంస్థను ఎంపికచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ విధానంలో ఇండిగో సంస్థ ఎంపికైంది. తొలి సర్వీసు నుంచే 90శాతం మేర ఆక్యుపెన్సీతో సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. ప్రభుత్వం నుంచి వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కూడా అవసరం లేకుండాపోతోంది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం దుబాయ్‌కు కూడా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన విమాన సర్వీసు నడపటానికి ఇటీవలే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లకు సంబంధించి ఈసారి అసాధారణ పోటీ నెలకొంది. సహజంగా దుబాయ్‌కు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం (తెలంగాణ) జిల్లాలతో పాటు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఒకవైపు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరోవైపు ప్రభుత్వం వీజీఎఫ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనూ ఈసారి ప్రముఖ విమానయాన సంస్థలన్నీ బిడ్లను దాఖలు చేశాయి. సింగపూర్‌కు బిడ్‌వేసి సొంతం చేసుకున్న ఇండిగో సంస్థ కూడా ఈ సారి రంగంలో ఉంది. ఈ నేపథ్యంలో, మిగిలిన సంస్థలకు ఇండిగో సంస్థ గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది.
 
 
ఈ నెల 11వ తేదీనే టెండర్లను ఖరారుచేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు విమానయాన సంస్థను ఎంపికచేయలేదన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్లనే గడువు పెంచినట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. మరిన్ని విమానయాన సంస్థల నుంచి బిడ్లను స్వీకరించటానికి అవకాశాలు ఉన్నందున టెండర్ల గడువు పొడిగించినట్టు తెలుస్తోంది. పోటీని పెంచటం కోసమే ఈ పనిచేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎంపికచేసిన సంస్థతో ఏడీసీఎల్‌ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందంలోభాగంగా వీజీఎఫ్‌పై చర్చజరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ విమానయాన సంస్థలు ఆసక్తిచూపి పోటీ ఏర్పడితే వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) తగ్గే అవకాశాలు ఉన్నందున గడువు పొడిగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏడీసీఎల్‌ స్పష్టతనిస్తే కానీ, వాస్తవం ఏమిటో తెలియదు!
Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:
పోటా పోటీ
17-02-2019 09:07:29
 
636859912478211124.jpg
  • దుబాయ్‌ సర్వీసుకు ప్రముఖ విమానయాన సంస్థల టెండర్లు
  • జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌వేస్‌ల బిడ్లు
  • ఈ నెల 26 వరకు పొడిగించిన ఏడీసీఎల్‌
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుబాయ్‌కు విమాన సర్వీసును నడిపేందుకు విమానయాన సంస్థలు పోటీలు పడుతున్నాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌) పిలిచిన టెండర్లకు అనూహ్యంగా పోటీ నెలకొంది. ఈ నెల 11న టెండర్లు తెరవాల్సి ఉన్నప్పటికీ ఈ నెల 26వరకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌) గడువు పొడిగించింది. ఇప్పటివరకు చూస్తే నాలుగు ప్రముఖ విమానయాన సంస్థలు టెండర్లలో పాల్గొని బిడ్లను వేపినట్టు తెలుస్తోంది. వీటిలో జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్‌ వేస్‌లు ఉన్నాయి. వీటిలో ఏ సంస్థ అర్హత సాధిస్తుందన్నది వేచిచూడాలి. ప్రస్తుతం టెండర్లను పొడిగించిన నేపథ్యంలో, ఈ నెల 26వరకు విమానయాన సంస్థల నుంచి వచ్చే బిడ్లను కూడా ఏపీ ఏడీసీఎల్‌ స్వీకరించే అవకాశం ఉంది.
 
