Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

సింగపూర్‌కు కష్టమ్స్‌!
08-09-2018 08:59:35
 
636719939751629171.jpg
  • ఎయిర్‌పోర్టులో సేవలు అందించేందుకు కదలని కస్టమ్స్‌ అధికారులు
  • మార్చి 19న నోటిఫికేషన్‌ ఇచ్చిన కేంద్రం
  • చర్యలు చేపట్టని ప్రాంతీయ విభాగం
  • సిబ్బందికి వేతనాలు చెల్లించాలని మెలిక
  • ఎయిర్‌పోర్టు అధికారులు విస్మయం
 
విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు అన్నీ అనుకూలించినా కస్టమ్స్‌ కష్టాలు వెంటాడుతున్నాయి. గాంధీ జయంతి రోజు సింగపూర్‌కు విమాన సర్వీసును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రంగం సిద్ధం చేస్తుంటే, కస్టమ్స్‌ ప్రాంతీయ విభాగం అధికారులు అవరోధాలు సృష్టిస్తున్నారు. తమ సిబ్బంది అందించే సేవలకు ప్రతిగా వారి వేతన భత్యాలు కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ చెల్లించాలని కస్టమ్స్‌ ప్రాంతీయ విభాగం అధికారులు మెలిక పెట్టినట్టు సమాచారం. ఇందుకు ఓకే అయితేనే సర్వీసులు నడుపుతామని సంకేతాలను పంపడంతో గందరగోళం నెలకొంది. కాగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కొత్త రూల్‌ను తీసుకు వచ్చిన కస్టమ్స్‌ అధికారులపై విమర్శలు వస్తున్నాయి.
 
విజయవాడ: అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసు నడపటానికి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది! గాంధీ జయంతి నాటి నుంచి సింగపూర్‌కు ఘనంగా విమాన సర్వీసు ప్రారంభించటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంటే.. మరోవైపు కస్టమ్స్‌ ప్రాంతీయ విభాగం అధికారుల తీరుతో సర్వీసు ప్రారంభించే అంశంపై గందరగోళం నెలకొంటోంది! ఈ ఏడాది మార్చి 19 న విజయవాడ ఎయిర్‌పోర్టుకు కేంద్రం కస్టమ్స్‌ నోటిఫికేషన్‌ ఇస్తే .. ప్రాంతీయ కస్టమ్స్‌ విభాగం ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో లేని రూల్‌ను ప్రాంతీయ కస్టమ్స్‌ విభాగం ఇక్కడ అమలు పరుస్తోంది. విమానాశ్రయంలో తమ సిబ్బంది అందించే సేవలకు ప్రతిగా వారి వేతన భత్యాలు కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ చెల్లించాలని కస్టమ్స్‌ ప్రాంతీయ విభాగ అధికారులు మెలిక పెట్టినట్టు తెలిసింది. కస్టమ్స్‌ సిబ్బందికి ఎయిర్‌పోర్టు అథారిటీ వేతనాలు చెల్లించలేని పక్షంలో సేవలు అందించలేమన్నట్టుగా పరోక్ష సంకేతాలను ఇక్కడి కస్టమ్స్‌ అధికారులు పంపారు.
 
కస్టమ్స్‌ నుంచి వచ్చిన ప్రతిపాదన పట్ల ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించటం లేదు. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు.. కస్టమ్స్‌ ప్రాంతీయ విభాగం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పై తక్షణం తమ కేంద్ర కార్యాలయానికి తెలియపరిచినట్టు సమాచారం. కస్టమ్స్‌ సిబ్బందికి ఎంత మేర జీతభత్యాలు చెల్లించాలో అంచనా వేసి పరిపాలనా ఆమోదానికి పంపినట్టు తెలిసింది. దేశంలో ఎక్కడా కస్టమ్స్‌ అందించే సేవలకు ఏఏఐ జీతాలు చెల్లించటం లేదు. మన రాష్ట్రంలోనే విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఎక్కడా లేని ఈ ప్రతిపాదనను ఏఏఐ ఆమోదిస్తుందా? లేదా ? అన్నది ప్రశ్నగా ఉంది. కస్టమ్స్‌ సిబ్బంది సేవలకు ఏఏఐ వేతనాలు చెల్లించకపోవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పరిస్థితి ఏమిటన్నదానిపై సస్పెన్స్‌ నెలకొంది. విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఏడాది కిందట అంతర్జాతీయ హోదా వచ్చింది. అంతర్జాతీయ హోదా రాగానే ఎయిర్‌పోర్టు అథికారులు పాత టెర్మినల్‌ బిల్డింగ్‌ను అంతర్జాతీయ టెర్మినల్‌ స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. రన్‌వే విస్తరణ పనులు కూడా శరవేగంగా చేపడుతున్నారు.
 
