Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

విశ్వకర్మను మెప్పించేలా..! 
కొత్త టెర్మినల్‌కు విశ్వకర్మ 2018 అవార్డు 
గన్నవరం విమానాశ్రయానికి మరో ఘనత 
ఈనాడు, అమరావతి 
amr-gen1a.jpg

న్నవరం విమానాశ్రయంలో రెండున్నరేళ్ల కిందటి వరకూ రేకుల షెడ్డులాంటి టెర్మినల్‌ భవనం ఉండేది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విశ్వకర్మ అవార్డును గెలుచుకున్న అధునాతన టెర్మినల్‌ భవనం స్థాయికి ఎదిగింది. గన్నవరం విమానాశ్రయం ఖ్యాతి మరోసారి దేశవ్యాప్తమైంది. ఈ ఏడాది కేంద్రం ఇచ్చే విశ్వకర్మ అవార్డును గన్నవరం విమానాశ్రయంలో నిర్మించిన నూతన టెర్మినల్‌ భవనం దక్కించుకుంది. ఈ రెండున్నరేళ్ల అతితక్కువ కాలంలోనే విమానాశ్రయం రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో పాటు.. ప్రయాణికులు ఐదారు రెట్లు పెరిగారు. కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్న సమయంలో అశోక్‌గజపతిరాజు వచ్చి టెర్మినల్‌ను చూసి బస్టాండ్‌ కంటే దారుణంగా ఉందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన రూ.160 కోట్లను నూతన టెర్మినల్‌ భవనం కోసం తనశాఖ నుంచి అశోక్‌ కేటాయించారు. అనుకున్న సమయంలోగా పూర్తిచేసేందుకు టెర్మినల్‌ నిర్మాణాన్ని ప్రారంభించి.. 2017 జనవరి నాటికి సిద్ధం చేశారు. జనవరి 12న ఘనంగా.. ప్రారంభించారు. విమానాశ్రయంలో ఉన్న పాత టెర్మినల్‌ భవనంతో సంబంధం లేకుండా.. నూతన భవనం నిర్మించారు. 9520చదరపు మీటర్ల విస్తీర్ణంలో గంటకు 500 మంది ప్రయాణికులు ఒకేసారి రాకపోకలు సాగించేలా ఏటా పది నుంచి పదిహేను లక్షల మంది సామర్థ్యంతో నూతన టెర్మినల్‌ను నిర్మించారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఓ లాంజ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడే కాన్ఫరెన్స్‌లు, సమావేశాలను నిర్వహించుకునేందుకూ సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం కేంద్ర విశ్వకర్మ అవార్డును నూతన టెర్మినల్‌ భవనం, దానిలో ఉన్న అధునాతన లాంజ్‌లకు సంబంధించే ఇచ్చారు.

దేశంలో ఎక్కడా లేని ఆకృతిలో.. 
గన్నవరం విమానాశ్రయంలో నిర్మించిన నూతన టెర్మినల్‌ భవనం ఆకృతి దేశంలోనే ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దారు. తక్కువ ఎత్తులోనే లోపల రెండు ఫ్లోర్లుగా నిర్మాణం చేపట్టారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల టెర్మినల్‌ భవనాలు చాలా ఎత్తుగా ఉండి.. ఎదురుగా నిలబడి చూస్తే.. పూర్తి ఆకృతి కనిపించవు. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్‌ను ఎక్కడి నుంచి నిలబడి చూసినా.. మొత్తం ఆకృతి కనిపించేంత ఎత్తులోనే.. విశాలంగా నిర్మించారు. దీనిలో ఎక్కడా లేనివిధంగా ప్రముఖులు, సాధారణ ప్రయాణికులు వేర్వేరుగా లోపలికి వచ్చేందుకు రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. అందుకే.. ప్రస్తుతం రోజూ పదుల సంఖ్యలో దేశవిదేశీ ప్రముఖులు ఇక్కడికి వస్తున్నా.. సాధారణ ప్రయాణికులకు ఆటంకం లేకుండా వెళ్లిపోయేందుకు వీలుకలిగింది. నూతన టెర్మినల్‌ భవనాన్ని దేశీయ విమాన సర్వీసుల కోసం పూర్తిగా కేటాయించారు. దేశీయంగా ఇప్పటికే ఎనిమిది నగరాలకు విమాన సర్వీసులు, ఏటా ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు దీనిలోంచే రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో ప్రారంభించబోయే అంతర్జాతీయ సర్వీసుల కోసం పాత టెర్మినల్‌ను రూ.రెండున్నర కోట్లతో ఆధునికీకరించారు.

