Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
సింగపూర్‌ ఫ్లైట్‌పై ప్రతిష్ఠంభన
08-07-2018 08:33:02
 
636666355807578997.jpg
  • కేంద్రం నుంచి అందని సహకారం
  • అనుమతులివ్వని డీజీసీఏ
  • కేరళ, గోవా, తమిళనాడుల్లో అనుమతులు
  • పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం
సింగపూర్‌కు ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసు నడిపే విషయం ప్రతిష్ఠంభనలో పడింది? అన్నీ అనుకూలిస్తే.. ఈ నెల మొదటి వారంలో సింగపూర్‌కు విమానం నడవాల్సింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అవాంతరాలు తలెత్తుతున్నాయి.
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
నవ్యాంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని ప్రాంతానికి తలమానికంగా ఉన్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు చార్టర్డ్‌ విమానాలను నడపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లోపిస్తోంది. పర్యాటకులు, రాజధాని నిర్మాణ అవసరాలను రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే స్వయంగా సింగపూర్‌కు చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపాలని నిర్ణయించింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఏడీసీఎల్‌) ద్వారా నడపటానికి ఔత్సాహిక సంస్థల కోసం టెండర్లను కూడా పిలిచింది. అందులో భాగంగా అనుమతుల కోసం డీజీసీఏను కోరగా ఇప్పటి వరకు రాలేదు. దేశీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతులు ఇవ్వలేమని చెబుతున్న డీజీసీఏ కేరళ, గోవా, తమిళనాడులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ ఇవ్వగా విజయవాడ నుంచి ఇవ్వటానికి సమస్య ఏమిటో అర్థం కాని పరిస్థితి. కేరళ, గోవా, తమిళనాడులకు పర్యాటకుల రాకపోకలు అదికంగా ఉంటాయి కాబట్టి.. అనుమతులిచ్చినట్లుగా వాదనలు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
 
 
ఇబ్బందికర నిబంధనలు
చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి నిర్దిష్ట ప్రాంతానికి వెళ్లే ప్రయాణికుల మొత్తం సంఖ్యను ఒక గ్రూపుగా నిర్ణీత గమ్యస్థానానికి చేర్చి.. తిరిగి వారిని తీసుకు రావటమే చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ ఉద్దేశ్యం. దీనిని బట్టి సింగపూర్‌కు సమూహంగా బయలుదేరాల్సి ఉంటుంది. తిరిగి అదే సమూహాన్ని తీసుకు రావాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి ఆ పరిస్థితి ఉండదేమోనన్న అనుమానాలను డీజీసీఏ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపున తాము చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపటానికి అనుమతులు కోరుతున్నామని ఏపీఏడీసీఎల్‌ అధికారులు తాజాగా డీజీసీఏ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రభుత్వాల తరపున చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపటానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కూడా డీజీసీఏ నుంచి అనుమతులు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే చార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపాలని నిర్ణయించటం మంచిదే. టికెట్‌ ధర నియంత్రణ కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ కంటే కూడా విజయవాడ నుంచి తక్కువకే ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం భావించింది. విజయవాడ విమానాశ్రయ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చాయి. ఈ దశలో డీజీసీఏ నుంచి అనుమతులు రాకపోవటం ఇబ్బంది కరంగా మారింది.
 
 
దుబాయ్‌కూ ఎగరని ఎయిర్‌ ఇండియా
ఇప్పటికే కేంద్ర సహకార లేమితో విజయవాడ నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసు కలగానే మిగిలిపోయింది. ముంబైకి విమనా సర్వీసు నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఇమిగ్రేషన్‌ ఏర్పడిన తర్వాత దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులు నడుపుతానని చెప్పింది. తీరా వచ్చాక ఈ సంస్థ వెనుకడుగు వేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌ గజపతిరాజు రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖ నుంచి కూడా సహకారం రావటం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా జంపింగ్‌ ఫ్లైట్స్‌కు అనుమతులు ఇవ్వలేమని డీజీసీఏ తేల్చటంతో దుబాయ్‌ సర్వీసు కథ ముగిసింది. ఇప్పుడు సింగపూర్‌కు విమాన సర్వీసు పరిస్తితి కూడా అయోమయంగానే ఉంది.
Link to comment
Share on other sites

