Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

ఉడాన్‌  పథకమొచ్చింది 
గన్నవరం నుంచి కడపకు తొలి సర్వీసు 
మార్చి ఒకటి నుంచి ప్రారంభం 
చెన్నైకు ఉదయం 10.30కు మరో విమానం 
ఈనాడు, అమరావతి 

గన్నవరం విమానాశ్రయానికి మార్చి ఒకటి నుంచి సరికొత్త కళ రానుంది. ఇప్పటివరకు నిత్యం నడుస్తున్న 41 సర్వీసులకు తోడు మరో 12 కొత్తగా వచ్చి చేరుతున్నాయి. రోజూ వచ్చి, వెళ్లే సర్వీసుల సంఖ్య 53కు చేరనున్నాయి. వీటిలో భాగంగానే విజయవాడ నుంచి కడపకు తొలి 
విమాన సర్వీసు మార్చి ఒకటిన ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకంలో భాగంగా రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌(ఆర్‌సీఎం) కింద గన్నవరం నుంచి ప్రారంభమవుతున్న తొలి విమాన సర్వీసు కూడా ఇదే. అతి తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోనికి తేవడంతో పాటు చిన్న పట్టణాలు, నగరాల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంలో భాగంగా కేంద్రం ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొమ్మిది నెలల కిందట 2017 ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద నడిచే సర్వీసులు ఇప్పటివరకూ గన్నవరం నుంచి లేవు. ఉడాన్‌ పథకంలో భాగంగా విజయవాడ నుంచి ప్రారంభమవుతున్న తొలి సర్వీసు ట్రూజెట్‌ విమానయాన సంస్థ  నడుపుతోంది. రూ.700 ప్రారంభ ధర నుంచి ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఉడాన్‌లో భాగంగా నడిచే విమాన సర్వీసులకు టిక్కెట్‌ ధర రూ.2500 లోపే ఉంటుంది. అదికూడా 151 నుంచి 175కిలోమీటర్ల మధ్య దూరానికి రూ.1420, 176 నుంచి 200 కిలోమీటర్ల మధ్య దూరానికి రూ.1500 వరకూ ధర ఉంటుంది. ఈ పథకంలో భాగంగా నడిపే సర్వీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు ఉంటాయి. విజయవాడ నుంచి కడపకు ఈ సర్వీసు నిత్యం నడుస్తుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి కడపకు వెళుతుంది. తిరిగి కడప నుంచి ఇక్కడికి వచ్చి మళ్లీ హైదరాబాద్‌కు వెళుతుంది. రోజూ ఉదయం 7.45కు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.05కు కడపకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి బయలుదేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుతుంది. ఉదయం 10.55కు బయలుదేరి హైదరాబాద్‌కు వెళుతుంది.
చెన్నైకు ఉదయం సర్వీసు.. విజయవాడ నుంచి చెన్నైకు వెళ్లాలంటే ప్రస్తుతం మధ్యాహ్నం 12.35కు ఎయిరిండియా సర్వీసు ఉంది. దాని తర్వాత మళ్లీ మధ్యాహ్నం 2, సాయంత్రం 5.20కు స్పైస్‌జెట్‌ సర్వీసులు చెన్నై వెళ్లేందుకున్నాయి. తాజాగా మార్చి ఒకటి నుంచి స్పైస్‌జెట్‌ సంస్థ ఉదయం 10.30కు విజయవాడ నుంచి చెన్నైకు కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. దీనివల్ల ఉదయం 10.30కు విజయవాడలో బయలుదేరి 11.45కు చెన్నైకు చేరిపోవచ్చు. నిత్యం నగరం నుంచి నడుస్తున్న మూడు సర్వీసులకూ భారీ డిమాండ్‌ ఉంది. దీంతో ఉదయం వేళ మరో సర్వీసును స్పైస్‌జెట్‌ ప్రారంభిస్తోంది. మార్చి రెండు నుంచి ఇండిగో సంస్థ సైతం నిత్యం పది సర్వీసులను హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నైలకు ప్రారంభిస్తోంది.