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
విజయవాడ నుంచి ఛలో సింగపూర్, మలేషియా..!
12-03-2018 06:51:19
 
636564342777663195.jpg
  • ‘సిల్క్‌ ఎయిర్‌’ సంస్థ ఆసక్తి
  • టీమ్‌ విజయవాడ ఎయిర్‌పోర్టు సందర్శన
  • అంతర్జాతీయ టెర్మినల్‌ పరిశీలన
  • సింగపూర్‌, మలేషియా సర్వీసులపై ఆసక్తి
  • ఇమిగ్రేషన్‌ ఏర్పడిన 45 రోజుల్లో..
  • దుబాయ్‌, షార్జాలకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ !
 
సిల్క్‌ ఎయిర్‌వేస్‌ విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌, మలేషియా దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించింది.
 
 
విజయవాడ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌, మలేషియాలకు అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభానికి అడుగులు పడుతున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్టును సిల్క్‌ ఎయిర్‌వేస్‌ టీమ్‌ సందర్శించింది. విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మదుసూధనరావుతో ఇక్కడి వసతులపై ఈ బృందం చర్చలు జరిపింది. సిల్క్‌ ఎయిర్‌వేస్‌ అన్నది సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ. ఈ సంస్థ అంతర్జాతీయంగా సర్వీసులు నడుపుతోంది.
 
    ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగా విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించటానికి అవకాశాలు ఉన్నాయని సింగపూర్‌ ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు విమానయాన సంస్థలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే సంస్థలకు మినిమం సీట్‌ గ్యారెంటీ కల్పిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆక్యుపెన్సీ లేకపోతే మినిమం గ్యారెంటీ ప్రకారం ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయా విమానయాన సంస్థలకు చెల్లిస్తుంది. ఉడాన్‌ పథకంలో భాగంగా ప్రాంతీయ రూట్లకు నడిపే విమానయాన సంస్థలకు కూడా ప్రభుత్వం మినిమం గ్యారెంటీ కల్పిస్తోంది. విజయవాడ నుంచి విమానాలు నడిపే ట్రూజెట్‌ సంస్థకు ఈ విధంగానే ప్రభుత్వం హామీ ఇచ్చింది. సిల్క్‌ఎయిర్‌వేస్‌ విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌, మలేషియా దేశాలకు విమాన సర్వీసులు నడపటానికి ఆసక్తి చూ పిస్తోంది.
 
    అయితే ఇక్కడి అధికారులకు వీటికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. ప్రభుత్వ స్థాయిలో మాట్లాడిన త ర్వాత తమ నిర్ణయాన్ని తెలిపే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టులో సిద్ధం చేస్తున్న టెర్మినల్‌ను సిల్క్‌ ఎయిర్‌వేస్‌ పరిశీలించింది. ఇందులోని సదుపాయాలు, రన్‌వే, పార్కింగ్‌ బేలు వంటి సమాచారాన్ని స్వీకరించింది. దీంతో పాటు ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాల నుంచి ఈ బృందం ఆరాతీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిబ్బంది శిక్షణలో ఉన్నందున మరికొంత కాలం సమయం పట్టే అవకాశం ఉంది. ఇమిగ్రేషన్‌ విభాగం ఏర్పాటు కాగానే 45 రోజులలో విజయవాడ నుంచి దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించటానికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
Link to comment
Share on other sites

నేరుగా సింగపూర్‌..! 
అంతర్జాతీయ సర్వీసుల అంశం పరిశీలన 
గన్నవరం విమానాశ్రయాన్ని సందర్శించిన సిల్క్‌ ఎయిర్‌ బృందం 
ఈనాడు, అమరావతి 
amr-top1a.jpg

సింగపూర్‌ విమానయాన సంస్థకు చెందిన సిల్క్‌ ఎయిర్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టింది. సిల్క్‌ఎయిర్‌ భారత ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలోని బృందం విమానాశ్రయాన్ని తాజాగా సందర్శించింది. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. సింగపూర్‌ నుంచి ఇక్కడికి నేరుగా విమాన సర్వీసులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించడానికే ఈ బృందం విచ్చేసింది. అంతర్జాతీయ టెర్మినల్‌ భవనంలో ఉన్న ఏర్పాట్లు, రన్‌వే సహా అన్నింటినీ పరిశీలించారు. విమానాశ్రయంలో ఉన్న ఏర్పాట్లపై వారు సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. విజయవాడ నుంచి ముంబయికి ప్రస్తుతం నడుస్తున్న ఎయిరిండియా సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు కేంద్ర విమానయానశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా సిల్క్‌ఎయిర్‌ కూడా సానుకూలంగా స్పందించడం శుభపరిణామం.

