Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ శిక్షణ
ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు మరో ముందడుగు పడింది. విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇమ్మిగ్రేషన్‌ సేవల కోసం 50మంది రాష్ట్ర పోలీసులు కావాలంటూ డీజీపీని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కొద్ది నెలల కిందట కోరింది. దీనికి రాష్ట్ర పోలీసుశాఖ సుముఖత వ్యక్తం చేసింది. తొలి దశలో భాగంగా 13మంది సిబ్బందిని కేటాయించారు. వీరికి శిక్షణ తరగతులను విమానాశ్రయంలో విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతంసవాంగ్‌ సోమవారం ప్రారంభించారు. ప్రాంతీయ విదేశీ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) భాస్కర్‌రెడ్డి, విమానాశ్రయ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి అవసరమైన తర్ఫీదును 15 రోజుల పాటు అందజేస్తారు.

Link to comment
Share on other sites

మార్చి 15కు.. పచ్చజెండా 
అంతర్జాతీయ సర్వీసులకు పూర్తి సన్నద్ధం 
ఆ తర్వాతే.. విమానయాన సంస్థలకు ఆహ్వానం 
మే నుంచి విదేశాలకు ఎగిరిపోయే అనుసంధానం 
ఈనాడు, అమరావతి 

గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు పూర్తి సుముఖంగా ఉన్నామంటూ.. మార్చి 15 తర్వాత అధికారులు ప్రకటించనున్నారు. ఆ తర్వాత.. విమానయాన సంస్థలు సర్వీసులను విదేశాలకు ఇక్కడి నుంచి నడపొచ్చని ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ముందుకొచ్చే విమాన సంస్థలు.. 45 రోజుల ముందు షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. షెడ్యూల్‌ను విడుదల చేశాక టిక్కెట్ల అమ్మకం ప్రారంభమవుతుంది. మే నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు నడవనున్నాయి. దీనికోసంఅవసరమైన సన్నద్ధతపై విమానాశ్రయంలో సోమవారం నిర్వహించిన ఇమ్మిగ్రేషన్‌ శిక్షణ తరగతుల కార్యక్రమంలో అధికారులు చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉందంటూ మార్చి 15న జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ డిక్లరేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించనున్నారు. ఆ తర్వాత విమానయాన సంస్థలతో ప్రభుత్వం సైతం సంప్రదింపులు జరుపుతుంది. 
గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. గతంలో వినియోగించిన పాత టెర్మినల్‌ భవనాన్నే రూ.2 కోట్లను వెచ్చించి.. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా మార్పులు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ, అంతర్జాతీయ సేవలు అందించేందుకు వీలుగా కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు, కన్వేయర్‌బెల్ట్‌లు, ఎక్స్‌రే బ్యాగేజీ యంత్రాలను పూర్తిస్థాయిలో అమర్చారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది ఒక్కటే కొరత ఉంది. సోమవారం నుంచి 13మంది రాష్ట్ర పోలీసు సిబ్బందికి ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అనుగుణంగా శిక్షణను ప్రారంభించారు. 15 రోజుల్లో వీరికి శిక్షణ పూర్తయి.. సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈలోగా ఇమ్మిగ్రేషన్‌ సేవల కోసం కేటాయించిన కార్యాలయంలో కంప్యూటర్లు, కేబుళ్లను ఏర్పాటు చేయడం పూర్తవుతుంది. మరోవైపు కస్టమ్స్‌ విభాగం కూడా ఇక్కడి నుంచి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కస్టమ్స్‌ డీసీ శ్రీకాంత్‌, ఫారినర్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) భాస్కర్‌రెడ్డి తదితరులు సోమవారం అంతర్జాతీయ టెర్మినల్‌, ఏర్పాట్లను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) తరఫున అన్ని రకాల సిద్ధంగా ఉన్నామని విమానాశ్రయ అధికారులు వారికి వివరించారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు తాజాగా శిక్షణ తీసుకుంటున్న 13మంది సిబ్బంది సిద్ధమవుతారు. అనంతరం.. రెండు వారాల్లో మిగతా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసి.. మార్చి 15న ఏఏఐ, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలన్ని కలిసి జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు.
తొలి అవకాశం ఎయిరిండియాకే.. 
గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు తొలి అవకాశం ఎయిరిండియా సంస్థకే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిరిండియా ముంబయికి నడుపుతున్న సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత అదే విమానం ఇక్కడి నుంచి విదేశాలకు ఎగరనుంది. తొలుత దుబాయ్‌కు ముంబయి మీదుగా ఈ సర్వీసును నడపనున్నారు.

