Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

ఎయిర్‌కార్గో హోదా
గన్నవరం విమానాశ్రయానికి ప్రకటన
విదేశాలకు నేరుగా సరకు రవాణా
నోటిఫికేషన్‌ విడుదల చేసిన కస్టమ్స్‌ విభాగం
ఈనాడు, అమరావతి
amr-brk7a.jpg

గన్నవరం విమానాశ్రయం స్థాయి మరో మెట్టు పెరిగింది. ఇకనుంచి విదేశాలకు సరకులను తీసుకెళ్లేందుకు, అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఎయిర్‌కార్గో హోదాను కల్పిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటివరకు కేవలం దేశీయంగా మాత్రమే సరకులను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో రవాణా కోసం విశాఖ, హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు లారీల్లో నింపి ఆరేడు గంటల పైగా ఇతర నగరాలకు తీసుకెళ్లి విదేశాలకు పంపించాల్సి వస్తోంది. దీనివల్ల సరకు తాజాగా ఉండడం లేదు. అందుకే.. ఇక్కడి నుంచి అంతర్జాతీయ కార్గో సేవలను ప్రారంభించాలని వ్యాపార, వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. ఎట్టకేలకు అనుకున్నది సాకారమైంది. సరకుల తనిఖీ కోసం కస్టమ్స్‌ విభాగం కార్యాలయాన్ని త్వరలో ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. విమాన ఛార్జీలతో పాటు కస్టమ్స్‌ పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. డిమాండ్‌ను బట్టి ప్రత్యేక కార్గో విమాన సర్వీసులు సంఖ్య పెరగనుంది. కార్గో సేవల కోసం భవనం కూడా ఆరు నెలల కిందటే సిద్ధమైంది.

మన సరకు విదేశాలకు..
దేశంలో ఇప్పటికే 19 రాష్ట్రాల్లో 32 విమానాశ్రయాల నుంచి ఎయిర్‌కార్గో సేవలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎయిర్‌కార్గో సేవలు నడుస్తున్నాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దేశంలో 33వ ఎయిర్‌ కార్గో హోదా పొందినదిగా నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పండే వ్యవసాయ ఉత్పత్తులు, మిర్చి, పొగాకు, పత్తి, మామిడి సహా అనేక ఉత్పత్తులను విదేశాలకు సరఫరా చేసేందుకు వీలుంటుంది. మత్స్య ఉత్పత్తులకు సైతం విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. దీనికితోడు తాజాగా వీరపనేనిగూడెంలో 75 పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. వీటి ఉత్పత్తులను సైతం తరలించాల్సి ఉంటుంది. మెగా ఫుడ్‌పార్క్‌ సైతం విమానాశ్రయానికి దగ్గరలోనే మంజూరైంది. వీటన్నింటికీ ఎయిర్‌కార్గో సేవలు అత్యంత అవసరం.

Link to comment
Share on other sites

విజయవాడ-షిర్డీ విమాన సర్వీసు
23-03-2018 01:00:23
 
  •  మే నెలలో ప్రారంభించనున్న సుప్రీం ఎయిర్‌లైన్స్‌
  •  తొలిసారిగా విశాఖకు ఇండిగో సర్వీసు
విజయవాడ (ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకిరానున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను విస్తరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మధ్యనే విజయవాడ నుంచి సర్వీసులు ప్రారంభించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌.. చెన్నై, బెంగళూరు నగరాలకు సర్వీసులు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు సర్వీసులు ఏప్రిల్‌ 4 నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఇండిగో ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మూడు, చెన్నై, బెంగళూరు నగరాలకు ఒక్కో విమానాన్ని నడుపుతోంది.
 
