Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

7 hours ago, swarnandhra said:

taxiway lekunda konnallu nadipinchavacchu. especially Gannavaram like small airport in the foreseeable future.

But immediate need is to install aerobridges. ekkado half km dooram ga aapi busses lo move chestunnaru passengers ni.

agree with you. aero bridges kuda vundali - but they charge fees per plane/seat so most of them(airlines) prefer grounds 

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
ఎయిర్‌పోర్టు విస్తరణ పనుల్లో జాప్యం లేదు
13-12-2018 03:42:03
 
  • 2022 మార్చి కల్లా విజయవాడ టెర్మినల్‌ పూర్తి
  • తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులకు ఓకే
  • కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని విమానాశ్రయాల విస్తరణ పనులు, వాటి నిర్మాణ కాలపరిమితి, సర్వీసుల రాకపోకలపై రాజ్యసభ సభ్యులు మూడు ప్రశ్నలు వేశారు. వాటికి కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న విస్తరణ పనుల్లో ఏ మాత్రం జాప్యం లేదని మంత్రి తెలపారు. ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెపుతూ, ‘‘విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, రాజమండ్రి, కడప విమానాశ్రయాల్లో విస్తరణ పనులు జరుగుతున్నాయి. వర్షాల కారణంగా విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల్లో కాస్త మందకోడిగా పనులు జరుగుతున్నాయి. మిగితా విమానాశ్రయాల్లో షెడ్యూల్‌ ప్రకారమే పనులు నడుస్తున్నాయి’’ అని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమధానం ఇస్తూ, ‘‘విజయవాడలో నూతన విమానాశ్రయ టెర్మినల్‌ నిర్మాణం 2022 మార్చి కల్లా పూర్తవుతుంది. పర్యావరణ అనుమతుల కోసం 2018 జూన్‌ 27న ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ).. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు దరఖాస్తు చేసింది.
 
పూర్తి స్థాయి పర్యావరణ అనుమతులు లభించడానికి 9 నుంచి 12 నెలల సమయం పడుతుంది’’ అని మంత్రి వివరించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ‘‘తిరుపతి విమానాశ్రయం నుంచే కాకుండా ఎయిర్‌ సర్వీస్‌ ఒప్పందం ప్రకారం దేశంలోని ఏ విమానాశ్రయం నుంచి అయినా భారతదేశానికి సంబంధించిన ఎయిర్‌లైన్స్‌ సంస్థలు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపవచ్చు. 2017లోనే విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ప్రకటించాం. తిరుపతిలో రూ.174 కోట్ల వ్యయంతో 700 పీక్‌ అవర్‌ ప్యాసింజర్స్‌ సామర్థ్యం గల ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను, రూ.161.35 కోట్ల వ్యయంతో విజయవాడలో 500 పీక్‌ అవర్‌ ప్యాసింజర్స్‌ సామర్థ్యం గల ఇంటెర్మ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మించాం’’ అని మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు.
Link to comment
Share on other sites

6 hours ago, ravindras said:

as per bhogapuram airport rfp is building with runway dimensions 3800*60 (length * width)  to handle a380

mumbai airport runway dimesions 3660*60 currently handling airbus a380 flights

gannavaram airport runway can be extended upto 3925 meters without canal diversion . i unable to understand  why aai want to extend runway upto 4430 meters

https://deccanchronicle.com/nation/current-affairs/260816/vijayawada-hurdles-to-airport-expansion.html

4430 ekkada chesthunnaru ఈ క్రమంలో 2286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను, 3360 మీటర్ల మేర రూ.వంద కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. దీని వల్ల బోయింగ్‌ 747, 777 విమానాలు కూడా నడవటానికి అవకాశం ఉంటుంది.