Link to comment
Share on other sites

అమరావతి నుంచి నేరుగా విదేశాలకు విమాన సర్వీసులు..
13-02-2018 19:15:34

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి నుంచి నేరుగా విదేశాలకు విమాన సర్వీసులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని విమాన సంస్థలు తెలిపాయి. అమరావతి నుంచి విదేశాలకు విమాన సర్వీసుల అంశంపై మార్చి 15 తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే నెల నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విదేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు నడవనున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టులో ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు మొదటి అవకాశం ఎయిరిండియా సంస్థకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న, గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు పూర్తి సుముఖంగా ఉన్నామంటూ.. మార్చి 15 తర్వాత అధికారులు ప్రకటించనున్నారు. ఆ తర్వాత.. విమానయాన సంస్థలు సర్వీసులను విదేశాలకు ఇక్కడి నుంచి నడపొచ్చని ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ముందుకొచ్చే విమాన సంస్థలు.. 45 రోజుల ముందు షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. షెడ్యూల్‌ను విడుదల చేశాక టిక్కెట్ల అమ్మకం ప్రారంభమవుతుంది. మే నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు నడవనున్నాయి. దీనికోసంఅవసరమైన సన్నద్ధతపై విమానాశ్రయంలో సోమవారం నిర్వహించిన ఇమ్మిగ్రేషన్‌ శిక్షణ తరగతుల కార్యక్రమంలో అధికారులు చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉందంటూ మార్చి 15న జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ డిక్లరేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించనున్నారు. ఆ తర్వాత విమానయాన సంస్థలతో ప్రభుత్వం సైతం సంప్రదింపులు జరుపుతుంది.


 


గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. గతంలో వినియోగించిన పాత టెర్మినల్‌ భవనాన్నే రూ.2 కోట్లను వెచ్చించి.. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా మార్పులు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ, అంతర్జాతీయ సేవలు అందించేందుకు వీలుగా కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు, కన్వేయర్‌బెల్ట్‌లు, ఎక్స్‌రే బ్యాగేజీ యంత్రాలను పూర్తిస్థాయిలో అమర్చారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది ఒక్కటే కొరత ఉంది. సోమవారం నుంచి 13మంది రాష్ట్ర పోలీసు సిబ్బందికి ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అనుగుణంగా శిక్షణను ప్రారంభించారు. 15 రోజుల్లో వీరికి శిక్షణ పూర్తయి.. సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈలోగా ఇమ్మిగ్రేషన్‌ సేవల కోసం కేటాయించిన కార్యాలయంలో కంప్యూటర్లు, కేబుళ్లను ఏర్పాటు చేయడం పూర్తవుతుంది.

మరోవైపు కస్టమ్స్‌ విభాగం కూడా ఇక్కడి నుంచి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కస్టమ్స్‌ డీసీ శ్రీకాంత్‌, ఫారినర్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) భాస్కర్‌రెడ్డి తదితరులు సోమవారం అంతర్జాతీయ టెర్మినల్‌, ఏర్పాట్లను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) తరఫున అన్ని రకాల సిద్ధంగా ఉన్నామని విమానాశ్రయ అధికారులు వారికి వివరించారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు తాజాగా శిక్షణ తీసుకుంటున్న 13మంది సిబ్బంది సిద్ధమవుతారు. అనంతరం.. రెండు వారాల్లో మిగతా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసి.. మార్చి 15న ఏఏఐ, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలన్ని కలిసి జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు... గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు తొలి అవకాశం ఎయిరిండియా సంస్థకే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిరిండియా ముంబయికి నడుపుతున్న సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత అదే విమానం ఇక్కడి నుంచి విదేశాలకు ఎగరనుంది. తొలుత దుబాయ్‌కు ముంబయి మీదుగా ఈ సర్వీసును నడపనున్నారు.

Link to comment
Share on other sites

Air india express doesnt fly out to EU or USA through Dubai. Dubai may be its final destination.

Mari Dubai nunchi US ki ela connect chesthaaro? Emirates , currently, is not a member of Star Alliance ..it will be interesting to see how Air India and Emirates work together.