రన్‌వే విస్తరణకు అడ్డంకిగా మారిన రోడ్డు
10-07-2018 07:20:34
 
636668040338026565.jpg
  • రన్‌వే విస్తరణ పనులపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష
  • 300 మీటర్ల మేర విస్తరణకు అడ్డంకిగా ఉన్న రోడ్డు
  • సత్వరమే ఆర్‌అండ్‌బీ ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలి
  • ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ గృహ నిర్మాణాలను పూర్తిచేయాలి
  • పది రోజులలో హైటెన్షన్‌ లైన్ల తొలగింపునకు ఆదేశాలు
విజయవాడ: విమానాశ్రయ రన్‌వే విస్తరణకు సంబంధించి వివిధ శాఖలు తలపెట్టాల్సిన పనులను తక్షణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతం ఆదేశించారు. రన్‌వే విస్తరణ పనులు పూర్తి చేయటానికి ఇప్పటికే జాప్యం జరిగిందని తక్షణం శాఖలన్నీ జూలై నెలాఖరుకు అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సోమవారం గన్నవరంలోని విమానాశ్రయ సమావేశ మందిరంలో రన్‌వే విస్తరణ పనులపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావుతో కలిసి కలెక్టర్‌ లక్ష్మీకాంతం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌కో, ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రన్‌వే విస్తరణ పనులకు సంబంధించి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ముందుగా తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. రన్‌వే విస్తరణ పనులు ఎండింగ్‌ వరకు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుత పాత రన్‌వే, నూతన రన్‌వేకు మధ్యలో 300 మీటర్ల మేర రన్‌వే పనులకు అర్‌అండ్‌బీ రోడ్డు ఓపెన్‌ చేసి ఉండటం వల్ల పురోగతిలో ఉండటం లేదని చెప్పారు. కాలువ మళ్ళింపు, విద్యుత్‌ లైన్ల షిఫ్టింగ్‌, నీటి పైపులైన్లు తొలగింపు చేపడితే త్వరితగతిన పూర్తి చేయగలమన్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ ఇప్పటికే విస్తరణ పనులు ఆలస్యం జరిగాయని, ఇక మీదట వేగంగా జరగాలన్నారు. బుద్దవరం రోడ్డు పనులను తక్షణం పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈను కలెక్టర్‌ ఆదేశించారు.
 
గన్నవరం నుంచి పుట్టగుంట వరకు రోడ్డు పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆయా యజమానులతో చర్చించి సత్వరం పరిష్కరించాలని నూజివీడు ఆర్‌ర్డీవో సీ హెచ్‌ రంగయ్య, గన్నవరం తహసీల్దార్‌ మాధురిలను ఆదేశించారు. పది రోజులలో హైటెన్షన్‌ లైన్లను తొలగించాలని ట్రాన్స్‌కో ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. అల్లాపురం, దావాజీగూడెం గ్రామస్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలన్నారు. తాగునీటి కాల్వల డ్రెయినేజీ పనులను ఇరిగేషన్‌ డ్రెయినేజీ ఇంజనీర్లు తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌లో నిర్మించాల్సి ఉన్న గృహ సముదాయాలను పూర్తి చేయాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని గృహ నిర్మాణ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రన్‌వే విస్తరణ పనులకు సంబంధించి పూర్తి స్థాయి నిధులను విడుదల చేయటం జరుగుతుందని, పనులు మాత్రం జూలై 31 లోపు పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్‌ ఆదేశించారు.
 
 
రూ. 1.30 కోట్లతో ఏఏఐ సీఎస్‌ఆర్‌ పనులు
సామాజిక బాధ్యతగా విజయవాడ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు విమానాశ్రయ పరిసర గ్రామాలో రూ. 1.30 కోట్ల వ్యయంతో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ప్రణాళికలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జీ మధుసూదనరావు , కలెక్టర్‌ బాలయ్యనాయుడు లక్ష్మీకాంతానికి అందచేశారు. చినఅవుటపల్లి గ్రామంలో రూ. 52.50 లక్షల వ్యయంతో 300 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు, 2.5 కిలోమీటర్ల మేర పైపులైన్ల పనులు చేపడుతున్నట్టు ఏపీడీ మదుసూదనరావు, కలెక్టర్‌కు వివరించారు. గన్నవరం కోనాయి చెరువు, పార్కు అభివృద్ధికి రూ. 39.76 లక్షలను ఖర్చుచేస్తున్నట్టు చెప్పారు. ఫెన్సింగ్‌ పనులు, వాకింగ్‌ ట్రాక్‌ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. బుద్ధవరం గ్రామంలో రూ. 31.74 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం చే పడుతున్నట్టు చెప్పారు. కేసరపల్లిలో డస్ట్‌బిన్లు, కుట్టుమిషన్ల పంపిణీకి 1.92 లక్షలు, అల్లాపురంలో డస్ట్‌బిన్లు, ట్రీగార్డులు, రెండు రిక్షాల కోసం 2.37 లక్షలను, అజ్జంపూడిలో చెత్త తరలించే రిక్షాలు, ట్రీగార్డులు, డస్ట్‌బిన్లు కొనుగోలుకు 2.20 లక్షల నిధులను ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.
Link to comment
Share on other sites