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నేరుగా ఇక్కడినుంచి దుబాయ్‌, షార్జాలకు ముందుకు వచ్చినట్టు వచ్చి తన ప్రతిపాదనను రద్దు చేసుకున్న తర్వాత ఇక్కడి ప్రజలలో తీవ్ర నిరాశ నెలకొంది. విదేశాల నుంచి పారిశ్రామిక ఔత్సాహికులు, వివిధ సంస్థల ప్రతినిథులు, పర్యాటకులు ఎందరో అమరావతికి వస్తున్నారు. వీరంతా హైదరాబాద్‌కు వచ్చి అమరావతి రావాల్సి వస్తోంది. విదేశాలకు విజయవాడ నుంచి విమాన సర్వీసులు ఉంటే ఈ సమస్య ఉత్పన్నం కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసును నడపాలని నిర్ణయించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభించటానికి చర్యలు తీసుకుంటున్న తరుణంలో కూడా ఇక్కడి కస్టమ్స్‌ అధికారులు కస్టమ్స్‌ కార్యకలాపాలకు వీలుగా చర్యలు తీసుకోలేదు
Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
బెజవాడ ఎయిర్‌పోర్టుకు మెగా హంగులు
09-09-2018 07:36:39
 
636720753960335368.jpg
  • రూ.721 కోట్లతో ఇన్‌ఫ్రా!!
  • రూ. 611 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌
  • పీఐబీ దగ్గరకు వెళ్లిన ప్రతిపాదన
  • జనవరిలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రూ.711 కోట్ల వ్యయంతో మెగా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేశారు. మరికొద్ది నెలల్లోనే ఇవి సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌, ఏరో బ్రిడ్జిలు, ఎయిర్‌ కంట్రోల్‌ టవర్‌, అధునాతన ఫైర్‌ స్టేషన్‌, మల్టీ కార్‌ పార్కింగ్‌ అంతిమంగా ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటి ప్రాజెక్టుల టెండర్లు చివరిదశలో ఉన్నాయి. ఇక పనులు ప్రారంభించటమే తరువాయి! అన్నీ అనుకూలిస్తే జనవరిలోనే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు మెగ అభివృద్ధి ప్రణాళికలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
 
విజయవాడ: బెజవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా రాకముందే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ కల సాకా రమైంది. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వా త రాష్ట్రంలోనే అత్యంత భారీ వ్యయంతో కూడిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే కార్యరూపంలోకి వచ్చింది. ఏర్పాటైన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌కు, ఏర్పడబోయే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కు మధ్య కనీసం పదేళ్ల సమయం అయినా ఉంటుంది. సీఎం చంద్ర బాబు ముందుచూపు కారణంగా... ఇంటీరి యం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవ సంద ర్భంలోనే ఏఏఐ అధికారుల దృష్టికి ఈ అంశా న్ని తీసుకువచ్చి కదలిక తీసుకొచ్చారు. ఇక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు కూడా అంచనాలు తయారు చేసి కేంద్రానికి పంపారు. దీనిపై కేంద్రం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ(పీఎంసీ)ని నియమించింది. పీఎంసీగా స్టుప్‌ సంస్థను ఎంపికచేసిన తర్వాత వేగం పుంజుకుంది.
 
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు సంబంధించి రూ.611 కోట్ల వ్యయ అంచనాలు ప్రీ పీఐబీ గడపదాటి పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (పీఐబీ) దగ్గరకు వెళ్లాయి. పీఐబీ ఆమోదం కేవలం లాంఛనం మాత్రమే! ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ పీఐబీలోనే వచ్చి ఉండేవి. ప్రీ పీఐబీ ఆమోదం పొందటం వల్ల పీఐబీ నుంచి ఎలాంటి సమస్యలు లేకుండానే ఆమోదం లభించే పరిస్థితి ఉంది. ఏఏఐ నుంచి కూడా కేంద్ర స్థాయిలో గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పీఐబీ ఆమోదం రాగానే పీఎంసీగా ఉన్న స్టుప్‌ సంస్థ డ్రాయింగ్స్‌, డిజైన్స్‌, ఎస్టిమేషన్స్‌ తయా రు చేస్తుంది. టెండర్ల ప్రక్రియను కూడా ఈ సంస్థ నిర్వహిస్తుంది. టెండర్లను మాత్రం ఏఏఐ పిలుస్తుంది. టెండర్లు పిలిచిన తర్వాత నిర్మాణ పనుల పర్యవేక్షణ అంతా కూడా ఈ సంస్థ చూస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ నాలుగైదు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. జనవరి నాటికి టెండర్లు పిలిస్తే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయటానికి అవకాశం ఉంటుంది. 2019 లో పని ప్రారంభిస్తే రెండు సంవత్సరాల వ్యవధిలో 2021 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
 
ఈఅండ్‌ఎం వర్క్‌షాప్‌
ఎయిర్‌పోర్టులో అధునాతన ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ వర్క్‌షాప్‌ను నిర్వహిం చటానికి వీలుగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఫైర్‌స్టేషన్‌. ఎయిర్‌పోర్టులో రోజన్‌బర్‌ పాంథర్‌ వంటి శక్తివంతపు ఆస్ర్టియా దేశ ఫైర్‌ ఫైటర్స్‌తో పాటు అనేక భద్రతా వ్యవస్థలు అంతర్భాగంగా ఉంటాయి. రూ.12 కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశారు. మరికొద్ది రోజులలోనే టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం ఫైర్‌ స్టేషన్‌ కోడ్‌ - 7 గా ఉంది. దీనిని ఏర్పాటు చేస్తే కోడ్‌ 9 - 10 స్థాయికి ఎగబాకుతుంది.
 
