Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

Promising response to domestic air cargo service

author-deafault.png Tharun Boda
VIJAYAWADA, August 09, 2018 00:00 IST
Updated: August 09, 2018 05:09 IST
Spreading wing:Traders are now receiving cellphones and bullion gold through airways, at the Common User Domestic Cargo Terminal in Gannavaram.

Spreading wing:Traders are now receiving cellphones and bullion gold through airways, at the Common User Domestic Cargo Terminal in Gannavaram.  

Postal and Rail Mail Services are using the service at Gannavaram now; increase in cargo capacity envisaged

The domestic air cargo service, running since August 1 at the Vijayawada airport, has received a promising response from the local trading community that waited for such a service for years.

The Common User Domestic Cargo Terminal located close to the old terminal is handling about six tonnes on an average everyday via the belly cargo space offered by airlines to several destinations in the country.

Formally inaugurated more than a month ago, the terminal, run by Shreepa Logistics Pvt. Ltd., has started operations this month.

The firm sees that there is a lot to happen in the coming weeks as the scenario changes with increasing demand and the cargo capacity.

“When we bagged the tender in 2017, the airport had a capacity of just 10 tonnes in a month. Now, on the first day of the operation we handled 12 tonnes and an average five to six tonnes every day this week,” Shreepa Logistics Managing Director Kokali Venkata Rama Rao told The Hindu .

“The cargo capacity goes up to 25 to 30 tonnes or more per day soon. Indigo which handles about 50% of the domestic air cargo is likely to open its cargo space in a week here. The greatest advantage is Indigo choosing the airport as its south India hub. Its three aircraft that will be parked here could alone handle 24 tonnes every day,” he said.

At present mobile phones and bullion gold are being received in large quantities by the city traders. “Gold which is transported only through airways is being received in large quantity from New Delhi and Mumbai,” Mr. Rama Rao said.

‘Boon for traders’

The Postal and Rail Mail Services are also using the service now. “Soon the DTDC will start using it. Our focus would be on aqua and agri products and express cargo services. Air India is giving the best deal at Rs. 12 per kg to Delhi while it is Rs. 30 per kg from Hyderabad to Delhi. This is a boon for traders. Other airlines too are offering lower freightage,” he said. The RTC visited the terminal on Tuesday to understand the air cargo procedure checking feasibility to use it for their courier services.

Link to comment
Share on other sites

Promising response to domestic air cargo service

https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pfke0a/article24638412.ece/alternates/FREE_660/07VJTKB01Air-cG4A4G74NV3jpgjpg

Postal and Rail Mail Services are using the service at Gannavaram now; increase in cargo capacity envisaged

The domestic air cargo service, running since August 1 at the Vijayawada airport, has received a promising response from the local trading community that waited for such a service for years.

The Common User Domestic Cargo Terminal located close to the old terminal is handling about six tonnes on an average everyday via the belly cargo space offered by airlines to several destinations in the country.

Formally inaugurated more than a month ago, the terminal, run by Shreepa Logistics Pvt. Ltd., has started operations this month.

The firm sees that there is a lot to happen in the coming weeks as the scenario changes with increasing demand and the cargo capacity.

“When we bagged the tender in 2017, the airport had a capacity of just 10 tonnes in a month. Now, on the first day of the operation we handled 12 tonnes and an average five to six tonnes every day this week,” Shreepa Logistics Managing Director Kokali Venkata Rama Rao told The Hindu .

“The cargo capacity goes up to 25 to 30 tonnes or more per day soon. Indigo which handles about 50% of the domestic air cargo is likely to open its cargo space in a week here. The greatest advantage is Indigo choosing the airport as its south India hub. Its three aircraft that will be parked here could alone handle 24 tonnes every day,” he said.

At present mobile phones and bullion gold are being received in large quantities by the city traders. “Gold which is transported only through airways is being received in large quantity from New Delhi and Mumbai,” Mr. Rama Rao said.