అలాగే ఏప్రిల్‌ 25 నుంచి విశాఖపట్నానికి సర్వీసును ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు విజయవాడ నుంచి షిర్డీకి విమాన సర్వీసును నిర్వహించేందుకు సుప్రీం ఎయిర్‌లైన్స్‌ ముందుకువచ్చింది. చార్టర్డ్‌ విమానాలతో సేవలందిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ) నుంచి అనుమతులు కూడా అందుకుంది. విజయవాడ విమానాశ్రయంలో బుకింగ్‌, చెకిన్‌ కౌంటర్లతో పాటు, పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించాలని కోరుతూ విజయవాడ విమానాశ్రయ అధికారులకు సుప్రీం ఎయిర్‌లైన్స్‌ సంస్థ లేఖ రాసింది. మే నెలలో షిర్డీకి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీమ్‌ యోచిస్తోంది. మరోవైపు స్పైస్‌ జెట్‌ కూడా వేసవికి మరిన్ని సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Link to comment
Share on other sites

స్మార్ట్‌గా ఎగిరిపోవచ్చు
డిజియాత్రకు గన్నవరం విమానాశ్రయం ఎంపిక
మరికొద్ది నెలల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ప్రయాణికులు తేలికగా రాకపోకలు సాగించేందుకు వీలు
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg
గన్నవరం విమానాశ్రయానికి మరో అరుదైన అవకాశం వచ్చింది. దేశంలో డిజిటల్‌ విమానాశ్రయాలుగా మార్చేందుకు మూడింటిని ఎంపిక చేయగా.. వాటిలో గన్నవరం ఒకటి. డిజియాత్ర పేరుతో పౌరవిమానయానశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం విమానాశ్రయాలను స్మార్ట్‌ రాకపోకలకు వేదికగా చేయాలని నిర్ణయించింది. వారణాశి, గన్నవరం, మరో విమానాశ్రయాన్ని ఎంపిక చేసి పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో రాకపోకలను మార్చనున్నట్టు భారత విమానయాన సంస్థ(ఏఏఐ) తాజాగా ప్రకటించింది. విమానాశ్రయంలోనికి ప్రయాణికులకు సులభతరమైన ప్రవేశం కల్పించనున్నారు. చెక్‌ఇన్‌ కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన పనిలేకుండా.. కేవలం వారి ఐడీ కార్డు చూపించి స్మార్ట్‌గా విమానంలోనికి ప్రవేశించేలా చేయడమే.. డిజియాత్ర ప్రధాన ఉద్దేశం. విమాన ప్రయాణానికి గంటల సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కాగిత రహితంగా కేవలం ఓ గుర్తింపు కార్డును చూపించి రాకపోకలు సాగించొచ్చు. అన్ని తనిఖీ, చెక్‌ఇన్‌ కౌంటర్ల వద్ద తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డును చూపిస్తే సరిపోతుంది. ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్‌ చేసే సమయంలో ఆధార్‌, బయోమెట్రిక్‌ పద్ధతిలో వివరాలను పొందుపరిస్తే సరిపోతుంది. డిజిటల్‌ అనుసంధానం ద్వారా అతి తక్కువ సమయంలోనే ప్రస్తుత బోర్డింగ్‌పాస్‌ ప్రక్రియను పూర్తిచేసుకుని ముందుకెళ్లిపోయేందుకు అవకాశం కల్పిస్తారు. విమానాశ్రయంలో దీనికి అవసరమైన డిజిటల్‌ అనుసంధాన ప్రక్రియను ఏర్పాటు చేసేందుకు.. మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో టెండర్లను పిలవనున్నట్టు ఏఏఐ ఛైర్మన్‌ గురుప్రసాద్‌ మహాపాత్ర తాజాగా వెల్లడించారు.