500 మల్టీ కార్‌ పార్కింగ్‌
నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌కు అనుబంధంగా మొత్తం 500 కార్లను ఏకకాలంలో పార్కింగ్‌ చేసే విధంగా మల్టీ కార్‌ పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి గ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌లో అంతర్భాగంగానే మల్టీ కార్‌ పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు.
 
ల్యాండ్‌ స్కేపింగ్‌
అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు స్థాయికి తగినట్టుగా ఇంటీరియం, ఇంటిగ్రేటెడ్‌ , గూడ్స్‌, ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్స్‌కు వెళ్ళే ప్రధాన మార్గాలతో పాటు, గ్రాండ్‌ ఎంట్రన్స్‌, రన్‌వే వెంబడి, బయట, ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ వెనుక భాగంలోనూ, నూతన టెర్మినల్‌ బిల్డింగ్స్‌ ముందుగా భాగంలో అద్భుతంగా ల్యాండ్‌ స్కేపింగ్‌ కల్పించేందుకు రూ.10 లక్షల వ్యయంతో మరికొద్ది రోజులలో టెండర్లు పిలవబోతున్నారు.
 
మూడు భారీ ఏరో బ్రిడ్జిలు
ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం కంటే ముందుగానే భారీ ఏరోబ్రిడ్జిల నిర్మాణానికి ఏఏఐ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూ.47.77 కోట్ల వ్యయంతో ఏరో బ్రిడ్జిల నిర్మాణానికి అంచనాలు సిద్ధమయ్యాయి. టెండర్లు పిలవటమే తరువాయి. ఏరో బ్రిడ్జిలకు అనుసంధానంగా పెద్ద పెద్ద విమానాలు నిలుపుదల చేయటానికి వీలుగా పార్కింగ్‌ బేలను తీర్చిదిద్దనున్నారు. వీటిని 6 కోడ్‌ సీ, 3 కోడ్‌ ఈ విధానంలో నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నారు. పెద్ద పెద్ద విమానాలు అంటే బోయింగ్‌ 777, బోయింగ్‌ 747 విమానాలు నిలుపుదల చేసేలా నిర్మించనున్నారు.
 
రన్‌వే కీలక పనులు ప్రారంభం
ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులలో కీలక ఘట్టం ప్రారంభమైంది. బుద్ధవరం - గన్నవరం రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో పాత రన్‌వే, అభివృద్ధి పరిచిన నూతన రన్‌వే మెర్జర్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఇది చాలా కీలకమైన పనులు. కష్టతరమైనవి కూడా! ఈ పనులు చేపట్టాలంటే.. విమానాల సమయాలను మార్చాలన్న ప్రతిపాదనలు నడుస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Link to comment
Share on other sites

అక్టోబర్‌ నుంచి సింగపూర్‌కు విమానం!
గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు
IndiGo-2.jpg

 విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు అక్టోబర్‌ తొలి వారంలో ఆరంభం కానుంది. ఇండిగో సంస్థ ఇక్కడి నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో సంస్థ అక్టోబర్‌ 2న ఇందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసి టిక్కెట్ల విక్రయాలను ప్రారంభించబోతోంది. విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనాన్ని ప్రస్తుతానికి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు వినియోగించనున్నారు. మరోవంక.. కొత్తగా రూ.611 కోట్లతో 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం నిర్మించనున్నారు. రెండేళ్లలో దీన్ని పూర్తిచేయాలనేది లక్ష్యం. రూ.120కోట్లతో కొనసాగుతోన్న రన్‌వే విస్తరణ పనులనూ వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తిచేయనున్నారు. విమానాశ్రయంలో ఇపుడున్న 7,500 అడుగుల రన్‌వేను 11,023 అడుగులకు విస్తరిస్తున్నారు.

అభివృద్ధి పనులపై చర్చ..
విమానాశ్రయ డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో గన్నవరం విమానాశ్రయ సలహా సంఘ సమావేశం సోమవారం జరిగింది. ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని శ్రీనివాస్‌, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో గత మూడేళ్లలో జోరందుకున్న అభివృద్ధి పనుల గురించి డైరెక్టర్‌ వివరించారు. విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలపై చర్చించారు. గన్నవరం నుంచి నెలకు లక్ష మంది వరకూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నందున సౌకర్యాల విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఎంపీలు సూచించారు. అక్టోబర్‌ మొదటి వారంలో సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమానం బయలుదేరనుందని కేశినేని నాని వెల్లడించారు.