‘Boon for traders’

The Postal and Rail Mail Services are also using the service now. “Soon the DTDC will start using it. Our focus would be on aqua and agri products and express cargo services. Air India is giving the best deal at Rs. 12 per kg to Delhi while it is Rs. 30 per kg from Hyderabad to Delhi. This is a boon for traders. Other airlines too are offering lower freightage,” he said. The RTC visited the terminal on Tuesday to understand the air cargo procedure checking feasibility to use it for their courier services.

Link to comment
Share on other sites

విజయవాడ టూ సింగపూర్..  ఇక నేరుగా విమానం 
10brk60a.jpg

అమరావతి: విజయవాడ నుంచి విమానంలో నేరుగా సింగపూర్‌ వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లే పరిస్థితి ఇక ఉండదు. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్‌కు విమానాన్ని నడపనున్నారు. లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) పద్ధతిలో సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దేశీయ విమాన సంస్థ ఇండిగో వారానికి రెండు నుంచి మూడు సార్లు సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు ముందుకురావడంతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అనుమతించింది. ఈనెల 27 నుంచి సేవలు ప్రారంభించాలా? అక్టోబరు 2 నుంచి విమానాన్ని నడపాలా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 60 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి రెండు, మూడుసార్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

విమానాశ్రయ విస్తరణకు సై..
భూ సమీకరణ పరిపూర్ణం
తొలగిన అడ్డంకులు
ప్లాట్ల కేటాయింపుపై రైతుల సంతృప్తి..!
హనుమాన్‌ జంక్షన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే
amr-gen1a.jpg

వ్యాంధ్రకు ప్రధాన విమానాశ్రయంగా ఉండి, అంతర్జాతీయ హోదా పొందిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ఇక శరవేగంగా జరగనుంది. ఏడాదిన్నర కిందటే పనులు వేగంగా జరగాలని ప్రజాప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. కానీ విస్తరణకు అవసరమైన భూ సమీకరణకు అడ్డంకులు రావడం, రాజధానిలో ఫ్లాట్ల కేటాయింపులపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో కార్యాచరణ అనుకున్నంతగా వేగవంతం కాలేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌లు ఇటీవల రైతులతో నిర్వహించిన సమావేశంలో దాదాపుగా ఏకాభిప్రాయం రావడంతో విస్తరణకు మార్గం సుగమమైంది.

ప్రస్తుతం విమానాశ్రయం 536 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మరో 1,200 ఎకరాలు సేకరించేందుకు 2016 ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఎకరాకు 1,450 గజాల చొప్పున భూమి కేటాయించేలా సమీకరణ ప్రక్రియ చేపట్టారు. ఆరంభంలోనే దాదాపు 700 ఎకరాల వరకు సమీకరణ జరిగింది. తర్జనభర్జనల అనంతరం 830 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు.

ఏలూరు కాల్వతో మొదలు : విమానాశ్రయ విస్తరణ ప్రక్రియలో భూ సమీకరణకు సంబంధించి పెద్దగా ఎలాంటి ఇబ్బందుల్లేకపోయినా, ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. దాదాపు 400 ఎకరాలు ఏలూరు కాల్వ మళ్లింపు అవసరాల కోసం సమీకరించాల్సి రావడంతో, కాల్వ మళ్లింపును వ్యతిరేకిస్తున్న వారంతా భూ సమీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. కాల్వ మళ్లించడం వల్ల అదనపు భూమి సేకరించడంతో పాటు, గన్నవరం మండలంలో పలు గ్రామాలు చీలిపోవడం, వందల నివాసాలు తొలగించాల్సి వస్తున్నందున ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని వీరంతా డిమాండ్‌ చేస్తూ వచ్చారు. రన్‌వే విస్తరణకు అధికారులు మూడు ప్రతిపాదనలు రూపొందించిన క్రమంలో ఏలూరు కాల్వ మళ్లించకుండా ఉన్న మొదటి ప్రతిపాదనను ఖాయం చేయాలనేది వీరి విజ్ఞప్తిగా ఉంది. అయితే భవిష్యత్తులో ఏలూరు కాల్వ జల రవాణా మార్గంగా మారే అవకాశం ఉన్నందున ఏలూరు కాల్వను మళ్లించడమే మేలని నిపుణులు సూచించడంతో చాలాకాలం ప్రతిష్టంభన నెలకొంది.

