Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
1 hour ago, Kiran Edara said:

not good.. assale bags ni sarigga handle cheyyaru vallu careless ga visiretaru.. ah bages kodiga edge lo pettina turn lo kindaki drift ayi padipovachu.. high rise/supportive edges undi unte bagundedhi.. 

Yes Hyd shamshabad airport lo vunnatlu vundi kadaa - is this an old conveyer belt or recently setup one ??

Link to comment
Share on other sites

గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురు చూపులకు, దక్కిన మొదటి ఫలితం...

   
gannvaram-25012018.jpg
share.png

ఎన్నాళ్ళుగానో గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుచూస్తున్న గజెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టును కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంజూరు చేసింది. ఇక కస్టమ్స్ సెంటర్ ఏర్పాటు ఒక్కటే ఇంటర్నేషనల్ సర్వీసులకి అడ్డంకి... దాని కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.... ఇటీవలే ఇమ్మిగ్రేషన్ విభాగం ఉన్నతాధికారులు గన్నవరం ఎయిర్పోర్టును సందర్శించి ఇక్కడి మౌలిక సౌకర్యాలు, సెక్యూరిటీ తదితర వాటిని పరిశీలించారు... వాస్తవానికి ఈ నెల రెండో తేదీనే ఈ సమాచారం రాష్ట్రానికి వచ్చింది... దీని పై అఫిషియాల్ గా ఎయిర్ పోర్ట్ అధారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ జరీ చేసింది...

 

gannvaram 25012018 2

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విదేశీ విమాన ప్రయాణికులు రాకపోకలు కోసం ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది... దీని కోసం విజయవాడ డిప్యూటీ పోలీస్ కమీషనర్ గజరావు భూపాల్ ను సివిల్ అధారిటీగా నియమిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు... గన్నవరం ఎయిర్ పోర్ట్ కు విదేశీయులు రావాలన్నా ఇక్కడ నుంచి వెళ్లాలన్నా విధిగా సివిల్ అథారిటీ అనుమతి ఉండాల్సిందే. 1948 ఫారినర్స్ చట్టంలో 3( 1)(ఏ), 5( 1)(ఏ) ప్రకారం విదేశీ విమాన ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది...

gannvaram 25012018 3

గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడపాలంటే విధిగా ఇమ్మిగ్రేషన్ తో పాటు కస్టమ్స్ విభాగం ఉండాలి. వాటిలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, త్వరలోనే కస్టమ్స్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతికి విదేశీయులు రాకపోకలు జరిపేందుకు వీలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవలే ముంబై విమాన సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గన్నవరానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు మంజూరవ్వటం, సివిల్ అథారిటీగా డీసీపీ-1 గజరావు భూపాల్ను ప్రభుత్వం నియమించింది. ఇమ్మిగ్రేషన్ విభాగానికి అవసరమైన చెక్ పాయింట్, లగేజీ తనిఖీ విభాగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్దంగా ఉన్నాయి....

Link to comment
Share on other sites

గన్నవరం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి దేశంలోని పలు ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు నడపటానికి దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో విజయవాడ విమానాశ్రయం నుంచి స్లాట్ కోరింది... ఇండిగో నుంచి స్లాట్ ఆభ్యర్ధన రావటమే తరువాయి, విజయవాడ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు స్లాట్ కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాశ్రయ అధికారులకు ఇంకా ఆధికారికంగా విమాన షెడ్యూలను ఇవ్వలేదు. నెల రోజుల ముందు ఎప్పుడైనా ఇవ్వవచ్చు కాబట్టి సమస్య లేదు. తన షెడ్యూల్ ను అధికారికంగా ఇవ్వ కపోయినా... ఇండిగో సంస్థ అధికారికంగా తన ఆగమనాన్ని ప్రకటించింది.


 


మార్చి 2 నుంచి విజయవాడ నుంచి దేశీయంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు విమాన సర్వీసుల షెడ్యూలను ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాదకు ప్రతిరోజూ 12.10, 18.45, 21.35 సమయాలలో మూడు ఫ్లైట్స్ బయలుదేరనున్నాయి. ఆలాగే విజయవాడ నుంచి బెంగళూరుకు 10. 15 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటలకు ఒక విమానం నడుస్తుంది. ఇవి ఇక్కడి నుంచి బయలుదేరే సమయాలు మాత్రమే. ఇవే సర్వీసులు గమ్యస్థానాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించటాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి 'ఇండిగో ' సంస్థ దశల వారీగా విమానాలను నడుపుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మొదటి దశ షెడ్యూలను మాత్రమే ప్రకటించడం జరిగింది. మొదటి దశ షెడ్యూల్ ప్రకారం ఈ సంస్థ మొత్తం రానుపోను కలిపి రోజుకు 10 సర్వీసుల చొప్పున విమానాల రాకపోకలు ఉంటాయి.

