Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

2 hours ago, Bezawada_Lion said:

Antha pedda airport katti maintain cheyali ante 611 crs kante chaala ekkuva avuddi....airport ki taggatu traffic and tarrifs kooda vundaali.....ivemi lekunda kadithe tadisi mopedu avuddi.....

paiga ippudu katte airport ala vundi poddi....every cosmopolitan citi will have a secondary airport....future lo current airport ala use chesukovachu.....

simple math....

kattatam ante ivvala repu kaadhu kadha... 2018-19 year lo Vij airport is having around 1.5million passengers... 8-10 years ante easy ga 3-4 million passengers vuntaru.. with this number it is not difficult to maintain new airport.

reg to your 2 airport theory... one good airport can easily handle 70-80 million passengers... Atlanta airport in 4700acres had 100+million passengers in 2017. so second airport is not a needed thing.

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
రెవెన్యూ తప్పిదం.. రైతులకు శాపం!
25-01-2019 07:57:44
 
636839998653925942.jpg
  • భూమి ఉన్నా.. ఉపయోగం లేని పరిస్థితి
  • నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌లోకి 68 ఎకరాలు!
విజయవాడ ఆంధ్రజ్యోతి): నిర్మాణాలకు ఆస్కారం లేదు.. పంటలు పండించుకునే పరిస్థితి అంతకన్నా లేదు.. భూమి ఉండీ ప్రయోజనం లేకపోవటం అంటే ఇదే! విమానాశ్రయ విస్తరణకు భూ సమీకరణ తలపెట్టిన రెవెన్యూ యంత్రాంగం అప్పట్లో చేసిన చిన్న తప్పిదం కారణంగా దాదాపుగా 68ఎకరాలు నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌పరిధిలోకి వచ్చాయి. దీంతో భూములిచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు.. మేమేం పాపం చేశాం? అంటూ రైతులు, ప్లాట్లదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూములను కూడా తీసుకోండని వేడుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం ఈ విషయంలో చొరవ చూపి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసరపల్లి, బుద్ధవరం, అజ్జపూడి, దావాజిగూడెం, అల్లాపురం తదితరగ్రామాల్లో మొత్తం 697.88 ఎకరాల భూములను సమీకరించిన రెవెన్యూ యంత్రాంగం, వాటిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు స్వాధీనం చేసింది. ఈ భూములకు సంబంధించి పెగ్‌మార్కింగ్‌లో జరిగిన లోపాల వల్ల విమానాశ్రయం సమీపంలో ఉన్న కొన్ని భూములు నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌పరిధిలోకి వెళ్ళాయి. మొత్తం 68ఎకరాల మేర నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌లోకి వెళ్ళాయి. సరిగ్గా ఈ భూములు ప్రతిపాదిత నూతన రన్‌వే ప్లాన్‌చుట్టూ ఉన్నాయి. విమానాశ్రయం ప్రహరీ దాటిన భూములు ఇందులోకి వస్తున్నాయి.
 
నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌లోకి వెళ్లటం వల్ల అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక పక్క విమానాశ్రయ గోడ, మరోవైపు కాలువ ఉంది. ఎటునుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి ప్రాంతంలో ఉన్న భూములను అమ్ముకోవటం కూడా కష్టమే అవుతుంది. ఎన్‌సీజడ్‌లోకి వెళ్ళటం వల్ల ధైర్యం చేసి ఈ భూములను కొనే పరిస్థితి కూడా ఉండదు. పోనీ వ్యవసాయమైనా చేసుకుందామనుకుంటే అదీ కుదిరే పరిస్థితి లేదు. ఈ భూముల్లోకి వెళ్లాలంటే సరైన మార్గం కూడాలేదు. పోనీ ఈ భూముల్లో పంటలు పండించుకుందామంటే ఆ పరిస్థితి లేకుండా పోయింది. పంటభూముల రైతులకు తమ భూములు నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌లో ఉన్నాయన్న విషయం చాలామంది రైతులకు స్పష్టంగా తెలియదు. ఈ భూముల్లో ఓ రియల్‌ వెంచర్‌ సంస్థ ప్లాట్లను వేసింది. ఇందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు తాము నష్టపోతున్నామన్న విషయాన్ని గ్రహించారు. స్థానిక రెవెన్యూ అధికారులకు తమ మొర వినిపిస్తున్నారు. తమ ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భూ సమీకరణలో ఉన్న వెంచర్లకు అజ్జంపూడిలో ప్లాట్లు కేటాయిస్తున్నట్టుగానే.. తమ ప్లాట్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ప్లాట్లదారులు సంఘటితంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
 