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశీయంగా ఏటా ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నిత్యం 50 విమాన సర్వీసులు దేశంలోని ఎనిమిది నగరాలకు తిరుగుతున్నాయి. మూడేళ్ల కిందటి వరకూ ప్రయాణికుల సంఖ్య ఏటా రెండు లక్షల లోపే ఉండేది. నిత్యం తిరిగే విమాన సర్వీసులు పది లోపే ఉండేవి. హైదరాబాద్‌, విశాఖ నగరాలకు మాత్రమే సర్వీసులు తిరిగేవి. అమరావతి రాజధానిగా మారిన నేపథ్యంలో అనూహ్యంగా విమానాశ్రయం అవసరం పెరిగింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, విశాఖ, తిరుపతి, కడప నగరాలకు ప్రస్తుతం విమాన సర్వీసులున్నాయి. ప్రతి పావుగంటకో సర్వీసు విజయవాడ విమానాశ్రయం నుంచి గాలిలోనికి ఎగురుతోంది. ఏ నగరానికి కొత్తగా సర్వీసులను ఏర్పాటు చేసినా.. ఆక్యుపెన్షీ రేషియో 80శాతం పైనే ఉంటోంది. దీంతో విమానయాన సంస్థలు సైతం పోటీపడి మరీ కొత్త రూట్లలో నడుపుతున్నాయి.

ప్రయాణికుల వృద్ధిలో అగ్రస్థానం..
దేశంలోనే ప్రయాణికుల వృద్ధిలో గన్నవరం విమానాశ్రయం గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏటేటా ఊహించని స్థాయిలో ప్రయాణికులు రెట్టింపు పెరుగుతున్నారు. ప్రయాణికుల అవసరాల దృష్ట్యా గన్నవరానికి అంతర్జాతీయ హోదాను కేంద్రం ప్రకటించింది. మరో ఒకటి రెండు నెలల్లో ఇక్కడి నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ఎగిరేందుకు అంతా సిద్ధమైంది. తాజాగా.. దేశంలోనే మూడు డిజిటల్‌ విమానాశ్రయాల్లోనూ గన్నవరానికి స్థానం లభించడంతో మరింత ఖ్యాతి వచ్చింది. విమానాశ్రయంలో ప్రస్తుతం చెక్‌ఇన్‌ కౌంటర్లు, తనిఖీ పూర్తిచేసుకుని విమానాల వద్దకు చేరుకునేందుకు కనీసం గంటకు పైగా సమయం పడుతోంది. డిజిటల్‌ అనుసంధానం ద్వారా.. ప్రయాణికులకు తనిఖీల ప్రక్రియ బాగా తగ్గిపోనుంది.

 
 

 

Link to comment
Share on other sites

ఐదడుగుల్లో విదేశీయానం
ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌, వైద్య, ఇంటెలిజెన్స్‌, భద్రత విభాగాలు సిద్ధం
ఏప్రిల్‌ మొదటి వారంలో విమాన సంస్థలకు పిలుపు
ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి
amr-sty1a.jpg

విదేశీ మారకం మార్చుకునేందుకు..
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ దేశాలకు చెందిన కరెన్సీని మార్చుకునేందుకు అవసరమైన కౌంటర్‌ కీలకమైనది. కౌంటర్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన టెండర్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఓ సంస్థను ఎంపిక చేశారు. త్వరలో ఈ సంస్థ తమ కార్యాలయాన్ని విమానాశ్రయంలో ఏర్పాటు చేయనుంది. విదేశీ ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వచ్చే ముందే వారి వద్ద ఉన్న డబ్బులను మన దేశ రూపాయిల్లోకి మార్చుకునేందుకు ఇదే కీలకం. దీనికి సంబంధించిన ప్రక్రియ సైతం పూర్తయింది. వారం పది రోజుల్లోగా కౌంటర్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు.