ఇటీవల 'ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్' సంస్థ దేశ ఆర్థిక రాజధాని ముంబాయి మహా నగరానికి విమాన సర్వీసును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండిగో సంస్థ ప్రకటించిన షెడ్యూల్తో ఇక విజయవాడ ఎయిర్ పోర్టు ఆత్యంత బిజీగా మారిపోనుంది. ఇండిగో భారీ ఆపరేషన్స్ షెడ్యూల్ తో ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా నివ్వెరపోతున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి మోనోపలీగా ఉన్న విమానయాన సంస్థలకు ఇక చెక్ పడనుంది. మోనోపలీ కారణంగా విమాన ధరలు ఆకాశానికంటుతున్నాయి. హైదరాబాద్ కు రూ. 18 వేల టిక్కెట్ ధర పలుకుతోంది. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణీ కులు బావురు మంటున్నారు. ఇండిగో ప్రవేశంతో విమానయాన సంస్థల మధ్య పోటీ ఏర్పడబోతోంది. ఇండిగో సంస్థ తన ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ. 2097 గా ఛార్జీని నిర్ణయించగా... బెంగళూరు నుంచి విజయవాడకు రూ. 1826గా నిర్ణయిం చింది. విజయవాడ నుంచి చెన్నైకు రూ 1179, చెన్నై నుంచి విజయవాడకు రూ. 1283గా నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్క రూ. 1099, హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1699గా ఛార్జీలను నిర్ణయిస్తూ అధికారికంగా ఇండిగో ప్రకటించింది.

Link to comment
Share on other sites

ticket price kante luggage cost adiripotundi international passengers ki. Indigo entry tho  I hope they increase baggage allowance from current 15 Kgs. 

two weeks ago, HYD-Gannavaram ticket 3200/- luggage charge 9000/-

a year ago, spicejet used to allow 2+1 bags for international passengers if the departure is with in 4-6 hours of arrival. now, they reduced it all the way down to 15 Kgs.

my friend flew from Mumbai to Pune same week but there they allowed 25Kgs(different airline).

spicejet competition leka povatam valla aadukuntundi.

Link to comment
Share on other sites


విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ దేశీయంగా కొత్తగా 20 విమానాలను ప్రవేశపెట్టింది. దేశీయ రూట్లలో 20 నాన్‌స్టాప్‌ విమానాలను త్వరలోనే ప్రారంభించ నున్నామని కంపెనీ ప్రకటించింది. చెన్నై-మంగళూరు, గౌహతికి చెన్నై మార్గాలు సహా ఫిబ్రవరి 11 ప్రారంభించి అనేక మార్గాల్లో ఫ్రీక్వెన్సీని జోడిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు కోల్‌కతా, జబల్‌పూర్‌, బెంగళూరు, పుదుచ్చేరి మధ్య డైరెక్ట్‌ ఫ్టైట్‌ నడుపనున్న తొలి సంస్థగా స్పైస్‌ జెట్‌ నిలిచింది. దక్షిణాన 18 విమానాలతో నాన్‌ మెట్రో, మెట్రో నగరాల మధ్య అనుసంధానం పెంచుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 10 సర్వీసులను ప్రాంతీయ కనెక్టివిటీ థీమ్ ‘కనెక్టెడ్‌ ది అన్‌కనెక్టెడ్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతున్నట్టు వెల్లడించింది.


 


తన కార్యకలాపాల విస్తరణలోభాగంగా చెన్నై-విశాఖపట్నం( సెకండ్‌ ఫ్రీక్వెన్సీ) కోల్‌కతా- విశాఖపట్నం( సెకండ్‌ ఫ్రీక్వెన్సీ) , చెన్నై-విజయవాడ( థర్డ్‌ ఫ్రీక్వెన్సీ) బెంగళూరు-చెన్నై (ఐదవ ఫ్రీక్వెన్సీ) రూట్లలో నాన్ స్టాప్ విమానాలను నడుపుతుంది. చెన్నై, విశాఖపట్నం, కోలకతా- విశాఖపట్నం, చెన్నై- విజయవాడ మధ్య రోజువారీ విమానాలు పనిచేస్తాయనీ, అయితే బెంగళూరు- తిరుపతి ధ్య మంగళవారాలు తప్ప అన్ని రోజుల్లోనూ తమ సేవలు అందుబాటులోఉంటాయని పేర్కొంది.

నిన్నే ఇండిగో కూడా గన్నవరం నుంచి, మార్చి 2 నుంచి విజయవాడ నుంచి దేశీయంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు విమాన సర్వీసుల షెడ్యూలను ప్రకటించింది. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ. 2097 గా ఛార్జీని నిర్ణయించగా... బెంగళూరు నుంచి విజయవాడకు రూ. 1826గా నిర్ణయిం చింది. విజయవాడ నుంచి చెన్నైకు రూ 1179, చెన్నై నుంచి విజయవాడకు రూ. 1283గా నిర్ణయించారు. విజయవాడ నుంచి హైదరాబాద్క రూ. 1099, హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.1699గా ఛార్జీలను నిర్ణయిస్తూ అధికారికంగా ఇండిగో ప్రకటించింది.