ఇదిలాఉంటే.. బయట ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంతంలో రైతుల వద్ద స్థలాలు కొన్నవారు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తమ స్థలాలకు ధర పలుతుందని భావించిన వారు, ల్యాండ్‌ పూలింగ్‌లో పోతే, రాజధానిలో ప్లాట్లు దక్కించుకోవచ్చన్న ఆలోచనతో కొనుగోలు చేసిన వారు కూడా నో కన్‌స్ట్రక్షన్‌ జోన్‌లో స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ఈ తప్పిదం ఇప్పుడు జరిగింది కాదు. రెవెన్యూ యంత్రాంగం మొదట్లో పెగ్‌ మార్క్‌ చేసేటపుడు జరిగింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకుని ఉన్నా ఈ పరిస్థితి దాపురించేది కాదు. ఎయిర్‌పోర్టు అథారిటీ తాము స్వాధీనం చేసుకున్న భూములలో ఏలూరు కాల్వ దగ్గర వరకు రన్‌వేను విస్తరిస్తోంది. ఏలూరు కాల్వ దాటిన తర్వాత నిర్మాణమైతే ఏమీచేయటం లేదు. కానీ ఆ ప్రాంతంలో చివర్లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఒక రాడార్‌ను ఏర్పాటు చేసింది. రాడార్‌ను ఏర్పాటు చేయటం వల్ల ఈ ప్రాంతంలో ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో ఈ భూములు కూడా నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌పరిధిలోకి వచ్చాయి.
 
పాపం చాలా మంది స్థానిక రైతులకు కూడా ఈ విషయం తెలియదు. తెలిసిన వారు మాత్రం ఈ భూములను తాము ఉంచుకుని ఏమి చేస్తామని, భూ సమీకరణ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పూలింగ్‌ కింద ఈ భూములను తీసుకోవటానికి సమస్యలు ఉన్నాయి. వీటిని తీసుకోవాలంటే మళ్లీ భూ సమీకరణ నోటిఫికేషన్‌జారీ చేయాలి. భూ సమీకరణ నోటిఫికేషన్‌జారీ చేయాలంటే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంటుంది. ఇంతకు ముందే ఏలూరు కాల్వ డైవర్షన్‌ కోసం భూ సమీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసి రైతుల అభ్యంతరం మేరకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. నో కన్‌స్ట్రక్షన్‌జోన్‌లో ఉన్న పాపానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులు, ప్లాట్లదారులే స్వయంగా తమ భూములను సమీకరణ కింద తీసుకోవాలని కోరుతున్నారు. ఈ భూములు ఇస్తే తీసుకోవటానికి ఎయిర్‌పోర్టు అథారిటీ కూడా సంసిద్ధతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కూడా ఆశక్తితో ఉన్నారు. రైతులు, ప్లాట్లదారుల సమస్యను పరిష్కరించటానికి జిల్లా యంత్రాంగం చొరవ చూపాల్సి ఉంది.
Link to comment
Share on other sites

కొత్త రన్‌వేపై పరుగులు 
 

ఎన్నికల కోడ్‌ వచ్చేలోగా పూర్తికి పనులు 
మార్చిలోగా ప్రారంభించాలనేది ఆలోచన 
అందుబాటులోకి రానున్న 11,023అడుగుల రన్‌వే 
ఈనాడు, విజయవాడ