రన్‌వే.. లక్ష్యం చేరుతుందా..!
అంతర్జాతీయ సర్వీసులకు ఇదే కీలకం
అడ్డంకుల తొలగింపులో తీవ్ర జాప్యం
ఆయా శాఖల నిర్లక్ష్యంతో పనులపై ప్రభావం
ఈనాడు, అమరావతి
amr-top2a.jpg
గన్నవరం విమానాశ్రయం రన్‌వే విస్తరణ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం నుంచి ప్రారంభించాలంటే.. రన్‌వే అత్యంత కీలకమైనది. రన్‌వే విషయంలోనే ప్రధానంగా విమానయాన సంస్థలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత త్వరగా పనులను చేపడితేనే.. అనుకున్న లక్ష్యంలోగా రన్‌వేను పూర్తిచేసేందుకు అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణను రెండేళ్ల కిందటే యుద్ధప్రాతిపదికన చేపట్టింది. భూముల్లో ఉన్న సమస్యలు, అడ్డంకులను పరిష్కరించడంలో ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు జాప్యం చేస్తుండడంతో రన్‌వే విస్తరణ పనులు మందగించాయి. ప్రధానంగా రన్‌వే విస్తరణ జరుగుతున్న మార్గంలో ఉన్న కాలువలు, రోడ్ల మళ్లింపులు, పనులు జరుగుతున్న భూములకు సంబంధించి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారం, నిర్వాసితులకు పునరావాసం కల్పించి వేరేచోటికి తరలించడం, హైటెన్షన్‌ విద్యుత్తు తీగలను తొలగించడం.. వంటి విషయాల్లో జాప్యం జరుగుతుండడంతో రన్‌వే విస్తరణ పనులు చేపట్టేందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నడిచేందుకు కీలకమైన సమయమిది. విమానాశ్రయంలో విదేశాలకు సర్వీసులను నడిపేందుకు అవసరమైన కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌, భద్రతా ఏర్పాట్లు, మౌలికసౌకర్యాలు అన్నింటితో టెర్మినల్‌ భవనం సిద్ధంగా ఉంది. కానీ.. విమానయాన సంస్థలు ముందుకు రావాలంటే.. భారీ విమానాలు తిరిగేందుకు  అనువైన రన్‌వే అత్యంత కీలకం. విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను ప్రకటించి ఏడాదిన్నర కావస్తోంది. రన్‌వే విస్తరణ విషయంలో ప్రత్యేక దృష్టిసారించకపోతే.. అంతర్జాతీయం కల సాకారం మరింత జాప్యమవుతుంది.

గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ప్రభుత్వం 700 ఎకరాలను కొత్తగా సేకరించింది. గతంలో ఉన్న 500 ఎకరాలతో కలిపితే.. 1200కు విమానాశ్రయం విస్తరించింది. రన్‌వే విస్తరణ కోసమే ఈ భూముల సేకరణ ప్రధానంగా చేపట్టారు. 2017 జనవరి 12న అప్పటి కేంద్రమంత్రి హోదాలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిసి రన్‌వే విస్తరణకు శంకుస్థాపన చేశారు. 2018 నవంబర్‌కు పనులను పూర్తి చేయాలని 21 నెలలు లక్ష్యంగా పెట్టారు. పనులు ప్రారంభంలో జోరుగానే సాగాయి. ముందుకు వెళుతున్న కొద్దీ మధ్యలో ప్రజలు వినియోగిస్తున్న రోడ్లుండంతో పనులు వాటి పైనుంచి చేపట్టడం కుదరడం లేదు. రోడ్లను మళ్లించడంలో అధికారులు ఆలస్యం చేయడంతో రన్‌వే విస్తరణ పనులపై ఆ ప్రభావం పడుతోంది. ప్రధానంగా బుద్ధవరం-కేశరపల్లి రహదారి మళ్లింపు పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం చేపడుతున్న గన్నవరం-పుట్టగుంట రహదారి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. దీనిలోభాగంగా ఏలూరు కాలువపై వంతెన సైతం నిర్మించాల్సి ఉంది. పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న మూడు ఆలయాలను వేరేచోట పునఃప్రతిష్టించాల్సి ఉంది. విద్యుత్తు హైటెన్షన్‌ లైన్లను తొలగించే పనులు సైతం ఇంకా సాగుతున్నాయి. 2017 మార్చిలో అప్పటి కలెక్టర్‌ బాబు.ఎ సమీక్ష సమావేశం నిర్వహించి హెచ్‌టీ విద్యుత్తు లైన్లను వేరేచోటికి త్వరగా మార్చాలని సూచించారు. పనులు అప్పటినుంచి జరుగుతున్నా.. త్వరితగతిన పూర్తిచేయడం లేదు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కాలువల మళ్లింపు పనులు సైతం జాప్యం జరుగుతున్నాయి. కాలువల మళ్లింపు చేపడుతున్న ప్రాంతంలోని నిర్వాసితులకు పునరావాసం, పరిహారం ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ పనులు ఎంత త్వరగా చేపడితే.. రన్‌వే విస్తరణ అంత వేగవంతమవుతుంది.

amr-top2b.jpg
అడ్డంకులు తొలగించాలని ఆదేశాలు..: విమానాశ్రయ రన్‌వే విస్తరణపై కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. విమానాశ్రయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో విమానాశ్రయ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు, రెవెన్యూ, జలవనరులు, ఆర్‌అండ్‌బి సహా సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. బుద్ధవరం రోడ్డు పనులను జులై 31లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఈని ఆదేశించారు. గన్నవరం-పుట్టగుంట రహదారి పనులను సైతం త్వరగా పూర్తిచేయాలన్నారు. న్యాయస్థానంలో ఉన్న కేసులపై సంబంధిత యజమానులతో మాట్లాడి పరిష్కరించాలని నూజివీడు ఆర్డీవో రంగయ్య, గన్నవరం తహసీల్దారు మాధురికి సూచించారు. హైటెన్షన్‌ విద్యుత్తు లైన్లను పది రోజుల్లోగా తొలగించాలని ట్రాన్స్‌కో ఇంజినీర్లను ఆదేశించారు. అల్లాపురం, బావాజీగూడెం వాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. కాలువల మళ్లింపులోనూ జాప్యం చేయకుండా సత్వరం పూర్తిచేయాలన్నారు. మూడు ఆలయాలను వేరేచోట పునఃప్రతిష్టించే కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. పునరావాసం కింద నిర్మించే ఇళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలని హౌసింగ్‌ అధికారును ఆదేశించారు. వీటన్నింటికి అవసరమైన అనుమతులను వెంటనే జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. మళ్లీ 15 రోజుల్లోగా సమావేశమై పురోగతిపై చర్చించనున్నట్టు వెల్లడించారు.
 
 

 

Link to comment
Share on other sites

Vijayawada: Soon, get your online orders delivered in 24 hours

If agreements are confirmed, all aircraft belonging to various airlines together can carry a combined cargo of 20 tonnes a day, says Shreepa’s operations manager.

Published: 10th July 2018 05:37 AM  |   Last Updated: 10th July 2018 05:37 AM   |  A+A-

ORDERS.jpg
By Express News Service

VIJAYAWADA: As the cargo terminal at Gannavaram airport is set to be functional from July 16, Shreepa Logistics, the agency in-charge of cargo is looking to rope in express courier services to speed up delivery of goods in 24 hours as against two to three days it takes now.

“If anyone in Vijayawada orders products online, it takes at least two days for them to reach the buyers. Now, that the cargo service is all set to become functional, express courier service companies can now export their products through us,” said Prashant Kumar, Shreepa’s operations manager, Vijayawada.
Till date, Shreepa has confirmed agreements with SpiceJet and Air India for cargo services, while talks are on with Indigo and TruJet. Airport Director G Madhusudhan Rao has confirmed that Indigo will operate flights from September from Gannavaram airport. “Indigo has commissioned Airbus to operate four large aircrafts from Gannavaram airport, starting September,” he said.

