Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
3 hours ago, John said:

Y not included tirupati :donno: 

money vunte anni places include cheyochhu bro... State govt has to bear the costs if the seats aren't filled... so prati place ni include chesthe where is the money I askinggguuuu

Link to comment
Share on other sites

9 hours ago, Yaswanth526 said:

Akkada twitter lo nemo vizag vallu maaku kavali antaru eedemo tiruapti vallu  :wall:

What’s wrong man ? ,intl status ichi new terminal Modi cheta open cheyinchi dobbichukoni 3 yrs nunchi waiting can’t we expect some thing good :damn: 

Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి. అక్టోబర్‌లో సింగపూర్‌కు వారంలో రెండు రోజులు విమానాలు నడవబోతున్నాయి.

Link to comment
Share on other sites

రూ.500 కోట్లతో విజయవాడలో కొత్త టెర్మినల్‌
03-09-2018 00:59:10
 
636715331490674936.jpg
  • పర్యావరణ శాఖ అనుమతి కోరిన ఎఎఐ
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సహా మరో నాలుగు విమానాశ్రయాల విస్తరణకు సంబంధించి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతుల కోసం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) వేచిచూస్తోంది. రూ.3,258 కోట్లతో ఈ విమానాశ్రయాల విస్తరణకు ఎఎఐ ప్రణాళికలు రూపొందించింది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ (ఈసి) తాజా సమావేశ వివరాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పాట్నా, లక్నో, డెహ్రడూన్‌, జబల్‌పూర్‌ విమానాశ్రయాల విస్తరణకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలంటూ ఎఎఐ కోరినట్లు ఈసి సమావేశ వివరాల్లో ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ విమానాశ్రయ విస్తరణకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించేందుకు అనుమతినివ్వాలని కోరింది. విజయవాడ విమానాశ్రయంలో రూ.500 కోట్ల పెట్టుబడితో కార్‌ పార్కింగ్‌, యుటిలిటీ భవనాలు, నగరంలోకి వెళ్లేందుకు నాలుగు వరుసల అప్రోచ్‌ రహదారి, ప్రయాణికుల ప్రాంగణం సహా కొత్త టెర్మినల్‌ భవనాన్ని నిర్మించేందుకు ఎఎఐ ఇప్పటికే ప్రణాళికను సమర్పించింది.
 
2015-16లో విజయవాడ విమానాశ్రయం నుంచి 3.98 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగా 2021-22 నాటికి ఈ సంఖ్య 14.87 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కాగా లక్నో విమానాశ్రయంలో టెర్మినల్‌ -1 ని కూల్చివేసిన అనంతరం టెర్మినల్‌-3 బిల్డింగ్‌ను నిర్మించాలని ఎఎఐ భావిస్తోంది. ప్రస్తుతమున్న టెర్మినల్‌ దేశీయ, విదేశీ ప్రయాణికులకు సరిపోకపోవటంతో రూ.1,383 కోట్లతో కొత్త టెర్మినల్‌ను నిర్మించాలని నిర్ణయించినట్లు ఎఎఐ పేర్కొంది.
 
లక్నో విమానాశ్రయానికి సంబంధించి ఎఎఐను కొన్ని వివరాలను కోరగా వాటిని సమర్పించిందని, తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల కోసం ఇఐసి సిఫారసు చేసిందని అప్రైజల్‌ కమిటీ పేర్కొంది. వీటితో పాటు పాట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (జెపిఎన్‌ఐ) నుంచి ఏటా 45 లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించే విధంగా కొత్త టెర్మినల్‌ను ఏర్పాటు చేసేందుకు ఎఎఐ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతమున్న టెర్మినల్‌ 20 సంవత్సరాలకు పైబడినది కావటంతో కొత్త సదుపాయాలు, టెక్నాలజీలతో రూ.865 కోట్ల పెట్టుబడితో కొత్త టెర్మినల్‌ను నిర్మించాలని చూస్తున్నట్లు ఎఎఐ తెలిపింది
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

AAI aa - inka ayinatle

asalu taxiway lekunda airport expansion chesthe yemosthundi

and also proper cargo handling bays kuda vundali

Link to comment
Share on other sites

Airports Authority of India seeks green clearance for Vijayawada airport expansion 

THE HANS INDIA |   Sep 03,2018 , 04:58 AM IST
   
Airports Authority of India seeks green clearance for Vijayawada airport expansion 
Airports Authority of India seeks green clearance for Vijayawada airport expansion 
 
Hyderabad: The Airports Authority of India (AAI) has sought various clearances from the Environment Ministry for the expansion of Vijayawada airport along with four others, including Lucknow and Patna.
 