amr-top1a_62.jpg

గన్నవరం విమానాశ్రయంలో కొత్త రన్‌వేను మార్చిలోగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఎలాగైనా అందుబాటులోనికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ వచ్చేలోగానే ప్రారంభించాలని కేంద్ర పౌరవిమానయానశాఖ భావిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన నేపథ్యంలో గన్నవరానికి పొడవైన రన్‌వే అత్యవసరం. అందుకే.. 2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడులు విమానాశ్రయంలో ఉన్న రన్‌వే పొడిగింపు పనులను ఆరంభించారు. 2018 డిసెంబర్‌లోగా పనులను పూర్తిచేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. స్థానికంగా నివాసం ఉండేవారికి ప్రత్యామ్నాయం చూపించి తరలించడం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వంటి విషయాల్లో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో రన్‌వే పనులను మాత్రం ఆపకుండా నిరంతరాయంగా చేపడుతూ వచ్చారు. ప్రస్తుతం అన్ని అడ్డంకులూ తొలగిపోయి పనులు చివరి దశకు చేరుకున్నాయి. విమానాశ్రయంలో పాత, కొత్త రన్‌వేలను కలిపే ప్రాంతం 200 మీటర్లు ప్రస్తుతం మిగిలింది. ఇది పూర్తయితే.. పూర్తిస్థాయిలో రన్‌వే సిద్ధమైపోతుంది. రన్‌వే చుట్టూ నిర్మిస్తున్న పటిష్టమైన తొమ్మిది అడుగుల గోడ సైతం.. రెండు వైపులా మొత్తం పూర్తయిపోయి ఓ 500 అడుగుల మేర మాత్రమే మిగిలింది. మధ్యలో ఇంకా 71 ఇళ్ల వరకూ ఉండడంతో పనులను ఆపారు. వాటిని తరలించిన వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే గోడను కలిపేస్తారు. విమానాశ్రయంలో ప్రస్తుతం 7500 అడుగుల రన్‌వే ఉంది. దీనిపైనే విమాన సర్వీసులు తిరుగుతున్నాయి. అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమైతే తప్పకుండా పెద్ద రన్‌వే ఉండాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతానికి సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ఆరంభమైనప్పటికీ.. 180 సీటింగ్‌ ఉన్న ఏటీఆర్‌ సర్వీసులను ఇండిగో నడుపుతోంది. అదే భారీ విమాన సర్వీసులున్న అంతర్జాతీయ సంస్థలు రావాలంటే.. ఖచ్చితంగా రన్‌వే పెద్దది అవసరం. అందుకే.. ప్రస్తుతం ఉన్న రన్‌వేను 11,023 అడుగులకు విస్తరిస్తున్నారు. ఈ కొత్త రన్‌వే అందుబాటులోనికి వస్తే.. ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది.

పాత, కొత్త వాటిని కలపడమే మిగిలింది.. 
రూ.160 కోట్లతో రన్‌వే విస్తరణ పనులను రెండు దశలుగా చేపట్టారు. ప్రస్తుతం ఉన్న 7500 అడుగుల రన్‌వేనే 11,023 అడుగులకు పొడిగిస్తున్నారు. దీనికోసం పాతదానిని కలుపుతూ.. కొత్తగా 3523 అడుగుల రన్‌వేను వేస్తున్నారు. దీనికోసం పాత రన్‌వేను సైతం పటిష్ఠంగా కొత్తదానికి సమానంగా చేపట్టాల్సి ఉంది. అందుకే.. పాత రన్‌వేను పటిష్ఠ పరిచే పనులు, అదే సమయంలో కొత్తగా వేసే పనులను రెండు దశల్లో చేపడుతూ వచ్చారు. పాత రన్‌వేను పటిష్ఠ పరిచే పనులు తాజాగా పూర్తయిపోయాయి. కొత్త రన్‌వే సైతం 80శాతం పూర్తయిపోయింది. పాత, కొత్త రన్‌వే కలిసే ప్రాంతంలో మాత్రమే పనులు చేపట్టాల్సి ఉంది. మిగతా అంతూ పూర్తయింది. బుద్ధవరం వద్ద రెండింటిని జాయింట్‌ చేసే చోట 200 మీటర్ల పనులు ఇంకా మిగిలాయి. రన్‌వేను ఆనుకుని ఉన్న మిగతా ఇళ్లను తరలిస్తే.. ప్రహరీ గోడను మూసేసి.. ఈ మిగిలిన పనులను సైతం చేపట్టనున్నారు. ఫిబ్రవరి చివరిలో లేదంటే మార్చి ఆరంభంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు చేతులమీదుగా ప్రారంభించాలని భావిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి దుబాయి సర్వీసు!

