Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
చలో సింగపూర్‌...
05-12-2018 02:35:38
 
636795741392059464.jpg
  • విజయవాడ నుంచి విదేశీయానం ప్రారంభం..
  • ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు శంకుస్థాపన
  • కేంద్రం-రాష్ట్రం కలిసి నడిస్తే సత్వర అభివృద్ధి
  • రాజకీయాలకతీతంగా ప్రభుత్వాలు పనిచేయాలి
  • గన్నవరానికి మరిన్ని అంతర్జాతీయ విమానాలు
  • భవిష్యత్‌లో ఎయిర్‌పోర్టు కళకళ: ఉపరాష్ట్రపతి
విజయవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకతీతంగా కలిసి పనిచేస్తే వేగవంతమైన అభివృద్ధిని చూడగలమని ఉపరాష్ట్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశం అభివృద్ధి చెందితే రాష్ర్టాలు కూడా అందులో భాగమవుతాయని చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో రూ.611 కోట్లతో నిర్మిస్తున్న నూతన ప్యాసింజర్‌ టె ర్మినల్‌ భవనానికి మంగళవారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. విజయవాడ నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గన్నవరం విమానాశ్రయం రానున్న రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సర్వీసులతో కళకళలాడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఇప్పటివరకూ విమానాశ్రయంలో ఉన్న సౌకర్యాలకు అదనంగా 35 వేల చదరపు మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను పర్యావరణహితంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు.
 
24 చెకిన్‌ కౌంటర్లు, 14 ఇమిగ్రేషన్‌ కౌంటర్లు, 3 కస్టమ్స్‌ కౌంటర్లు, 5 బ్యాగేజ్‌ చెకిన్‌కౌంటర్లు, ఇన్‌లైన్‌ బ్యాగేజ్‌ స్కీృనింగ్‌, సిస్టమ్‌, 1250 కార్లపార్కింగ్‌ సౌకర్యం, 8 బోర్డింగ్‌ గేట్స్‌, సోలార్‌ఎనర్జీ, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ సిస్టమ్‌, డబుల్‌ ఇన్సులేటెడ్‌ రూఫింగ్‌ సిస్టమ్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ సెన్సార్స్‌తో కూడిన రూఫింగ్‌ లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. సర్వీసుల ప్రారంభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవను ప్రశంసించారు. విమాన సర్వీసుల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం చొరవతో తాత్కాలికంగా వయబిలిటీ గ్యాప్‌ఫండ్‌ (వీజీఎఫ్‌) ఇవ్వడాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. అంతర్జాతీయ విమానయాన కేంద్రంగా మారే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. విమానయానం అంతర్జాతీయ రవాణా వ్యవస్థకు వెన్నెముక లాంటిదని చెప్పారు. ఆర్థిక, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ఇలాంటి సర్వీసులు వారధిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో అనుసంధానం, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని చెప్పారు.
 
రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణ: సురేశ్‌ప్రభు
ఆంధ్రప్రదేశ్‌ ఎంపీగా ఈ రోజు విమానయాన మంత్రిగా ఉన్నానని, రూ.611 కోట్ల వ్యయంతో అద్భుతమైన టెర్మినల్‌ బిల్డింగ్‌కు అనుమతులు ఇచ్చామని పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ ప్రభు చెప్పారు. ఇది పూర్తయితే రాష్ట్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి టీమిండియా స్ఫూర్తితో పనిచేస్తే వివిధ రంగాల్లో అభివృద్థికి సానుకూల వాతావరణం సృష్టించవచ్చన్నారు. వివిధ పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఎన్నికలతో ముగిసి పోవాలని.. అనంతరం పాలనపై, ప్రజల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా.. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు సింగపూర్‌ నుంచి 150 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం ఇక్కడకు వచ్చి.. 88 మందితో తిరిగి వెళ్లింది. సింగపూర్‌ సర్వీసును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి.. అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్‌పా్‌సలు అందజేశారు. ఇండిగో యాజమాన్యానికి, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
 

 

Link to comment
Share on other sites

అనుసంధానంతోనే అభివృద్ధి 
గన్నవరం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం 
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి 
ఈనాడు - విజయవాడ 
4ap-main2a.jpg