Link to comment
Share on other sites

గన్నవరం విమానాశ్రయానికి మార్చి ఒకటి నుంచి సరికొత్త కళ రానుంది. ఇప్పటివరకు నిత్యం నడుస్తున్న 41 సర్వీసులకు తోడు మరో 12 కొత్తగా వచ్చి చేరుతున్నాయి. రోజూ వచ్చి, వెళ్లే సర్వీసుల సంఖ్య 53కు చేరనుంది. వీటిలో భాగంగానే విజయవాడ నుంచి కడపకు తొలి విమాన సర్వీసు మార్చి ఒకటిన ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకంలో భాగంగా రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌(ఆర్‌సీఎం) కింద గన్నవరం నుంచి ప్రారంభమవుతున్న తొలి విమాన సర్వీసు కూడా ఇదే. అతి తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోనికి తేవడంతో పాటు చిన్న పట్టణాలు, నగరాల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడంలో భాగంగా కేంద్రం ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. తొమ్మిది నెలల కిందట 2017 ఏప్రిల్‌ 27న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద నడిచే సర్వీసులు ఇప్పటివరకూ గన్నవరం నుంచి లేవు. ఉడాన్‌ పథకంలో భాగంగా విజయవాడ నుంచి ప్రారంభమవుతున్న తొలి సర్వీసు ట్రూజెట్‌ విమానయాన సంస్థ నడుపుతోంది. రూ.700 ప్రారంభ ధర నుంచి ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఉడాన్‌లో భాగంగా నడిచే విమాన సర్వీసులకు టిక్కెట్‌ ధర రూ.2500 లోపే ఉంటుంది. అదికూడా 151 నుంచి 175కిలోమీటర్ల మధ్య దూరానికి రూ.1420, 176 నుంచి 200 కిలోమీటర్ల మధ్య దూరానికి రూ.1500 వరకూ ధర ఉంటుంది. ఈ పథకంలో భాగంగా నడిపే సర్వీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, రాయితీలు ఉంటాయి. విజయవాడ నుంచి కడపకు ఈ సర్వీసు నిత్యం నడుస్తుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి కడపకు వెళుతుంది. తిరిగి కడప నుంచి ఇక్కడికి వచ్చి మళ్లీ హైదరాబాద్‌కు వెళుతుంది. రోజూ ఉదయం 7.45కు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.05కు కడపకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి బయలుదేరి ఉదయం 10.45కు విజయవాడ చేరుతుంది. ఉదయం 10.55కు బయలుదేరి హైదరాబాద్‌కు వెళుతుంది.

Link to comment
Share on other sites

దేశమంతా చుట్టేయొచ్చు 
ఎనిమిది నగరాలతో అనుసంధానం 
ప్రతి గంటకూ నాలుగు సర్వీసులు 
పోటీపడుతున్న విమానయాన సంస్థలు 
amr-top2a.jpg
గన్నవరం నుంచి విమాన సర్వీసులు నడిచే నగరాలు: 8 (తిరుపతి, కడప, విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, దిల్లీ, ముంబయి) 
* నడిపే సంస్థలు: ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌, ఇండిగో 
* ఏ సంస్థకు చెందిన సర్వీసులు ఎన్ని: ఎయిరిండియా: 22, స్పైస్‌జెట్‌: 17, ట్రూజెట్‌: 4, ఇండిగో: 10 
* ప్రారంభమయ్యే సమయం: ఉదయం 7.45 (విజయవాడ-బెంగళూరు) 
* ఆఖరి సర్వీసు: రాత్రి 9.10(విజయవాడ-హైదరాబాద్‌) 
* నిత్యం తిరిగే సర్వీసులు: 53 
* అందుబాటులో ఉన్న సీటింగ్‌: 4510 (వచ్చేవి, వెళ్లేవి కలిపి) 
* ప్రతి గంటకూ సర్వీసులు: 4 
* ఏటా ప్రయాణికులు: 8లక్షలు
ఈనాడు, అమరావతి