ప్రజాభిప్రాయ సేకరణకు భారీగా విజ్ఞప్తులు
ఫిబ్రవరి 11న విమానయాన సంస్థ ఎంపిక
వారానికి రెండు రోజులు నడిపే అవకాశం
ఈనాడు, అమరావతి

amr-gen13a_41_1.jpg

విజయవాడ నుంచి దుబాయ్‌కి విమాన సర్వీసు ప్రక్రియ ఊపందుకుంది. మరో నెల రోజుల్లో దుబాయి సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) ఆధ్వర్యంలో బిడ్లను ఆహ్వానిస్తూ జనవరి 23న నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఫిబ్రవరి 02 వరకూ స్వీకరించారు. అతి తక్కువకు బిడ్‌ను దాఖలు చేసిన విమానయాన సంస్థకు అవకాశం కల్పించనున్నారు. ఫిబ్రవరి 11న విమానయాన సంస్థల ప్రతినిధుల సమక్షంలోనే బిడ్లను తెరిచి తక్కువకు కోట్‌ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. అనంతరం నెల రోజుల వ్యవధిలో దుబాయికి సర్వీసు ఆరంభమయ్యే అవకాశం ఉంది. గతంలో సింగపూర్‌కు సర్వీసును నడిపినప్పుడు కూడా ఇలాగే తొలుత బిడ్లను ఆహ్వానించి అనంతరం ఇండిగోను ఎంపిక చేశారు. దుబాయికి సర్వీసును ఏర్పాటు చేస్తే.. సింగపూర్‌ కంటే రద్దీ రెట్టింపు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

దుబాయికి సర్వీసులను నడిపేందుకు ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఏడీసీఎల్‌ చేపట్టింది. గతంలో సింగపూర్‌కు సర్వీసును ఆరంభించే ముందు కూడా ఇలాగే సర్వే చేపట్టారు. తాజాగా దుబాయికి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు మంచి స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్తో పాటూ ఈమెయిల్‌, వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సర్వేను  చేపట్టారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విదేశాలలో ఉండే ప్రవాసాంధ్రుల నుంచి మద్దతుగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్‌లోనే 2,42,594 మంది దుబాయి సర్వీసుకు ఓటేశారు. 950 మంది ఈమెయిళ్ల ద్వారా తమ సమ్మతిని తెలిపారు. మరో 25 మంది వాట్సాప్‌, 30 మంది ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆసక్తిని తెలియజేశారు. ఫిబ్రవరి 23 వరకూ వచ్చిన ఈ స్పందనను చూసిన రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ వెంటనే బిడ్లను ఆహ్వానించింది. బిడ్లను దాఖలు చేసిన విమానయాన సంస్థల్లో.. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌)ను అత్యంత తక్కువకు కోట్‌ చేసిన వారిని ఎంపిక చేయనున్నారు.

బుధ, శుక్రవారాల్లో ఉండొచ్చు..
దుబాయి సర్వీసును బుధ, శుక్రవారాల్లో వారంలో రెండు రోజులు నడపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్‌కు నడుస్తున్న అంతర్జాతీయ సర్వీసులు మంగళ, గురువారాల్లో గన్నవరం నుంచి నడుస్తున్నాయి. అందుకే.. బుధ, శుక్రవారాల్లో నడపాలని భావిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి దుబాయికి సర్వీసును ఆరంభిస్తే.. స్పందన భారీగా ఉండబోతోంది. సింగపూర్‌కు వీసాల సమస్య ఎదురవుతోంది. దీంతో ఆరంభంలో సర్వీసులు సగం వరకూ నిండేవి. ప్రస్తుతం 70శాతం పైగా నిండుతున్నాయి. దుబాయికి సింగపూర్‌ మాదిరిగా వీసా సమస్య లేదు. అమెరికా వీసా ఉన్న ప్రతి ఒక్కరూ దుబాయికి నేరుగా వెళ్లిపోవచ్చు. అమెరికా వీసా ముద్ర ఉంటే.. దుబాయికి ప్రత్యేకంగా అవసరం లేదు. దానితోనే వెళ్లిపోవచ్చు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికులకు అమెరికా వీసాలున్నాయి. దీనికితోడు కొత్తగా వీసా అవసరమైన వారికి అత్యంత తేలికగా దుబాయి అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన దుబాయికి వెళ్లి వచ్చేవారు ఈ ప్రాంతం నుంచి భారీగా ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యంత తేలికగా దుబాయి నుంచి వెళ్లిపోయేందుకు వీలుంటుందని, అందుకే ఆరంభం నుంచే రద్దీ ఉండబోతోందని గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మండలి సభ్యులు ముత్తవరపు మురళీకృష్ణ వెళ్లడించారు. ఇలా వచ్చేవారికి సమయం ఆరేడు గంటలు మిగలబోతోందన్నారు. చెన్నై, హైదరాబాద్‌కు వెళ్లి రావాల్సిన అవసరం లేకుండా.. నేరుగా గన్నవరంలో దిగిపోవచ్చన్నారు. గన్నవరం నుంచి దుబాయి సర్వీసును ఆరంభించాలంటూ ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ తరఫున చాలాకాలంగా కోరుతున్నామని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరుతుండటంతో ఈ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోందన్నారు.