Link to comment
Share on other sites

అభివృద్ధిలో.. రెండో అంకం
రెండేళ్లలో రూ.611 కోట్లతో అంతర్జాతీయ టెర్మినల్‌
రన్‌వే పూర్తిస్థాయిలో డిసెంబర్‌కు అందుబాటులోకి
అక్టోబర్‌ ఆరంభం నుంచి సింగపూర్‌కు విమానం
ఈనాడు, విజయవాడ
amr-top2a.jpg
గన్నవరం విమానాశ్రయం గత మూడేళ్లలో గణనీయమైన ప్రగతితో దూసుకెళ్లింది. బస్టాండ్‌ కంటే దారుణమైన పరిస్థితి నుంచి అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు, ఎనిమిది నగరాలకు సర్వీసులు, నెలకు లక్ష మంది ప్రయాణికుల స్థాయికి విమానాశ్రయం ఎదిగింది. కేవలం మూడేళ్ల వ్యవధిలో దేశంలోనే మరే విమానాశ్రయానికీ అందని రీతిలో గన్నవరం దినదినాభివృద్ధి చెందింది. ఇప్పుడు.. విమానాశ్రయ అభివృద్ధిలో రెండో అంకం ప్రారంభమైంది. సోమవారం విమానాశ్రయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో దీనిపై లోతుగా చర్చించారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఓ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణం చేపట్టబోతున్నారు. రన్‌వే సైతం లక్ష్యంలోగానే పూర్తయి అందుబాటులోనికి రాబోతోంది. వచ్చే నెల 2 నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇండిగో సంస్థ వారానికి  రెండు రోజులు సింగపూర్‌కు సర్వీసును ఇక్కడి నుంచి నడపబోతోంది. మంగళ, గురువారం నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతోంది. టిక్కెట్ల విక్రయానికి సాధారణంగా 40 రోజుల సమయం విమానయాన సంస్థలు తీసుకుంటాయి. అయితే.. 20 రోజులు సరిపోతాయని ఇండిగో భావిస్తున్నట్టు తెలిసింది. ఎంత త్వరగా వీలైతే అంత అంతర్జాతీయ సర్వీసును విమానాశ్రయం నుంచి నడపాలని రాష్ట్ర ప్రభుత్వం, విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు.

శాశ్వత అంతర్జాతీయ టెర్మినల్‌..
క్రొత్తగా శాశ్వత అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనాన్ని నిర్మించనున్నఆరు. దీనికోసం 2019 జనవరిలో టెండర్లు పిలిచి.. ఫిబ్రవరి తర్వాత శిలాఫలకం వేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్‌ నాటికి పనులు ప్రారంభించి.. 24 నెలల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. 3 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త టెర్మినల్‌ పూర్తిస్థాయి అంతర్జాతీయ సౌకర్యాలతో నిర్మిస్తారు. దేశీయ సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే విమానాశ్రయంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో రూ.160 కోట్లతో టెర్మినల్‌ను నిర్మించారు. ఇదే స్థాయిలో అంతర్జాతీయ సర్వీసుల కోసం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవనం నిర్మించనున్నారు.

కొత్త రన్‌వేపై జనవరి నుంచి..
విమానాశ్రయంలో ప్రస్తుతం 7500 అడుగుల రన్‌వే ఉంది. దీనిని 11,023 అడుగులకు పెంచుతున్నారు. కొత్తగా 3523 అడుగులు పొడిగిస్తున్నారు. రూ.148 కోట్ల బడ్జెట్‌ అంచనా వేయగా.. ప్రస్తుతం రూ.120 కోట్ల వరకూ ఖర్చవుతోంది. రన్‌వే విస్తరణ పనులను 2017 ఏప్రిల్‌ నుంచి ప్రారంభించారు. 20 నెలల్లో అనుకున్న లక్ష్యంలోగానే పనులను పూర్తి చేస్తున్నారు. విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న 7500 పొడవైన రన్‌వే అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అనువుగానే ఉంది. భవిష్యత్తులో రద్దీ మరింత పెరిగాక.. అవసరాల దృష్ట్యా రన్‌వేను పొడిగిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త రన్‌వేపై సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి.

Link to comment
Share on other sites

ఐదింటికి.. ఆకాశయానం
రాజధాని నుంచి ఈ ప్రధాన నగరాలకు సర్వీసులు కావాలి
గన్నవరం నుంచి దేశమంతా చుట్టాలంటే అత్యవసరం
amr-top1a.jpg

ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయం దేశంలోనే ప్రయాణికుల వృద్ధిలో గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఏటేటా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు పెరుగుతూ వెళుతోంది. మూడేళ్ల కిందటి వరకూ ఏటా నాలుగు లక్షల మంది దేశీయ ప్రయాణికులు ఉండగా.. ప్రస్తుతం ఏటా 12 లక్షలకు పెరిగారు. కానీ.. విమానాశ్రయం నుంచి ఇప్పటికీ దేశంలోని కేవలం ఐదు ప్రధాన మెట్రో నగరాలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు హైదరాబాద్‌కు వెళ్లి   విమాన సర్వీసులను ఎక్కాల్సి వస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి నాలుగు జిల్లాల నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకూ నిత్యం వేల సంఖ్యలో వివిధ పనులు, పర్యాటక ప్రదేశాల సందర్శన, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లి వస్తుంటారు. దేశవ్యాప్తంగా విమాన కనెక్టివిటీ ఏర్పడాలంటే.. గన్నవరం నుంచి అత్యవసరంగా కోచి, అహ్మదాబాద్‌, గోవా, కోల్‌కతా, షిరిడి ఐదు ప్రాంతాలకు అనుసంధానం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాపార, వాణిజ్య వర్గాలు సహా అందరి నుంచి డిమాండ్‌ వస్తోంది.

గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం దేశంలోని ఎనిమిది ప్రదేశాలకు సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో మూడు రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి, కడప ఉండగా.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ నగరాలకు మాత్రమే ఇక్కడి నుంచి విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐదు నగరాల్లోనూ హైదరాబాద్‌ మినహా మిగతా నాలుగూ.. గత రెండేళ్లలోనే కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ నగరాలకు సైతం సర్వీసులను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉన్నా.. ఇక్కడి నుంచి పెద్దగా ప్రయాణికులు ఉండరని విమానయాన సంస్థలు ముందుకు రాలేదు. విమానాశ్రయ అధికారులు, స్థానిక వ్యాపార, వాణిజ్య, రాజకీయ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు.. ఒక్కొక్కటిగా హైదరాబాద్‌ను అనుసంధానిస్తూ సర్వీసులను ఏర్పాటు చేశారు. కానీ.. అనూహ్యంగా వాటికి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం విమానయాన సంస్థలు పోటీ పడి మరీ విజయవాడ విమానాశ్రయం నుంచి సర్వీసులను నడుపుతున్నాయి. ఈ ఐదు మెట్రో నగరాలకూ విజయవాడ నుంచి వెళ్లే ప్రతి విమాన సర్వీసూ.. 80శాతం పైగా ఆక్యుపెన్షీతో నడుస్తున్నాయి.

ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రదేశాలు..
షిరిడి: దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతమైన షిరిడికి నాలుగు జిల్లాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో యాత్రికులు వెళుతుంటారు. వీళంతా నిత్యం రైలు, బస్సుల్లోనే వెళ్లాల్సి వస్తోంది. కనీసం 18 గంటల పైనే ప్రయాణం పడుతోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి కనీసం రోజూ ఒక్క విమాన సర్వీసు షిరిడికి నడిపినా.. ఫుల్‌ ఆక్యుపెన్షీతో నడుస్తుంది. గన్నవరం నుంచి నడుస్తున్న సర్వీసుల్లో ఎక్కువగా 72 సీట్లు ఉండే ఏటీఆర్‌ సర్వీసులే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి ఓ సర్వీసును షిరిడికి వేస్తే.. నిండకపోవడం అనే ప్రశక్తే ఉండదు. రద్దీని బట్టి విమానయాన సంస్థలు ఎలాగూ కొత్త సర్వీసులను నడిపేందుకు ముందుకొస్తాయి.
గోవా, కొచ్చి: కేరళలోని కోచి, గోవాలకు పర్యాటకులు ఇక్కడి నుంచి ఏటా లక్షల మంది వెళ్లి వస్తున్నారు. ఈ మధ్య డెష్టినేషన్‌ వెడ్డింగ్‌లు, పార్టీలూ ఎక్కువగా ఈ రెండు ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటున్నారు. ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో ఆ వేడుకల్లో పాల్గొనేందుకు హాజరవుతున్నారు. వేసవిలో ఈ రెండు ప్రాంతాలకు ఇక్కడి నుంచి భారీగా ప్రయాణికుల డిమాండ్‌ ఉంటోంది.
అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ నుంచి పెద్దఎత్తున వ్యాపార సంబంధాలు విజయవాడ, గుంటూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉన్నాయి. ప్రధానంగా మార్వాడీలు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. వస్త్ర వ్యాపారం అహ్మదాబాద్‌ కేంద్రంగానే ఎక్కువగా సాగుతుంది. అధిక సంఖ్యలో అక్కడి నుంచే దిగుమతి అవుతుంటాయి. ఈ వ్యాపార కార్యకలాపాల కోసం నిత్యం వెళ్లి వచ్చే ప్రయాణికులు ఉన్నారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాతో ఇక్కడి వాళ్లు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు అధికంగా నిర్వహిస్తుంటారు. ప్రధానంగా వస్త్ర వ్యాపారం అక్కడి నుంచే జరుగుతుంటుంది. ఇక్కడి నుంచి నిత్యం పెద్దసంఖ్యలో వెళ్లి వస్తుంటారు. పైగా.. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌ను కలుపుతూ ఇక్కడి నుంచి ఓ విమాన సర్వీసును నడపాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉంది.

అన్ని ప్రాంతాలకూ అనుసంధానం..
దిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులను ఆరంభించిన తర్వాత.. ఇక్కడి వారికి ఎంతో సౌలభ్యం ఏర్పడింది. గతంలో రైలులో ఒక రోజుకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. లేదంటే హైదరాబాద్‌కు వెళ్లి విమానం ఎక్కాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ బాధ తప్పింది. డిమాండ్‌ కూడా బాగా పెరిగింది. దేశంలోని ఈ ఐదు ప్రధాన ప్రాంతాలను కలిపేలా సర్వీసులను ఏర్పాటు చేస్తే.. దేశమంతా సంపూర్ణంగా అనుసంధానం ఏర్పడుతుంది. షిరిడి, కోచి, గోవా, అహ్మదాబాద్‌, కోల్‌కతా ప్రాంతాలకు నిత్యం ఇక్కడి నుంచి వెళ్లి వచ్చేవాళ్లు వేల మంది ఉంటారు. రోజుకు ఈ ఐదు ప్రాంతాలకూ కనీసం ఒక్క సర్వీసును ఏర్పాటు చేసినా.. విపరీతమైన రద్దీ ఉంటుంది. తర్వాత అదనంగా నడిపేందుకు విమానయాన సంస్థలే పోటీ పడే పరిస్థితి ఉంటుంది.