Link to comment
Share on other sites

సింగపూర్‌ సర్వీస్‌.. సూపర్‌..
14-12-2018 09:06:03
 
636803751652213195.jpg
  • సింగపూర్‌ - ఇండిగో సర్వీసు వేళలు 6.40 మంగళ, గురు 
విజయవాడ నుంచి సింగపూర్‌ నూతన సర్వీసుకు అనూహ్య స్పందన లభిస్తోంది. రెండువారాల్లో సింగపూర్‌ నుంచి సగటున 170మంది వరకు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్ళే వారు సగటున 70 మంది ఉంటున్నారు. రాకపోకల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడలో వీసా కేంద్రం ఏర్పాటుకు సింగపూర్‌ కాన్సులేట్‌ ఆసక్తి చూపుతోంది.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): విదేశీయానానికి ఫాస్ట్‌ గ్రోయింగ్‌ డెస్టినేషన్‌గా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో సింగపూర్‌ విదేశీ మంత్రిత్వశాఖ బెజవాడపై ప్రత్యేకదృష్టి సారించింది. రెండువారాల కిందట ప్రారంభించిన సింగపూర్‌ సర్వీసు దుమ్ము రేపడంతో విజయవాడలో వీసాకేంద్రం ఏర్పాటుకు సింగపూర్‌ కాన్సులేట్‌ ఆసక్తి చూపుతోంది. అతి త్వరలో వీసాకేంద్రం బెజవాడలో కొలువు తీరబోతోంది. ముఖ్యంగా విదేశాలకు ఎక్కువ రాకపోకలు ఉన్నప్రాంతం కావటంతో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం, ఖమ్మం, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు వీసాకోసం హైదరాబాద్‌ కానీ, బెంగళూరు కానీ వెళ్ళాల్సి వస్తోంది. ఇక మీదట విజయవాడలోనే వీసా తీసుకునేందుకు అవకాశం కలుగుతోంది.
 
సింగపూర్‌ కాన్సులేట్‌ చూపిన ఆసక్తివల్ల విజయవాడ నుంచి విదేశీయానానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కృషికి ఇదే నిదర్శనం. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఏడీసీఎల్‌), సింగపూర్‌ కాన్సులేట్‌తో వీసాకేంద్రం ఏర్పాటుపై చర్చిస్తోంది. సింగపూర్‌ కాన్సులేట్‌ కూడా సానుకూలంగా స్పందించటంతో విజయవాడలో వీసాకేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విజయవాడలో రెండువారాల కిందట సింగపూర్‌కు విదేశీయానం ప్రారంభమైంది. తొలి అంతర్జాతీయ సర్వీసుగా సింగపూర్‌కు ఇండిగో విమానం నడుస్తోంది. వారంలో మంగళ, గురు రెండురోజుల పాటు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. సింగపూర్‌ సర్వీసుకు రాష్ట్రప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ప్రాతిపదికన ఇండిగో సంస్థకు బ్రేక్‌ఈవెన్‌ ఇవ్వటానికి కూడా చొరవతీసుకుంది. ఫలితంగా మార్గం సుగమం అయింది.
 
ఉపయుక్తంగా వీసాకేంద్రం
aefnae.jpgసింగపూర్‌ నుంచి విజయవాడకు వచ్చేవారికి వీసాసమస్యలు ఉండవు. ఇక్కడి నుంచి వెళ్ళే నూతన ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీనివల్ల ఇక్కడినుంచి బయలుదేరే వారిసంఖ్య తక్కువుగా ఉంటోంది. దీనిని గమనంలోకి తీసుకున్న సింగపూర్‌ కాన్సులేట్‌ ఇక్కడ వీసాకేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల పరిసర ప్రాంత ప్రజలకు అనువుగా ఉంటోందని భావిస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ఖమ్మం, ప్రకాశం జిల్లాలనుంచి ఐదులక్షల మంది విదేశాలలో ఉంటున్నారు. తరచూ ఇక్కడికి రాకపోకలు ఉంటున్నాయి. ప్రతిఏడాది 30 వేలకు పైగా విద్యార్థులు విద్యనభ్యశించటానికి వెళుతున్నారు. ఉపాధికి వెళ్ళే వారిశాతం కూడా ఎక్కువుగా ఉంటోంది. హైదరాబాద్‌ నుంచి విదేశాలకు వెళ్ళే ప్రతి 100మంది ప్రయాణీకులలో సగటున 46మంది ఈ ప్రాంతం వాళ్ళే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. సింగపూర్‌ సర్వీసుకు ఆదరణ ఉండటం, రానున్న రోజుల్లో మరింత వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండటంతో సింగపూర్‌ కాన్సులేట్‌ నిర్ణయం తీసుకుంది.
 