 

Link to comment
Share on other sites

విమానాశ్రయ అభివృద్ధి పనులపై చర్చ
18-02-2018 07:55:33

 ఏప్రిల్‌ నాటికి సమస్యలను పరిష్కరిస్తాం..
 లింకు రోడ్లు, పునరావసం, హెచ్‌టీ లైన్స్‌ తొలగింపు
 కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు అధ్యక్షతన ఎయిర్‌పోర్టు అభివృద్ధి కమిటీ సమావేశం
 అంతర్జాతీయ టెర్మినల్‌ ప్రారంభోత్సవం నాటికి... రన్‌వే విస్తరణ పనులకు ఇబ్బందికరంగా ఉన్న అన్ని అవాంతరాలు మూడునెలల్లో పరిష్కారం కావటానికి బీజం పడింది. జిల్లా యంత్రాంగంతో ముడిపడి ఉన్న లింకు రోడ్ల ఏర్పాటు, భవనాల తొలగింపు, పేదల ఇళ్లకు ఆర్‌ఓఆర్‌ ప్యాకేజీ, హెచ్‌టీ లైన్స్‌ తొలగింపు వంటి అనేక అపరిష్కృత అంశాలను మూడు నెలల్లో పరిష్కరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు కృష్ణాజిల్లా యంత్రాంగానికి నిర్ధేశించారు. రెండు నెలల్లోనే పనులన్నింటినీ పూర్తి చేసి పూర్తి క్లియరెన్స్‌ ఇస్తామని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం హామీ ఇచ్చారు.
 
విజయవాడ, ఫిబ్రవరి 17( ఆంధ్రజ్యోతి): మరికొద్ది నెలల్లో విజయవాడ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఇమిగ్రేషన్‌ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అంతర్జా తీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ను ప్రారంభించటానికి ఒకవైపు సన్నా హాలు జరుగుతుండ గా.. మరో వైపు రన్‌వే విస్తరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాయంత్రాంగంతో ముడిపడి ఉన్న అపరిష్కృత సమస్యలపై శనివారం గన్నవరంలోని ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు అధ్యక్షత వహించటం విశేషం. అజెండా లో మొత్తం 12 అంశాలపై చర్చ జరిగింది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు తమకు ఉన్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
 