నిర్వాసితుల వైపే మొగ్గు: ఏలూరు కాల్వ మళ్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టడంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు ముఖ్యమంత్రిని, ఇతర పెద్దల్ని కలిసి కాల్వ మళ్లింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవంక రైతులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. గన్నవరం నియోజకవర్గంలో వేల ఎకరాల భూ సేకరణ జరిగినా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరిగిపోగా, ఒక్క ఈ విషయంలోనే తకరారు ఏర్పడింది. రైతులు ఏమాత్రం సమ్మతి తెలపని తరుణంలో ఎమ్మెల్యే వంశీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, నిపుణులతో చర్చలు సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన్ను విరమించుకోవాలని, జల రవాణాకు అవసరమైతే ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని ముఖ్యమంత్రి చెప్పడంతో వివాదానికి తెరపడింది.

ప్లాట్ల కేటాయింపుపై గందరగోళం: సమీకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయినట్లేనని అందరూ భావించిన తరుణంలో, నిర్వాసితులకు అమరావతి పరిధిలో ఇచ్చే ప్లాట్ల కేటాయింపుపై గందరగోళం ఏర్పడింది. అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇస్తున్నారంటూ ఇటీవల రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. మొదట్లో తమకు రాజధాని నుంచి విజయవాడ మధ్యలో భూములిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు కేటాయింపు భిన్నంగా ఉందంటూ వీరు ఆందోళన బాట పట్టడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

రైతులు ఖుషీ: నిర్వాసితులు కోరినట్లుగా నిడమర్రు, కొరగల్లు గ్రామాలను ప్లాట్ల కేటాయింపు నుంచి మినహాయించడం, భూములిచ్చిన రైతులందరి పేర్లతో విమానాశ్రయంలో శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్‌ హామీనిచ్చారు. దీంతో పాటు అవకాశాన్ని బట్టి రైతులందరూ సింగపూర్‌ పర్యటనకు వెళ్లేలా ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నిర్వాసితులంతా సంతృప్తి చెంది ఆందోళన విరమించారు.

ముఖ్యమంత్రిదే ఘనత: వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గన్నవరం నియోజకవర్గంలో భూ సేకరణ జరిగింది. పోలవరం కుడికాల్వ, విమానాశ్రయం విస్తరణ, మల్లవల్లి పారిశ్రామిక వాడ ఇందులో చాలా కీలకమైనవి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా వ్యవహరించి, రైతులకు సంతృప్తికరంగా ఉండేలా పరిహారం ఇచ్చారు. స్థిరాస్తి దళారులు లేనిపోని గందరగోళం సృష్టించడం, ప్రతిపక్షాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం వలనే విమానాశ్రయ నిర్వాసితులు అపోహలకు లోనయ్యారు. ఇప్పుడు వారికి ఆమోదయోగ్యంగానే ప్లాట్ల కేటాయింపు జరగనుంది.

ఇరువురి చొరవ
సమీకరణ సాఫీగా జరిగిందనుకుంటున్న తరుణంలో రైతులు ఆందోళనకు దిగడంతో సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌లు చొరవ తీసుకున్నారు. రైతులతో కలిసి సీఆర్డీఏ కార్యాలయంలో ఈనెల ఏడో తేదీన సమావేశం ఏర్పాటు చేసి అమరావతి స్వరూపం, ప్లాట్ల కేటాయింపుపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. దీంతో పాటు ప్లాట్లు కేటాయించే గ్రామాల్లో క్షేత్ర సందర్శనకు రైతులకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత రైతులు అంగీకారం తెల్పడంతో సమస్య సామరస్యంగా పరిష్కారమైంది.

Link to comment
Share on other sites

IndiGo to operate bi-weekly Vijayawada-Singapore service

author-deafault.png Tharun BodaVIJAYAWADA
August 16, 2018 01:04 IST
Updated: August 16, 2018 01:04 IST
 

Tentative plan is to launch flight service in early October

IndiGo, which recently made the Vijayawada airport as a hub for its aircraft, has come forward to operate bi-weekly service to Singapore responding to a tender call by the Andhra Pradesh Airports Development Corporation Ltd (APADCL).