“If the agreements are confirmed, all the aircraft belonging to various airlines together can carry a combined cargo of 20 tonnes a day,” said Prashanth.Until now, products reach Hyderabad by air and thence to Vijayawada by road. Once cargo terminal at Gannavaram becomes functional, the products will reach Vijayawada by air and customers within 24 hours.

A source from a leading courier company told Express that the schedule for the flights that are to carry cargo must be after six in the evening as that is when express service cargo is transported.Since agricultural and aqua produce is currently being imported to Vijayawada via Hyderabad, Shreepa Logistics is planning to give them a boost. “We are in talks with aquaculture companies to export their products to international destinations once international flight services begin from Gannavaram,” said Prashanth.

However, the airport director did not confirm when international flight services are to start from Gannavaram as talks are going on with airlines in the Middle East. “I cannot confirm when flight services will start but I have had talks with a number of parties who are interested,” said Rao.

“We are waiting for international services to start since we are currently exporting aqua produce to Middle Eastern countries such as Saudi Arabia and UAE through Hyderabad. If international services start from Gannavaram, we will benefit along with our farmers,” said G Rambabu, owner of Harika Sea Foods, which exports shrimp, sea tiger, sea white, and kingfish.

“We are also planning to invite farmers to seminars and educate them about the benefits of the cargo terminal. We will set up deals between them and buyers directly. This is vital as farmers are being cheated by middlemen. Now, we will help them avoid dealing with middlemen and directly do business with buyers from other states. Local products like Guntur chilli and mangoes will be sent to other states. Vegetables and fruit cultivators will be our prime focus,” said Rama Rao. “We intend to create a syndicate of these farmers to boost exports,” said Prashanth.

Efforts on to boost air cargo

“We will soon have a meeting with the Telangana and Andhra Courier Service Associations. This will be after deals are inked with  airlines. We will discuss and decide the best schedule to transport express service cargo in flights,” he explained.  
“If all the deals go through smoothly, Vijayawada people will soon be able to get their online orders delivered within 24 hours. We also intend to expand the reach of these services to regions which are within 200-300 km radius of the city,” said Venkata Rama Rao, Managing Director of Shreepa Logistics.

Complete airport runway expansion works by month-end

Vijayawada: Collector B Lakshmikanth has directed officials concerned to complete Gannavaram airport runway expansion works by month-end. Holding a review meeting with the officials here on Monday, he instructed the R&B AE to complete road works by Wednesday.

Link to comment
Share on other sites

ఎయిర్‌ ఇండియాకు విమానాల కొరత..!
16-07-2018 08:52:55
 
636673279761168181.jpg
  • ఢిల్లీ, ముంబైలకు వారంలో ఒకరోజు కట్‌
  • ఆగస్టు 10 వరకే అంటున్న ఎయిర్‌ పోర్టు అథారిటీ
విజయవాడ: దేశ రాజధాని ఢిల్లీకి, ఆర్థిక రాజధాని ముంబైకి.. విజయవాడ నుంచి సర్వీసులు నడుపుతున్న ఎయిర్‌ ఇండియా ఇటీవల కాలంలో విమానాల కొరతను ఎదుర్కొంటోంది. దాంతో విజయవాడ నుంచి వారంలో ఒకరోజు ఢిల్లీ, ముంబైలకు విమానాలను రద్దు చేసింది. అయితే ఇది తాత్కాలికమేనని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. అధికారుల సమాచారం మేరకు విమానాల కొరత కారణంగా సర్దుబాటు చేస్తున్నామని కొద్దిరోజుల పాటు ఇబ్బందులు తప్పవని సంస్థ ప్రతినిథులు చెప్పినట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా సంస్థ విమానాలను నడుపుతోంది. ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబాయికి విమాన సర్వీసును నడుపుతోంది.
 
ఢిల్లీకి రోజుకు ఒకటి హైదరాబాద్‌తో లింక్‌ అయ్యేవిధంగా, మిగిలిన రెండు సర్వీసులు నేరుగా ఢిల్లీకి వెళతాయి. ఉదయం సమయంలో రెండు సర్వీసులు, సాయంత్రం ఒక సర్వీసు నడుస్తోంది. అలాగే ముంబాయికి ఉదయం ఒక సర్వీసు నడుస్తోంది. వారంలో ప్రతిరోజూ ఆయా ప్రాంతాలకు సర్వీసులు నడుస్తున్నాయి. వారంలో ఒక రోజు ఈ సర్వీసులను ఎయిర్‌ఇండియా దాని అనుబంధ సంస్థ ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు తగ్గించాయి. ప్రతి శనివారం సాయంత్రం వెళ్లే ఢిల్లీ విమాన సర్వీసును ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. ప్రతి మంగళవారం ముంబాయి విమాన సర్వీసును ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ రద్దు చేసింది.
 
