Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొత్త కళ
03-12-2018 21:15:41
 
636794686787201481.jpg
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ విమానం సింగపూర్ వెళ్లనుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీకాంతం, విజయవాడ కమిషనర్ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదన్ రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
నవ్యాంధ్రకే.. గగనాభరణం!
04-12-2018 02:41:14
 
636794880748378554.jpg
  • శాశ్వత ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు నేడు భూమిపూజ
  • 611 కోట్లతో.. స్టీల్‌, గ్లాస్‌తో నిర్మాణం
  • ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా శంకుస్థాపన
విజయవాడ, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌ సిగలో మరో అద్భుత కట్టడం చేరనుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాశ్వత ప్రా తిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా శ్రీకారం చుట్టింది. రూ. 611 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ సరికొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు మంగళవారం భూమిపూజ జరగనుంది. రాష్ర్టానికే గగనాభరణంగా నిలిచేలా నిర్మించనున్న ఈ టెర్మినల్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రులు సురేశ్‌ ప్రభు, జయంత్‌ సిన్హా భూమిపూజ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఏడాది క్రితం సీఎం చంద్రబాబు అప్పటి కేం ద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సాక్షిగా ఎయిర్‌పోర్టు అథారిటీకి, సివిల్‌ ఏవియేషన్‌కు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ అవసరాన్ని వివరించారు.
 
దాంతో ఎయిర్‌పోర్టు అథారిటీ, సివిల్‌ ఏవియేషన్‌ కలిసి అంచనాల రూపకల్పనకు ఆదేశాలిచ్చాయి. ఎయిర్‌పోర్టు ఉ న్నతాధికారులు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రూ.600 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. దీనిపై కేంద్రస్థాయిలో వేగంగా ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు సంబంధించి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీగా ‘స్టుప్‌’ సంస్థను నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టిన స్టుప్‌ అంచనాలతో పాటు, డిజైన్లను కూడా రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడంతోపాటు పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతను కూడా ఇదే సంస్థ చేపడుతుంది. ప్రస్తుతం కేంద్రస్థాయిలో పబ్లిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బోర్డు(పీఐబీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈలోగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు భూమిపూజ నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సీఎం సూచించిన మార్పుల సవరణ అనంతరం రాష్ట్రప్రభుత్వం అనుమతి తీసుకున్న వెంటనే డిజైన్‌ను ఫైనల్‌ చేశారు.
 
అమరావతి, కృష్ణా మేళవింపుతో డిజైన్లు: నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ డిజైన్లు అదరగొడుతున్నాయి. అమరావతికి చిహ్నంగా బౌద్ధ స్థూపం, అమరావతిలో ఇంగ్లిష్‌ అక్షరం ‘ఏ’ కనిపించేలా టెర్మినల్‌ ముందు భాగం కనిపిస్తుంది. దీనికి రెండువైపులా కూచిపూడి నర్తకి రెండుచేతులు చాపి నృత్యం చేస్తున్న ఆకృతులను సమ్మిళితం చేశారు. రాష్ట్ర పుష్పం మల్లెపు వ్వు, బుట్టలంగా వేసుకున్న కొండపల్లి బొమ్మను డిజైన్‌లో పొందుపరిచారు. మెలికలు తిరిగే కృష్ణానది పాయలు రూఫ్‌టా్‌పలో కనిపించేలా డిజైన్‌ చేశారు.
 
ఇదీ.. బిల్డింగ్‌ స్వరూపం
అమరావతి రాజధానిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను స్టీల్‌, గ్లాస్‌ స్ట్రక్చర్‌ విధానంలో నిర్మిస్తున్నారు. ఈ టెర్మినల్‌లో ఆధునిక బ్యాగేజి హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌, ఎరైవల్‌ బ్యాగేజీ క్లెయిమ్‌ క్లారోసుల్స్‌, సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, పబ్లిక్‌ అడ్రస్‌, ఫైర్‌ అలారం, విమాన సర్వీసుల సమాచార డిస్‌ప్లే, చెక్‌ఇన్‌ కౌంటర్‌, కారు పార్కింగ్‌ వంటి వసతులు కల్పిస్తున్నారు.
Link to comment
Share on other sites