 
ఆ తర్వాత టెండర్ల స్ర్కూటినీ బృందం బిడ్లను పరిశీలించాల్సి ఉంది. బిడ్లను పరిశీలించిన తర్వాత అర్హత సాధించిన సంస్థను ఎంపికచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ విధానంలో ఇండిగో సంస్థ ఎంపికైంది. తొలి సర్వీసు నుంచే 90శాతం మేర ఆక్యుపెన్సీతో సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. ప్రభుత్వం నుంచి వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కూడా అవసరం లేకుండాపోతోంది. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం దుబాయ్‌కు కూడా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన విమాన సర్వీసు నడపటానికి ఇటీవలే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లకు సంబంధించి ఈసారి అసాధారణ పోటీ నెలకొంది. సహజంగా దుబాయ్‌కు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం (తెలంగాణ) జిల్లాలతో పాటు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఒకవైపు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరోవైపు ప్రభుత్వం వీజీఎఫ్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనూ ఈసారి ప్రముఖ విమానయాన సంస్థలన్నీ బిడ్లను దాఖలు చేశాయి. సింగపూర్‌కు బిడ్‌వేసి సొంతం చేసుకున్న ఇండిగో సంస్థ కూడా ఈ సారి రంగంలో ఉంది. ఈ నేపథ్యంలో, మిగిలిన సంస్థలకు ఇండిగో సంస్థ గట్టి పోటీనిచ్చే అవకాశం కనిపిస్తోంది.
 
 
ఈ నెల 11వ తేదీనే టెండర్లను ఖరారుచేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు విమానయాన సంస్థను ఎంపికచేయలేదన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్లనే గడువు పెంచినట్టుగా వాదనలు వినిపిస్తున్నాయి. మరిన్ని విమానయాన సంస్థల నుంచి బిడ్లను స్వీకరించటానికి అవకాశాలు ఉన్నందున టెండర్ల గడువు పొడిగించినట్టు తెలుస్తోంది. పోటీని పెంచటం కోసమే ఈ పనిచేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎంపికచేసిన సంస్థతో ఏడీసీఎల్‌ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఒప్పందంలోభాగంగా వీజీఎఫ్‌పై చర్చజరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ విమానయాన సంస్థలు ఆసక్తిచూపి పోటీ ఏర్పడితే వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) తగ్గే అవకాశాలు ఉన్నందున గడువు పొడిగించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏడీసీఎల్‌ స్పష్టతనిస్తే కానీ, వాస్తవం ఏమిటో తెలియదు!

Ee ulfa airlines kaakunda emigrates ni try cheyaali gettigaa....these are not worth for connecting passengers......

 

may be jet airways has agreement with emirates and kontha lo kontha idi better emo....

 

janaalaki doola teeruddi cost wise and effort wise with non-partnered airlines in dubai

Link to comment
Share on other sites

2 hours ago, Bezawada_Lion said:

Ee ulfa airlines kaakunda emigrates ni try cheyaali gettigaa....these are not worth for connecting passengers......

 

may be jet airways has agreement with emirates and kontha lo kontha idi better emo....

 

janaalaki doola teeruddi cost wise and effort wise with non-partnered airlines in dubai

Same with Singapore. This stupid Indigo does n't have code sharing agreements with anybody. it is big headache flying to Gannavaram

Link to comment
Share on other sites

yes aa foreign low cost carriers ni lagali

aa viability gap money edo vallaki isthe poddi

like Silk Air to Singapore

Flydubai to dubai

Jet Airways to Abu Dubai

They have code sharing with their respective parent airlines Singapore Airlines, Emirates and Etihad

mana local carriers eppudo okappudu handsup anela vunnaru

 

Link to comment
Share on other sites

రెక్కలు తొడిగి.. రివ్వున ఎగిరి

 

 గంటల వ్యవధిలో విమాన ప్రయాణం
వేగవంతంగా విమానాశ్రయాల అభివృద్ధి
 రాష్ట్ర  సంస్థ ప్రణాళికలు

ap-story1a_13.jpg

గతంలో రాష్ట్రం నుంచి విదేశాలకు విమానంలో ఇటు హైదరాబాద్‌... అటు విశాఖపట్నం నుంచే వెళ్లాల్సి వచ్చేది. లేదంటే చెన్నైకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ చేపట్టిన ప్రణాళికతో కొత్త విమానాశ్రయాలు, వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దాంతో ప్రయాణికుల సంఖ్య  55 లక్షలకు చేరింది.