- ముత్తవరపు మురళీకృష్ణ, గన్నవరం విమానాశ్రయం సలహా సంఘం సభ్యులు
Link to comment
Share on other sites

వచ్చేస్తోంది!..సింగపూర్‌ విమానం 
ఈనాడు, అమరావతి 
ప్రపంచంతో అనుసంధానం 
ఎక్కడికైనా తేలికగా ఎగిరిపోవచ్చు! 
gnt-gen1a.jpg
గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే.. ఈ ప్రాంతానికి దేశవిదేశాలతో అనుసంధానం ఏర్పడినట్లే. ప్రపంచంలోనే ప్రముఖ వాణిజ్య, వ్యాపార కేంద్రమైన సింగపూర్‌కు విజయవాడ నుంచి నేరుగా మూడు గంటల్లో చేరిపోవచ్చు. అక్కడి నుంచి ప్రపంచమంతటికీ విమాన సర్వీసులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఏ దేశానికైనా తేలికగా చేరిపోయేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణ ఛార్జీలతో పాటూ ప్రయాస తగ్గిపోతుంది. సింగపూర్‌కు సర్వీసు ప్రాంరభమైతే.. అది కేవలం ఆ దేశానికి వెళ్లేందుకే కాకుండా.. ప్రపంచమంతటికీ తలుపులు తెరవనుంది.

గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు అక్టోబర్‌ నుంచి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ చొరవతో ఇండిగో ముందుకొచ్చి సింగపూర్‌కు సర్వీసు నడపబోతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి ఏటా ఈ నాలుగు జిల్లాల నుంచి 25 లక్షల మంది    హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నారు. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. వీరందరూ ఇక్కడి నుంచే వెళ్లేందుకు వీలుంటుంది. సింగపూర్‌తో భారతదేశానికి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో నౌకల ద్వారా జరిగే రవాణా చాలావరకు సింగపూర్‌, దుబాయ్‌ మీదుగానే ఇతర దేశాలకు చేరుకుంటాయి. సింగపూర్‌కు ఏటా కోస్తా ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. . రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ ఒక్క విమాన సర్వీసును సింగపూర్‌, దుబాయ్‌కు నడిపితే.. వెసులుబాటు కలుగుతుందని ఎప్పటినుంచో ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

ప్రయాణ ఖర్చు, సమయం ఆదా..: సింగపూర్‌కు విమాన టిక్కెట్‌ రూ. 16 నుంచి రూ. 20 వేల వరకూ అవుతోంది. అదే.. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో, రోడ్డు మార్గంలో వెళ్లడం వల్ల ఖర్చు అదనం. అక్కడ వేచి ఉండే సమయంలో ఖర్చు, విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలు సైతం ప్రయాణికులపై పడుతున్నాయి. అమెరికా, లండన్‌, కెనడా ఎక్కడి నుంచి వచ్చేవారినైనా తీసుకొచ్చేందుకు, సాగనంపేందుకు ఇక్కడి నుంచి వారి బంధువులు నిత్యం హైదరాబాద్‌కు వాహనాల్లో వెళ్లి వస్తున్నారు. ఇది మళ్లీ అదనపు ఖర్చు.. ప్రయాస. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాక.. అక్కడ తెల్లవారుజామున 2గంటల తర్వాత నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి రాత్రి 10 గంటలకు అక్కడికి చేరుకున్నా.. కనీసం ఐదారు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. అటునుంచి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే ప్రయాణికులు.. తెల్లవారే వరకూ విమానాశ్రయంలోనే ఉండాల్సి వస్తోంది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఐదారు గంటలు ప్రయాణించి విజయవాడకు చేరాలి. ప్రస్తుతం ప్రవాసాంధ్రులు, విదేశాలకు వెళ్లే యాత్రికుల కోసమే ప్రత్యేకంగా వందల వాహనాలు నడుస్తున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా ఓ ఏసీ సర్వీసు విదేశాల నుంచి వచ్చే వారి కోసం నడుపుతున్నారు.

ప్రధానంగా ఈ దేశాలకు.. 
అమెరికా, కెనడా, లండన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, డెన్మార్క్‌, చైనా, మలేషియా, సింగపూర్‌, రష్యా, సింగపూర్‌, కెన్యా, నైరోబి, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇక్కడి వాళ్లు అధికంగా ఉన్నారు. సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభమైతే.. వీళ్లంతా అత్యంత తేలికగా.. వెళ్లి వచ్చేందుకు వీలుంటుంది. ఇక్కడి నుంచి మూడు గంటల్లో సింగపూర్‌ వెళ్లి.. అక్కడి నుంచి గంటల వ్యవధిలో సమయం వృథా కాకుండా వెళ్లిపోవచ్చు.

కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ ఇక్కడ పూర్తి.. 
అంతర్జాతీయ ప్రయాణికులకు కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలు చాలా కీలకం. గన్నవరం నుంచి అంతర్జాతీయ అనుసంధానం ఏర్పడితే.. ఇక్కడే కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. నేరుగా సింగపూర్‌కు వెళ్లాక.. అక్కడ మళ్లీ ఈ తనిఖీలు అవసరం ఉండదు. నేరుగా విమానంలోనికి వెళ్లిపోయి.. విదేశాలకు చేరిపోవచ్చు. ముందుగానే కనెక్టివిటీ సర్వీసులకు టిక్కెట్లను బుక్‌ చేసుకుంటే సమయం చాలా ఆదా అవుతుంది.