విజయవాడ నుంచి నేరుగా దుబాయ్‌, సింగపూర్‌ దేశాలకు విమాన సర్వీసులను తొలుత ప్రారంభించాలని స్థానిక పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఆ రెండు దేశాలకు వెళ్లిపోతే ప్రపంచంలో ఎక్కడికైనా తేలికగా చేరుకునేందుకు విమాన కనెక్టివిటీ ఉంటుంది. అందుకే తొలుత కనీసం వారంలో రెండు మూడు రోజులైనా దుబాయ్‌, సింగపూర్‌లకు సర్వీసులను నడపాలని ఇక్కడి వాళ్లు కోరుతున్నారు. మార్చి 15 తర్వాత అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉంటామంటూ విమానాశ్రయం అధికారులు ఎయిరిండియాకు కొద్దిరోజుల కిందట లేఖను సైతం సమర్పించారు. విదేశీ సర్వీసును ప్రారంభించాలంటే కనీసం 45 రోజుల ముందు నుంచి టిక్కెట్లను విక్రయించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా ఎయిరిండియాకు విమానాశ్రయం తరఫున అనుమతి తెలియజేస్తూ లేఖను పంపించారు.

సేవలకు సిద్ధమైన సిబ్బంది.. 
విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన 15 మంది సిబ్బంది గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇమ్మిగ్రేషన్‌ సేవలను స్థానిక పోలీసుల ద్వారానే నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. తొలి దశలో 15 మంది పోలీసు సిబ్బందికి గన్నవరం విమానాశ్రయంలో వారం రోజుల శిక్షణ అందించారు. కేంద్ర ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది వచ్చి వీరికి తర్ఫీదునిచ్చారు. అనంతరం హైదరాబాద్‌ శంషాబాద్‌లో వీరికి మరో పది రోజుల శిక్షణ అందించారు. విదేశీ విమానాలు తిరగాలంటే ఇమ్మిగ్రేషన్‌ విభాగమే అత్యంత కీలకం. అందుకే ముందుగా సిబ్బందిని సిద్ధం చేశారు.

Link to comment
Share on other sites

జాతీయ అవార్డు మా బాధ్యతను పెంచింది..
13-03-2018 08:54:34
 
636565280752750983.jpg
  • సెర్మోనియల్‌ లాంజ్‌ నిర్మాణ శైలి దేశంలోనే లేదు
  • ఇన్నోవేటివ్‌గా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌
  • త్వరలో మిలియన్‌ మార్క్‌ చేరుకోవటం ఖాయం
  • పురోగతిలో రన్‌వే పనులు
  • విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు
విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ అవార్డును సాధించటం మా బాధ్యతను మరింత పెంచింది! ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ - సెర్మోనియల్‌ లాంజ్‌ను అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేయటానికి పెద్ద వ్యూహమే ఉంది. దేశంలోనే ఇలాంటి నిర్మాణశైలి కలిగిన టెర్మినల్‌ లేదనే చెప్పాలి. ఈ అవార్డు స్ఫూర్తితో రానున్న రోజుల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను వరల్డ్‌క్లాస్‌ ప్రమాణాలతో మరింత ఇన్నోవేటివ్‌గా నిర్ణీత సమయం కంటే ముందుగానే పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం విజయవాడ విమానాశ్రయం ప్రయాణీకుల రాకపోకల పరంగా ‘మిలియన్‌’ మార్క్‌ను దాటడం ఖాయం..’ అని విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు అన్నారు. నీతి ఆయోగ్‌ పరిధిలోని కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ర్టీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సీఐడీసీ) పంచకర్మ - 2018 పదో అవార్డుల కార్యక్రమానికి బెస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు కేటగిరి అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌తో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి...
 
