Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
1 hour ago, sonykongara said:

mari problem undadha bro

yes expansion ki problem ye

planning lo inko runway, taxiway kuda vunnayi

without canal diversion another runway is not possible - choodali yemanna kottha plans tho vastharemo like underground tunnel for canal

 

Link to comment
Share on other sites

Guest Urban Legend

 

The Central Board of Excise and Customs (CBEC) has permitted unloading of imported goods and loading of export goods or any class of such goods at the Vijayawada airport.

Da_eG5MWAAAX1eY.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
విమానాశ్రయ విస్తరణకు.. డెడ్‌లైన్‌ మే 20
26-04-2018 10:08:56
 
636603341359979770.jpg
  • అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అందుబాటులోకి తీసుకురావాలి
  • గన్నవరం - మానికొండ, గన్నవరం - పుట్టగుంట లింక్‌ రోడ్లకు అనుమతులు
  • హైటెన్షన్‌, లో టెన్షన్‌ విద్యుత్‌ లైన్ల మార్పిడి పనుల పూర్తికి ఆదేశం
  • విస్తరణ పనుల్లో గృహాలను కోల్పోయిన వారికి పరిహారం
  • ఎయిర్‌పోర్టు విస్తరణ సమీక్షలో కలెక్టర్‌
విజయవాడ(ఆంధ్రజ్యోతి): విమానాశ్రయ విస్తరణ పనులను మే 20 నాటికి పూర్తి చేయటానికి కృష్ణా కలెక్టర్‌ డెడ్‌లైన్‌ విధించారు. విమానాశ్రయ విస్తరణపై రెవెన్యూ, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, ఇరిగేషన్‌ అధికారులతో బుధవారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ సమీక్షించారు. అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కావటానికి అదనపు రన్‌వే అందుబాటులోకి రావాల్సి ఉన్న నేపథ్యంలో, విమానాశ్రయ అధికారులు దీనికి సంబంధించిన పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయ విస్తరణతో ముడిపడి ఉన్న ఇతర అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. గన్నవరం - మానికొండ, గన్నవరం - పుట్టగుంట లింక్‌ రోడ్లకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించిన విషయాన్ని కలెక్టర్‌ చెప్పారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినందున యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. హైటెన్షన్‌, లో టెన్షన్‌ విద్యుత్‌ లైన్ల మార్పిడి పనులు పూర్తి చేయాలని విద్యుత్‌శాఖాధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులు డ్రెయిన్‌ షిఫ్టింగ్‌ పనులను సకాలంలో పూర్తి చెయ్యాలని ఆదేశించారు. విస్తరణ పనుల్లో గృహాలను కోల్పోయిన వారికి చెల్లింపుల ప్రక్రియు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలన్నీ పూర్తి చేయాల్సిన పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోనే పూర్తి చేయాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

మిగిలింది... అనుమతి!
కార్గో సేవలకు భద్రతా సంస్థల పచ్చజెండా
గన్నవరం నుంచి ఇప్పటికే ప్రక్రియ ఆలస్యం
త్వరగా ప్రారంభించాలని అధికారుల కసరత్తు
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
న్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు గత ఏడాది నుంచే ప్రారంభమవ్వాల్సి ఉండగా.. కొంత ఆలస్యం జరిగింది. కార్గో సేవలకు సంబంధించిన ప్రక్రియ అంతా విమానాశ్రయంలో చాలా నెలల కిందటే పూర్తయ్యింది. గత ఏడాది మార్చిలోనే శ్రీపా లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కార్గో సేవలు నిర్వహించే టెండర్‌ను ఖరారు చేశారు. అనంతరం బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) నుంచి భద్రతా పరమైన అనుమతుల విషయంలో ప్రక్రియ కొంత జాప్యమైంది. ప్రస్తుతం అదికూడా పూర్తయ్యింది. బీసీఏఎస్‌కు సంబంధించిన బృందం విమానాశ్రయాన్ని ఇటీవల మరోసారి పరిశీలించి వెళ్లింది. విమానాశ్రయంలోని కార్గో సేవలు అందించేందుకు నిర్మించిన గోడౌన్‌లో అవసరమైన ఎక్విప్‌మెంట్‌ను సైతం ఏర్పాటు చేశారు. కేంద్ర నిఘా విభాగం, పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బందితో కూడిన బృందం కార్గో సేవలు అందించేందుకు అవసరమైన అన్నింటినీ పరిశీలించారు. వారు సూచించిన ఒకటి రెండు చిన్న మార్పులను సైతం సరిచేసి.. మళ్లీ నివేదికను తాజాగా పంపించారు. దీంతో భద్రతాపరమైన అన్ని క్లియరెన్స్‌లు వచ్చేసినట్టే. కార్గో సేవల నివేదిక ప్రస్తుతం దిల్లీకి చేరింది. అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే గన్నవరం నుంచి కార్గో సేవలు ప్రారంభమవుతాయి.

గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు ప్రారంభమైతే.. ఇక్కడి నుంచి సరకును నేరుగా విదేశాలకు పంపించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి వ్యవసాయ, వాణిజ్య పంటలు, ఆక్వా, మాంస, పౌల్ట్రీ, పారిశ్రామిక ఉత్పత్తులను విదేశాలకు తేలికగా పంపించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సరకును కృష్ణపట్నం పోర్టు, విశాఖ, హైదరాబాద్‌, చెన్నై.. లాంటి నగరాలకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారు. సరకును ఇక్కడ వాహనాల్లో నింపి.. కనీసం ఏడెనిమిది గంటలు ప్రయాణించాక.. మళ్లీ అక్కడ దించి.. పంపడం.. వ్యయ ప్రయాసలకు గురిచేస్తోంది. అదికూడా పారిశ్రామిక ఉత్పత్తులైతే.. ఎన్నాళ్లయినా పర్వాలేదు. ఇక్కడి నుంచి పంపించే వ్యవసాయ, మత్స్య, మాంస ఉత్పత్తులు, పండ్లు లాంటివి ఎక్కువ సమయం నిలువ ఉంచడానికి.. సరైన శీతల వాతావరణం ఏర్పాటు చేయాలి. ఏమాత్రం తేడా జరిగినా.. సరకంతా పాడైపోతుంది. దీంతో ఎక్కువ శాతం ఇక్కడే రైతులు, వ్యాపారులు ఎంతో కొంత ధరకు ఇచ్చేసే దోరణిలో ఉంటున్నారు. అదే ఇక్కడి సరకుకి.. మంచి డిమాండ్‌ ఉన్న విదేశాలకు పంపించగలిగితే.. లాభాలు రెట్టింపవుతాయి.

ఏడాది కిందట ఏఏఐ పచ్చజెండా..
ఈ నేపథ్యంలో స్థానిక వ్యాపార, వాణిజ్య సంఘాలు ఎప్పటినుంచో కార్గో సేవలను గన్నవరం నుంచి అందుబాటులోనికి తేవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దశాబ్దాల కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు మాంస ఉత్పత్తులు ఎగుమతి చేసేవారు. పౌరవిమానయానశాఖకు పలుమార్లు ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ సహా పలు వ్యాపార, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో లేఖలు సైతం పంపించారు. దీంతో విమానాయాన శాఖ ఆధ్వర్యంలో అనేక సర్వేలను స్థానికంగా చేయించారు. కార్గో సర్వీసులను నడిపేందుకు ఇక్కడ పుష్కలంగా అవకాశం ఉందని గుర్తించాకే.. ఎట్టకేలకు గత ఏడాది ప్రారంభంలో భారత విమానయాన సంస్థ(ఏఏఐ) పచ్చజెండా ఊపింది. వెంటనే నెలల వ్యవధిలోనే విమానాశ్రయంలో కార్గో సేవలకు అవసరమైన గోడౌన్‌ను నిర్మించారు. మార్చిలో టెండర్లు పిలిచి.. శ్రీపా లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కార్గో సేవలు అందించే కాంట్రాక్టును అప్పగించారు. గత ఏడాది జులై నాటికే ప్రక్రియ పూర్తవుతుందని భావించినా.. భద్రతాపరమైన అనుమతుల విషయంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అన్ని అనుమతులకూ పచ్చజెండా ఊపడంతో.. ఎలాగైనా మరో నెల రోజుల్లోపే కార్గో సేవలను అందుబాటులోనికి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 
 