 
విమానాల రద్దుపై సందేహాలు
విమానాల రద్దుపై అనేక సందేహాలున్నాయి. లాభాల్లో ఉన్న రూట్లలో విమానాలను రద్దు చేసే అవసరం ఏమొచ్చిందన్న వాదనలు వస్తున్నాయి. దుబాయ్‌, షార్జాలకు అంతర్జాతీయ సర్వీసు నడుపుతామని హామీ ఇచ్చి.. మాట తప్పిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌ గజపతిరాజు రాజీనామా చేసిన తర్వాత ఎయిర్‌ ఇండియా నుంచి విజయవాడకు ఎలాంటి సానుకూలతలు కనిపించటం లేదు. ముంబాయికి సర్వీసు రద్దు వెనుక కారణమేంటని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
 
ఎయిర్‌ ఇండియా విమానాలను రద్దు చేస్తే ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయంగా మిగిలిన సంస్థలు భర్తీ చేసే పరిస్థితి లేదు. ఆగస్టు 11వరకే అంటున్న అధికారులువిమానాశ్రయ అధికారులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎయిర్‌ ఇండియా అంతర్గత సర్దుబాట్ల ప్రకారం షెడ్యూల్‌లో అతి స్వల్పంగానే మార్పులు జరిగాయని, వారంలో ఒక్కరోజు మాత్రమే అదీ సాయంత్రాలలో ఢిల్లీకి విమాన సర్వీసు నిలిపివేయటం జరిగిందని పేర్కొంటున్నారు. ముంబైకి సర్వీసు ఒక్కరోజు మాత్రమే నిలిచిపోతుందని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆగస్టు 11 వరకే ఈ సమస్య ఉంటుందని, ఆ తర్వాత ఈ సమస్య ఉండదని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Worst explanation. I have booked tickets for my parents from Vijayawada-Delhi-London this 21st(Saturday morning) two months ago. One week ago received email saying that Flight cancelled due to operational reasons from Vijaywada to Delhi on that day. Needed to prepone the journey.

Link to comment
Share on other sites

Guest Urban Legend
అంతర్జాతీయ ప్రయాణం ఆమడదూరం 
గన్నవరం నుంచి విదేశీ ప్రయాణానికి నోచుకోని దుస్థితి 
  ద్వైపాక్షిక ఒప్పందాలపై కేంద్రం నిర్లిప్తత 
16ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించి ఏడాదిన్నరవుతున్నా విదేశీ విమానాల జాడైతే లేదు. ఐదారు నెలల క్రితం వరకు కొంత ప్రయత్నం జరిగినా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పదవికి అశోక్‌గజపతిరాజు రాజీనామాతో ప్రయత్నాలు పూర్తిగా చతికిలపడ్డాయి. అంతర్జాతీయ హోదా ప్రకటన వెలువడిన మూడు, నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాలు గన్నవరం నుంచి గాలిలోకి ఎగురుతాయని ప్రకటించిన కేంద్రం అన్నట్టుగానే మొదట్లో తగినన్ని నిధులు కేటాయించి పలు అనుమతులిచ్చింది. విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనాన్ని రూ.2.50 కోట్లు వెచ్చించి రెండు నెలల్లోనే అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు    అనువుగా తీర్చిదిద్దారు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ విభాగాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను జారీ చేశారు. ఈ రెండు విభాగాల అధికార యంత్రాంగం అనేకసార్లు విమానాశ్రయానికి వచ్చి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చింది. టెర్మినల్‌ భవనంలో భద్రతకు అవసరమైన సీసీ కెమెరాలు, ఆర్చ్‌వే మెటల్‌ డిటెక్టర్లు, మూడంచెల భద్రతా వ్యవస్థలను సిద్ధం చేశారు. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన సిబ్బందికి శిక్షణ అందించారు... ఇలా అన్నింటినీ విమానాశ్రయంలో సిద్ధం చేశారు. రన్‌వే సైతం అంతర్జాతీయ సర్వీసులు తిరిగేందుకు అనువుగానే ఉంది. రేపో మాపో విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తారన్న దశలో ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెదేపా వైదొలడంతో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు రాజీనామా చేశారు. అంతే అప్పటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