  • జాతీయ అవార్డు సాధించటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా కృషికి తగిన గుర్తింపుగా భావిస్తున్నాం. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు దేశీయంగా సాధించిన మొట్టమొదటి అవార్డు ఇది. 2016-17 మధ్యకాలంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ - సెర్మోనియల్‌ లాంజ్‌ను అతి తక్కువ వ్యవధిలో నిర్మించటంతో పాటు అనేక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను గమనంలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు.
  • ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ - సెర్మోనియల్‌ లాంజ్‌ను కేవలం 11 నెలల్లో నిర్మించటం ఒక అరుదైన విషయం. ప్రీ కాస్ట్‌ విధానంలో దీనిని నిర్మించటం జరిగింది. ప్రీకాస్ట మౌల్డింగ్‌ బయటే జరిగే విధంగా కాంట్రాక్టు సంస్థకు సూచించాం. టెర్మినల్‌ డిజైన్‌కు అనుగుణంగా ప్రీకాస్ట్‌ మౌల్డింగ్‌ అన్నది ఫ్యాక్టరీలోనే నిర్వహించటం ద్వారా సగానికి సగం పని పూర్తయినట్టు అయింది. దీంతో తక్కువ సమయంలో టెర్మినల్‌ బిల్డింగ్‌ రూపుదిద్దుకుంది.
  • అవార్డు స్ఫూర్తితో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ విధానానికి సంబంధించి వరల్డ్‌క్లాస్‌ ప్రమాణాలను పాటిస్తాం. ప్రపంచంలోనే ఇన్నోవేటివ్‌గా ఉండేలా నిర్మించాలన్నది మా అభిమతం. రూ.600 కోట్ల వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రం కూడా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ) నియమించటం జరిగింది. వ రల్డ్‌ క్లాస్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ఏర్పాటుకు అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. వినూత్నమైన నిర్మాణంగా చేపడతాం.
  • పాత టెర్మినల్‌ను ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌గా ఆధునీకరించటం పూర్తయింది. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. లగేజీ చెకిన్‌ యంత్రాలు మూడు అందుబాటులో ఉంచాం. ఇంటీరియర్‌ పనులు పూర్తయ్యాయి. అరైవల్‌ బ్లాక్‌ వైపు మరో 400 చదరపు మీటర్ల మేర విస్తరించాం. డిపార్చర్‌ బ్లాక్‌లో కూడా ఏర్పాట్లు చేపట్టాం. పాసింజర్‌ హెల్త్‌ టెస్టింగ్‌ సెంటర్‌, చైల్డ్‌ మిల్క్‌ఫీడింగ్‌ రూమ్‌, సమృద్ధిగా మరుగుదొడ్లు వంటి అనేక సదుపాయాలను అభివృద్ధి చేశాం. ఇమిగ్రేషన్‌కు సంబంధించి సర్వర్స్‌, కంప్యూటర్స్‌ రావాల్సి ఉన్నాయి.
  • అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధి రేటు అనూహ్యంగా పెరిగింది. 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం మిలియన్‌ మార్క్‌ దాటడం ఖచ్చితంగా చూడగలం. నేను ఇక్కడికి రాకముందు కేవలం 12 ఫ్లైట్‌ మూమెంట్స్‌ మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్య 50కి చేరుకుంది.
  • రన్‌వే విస్తరణ పనులు పురోగతిలోనే ఉన్నాయి. ఎర్త్‌ ఫిల్లింగ్‌ పనులు సకాలంలోనే జరుగుతున్నాయి. బుద్ధవరం - దావాజిగూడెం రోడ్డు మినహా స్వాధీనం చేసుకున్న భూములలో ఎర్త్‌ఫిల్లింగ్‌ ముమ్మరంగా జరుగుతోంది. రోడ్డు డైవర్షన్‌ చేయమని కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకు వెళ్లాం. లేదంటే తాత్కాలికంగా రన్‌వే చివరి నుంచి వక్రాకారం మార్గాన్ని ఇవ్వటానికి సుముఖంగా ఉన్నాయి.
Link to comment
Share on other sites

గన్నవరంలో అంతర్జాతీయ టెర్మినల్ రెడీ..!
14-03-2018 09:03:42
 
636566150230413165.jpg
  • ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఏఏఐ సమాచారం
  • ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ కౌంటర్లు, కార్యాలయాలు సిద్ధం
  • ఇంటీరియర్‌ పూర్తి.. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్స్‌ ముస్తాబు
విజయవాడ: అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ సిద్ధమైంది! అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సివిల్‌ నిర్మాణాలు, ఇంటీరియర్‌, ఎలక్ర్టికల్‌, కేబులింగ్‌ వంటి వాటితో పాటు ప్రధానమైన ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ కార్యాలయాలు, వాటి చెకిన్‌ పాయింట్లు సిద్ధమయ్యాయి. మార్చి నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తామని ముందుగా చెప్పినట్టే చేసి చూపించారు. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్స్‌ సుందరంగా ముస్తాబయ్యాయి. బ్యాగేజీ చెకిన్‌ యంత్రాలు సిద్ధమయ్యాయి. లగేజి కౌంటర్లు, ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు, సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటివన్నీ పూర్తయ్యాయి.
 