రెండు వారాల ఫలితాలు విడుదల
సింగపూర్‌కు విమానసర్వీసు ప్రారంభించిన నేపథ్యంలో, రెండువారాల ఫలితాలు గురువారం వెల్లడించారు. ఫలితాలు చూస్తే సింగపూర్‌ సర్వీసుకు అనుకున్న దానికంటే అనూహ్య ఆదరణ లభించింది. ఈఫలితాల ప్రకారం.. రెండువారాల్లో సింగపూర్‌ నుంచి ద సగటున 170మంది వరకు ఇక్కడికి వస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు వెళ్ళే వారు సగటున 70 మంది ఉంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళటానికి ఇంత కంటే ఎక్కువ సంఖ్య ఉన్నప్పటికీ వీసాసమస్యల కారణంగానే వెళ్ళలేకపోతున్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, Yaswanth526 said:

Indigo Airlines is providing multiple connection across India & International through connecting flights from Vijayawada

India : Pune, Goa, Kochi, Madurai, Coimbatore, Jaipur, Bhubaneswar

International : Sharjah, Doha, Bangkok

https://pbs.twimg.com/media/DuTX7U4VYAELjaJ.jpg

Doha ki direct flight kaadu kadaa?

Link to comment
Share on other sites

విజయవాడలోనే సింగపూర్‌ వీసా!
14-12-2018 03:56:24
 
  • ప్రభుత్వం ప్రతిపాదనలకు కాన్సులేట్‌ సానుకూలత
విజయవాడ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కి వెళ్లే ప్రయాణీకులకు మరింత వెసులుబాటు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సింగపూర్‌ నుంచి సానుకూలత వ్యక్తమైంది. రాష్ట్రం నుంచి సింగపూర్‌కి రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీసాకోసం వీరు అటు బెంగళూరుకు కానీ, ఇటు హైదరాబాదుకు కానీ వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగానే వీసా కేంద్ర ఏర్పాటు చేస్తే విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణీకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావించింది. దీనితో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీ ఏడీసీఎల్‌), సింగపూర్‌ కాన్సులేట్‌తో చర్చలు మొదలు పెట్టింది. దీనిపై సింగపూర్‌ కాన్సులేట్‌ కూడా సానుకూలంగా స్పందించింది. ఇదే జరిగితే అంతర్జాతీయ రాకపోకలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

జనవరిలో టెండర్లు
అమరావతి సంస్కృతిని జోడిస్తూ ఆకృతులు
30 నెలల్లో స్టీల్‌, గ్లాస్‌ స్ట్రక్చర్‌తో నిర్మాణం
ప్రత్యేక ఆకర్షణగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం
ఈనాడు, అమరావతి

1CQW3LS.jpg

గన్నవరం విమానాశ్రయంలో రూ.611 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం టెండర్ల ప్రక్రియ జనవరిలో ఆరంభం కాబోతోంది. విమానాశ్రయంలో దీనికి సంబంధించిన స్థలం ఎంపిక పూర్తయింది. టెండర్లు ఖరారైన తర్వాత 30 నెలల్లో భవనాన్ని నిర్మించాలనేది లక్ష్యం. అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో టెర్మినల్‌ను నిర్మించేందుకు అవసరమైన నమూనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ ప్రమణాలకు.. అమరావతి సంస్కృతిని జోడిస్తూ అత్యాధునికంగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ఈనెల 4న ఉపరాష్ట్రపతి
వెంకయ్యనాయుడు, కేంద్ర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నూతన టెర్మినల్‌ భవనం అందుబాటులోనికి వస్తే.. గన్నవరం స్థాయి ఒకేసారి పది రెట్లు పెరగనుంది.