ఈనాడు, అమరావతి

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌, వైద్య, ఇంటెలిజెన్స్‌, భద్రత విభాగాలు ఐదు కీలకం. ప్రస్తుతం ఈ ఐదు విభాగాలూ సేవలు అందించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. Rs 3 కోట్లతో ఆధునికీకరించిన విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనంలో అంతర్జాతీయ సేవలు అందించేందుకు ఈ విభాగాలన్నీ సమాయత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగతా చిన్న చిన్న పనులను పూర్తి చేసి.. ఏప్రిల్‌ మొదటి వారంలో విదేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు అన్ని అనుమతులు, వసతులతో మేం సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటన వెలువడనుంది. విమానాశ్రయం నుంచి అన్ని విమానయాన సంస్థలనూ ఆహ్వానిస్తూ.. తమ సన్నద్ధతను తెలియజేస్తారు. అనంతరం ఆయా సంస్థలు తమ సర్వీసులను నడిపేందుకు ముందుకు రావడం ఒక్కటే మిగిలి ఉంటుంది.

గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన సిబ్బంది ప్రత్యేక శిక్షణ తీసుకొని సిద్ధమయ్యారు. ఓ విదేశీ విమానం ఇక్కడికి రావాలన్నా, ప్రయాణికులు అనుమతి పొందాలన్నా.. మొదట ఉండాల్సిన విభాగం ఇమ్మిగ్రేషనే. ప్రయాణికుడు విమానం దిగి లోపలికి రాగానే.. అతనికి సంబంధించిన పాస్‌పోర్ట్‌ను పరిశీలిస్తారు. అతను ఏ పనిపై వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడనే వివరాలన్నీ.. అక్కడే తనిఖీ చేస్తారు. ఈ విభాగం తమ కంప్యూటర్లు, ఎన్‌ఐసీ సర్వర్లు, సిబ్బంది సహా అంతా సిద్ధం చేసుకుంది. ఇమ్మిగ్రేషన్‌ తర్వాత ప్రయాణికులు దాటాల్సిన రెండో దశ విమానాశ్రయ వైద్య విభాగం. ప్రయాణికులకు అన్ని రకాల పరీక్షలు చేసి.. లోపలికి పంపిస్తారు. వారికి వాక్సినేషన్‌, ఎలాంటి వ్యాధులతోనైనా వచ్చారా..అనేవి మొత్తం ఇక్కడ పరిశీలిస్తారు. ఈ కార్యాలయం కూడా సిద్ధమైపోయింది. మూడో దశ కస్టమ్స్‌. విదేశీ ప్రయాణికులు తీసుకొచ్చే వస్తువులను తనిఖీ చేయడం, వాటికి సంబంధించిన అన్ని అనుమతులూ ఉన్నాయో లేవో చూడడం కస్టమ్స్‌ పని. ప్రమాదకరమైన ఆయుధాలు, డ్రగ్స్‌ లాంటివి తేవడం, తీసుకెళ్లడం జరగకుండా వీరు తనిఖీ చేస్తారు. ఇప్పటి వరకు కస్టమ్స్‌ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా వారం కిందట విమానాశ్రయానికి ఎయిర్‌కార్గో హోదాను ఇస్తూ నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది. ఈ మూడు దశలూ దాటాక.. అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు కీలకమైనది కేంద్ర ఇంటెలిజెన్స్‌ వింగ్‌. ఇది కూడా సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. ఐదోది అత్యంత కీలకమైన విమానాశ్రయ భద్రతా విభాగం. ఎప్పటి నుంచో రాష్ట్ర పోలీసులే భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం తమ సిబ్బందిని మరింత మందిని పెంచారు.

కస్టమ్స్‌ పన్ను ఎస్‌బీఐ ద్వారా..
ఎస్‌బీఐ శాఖను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం కార్యాలయం సిద్ధమైంది. ఇక్కడ ఎస్‌బీఐ సిబ్బందిని కేటాయించిన వెంటనే పని ప్రారంభమవుతుంది. విదేశీ వస్తువులకు కస్టమ్స్‌ పన్నును ఎస్‌బీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. పన్నును చెల్లించిన తర్వాత వస్తువులను తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతి ఇస్తారు.