This takes the State’s ambitious plan of starting an international flight service from the airport in the capital Amaravati a step closer to fruition.

“The tendering process has been completed and the airlines came forward to fly on the new sector. The State government has in principle approved the deal and assured it the Viability Gap Funding (VGF). We are awaiting the formal approval and modalities from the government before signing the final agreement. Tentatively the service will be launched on October 2,” APADCL chief executive officer Virender Singh told The Hindu.

“Though the airline was not keen initially it came in after the tender call that assured the VGF,” Mr. Singh said.

According to its aviation policy, the State provides VGF if the airline fails to get at least 50% occupancy on the specified sector. “We are confident that every flight will have 60-70% occupancy and no funding may be required. But the VGF would take care of the losses, if any.” Once the agreement is signed, the timings of the scheduled flights would be decided.

With the city airport not being included in the bilateral air service agreements by the Centre yet, the outset of international services got allegedly stalled and the Corporation has planned to run unscheduled chartered flights by hiring an airline that could run the business on its behalf.

The inordinate delay has dashed the hopes of the State which is expecting to have direct flights to destinations in West Asia.

Chief Minister N. Chandrababu Naidu had in June announced that the Vijayawada-Singapore service would be launched soon. Earlier it was also announced that Singapore’s SilkAir would be operating unscheduled flights as per the State’s requirement.

A domestic carrier could operate international services from Vijayawada without special permissions.

Declared as an international airport in 2017, the city airport now has facilities like immigration and customs counters and security in place to handle international traffic.

 
Link to comment
Share on other sites

నదీతీర ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు వరద ముప్పు
20-08-2018 10:19:58
 
636703572001596884.jpg
న్యూఢిల్లీ : నదీతీర ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలకు వరద ముప్పు పొంచి ఉందని తేలింది. తాజాగా కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయం పెరియార్ నదీతీరానికి సమీపంలో నిర్మించడంతో భారీవర్షాల వల్ల ఈ నదీ పొంగి ప్రవహించడంతో దీని చెంత ఉన్న విమానాశ్రయం రన్ వే నీట మునిగింది. వరదనీట మునగడంతో కొచ్చి విమానాశ్రయాన్ని అత్యవసరంగా మూసివేయాల్సి వచ్చింది. కొచ్చి విమానాశ్రయం ఘటనతోనైన పాఠాలు నేర్చుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ముంబై, చెన్నై విమానాశ్రయాలు నదీ తీర ప్రాంతాల్లో నిర్మించక పోయినా వీటి రన్ వేలను విస్తరించడం వల్ల ఇవి కాస్తా నదీతీరానికి సమీపంలోకి వెళ్లాయి. దీంతో ముంబై విమానాశ్రయం 2005లో కురిసిన భారీవర్షాల వల్ల వరదనీరు పోటెత్తడంతో విమానాశ్రయం రన్ వే నీట మునిగింది. 2015లో చెన్నైను ముంచెత్తిన వరదల్లో భాగంగా వరదనీరు విమానాశ్రయ రన్ వేపైకి రావడంతో విమానాల రాకపోకలను అప్పట్లో నిలిపివేశారు.
 