అంతర్జాతీయ కల సాకారం
నేడు గాలిలోకి లేవనున్న తొలి సర్వీసు
ఈనాడు అమరావతి
amr-brk1a.jpg
న్నవరం విమానాశ్రయానికి పూర్తిస్థాయిలో అంతర్జాతీయస్థాయి నేటి నుంచి రానుంది. 2017 మే నెలలో గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పిస్తున్నట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఆరు నెలల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం నుంచి బయలుదేరతాయన్నారు. కానీ.. అప్పటినుంచి అనేక ఒడుదుడుకులను ఎదుర్కొని.. ఏడాదిన్నర తర్వాత ఈరోజు కల సాకారం కాబోతోంది. ఏడాది కిందటే అంతర్జాతీయ సేవలు అందించేందుకు అవసరమైనమౌలికసౌకర్యాలు విమానాశ్రయంలో సిద్ధమైనా.. ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలకు సంబంధించిన అనుమతులు, విమానయాన సంస్థలు ముందుకు రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చివరికి.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో.. ఇండిగో విమానయాన సంస్థ ముందుకొచ్చింది. లాభనష్టాల అంతరం(వీజీఎఫ్‌) మేరకు.. నిధులను ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించడంతో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియోతో సంబంధం లేకుండా సర్వీసులను నడిపేలా ఇండిగో సంస్థతో ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ సర్వీసుల కల మంగళవారం నుంచి సాకారం కాబోతోంది.

పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి...

 
Link to comment
Share on other sites

విదేశీ విమానం నేటి నుంచే 
ఆరంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 
రూ.611 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు భూమిపూజ 
విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలకు పక్కాగా ఏర్పాట్లు 
ఈనాడు - అమరావతి 
3ap-main12a.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. మంగళవారం సాయంత్రం 6.40కు ఇక్కడి నుంచి బయలుదేరే తొలి విమానం రాత్రి 10.40కు సింగపూర్‌ చేరుతుంది. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పౌరవిమానయానశాఖ మంత్రి సురేష్‌ ప్రభు మొదటి సర్వీసును ప్రారంభించనున్నారు. విమానాశ్రయంలో రూ.611 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో సంస్థ అంతర్జాతీయ సర్వీసులను గన్నవరం నుంచి నడుపుతోంది. ప్రస్తుతం మంగళ, గురువారాల్లో రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసులు నడుస్తాయి. రద్దీని బట్టి వీటిని పెంచనున్నారు. 180 సీటింగ్‌ ఉన్న ఏ320 ఎయిర్‌బస్‌లను సింగపూర్‌కు ఇండిగో నడుపుతోంది. టిక్కెట్‌ ధర రూ.7,500 నుంచి రూ.10,422గా నిర్ణయించారు. సింగపూర్‌ నుంచి కూడా మంగళ, గురువారాల్లోనే విజయవాడకు సర్వీసులు నడుస్తాయి. సింగపూర్‌లో ఉదయం 11.40కు బయలుదేరే విమానం మధ్యాహ్నం 3.45కు గన్నవరం చేరుతుంది. గన్నవరం నుంచి నేడు బయలుదేరి వెళ్లనున్న తొలి సర్వీసుకు 99, సింగపూర్‌ నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసుకు 150 టిక్కెట్లు బుక్కయ్యాయి. అంతర్జాతీయ సేవలు అందించేందుకు అనువుగా గన్నవరం విమానాశ్రయంలో పాత టెర్మినల్‌ భవనాన్ని ఆధునికీకరించారు. ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలు ఏర్పాటయ్యాయి. సాధారణ ప్రయాణికులు వేచి ఉండేందుకు విశాలమైన లాంజ్‌లు, ప్రముఖుల కోసం విశ్రాంతి మందిరాలను సిద్ధం చేశారు. రాష్ట్ర పోలీసులే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

3ap-main12b.jpg
Link to comment
Share on other sites

Vice-President to perform Bhumi Puja at airport today

THE HANS INDIA |   Dec 04,2018 , 02:14 AM IST
   

 
 