amr-gen13b.jpg

దుబాయి సర్వీసు కావాలంటూ విజ్ఞప్తులిలా..
ఏపీఏడీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా: 2,42,594మంది
ఈమెయిళ్ల ద్వారా: 950మంది
వాట్సాప్‌లో: 25మంది
ఎస్‌ఎంఎస్‌ల రూపంలో: 30మంది

Link to comment
Share on other sites

గన్నవరంలో అందుబాటులోకి నూతన రన్‌వే

 

నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు
 పెద్ద విమానాలకు రాకపోకలకు మార్గం సుగమం

ap-main16a_4.jpg

ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన రన్‌వే మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉదయం 10.30కు ప్రారంభిస్తారని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు వెల్లడించారు. 2017 ఫిబ్రవరి 12న ముఖ్యమంత్రి చంద్రబాబు, నాడు కేంద్రమంత్రిగా ఉన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కలిసి రన్‌వే పనులను ఆరంభించారు. రూ.160 కోట్లతో అనుకున్న గడువులోగా పనులను పూర్తిచేసి.. అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఇక ఎయిర్‌బస్‌లు ఎగరొచ్చు: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా మారిన నేపథ్యంలో భారీ విమాన సర్వీసులు రాకపోకలు సాగించేందుకు పొడవైన రన్‌వే అవసరం. దానికితగ్గట్టుగా రన్‌వేను రూపొందించారు. గత డిసెంబర్‌ నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి ఆరంభమయ్యాయి. కొత్త రన్‌వే అందుబాటులోనికి రావడంతో ప్రస్తుతం ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 777, 747 వంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలు కలిగింది.

 

Link to comment
Share on other sites

అతిపెద్ద రన్‌వే.. అరుదైన ఘనత
12-02-2019 08:58:01
 
636855586826159627.jpg
  • నేడు బెజవాడలో నూతన రన్‌వే ప్రారంభం
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్న కేంద్రమంత్రి సురేష్‌ ప్రభు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో చారిత్రక అడుగు నేడు పడబోతోంది! నవ్యాంధ్రలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నిలవనుంది. నూతనంగా అభివృద్ధి చేసిన రన్‌వేను మంగళవారం కేంద్ర విమానయానశాఖ మంత్రి సురేష్‌ ప్రారంభిస్తున్నారు. ఏర్పాట్లను సోమవారం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు సమీక్షించారు.
 
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి): బెజవాడ ఎయిర్‌పోర్టులో రూ.135 కోట్లవ్యయంతో 1014 మీటర్ల మేర నూతనంగా రన్‌వే నిర్మాణాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చేపట్టింది. డిసెంబర్‌ నెలలోనే నూతన్‌ రన్‌వేను ప్రారంభించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందుల రీత్యా వీలు పడలేదు. నేడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నూతన రన్‌వేను ప్రారంభిస్తారు. విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం ఎయిర్‌పోర్టు రన్‌వేలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాతో పాటు కేంద్ర పౌర విమానయానశాఖ మాజీమంత్రి అశోక్‌ గజపతిరాజులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) చైర్మన్‌ గురుప్రసాద్‌ మహాపాత్రో కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో ఉంటారు. జిల్లా మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, బందరు ఎంపీ కొణకళ్ళ నారాయణరావు, స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌లు
 
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కార్యక్రమంలో పాల్గొంటారు. నూతన రన్‌వే ప్రారంభోత్సవానికి సంబంధించి విజయవాడ విమానాశ్రయ అధికారులు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం వేదిక వద్ద ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఏర్పాట్లను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు సమీక్షించారు.
 