గన్నవరం విమానాశ్రయంలో రన్‌వే ఆఫ్రాన్‌ను ఆనుకుని 35వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి చేపట్టనున్నారు. ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా.. తట్టుకుని సుదీర్ఘకాలం నిలబడేలా స్టీలు, గ్లాస్‌ స్ట్రక్చర్‌తో నిర్మించనున్నారు. కీలక సమయంలో ఒకేసారి 1200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉంటుంది. 800మంది దేశీయ, 400మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా సౌకర్యాలను కల్పిస్తున్నారు. 24 చెక్‌ఇన్‌ కౌంటర్లు, డిపార్చర్‌, అరైవల్‌ బ్లాకుల్లో బ్యాగేజీ కన్వేయర్లు, 14ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్లు, 4 కస్టమ్స్‌ కౌంటర్లు, అంతర్జాతీయస్థాయి బ్యాగేజీ హ్యాండలింగ్‌ వ్యవస్థ, సెంట్రల్‌ ఏసీ, సీసీటీవీ సర్వయిలెన్స్‌ వంటి అధునాతన సౌకర్యాలు నూతన టెర్మినల్‌లో ఉంటాయి. ప్రయాణికుల కార్లు వెయ్యి, టాక్సీలు 200 నిలిపేంత సామర్థ్యంతో అధునాతన పార్కింగ్‌ సౌకర్యం ఇంటిగ్రేటెడ్‌ భవనానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఒకేసారి దేశీయ, అంతర్జాతీయ..
ఒకేసారి అంతర్జాతీయ, దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించే వీలుంటుంది. ఇంటిగ్రేటెడ్‌ భవనం అందుబాటులోనికి వస్తే.. ప్రస్తుతం వినియోగిస్తున్న అంతర్జాతీయ, దేశీయ టెర్మినల్‌ భవనాలను దేనికోసం వినియోగించాలనే విషయంపైనా దృష్టిపెట్టారు. కార్గోకు వినియోగించాలా.. లేక ప్రత్యేక ఎయిర్‌లైన్స్‌కు కేటాయించాలా.. అనేది నిర్ణయిస్తారు. టెర్మినల్‌ భవన ఆకృతులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. స్థానిక సంస్కృతి, కళారీతులు, సంప్రదాయాలను మేళవిస్తూ.. చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించేలా నమూనాలు రూపొందించారు. గన్నవరం విమానాశ్రయంలో రూ.160 కోట్లతో దేశీయ టెర్మినల్‌ భవనాన్ని రికార్డు స్థాయిలో 11 నెలల్లో నిర్మించారు. ఇదే స్ఫూర్తితో తాజాగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనాన్ని సైతం ఖచ్చితంగా అనుకున్న లక్ష్యంలోగా పూర్తిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
విమానం వేళలు మార్చాలని లోకేష్‌ను కోరిన సింగపూర్‌ కోర్‌ కమిటీ
27-12-2018 08:01:17
 
636814945197031693.jpg
విజయవాడ: సింగపూర్‌ ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేశ్‌ తెలుగుదేశం ఫోరం సింగపూర్‌ కోర్‌ కమిటీ సభ్యులు బుధవారం ఘనస్వాగతం పలికారు. సమావేశానికి హాజరైన ఆయనకు ఆంధ్రాకు చెందిన పలువురు సింగపూర్‌ విమానం వేళలు మార్పు చేయాలని కోరారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మంగళ, గురువారాల్లో ఇండిగో విమాన సర్వీసు సింగపూర్‌కు నడుస్తుందన్నారు. రెండు వారాల్లో సర్వీసు ఉండటం వలన ఒక పూట సెలవు పెట్టి రావాల్సి వస్తుందన్నారు.
 