According to the minutes of meeting of the latest expert appraisal committee (EAC) under the Ministry of Environment, Forest and Climate Change, the AAI sought environmental clearance for Patna, Lucknow, Dehradun and Jabalpur airports with an investment outlay of Rs 3,258 crore. It also requested the ministry to prepare terms of reference for the Vijayawada airport expansion programme.
 
The AAI intends to construct a new terminal building T3 for Lucknow airport after dismantling Terminal 1 to cater to the increasing number of international and domestic passengers as the capacity of the present ones has neared saturation point.
 
A multi-level car parking and allied facilities are also proposed.  "The estimated cost of the project (for Lucknow Airport) will be approximately Rs 1,383 crore. Based on the information submitted and clarifications provided by the Project Proponent (AAI)...
 
EAC recommended the project for grant of Environmental clearance for Lucknow Airport," the committee said. The AAI plans to set up a new domestic terminal at Jai Prakash Narayan International (JPNI) Airport, Patna, to handle 4.5 million passengers per year with modern amenities on par with GRIHA-4 rating.
 
The existing domestic terminal is more than 20-year old and the ATC tower, technical block and administrative offices are housed in the same domestic terminal building. Initially, the building was designed for 50 lakh passengers per annum. The cost of the project is Rs 865 crore, the EAC said.
 
However, the increase in number of flights has seen more passengers travelling per year to about three million and hence the existing building was not sufficient to cater to the present passenger load, it said. "In view of the future growth of passengers, it is proposed to construct a new domestic terminal for 4.5 million per annum," the EAC said in case of Patna airport while recommending for the environment clearance with certain conditions.
 
For Vijayawada, the AAI has submitted a plan for construction of a new integrated terminal building with allied facilities like surface car parking, utility building, city side four lane approach road and canopy for passenger facilitation, among others, at an investment outlay of Rs 500 crore, the committee said in the minutes.
 
As per current traffic data, Vijayawada airport handled 3.98 lakh passengers in 2015-16. The airport is expected to handle 14.87 lakh passengers by 2021-22. It also proposes to expand Dehradun airport by constructing a new integrated terminal building and allied facilities at an investment of Rs 344.75 crore, while for expansion of Jabalpur airport, the AAI requested the ministry to reconsider the environment clearance to make the aerodrome suitable for operation of AB-320 type aircraft.
Link to comment
Share on other sites

//As per current traffic data, Vijayawada airport handled 3.98 lakh passengers in 2015-16. The airport is expected to handle 14.87 lakh passengers by 2021-22.//

vellu old news malli recycle chestara? otherwise we are in 2018-19 fiscal year... eppudo 2015-16 data ivvatam emiti? what happened to 16-17 and 17-18. ippudu vuuna trend continue ayithe Vij airport will reach 15L passengers by 2019-20. vellu emo 21-22 ani vesaru.

Link to comment
Share on other sites

25 minutes ago, katti said:

I think this year itself it will be crossing 12 lacs. ( saw an article yesterday that said monthly number crossed 1 lac)

Link to comment
Share on other sites

నెలకు.. లక్ష దాటారు
ఏడాదికి 12లక్షలు దాటుతున్న సంఖ్య
గన్నవరం నుంచి ఏటేటా గణనీయమైన వృద్ధి
దేశీయ సర్వీసుల్లో  విమానయాన సంస్థల పోటీ
ఈనాడు, విజయవాడ
kri-gen1a.jpg

న్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య మరో మైలు రాయిని దాటింది. ప్రస్తుతం నెలకు లక్ష మంది విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు 3,300 మంది ప్రయాణికులు.. 52 సర్వీసుల్లో దేశంలోని ఎనిమిది నగరాలకు వెళ్లి వస్తున్నాయి. మూడేళ్ల కిందటి వరకూ చూసుకున్నా.. రోజుకు వెయ్యి మంది.. నెలకు 30 వేల మంది మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం అనూహ్య రీతిలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది. ఇక్కడి డిమాండ్‌ను గుర్తించిన విమానయాన సంస్థలు సైతం