గన్నవరం - మానికొండ రోడ్డు డైవర్షన్‌కు సంబంధించి ప్రధాన చర్చ జరిగింది. ప్ర స్తుత రన్‌వే చివర బుద్దవ రం మీదుగా ఈ రోడ్డు వెళుతుంది. రన్‌వే విస్తరణ నేప థ్యంలో, ఈ రోడ్డును పూర్తిగా మూసివేయాల్సి ఉంది. ప్రత్యామ్నాయ రోడ్డు ను అభివృద్ధి చేయాల్సిందిగా స్థానిక ప్రజలు గతంలో కోరటంతో దీని కి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించటం జరిగింది.సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తే.. ప్రస్తుతం అడ్డుగా ఉన్న రోడ్డు స్థానంలో కూడా రన్‌వే పనులు చేపట్ట వలసి ఉందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ కోరారు. దీనికి కలెక్టర్‌ వెంటనే స్పందించారు. గన్నవరం - మానికొండ లింకురోడ్డును కేసరపల్లి మీదుగా జాతీయ రహదారికి అనుసంధానిం చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామాల ప్రజలు బుద్దవరం, గన్నవరంల మీదుగా చిన అవుటపల్లికి అనుసంధాన రోడ్డును కోరుతున్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే కేసరపల్లి వైపుగా లింకు రోడ్డు అభివృద్ధి పను లను ఆర్‌అండ్‌బీ అధికారులు చేపడతారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. గన్నవరం - పుట్ట గుంట రోడ్డు డైవర్షన్‌, ఏలూరు కాల్వ మీద వంతెన తొలగింపు తక్షణం చేపట్టకపోతే రన్‌వే విస్తరణ, అప్రోచ్‌ లైటింగ్‌ పనులకు ఇబ్బందిగా ఉందని చెప్పారు.దీనికి సంబంధిం చి తక్షణం చర్యలు చేపడతామని కలెక్టర్‌ చెప్పారు. ప్రతిపాదిత రన్‌వే విస్తరణ ప్రాంతం వెంబడి చుట్టూ గన్నవరం - బుద్దవరం కాలువు ఉంది. దీని డైవర్షన్‌కు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
హెచ్‌టీ లైన్స్‌ తొలగింపు పనులు చేపట్టక పోవటం వల్ల రన్‌వే విస్తరణ పనులకు ఇబ్బందికరంగా ఉందని, ఇటీవల ఓ లారీ డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందిన విషయాన్ని ఏపీడీ మధుసూదనరావు ప్రస్తావించారు. రైతులు పంటలు వేసిన నేపథ్యంలో, హెచ్‌టీ లైన్స్‌ను తొలగించలేదని, పంట చేతికి వచ్చిన నేపథ్యంలో, తక్షణం ఆ పనులు పూర్తి చేయా లని విద్యుత్‌ శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశి ంచారు. కాలువ వెంబడి ఉన్న 84 గృహాల తొలగింపనకు సంబంధించి చర్యలు తీసుకో వాల్సిఉందని ఏపీడీ ప్రస్తావించారు. పునరా వాసం కల్పించటానికి చర్యలు తీసుకుంటా మని, అవసరమైన స్థలం చూడాల్సిందిగా నూజివీడు ఆర్‌డీఓను కలెక్టర్‌ ఆదేశించారు. ఆ స్థలంలో అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. వీకేఆర్‌ కాలేజీ భవనాల కూల్చివేత, సెమన్‌ బ్యాంక్‌ తరలిం పు, దేవాలయాల తరలింపు పునర్నిర్మాణం, తమకు అప్పగించిన భూములలో బోర్‌వెల్స్‌ తొలగింపు వంటివాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీడీ కోరారు. ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న ఏబీ కన్వెన్షన్‌ తో పాటు స్తానికంగా ఫంక్షన్ల సందర్బంగా లేజర్‌ ఫోకస్‌ లైట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో రాత్రుళ్లు విమానాల ల్యాండింగ్‌ సమస్యగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు పరిసరాలలో ఆహార వృధా ఎక్కువుగా జరుగుతున్నందున పక్షులు ఎక్కువుగా వస్తు న్నాయన్న దానిపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సీఎస్‌ఆర్‌ యాక్టివిటీ కింద ఫుడ్‌వేస్ట్‌ బిన్స్‌ సమీప ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించటం జరిగింది. విమానాశ్రయ అధికారులు ప్రస్తావించిన సమస్యలపై కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు స్పందిస్తూ.. మే నెల కల్లా అన్ని పనులను పూర్తి చేసి క్లియరెన్స్‌ ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ ఏప్రిల్‌ నాటికే అన్ని పనులు పూర్తి చేసి క్లియరెన్స్‌ ఇస్తామని హామీ ఇవ్వటంతో సమావేశం ముగిసింది.
 
వేగవంతంగా అభివృద్ధి
గన్నవరం ఎయిర్‌పోర్టు వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. మరింత ముందుకు తీసుకువెళ్లే బాధ్యత ఇమ్మిగ్రేషన్‌ సిబ్బందిపై ఉంది అని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు అన్నారు. ఎయిర్‌పోర్టులో గత వారంరోజులుగా నడుస్తున్న ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది శిక్షణ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ డొమెస్టిక్‌ను ఒక సంవత్సరంలో పూర్తి చేశాం. రన్‌వే పనులు స్పీడుగా జరుగుతున్నాయి. శిక్షణ తీసుకున్న 20 మంది ఈ నెల 22 నుంచి పది మంది హైదరాబాద్‌లో ప్రాక్ట్టికల్‌ శిక్షణకు వెళ్లనున్నారు. మిగిలిన పది మందికి ఇక్కడే సాఫ్ట్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు ఇమ్మిగ్రేషన్‌ ఇన్‌ఛార్జి, సివిల్‌ ఆఽథారిటీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. ఎయిర్‌పోర్టు డైరె క్టర్‌ జి.మధుసూధనరావు, అడిషనల్‌ సీపీ బీవీ రమణ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