వారంలో శుక్రవారం రాత్రి 10గంటలకు సింగపూర్‌లో విమానం బయలు దేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. శని, ఆదివారం సెలవులు కావున రెండు రోజులు ఆంధ్రాలో ఉండటంతో పాటు వచ్చి వెళ్లడానికి వీలుంటుందన్నారు. స్పందించిన లోకేష్‌ ఇండిగో విమాన సంస్థతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలుగుదేశం ఫోరం సింగపూర్‌ కోర్‌ కమిటీ సభ్యులు నల్లూరి శ్రీకాంత్‌, నంబూరి నాగ, ఎం. శ్రీకాంత్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

విజయవాడ నుండి అంతర్జాతీయ విమానాలు నడపడానికి కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కూర్చోడాని కుర్చీలు లేవు కుదరన్నారు.

మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం అంటే, మీరు చేస్తే మేము ఒప్పుకొం అని మొండికేశారు

అన్ని అధిగమించి ఇండిగో సింగపూర్ సర్వీస్ మొదలెడితే, నష్టం వస్తే వయబిలిటీ ఫండ్ ఇస్తామన్నాం.

అది అవరసరం లేకుండానే ఫుల్ కెపాసిటీతో నడుస్తోంది, డిమాండ్ తగ్గట్టు ఇంకోక సర్వీసు మొదలెట్టే ఆలోచన చేస్తున్నాము : సీఎం చంద్రబాబు

Link to comment
Share on other sites

న్‌వే.. సుగమం
30-12-2018 07:45:00
 
636817526968286845.jpg
  • భూ వివాద పరిష్కారానికి జిల్లా యంత్రాంగం జోక్యం
  • పక్షం రోజుల్లో లే అవుట్‌ ఆర్డర్‌ కాపీలు
  • 398 ప్లాట్లకు 230 ప్లాట్ల పూర్తి వివరాలు సేకరణ
  • రెండు నెలల్లో .. మౌలిక సదుపాయాలు
అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులకు అడ్డంకిగా మారిన ప్లాట్ల వివాదాన్ని పరిష్కరించటానికి రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది! రన్‌వే విస్తరణకు ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్న వెంచర్ల నిర్వాహకులు, అందులో ప్లాట్లను కొనుగోలు చేసిన వారికి అజ్జంపూడిలో సమీకరించిన భూముల్లో ప్లాట్‌ టు ప్లాట్‌లను ఇవ్వడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది.
 
విజయవాడ/గన్నవరం(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ విమానాశ్ర యంలో భారీ బోయింగ్‌ విమానాలు దిగటానికి విస్తరిస్తున్న రన్‌వేను త్వరగా ఫంక్షన్‌లోకి తీసు కురావాల్సి ఉన్న దశలో వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈ దశలో కృష్ణాజిల్లా యంత్రాంగం జోక్యం చేసుకోవటంతో సమస్యను పరిష్కరించటానికి చర్యలు చేపడుతోంది. గన్నవరం రెవెన్యూ యంత్రాంగం, సీఆర్‌డీఏ ప్లానింగ్‌ యంత్రాంగా న్ని సమన్వయం చేసుకుని లే అవుట్‌తో పాటు ప్లాట్లను వేయటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీ కాంతం ఆదేశించారు. ఈ క్రమంలో గన్నవరం రెవెన్యూ యంత్రాంగం ఎయిర్‌పోర్టు విస్తరణకు ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్న వెంచర్లలో ప్లాట్‌ ఐడెంటిఫికేషన్‌ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా ఆయా వెంచర్లలో మొత్తం 398 ప్లాట్లు ఉన్నాయని గుర్తించింది. వీటిలో 230 ప్లాట్లకు సంబంధించి మాత్రమే వాటి యజమా నుల చిరునామాలను గన్నవరం రెవెన్యూ యంత్రాంగం సేకరించిగలిగింది. మిగిలిన ప్లాట్ల కు ఓనర్లకు సంబంధించిన అసోసియేషన్‌ నుం చి రెవెన్యూ యంత్రాంగం చిరునామాలను సేక రిస్తోంది. గన్నవరం తహసీల్దార్‌ కె.గోపాలకృష్ణ తో కూడిన రెవెన్యూ బృందం, ప్లానింగ్‌ డైరెక్టర్‌ చెన్నకేశవరావులతో కూడిన సీఆర్‌డీఏ బృందం ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించటం జరిగింది. ప్రస్తుతం గుర్తించిన ప్లాట్ల చిరునామాలతో పా టు మిగిలిన చిరునామాలను కూడా అందించా ల్సిందిగా సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగం, రెవెన్యూ అధికారులను కోరింది.
 