దేశీయ సర్వీసులను నడిపేందుకు పోటీ పడుతూ.. టిక్కెట్ల ధరలను సైతం అందుబాటులోనికి తీసుకొస్తున్నాయి. దేశంలోని ఎనిమిది నగరాలకు నడుస్తున్న విమాన సర్వీసులన్నీ.. 70శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. గన్నవరం నుంచి విమాన సర్వీసులను ఏ నగరానికైనా నడిపితే ప్రయాణికులు ఉంటారా.. అనే సందేహం మూడేళ్ల కిందటి వరకూ ఉండేది. ఒక్కో విమానయాన సంస్థ ముందుకొచ్చి.. సర్వీసులను ప్రారంభిస్తుంటే.. అనూహ్యమైన స్పందన కనిపిస్తూ వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా ఏ నగరానికైనా సర్వీసులను ఇక్కడి నుంచి నడపొచ్చనే దీమా విమానయాన సంస్థల్లో వచ్చింది.

మార్చి నుంచి ప్రతినెలా లక్ష..
2018 మార్చి నుంచి ప్రతి నెలా ప్రయాణికులు లక్ష మందికి పైగా ఉంటున్నారు. గత ఆరు నెలల్లో విమానాశ్రయం నుంచి ఆరు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఏడాది మొత్తంలో తొమ్మిది లక్షల మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఆరు లక్షలున్నారు. ఈ సంఖ్య వచ్చే ఆరు నెలల్లో మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ నగరాలకు అత్యధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయంగా విజయవాడ నుంచి గోవా, కేరళ, అహ్మదాబాద్‌ సహా అనేక ప్రాంతాలకు ఇంకా సర్వీసులు ప్రారంభమవ్వలేదు. ఇక్కడి నుంచి దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటికీ డిమాండ్‌ భారీగా ఉంటోంది. విమానయాన సంస్థలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ సర్వీసులను ప్రారంభిస్తే.. ప్రయాణికుల వృద్ధి మరింత గణనీయంగా ఉంటుంది.

ఇండిగో భారీ ఎయిర్‌బస్‌లు..
గన్నవరం కేంద్రంగా అక్టోబర్‌ 01 నుంచి భారీ ఎయిర్‌బస్‌ సర్వీసులను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం ఏటీఆర్‌ సర్వీసులను మాత్రమే ఇండిగో నడుపుతోంది. వీటిలో 72మంది మాత్రమే ప్రయాణికులు పడతారు. కొత్తగా తీసుకొచ్చే ఎయిర్‌బస్‌లో 180మంది ప్రయాణికులు రాకపోకలు సాగించొచ్చు. దిల్లీకి నిత్యం ఈ ఎయిర్‌బస్‌ను గన్నవరం విమానాశ్రయం నుంచి నడపనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఇండిగో విడుదల చేసింది. దిల్లీ నుంచి మధ్యాహ్నం 3.35కు గన్నవరం వస్తుంది. సాయంత్రం 4.15కు తిరిగి దిల్లీకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతుంది. సాధారణంగా దిల్లీకి రూ.6 వేలకు పైగా టిక్కెట్‌ ధర ఉండగా.. ఇండిగో రూ.4 వేల లోపే అందుబాటులోనికి తీసుకొచ్చింది. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి ఉదయం 9.10, రాత్రి 8.40కు రెండు సర్వీసులను ఎయిరిండియా నేరుగా దిల్లీకి నడుపుతోంది. మధ్యలో సాయంత్రం 5.20కు ఓ సర్వీసు ఉన్నా.. అది హైదరాబాద్‌ మీదుగా వెళుతుంది. తాజాగా ఇండిగో ఏర్పాటు చేస్తున్న సర్వీసు సాయంత్రం 4.15కు ఉండడంతో పనులపై ఇక్కడికి వచ్చేవారు రాత్రి వరకూ ఆగాల్సిన అవసరం లేకుండా సాయంత్రం 6గంటలకు దిల్లీకి చేరిపోóుందుకు  వీలుంటుంది.

Link to comment
Share on other sites

33 minutes ago, katti said:

//As per current traffic data, Vijayawada airport handled 3.98 lakh passengers in 2015-16. The airport is expected to handle 14.87 lakh passengers by 2021-22.//

vellu old news malli recycle chestara? otherwise we are in 2018-19 fiscal year... eppudo 2015-16 data ivvatam emiti? what happened to 16-17 and 17-18. ippudu vuuna trend continue ayithe Vij airport will reach 15L passengers by 2019-20. vellu emo 21-22 ani vesaru.

