Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
ఇండిగో బేస్‌ స్టేషన్‌గా విజయవాడ!
12-06-2018 00:27:59
 
636643662017852110.jpg
 
  • 4 విమానాల నైట్‌ పార్కింగ్‌కు వినతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ప్రైవేట్‌ విమానయాన సంస్థ ఇండిగో.. దక్షిణాదిలో తన నాలుగో బేస్‌ స్టేషన్‌గా విజయవాడ విమానాశ్రయాన్ని ఎంచుకుంది. విజయవాడ కేంద్రంగా తన విమాన సర్వీసులను దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఇండిగో భావిస్తోంది. ఇందులో భాగంగా నాలుగు ఎయిర్‌బస్‌-320 విమానాల నైట్‌ పార్కింగ్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వాలని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులను కోరింది. ఇండిగో తీసుకుంటున్న తాజా చర్యలతో విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెరగనుంది. గతంలో విజయవాడ కేంద్రంగా ఎయిర్‌ కోస్టా తన సేవలను అందించింది. ప్రస్తుతం ఎయిర్‌ కోస్టా సేవలు నిలిచిపోవటంతో తాజాగా ఆ లోటును ఇండిగో భర్తీ చేయనుంది. దక్షిణాదిలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తర్వాత విజయవాడ విమానాశ్రయాన్ని నాలుగో బేస్‌ స్టేషన్‌గా ఎంచుకుంది.
 
ఇటీవలి కాలంలో ఎయిర్‌ ఇండియా తన ఎటిఆర్‌ విమానాల స్థానంలో ఎయిర్‌ బస్‌ విమాన సర్వీసును విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఇండిగో 4 ఎయిర్‌బ్‌సలను విజయవాడ నుంచి నిర్వహించాలని ప్రతిపాదించింది. ఇండిగో ప్రతిపాదన అమల్లోకి రావాలంటే 4 విమానాల నైట్‌ పార్కింగ్‌కు విమానాశ్రయ అధికారులు అనుమతివ్వాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి ప్రతి రోజు ఢిల్లీకి ఎయిర్‌బస్‌-320 ద్వారా విమాన సర్వీసును నిర్వహించాలని ఇండిగో భావిస్తోంది. ఢిల్లీతో పాటు ముంబైకి మరొక సర్వీసును నడపాలని యోచిస్తోంది. మరో రెండు సర్వీసులను ఎక్కడికి నిర్వహించాలనే దానిపై ఇండిగో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Link to comment
Share on other sites

విజయవాడ-సింగపూర్‌ విమాన సేవలకు వేళాయె!
అనుమతుల సాధనకు దిల్లీకి అధికారి

ఈనాడు, అమరావతి: విజయవాడ-సింగపూర్‌ మధ్య విమానయాన సేవలను వచ్చే నెలలో ప్రారంభించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారి గురువారం దిల్లీ వెళ్లారు. విజయవాడ (గన్నవరం)- సింగపూర్‌ మధ్య విమాన సేవలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 80 వేల మంది (సంస్థ వెబ్‌సైట్‌, ఈమెయిల్‌ ద్వారా) సానుకూలంగా స్పందించారు. విజయవాడ నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి బయలుదేరాలంటే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అనేకమంది ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్షలో నెలాఖరులోగా సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అయితే కేంద్రం నుంచి అనుమతుల జారీలో జాప్యమయ్యే అవకాశం ఉండడంతో వచ్చే నెలలో విమానయాన సేవలు ప్రారంభం కావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సిల్క్‌ ఎయిర్‌, ఇండిగో, స్పైస్‌ జెట్‌ తదితర సంస్థలు విజయవాడ- సింగపూర్‌ మధ్య విమానాలు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాయి.

సాగర్‌, పుట్టపర్తికి..: విజయవాడ- నాగార్జునసాగర్‌, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్‌ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన.

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి నేరుగా సింగపూర్‌‌కు సర్వీసు..!
18-06-2018 07:32:51
 