విమానాశ్రయాల్లో వరదనీరు వెల్లువెత్తిన నేపథ్యంలో నవీ ముంబైలో కొ్త్తగా నిర్మించనున్న విమానాశ్రయం ఉల్వే నదీతీరంలో నిర్మించవద్దని నిపుణులు సూచించారు. విమానాశ్రయం రన్ వే కోసం కనీసం నాలుగు కిలోమీటర్ల భూమి అవసరం. కొచ్చి విమానాశ్రయంలో చెంగాల్ కాల్వను మళ్లించక పోవడంతోనే వరదలు వెల్లువెత్తుతున్నాయిన సియల్ మేనేజింగ్ డైరెక్టరు వీజే కురియన్ వ్యాఖ్యానించారు. గోవా విమానాశ్రయం నదీ తీరంలో ఉన్నప్పటికీ రన్ వైకి ఇరువైపులా వర్షపు నీరు వెళ్లేందుకు వీలుగా డ్రెయిన్ లు నిర్మించారు. దీంతో వరదనీరు గోవా విమానాశ్రయాన్ని ముంచెత్తలేదు. కొచ్చి, చెన్నై, ముంబై విమానాశ్రయాలకు వరదనీరు పోటెత్తిన నేపథ్యంలో దేశంలో కొత్తగా నిర్మించనున్న వంద విమానాశ్రయాల నిర్మాణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నదీతీర ప్రాంతాలకు దూరంగా విమానాశ్రయాలు నిర్మించాలని జలవనరుల నిపుణులు చెపుతున్నారు.
2224442.jpg
Link to comment
Share on other sites

గన్నవరం రైతులకు రాజధానిలో ప్లాట్లు
21-08-2018 10:52:51
 
636704455730822200.jpg
  • విమానాశ్రయ విస్తరణకు భూములు ల్యాండు పూలింగ్‌కు..
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
తుళ్లూరు/గుంటూరు: గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల వద్ద తీసుకున్న భూమికి ప్రతిగా రాజధానిలో ప్లాట్లను కేటాయించారు. ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం సోమవారం తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కించి లాటరీ విధానంతో ప్లాట్లను కేటాయించారు.
 
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించటానికి సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు. అందుకు కావల్సిన భూమిని గన్నవరం మండలం అజ్జంపూడి, అల్లాపురం, బుద్దవరం, చిన ఆవుటపల్లి, కేసరపల్లి గ్రామాల రైతుల నుంచి స్వీకరించాల్సి వచ్చింది. భూసేకరణ చేయాలని అధికారులు భావించారు. అయితే సేకరణ అయితే వద్దని రైతులు వారించారు. గత ప్రభుత్వంలో విమానాశ్రయ విస్తరణ చేస్తున్నామని చెప్పి భూముల విలువ తక్కువ చేసి లెక్క కట్టారని.. అందుకే అక్విజేషన్‌కు ఒప్పుకోబోమన్నారు. రాష్ట్ర విభజన జరగటంతో గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌గా మార్చాల్సి అవశ్యకత ఏర్పడింది.
 
దీంతో రైతుల ముందు ల్యాండు పూలింగ్‌ ప్రతిపాదన తెచ్చారు. రాజధానిలో ప్లాట్లు ఇచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రైతులను ఒప్పించి, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్ళారు. చంద్రబాబు కూడా రైతులకు హామీ ఇవ్వటంతో విమానాశ్రయినికి భూమి సమకూరింది. పట్టాభూమి 707.59 ఎకరాలు అసైన్‌డ భూమి 3.69 ఎకరాలు, ప్రభుత్వ భూమి 120.41 ఎకరాలు, మొత్తం కలిపి 837 ఎకరాలు సమీకరణ(ల్యాండు పూలింగ్‌) కింద సీఆర్డీయే అధికారులు నోటిఫై చేసారు. ఆయా గ్రామాల రైతులు 718 మంది నుంచి తీసుకోవాల్సి ఉందని గుర్తించారు. రాజధానిలో ప్లాట్లు ఇస్తారనటంతో గన్నవరం ఏరియాలో బయట నుంచి వచ్చిన రైతులు భూమిని గొనుగోలు చేయటంతో రైతుల సంఖ్య 1,507కి వెళ్లింది. వారందరికి సీఆర్డీయే పరిధిలో ఉన్న మల్లవల్లి ప్రాంతంలో ఇస్తారనే అపోహలు సృష్టించటంతో రైతులు ఆందోళన చెందారు. రైతుల ఆందోళనను పటా పంచలు చేస్తూ సోమవారం రైతులకు ప్లాట్లను కేటాయించారు. గతవారం గన్నవరం రైతులు రాజధానిలో వారికి కేటాయించే ప్లాట్ల ప్రదేశాలను పరిశీలించి, నిర్మాణ పనులను కళ్లారా చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాజధానిలో ఐదు ప్రదేశాల్లో గన్నవరం రైతులకు 718 నివాస ప్లాట్లు, 479 వాణిజ్య ప్లాట్లు, విల్లా టైపు -1 కింద48. విల్లా టైపు-2 కింద 54 ప్లాట్లను కేటాయించారు.
 