అమరావతి రాజధాని ప్రాంతం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకూ సులభంగా చేరుకునే విమాన అనుసంధానం అందుబాటులోనికి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి విమాన సర్వీసుల సంఖ్య గత ఆరు నెలల్లోనే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి. ఒక్కొక్కటిగా దిల్లీ, ముంబయి సహా ప్రధాన నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రీజినల్‌ కనెక్టివిటీలో భాగంగా ఉడాన్‌ పథకం కింద కడపకు సైతం ట్రూజెట్‌ సర్వీసు అందుబాటులోనికి వచ్చింది. నిత్యంఉదయం 8.05కు 72 సీటింగ్‌తో ట్రూజెట్‌ సర్వీసు కడపకు బయలుదేరి వెళుతుంది. గురువారం నుంచి ఈ సర్వీసును ప్రారంభించారు. నేటినుంచి మరో పది సర్వీసులను ఇండిగో సంస్థ ప్రారంభిస్తోంది. దీంతో ఉదయం 7.45 నిమిషాల నుంచి ప్రారంభమయ్యే సర్వీసులు రాత్రి 9.10 వరకూ ప్రతి గంటకూ నాలుగు చొప్పున గన్నవరం విమానాశ్రయం నుంచి వెచ్చి వెళ్లనున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రయాణికుల సంఖ్య 4 లక్షల నుంచి 8లక్షలకు పెరిగింది. సర్వీసులు రోజూ 11 ఉండగా.. ప్రస్తుతం 53కు చేరాయి. త్వరలో అంతర్జాతీయ సర్వీసులు సైతం విమానాశ్రయం నుంచి ప్రారంభమవ్వనున్నాయి. తొలి సర్వీసు దుబాయ్‌కు నడవనుంది. ఎయిరిండియా సంస్థ అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. దీంతో గన్నవరం పూర్తిస్థాయి అధునాతన సౌకర్యాలు, సర్వీసులు ఉన్న విమానాశ్రయంగా రూపుదిద్దుకోనుంది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఏదో ఒక నగరానికి ప్రతి అరగంటకూ ఒక సర్వీసు గన్నవరం నుంచి నడుస్తోంది. దీంతో అంతర్జాతీయ అనుసంధానం కూడా ఇప్పటికే అందుబాటులోనికి వచ్చింది. ఇక్కడి నుంచి ఈ ఐదు నగరాలకు చేరుకుని అక్కడి నుంచి తేలికగా విదేశాలకు వెళ్లిపోతున్నారు. కొన్ని విమానయాన సంస్థలు ఇక్కడి నుంచే కనెక్టివిటీ టిక్కెట్లను కూడా ఇస్తున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లి హైదరాబాద్‌, దిల్లీ, ముంబయిల్లో అదే విమానయాన సంస్థకు చెందిన మరో విమానంలో ఎక్కి వెళ్లిపోతున్నారు.

రెండు రోజుల్లో 12 సర్వీసులు అదనం..: గన్నవరం విమానాశ్రయం నుంచి ఒక్క సర్వీసును అదనంగా ప్రారంభించాలంటే విమానయాన సంస్థలు నెలల తరబడి ఆలోచనలు చేసేవి. అలాంటిది.. రెండు రోజుల వ్యవధిలో 12 సర్వీసులు ఇక్కడి నుంచి ప్రారంభమవ్వడం ప్రయాణికుల డిమాండుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇండిగో సంస్థ తమ సర్వీసులను శుక్రవారం నుంచి ఒకేసారి పది ప్రారంభిస్తోంది. ఇప్పటికే ట్రూజెట్‌ సంస్థ కడపకు రెండు సర్వీసులను గురువారం నుంచి ప్రారంభించింది. దీంతో రోజూ విమానాశ్రయం నుంచి నడిచే సర్వీసుల సంఖ్య 53కు చేరింది. కొద్ది నెలల కిందటి వరకూ విదేశాలకే కాదు.. దిల్లీ, ముంబయి నగరాలకు వెళ్లాలన్నా హైదరాబాద్‌ చేరుకుని అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రధాన నగరాలన్నింటికీ అనుసంధానం.. 
రాజధాని స్థాయికి తగ్గట్టుగా త్వరితగతిన మౌలికవసతులు, సర్వీసుల పరంగా విమానాశ్రయం అభివృద్ధి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విమానాశ్రయంలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నాం. విమానయాన సంస్థలు సైతం సర్వీసులను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. వారికి అవసరమైన సౌకర్యాలను వెంటవెంటనే కల్పించడం, ప్రయాణికుల రద్దీ కూడా అధికంగా ఉండడం జరుగుతోంది. ఇప్పటికే గన్నవరం నుంచి అన్ని ప్రధాన నగరాలకూ సర్వీసులు నడుస్తున్నాయి.