    రన్‌వే వైపు ల్యాండ్‌ స్కేపింగ్‌, టెర్మినల్‌ లోపల సీసీ కెమెరాలు, డిస్‌ప్లే బోర్డులు.. అనేకం ఏర్పాటయ్యాయి. చైల్డ్‌ మిల్క్‌ఫీడ్‌ రూమ్‌, స్మోకింగ్‌ జోన్‌తో పాటు కమర్షియల్‌గా ఎస్టాబ్లిష్‌ చేయటానికి అనేక ఏర్పాట్లు చేపట్టారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావటమే ఇక మిగిలిన ప్రక్రియ. ఇమిగ్రేషన్‌ అధికారిగా పోలీసు ఉన్నతాధికారి గజరావు భూపాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్‌ స్టాఫ్‌కు సంబంధించి శిక్షణ నడుస్తోంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ చెకిన్‌ పాయింట్లు, కార్యాలయం సిద్ధమైంది. ఇందులో కంప్యూటర్లను సంబంధిత శాఖ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కస్టమ్స్‌ చెక్‌ ఇన్‌ కౌంటర్లు, కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. కస్టమ్స్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు. ఆ శాఖ ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కస్టమ్స్‌ శాఖ విజయవాడ ఎయిర్‌పోర్టుపై అంత సీరియస్‌గా దృష్టి సారించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
 
    అంతర్జాతీయ హోదా వచ్చినా ఆ శాఖ పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వటంలో అంతులేని తాత్సారం నడుస్తోందని చెప్పవచ్చు. కస్టమ్స్‌ జాప్యం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ విమానాల రాకపోకల మీద ఇది ప్రభావితం చూపే అవకాశం లేదు. ఎలాగూ అంతర్జాతీయ స్థాయితో పాటు ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ కూడా వచ్చింది కాబట్టి విదేశాలకు విమాన సర్వీసులు నడపటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుగా ఇమిగ్రేషన్‌ పలకరిస్తుంది. ప్రయాణికుడు అంతర్జాతీయ ప్రయాణానికి అర్హుడో కాదో ఈ శాఖ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రయాణికుడు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు హెల్త్‌ చెకప్‌ సెంటర్‌ ఉంటుంది. మూడవదిగా కస్టమ్స్‌. ఇది లగేజీని చెక్‌ చేస్తుంది.
 
మేం సిద్ధం : ఏఏఐ
అంతర్జాతీయ విమానాలు నడపటానికి విజయవాడలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు లేఖ రాశారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమానాలు నడపటానికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ముంబయికి విమానయాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసును అంతర్జాతీయ సర్వీసుగా కూడా ఉపయోగించాలని నిర్ణయించింది. దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులను ప్రారంభించాలన్న ఆసక్తితో ఈ సంస్థ ఉంది. అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ సిద్ధం కాకపోవటం, ఇమిగ్రేషన్‌ సాకారం కాకపోవడం వల్ల ఈ రెండు సానుకూలమయ్యే వరకు ముంబయికి మాత్రమే సర్వీసును నడపాలని నిర్ణయించింది. ఇప్పుడు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి కాబట్టి.. అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చన్న సమాచారాన్ని తెలియచేస్తున్నామని అధికారికంగా ఇక్కడి అధికారులు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు సమాచారాన్ని అందించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నుంచి సమాచారం రావాల్సి ఉంది.
Link to comment
Share on other sites

8 hours ago, sonykongara said:
గన్నవరంలో అంతర్జాతీయ టెర్మినల్ రెడీ..!
14-03-2018 09:03:42
 
636566150230413165.jpg
  • ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు ఏఏఐ సమాచారం
  • ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ కౌంటర్లు, కార్యాలయాలు సిద్ధం
  • ఇంటీరియర్‌ పూర్తి.. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్స్‌ ముస్తాబు
విజయవాడ: అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ సిద్ధమైంది! అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించటానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సివిల్‌ నిర్మాణాలు, ఇంటీరియర్‌, ఎలక్ర్టికల్‌, కేబులింగ్‌ వంటి వాటితో పాటు ప్రధానమైన ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ కార్యాలయాలు, వాటి చెకిన్‌ పాయింట్లు సిద్ధమయ్యాయి. మార్చి నెలలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు వస్తామని ముందుగా చెప్పినట్టే చేసి చూపించారు. అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్స్‌ సుందరంగా ముస్తాబయ్యాయి. బ్యాగేజీ చెకిన్‌ యంత్రాలు సిద్ధమయ్యాయి. లగేజి కౌంటర్లు, ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు, సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటివన్నీ పూర్తయ్యాయి.
 
    రన్‌వే వైపు ల్యాండ్‌ స్కేపింగ్‌, టెర్మినల్‌ లోపల సీసీ కెమెరాలు, డిస్‌ప్లే బోర్డులు.. అనేకం ఏర్పాటయ్యాయి. చైల్డ్‌ మిల్క్‌ఫీడ్‌ రూమ్‌, స్మోకింగ్‌ జోన్‌తో పాటు కమర్షియల్‌గా ఎస్టాబ్లిష్‌ చేయటానికి అనేక ఏర్పాట్లు చేపట్టారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కావటమే ఇక మిగిలిన ప్రక్రియ. ఇమిగ్రేషన్‌ అధికారిగా పోలీసు ఉన్నతాధికారి గజరావు భూపాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇమిగ్రేషన్‌ స్టాఫ్‌కు సంబంధించి శిక్షణ నడుస్తోంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌ చెకిన్‌ పాయింట్లు, కార్యాలయం సిద్ధమైంది. ఇందులో కంప్యూటర్లను సంబంధిత శాఖ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కస్టమ్స్‌ చెక్‌ ఇన్‌ కౌంటర్లు, కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. కస్టమ్స్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ ఇంకా వెలువడలేదు. ఆ శాఖ ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కస్టమ్స్‌ శాఖ విజయవాడ ఎయిర్‌పోర్టుపై అంత సీరియస్‌గా దృష్టి సారించటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
 