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ రైతుల్లో కొంత అపోహాలు సృష్టించటంతో ఆందోళన చెందరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు రాజధానిలో ప్లాట్లు కేటాయించటం అందరికీ సంతోషంగా ఉందని చంద్రబాబు మీద నమ్మకంతోనే భూములను రైతులు ఇచ్చారని చెప్పారు. కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ గన్నవరం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాజధానిలో ప్లాట్లు కేటాయించామన్నారు. భూములిచ్చిన రైతులకు కమిషనర్‌ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నూజివీడు ఆర్డీవో, సీఆర్డీయే ల్యాండ్సు డైరెక్టర్‌ చెన్నకేశవరావు, ప్లానింగ్‌ అధికారి నాగేశ్వరావు, ఐటీ సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్లాట్లు కేటాయించటంతో గన్నవరం రైతులు ఆనందం వ్యక్తం చేసారు. వారి ఆనందం వారి మాటల్లోనే...
 
 
చంద్రబాబు పై నమ్మకంతోనే..
తల్లి లాంటి భూమి సీఎం మీద నమ్మకంతోనే ఇచ్చాం. 1956 నుంచి ఈ భూములను సాగు చేసుకుంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి కోసం సీఎం చేస్తున్న కృషి చూసి ఎంతో అనుభంధం ఉన్న నా భూమి ఏడు ఎకరాలను విమానాశ్రయ విస్తరణకు ఇచ్చాను. ప్రతిగా రాజధానిలో మమ్మల్ని భాగస్వాముల్ని చేస్తూ ప్లాట్లు కేటాయించటం సంతోషంగా ఉంది.- గూడవల్లి నాగేశ్వరావు, బుద్దవరం రైతు
 
 
అభివృద్ధికి సహకరించాలనే..
సీఎం చేస్తున్న అభివృద్ది కళ్లారా కనబడుతోంది. భూములిచ్చి అభివృద్ధికి మావంతు సహకారం ఇవ్వటం కోసమే సీఎం మీద నమ్మకంతో ఇచ్చాం. రాజధానిలో ప్లాట్లు ఇవ్వరని మధ్యలో అపోహలు సృష్టించారు. కాని సీఎం హామీ, ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన మాట మీద మాకు నమ్మకం ఉంది. 4.9 ఎకరాలు ఇచ్చాను. రాజధానిలో ప్లాట్లు ఇవ్వటం ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది.- నాయిని ప్రభాకరరావు, బుద్దవరం రైతు
 
Tags : gannavaram, AP capital, amaravathi
Link to comment
Share on other sites

కీలక నిర్ణయం తీసుకున్న ‘ఇండిగో’ విమానయాన సంస్థ
22-08-2018 08:52:06
 
636705247290069558.jpg
  • అక్టోబరు నుంచి నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ సర్వీసు
  • వెబ్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేపట్టిన ఇండిగో
  • రోజూ సాయంత్రం నాలుగు గంటలకు..
  • టిక్కెట్‌ ధర రూ.5,316
  • విజయవాడ నుంచి ఢిల్లీకి నాలుగో సర్వీసు
  • ఎయిర్‌ ఇండియా మూడు సర్వీసులు
విమానాల కొరతతో ‘ఎయిర్‌ ఇండియా’ అల్లాడుతున్న తరుణంలో.. ఢిల్లీ రూట్‌పై దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ కన్నేసింది. యుద్ధ ప్రాతిపదికన అంతర్గత సర్వే నిర్వహించి దేశ రాజధానికి విమాన సర్వీసు నడపటానికి రంగం సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టు అధికారులకు దీనిపై ఇంకా సమాచారం ఇవ్వకపోయినా అక్టోబర్‌ నుంచి ఢిల్లీకి సర్వీసు నడపటానికి ఇండిగో సంస్థ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఏకంగా తన వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ నెల నుంచి బుకింగ్‌కు కూడా అవకాశం కల్పించింది. మరికొద్ది రోజుల్లో అధికారికంగా తమ విమాన సర్వీసుపై ఇండిగో అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.
 