కాల్‌ ట్యాక్సీ, స్నాక్‌బార్‌..
అంతర్జాతీయ ప్రయాణికులను తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రీపెయిడ్‌ ట్యాక్సీల కోసం ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థను ఎంపిక చేశారు. విమానాశ్రయంలోని స్వదేశీ ప్రయాణికులకు సేవలు అందిస్తున్న సంస్థే ఇక్కడా సేవలు అందించనుంది. స్నాక్‌ బార్‌ కోసం టెండర్లను పిలిచారు. ప్రయాణికుల కార్ల పార్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.
ముఖ్యమంత్రి కార్యాలయం సైతం అంతర్జాతీయ సర్వీసులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పటికే విమానాశ్రయంలోని ఏర్పాట్లు, అనుమతుల గురించి అధికారులను తాజాగా అడిగి తెలుసుకున్నారు. విదేశాలకు విమానాలను నడిపేందుకు ఎయిర్‌లైన్స్‌ సంస్థలను ఒప్పించే బాధ్యతను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇక చేపట్టనుంది.

Link to comment
Share on other sites

Vij airport waits for 1st international flight

Vijayawada: The Vijayawada International Airport at Gannavaram is waiting for the launch of services to foreign destinations. The old terminal has been renovated to operate international flights, and airport authorities are waiting for operators to start the services.

The airport at Gannavaram is witnessing 50 movements per day to 12 cities in the country. While renovation, Airports Authority of India (AAI) faced several challenges such as poor services and lack of basic infrastructure. After the bifurcation of the state, one terminal with a built-up area of 1,100 square metre, a single conveyor belt, and four check-in points were there. The AAI and the state government constructed the new terminal of 13,300 sqm built-up an area for domestic operations with, and special VVIP lounges. They also focused on renovation of the old terminal for international services. Airport director, G Madhusudhana Rao, said: “We completed the renovation of the old terminal, where we increased the number of conveyor belts, boarding counters, and security check centres.”

 
He said, “We have written a letter to Air India, requesting them to start international services. We are waiting for their acceptance as we are ready to handle international services. Many private airlines operators are contacting us in this regard.”

Many businessmen are urging the government to start international connectivity, which will do good for their work. Muthavarapu Murali Krishna, representative of AP Chamber of Commerce and Industry, said, “This will take trade and commerce to next level. Direct flights from Mumbai made our work easy, and we need connectivity to Dubai, which is a gateway to the world.”

 
Link to comment
Share on other sites

విజయవాడకు ఎయిర్‌పోర్టుకు ఐఎస్‌వో - 9001
03-04-2018 07:23:22
 
636583370027229299.jpg
  •  అంతర్జాతీయ హోదానే కాదు.. ప్రమాణాల్లోనూ అంతే!
  •  క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (క్యూఎంఎస్‌)లో అత్యున్నత ప్రమాణం
  •  నెల రోజులుగా విజయవాడ ఎయిర్‌పోర్టు ఐఎ్‌సవో బృందాల పరిశీలన
  •  నిరంతరంగా ప్రయాణికులకు నాణ్యమైన సేవలు ఇస్తున్నారని గుర్తింపు
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ స్థాయినే కాదు.. ఆస్థాయి ప్రమాణాలను సైతం విజయవాడ ఎయిర్‌పోర్టు అందిపుచ్చుకుంది. నిన్నటికి నిన్న బెస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన విజయవాడ ఎయిర్‌పోర్టు... తాజాగా నాణ్యతలో భేష్‌ అనిపించింది. ప్రయాణికులకు సౌకర్యాలు, సదుపాయాలు, సేవలు నాణ్యంగా అందిస్తున్నందుకు అత్యుత్తమమైన ఐఎ్‌సవో- 9001/2015 ప్రమాణాన్ని సాధించింది. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌ (ఐఎ్‌సఓ) సంస్థ తాజాగా విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఈ మేరకు ఐఎ్‌సవో - 9001 ప్రామాణికతను కల్పిస్తూ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావుకు సర్టిఫికెట్‌ను అందించింది. గత నెలరోజులుగా క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (క్యూఎంఎస్‌) విధానంలో విజయవాడ ఎయిర్‌పోర్టు అందిస్తున్న సేవలను ఈ సంస్థకు చెందిన బృందాలు విజయవాడ ఎయిర్‌పోర్టును అధ్యయనం చేశాయి. ప్రయాణికులకు అందించే అన్ని సేవలపై ఈ బృందాలు దృష్టి సారించాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు లేకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వాటన్నింటిని ఎంత నాణ్యతగా అందిస్తున్నారో పరిశీలించటం జరిగింది. ఇప్పటికే టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి సంబంధించి జాతీయస్థాయి అవార్డును సాధించింది. టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి వచ్చే వారికి ప్రయాణ పరంగా అందించే సేవలు సంతృప్తికర స్థాయిలో ఉండే విధంగా ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. విశాలమైన ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌లో సకల సదుపాయాలు, సేవలను నాణ్యతతో అందించటం జరుగుతోంది.
 