    అంతర్జాతీయ హోదా వచ్చినా ఆ శాఖ పట్టనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వటంలో అంతులేని తాత్సారం నడుస్తోందని చెప్పవచ్చు. కస్టమ్స్‌ జాప్యం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ విమానాల రాకపోకల మీద ఇది ప్రభావితం చూపే అవకాశం లేదు. ఎలాగూ అంతర్జాతీయ స్థాయితో పాటు ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ కూడా వచ్చింది కాబట్టి విదేశాలకు విమాన సర్వీసులు నడపటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుగా ఇమిగ్రేషన్‌ పలకరిస్తుంది. ప్రయాణికుడు అంతర్జాతీయ ప్రయాణానికి అర్హుడో కాదో ఈ శాఖ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ప్రయాణికుడు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిదీ తెలుసుకునేందుకు హెల్త్‌ చెకప్‌ సెంటర్‌ ఉంటుంది. మూడవదిగా కస్టమ్స్‌. ఇది లగేజీని చెక్‌ చేస్తుంది.
 
మేం సిద్ధం : ఏఏఐ
అంతర్జాతీయ విమానాలు నడపటానికి విజయవాడలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు లేఖ రాశారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమానాలు నడపటానికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ముంబయికి విమానయాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసును అంతర్జాతీయ సర్వీసుగా కూడా ఉపయోగించాలని నిర్ణయించింది. దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులను ప్రారంభించాలన్న ఆసక్తితో ఈ సంస్థ ఉంది. అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ సిద్ధం కాకపోవటం, ఇమిగ్రేషన్‌ సాకారం కాకపోవడం వల్ల ఈ రెండు సానుకూలమయ్యే వరకు ముంబయికి మాత్రమే సర్వీసును నడపాలని నిర్ణయించింది. ఇప్పుడు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి కాబట్టి.. అంతర్జాతీయ సర్వీసులు నడుపుకోవచ్చన్న సమాచారాన్ని తెలియచేస్తున్నామని అధికారికంగా ఇక్కడి అధికారులు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు సమాచారాన్ని అందించారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నుంచి సమాచారం రావాల్సి ఉంది.


Ayithe inkem...Customs notification will not be released by Modi Government....Let's forget this for this term

Link to comment
Share on other sites

మరో పార్కింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలి
18-03-2018 08:16:03
 
636569577623849733.jpg
  • ఎయిర్‌పోర్టులో ఒక్కటే పార్కింగ్‌ బూత్‌
  • తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు
గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఒకటే పార్కింగ్‌ బూత్‌ ఉండటం వల్ల వాహనాలలో వచ్చే ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎయిర్‌ పోర్టులోకి వచ్చే వాహనాలు పార్కింగ్‌ బూత్‌ వద్ద టోకెన్‌ తీసుకుని వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులను దింపటం లేక ఎక్కించుకుని టోకెన్‌ తీసుకున్న ఐదు నిమిషాలలోపు వస్తే ఎలాంటి చార్జీలు తీసుకోరు. ఐదు నిమిషాలు దాటితే బస్‌, ట్రక్స్‌కు రూ.50, కారు, ఆటోలకు రూ.35, ద్విచక్ర వాహనాలకు రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఎయిర్‌ ఇండియా, ట్రూజెట్‌, స్పైస్‌జెట్‌, ఇండిగో సర్వీస్‌లు గన్నవరం నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, కడప, ప్రాంతాలకు బయలుదేరి వెళతాయి.
 