విదేశీయుల నుంచి  ఆదాయం.. 
విదేశాల నుంచి అతిథులు, ప్రముఖల రాక అమరావతికి భారీగా పెరిగింది. వీళ్లంతా హైదరాబాద్‌లోనే బస చేసి.. ఇక్కడికి వాహనాల్లో వచ్చి తిరిగి సాయంత్రానికి అక్కడికే వెళ్లిపోతున్నారు. అదే.. ఇక్కడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. నేరుగా గన్నవరంలో దిగి.. విజయవాడలో బస చేస్తారు. సింగపూర్‌కు సర్వీసులు నడిస్తే.. ఏ దేశం నుంచైనా కనెక్టివిటీ పెట్టుకొని నేరుగా ఇక్కడ వాలిపోవచ్చు. ఏటా వేల సంఖ్యలో బౌద్ధ భిక్షువులు అమరావతి ప్రాంతం చూసేందుకు వచ్చి వస్తుంటారు. రాజధానిగా ప్రకటించిన తర్వాత వారి రాకపోకలు మరింత పెరిగాయి. వాళ్లు కూడా నేరుగా ఇక్కడికి రాకుండా.. హైదరాబాద్‌లో ఉండి.. ఇక్కడికి వచ్చి సాయంత్రానికి వెళ్లిపోతున్నారు. అదే.. నేరుగా ఇక్కడే దిగితే.. ఇక్కడే బస చేస్తారు. వీళ్లు ఖర్చు పెట్టే ప్రతిరూపాయి ఇక్కడికే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.

మొదటి సర్వీసుతో  ఓ చారిత్రక ఘట్టం.. 
గన్నవరం నుంచి అక్టోబర్‌లో కచ్చితంగా సింగపూర్‌ సర్వీసు ప్రారంభమవుతుంది. మొదటి అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే చారిత్రక ఘట్టం మా హయాంలో ఆవిష్కృతమవ్వడం చాలా ఆనందంగా ఉంది.  రన్‌వే విస్తరణ డిసెంబర్‌ నాటికి పూర్తయితే.. మరిన్ని విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ముందుకొస్తాయి.

- జి.మధుసూదన్‌రావు, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌

Europe velle vaallaki, Singapore not a good option. It would be good if we have direct to Middleeast(Dubai/abudhabi/Doha). Anyway it is really a good start, if this materializes. Pushapams slowly reducing Delhi-VJA flight schedules, which would be a major set back for people from abroad. At least people can now fly-in to Delhi and from there to VJA.

Link to comment
Share on other sites

3 hours ago, Bezawada_Lion said:

Calif and west canada ki full traffic vuntadi....that alone is enough....busy seasons lo 2nd flight vesinaa saripodhu....do you know how many people come to vijayawada via delhi and hyderabad?

Per average vesukunna troops ga velley minutes to movie vallatho no match....

in general ga.. Mumbai nunchi delhi nunchi hyd ki hyd nunchi all different cities ki travel avutharu mana actors n teams

Next siima iifa lanti bokada shows ki hundreds lo veltharu frim hyd

Next tana ata bata lanti prigrams pedda teams pothay hyd nunchi

Inka songs ki shootings ani locations ani batch bat h lu pothay

Vati mundu ivi jujubi annay

Link to comment
Share on other sites

5 hours ago, TDP888 said:

Ofcourse.....

Link to comment
Share on other sites

ట్రూజెట్‌-అమరావతి బోటింగ్‌ క్లబ్‌ల మధ్య ఎంవోయూ
19-09-2018 07:08:32
 
636729377096100774.jpg
  • పరస్పరం పర్యాటక ప్రమోషనల్‌ క్యాంపెయినింగ్‌
  • విమానయాన, వాటర్‌ రైడింగ్‌లకు రెండు సంస్థల ప్రచారం
  • రెండు సంస్థల మధ్య వ్యాపారాభివృద్ధికి దోహదం
 
విజయవాడ: పర్యాటకాన్ని తద్వారా విమానయానాన్ని పెంపొదించటం కోసం బెజవాడ వేదికగా తొలి అడుగు పడింది. ట్రూజెట్‌ విమానయాన సంస్థ, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ల మధ్య మంగళవారం సరికొత్త పర్యాటక ప్రోత్సాహక ఎంఓయూ జరిగింది. ఈ తరహా ఎంవోయూ దేశంలోనే ప్రథమం! విమాన ప్రయాణీకులకు వాటర్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ రైడింగ్స్‌ వంటి అదనపు సదుపాయాలను కల్పించటం ఒక ఎత్తు అయితే, వాటర్‌ రైడింగ్‌కు వచ్చే పర్యాటకులకు విమాన ప్రయాణంపై ఆసక్తి కలిగించటం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం. ఒక గగనయాన సంస్థకు, జలయాన సంస్థకు మధ్య పర్యాటక ప్రోత్సాహకంగా ఈ ఒప్పందం జరగటం విశేషం. ఈ ఒప్పందం వల్ల పర్యాటకాన్ని ప్రోత్సహించటంతో రెండు సంస్థల వ్యాపారాభివృద్ధికి కూడా మార్గం ఏర్పడుతుంది. ట్రూజెట్‌ సంస్థ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉడాన్‌’ పథకంలో భాగంగా తెలుగు రాష్ర్టాల నుంచి ప్రాంతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. పర్యాటక ప్రధానంగా ఈ సంస్థ విమాన సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ 19 రూట్లలో ప్రాంతీయ విమాన సర్వీసులను నడుపుతోంది.
 