విమానాశ్రయానికి రక్షణ గోడ నిర్మాణం 
కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు
విమానాశ్రయం (గన్నవరం), న్యూస్‌టుడే: విజయవాడ విమానాశ్రయం చుట్టూ  ప్రహరీని నిర్మించి రక్షణ కల్పించడంతోపాటు అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. శనివారం వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, జిల్లా యంత్రాంగంతో విమానాశ్రయ అభివృద్ధిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రన్‌వే విస్తరణ, విమానాశ్రయం చుట్టూ కొత్తగా సేకరించిన భూమితో కలిపి మొత్తం 1230 ఎకరాల పరిధిలో చేపట్టిన ప్రహరీ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విస్తరణలో కనుమరుగవుతున్న ఆర్‌అండ్‌బీ రహదారుల పునర్నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్తు లైన్ల మార్పిడి వంటి అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. విస్తరణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. పర్యవేక్షణ అధికారిని నియమించి పనులను సత్వరమే పూర్తిచేసేలా చూడాలని జిల్లా కలెక్టరు లక్ష్మీకాంతాన్ని ఆదేశించారు.
ప్రయాణికుల మన్నన పొందాలి.. విమానాశ్రయ పరిపాలనా విభాగంలో ఇమిగ్రేషన్‌ సదస్సు ముగింపు సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ముఖ్య అధికారులను పిలిపించి వారితో మాట్లాడారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులు మొదటగా కలిసేది ఇమిగ్రేషన్‌ అధికారులనేనని, వారి పట్ల మర్యాద పాటించి, మన్ననలు పొందాలని సూచించారు. మంత్రి వెంట విమానాశ్రయ డైరెక్టరు మధుసూదనరావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

Link to comment
Share on other sites

విజయవాడ ఎయిర్‌పోర్టులో మరో టెర్మినల్‌ బిల్డింగ్‌
19-02-2018 02:35:58
విజయవాడ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శాశ్వత ప్రాతిపదికన ఇంటిగ్రేటెట్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ(పీఎంసీ)గా ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘స్టుప్‌’ను ఎంపిక చేసింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) సూచనల మేర కు ఆరు నెలల కిందట విజయవాడ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులు రూ.600కోట్ల వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. నిర్మా ణ పనుల పర్యవేక్షణతో పాటు రెండు సంవత్సరాల పాటు టెర్మినల్‌ బిల్డింగ్‌ను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.

Link to comment
Share on other sites

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు.. తొలి అడుగు
19-02-2018 08:23:46

ఏడాది కిందట ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభం
శాశ్వత అవసరాల కోసం మరో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు శ్రీకారం
మెగా విస్తరణ దిశగా విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు
ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి పీఎంసీని నియమించిన కేంద్రం
పీఎంసీగా ‘స్టుప్‌’ ఎంపిక
అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఏడాది కిందట అందుబాటులోకి వచ్చిన నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే కేసరపల్లి వైపు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు స్థలాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రతిపాదించారు. బిల్డింగ్‌ నిర్మాణానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)కి టెండర్లు పిలిచి ‘స్టుప్‌’ అనే సంస్థను కేంద్రం ఎంపిక చేసింది.
 