Krishna District Collector B Lakshmikantham, Vijayawada Airport Director G Madusudhana Rao and Nuzvid Sub-Collector S Dinakaran inspecting the arrangements for the Bhumi Puja at the airport on Monday
Krishna District Collector B Lakshmikantham, Vijayawada Airport Director G Madusudhana Rao and Nuzvid Sub-Collector S Dinakaran inspecting the arrangements for the Bhumi Puja at the airport on Monday
 
 
Vijayawada: Vice-President M Venkaiah Naidu will perform Bhumi Puja at the Vijayawada International Airport here on Tuesday evening at 5 pm for the construction of new integrated terminal building at a cost of Rs 611 crore. 
 
Later, the Vice-President will meet the Vijayawada-Singapore flight passengers to mark the inauguration of services. The new terminal will be built in 35,000 square metres with 24 check-in counters. The Airports Authority of India will construct the new building with rural and urban blend of Vijayawada culture with interior and exterior designs. 
 
 
 
The new terminal can handle passenger capacity of 3.33 million passengers per year with peak hour handling capacity of 1200. The new terminal will have custom counters, immigration counter, baggage claim carousels, baggage conveyors, taxi stand, vehicle parking facility and many more, said G Madusudana Rao, Director of the Vijayawada Airport.
 
 
 
He said the temporary terminal built at the airport was inaugurated in May 2017 and now ground-breaking ceremony would be held for the construction of new terminal building.
 
Link to comment
Share on other sites

శాశ్వత టెర్మినల్‌కు.. నేడే శ్రీకారం
04-12-2018 09:55:01
 
636795141022486138.jpg
  • రూ.611 కోట్ల వ్యయంతో నిర్మాణం.. నేడు భూమిపూజ
  • ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌లో జీఆర్‌ఐహెచ్‌ఏ 4 స్టార్‌ సదుపాయాలు
  • మూడు ఏరో బ్రిడ్జిలు.. ఆప్రాన్‌ నిర్మాణం
  • నేడే సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభం
నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధానికి ధీటైన.. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు కాబోతున్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టును ప్రపంచ స్థాయి ఎయిర్‌పోర్టుల సరసన చేర్చే బృహత్తరమైన టెర్మినల్‌ నిర్మాణానికి మంగళవారం శ్రీకారం జరగబోతోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు కీలకదశలో ఉండగా.. ఈ నిర్మాణం రాజధాని ప్రతిష్టను ప్రపంచ స్థాయికి ఇనుమడింప చేయనుంది. దీంతో పాటు విజయవాడ నుంచి సింగపూర్‌ తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ఉప రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
 
విజయవాడ/గన్నవరం(ఆంధ్రజ్యోతి): విజయవాడ విమానా శ్రయంలో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయనున్నారు. జీఆర్‌ఐహెచ్‌ఏ 4 స్టార్‌ సదుపాయాలతో ఈ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. టెర్మినల్‌ను మొత్తం 35 లక్షల చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. రూ.611 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్నారు. గంటకు 1200 మంది ప్రయాణీకుల రాకపోకల సావర్థ్యంతో రూపొందించనున్నారు. ఇందులో దేశీయంగా గంటకు 800 మంది ప్రయాణికులు, అంతర్జాతీయంగా గంటకు 400 మంది ప్రయాణికులు వేర్వేరుగా రాకపోకలు సాగించే సామఽర్ధ్యాన్ని కలిగి ఉండేలా డిజైన్‌ చేశారు. ఆధునిక టెర్మినల్‌లో మొత్తం 24 చెకిన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. డిపార్చర్‌ ఏరియాలో ఒక బ్యాగేజీ కన్వేయర్‌ ఉంటుంది. నూతన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను స్టీల్‌, గ్లాస్‌ల మేళవింపుతో నిర్మిస్తున్నారు. డబుల్‌ ఇన్సులేటెడ్‌ పైకప్పుతో పాటు, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎయిర్‌ కండిషనింగ్‌, ఎల్‌ఈడీ లైట్లు, లో వీఓసీ పెయింట్‌, తక్కువ హీట్‌ గెయిన్‌ గ్లేజింగ్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
 