పది రోజుల్లో పూర్తిగా స్వాధీనం
విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పో తున్న వెంచర ్ల నిర్వాహకులు, ప్లాట్ల కొనుగోలు దారుల కోసం అజ్జంపూడిలో రెవెన్యూ యం త్రాంగం 59 ఎకరాలను సమకూర్చింది. ఈ భూములలో ప్రస్తుతం రైతులు పంట వేశారు. ఈ భూములలో వరి కుప్పలు ఉన్నాయి. పది రోజులలోపు ఈ భూములలో ఉన్న కుప్పల నూర్పిడిని పూర్తి చేయించి ధాన్యాన్ని తరలిం చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధి కారులు నిర్ణయించారు. వెంటనే ఈ భూము లను చదును చేయించి సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగానికి అప్పగిస్తారు. ఐదు రోజల వ్యవధిలోనే సీఆర్‌డీఏ ప్లానింగ్‌ విభాగం లే అవుట్‌ వేసి ప్లాట్లను విభజిస్తుంది.
 
ప్రస్తుతం వెంచర్ల నిర్వాహకులు, అందులోని ప్లాట్ల ఓనర్లకు తమకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ప్లాట్లపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయటానికి వారికి ప్లాట్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌, దాని మ్యాప్‌ కాపీలను అందించాలని నిర్ణయించారు. సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలని నిర్ణయించారు. రెవెన్యూ యంత్రాంగం గుర్తించిన మేరకు సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్లు ఆయా వెంచర్లలో ఉన్నాయని తెలుస్తోంది. దీనిని బట్టి ఆమేరకు అజ్జంపూడిలో ఇవ్వబోయే ప్లాట్లలో కూడా ఇవే వసతులు కల్పించాల్సి ఉంటుంది.
 
రన్‌వే విస్తరణలో బాలారిష్టాలు
ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం 2286 మీటర్ల మేర రన్‌వే ఉంది. దీనిని అంతర్జాతీయ విమాన సర్వీసుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని 3360 మీటర్లకు విస్తరిస్తున్నారు. అదనంగా 1074 మీటర్ల మేర విస్తరిస్తున్నారు. దాదాపుగా 650 మీటర్ల మేర రన్‌వేను విస్తరించారు. ప్రస్తుత రన్‌వేను నూతనంగా అభివృద్ధి చేసిన రన్‌వేకు అనుసంధానించాల్సిన ప్రాంతం 400 మీటర్లు ఉంటుంది. గతంలో బుధ్దవరం మీదుగా వెళ్ళటానికి ఇటు రోడ్డు ఉండేది. రోడ్డుపై రాకపోకల కారణంగా కొంత జాప్యం జరిగింది. జాయింట్‌ దగ్గర చాలా జాగ్రత్తగా పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి నిర్దేశించిన గడువు జనవరి 20 లోపు పూర్తి చేయాలంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా రోడ్డును ఎగువున ఆర్‌అండ్‌బీ అభివృద్ధి చే స్తోంది. రోడ్డును ఏర్పాటు చేస్తున్నా.. ఏలూరు కాల్వపై బ్రిడ్జిని నిర్మించాల్సి ఉంది. ఇరిగేషన్‌ దగ్గర బ్రిడ్జి ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది.
 