ap-story1e_4.jpg

రాష్ట్రంలో ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి, దేశంలోని ముఖ్య నగరాలకు, ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాలకు గంటల వ్యవధిలో చేరుకునేలా విమాన సర్వీసులు నడిపే స్థాయికి విమానాశ్రయాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారు. విజయవాడ నుంచి దుబాయి, అబుదాబికి నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. తిరుపతి నుంచి విదేశాలకు నేరుగా ఒకటి, రెండు సర్వీసులైనా నడిచేలా చర్యలు చేపడుతున్నారు. విజయవాడ (గన్నవరం), రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో తాజాగా రన్‌వేలను విస్తరించారు. కడప, తిరుపతిలో విస్తరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో ప్రయాణికుల టెర్మినల్‌ను   అభివృద్ధి చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో విమాన ప్రయాణికుల సంఖ్య 13 లక్షల నుంచి ఇప్పుడు 55 లక్షలకు చేరింది. 2014లో విశాఖపట్నం, గన్నవరం, తిరుపతి, కడప నుంచి దేశీయంగా రోజూ 50 నుంచి 60 విమానాలు నడిస్తే ఇప్పుడు వీటి సంఖ్య 120కి పెరిగింది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి ఐదు, గన్నవరం నుంచి ఒక అంతర్జాతీయ సర్వీసులు  నడుస్తున్నాయి. రన్‌వేల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్ల విలువైన 2,300 ఎకరాలకుపైగా భూములను భారత విమానయాన సంస్థకి కేటాయించింది.

విజయవాడ

* రన్‌వే పొడవు: 3,360మీటర్లు
* టెర్మినల్‌: 13వేల చదరపు మీటర్లు
* దేశీయంగా నడుస్తున్న విమానాలు: దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌.
* విదేశీ సర్వీసులు: వారంలో రెండు రోజులు సింగపూర్‌కు.
* ప్రయాణికుల రద్దీ: ఏటా 10 లక్షలు
* అంతర్జాతీయ టెర్మినల్‌: 35,000 చదరపు    మీటర్లకు విస్తరణ

కొత్తగా...
 

ఇటీవలే రూ.150 కోట్లతో విస్తరించారు. రన్‌వేపై ఇక నుంచి బోయింగ్‌ 747, 777 వంటి భారీ విమానాలు దిగేందుకు వీలుంటుంది. ఒకేసారి 16 విమానాలు నిలిపే సామర్థ్యంతో పార్కింగ్‌ ప్రాంతాన్ని విస్తరించారు.

తిరుపతి

* రన్‌ వే: 2,286 మీటర్లు
* దేశీయంగా నడుస్తున్న విమానాలు: హైదరాబాద్‌, ముంబయి. బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం
* ప్రయాణికుల రద్దీ: 6 లక్షలు

కొత్తగా...
 

* రన్‌వే: 2,286 మీటర్ల నుంచి 3,800 మీటర్లకు విస్తరణ
* అదనపు సౌకర్యం: రన్‌ వే విస్తరణతో అందుబాటులోకి విదేశీ సర్వీసులు.

విశాఖపట్నం

* రన్‌వే: 1) 3,050 మీటర్లు 2) 1,829 మీటర్లు
* టెర్మినల్‌: 20,400 చదరపు మీటర్లు
* దేశీయంగా నడుస్తున్న విమానాలు: బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, పోర్టు బ్లెయిర్‌, తిరుపతి, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, చెన్నై, కోయంబత్తూరు, కొచ్చి, ఉదయ్‌పూర్‌.
* విదేశీ సర్వీసులు: దుబాయి, సింగపూర్‌, కౌలాలంపూర్‌, బ్యాంకాక్‌. ప్రయాణికుల రద్దీ: ఏటా 20 లక్షలు

కొత్తగా...
 