వాణాపరంగా అనుసంధానత పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఏకీకృత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనానికి భూమిపూజతో పాటు సింగపూర్‌ విమాన సర్వీసును ఆయన మంగళవారం పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో కలిసి ప్రారంభించారు. సింగపూర్‌ నుంచి బయలుదేరిన విమానం.. మధ్యాహ్నం మూడున్నరకు గన్నవరం చేరుకుంది. ఇక్కడినుంచి ప్రారంభమైన సర్వీసులో 87 మంది సింగపూర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన సభలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల్లో విజయవాడకు స్థానం దక్కడం ఆనందదాయకమని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాలలో  రూ.611 కోట్లతో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం దేశంలోనే ప్రథమమని వివరించారు. కూచిపూడి, కృష్ణా తీరం గొప్పదనం, స్థానిక సౌరభాలు వెదజల్లేలా టెర్మినల్‌ నిర్మించనున్నారని వివరించారు. అనుమతులు సత్వరం వచ్చేలా తాను సంబంధిత కేంద్ర మంత్రులతో, అధికారులతో మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. కేంద్రం కృషితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపడంతోనే అంతర్జాతీయ కల సాకారమైందని అన్నారు. విమానయాన సంస్థలు ముందుకు వచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వయబులిటీ గ్యాప్‌ఫండ్‌ సమకూర్చారని వివరించారు. అన్నీ ప్రభుత్వాలు చేయబోవని, ప్రైవేటురంగం కూడా ముందుకు వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కావడం ఆరంభమేనని, భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు వస్తాయని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి విజయవాడ, విశాఖ విమానాశ్రయాలలో అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయని, రాజమహేంద్రవరం, కడప కూడా వీటి సరసన చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్గో ద్వారా అమరావతి ప్రాంతం నుంచి మామిడి, మిర్చి, వేరుసెనగ వంటి ఉత్పత్తులు విదేశాలకు పంపించే వీలు కలుగుతుందని అన్నారు.

4ap-main2b.jpg

కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై దృష్టి పెట్టామని, ఇందుకుగాను 65 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు చెప్పారు. నవ్యాంధ్రకు కేంద్రం సహకరిస్తోందని, సింగపూర్‌ సర్వీసు ప్రారంభం ద్వారా రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభమైందని వివరించారు. త్వరలో కేంద్రం ఎయిర్‌కార్గో విధానానికి శ్రీకారం చుడుతుందని, ఇది అమల్లోకి వస్తే రైతులు తమ ఉత్పత్తులను పొలాలనుంచే విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కలుగుతుందని వివరించారు. విమానాశ్రయం ఈ దశకు రావడానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి కృషి ఎంతో ఉందని అన్నారు. సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసును తమ సంస్థ ద్వారా ప్రారంభించడం ఆనందంగా ఉందని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ అన్నారు. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా, మంత్రులు యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, అధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

అటెన్షన్‌ ప్లీజ్‌!
04-12-2018 10:12:19
 
636795151394332172.jpg
 
  • గన్నవరం - సింగపూర్‌ విమాన యానానికి చెక్‌లిస్ట్‌!
  • టెన్షన్‌ లేని ప్రయాణం ఇలా!
  • టిక్కెట్‌ చూపించి లోపలికి..
  • బ్యాగేజీ చెకిన్‌, ట్యాగింగ్‌ చేయించండి
  • ఇమిగ్రేషన్‌ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
  • స్టాంపింగ్‌ వేయించుకుని కస్టమ్స్‌కు వెళ్లండి
  • తిరుగు ప్రయాణంలోనూ ఇదే ప్రక్రియ
  • విదేశీయానం అంతా ఇలాగే ఉంటుంది
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సింగపూర్‌కు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. విదేశాలకు వెళ్లే సాధారణ ప్రయాణికులతో పాటు తొలిసారిగా సింగపూర్‌ వె ళ్లాలనుకునే వారు కూడా మంగళవారం విజయవాడ అంతర్జాతీయ టెర్మినల్‌ నుంచి ప్రయాణం చేయనున్నారు. టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి ప్రవేశించటం నూతన ప్రయాణికులకు ఒకింత ఉద్విఘ్నతకు గురిచేస్తుంది. దీనితోపాటు కొత్తదనం వల్ల ఒకింత గందరగోళంగానూ ఉంటుంది. అంతర్జాతీయ టెర్మినల్‌ కావటం, అందునా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉండటం వల్ల భద్రత రీత్యా కట్టుదిట్టంగా ఉంటుంది. టెర్మినల్‌లో కూడా కోలాహలంగా ఉంటుంది. సింగపూర్‌ వెళ్ళేవారే కాదు..! కొత్తగా విదేశీయానం చేసే ప్రతి ప్రయాణికుడు టెర్మినల్‌లో పాదం మోపడం దగ్గర నుంచి ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా క్రమపద్ధతిలో జరిగే ప్రక్రియ గురించి తెలియజెప్పే ప్రత్యేక కథనం..
 