- జి.మధుసూదనరావు, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌
Link to comment
Share on other sites

మిలియన్ మార్క్ దిశగా గన్నవరం ఎయిర్‌పోర్టు
02-03-2018 07:38:16

పది లక్షల మంది ప్రయాణికులే లక్ష్యంగా..
పెరుగుతున్న విమాన సర్వీసులు
ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖలకు పెరిగిన విమానాలు
ఆపరేషన్స్‌ పెరగటంతో దిగి రానున్న చార్జీలు
విజయవాడ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత వృద్ధి చెందబోతోంది! అంతకు మించి విమానం ఎక్కాలనుకునేవారికి ఇక చౌక ప్రయాణం అందుబాటులోకి రాబోతోంది! విజయవాడ విమానాశ్రయం మూడేళ్లుగా వృద్ధి సాధిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలోని మెట్రోపాలిటన్‌ విమానాశ్రయాల కంటే కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు వృద్ధిరేటులో 71 శాతంతో అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ దేశీయంగా బలమైన విమానాశ్రయాలు నిర్వహించే ఆపరేషన్స్‌ విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి లేవనే చెప్పాలి. ఆ దిశగా విమాన ఆపరేషన్స్‌ సాగించటానికి వీలుగా ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు మిలియన్‌ ప్రయాణికుల రాకపోకలు సాగించే దిశగా ఎదగాలన్నది తొలి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటివరకు చూస్తే సంవత్సరానికి 8.50 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. పది లక్షలమందికి చేరుకోవటానికి అధికారులు తపన పడుతున్నా.. మరిన్ని విమానయాన సంస్థల ఆసక్తి లేకపోవటం, మరిన్ని రూట్లకు విమానాలు నడవకపోవటం, ఉన్న రూట్లలో పరిమితంగానే విమానాలు నడుస్తుండటం వల్ల మిలియన్‌ మార్కును చేరుకోలేదు.
 
ఈ ఏడాదిలో ఢిల్లీకి ఒక విమాన సర్వీసు అదనంగా పెరిగింది. దీంతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖలకు కొన్ని సర్వీసులు పెరిగాయి. ముంబైకి అదనంగా మరో సర్వీసు పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేటినుంచి ఇండిగో విమానయాన సంస్థ హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులకు విమాన సర్వీసులను ప్రారంభించబోతోంది. దీంతో ఒక్కసారిగా అదనంగా విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. దీన్నిబట్టి మిలియన్‌ ప్రయాణీకుల కంటే కూడా అదనంగా వృద్ధిని సాధించటానికి అవకాశమేర్పడుతోంది. ఇండిగో సంస్థ మలివిడతగా ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, జైపూర్‌, పూనెలకు సర్వీసులు నడపాలని భావిస్తుండటంతో రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటుతో పాటు, ఆపరేషన్స్‌, ప్రయాణీకుల వృద్ధిలో కూడా అగ్రస్థానం సాధించే అవకాశం ఉంది.
 