తాజాగా దేశంలోని తూర్పు, పశ్చిమ రాష్ర్టాలలోని 20 ప్రాంతాల (రూట్లు) లో విమాన సేవలు అందించటానికి ట్రూజెట్‌కు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలో నూతనంగా షిర్డీకి విమాన సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించటం గమనార్హం. షిర్డీకి విమాన సర్వీసు విజయవాడతో అనుసంధానమౌతోంది. రాజమండ్రి, తిరుపతి, వైజాగ్‌ వంటి నగరాలకు కూడా అనుసంధానం చేయాలని ట్రూజెట్‌ భావిస్తోంది. హైదరాబాద్‌ - విశాఖపట్నం రూట్‌లో కూడా మధ్యలో విజయవాడ కనెక్టివిటీగా విమాన సర్వీసులు నడిపే అంశాన్ని కూడా ట్రూజెట్‌ పరిశీలిస్తోంది. పర్యాటకంగా ప్రమోషన్‌ కల్పించే కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మరింత వ్యాపారాభివృద్ధి సాధించవచ్చన్న ఆలోచనలో ట్రూజెట్‌ ఉంది. ఈ క్రమంలో అమరావతి రాజధాని ప్రాంతం కేంద్రంగా అమరావతి బోటింగ్‌ క్లబ్‌ నుంచి ట్రూజెట్‌ ఎయిర్‌లైన్స్‌కు అనూహ్యంగా వచ్చిన ప్రతిపాదనతో ఈ ఎంవోయూకు అంకురార్పణ జరిగింది.
 
ఈ ఒప్పందం వల్ల రెండు సంస్థల మ్యూచువల్‌ ప్రమోషనల్‌ డిస్కౌంట్స్‌ ఆఫర్ల పథకం అమల్లోకి వస్తుంది. ప్రాథమికంగా ఈ ఒప్పందం వాటర్‌ స్పోర్ట్స్‌కు పరిమితమైంది. విమాన ప్రయాణీకులు విజయవాడలో వాటర్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ రైడింగ్‌ చేయటానికి సంబంధించి ట్రూజెట్‌ సంస్థ, ఏబీసీ ప్యాకేజీలపై ప్రమోషన్స్‌ చేస్తుంది. అలాగే తమ దగ్గరకు వచ్చే పర్యాటకులకు ఏబీసీ కూడా ట్రూజెట్‌ విమాన పర్యాటక ప్యాకేజీలకు సంబంధించి ప్రమోషన్‌ చేస్తుంది. ట్రూజెట్‌ నుంచి వచ్చే పర్యాటకులకు తమ రైడ్లలో 10 శాతం డిస్కౌంట్‌ కల్పిస్తుంది. అలాగే ఏబీసీ ద్వారా విమానయానం చేసే వారికి 10 శాతం డి స్కౌంట్‌ కల్పిస్తారు.
 
త్వరలో పర్యాటక ప్రాంతాల ప్రమోషన్‌
ట్రూజెట్‌తో ఒప్పందంలో భాగంగా వారి ద్వారా వచ్చే పర్యాటకులకు అమరావతి రాజధాని ప్రాంతంలో తమ బోటింగ్‌ రైడ్స్‌లో 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తాం. ప్రస్తుతం ఎయిర్‌ , వాటర్‌ ప్రమోషనల్‌ క్యాంపెయిన్‌జరిగింది. రానున్న రోజుల్లో భూమి మీద సందర్శనీయ ప్రాంతాలకు కూడా ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ చేస్తాం. అమరావతి, బుద్దిస్ట్‌ సర్క్యూట్‌, మంగళగిరి పానకాలస్వామి ఆలయం, దుర్గగుడి ఇలాంటివి అనేక సందర్శనీయ ప్రాంతాలకు కూడా ప్రమోషన్‌ కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
- తరుణ్‌ కాకాని, ఏబీసీ వ్యవస్థాపకుడు
 
సామాజిక, ఆర్థిక ప్రగతికి దోహదం
నా నలభై సంవత్సరాల సర్వీసులో ఒక విమానయాన సంస్థతో , వాటర్‌ స్పోర్ట్స్‌ సంస్థ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవటం చూడలేదు. ఇదొక అద్భుతమైన ఐడియా. పర్యాటకంగా ప్రమోషన్‌ చేసుకోవటం వల్ల వ్యాపారాఽభివృద్ధి సాధ్యమౌతుంది. తాజా ఒప్పందం రెండు సంస్థలకు ప్రయోజనం కలిగిస్తుంది. రెండు సంస్థలు ప్రమోషన్‌ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. విమానయానం, పర్యాటకరంగం ద్వారా ఉద్యోగావకాశాలు ఎక్కువుగా కలుగుతాయి. ఆర్థికంగా పురోభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. పర్యాటకం ద్వారా 900 బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధిస్తుంటే, విమానయానం ద్వారా 640 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరుగుతోంది.
- సుధీర్‌ రాఘవన్‌, సీసీవో, ట్రూజెట్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...