కంగారు పడొద్దు
efedfef.jpgటెర్మినల్‌ లోపలకు వెళ్ళగానే.. ప్రయాణికులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎడమవైపు బ్యాగేజీ చెకింగ్‌ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ముందు మీ బ్యాగేజీని నిలిపి ఉంచితే అది లోపలికి తీసుకుని తనిఖీ చేసి రె ండోవైపుకు తీసుకు వస్తుంది. ఇది పూర్తయిన తర్వాత బ్యాగేజీని తీసుకుని ఎదురుగా కనిపించే బ్యాగేజీ చెకిన్‌ కౌంటర్లకు వెళ్ళాలి. అక్కడ బ్యాగేజీకి ట్యాగింగ్‌ చేస్తారు. ట్యాగింగ్‌ చేసిన తర్వాత కన్వేయర్‌ బెల్ట్‌పై వేసి లోపలికి పంపిస్తారు.
 
ఇమిగ్రేషన్‌ కౌంటర్‌కు వెళ్లాలి
4aw3rwr.jpgచెకిన్‌ కౌంటర్లలో మీ బ్యాగేజీని తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్‌ కౌంటర్‌ దగ్గరకు వెళ్లాలి. అక్కడ పాస్‌పోర్టు, వీసా, టిక్కెట్‌ చూపించాలి. వీసాను పరిశీలించిన మీదట సింగపూర్‌ ఎందుకు వెళుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారు అడిగే ప్రశ్నలను సావధానంగా విని, సమాధానాలు చెప్పాలి. ఆధార్‌ కార్డులను అడిగితే చూపించాలి. మీ గురించి అడిగితే చెప్పాలి. మీరు పనిచేసే ప్రదేశం గురించి అడిగినా.. విదేశాల్లో ఎవరిని కలుసుకుంటారని అడిగినా చెప్పాలి. ముఖాముఖి పూర్తి కాగానే ఇమిగ్రేషన్‌ అధికారులు స్టాంపింగ్‌ చేస్తారు.
 
కస్టమ్స్‌ కౌంటర్‌లో..
4wrwdwd.jpgఇమిగ్రేషన్‌ పూర్తి కాగానే, కస్టమ్స్‌ కౌంటర్‌ ఎదురవుతుంది. విమానాల్లో ఇక్కడి నుంచి బయలు దేరేటపుడు ముందుగానే బ్యాగేజీ తనిఖీ పూర్తవుతుంది కాబట్టి వెళ్లేటపుడు పెద్దగా కస్టమ్స్‌ అధికారులు ప్రతి ప్రయాణికుడి బ్యాగేజీని తనిఖీ చేయరు. ఎవరిమీదనైనా అనుమానం వస్తే చేతిలో ఉన్న హ్యాండ్‌ బ్యాగ్స్‌ వంటివి తెరచి చూపించమంటారు.
 
లోపల బ్యాగేజీ రెడీ
కస్టమ్స్‌ కౌంటర్‌ దాటుకుని వెళ్లిన తర్వాత ప్రయాణికుల లాంజ్‌కు చేరుకునే లోపు బ్యాగేజీ, పర్సనల్‌ చెకింగ్‌ ఉంటుంది. ఇక్కడ ఉన్న బ్యాగేజీ చెకిన్‌ యంత్రంలో బ్యాగేజీని స్కాన్‌ చేస్తారు. వాలెట్‌, హ్యాండ్‌ బ్యాగ్‌లలో ఉన్న వస్తువులను కూడా పరిశీలిస్తారు.
 
ప్రయాణికుల లాంజ్‌లోకి..
awewefef.jpgఫైనల్‌ బ్యాగేజీ చెకిన్‌ అయ్యాక ప్రయాణికుల లాంజ్‌లోకి వెళ్లి కూర్చోవచ్చు. మీ దగ్గర ఉన్న బ్యాగేజీని సిబ్బంది ట్రక్కుల్లో విమానాల దగ్గరకు తీసుకు వెళతారు. లాంజ్‌లో ప్రార్థనలు చేసుకోవటానికి, స్మోకింగ్‌ చేసుకోవాటానికి, పిల్లలకు పాలు పట్టడానికి ప్రత్యేక చాంబర్లు ఉంటాయి. రిఫ్రెష్‌ కావటానికి టాయ్‌లెట్స్‌ ఉంటాయి. విమానం బయలు దేరే సమయానికి పావు గంట ముందుగా బస్సు సిద్ధంగా ఉంటుంది. బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని రన్‌వే వెంబడి పార్కింగ్‌ ఏరియాకు తీసుకు వెళతారు.
 