దిగిరానున్న చార్జీలు..
ఇప్పటివరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్దేశిత రూట్లకు పరిమిత సంఖ్యలో విమానాలు ఉండటంతో ధరలు ఆకాశంలో ఉన్నాయి. నేటి నుంచి విమాన ధరలు ఆకాశం నుంచి దిగి రాబోతున్నాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు పరిమిత సంఖ్యలో విమానాలు ఉండేవి. తాజాగా స్పైస్‌జెట్‌ సంస్థ ఉదయం సమయంలో చెన్నైకు గురువారం నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ట్రూజెట్‌ సంస్థ ప్రాంతీయంగా సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు వెళ్ళటానికి విమాన సర్వీసులు పెరగటంతో పాటు ప్రయాణీకులకు ఛాయిస్‌ లభించినట్టు అయింది. గతంలో స్పైస్‌ జెట్‌ ఒక్కటి మాత్రమే అనుకుంటే ఇప్పుడు ఇండిగో ఉందన్న ఆప్షన్‌ ఉంటంతో హైదరాబాద్‌ రూట్‌లో ఛార్జీలు దిగి వచ్చే అవకాశం ఉంది. ఇలాగే బెంగళూరు, చెన్నై రూట్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది

Link to comment
Share on other sites

636556630820457000.jpg
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): మరికొద్ది రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు విజయవాడ ఎయిర్‌పోర్టు కేంద్రం కాబోతోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. విజయవాడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మదుసూధనరావులు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఎనిమిదిన్నర లక్షల మంది ప్రయాణీకులు ఏటా రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో అనూహ్యంగా విమానాల సంఖ్య పెరిగింది. ముంబాయికి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుతో పాటు, ప్రాంతీయంగా కడపకు ట్రూజెట్‌ సర్వీసులతో విమాన సర్వీసులు పెరిగాయి. డొమెస్టిక్‌గా చూస్తే హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు ఇండిగో విమానయాన సంస్థ తొలిదశలోనే భారీ ఆపరేషన్స్‌కు శ్రీకారం చుట్టింది.
 
 
 
స్పైస్‌జెట్‌ సంస్థ చెన్నైకు ఉదయం సమయంలో మరో సర్వీసును ప్రారంభించింది. దీంతో అసాధారణంగా ట్రాఫిక్‌ పెరిగింది. దీంతోపాటు మరికొద్ది రోజులలో విదేశీ విమానయానికి సంబంధించి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ దుబాయ్‌, షార్జాలకు సర్వీసులు నడపటానికి దాదాపు షెడ్యూల్‌ను నిర్ణయించింది. అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కూడా ఇక్కడికి విమాన సర్వీసు నడపడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతోంది. సింగపూర్‌ ప్రభుత్వం కూడా విజయవాడకు నేరుగా సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చింది. ఇమిగ్రేషన్‌ హోదా ఇప్పటికే వచ్చేసింది. ప్రస్తుతం సిబ్బంది శిక్షణలో ఉన్నారు. ఇమిగ్రేషన్‌ అధికారిగా విజయవాడ డీసీపీ గజరావు భూపాల్‌ను నియమించటం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో సాధ్యమైనంత త్వరగా అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. సివిల్‌, ఎలక్ర్టికల్‌ పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. దీనిని వినియోగంలోకి తీసుకు వస్తే ప్రస్తుతం 8.50 లక్షల మందికి కాకుండా మరో 1.50 లక్షల మంది ప్రయాణీకులకు సేవలను అందించగలుగుతోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులకు శ్రీకారం చుడితే బాగుంటుందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. మంత్రి కూడా తన స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పారు.
Link to comment
Share on other sites

గన్నవరం విమానాశ్రయానికి విశ్వకర్మ అవార్డు

ఈనాడు, అమరావతి: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే విశ్వకర్మ అవార్డు- 2018ని విమానాశ్రయం దక్కించుకుంది. నీతిఆయోగ్‌కు చెందిన కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీఐడీసీ) ఏటా ఈ అవార్డును ఇస్తుంది. దేశంలోనే ఉత్తమ కట్టడంగా గుర్తించి ఈ ఏడాది పదో సీఐడీసీ విశ్వకర్మ అవార్డును గన్నవరం విమానాశ్రయానికి అందించింది. గతేడాది రికార్డు స్థాయిలో కేవలం ఏడాది వ్యవధిలో రూ.160 కోట్లతో అధునాతన టెర్మినల్‌ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణాన్ని ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టుగా గుర్తించి అవార్డును ప్రకటించారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును భారత విమానయాన సంస్థ(ఏఏఐ)కు సీఐడీసీ అందజేసింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...