మార్చి నుంచి ప్రతినెలా లక్ష..
2018 మార్చి నుంచి ప్రతి నెలా ప్రయాణికులు లక్ష మందికి పైగా ఉంటున్నారు. గత ఆరు నెలల్లో విమానాశ్రయం నుంచి ఆరు లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఏడాది మొత్తంలో తొమ్మిది లక్షల మంది రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే ఆరు లక్షలున్నారు. ఈ సంఖ్య వచ్చే ఆరు నెలల్లో మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ నగరాలకు అత్యధికంగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయంగా విజయవాడ నుంచి గోవా, కేరళ, అహ్మదాబాద్‌ సహా అనేక ప్రాంతాలకు ఇంకా సర్వీసులు ప్రారంభమవ్వలేదు. ఇక్కడి నుంచి దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటికీ డిమాండ్‌ భారీగా ఉంటోంది. విమానయాన సంస్థలు దేశంలోని అన్ని ప్రాంతాలకూ సర్వీసులను ప్రారంభిస్తే.. ప్రయాణికుల వృద్ధి మరింత గణనీయంగా ఉంటుంది.

Link to comment
Share on other sites

అక్టోబరు 2 నుంచి తొలి అంతర్జాతీయ విమానం
07-09-2018 06:53:43
 
636719000232012428.jpg
  • గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి స్లాట్‌
  • 180 సీటర్‌ ఎయిర్‌బస్‌... 320 సర్వీస్‌ ఆపరేషన్‌
 
విజయవాడ నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసును అందిస్తున్న సంస్థగా దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ నిలువనుంది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు అక్టోబర్‌ రెండో తేదీ నుంచి వారంలో రెండు రోజుల పాటు సింగపూర్‌కు ఇండిగో తన విమాన సర్వీసును ప్రారంభించనుంది.
 
విజయవాడ: రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) పిలిచిన టెండర్లలో వయబిలిటి గ్యాప్‌ ఫండింగ్‌కు సంబంధించి తక్కువగా కోట్‌ చేసిన ఇండిగో సంస్థ సింగపూర్‌కు విమాన సర్వీసు నడపటానికి ఎంపికైంది. సింగపూర్‌కు విమాన సర్వీసు నడపడానికి మరో ప్రధాన విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ కూడా టెండర్లలో పోటీ పడినప్పటికీ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌కు సంబంధించి ఎక్కువ సీట్లకు కోట్‌ చేయడంతో ఆ సంస్థ బిడ్‌ను పక్కన పెట్టారు. వాస్తవానికి ఈనెల 27 నుంచే సింగపూర్‌కు సర్వీసును ప్రారంభించాల్సి ఉంది.
 
మంచి రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించడంతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 వ తేదీన అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సింగపూర్‌కు వారంలో రెండు రోజుల పాటు విమాన సర్వీసును ఇండిగో విమాన సర్వీసును నడుపుతుంది. వారంలో ఏ రోజు? ఏ సమయంలో? విమాన సర్వీసును ప్రారంభిస్తారన్న దానిపై షెడ్యూల్‌ను అధికారికంగా మరికొద్ది రోజులలో ప్రభుత్వం ప్రకటించనుంది. సింగపూర్‌కు భారీ విమానాన్నే ఇండిగో సంస్థ నడపనుంది. ఆంధ్రజ్యోతికి అందిన సమాచారం మేరకు ఎయిర్‌ బస్‌ 320 విమానాన్ని నడపనుంది. ఈ విమానంలో మొత్తం 180 సీటింగ్‌ ఉంటుంది.
 
వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇలా..
సింగపూర్‌కు విమాన సర్వీసు నడపడానికి ముందుకు వచ్చిన ఇండిగో సంస్థ వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌కు సంబంధించి తక్కువగా కోట్‌ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 100 సీట్ల వరకు ప్రభుత్వం మినిమం గ్యారంటీ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మినిమం గ్యారంటీ ప్రకారం విమానంలో 60 మంది ప్రయాణీకులే వెళితే మిగిలిన 40 సీట్లకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ 110మంది ప్రయాణికులు వెళితే ప్రభుత్వం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సింగపూర్‌కు వారంలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్నారు కాబట్టి 100 సీట్లకు పైగా కచ్చితంగా నిండుతాయని ప్రభుత్వంపై భారంపడే అవకాశం కూడా ఉండక పోవచ్చని ఎయిర్‌పోర్టు అధికారులు భావిస్తున్నారు. ఒకసారి సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభమైతే వారంలో ఎలా ఉన్నా.. తర్వాత రద్దీ పెరగడం ఖాయమని ఇక్కడి అధికారుల భావనగా ఉంటోంది.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే..
విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడపటం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవ, కృషి ఉన్నాయి. విజయవాడ నుంచి ముంబైకి విమానాన్ని నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ తన సర్వీసును దుబాయి, షార్జాలకు నడపాల్సి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుని, ఇమిగ్రేషన్‌ వచ్చిన ఆ సంస్థ మొహం చాటేసింది. దీంతో అంతర్జాతీయ ఆశలు అడియాశలయ్యాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున సింగపూర్‌కు విమాన సర్వీసు ప్రారంభించడానికి ఎంతగానో కృషి చేసి కార్యరూపంలోకి తీసుకొచ్చారు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తొలి అంతర్జాతీయ విమానాన్ని నడుపుతున్న సంస్థగా ఇండిగో నిలువబోతోంది. అలాగే విజయవాడ నుంచి సౌత్‌ఈస్ట్‌ ఏషియాలో సింగపూర్‌ తొలి విమాన సర్వీసును నడుపుతున్న ఘనతను ఎయిర్‌ పోర్టు సాధించనుంది.
Link to comment
Share on other sites

బంపర్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
08-09-2018 09:08:23
 
636719945038456185.jpg
విజయవాడ: దేశ రాజధాని ఢిల్లీకి తొలి విమాన సర్వీసును నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఢిల్లీకి టికెట్‌ ధర రూ.3,330గా నిర్ణయించింది. వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన ఇండిగో సంస్థ కొంతమంది ప్రయాణీకులకు ఈ ఆఫర్‌ను కల్పించింది. దీంతో ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణీకులు తక్కువ ధరకే ఢిల్లీకి వెళ్ళే అవకాశాన్ని పొందారు. ఢిల్లీకి తొలి విమాన సర్వీసును నడపాలని నిర్ణయించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కొద్ది రోజులుగా తన వెబ్‌సైట్‌ ద్వారా ఢిల్లీకి టిక్కెట్‌ బుకింగ్‌ కూడా చేపడుతోంది. ఢిల్లీకి విమాన సర్వీసును నడుపుతున్నట్టు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన సందర్భంలో కనిష్ట ధర రూ.5,520గా ఉంది. సాధారణంగా ఢిల్లీకి ముందస్తుగా బుక్‌ చేసుకుంటే సగటు ధర రూ.6,000 ఆ పైన ఉంటుంది.
 
ఎయిర్‌ ఇండియా సంస్థ వసూలు చేస్తున్న ఛార్జీలతో విమాన ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇండిగో భారీ తగ్గింపునిస్తుందని ఆశించారు. అయితే ఈ ప్రారంభ ఆఫర్‌ ఏమీ లేకపోవటంతో చాలామంది నిరాశ చెందారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు రూట్లలో విమానాలు నడిపేటపుడు ఒక్కసారిగా విమాన ఛార్జీల ధరలను సవరించింది. దీంతో మిగిలిన విమానయాన సంస్థలు కూడా ధరలను తగ్గించాయి. ఢిల్లీ రూట్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తే.. మొదట్లో అలా జరగలేదు. అనూహ్యంగా ఇండిగో సంస్థ వెబ్‌లో ఛార్జీలను తగ్గిస్తూ ప్రకటించింది. బుకింగ్‌ కల్పించిన మొదటి వారం తర్వాత రూ.3,330, మధ్యలో రూ.2,220కు కూడా టిక్కెట్‌ లభించే అవకాశాన్ని కల్పించింది. ఢిల్లీకి తొలి విమాన సర్వీసును అక్టోబర్‌ 1వ తేదీన నడపాలని ఇండిగో ముహూర్తం నిర్ణయించింది. తెల్లవారుజాము సమయంలో ఈ విమాన సర్వీసును నడపబోతోంది. దీంతో ఢిల్లీకి ఉదయం 9 - 10 గంటల మధ్యలోనే చేరుకునే అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...