 

 

Link to comment
Share on other sites

న్నవరం ఎయిర్‌పోర్టుకు నో ఎంబార్కేషన్‌ పాయింట్
29-04-2018 06:42:19
 
636605809394077314.jpg
  • కొత్త పాయింట్లు ఇవ్వటం లేదని తేల్చిచెప్పిన కేంద్రం
  • అంతర్జాతీయ హోదా వచ్చినా.. అదే తీరు
  • ఇక్కడి నుంచి మూడువేల మంది హాజీలు సిద్ధం
  • ఆగస్టు నుంచి హజ్‌ యాత్రా ప్రక్రియ ప్రారంభం
 
విజయవాడ: అంతర్జాతీయ హోదా అందుకున్నా.. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి హజ్‌ యాత్ర సాగించటానికి దారులు మూసుకుపోతున్నాయి. అమరావతి రాజధానికే కాకుండా నవ్యాంధ్రప్రదేశ్‌కే తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టుకు హజ్‌ ఎంబార్కేషన్‌ పాయింట్‌ (సమూహంగా వెళ్లటానికి) ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. కిందటేడాది ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇవ్వటానికి అంతర్జాతీయ హోదా లేదని తిరస్కరించగా.. ఈ ఏడాది కొత్తగా ఎంబార్కేషన్‌ పాయింట్స్‌ ఇవ్వటం లేదని సెంట్రల్‌ మైనారిటీ అఫైర్స్‌ తేల్చి చెప్పటంతో చిక్కులు వచ్చిపడ్డాయి.
 
   రాష్ట్ర వ్యాప్తంగా మూడువేల మంది హాజీలు హజ్‌ యాత్రకు బయలుదేరబోతున్నప్పటికీ నడిబొడ్డున సమీపాన ఉన్న విజయవాడ ఎమిర్‌పోర్టు కాకుండా దూరాన ఉన్న పొరుగురాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హజ్‌యాత్రకు ప్రత్యేక విమానాలు నడపటానికి విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నా.. విజయవాడ నుంచే తమ యాత్రను ప్రారంభించాలని హాజీలు భావిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవటంతో ఈ ఏడాది కూడా విజ యవాడ ఎయిర్‌పోర్టు నుంచి తీపి కబురు లేదు. సెంట్రల్‌ మైనారిటీ అఫైర్స్‌ కొత్తగా ఎలాంటి ఎంబార్కేషన్‌ పాయింట్స్‌ ఇవ్వటం లేదని చెప్పటంతో భవిష్యత్తు ఆశలపై కూడా నీళ్లు చల్లుతున్నట్టు అవుతోంది.
 
శంషాబాద్‌కు వ్యయప్రయాసలతో..
అమరావతి రాజధాని కేంద్రస్థానంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హజ్‌ యాత్రకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇచ్చే విషయంలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వేలాదిమంది హాజీలను ఇబ్బంది పెడుతోంది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాల నుంచి బయలుదేరే హాజీలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. చెంతన ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టును కాదని, 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళటం ప్రయాసగా భావిస్తున్నారు. కిందటి సంవత్సరం విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ తీసుకురావటానికి రాష్ట్ర హజ్‌ కమిటీ ప్రయత్నం చేసింది. కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖను సంప్రదించటం జరిగింది. విజయవాడ ఎయిర్‌పోర్టు అప్పటికి ఇంకా అంతర్జాతీయ హోదా సాధించకపోవటం, అంతర్జాతీయ టెర్మినల్‌ను కూడా కలిగి ఉండకపోవటం వల్ల వీలుపడదని చెప్పింది. హజ్‌యాత్రకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇవ్వటానికి అంతర్జాతీయ విమానాశ్రయం తప్పనిసరి అని మెలిక పెట్టడంతో అవకాశం తప్పింది.
 
కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా..
ఏడాది తిరిగేలోపు విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ హోదాను అందుకుంది. అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతర్జాతీయ విమానాలు తిరగటానికి వీలుగా ఇమిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ శాఖలు కొలువు తీరటానికి కార్యాలయాలతో పాటు, కౌంటర్లు కూడా పూర్తయ్యాయి. ఇమిగ్రేషన్‌ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమించటం జరిగింది. ప్రస్తుతం సిబ్బంది శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తికాగానే.. కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో విదేశాలకు భారీ విమానాలు నడపటానికి వీలుగా రన్‌వే విస్తరణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.
 
   వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మెయిన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖను సంప్రదించారు. రెండు రాష్ర్టాలకు ప్రత్యేకంగా హజ్‌ బోర్డులు ఏర్పాటయ్యాయని విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ బోర్డు పనిచేస్తున్నదని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమానాలు తిరగటానికి మార్గం సుగమమైందని చెప్పారు. భారీ విమానాలు నడవటానికి వీలుగా రన్‌వే విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయని, ప్రస్తుత రన్‌వే ద్వారా కూడా అంతర్జాతీయ విమానాలు నడపవచ్చని అనుమతులు ఇవ్వమని కోరారు. దీనికి సంబంధిత శాఖ నుంచి కొత్తగా ఎంబార్కేషన్‌ పాయింట్లు ఇవ్వటం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆయన ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన స్వయంగా కేంద్ర మంత్రి అబ్బాస్‌ నఖ్వీకి లేఖ రాశారు.
 
   అయినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మూడు వేల మంది హాజీలు బయలుదేరే ప్రాంతానికి ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇవ్వకపోవటం అర్థరహితమని భావించిన రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మొయిన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. ఆయన కేంద్ర మంత్రి నక్వీతో మాట్లాడినట్టు సమాచారం. నక్వీ సానుకూలంగా హామీ ఇచ్చినా ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ ఇవ్వలేదు.
 
 
విదేశాలకు ఎయిరిండియా ఆసక్తి..
అంతర్జాతీయ హోదా వచ్చిన క్రమంలో విదేశాలకు విమానాలు నడపటానికి ఇప్పటికే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఆసక్తి చూపిస్తోంది. దుబాయ్‌, షార్జాలకు విమానాలు నడపటానికి ఆ సంస్థ ఏర్పాట్లు చేసుకుంది. ఇదే క్రమంలో హజ్‌ యాత్రలో భాగంగా వేలాది మంది హాజీల కోసం సౌదీ అరేబియాకు కూడా అంతర్జాతీయ సర్వీసులను నడపటానికి మార్గం సుగమం అవుతుంది. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాలలోని దైవగృహం, మహమ్మద్‌ ప్రవక్త సమాధిలను చూడటానికి హాజీలు బయలుదేరతారు. కనీసం హజ్‌ యాత్రకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ వస్తే విజయవాడ ఎయిర్‌పోర్టు మరింత కళకళలాడి ఉండేది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

DcVW4NNU8AAffIm.jpg18 feet in height, wooden carved traditional Kondapalli toy of an Elephant with Howdah or Enugu Ambari was inaugurated at Gannavaram International Airport to encourage and promote the age old heritage of Kondapalli near Vijayawada in Krishna District of Andhra Pradesh.

Link to comment
Share on other sites

2 minutes ago, Urban Legend said:

DcVW4NNU8AAffIm.jpg18 feet in height, wooden carved traditional Kondapalli toy of an Elephant with Howdah or Enugu Ambari was inaugurated at Gannavaram International Airport to encourage and promote the age old heritage of Kondapalli near Vijayawada in Krishna District of Andhra Pradesh.

super inkoti kuda pedithe poyedi

Link to comment
Share on other sites

Guest Urban Legend
8 minutes ago, sonykongara said:

super inkoti kuda pedithe poyedi

ya both sides of the entry looks good 

Link to comment
Share on other sites

1 hour ago, Urban Legend said:

DcVW4NNU8AAffIm.jpg18 feet in height, wooden carved traditional Kondapalli toy of an Elephant with Howdah or Enugu Ambari was inaugurated at Gannavaram International Airport to encourage and promote the age old heritage of Kondapalli near Vijayawada in Krishna District of Andhra Pradesh.

Very nice ? 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...