తిరుగు ప్రయాణంలోనూ ఇదే ప్రక్రియ
ernawefwef.jpgవిదేశీయానం ముగించుకుని తిరిగి వచ్చేటపుడు కూడా ఇదే ప్రక్రియ ఉంటుంది. విమానం నుంచి దిగిన తర్వాత బస్సులో ఈ సారి అరైవల్‌ బ్లాక్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న కన్వేయర్‌ బెల్ట్‌ మీదకు మీ బ్యాగేజీ వస్తుంది. బ్యాగేజీని తీసుకున్న తర్వాత ఇమిగ్రేషన్‌ కౌంటర్‌కు వచ్చి విమానాశ్రయంలో దిగినట్టు స్టాంపింగ్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత కస్టమ్స్‌ కౌంటర్‌కు రావాలి. కస్టమ్స్‌ విభాగం బ్యాగేజీని నిశితంగా పరిశీలిస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకు వస్తున్నారన్నదానిపై కస్టమ్స్‌ దృష్టి సారిస్తుంది. బ్యాగేజీ చె కింగ్‌ తప్పనిసరిగా ఉంటుంది. అనుమానం లేకపోతే గ్రీన్‌ చానల్‌ నుంచి బయటకు పంపిస్తారు. అనుమానం ఉంటే మాత్రం రెడ్‌ చానల్‌కు తీసుకు వెళ్లి, బ్యాగేజీని తెరిచి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ ముగియగానే బయటకు వచ్చేయవచ్చు.
 
డిపార్చర్‌ బ్లాక్‌ లోకి ప్రవేశం
aetawere.jpgప్రయాణికులు అర్ధ గంట ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. సొంత కారులో వస్తే కారును పార్కింగ్‌ ఏరియాలో నిలుపుకోవాలి. టెర్మినల్‌ బయట ట్రాలీ బ్యాగ్‌లుంటాయి. లగేజీ ఉంటే ట్రాలీల్లో సర్దుకుని డిపార్చర్‌ బ్లాక్‌ ప్రవేశమార్గానికి చేరుకోవాలి. ఇక్కడ మూడంచెల భద్రత ఉంటుంది. విమానాశ్రయ సాధారణ సెక్యూరిటీతో పాటు పోలీసు బందోబస్తు, ఎస్పీఎఫ్‌ బలగాలు ఉంటాయి. ప్రవేశమార్గానికి చేరుకున్న తర్వాత మీ టిక్కెట్‌ను పరిశీలనకు ఇవ్వాలి. టిక్కెట్‌ను పరిశీలించిన తర్వాత, ప్రయాణికులను మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత లోపలికి అనుమతిస్తారు.
Link to comment
Share on other sites

తూర్పు ఆసియాకు దీపిక అంతర్జాతీయ వేడుక
ఈనాడు - విజయవాడ, న్యూస్‌టుడే - గన్నవరం
amr-gen1a.jpg
ఉమ్మడి రాష్ట్రానికి విజయవాడ రెండో రాజధానిగా ఉండేదని, సాంస్కృతిక, కళలు, పత్రికలకు కేంద్రంగా విలసిల్లిందని.. నేడు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించనుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో రూ. 611 కోట్లతో నూతన ఏకీకృత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనానికి భూమి పూజ చేశారు. సభావేదికపైనే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రన్‌వే పైకి వెళ్లి విజయవాడ - సింగపూర్‌ విమానానికి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణికులతో మాట్లాడారు. అంతకు ముందు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రవాణా విషయంలో విజయవాడ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్‌.. దేశంలోనే రెండో పెద్ద జంక్షన్‌, బస్టాండు.. ఆసియాలోనే పెద్దదన్నారు. ఈ తరహాలోనే విమానశ్రయం కూడా పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల్లో అత్యధికులు ఈ ప్రాంతం నుంచి వెళ్లిన వారే అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభుకు చెప్పారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించాలని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థను కోరారు.
* కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయంలో సరికొత్త హంగులతో కొత్త టెర్మినల్‌ను నిర్మిస్తామన్నారు. దేశంలో డిజియాత్ర అనే సరికొత్త కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు.
* ఆర్థిక శాఖ మంత్రి యనముల రామకృష్ణుడు మాట్లాడుతూ..  విజయవాడ నగరం పేరు చరిత్రలోకి ఎక్కిందన్నారు. రోడ్డు, రైలు, వాయు, జల రవాణా అనుసంధానంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోందన్నారు. ఈ విషయాలలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే శీఘ్రగతిన అభివృద్ధి చెందుతామన్నారు. ఈ అంశాలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి ఎనలేనిదన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల విషయంలో కేంద్రం త్వరగా స్పందించాలని కోరారు.
భవిష్యత్తులో మంగళగిరిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు.
* అంతర్జాతీయ సర్వీసు ప్రారంభానికి చిహ్నంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌.. విమానం నమూనాలను వెంకయ్యనాయుడుతో పాటు వేదికపై ఉన్న అతిథులకు అందించారు. అనంతరం వేదిక వద్ద ఇండిగో సిబ్బందితో కలసి కేక్‌ కోశారు. ఈ సందర్భంగా విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, జయంత్‌ సిన్హాలకూ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సన్మానించారు. రైతుల ఉదారతను వెంకయ్యనాయుడు ప్రస్తుతించారు. మీ చేసిన పని వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, విమానాశ్రయ సంచాలకుడు మధుసూదన్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.
 