* టెర్మినల్‌ బిల్డింగ్‌: రెండు వైపులా 75 చదరపు మీటర్ల విస్తరణ
* అదనపు సౌకర్యం: దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు వేర్వేరుగా సౌకర్యాలు
* విమానాలు  నిలిపే ప్రాంతాలు: 8 నుంచి 16కి విస్తరణ

కడప

* రన్‌ వే: 1,719 మీటర్లు
* దేశీయంగా నడుస్తున్న విమానాలు: హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ
* ప్రయాణికుల రద్దీ: 55,000

కొత్తగా...
 

* రన్‌ వే: 2,500 మీటర్లకు విస్తరించడంతో విమాన పార్కింగ్‌ స్టాండ్లు మరో నాలుగు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా మరికొన్ని విమాన సర్వీసులు నడపొచ్చు.
* ఇతర ఉపయోగాలు: ప్రయాణికుల సంఖ్య ఏడాది వ్యవధిలో లక్షకు చేరుతుందని అంచనా. రూ.10 కోట్లతో ప్రయాణికుల టెర్మినల్‌ను విస్తరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం హైదరాబాద్‌కు విమాన సర్వీసులు నడిపే ప్రతిపాదనలున్నాయి.

రాజమహేంద్రవరం

* రన్‌ వే: 1,750 మీటర్లు
* దేశీయంగా నడుస్తున్న విమానాలు: హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై
* ప్రయాణికుల రద్దీ: ఏటా 3 లక్షలు

కొత్తగా...
 

* రన్‌ వే: 1,750 మీటర్ల నుంచి 3,165 మీటర్లకు విస్తరణ
* ఉపయోగం: కోడ్‌-4సీ విమానాశ్రయంగా విస్తరించి 120 నుంచి 180 మంది ప్రయాణికుల సామర్ధ్యంగల ఎయిర్‌ బస్‌, బోయింగ్‌ విమాన రాకపోకలకు వీలుంది. ప్రయాణికుల రద్ధీ కూడా 2019-20 నాటికి 8 లక్షలకుపైగా చేరుకుంటుందని అంచనా.

కేంద్రం చొరవతో ద్వైపాక్షిక ఒప్పందాలు తప్పనిసరి

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా కల్పించినా విశాఖ నుంచి నాలుగు దేశాలకు ... విజయవాడ నుంచి ఒక దేశానికి విమాన సర్వీసులు నడుస్తున్నాయి. తిరుపతికి అంతర్జాతీయ హోదా కల్పించినా విదేశీ సర్వీసుల్లేవు. ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడపాలంటే కేంద్రం ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా అనుమతులివ్వకపోవడంతో ఆ ప్రభావం రాష్ట్రంలోని అంతర్జాతీయ సర్వీసులపై కనిపిస్తోంది. కేంద్రం చొరవ తీసుకుంటే విమానాశ్రయాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ లక్ష్యం

ap-story1b_11.jpg

రాబోయే ఐదేళ్లలో అన్ని జిల్లా కేంద్రాల్లో విమానాశ్రయాలు, మండలకేంద్రాల్లో హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రణాళిక.

* విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు ఏర్పడుతున్న ఆవరోధాలతో భోగాపురంలో రూ.2,300కోట్ల అంచనాతో గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతుంది. ఇటీవలే సీఎం చంద్రబాబునాయుడు దీనికి శంకుస్థాపన చేశారు.