అనుసంధానంగా ఏరో బ్రిడ్జిలు
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌కు మూడు ఏరోబ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏరోబ్రిడ్జిలు నేరుగా విమాన పార్కింగ్‌ బేలకు అనుసంధానమై ఉంటాయి. మూడు ఏరోబ్రిడ్జిలకు రెండేసి చొప్పున మినీ ఏరోబ్రిడ్జిలను అనుసంధానం చేస్తారు. బిల్డింగ్‌కు అను సంధానంగా నూతన ఆఫ్రాన్‌ను నిర్మించనున్నారు. ఆఫ్రాన్‌లో పార్కింగ్‌ బేల సదుపాయం ఉంటుంది. మూడు కోడ్‌ ఈ విమానాలకు, ఆరు కోడ్‌ సీ విమానాలకు పార్కింగ్‌ కల్పించనున్నారు.
 
మిలియన్‌ దాటుతోంది..
విజయవాడ ఎయిర్‌పోర్టు అనూహ్య వృద్ధి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను ఏడాది కిందట నిర్మించారు. దీనిని ఒక పదిహేను సంవత్సరాల అవసరాలను తీర్చుకోవచ్చని భావించి నిర్మించారు. ప్రస్తుత టెర్మినల్‌ బిల్డింగ్‌ కిక్కిరిసిపోతోంది. ఈ క్రమంలో కిందటి ఆర్థిక సంవత్సరం మే 3 వ తేదీన విజయవాడ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించటం జరిగింది. దీంతో విమానాశ్రయ అధికారులు దీనికి తగిన విధంగా రన్‌వే విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత రన్‌వే 2286 మీటర్ల నుంచి 3360 మీటర్లకు పొడిగించటానికి రూ.98.59 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఎయిర్‌బస్‌ విమానాలు మాత్రమే నడవటానికి అవకాశం ఉన్న పరిస్థితులలో.. ఇక మీదట బోయింగ్‌ 747, బోయింగ్‌ 777 విమానాలను కూడా నడపటానికి అవకాశం కలుగుతుంది.
 
సింగపూర్‌ సర్వీసు నేటి నుంచే.. 
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసు బెజవాడ నుంచి సాయంత్రం బయలుదేరబోతోంది! విజయవాడ నుంచి మొట్టమొదటి సర్వీసు నడుపుతున్న విమానయాన సంస్థగా దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో నిలుస్తోంది. విజయవాడ విమానాశ్రయం గత మూడు సంవత్సరాలుగా చూస్తే 250 శాతం వృద్ధి చెందినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‌పోర్టులన్నీ కూడా దేశంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఏడాదిలో నెలకు లక్ష మంది చొప్పున ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు.
 
ఈ ఏడాది ఎయిర్‌పోర్టు నుంచి పది లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మార్కును చేరుకునే పరిస్థితి ఉంది. అమరావతిలో 20 లక్షల మంది జనాభాను చేరుకునేలా వృద్ధి చెందుతోంది. రానున్న 2020 నాటికి విజయవాడ అమరావతిలలో మూడు మిలియన్లు జనాభా పెరిగే అవకాశం ఉందన్నది అంచనాగా ఉంది. రాజధాని నుంచి ప్రతిరోజూ ఎన్‌ఆర్‌ఐలు ఢిల్లీ, ముంబాయి, బెంగళూరుల నుంచి విదేశాలకు వెళ్ళేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని చెంతనే ఏర్పడటం వల్ల రాష్ట్ర పరిపాలనా కేంద్రంగా మారిపోవటం, రాజకీయ కేంద్రంగా కూడా మారిపోవటం వల్ల రానున్న రోజుల్లో విజయవాడకు మరింతగా రాకపోకలు సాగే అవకాశం ఉంటుంది.
 
aewefefe.jpgరాజధాని నిర్మాణానికి సంబంధించి విదేశీ సంస్థల ప్రతినిథులు నేరుగా ఇక్కడికి రావటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ వచ్చి .. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అమరావతికి రావటానికి ఇష్టపడటం లేదు. అమరావతిలో విద్యా సంస్థలు కొలువు తీరటం, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావటం, పర్యాటకంగా అభివృద్ధి చెందటం వల్ల మరింతగా రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వ్యాపార ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేయటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సరుకుతో పాటు ప్రధానంగా కూరగాయలు, పండ్లు, పూలు వంటివి కూడా విదేశాలకు ఎగుమతి చేయటానికి పూర్తిస్థాయిలో కార్గో సదుపాయాలు కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది.
 