636649039851122293.jpg
  • విమానయాన సంస్థలకు ఆఫర్‌ !
  • ఆర్‌ఎఫ్‌పీ విడుదల చేసిన ఏడీ సీఎల్‌
  • సుమారు లక్ష మంది ప్రజాభిప్రాయ సేకరణ
  • నూరు శాతం సింగపూర్‌కు ఓటు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ హోదా అందుకున్న విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి సింగపూర్‌కు నేరుగా చార్టర్డ్‌ విమానాలు నడిపేందుకు అవకాశాన్ని పరీక్షించుకోవసిందిగా విమానయాన సంస్థలకు ప్రభుత్వం ఆఫర్‌ ప్రకటించింది. సింగ పూర్‌కు విమానాలు నడిపేందుకు రాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీఎల్‌) ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌)ను విడుదల చేసింది. ఔత్సాహిక సంస్థలు ఈ నెల 22వ తేదీ లోపు తమ సీల్డ్‌ కొటేషన్లను సమర్పిం చాల్సి ఉంటుంది. ఈ నెల 22న బిడ్లను తెరుస్తారు. వయ బిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌)కు ఏ సంస్థ తక్కువగా కోట్‌ చేస్తుందో ఆ సంస్థకు విమాన సర్వీసులు నడిపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. చార్టర్డ్‌ ఫ్లైట్‌లో తల సరి సీటుకు వీజీఎఫ్‌ ఎంత సూచిస్తారన్నది విమానయాన సంస్థల ఎంపికను ప్రధానంగా నిర్ణయిస్తుంది.
 
ఇప్పటికే సిల్క్‌ ఎయిర్‌వేస్‌ సంస్థతో ఒప్పందం జరిగిందన్న ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి తాజాగా ఆర్‌ఎఫ్‌పీ విడుదల కావటం గమనార్హం! సిల్క్‌ ఎయిర్‌వే స్‌ విదేశీ విమానయాన సంస్థ. స్వదేశీ విమానయాన సంస్థల నుంచి కూడా ఆసక్తిని తెలుసుకోవటానికి, అవకాశం కల్పించటానికి విమానయాన సంస్థల మధ్య పోటీ పెట్టాలన్న ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ ఏడవ తేదీ నుంచి సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
 
దాదాపుగా లక్ష మంది నుంచి ‘సింగపూర్‌’ విమానం కోసం ఆసక్తి
అంతర్జాతీయ హోదా వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ సర్వీసు కూడా విజయవాడ నుంచి ఎగరలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపించాలన్న ఆలోచన చేస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడిపే విషయంలో ప్రయాణికులు, ప్రజల ప్రతిస్పందన ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అభిప్రాయసేకరణ జరిపింది. ఈ అభిప్రాయ సేకరణ ప్రకారం వెబ్‌సైట్‌లో సానుకూలంగా 79,404 మంది సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాలని సబ్‌మిట్‌ చేశారు. ఏడీసీఎల్‌ సంస్థ ఇ-మెయిల్స్‌ ద్వారా కూడా అభిప్రాయ సేకరణ జరిపింది. ఇ- మెయిల్స్‌ ద్వారా 1,335 మంది సానుకూలంగా స్పందించారు. సామాజిక సందేశ మాధ్యమం ‘వాట్స్‌యాప్‌’ ద్వారా జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 4,020 మంది సానుకూలంగా స్పందించారు. అలాగే 1,993 మంది ఎస్‌ఎంఎస్‌ ద్వారా తమ ఆసక్తిని తెలిపారు
 
పుట్టపర్తి, నాగార్జునసాగర్‌లకు 9 సీటర్‌ విమానాలు!
అనంతపురం జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌ ఎయిర్‌పోర్టుకు కూడా విమానాలు నడపటానికి ప్రభుత్వం ఆసక్తితో ఉంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీటింగ్‌ కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆధ్మాత్మిక ధామం పుట్టపర్తి. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో యాత్రికులు పుట్టపర్తిని సందర్శిస్తుంటారు. అలాగే నాగార్జునసాగర్‌ గొప్ప పర్యాటక ప్రాంతం. నాగార్జునసాగర్‌కు కూడా నిత్యం వందలాది మంది తరలివస్తుంటారు. ఈ రెండు ప్రాంతాలకు తొమ్మిది సీటర్‌ విమానాలను నడపటానికి కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోరుతోంది. రాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏడీసీఎల్‌) తన వెబ్‌పోర్టల్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ కోరింది. ఆదివారం నాటికి పుట్టపర్తికి 658 మంది, నాగార్జున సాగర్‌ ఎయిర్‌పోర్టుకు 515 మంది తమ ఆసక్తిని వ్యక్తపరుస్తూ సబ్‌మిట్‌ చేశారు.
Link to comment
Share on other sites

నేటి నుంచే ఎక్స్‌ప్రెస్‌ కార్గో!
19-06-2018 00:54:09
 
  • గన్నవరం విమానాశ్రయం నుంచి సేవలు
విజయవాడ/గన్నవరం, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయంగా 24 గంటల్లోనే వేగంగా సరుకు రవాణా చేపట్టే విమానాశ్రయాల సరసన చేరబోతోంది. ఈ విమానాశ్రయం నుంచి ఎక్స్‌ప్రెస్‌ కార్గో సేవలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు సరుకు రవాణా చేసే అవకాశం నవ్యాంధ్ర రాజధాని అమరావతి చెంతనే ఉండబోతోంది.
 