ఒక విమానయాన సంస్థకు చెందిన కౌంటర్లు నిర్ణీత సమయంలో ఉపయోగించలేకపోతే అప్పుడే సర్వీసును ప్రారంభించే మరో ఎయిర్‌లైన్స్‌ సంస్థ చెక్‌ ఇన్‌ కౌంటర్లను ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేసిన క్యూట్‌ ఫెసిలిటీ సత్ఫలితాలను ఇస్తోంది. సీతా అనే ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా చెక్‌ ఇన్‌ కౌంటర్స్‌ నిర్వహణ జరుగుతోంది. ప్రయాణికులు ఎక్కువ సేపు క్యూలైన్లలో నుంచోకుండా ఉండటానికి సెల్‌ ్ఫచెకిన్‌ పాయింట్లను ఏర్పాటు చేయించటం జరిగింది. హ్యాండ్‌ బ్యాగులకు ట్యాగ్‌ విధానాన్ని రద్దు చేసేందుకు ట్యాగ్‌లెస్‌ కాన్సె్‌ప్టను తీసుకు వచ్చారు. సీసీ కెమెరాల ద్వారా బ్యాగేజీని ఐడెంటిఫికేషన్‌ చేసే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్స్‌ రే బ్యాగేజీ మెషీన్లు, హ్యాండ్‌ బ్యాగేజీ స్కానింగ్‌ మెషీన్లను అవసరాల కంటే ఎక్కువుగానే సంసిద్ధం చేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో ఆరు ఎక్స్‌రే బ్యాగేజీ స్కాన్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. సెర్మోనియల్‌ లాంజ్‌లో క్రమపద్ధతిలో సౌకర్యవంతమైన సదుపాయాలను కల్పించారు. మంచి సీటింగ్‌, వెయిటింగ్‌ హాల్‌, వీఐపీ లాంజ్‌ , కాఫీ స్నాక్‌ బార్స్‌ , దుకాణాలు, ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లలకు పాలు ఇవ్వటానికి ప్రత్యేక ఏర్పాట్లు, ఓన్లీ స్మోకింగ్‌ రూమ్స్‌ వంటి అనేక సదుపాయాలను కల్పించారు. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకులు సులభతరంగా సేవలు పొందటానికి వీలుగా సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సిగ్నేజ్‌ వ్యవస్థ కూడా సౌకర్యంగా ఉంది. దీంతో పాటు విశాలమైన పార్కింగ్‌ సదుపాయం కూడా కల్పించటం జరిగింది. టెర్మినల్‌ బిల్డింగ్‌ నుంచి రన్‌వే మీదకు వెళ్ళే వరకు వివిధ సేవలను, సదుపాయాలను, నిర్వహణను ఎంతో నైపుణ్యవంతంగా అందిస్తున్నందుకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు అత్యున్నత ప్రమాణం ఐఎ్‌సవో - 9001 దక్కింది.
Link to comment
Share on other sites