వెల్‌కమ్‌ టూ ఇండిగో
awerwearwe.jpgఇండిగో విమానయాన సిబ్బంది అంతర్జాతీయ టెర్మినల్‌లో కొలువు తీరారు. ఎయిర్‌హోస్టెస్‌ , విమానయాన సిబ్బంది, కౌంటర్ల సిబ్బంది అంతా ఒక రోజు ముందుగానే విధులకు హాజరయ్యారు. అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ సంసిద్ధమైంది. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌, భద్రతా బలగాలు, విమానయాన సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ తమ విధులలో చేరిపోయారు. ఇమిగ్రేషన్‌ ఇన్‌చార్జి, కస్టమ్స్‌ అధికారులు కూడా సోమవారం ట్రయల్‌ నిర్వహించారు. కౌంటర్లు సిద్ధమయ్యాయి. బ్యాగేజీ చెకిన్‌కౌంటర్లు సిద్ధమయ్యాయి. సెంట్రలైజ్డ్‌ ఏసీ సదుపాయాన్ని కూడా పరిశీలించారు.
 
ఉపరాష్ట్రపతిచే భూమిపూజ
werawer.jpgఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా భూమిపూజ జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు కేంద్ర వాణిజ్య పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్‌ ప్రభు, సహాయ పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్‌సింహాలు పాల్గొంటున్నారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలతో పాటు విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని శ్రీనివాస్‌, కొణకళ్ల నారాయణరావు, స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్‌ గురు ప్రసాద్‌ మహాపాత్ర తదితరులు పాల్గొంటారు.
 
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సింగపూర్‌ సర్వీసు ప్రారంభోత్సవం చేయటానికి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం రాత్రి కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతం, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూదనరావు, సీపీ ద్వారకా తిరుమలరావులు ఏర్పాట్లును పర్యవేక్షించారు. మధ్యాహ్నం విమాన ప్రయాణీకులకు వెంకయ్యనాయుడు బోర్డింగ్‌ పాస్‌లు ఇస్తారు. అంతకు ముందు జరిగే కార్య క్రమంలో జ్యోతి ప్రజ్వల చేస్తారు. తిరిగి సాయంత్రం బయలుదేరే సమయానికి ఇండిగో విమానానికి పచ్చజెండా ఊపుతారు.
Link to comment
Share on other sites

గన్నవరం చేరుకున్న సింగపూర్‌ విమానం

0542410412GANNAVARAM-INDIGO1A.JPG

విజయవాడ: సింగపూర్ నుంచి తొలి విమానం గన్నవరం విమనాశ్రయానికి మంగళవారం చేరుకుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానం 150 మంది ప్రయాణికులతో గన్నవరం రాగానే విమానాశ్రయ అధికారులు స్వాగతం పలికారు. సిబ్బంది వారికి పుష్పగుచ్ఛాలిచ్చి అభినందించారు. సింగపూర్ నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ సీఆర్డీఏ తరఫున అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక బుక్‌లెట్‌ను అందజేశారు. సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభం కావడం వల్ల తమ ప్రయాణానికి అనుకూలంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. గతంలో చెన్నై, బెంగుళూరు లేదా హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా ప్రయాస తప్పిందని సంతోషం వ్యక్తంచేశారు.
Link to comment
Share on other sites

Foundation Stone for new integrated passenger terminal building has been done by Honorable Vice President of India Shri M. Venkaiah Naidu Garu ? 3 Aero-Birdges Can handle - 6 A320 or B737 (180 Seating) Aircrafts or - 3 B787/777/747 or A330/340/350 (230 - 450 Seating) Aircrafts

Dtk19_oU4AAaz7Q.jpg
Dtk1_YyUwAE0jbv.jpg
Dtk2AM8V4Akv1ZU.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...