 
రాష్ట్రంలోనే పెద్దది..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్రంలోనే అరుదైన ఘనత సాధించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలుస్తోంది. అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా చిరస్మరణీయం కానుంది. రాజమండ్రి, విశాఖపట్నంలో రన్‌వేను విస్తరించినా విజయవాడ కంటే తక్కువే! విజయవాడ విమానాశ్రయం రన్‌వేను 2286 మీటర్లు నుంచి 3360 మీటర్లకు విస్తరించారు. నూతన రన్‌వే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 700ఎకరాలను స్థానికంగా ఉన్న కేసరపల్లి, అజ్జంపూడి, బుద్దవరం, అల్లాపురం, చిన అవుటపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరించింది.
 
అమరావతి రైతుల తరహాలోనే రాజధానిలోనే ప్రతిగా రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్లాట్లను ఇచ్చేందుకు. సాలుసరి కౌలు తదితర ప్రయోజనాలను కల్పించేందుకు అంగీకరించటం జరిగింది. రైతుల నుంచి భూములను కృష్ణాజిల్లా యంత్రాంగం ఏఏఐకి స్వాధీనం చేసింది. ప్రస్తుత అవసరాల కోసం ఏలూరు కాల్వ దిగువ వరకు మాత్రమే రన్‌వే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఏలూరు కాల్వ అవతల భూములలో భవిష్యత్తులో రన్‌వే విస్తరించాలని నిర్ణయించింది. ఏలూరు కాల్వ డైవర్షన్‌కు కూడా రైతుల నుంచి అభ్యంతరాలు రావటంతో తాత్కాలికంగా ప్రతిపాదనను ప్రభుత్వం, ఏఏఐ కూడా పక్కన పెట్టాయి. పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ టెండర్లను దక్కించుకుని పనులు చేపట్టింది. డిసెంబరు నాటికి కావాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల పనులు జాప్యమయ్యాయి.
 
 
భారీ విమానాలకు అనుకూలం
అంతర్జాతీయ హోదాను అందుకున్న క్రమంలో ఆ స్థాయిలో రన్‌వే విస్తరణ అవసరమైంది. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమౌతున్న దశలోనే సరిగ్గా విమానాశ్రయ రన్‌వే కూడా అందుబాటులోకి రావటం మంచి పరిణామం. ఇప్పటివరకు ప్రస్తుతం ఉన్న రన్‌వే ప్రకారం ఎయిర్‌బస్‌ 321 మా త్రమే ల్యాండింగ్‌ కావటానికి అవకాశం ఉం ది. ప్రస్తుతం అందుబాటులోకి రానున్న నూ తన రన్‌వేపై భారీ విమానాలైన బో యింగ్‌ - 747, బోయింగ్‌ - 777 విమానాలు కూడా ల్యాండ్‌ కావటానికి అవకాశమేర్పడుతుంది.
 
 
కొన్ని పనులు మిగిలే ఉన్నాయి..
నూతన రన్‌వేకు నేడు ప్రారంభోత్సవం జరుగుతున్నా.. మరో నెలరోజులకు కానీ ఇది పూర్తిస్థాయిలో కమిషన్‌లోకి రాదు! క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులున్నాయి. నూతన రన్‌వే కమిషన్‌లోకి రావాలంటే సెక్యూరిటీగా పూర్తిగా ప్రహరీని నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రియల్‌వెంచర్ల ప్లాట్ల భూములకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం ప్రత్యామ్నాయం చూపకపోవటంతో వారు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గోడ కట్టలేదు. బుద్దవరం, దావాజిగూడెం ప్రజలకు ప్రత్యామ్నాయంగా రోడ్డుపనులను పూర్తిచేయాల్సి ఉంది. అప్పటివరకు నూతన రన్‌వే మీదుగానే రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. దీనికి తోడు హైటెన్షన్‌ తీగలను కూడా తొలగించాల్సి ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...