 

Link to comment
Share on other sites

With First Flight To Singapore, Vijayawada Enters Global Aviation Map

The Vijaywada-Singapore Inaugural flight was flagged off by Vice President Venkaiah Naidu.

Andhra Pradesh | Press Trust of India | Updated: December 04, 2018 21:56 IST
 Share
EMAIL
PRINT
0COMMENTS
 
With First Flight To Singapore, Vijayawada Enters Global Aviation Map

Vice President Venkaiah Naidu at the launch of the Vijayawada-Singapore direct flight.

 
Vijaywada: 

Vijayawada entered the international aviation map Tuesday after its maiden Indigo flight took off for Singapore from the airport at Gannavaram. The inaugural flight was flagged off by Vice President in the presence of Union Civil Aviation Minister Suresh Prabhakar Prabhu, Minister of State for Civil Aviation Jayant Sinha.

"This is only a beginning and Vijayawada will have more international flights in the near future, Mr Naidu said on the occasion.

The new air connectivity between Andhra Pradesh and Singapore is expected to expand India's reach in south-east Asia. Andhra Pradesh is expected to become an aviation gateway between the two prospering regions. It would also boost tourism, he added.

He asked state government to partner with the Centre in a true 'Team India spirit' for building a prosperous and inclusive 'New India'

The Andhra Pradesh government set aside a sum of Rs. 18.35 crore as viability gap fund for six months to operate the 180-seater Vijayawada-Singapore non-stop flight.

The Indigo flight from Singapore landed at Vijayawada airport at 4.15 pm, carrying about 150 passengers. The Vijayawada-Singapore flight had over 80 passengers flying to the City-State from Andhra Pradesh's capital region Amaravati.

The Vijayawada-Singapore return flights will be operated on Tuesday and Thursday every week.

The 35,000 sq m, Rs. 611 crore building will have a peak passenger handling capacity of 1200 with 24 check-in counters.

Link to comment
Share on other sites

తొలి విమానం నడిపింది తెలుగువారే
amr-gen4a.jpg
విమానాశ్రయం (గన్నవరం), న్యూస్‌టుడే : సింగపూర్‌ నుంచి గన్నవరం వచ్చిన తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును నడిపిన పైలెట్‌ తెలుగు యువకుడు కావటం విశేషం. హైదరాబాద్‌కు చెందిన షఫీ అలీఖాన్‌.. 6ఈ34 విమాన సర్వీసును మంగళవారం సింగపూర్‌ నుంచి గన్నవరం తీసుకువచ్చారు. తొలి విమానం నడపటం ఆనందంగా ఉందని, ప్రయాణికుల ముఖాల్లో వెలుగులు చూసి నా ఆనందం రెట్టింపయ్యిందని ‘ఈనాడు-ఈటీవీ’తో అన్నారు. అలాగే.. గన్నవరం నుంచి సింగపూర్‌ బయలుదేరే 6ఈ33 విమానాన్ని విజయవాడకు చెందిన చండ్ర రాజేష్‌ నడిపారు. ఇండిగో సంస్థలో పని చేస్తున్న ఈయన.. సొంత ప్రాంతం నుంచి విదేశాలకు విమాన సర్వీసును నడిపే అవకాశం రావటం సంతోషంగా ఉందని చెప్పారు. నేను విజయవాడలోనే చదువుకున్నానని చెప్పారు. తొలుత చిన్న చిన్న విమానాలు నడిపేవాడినని, గన్నవారం విమానాశ్రయం బాగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. పైలెట్‌ విజయవాడ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మనువడు కావటం చర్చనీయాంశం.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...