సింగపూర్‌, దుబాయ్‌కైనా నడపాలి 
అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలను కేంద్రం చేపట్టాలి. విమానయాన సంస్థలతో సంప్రదింపులు చేసి విమానాలు నడిపేలా ఒప్పించాలి. అలాంటి ప్రయత్నాలేవీ చేయకపోవడంతో గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు వెళ్లాలన్న ప్రయాణికుల ఆశ నిరాశే అవుతోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఏటా కనీసం 10 నుంచి 20 లక్షల మంది విదేశాలకు వెళ్లి వస్తుంటారు. ప్రవాసాంధ్రులు వచ్చి వెళ్లడం, విద్య, వ్యాపారం, సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లేవాళ్లు. పర్యాటక ప్రదేశాలను చూసి వచ్చేందుకు వెళ్లే వారి సంఖ్య ఈ నాలుగు జిల్లాల నుంచి భారీగా ఉంటోంది. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళుతున్నారు. కనీసం సింగపూర్‌, దుబాయ్‌ లాంటి దేశాలకైనా విమాన సర్వీసులను వారానికి ఒకటి రెండు నడపాలంటూ ప్రజలు కోరుతున్నారు. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా తేలికగా వెళ్లే వీలుంటుంది.

కొలిక్కిరాని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు 
గన్నవరం నుంచి విదేశీ విమానాలు నడిపేందుకు కేంద్రం చొరవ తగ్గడంతో ప్రజల విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లోటు భర్తీ నిధి(వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌) విధానంలో సింగపూర్‌-విజయవాడ మధ్య చార్టర్డ్‌ విమానాన్ని నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. సింగపూర్‌కు చెందిన సిల్క్‌ ఎయిర్‌వేస్‌ మొదట ముందుకొచ్చినా కేంద్ర పౌరవిమానయానశాఖ నిబంధనలు అవరోధమయ్యాయి. దీంతో దేశీయ విమానయాన సంస్థలతో విజయవాడ-సింగపూర్‌ మధ్య లోటు భర్తీ నిధి విధానంలోనే చార్టర్డ్‌ విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) మరో ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన బిడ్డింగ్‌లో ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు పాల్గొన్నాయని తెలుస్తోంది.

రేణిగుంటకు హోదా ఇచ్చారంతే 
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించి రెండున్నరేళ్లయినా ఇప్పటికీ ఒకడుగూ ముందుకు పడలేదు. గన్నవరం కంటే ముందే హోదా ప్రకటించినా ముందస్తు ఏర్పాట్లుపై కేంద్ర పౌరవిమానయానశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధ్యాత్మిక నగరమైన తిరుపతికి దేశ, విదేశాల నుంచి రోజూ వేలాదిగా భక్తులు వస్తుంటారు. రాయలసీమ జిల్లాల నుంచి అనేకమంది ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్న పరిస్థితి. హోదా ప్రకటించినా తదుపరి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇక్కడి నుంచి విదేశీ ప్రయాణం ప్రజలకు అందని ద్రాక్షే అవుతోంది. దేశీయ విమాన సంస్థలు రేణిగుంట నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు పది విమానాలు నడుపుతున్నాయి. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ 2,500 నుంచి 3 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. విదేశాలకు విమానాలు నడిపితే ప్రస్తుతం బెంగుళూరు, చెన్నై విమానాశ్రయాలకు వెళ్లే వారంతా రేణిగుంట నుంచి ప్రయాణించే అవకాశం ఉంది..

సాధ్యమైనంత త్వరగా సింగపూర్‌కు విమానం
విజయవాడ, సింగపూర్‌ మధ్య సాధ్యమైనంత వేగంగా విమానాన్ని నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ప్రకటనపై విదేశీ సంస్థలు వేసిన బిడ్లు మదించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నాం. అక్కడి నుంచి అనుమతిరాగానే విమాన సేవలు ప్రారంభమవుతాయి. వచ్చే నెలాఖరులోగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నాం. విజయవాడ నుంచి దుబాయ్‌కు మరో విమానాన్ని నడిపేందుకు యత్నిస్తున్నాం. విజయవాడ నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక తిరుపతి(రేణుగుంట) విమానాశ్రయంపైనా దృష్టి పెడతాం.
 -అజయ్‌జైన్‌, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...