గన్నవరం నుంచి ఇండిగో అదనపు సర్వీసులు ప్రారంభం
05-04-2018 08:22:46
 
636585133674253773.jpg
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి చెన్నై, బెంగళూరుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ రెండు విమాన సర్వీసులను బుధవారం ప్రారంభించింది. రోజూ మధ్యాహ్నం 13.30 గంటలకు ఇక్కడ నుంచి బెంగళూరు, 20.50కు చెన్నైకి రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో 74 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు 5 సర్వీసులను ఇండిగో నడుపుతోంది.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

ganna2.jpg

I see similar boards in PUNE i really hate it, there is English names also there is exact context in hindi script.  sad to see here :wall: 

welcome badulu swagatam ani pettochu ga :wall: 

Link to comment
Share on other sites

రన్‌వే విస్తరణ 55 శాతం పూర్తి
11-04-2018 08:16:50
 
636590314116118784.jpg
  • పనులన్నీ కొలిక్కి
  • ఎర్త్‌ ఫిల్లింగ్‌ దాదాపు పూర్తి
  • ప్రాజెక్టు వ్యయం రూ.117 కోట్లలో రూ.58 కోట్ల చెల్లింపు
  • నూతన సంవత్సరం అందుబాటులోకి..
విజయవాడ: విమానాశ్రయ రన్‌వే విస్తరణ పనులు పరుగులు పెడుతున్నాయి. పది నెలల కాలంలో సగభాగం పూర్తయ్యాయి. విస్తరణ కోసం సేకరించిన 600 ఎకరాల భూముల్లో ప్రస్తుతం ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులు పతాక స్థాయిలో జరుగుతున్నాయి. విస్తరణలో ఈ పనులే కీలకం. మొత్తం ప్రాజెక్టులో దాదాపు 70 శాతం మేర ఎర్త్‌ఫిల్లింగ్‌ పని ఉంది. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మయ్యలింగం చెరువు నుంచి మట్టిని ఇక్కడికి తరలిస్తున్నారు. ఈ పనులు మరో రెండు నెలలు జరుగుతాయి. ఆ తర్వాత కాంక్రీట్‌ పనులు, ఆ తర్వాత బీఎం, ఎస్‌డీఏసీ, డీఏసీ విధానంలో మూడు లేయర్లతో రన్‌వేను మరింత బలోపేతం చేసే పనులు జరుగుతాయి.
 
  విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ కోసం రూ.117 కోట్ల వ్యయంతో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) టెండర్లు పిలిచింది. పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కాంట్రాక్టును దక్కించుకుంది. పది నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు రూ.58 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. వాస్తవానికి రన్‌వే ప్రాజెక్టు వ్యయం రూ.98 కోట్లు మాత్రమే! మిగిలిన వ్యయం జీఎస్టీ కిందకు వెళుతుంది. విస్తరణ పనులు వచ్చే ఏడాదికి పూర్తవుతాయి. విస్తరించిన రన్‌వే వచ్చేఏడాది ప్రారంభం అవుతుంది. నూతన రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్టుగా ఇది భాసిల్లుతుంది.
 
   విశాఖపట్నం, రాజమండ్రి, చిత్తూరు ఎయిర్‌పోర్టులు కూడా విజయవాడ తర్వాత స్థానంలోనే ఉంటాయి. ప్రస్తుతం రాజమండ్రి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించటం వల్ల విజయవాడ ప్రస్తుత రన్‌వేతో సమానంగా ఉంది. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే పొడవు ప్రస్తుతం 7500 అడుగులు (2286 మీటర్లు). దీనిని మరో 3500 అడుగులు (1704 మీటర్ల) మేర ప్రస్తుతం పొడిగిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు అదనపు రన్‌వే అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో అత్యంత పొడవైన రన్‌వేగా రికార్డుకెక్కుతుంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...