పనులపై ప్రభావం
ప్రస్తుతం వెంచర్ల నిర్వాహకులు ఆందోళన చేస్తున్న అల్లాపురం ప్రాంతంలోనే ఎయిర్‌పోర్టు అధికారులు నావిగేషన్‌కు సంబంధించిన డీజీఓఆర్‌ పనులను చేపట్టారు. ఈ పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. ఇక్కడ ఆందోళన కారణంగా పనులపై ప్రభావం చూపిస్తోంది. విస్తరణ భూములలో ఇంకా ఇళ్ళు ఉన్నాయి. నిర్వాసితులకు పునరావాసంపై రెవెన్యూ దృష్టి సారించింది. ఈ లోపు ఇళ్ళు ఖాళీ చేయటానికి నిర్వాసితులకు అద్దె చెల్లించటం జరుగుతోంది. అయినా ఇంకా చాలా మంది అక్కడే ఉంటున్నారు. ఈ కారణాల వల్ల బౌండరీ వాల్‌ను పూర్తిగా ఏఏఐ నిర్మించలేకపోతోంది. రన్‌వే కమిషన్‌లోకి వస్తున్న దశలో ఇలాంటి కారణాలతో బౌండరీ వాల్‌ లేకపోతే మాత్రం భద్రతా కోణంలో కష్టంగా ఉంటుందన్న ఆందోళనలో విమానాశ్రయ వర్గాలున్నాయి.
 
సత్వర పరిష్కారం
4awejr.jpgవిమానాశ్రయ సమీకరణలో ఉన్న వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లను కొనుగోలుచేసిన వారికి పూర్తి న్యాయం చేయటానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సత్వరం ప్లాట్లను విభజించి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలను అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. రెండు నెలల్లో ప్లాట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయటానికి కృషి చేస్తాం.
- కే గోపాలకృష్ణ, తహసీల్దారు, గన్నవరం
Link to comment
Share on other sites

సింగపూర్‌ సర్వీస్‌ సక్సెస్‌
30-12-2018 03:42:37
 
636817381538587618.jpg
  • గ్యాప్‌ ఫండింగ్‌ లేకుండానే దిగ్విజయంగా విమాన సేవలు
  • సగటున పోక 100... రాక 170
  • ఖుషీ ఖుషీగా ఇండిగో
  • ఏడీసీఎల్‌కూ బూస్ట్‌
  • త్వరలో దుబాయ్‌కు విమానాలు!
విజయవాడ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సింగపూర్‌ అంటే... ఓ క్రేజ్‌! విద్య, వ్యాపారం, వైద్యం, పర్యాటకం... అనేక అంశాల్లో ఆకర్షిస్తున్న ఆ దేశానికి విజయవాడ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తోంది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ప్రాతిపదికన సింగపూర్‌కు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నా... ఇప్పటి వరకూ ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా భారం పడలేదు. ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజాదరణ ఉండడంతో అటు ఇండిగో సంస్థ కూడా ఖుషీఖుషీగా ఉంది. ఈ పరిణామాలు రాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఏడీసీఎల్‌)కు మంచి బూస్ట్‌ ఇచ్చాయి!
 
నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికమైన విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి పదకొండు నెలలు అయినా విదేశాలకు ఒక్క సర్వీసు కూడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చొరవ తీసుకుంది. అవసరమైతే ఎదురు పెట్టుబడి పెట్టి మరీ విదేశాలకు విమానాలు పంపించాలని కృతనిశ్చయానికి వచ్చింది. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందిన ఆసియా దేశాలలో సింగపూర్‌కు తొలి విమాన సర్వీసు నడపాలని నిర్ణయించింది. ఏపీ ఏడీసీఎల్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించే ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏడీసీఎల్‌ వెబ్‌పోర్టల్‌ ద్వారా సేకరించగా.. లక్షలాది మంది మద్దతు పలుకుతూ స్వాగతించారు. ఈ క్రమంలో మరో ఆలోచనకు తావు లేకుండా ఔత్సాహిక విమానయాన సంస్థల కోసం టెండర్లు పిలవగా... ఇండిగో సంస్థ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉండటంతో దానిని ఎంపిక చేశారు. వీజీఎఫ్‌ విధానంలో విమాన సర్వీసును నడిపేందుకు దానితో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం... సింగపూర్‌కు నడిపే విమానంలో మొత్తం 180 సీట్లు ఉంటాయి. ఇందులో సగం... అంటే 90 సీట్లు కూడా నిండకపోతే ఇండిగో సంస్థకు వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
 
ఒక్కో సీటుకు కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా 15 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన విమాన సర్వీసుకు ఆదరణ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.కోట్లలో భారం పడే అవకాశాలు ఉన్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు సర్వీసు ప్రారంభించిన వేళా విశేషమేంటోగానీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పరిస్థితి రాలేదు! ఇటు నుంచి వెళ్లే వారిలో సగటున 100 మంది, అటు నుంచి వచ్చే వారిలో సగటున 170 మంది ఉంటున్నారు. ఇటు నుంచి వెళ్లటానికి వీసా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్య పరిష్కారమైతే మరింత మంది వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గమనిస్తున్న ఇండిగో... భవిష్యత్తులో మరిన్ని సర్వీసుల పట్ల కూడా ఆసక్తి కనబరుస్తోంది. సింగపూర్‌ సర్వీసు దిగ్విజయం కావటంతో దుబాయ్‌కు విమానాలు నడిపే అంశంపై ఏడీసీఎల్‌ దృష్టి సారిస్తోంది. దుబాయ్‌కు విమాన సర్వీసు నడ పటానికి నిన్న మొన్నటి వరకూ స్లాట్‌ లేదు. ఇటీవల స్పైస్‌ జెట్‌ సంస్థ దేశం నుంచి సింగపూర్‌కు పలు విమానాలను ఉపసంహరించుకోవటంతో స్లాట్‌ల ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో విజయవాడ నుంచి దుబాయ్‌కు సర్వీసు నడపటానికి స్లాట్‌ అవకాశం లభిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో ఏడీసీఎల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

On 12/13/2018 at 2:32 PM, sonykongara said:

4430 ekkada chesthunnaru ఈ క్రమంలో 2286 మీటర్ల పొడవు ఉన్న రన్‌వేను, 3360 మీటర్ల మేర రూ.వంద కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. దీని వల్ల బోయింగ్‌ 747, 777 విమానాలు కూడా నడవటానికి అవకాశం ఉంటుంది.

http://environmentclearance.nic.in/auth/FORM_A_PDF.aspx?cat_id=IA/AP/MIS/58075/2016&pid=New

S. NO 3 choodandi . 

Present area: 531.65 acres, Additional Area Required: 698.00 acres ,Length of Runway 26 Existing : 2286 m , Proposed : Phase –I : 739 m , Phase –II : 785 m Phase –III : 620 m ha.

2286+739+785+620 = 4430 meters 

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

http://environmentclearance.nic.in/auth/FORM_A_PDF.aspx?cat_id=IA/AP/MIS/58075/2016&pid=New

S. NO 3 choodandi . 

Present area: 531.65 acres, Additional Area Required: 698.00 acres ,Length of Runway 26 Existing : 2286 m , Proposed : Phase –I : 739 m , Phase –II : 785 m Phase –III : 620 m ha.

2286+739+785+620 = 4430 meters 

2286+739+785+620 = 4430 meters  anedi chance ledu,inkoti kattukovatame

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...