విమాన ప్రయాణికులతోపాటు వర్తకులు, రైతులు, పార్శిల్స్‌, కొరియర్‌ సంస్థలు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక కార్గో టెర్మినల్‌ నుంచి శ్రీప లాజిస్టిక్స్‌ సంస్థ కార్గో వ్యవహారాలను పర్యవేక్షించనుంది. ఎక్స్‌ప్రెస్‌ కార్గో విధానంలో 24 గంటల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా సరకు రవాణా చేపట్టడానికి మార్గం సుగమమవుతుంది. కార్గో సేవలు ప్రారంభంతో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని వర్తక, వాణిజ్య వర్గాలకు ఊతంగా మారనుంది.
Link to comment
Share on other sites

ఏపీలోనే అతిపెద్ద రన్‌వే ఎయిర్‌పోర్టు
29-06-2018 09:34:42
 
636658616839196955.jpg
  • శరవేగంగా ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే పనులు
  • భూగర్భ పటిష్టతకు ఐదు రకాల మిక్సింగ్స్‌తో లేయర్లు
  • రెండు లేయర్ల బీటీ పనులు పూర్తి
  • ఐసోలేషన్‌ బే నిర్మాణ పనులు దాదాపు పూర్తి
 
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన రన్‌వే పనులు శరవేగంగా సాగుతున్నాయి. సువిశాల ఐసోలేషన్‌ బే ను దాదాపుగా పూర్తి చేశారు. ప్రస్తుతం 7,500 అడుగులు ఉన్న రన్‌వేకు అదనంగా 3,525 అడుగులు విస్తరిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం 11,025 అడుగుల విస్తీర్ణం కలిగిన అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలుస్తుంది.
 
 
విజయవాడ (ఆంధ్రజ్యోతి)): రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా తన పేరును మరికొద్ది నెలల్లో లిఖించుకోవటానికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం సంసిద్ధమౌతోంది! ఇప్పటి వరకు 60 శాతం మేర రన్‌వే పనులు పూర్తయ్యాయి. ఐసోలేషన్‌ బే పనులు కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం పాత రన్‌వేకు, అభివృద్ధి పరుస్తున్న రన్‌వేకు మధ్యన ఉన్న బుద్ధవరం రోడ్డు స్థానంలో రన్‌వే అభివృద్ధి చేయటమే మిగిలి ఉంది. ఇది ఎంత త్వరగా చేస్తే.. అంత త్వరగా రన్‌వే విస్తరించటం పూర్తయ్యి అందుబాటులోకి వస్తుంది. ఈ సమస్య విమానాశ్రయ అధికారులను ప్రస్తుతం కలవరపెడుతోంది. అమెరికాలో ఉన్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం స్వదేశానికి రాగానే ఈ సమస్యపై తక్షణం చర్చించి త్వరితగతిన రోడ్డును కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని భావి స్తున్నారు. ప్రస్తుతం విజయవాడ ఎయిర్‌ పోర్టు రన్‌వే 7500 అడుగులు ఉంది. దీనికి అ దనంగా 3525 అడుగుల ర న్‌ వేను విస్త రిస్తు న్నారు. మొత్తం రెవెన్యూ యం త్రాంగం అప్ప గించిన 700 ఎకరా లను స్వాధీనం చే సుకున్న ఎయి ర్‌పోర్టు అథారిటీ అధికారులు ప్రస్తుత ర న్‌వేకు అనుబంధంగా నూతన రన్‌వేను విస్తరించానికి, ఐసోలేషన్‌ బేలను నిర్మించటానికి రూ.148 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు.
 
 
పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ పనులను చేపడుతోంది. ఆరు నెలల కాలంగా రన్‌వే విస్తరణ పనులు ఎంతో పురోగతిలో ఉన్నాయి. లోతట్టు వ్యవసాయ భూములలో రన్‌వే అనుసంధానానికి, ఐసోలేషన్‌ బే, ప్రహరీ గోడల నిర్మాణానికి మార్కింగ్‌ పనులు చకచకా ప్రారంభించారు. రన్‌వేను విస్తరించటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. లోతట్టు పంట భూములను మెరక చేయటానికి బ్రహ్యయ్యలింగం చెరువు నుంచి రోజూ వందల సంఖ్యలో పెద్ద టిప్పర్లతో మట్టిని ఇక్కడ డంప్‌ చేస్తే కానీ ఇప్పుడు చూస్తున్న స్వరూపం రాలేదు. మరో రెండు నెలలు మట్టి డంప్‌ చేస్తే ఎర్త్‌ పిల్లింగ్‌ పూర్తవుతుంది. ఎర్త్‌ ఫిల్లింగ్‌కు సంబంధించి 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎర్త్‌ ఫిల్లింగ్‌ మీద ఐదు రకాల ధృడమైన లేయర్లను వేశారు. డబ్ల్యూబీఎం, వెట్‌మిక్స్‌, హాట్‌మిక్స్‌ వంటి ఐదు రకాల లేయర్లతో నేలను దృఢంగా తయారు చేస్తారు. దీనిపై రెండు లేయర్ల బీటీ వేశారు. నూతన రన్‌వే పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
 