* కర్నూలులో రూ.105    కోట్లతో చేపట్టిన విమా  నాశ్రయ పనులు పూర్తవడంతో ఈ ఏడాది జనవరి 8న ప్రారంభమైంది. ఇక్కడి నుంచి చెన్నై, విజయవాడకు మొదటిదశలో విమాన సర్వీసులు నడిపేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

* కుప్పంలో రూ.50కోట్లతో ఎయిర్‌ స్ట్రిప్‌ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యవసాయఉత్పత్తులు, పండ్లు ఇతర ప్రాంతాలకు రవాణా చేసేందుకు వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. వారంలో ఆరు రోజుల పాటు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ప్రయాణికుల కంటే సరకు రవాణాకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు.
 

* నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రయాణికులతో పాటు  సరకు రవాణాకు వీలుగా రూ.362   కోట్లతో విమానాశ్రయ పనులకు యంత్రాంగం    సన్నాహాలు చేస్తోంది.

ap-story1d_4.jpg

- ఈనాడు, అమరావతి

 

 
Link to comment
Share on other sites

చలో కేరళ..
20-02-2019 08:46:25
 
636862491863676214.jpg
  • మార్చి నుంచి.. కొచిన్‌కు సర్వీసు ప్రారంభం
  • ముందుకొచ్చిన స్పైస్‌జెట్‌
  • విజయవాడ-తిరుపతి మీదుగా కొచిన్‌కు
  • తిరుగు ప్రయాణంలో బెంగళూరు మీదుగా విజయవాడకు
  • శబరిమలై యాత్రికులకు అందుబాటులోకి..
విజయవాడ (ఆంధ్రజ్యోతి): కేరళ రాష్ట్రంలోని కొచిన్‌కు విజయవాడ నుంచి విమాన సర్వీసు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మార్చి 1నుంచి కొచిన్‌కు విమాన సర్వీసు నడ పటానికి స్పైస్‌జెట్‌ సంస్థ ముందుకు వచ్చింది. తిరుపతి నుంచి వచ్చే ఈ సర్వీసు సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి వయా తిరుపతి మీదుగా కొచిన్‌ వెళుతుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం కొచిన నుంచి బెంగ ళూరు మీదుగా విజయవాడకు తిరిగి తిరుపతికి ఈ సర్వీసు చే రుకుంటుంది. స్పైస్‌జెట్‌ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు రెండు రాష్ర్టాలకు విమాన కనెక్టివిటీ ఏర్పడుతుంది. కొత్తగా కేరళ రాష్ర్టానికి కనెక్టివిటీ ఏర్పడుతుండడంతో శబరిమలై వెళ్ళేవారికి ఈ సర్వీసు బాగా ఉపయోగపడుతుంది. తిరుపతి, శబరిమలైలను రెండింటినీ దర్శించుకోవాలనుకునే వారికి కూడా ఈ సర్వీసు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
 
మరో వైపు బెంగళూరుకు అదనపు సర్వీసు అనుసంధానమౌతుంది. బెంగళూరుకు ఇప్పటికే స్పైస్‌జెట్‌ సంస్థతో పాటు, ఇండిగో విమానయాన సంస్థ కూడా విమానాలను నడుపుతోంది. కోస్తా ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కేరళకు వెళ్ళే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటి వరకు ప్రైవేటు పర్యాటక సంస్థలు, ఐఆర్‌సీటీసీ వంటి సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలు కల్పిస్తుండటంతో వాటికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోంది. ప్రస్తుతం కొచిన్‌కు విమాన సర్వీసు ప్రారంభించటంతో ఈ సంస్థల మీద పరోక్ష ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కొచిన్‌కు ఎంత ఛార్జీ నిర్ణయిస్తారన్నది తెలియాల్సి ఉంది. అధికారికంగా త్వరలో స్పైస్‌జెట్‌ సంస్థ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్
23-02-2019 18:59:50
 