   వీటిలో ఆ ప్రాంతాలకు వెళ్లేవారు వందల సంఖ్యలో ఉదయం పూట వాహనాలలో ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. పార్కింగ్‌ బూత్‌ ఒక్కటే ఉండటంతో ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ బాగా ఉంటుంది. వాహనాలు బారులు తీరి ఉండటం వల్ల ఆయా విమానాలలో వెళ్లే ప్రయాణికులకు ఎక్కువ సమయం ఇక్కడే పట్టడంతో బోర్డింగ్‌ ముగిసిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆలస్యమైతే విమాన సిబ్బంది విసుక్కుంటున్నారని వాపోతున్నారు. పార్కింగ్‌ బూత్‌లు అదనంగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

ప్రయాణికుల సేవలు అత్యాధునికం..!
19-03-2018 08:01:56
 
636570433157897768.jpg
  • టెర్మినల్‌ బిల్డింగ్‌లో చెక్‌ ఇన్‌ కౌంటర్ల వద్ద ‘క్యూట్‌ ఫెసిలిటీ’
  • సెల్ఫ్‌ చెక్‌ కోసం.. కస్‌ కౌంటర్లు - కియోస్క్‌లు
  • ట్యాగ్‌లెస్‌ హ్యాండ్‌ బ్యాగేజీ ... ప్రయోగాత్మకంగా పరీక్ష
  • ఉచిత వైఫై సేవలు
 
విజయవాడ: అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌లో ప్రయాణికులకు అధునాతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌పోర్టులో మొత్తం 18 చెక్‌ఇన్‌ కౌంటర్లు ఉన్నాయి. ఇప్పటివరకు వీటి నిర్వహణ మాన్యువల్‌ విధానంలో ఉండేది. ఈ విధానంలో ఏ విమానయాన సంస్థకు కేటాయించిన కౌంటర్లను ఆ విమానయాన సంస్థలు మాత్రమే ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. దీనివలన విజయవాడ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌లో చెక్‌ ఇన్‌ కౌంటర్ల దగ్గర విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. విమానయాన సంస్థలకు ప్రస్తుతం కేటాయించిన చెక్‌ఇన్‌ కౌంటర్లు కాకుండా అదనంగా మరికొన్నింటిని కల్పించ టంతో ప్రయాణికులు క్యూలో నిలబడకుండా ఉండే వ్యవస్థను అందుబాటులోకి తీసుకు తెచ్చారు. ఈ వ్యవస్థనే విమానాశ్రయ అధికారులు క్యూట్‌ ఫెసిలిటీగా పిలుస్తారు. ఈ విధా నంలో ఒక విమానయాన సంస్థకు చెందిన చెక్‌ ఇన్‌ కౌంటర్లను మరో విమానయాన సంస్థ ఉప యోగించుకుంటుంది. ఉదాహరణకు ట్రూజెట్‌ సర్వీసు ఉదయం 10 గంటలకు ఉంటుంది. పద కొండు గంటలకు స్పైస్‌జెట్‌ ఉంటుంది. స్పైస్‌జెట్‌ విమానం బయలుదేరే సమయానికి ట్రూజెట్‌ చెక్‌ ఇన్‌ కౌంటర్లు ఖాళీగా ఉంటాయి. కాబట్టి ఇలా నిర్ణీత సమయాలలో విమానసర్వీసులు లేని సందర్భంలో వాటి కౌంటర్లను కూడా మిగిలిన విమానయాన సంస్థలు ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ క్యూట్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు.
 
విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌లో సెల్ఫ్‌ చెకిన్‌ కౌంటర్ల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కస్‌ కౌంటర్లు - కియోస్క్‌లు అంటారు. చాలామంది విమాన ప్రయాణీకులు హ్యాండ్‌ బ్యాగులతో వస్తారు. ఇలాంటి వారి కోసం విమానాశ్రయంలో మూడు కస్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. పైన చెప్పుకున్న చెక్‌ ఇన్‌ కౌంటర్లకు వెళ్లనవసరం లేకుండానే ప్రయాణీకులే సెల్ఫ్‌ చెక్‌ ఇన్‌ చేసుకోవచ్చు. ఈ సేవలు విమానయాన సంస్థలతో అను సంధా నించారు. ఎయిర్‌పోర్టు నుంచి విమానాల ఆపరేషన్‌ చేపట్టే నాలుగు విమానయాన సంస్థలలో ఎయి ర్‌ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశాయి.
 
ట్యాగ్‌లెస్‌ హ్యాండ్‌ బ్యాగేజి
ఇప్పటి వరకు విమాన ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించి వారి బ్యాగేజీలకు ట్యాగ్‌లు వేయటం జరుగుతుంది. రాక , పోక రెండింటికీ రెండు ట్యాగ్‌లను వేయాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్‌లను చూసిన తర్వాత స్టాంపింగ్‌, సెక్యూరిటీ చెకింగ్‌, బోర్డింగ్‌ చెకిన్‌ వంటివి చేస్తారు. ఇలా కాకుండా సీసీ టీవీల విధానంలో పర్యవేక్షణ ద్వారా బ్యాగేజీకి ట్యాగ్‌లు లేకుండా చేసే విఽఽధానాన్ని విజయవాడ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
 
తనిఖీల కోసం...
ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌లో తనిఖీల కోసం మరిన్ని ఎక్స్‌రే బ్యాగేజీ మిషన్లను ఏర్పాటు చేశారు. రూ.2 కోట్ల వ్యయంతో మొత్తం 6 ఎక్స్‌రే బ్యాగేజీ మిషన్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. సెర్మోనియల్‌ లాంజ్‌లో చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని లైవ్‌గా తెలుసుకునేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు.
 