 
ప్రస్తుత రన్‌వే దగ్గర అనుసంధానించాల్సిన ప్రాంతంలో మాత్రమే రోడ్డు ఉండటం వల్ల కొంత బిట్‌ మిగిలి ఉంది. ఇది కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మూడవ లేయర్‌ను వేస్తారు. మూడవ లేయర్‌ ఏర్పాటుతో నూతన్‌ రన్‌వే విస్తరణ పూర్తవుతుంది. ఇకపోతే ప్రధానంగా స్వాధీనం చేసుకున్న 700 ఎకరాల విస్తీర్ణం వెంబడి ప్రహరీ గోడ నిర్మాణ పనలు చేపట్టారు. ప్రహరీ పనులు కూడా 90 శాతం మేర పూర్తయ్యాయి.
 
 
రోడ్డు సమస్య తేలితే..
విమానాశ్రయ రన్‌వే విస్తరణ ప్రధాన పనులు జరగాల్సిన చోట ఉన్న బుధవారం రోడ్డును మూసివేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయ రోడ్డు విషయంలో ఇంకా అడుగులు పడకపోవటంతో ప్రస్తుత రోడ్డును కొనసాగించాల్సి వస్తోంది. దీంతో నూతన రన్‌వేను, ప్రస్తుత రన్‌వేకు అనుసంధానం చేయలేని పరిస్తితి ఏర్పడుతోంది. ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా రన్‌వే పూర్తి చేసే అవకాశం ఉంది.
 
 
ఐసోలేషన్‌ బే నిర్మాణం దాదాపుగా పూర్తి
విమానాశ్రయంలో సేకరించిన 700 ఎకరాల భూములలో ఉత్తరం వైపు సువిశాల ఐసోలేషన్‌ బే ను దాదాపుగా పూర్తి చేశారు. ఐసోలేషన్‌ బే అన్నది పూర్తిగా కాంక్రీట్‌ మిక్సింగ్‌తో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఐసోలేషన్‌ బే అన్నది తప్పనిసరి ! ఐసోలేషన్‌ బే అనేక రకాలుగా ఉపయోగ పడుతుంది. విమానాలకు సంబంధించి సమస్యలు ఉత్పన్నం అయినపుడు ల్యాండింగ్‌ అయిన క్రమంలో ఆ విమానాన్ని ఎక్కువ దూరం నడిపించకుండా వెంటనే ఐసోలేషన్‌ బే మీదకు తీసుకు వెళతారు. ఇక్కడ ఆ విమానానికి సంబంధించి మరమ్మతులు వంటివి నిర్వహిస్తారు. దీంతో పాటు హైజాకర్లు ఏదైనా విమానాన్ని హైజాక్‌ చేసినపుడు ఇక్కడ ల్యాండింగ్‌ చేయదలిస్తే .. ఐసోలేషన్‌ బే మీదకు ఆ విమానాన్ని డైవర్షన్‌ అయ్యేలా చేస్తారు. హైజాక్‌ అయిన విమానం వల్ల ఇతర విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు కాబట్టి ఐసోలేషన్‌ బేను ఇలా ఉపయోగించుకుంటారు. విమానాశ్రయంలో రద్దీ నెలకొన్నప్పుడు పార్కింగ్‌ బేలు కిటకిటలాడుతున్నప్పుడు కొంత సేపు విమానాలను ఇక్కడ నిలుపుదల చేయటానికి ఐసోలేషన్‌ బేను ఉపయోగిస్తారు.
 
 
ఏపీలోనే అతిపెద్ద రన్‌వే ఎయిర్‌పోర్టు
ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు 10 వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది. విస్తరిస్తున్న రాజమండ్రి ఎయిర్‌పోర్టు విస్తీర్ణం 9 వేల అడుగుల విస్తీర్ణంలో ఉంది. తిరుపతి ఇంకా తక్కువగా ఉంది. వియవాడ ఎయిర్‌పోర్టు ప్రస్తత రన్‌వే 7500 అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం 3,525 అడుగుల మేర రన్‌వేను విస్తరిస్తున్నారు. ఈ రన్‌వే అందుబాటులోకి వస్తే మొత్తం 11,025 అడుగుల విస్తీర్ణం కలిగిన అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా భాసిల్లనుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...