విజయవాడ(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంతానికి మణిమకుటమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి కేంద్రం.. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)ని నియమించటంతో అంతర్జాతీయ హోదాకు ముందు, తర్వాత అభివృద్ధి పనులతో శరవేగంగా రూపుమార్చుకుంటున్న విజయవాడ ఎయిర్‌పోర్టు... మెగా విస్తరణ దిశగా అడుగులు వేయబోతోంది. ఏడాది కిందట అందుబాటులోకి వచ్చిన నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ పక్కనే కేసరపల్లి వైపు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు స్థలాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుత ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ఓ పదిహేను సంవత్సరాల పాటు అవసరాలను తీర్చగలుగుతుంది. గత అర దశాబ్ద కాలంగా అనూహ్యంగా విమాన ప్రయాణికులు, విమానాల రాకపోకలతో దేశంలోని మెట్రోపాలిటన్‌ ఎయిర్‌పోర్టుల కంటే అధికంగా వృద్ధి రేటు సాధిస్తున్న విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ ఏడాదిలో అనూహ్యంగా దినదిన ప్రవర్థమానం చెందుతూ వస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో 8లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా ఈ ఏడాది ‘మిలియన్‌ మార్చి’ నినాదంతో పది లక్షల మంది రాకపోకలు సాగించే దిశగా ఇక్కడి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
ఫలితంగా 21 నుంచి ప్రస్తుతం 33 విమానాల ఆపరేషన్‌ పెరిగింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీకి మూడవ సర్వీసును ఎయిర్‌ ఇండియా ప్రవేశపెట్టింది. ఇటీవలే ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముంబాయికి విమాన సర్వీసును ప్రారంభించింది. మార్చి 2 నుంచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుకు ఇండిగో సంస్థ సర్వీసులను ప్రారంభించబోతోంది. మార్చి ఒకటి నుంచి ట్రూజెట్‌ సంస్థ కడపకు విమాన సర్వీసును ప్రారంభించబోతోంది. మరో ఆరు నెలల్లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ ఇక్కడి నుంచి విదే శాలకు అంటే షార్జా, దుబాయ్‌లకు విమాన సర్వీసులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ఇండిగో కూడా దేశంలోని ఢిల్లీతో పాటు జైపూర్‌, కలకత్తా వంటి నగరాలకు కూడా విమాన సర్వీసులు నడపాలని, గల్ఫ్‌ దేశాలకు కూడా విమాన సర్వీసులు నడపాలన్న ఆలోచనతో ఇండిగో ఉంది. ఇటీవల ప్రారంభించిన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రస్తుతం 1000 మంది విమాన ప్రయాణికులు ఒకేసారి రాకపోకలు సాగించటానికి వీలుగా అవసరాలను తీరుస్తోంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం మరోవైపు పాత టెర్మినల్‌ను ఆధునికీకరించి అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించబోతున్నారు. ఈ టెర్మినల్‌ బిల్డింగ్‌ 750 మంది ప్రయాణికుల రాకపోకలకు ఒకేసారి అవకాశం కల్పించనుంది. ప్రస్తుత ఎయిర్‌ ట్రాఫిక్‌ను చూస్తే అంచనాలను మించుతోంది. ఈ క్రమంలో ఎప్పుడో పదేళ్ళ తర్వాత అనుకుంటున్న ట్రాఫిక్‌ సమీప కాలంలోనే కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. గత కొంత కాలంగా విమానాశ్రయం సాధిస్తున్న ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ఎప్పుడో కాకుండా ముందుగానే శ్రీకారం చుడితే మంచిదన్న అభిప్రాయాన్ని ఏఏఐ అధికారుల దగ్గర వ్యక్తం చేశారు. ఏఏఐ అధికారులు వెంటనే ఇక్కడి ఎయిర్‌పోర్టు అధికారులకు తగిన ప్రతిపాదనలు పంపించమని కోరారు. దీనికి అనుగుణంగా విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు రూ.600 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి ఢిల్లీకి పంపారు. కేంద్రం దగ్గర చాలా కాలం ఇది పెండింగ్‌లో ఉంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజుల కృషితో ఎట్టకేలకు కేంద్ర స్థాయిలో దీనిపై కదలిక వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)కి టెండర్లు పిలిచింది.
 
ఈ టెండర్లలో ‘స్టుప్‌’ అనే సంస్థను కేంద్రం ఎంపిక చేసింది. ఈ సంస్థకు అవార్డు ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది. అవార్డు రాగానే ఈ సంస్థ తన పని ప్రారంభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ వ్యవహారాలన్నీ ఈ సంస్థ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. టెర్మినల్‌ బిల్డింగ్‌ డిజైన్స్‌ అన్నింటినీ ఈ సంస్థే రూపొందిస్తుంది. డిజైన్స్‌తో పాటు అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్స్‌లో ఇంటీరియర్‌ డిజైన్స్‌, లాంజ్‌ డిజైన్స్‌ కూడా ఈ సంస్థ నిర్ణయిస్తుంది. వీటితో పాటు ఏరో బ్రిడ్జిల డిజైన్స్‌ అంతర్గతంగా కమర్షియల్‌ ప్రాంతాన్ని, బయట ల్యాండ్‌ స్కేపింగ్‌, అవుట్‌లుక్‌ డిజైన్స్‌ అన్నీ ఈ సంస్థ రూపొందిస్తుంది. టెర్మినల్‌ బిల్డింగ్‌కు అయ్యే అంచనాలను కూడా ఈ సంస్థ సిద్ధం చేస్తుంది. టెండర్ల ప్రక్రియను కూడా ఈ సంస్థ చేపడుతుంది. నిర్మాణ పనులను పర్యవేక్షించటంతో పాటు తర్వాత రెండు సంవత్సరాల పాటు ఆజమాయిషీ కూడా ఈ సంస్థ చేస్తుంది.

Link to comment
Share on other sites

On 2/23/2018 at 4:09 AM, Yaswanth526 said:

Jan2018 city pair traffic report is out.

Mumbai to VGA load factor is in around 0.5 and VGA-Mumbai LF is slightly under 0.6.
Overall number is somewhat an improvement (~5k) over Dec 2017.
Traffic to both Hyd and Del increased by around 2k. Bombay added another 1k.

Total: 68470

https://i.imgur.com/JMelYiC.png

 

These are Nice Stats

 

what does first column and second column stand for?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...