 
విజయవాడ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా మాత్రమే విమాన సర్వీసులు నడుపుతోంది. ఇటీవల కాలంలో విజయవాడ రూట్‌లో వారంలో ఏడు రోజుల పాటు నడపాల్సిన విమానాలను నాలుగు రోజుల చొప్పున కుదించి నడుపుతోంది. మరో నెల రోజుల్లో ఈ సమస్య నుంచి బయట పడతామని ఎయిర్‌ ఇండియా ప్రకటిస్తూ వస్తోంది. ఇదే తరుణంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఢిల్లీకి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే ఢిల్లీకి విమాన సర్వీసు నడిపే విషయంలో తమ బృందం చేత అధ్యయనం చేయించింది. ఢిల్లీకి ముందుగా ఒక సర్వీసు ఎక్కడా స్టాప్‌ లేకుండా నేరుగా నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్‌ 1 నుంచి బుకింగ్స్‌ కూడా ఇప్పటి నుంచే చేపడుతోంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్‌కు అవకాశం కల్పించింది. ప్రారంభ ధర రూ.5,316గా ప్రకటించింది. నూతన సర్వీసును ప్రారంభిస్తున్న సమాచారాన్ని ఇంతవరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విజయవాడ విమానాశ్రయ అధికారుల దృష్టికి అయితే తీసుకు రాలేదు.
రోజూ సాయంత్రం 4 గంటలకు..రోజూ సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీకి విమానాన్ని నడపాలని ఇండిగో విమానయానసంస్థ నిర్ణయించింది. సాయంత్రం 3.45 గంటలకు విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి 4 గంటలకు ఈ విమానం బయలు దేరుతుంది. సాయంత్రం సమయంలో ముందుగా ఢిల్లీకి బయలుదేరాలనుకునే వారికి ఈ విమాన సర్వీసు సౌకర్యవంతంగా ఉంటుంది.
 
ఢిల్లీకి నాలుగో సర్వీసు..
విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిచే విమాన సర్వీసుల సంఖ్య మొత్తం నాలుగుకు చేరింది. ఎయిర్‌ ఇండియా సంస్థ మొత్తం మూడు సర్వీసులను నడుపుతోంది. ఉదయం 9.10 నిమషాలకు ఒకటి, సాయంత్రం 5.20 గంటలకు ఒక సర్వీసు, రాత్రి 9.10 గంటలకు మరో సర్వీసు చొప్పున నడుపుతోంది. ఈ సర్వీసులకు తోడు ఇండిగో విమాన సర్వీసు కూడా జతకూడటంతో విజయవాడ నుంచి ఢిల్లీకి నాలుగు సర్వీసులతో మెగా రూట్‌గా ఉంది.
 
ఎయిర్‌ ఇండియా మోనోపలీకి చెక్‌
విజయవాడ - ఢిల్లీ రూట్‌లో ఎయిర్‌ ఇండియా మోనోపలీ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ రూట్‌లో ఇదే సంస్థ సర్వీసులను నడపటంతో ధరలు ఆకాశంలో ఉంటున్నాయి. రూ.7 వేల నుంచి రూ.30 వేల వరకు టిక్కెట్‌ ధరలు ఉంటున్నాయి. రద్దీ సీజన్‌లో అయితే మరీ దారుణంగా ఉంటోంది. ఇప్పటివరకు ఇండిగో విజయవాడ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు తక్కువ ఖర్చుతో కూడుకున్న విమాన ప్రయాణం అందిస్తోంది. దీంతో ఆయా రూట్లలో మిగిలిన సంస్థలు కూడా ధరలను సవరించుకోవాల్సి వచ్చింది. తాజాగా ఢిల్లీ రూట్‌లో కూడా ఎయిర్‌ ఇండియా ధరలను సవరించుకునే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...