636865451891597667.jpg
విజయవాడ: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఇంతియాజ్ హామీ ఇచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులతో కలెక్టర్ ఇంతియాజ్ సమావేశం
అయ్యారు. ఈ భేటీలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ , రైతులు పాల్గొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్లాట్ల కేటాయింపులో కొంత ఆలస్యం అయిందన్నారు. వారం రోజుల్లో డిప్యూటి కలెక్టర్ స్దాయి అధికారిని నియమిస్తామని చెప్పారు. 524 ప్లాట్లకు సంభందించిన పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బీ ప్యాకేజీ విషయంలో రైతులకు ఉన్న అపోహలు తొలగించినట్లు వెల్లండిచారు.
Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:
ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్
23-02-2019 18:59:50
 
636865451891597667.jpg
విజయవాడ: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఇంతియాజ్ హామీ ఇచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులతో కలెక్టర్ ఇంతియాజ్ సమావేశం
అయ్యారు. ఈ భేటీలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ , రైతులు పాల్గొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్లాట్ల కేటాయింపులో కొంత ఆలస్యం అయిందన్నారు. వారం రోజుల్లో డిప్యూటి కలెక్టర్ స్దాయి అధికారిని నియమిస్తామని చెప్పారు. 524 ప్లాట్లకు సంభందించిన పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బీ ప్యాకేజీ విషయంలో రైతులకు ఉన్న అపోహలు తొలగించినట్లు వెల్లండిచారు.

Inka ennallu ee boring news....edo okati settle chesi pakkana pettaka veellani.....

Link to comment
Share on other sites

విస్తరణం!
24-02-2019 08:25:59
 
636865935579963524.jpg
  • ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ప్రతిబంధకాలు
  • రన్‌వే ఫంక్షన్‌లోకి తీసుకు రావటానికి అష్ట కష్టాలు
  • పూర్తిస్థాయిలో ప్రహరీ గోడను నిర్మించలేని పరిస్థితి
  • 700 ఎకరాలు ఇచ్చిన రైతుల సమస్యలు అపరిష్కృతం
  • అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న రైతాంగం
నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణాభివృద్ధికి ప్రతిబంధకాలు వీడటం లేదు! విమానాశ్రయ విస్తరణకు అడ్డంకిగా ఉన్న సమస్యలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించడం లేదు. ఇదే జరిగితే అంతర్జాతీయ విమానాలు నడపటానికి విముఖత చూపే ప్రమాదం పొంచి ఉంది. ఎన్నికల ప్రక్రియలో తలమునకలుగా ఉంటున్న రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులకు, విమానాశ్రయాభి వృద్ధికి అతి ముఖ్యమైన అంశంపై నిర్లక్ష్యం వీడి కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): భూము లిచ్చిన రైతుల సమస్యల పరిష్కారం విషయంలో రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపించకపోవటంతో బెజవాడ విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ రన్‌ను ఫంక్షన్‌లోకి తీసుకు రావాలంటే.. తక్షణం విమానాశ్రయానికి అప్పగించిన భూముల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉంది. రన్‌వేపై ధృఽఢమైన ఫైనల్‌ లేయర్‌ను వేయాల్సి ఉంది. విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు రాజధానిలో ప్లాట్ల కేటాయింపు, కౌలు పరిష్కారం, ఇళ్ళ బాధితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, వెంచర్లలో ప్లాట్ల దారులకు ప్లాట్‌ టు ప్లాట్‌, కోళ్ళఫారాలు ఉన్న వారికి తగిన పరిహారం వంటి అనేక సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. విమానాశ్రయ విస్తరణ కోసం 700 ఎకరాల భూములను అప్పగించిన రైతాంగ సమస్యలను పరిష్కరించటానికి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను అపాయింట్‌ చేసి ఉంటే ఈ సమస్య ఇంత వరకు వచ్చేది కాదు!
 