 
మరిన్ని ప్రయాణికుల సేవలు
విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌లో గతంలో ఎలక్ర్టానిక్‌ సిస్టమ్‌ మాన్యువల్‌ సేవలు ఉండేవి. ఇప్పుడు మెకనైజ్డ్‌ సిస్టమ్‌ మాన్యువల్‌ విధానంలో సేవలను అందిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో శక్తివంతమైన వైఫై సేవలను అందిస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు జియో సర్వీసు ప్రొవైడర్స్‌తో కూడా మాట్లాడి రెండింటి ద్వారా శక్తివంతమైన వైఫై సదుపాయాలను అందిస్తున్నారు. ఈ వైఫై కు కనెక్ట్‌ అయితే ఫోన్‌ నెంబర్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్‌ చేస్తే 1 జీబీ డేటా వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలోకి విజయవాడ ఎయిర్‌పోర్టు..?
19-03-2018 06:58:59
 
636570395383679926.jpg
విజయవాడ: త్వరలో జాతీయ పారామిలటరీ భద్రతా బలగాల (సీఐఎస్‌ఎఫ్‌) వ్యవస్థ పరిధిలోకి విజయవాడ ఎయిర్‌పోర్టు రానున్నది. ఉగ్రవాద కార్యకపాలను నిరోధించటంలో ఈ వ్యవస్థ అత్యుత్త మంగా పనిచేస్తుంది. మహారాష్ట్రలోని షిర్డ్డి గుజరాత్‌లోని జామ్నానగర్‌ విమా నాశ్రయాలు ప్రస్తుతం సంసిద్ధంగా ఉన్నాయి. మధ్యప్రదశ్‌లోని జబల్‌పూర్‌, ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ ఎయిర్‌ పోర్టులు కూడా ఈ స్థాయిని అందు కోనున్నాయి. గన్నవరం విమానా శ్రయంలో సీఐఎస్‌ ఎఫ్‌ ఫోర్సు ఏర్పాటుకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ నుంచి మౌఖికంగానే సమాచారం వచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమో దం పొందినప్పటికీ సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో కూడిన వ్యవస్థ ఏర్పడటానికి ప్రధానంగా పలు విమానాశ్రయాలలో సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల కూడా జాప్యం జరిగినట్లు సీఐఎస్‌ఎఫ్‌ ప్రస్తావిస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టుకు దాదాపు 235 మంది సాయుధ పారా మిలటరీ బలగాలను కేటాయించినట్టు తెలుస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌ , ఇక్కడి అధికారులను సంప్రదిస్తే త్వరగా సెక్యూరిటీ మౌలిక సదుపాయాలను కల్పించటానికి అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

గన్నవరం, షిర్డీకి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత!
19-03-2018 09:04:47
 
636570470865710555.jpg
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయానికి త్వరలో సీఐఎస్‌ఎఫ్‌(కేంద్ర పరిశ్రమల భద్రతా దళం)తో భద్రత కల్పించనున్నారు. దీంతోపాటు మహారాష్ట్రలోని షిర్డీ, గుజరాత్‌లోని జాంనగర్‌, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌ విమానాశ్రయాలకు కూడా సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పిస్తారు. కేంద్ర హోంశాఖ కొంత కాలం క్రితమే తుది అనుమతులు మంజూరు చేసినప్పటికీ, కొన్ని సమస్యల వల్ల అమలులో జాప్యం జరుగుతోంది. వాటిని త్వరలోనే పరిష్కరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 59 విమానాశ్రయాలకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత ఉంది. షిర్డీ విమానాశ్రయానికి వచ్చేనెల మొదట్లోనే అమలు చేసే అవకాశం ఉంది. సీఐఎస్‌ఎఫ్‌ అనేది విమానాశ్రయాల్లో భయోత్పాతక, విధ్వంసక ఘటనలకు తావు లేకుండా భద్రత కల్పించే జాతీయ దళం. విమానాశ్రయాల కోసం ఇందులో ఏఎస్‌జీ(ప్రత్యేక వైమానిక భద్రతా గ్రూప్‌) ఉంటుంది. హైజాక్‌లు, బాంబుదాడులు జరగకుండా పౌరవిమానాశ్రయాలను సురక్షితంగా ఉంచే బాధ్యత సీఐఎస్‌ఎఫ్‌దే.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...