 
ప్రహరీ.. ప్రహసనం
ప్రస్తుతం దావాజీగూడెం దగ్గర 500 మీటర్ల వరకు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రహరీ నిర్మాణం చేపట్ట లేదు. ప్రహరీ నిర్మాణం చేపడుతుంటే రైతులు, వెంచర్ల ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అడ్డుకుంటు న్నారు. దీంతో పనులు నిలుపుదల చేస్తున్నారు. రన్‌వేను ప్రారంభించుకున్న నేపథ్యంలో, ఫంక్షన్‌లో తీసుకు రావటానికి ప్రహరీ కాకపోయినా.. కనీసం ఫెన్సింగ్‌ అయినా వేసి భద్రత కల్పించాలనుకున్నా.. దీనిని కూడా రైతులు, ప్లాట్లదారులు అంగీక రించటం లేదు. నిన్న మొన్నటి వరకు రన్‌వే మీదగాఆ బుద్ద వరంలోకి రాకపోకలను అనుమతించారు. అతి కష్టం మీద గోడ మూసివేశారు. ప్రస్తుతానికి ఈ సమస్య పరిష్కారమైనా.. దావాజిగూడెం, అల్లాపురం ప్రాంతాల దగ్గర టెక్నికల్‌ కమ్యూనికేషన్స్‌ కోసం ఎయిర్‌పోర్టు అధికారులు టవర్‌ నిర్మిస్తున్నారు. ఈ టవర్‌ పనులను కూడా అడ్డుకుంటున్నారు. రోడ్డు మార్గం నుంచి పనివాళ్ళు వెళ్ళకుండా రైతులు రాళ్లు పాతి అడ్డుగోడలు సృష్టిస్తున్నారు. కోళ ్ళ ఫారాల యజమానులు తమకు సంతృప్తికర పరిహారం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 
ప్రైవేటు వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యామ్నాయంగా అజ్జంపూడిలో ఇస్తామన్న ప్లాట్ల సమస్యను కూడా త్వరగా పరిష్కరించాల్సి ఉంది. నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌ పరిధిలోకి వచ్చే వారి భూములు కూడా ఎందుకూ పనికిరాకుండా ఉంటున్నాయి. వీరు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. అత్యంత ముఖ్యమైన సమస్య పేదలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఇవన్నీ తేలకపోతే రైతులు విమానాశ్రయ అభివృద్ధికి సహకరించే పరిస్థితి ఉండదు. విమానాశ్రయ భూముల్లో ఇంకా హెచ్‌టీ లైన్‌ వెళుతున్నాయి. వీటిని సంబంధిత విద్యుత్‌ శాఖ తొలగించాల్సి ఉంది. నూతన రన్‌వే నవంబరు నాటికే ఫంక్షన్‌లోకి రావాల్సి ఉంది. వచ్చే మార్చి నాటికి ఫంక్షన్‌లోకి తీసుకు రావాలను కున్నా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే సాధ్యమయ్యేలా లేదు.
 
 
అంతర్జాతీయ సంస్థలెలా వస్తాయి..?
విజయవాడ విమానాశ్రయంలో విస్తరించిన రన్‌వే ఫంక్షన్‌లోకి రానంతవరకు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఆసక్తి చూపే పరిస్తితి ఉండదు. రన్‌వే తగినంత లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన సింగపూర్‌కు విమాన సర్వీసు నడుపుతోంది. దుబాయ్‌కు కూడా ఇదే విధానంలో వెళుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కూడుకున్న వయబిలిటి గ్యాప్‌ ఫండింగ్‌ స్కీమ్‌ కాకుండా నేరుగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు ముందుకు రావాలంటే రన్‌వే ఫంక్షన్‌లోకి రావాలి. మొదట్లో విజయవాడ విమానాశ్రయంలో 150 మంది ఉద్యోగులు పనిచేసేవారు. విమానాశ్రయం విస్తరిస్తున్న కొద్దీ ఈ సంఖ్య ఏడాదికేడాది రెట్టింపు అవుతూ వస్తోంది. ఇటీవల వరకు 800కు పెరిగిన ఉద్యోగులు, ప్రస్తుతం1000 కు చేరింది. రన్‌వే అందుబాటులోకి వస్తే.. యాక్టివిటీ ద్వారా మరో 200 - 300 మందికి ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...