Link to comment
Share on other sites

ఇమిగ్రేషన్‌కు..రాజముద్ర
01-02-2018 07:06:05

 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి విదేశీయానం
 కాంపిటెంట్‌ అధికారిగా గజరావు భూపాల్‌ నియామకం
 సిబ్బందిని త్వరగా భర్తీ చేస్తే.. అంతత్వరగా విమానం
 ఇమిగ్రేషన్‌ సివిల్‌ వర్క్స్‌ పూర్తి, ఎలక్ర్టికల్‌ వర్క్స్‌ బ్యాలెన్స్‌
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్ర అమరావతి రాజధానికి రాచఠీవిగా నిలుస్తున్న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇమిగ్రేషన్‌ హోదాకు రాజముద్ర పడింది. కేంద్ర మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ వెలురించిన నేపథ్యంలో, రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా గజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెలువరించింది. ఇమ్మిగ్రేషన్‌ కాంపిటెంట్‌ అధికారిగా డీసీపీ - 1 గజరావు భూపాల్‌ వ్యవహరించనున్నారు. ఇమ్మిగ్రేషన్‌కు రాజముద్ర పడటంతో.. ఇమిగ్రేషన్‌ హోదాకు అధికారిక ముద్ర పడింది. విజయవాడ ఎయిర్‌పోర్టు ఇమిగ్రేషన్‌ స్థాయిని అందుకుంది. ఎయిర్‌పోర్టు కేంద్రంగా పనిచేయనున్న ఇమిగ్రేషన్‌కు కాంపిటెంట్‌ అధికారిని నియమించిన సందర్భంలో సిబ్బందిని తక్షణం నియమించాల్సి ఉంది. ఇంతకు ముందు కేంద్ర ఇమిగ్రేషన్‌ ఉన్నతాధికారులు విజయవాడ వచ్చి ఎయిర్‌పోర్టును పరిశీలించిన తర్వాత అప్పటి డీజీపీ ఎన్‌.సాంబశివరావును కలిశారు. అప్పుడు ఆయన 55 మంది సిబ్బందిని కేటాయిస్తామని, వారికి శిక్షణ కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం రాజముద్ర పడిన నేపథ్యంలో, తక్షణం సిబ్బందిని భర్తీ చేయాల్సి ఉంది. మరోవైపు అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు పూర్తయ్యాయి. ఇమిగ్రేషన్‌ శాఖకు సంబంధించి సివిల్‌ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఎలక్ర్టికల్‌ వర్క్‌ జరుగుతోంది. ఢిల్లీ నుంచి ఎలక్ర్టానిక్‌ పరికరాలు, యూపీఎస్‌లు వచ్చాయి. వీటిని బిగించాల్సి ఉంది. ఈ ఏర్పాటంతా ఎంత త్వరగా జరిగితే.. అంత త్వరగా అంతర్జాతీయ విమానాలు ప్రారంభించటానికి అవకాశం ఉంటుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానయాన సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ సర్వీసును నడపటానికి ముందుకు వచ్చింది.
 
విజయవాడ నుంచి ముంబాయికి అక్కడి నుంచి దుబాయి, షార్జాలకు వెళ్ళి తిరిగి ముంబాయి, ఆ తర్వాత విజయవాడ వచ్చేలా రూట్‌మ్యాప్‌ను నిర్దేశించుకోవటం జరిగింది. ఇంకా ఇమిగ్రేషన్‌ ఏర్పాటు కాకపోవటం వల్ల ప్రస్తుతానికి పక్షం రోజుల నుంచి ముంబాయికి మాత్రమే విమాన సర్వీసులు నడుపుతోంది. ఎంత త్వరగా సిబ్బంది ఏర్పాటు జరిగితే అంత త్వరగా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించటం సాధ్యమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కు విమాన సర్వీసును నడపాలన్న ఉద్దేశంతో ఉంది. దీనికోసం ఆ దేశ విమానయాన సంస్థతో సంప్రదింపులు చేస్తోంది. ఇమిగ్రేషన్‌ ఏర్పాటుతోటే కస్టమ్స్‌కు కూడా లైన్‌ క్లియర్‌ అవుతోంది. కస్టమ్స్‌ కూడా ఇక్కడ నుంచి పనిచేయటానికి సర్వంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. రెండు వారాల్లో దీనికి సంబంధించి కూడా తీపి క బురు వచ్చే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

11 hours ago, Bezawada_Lion said:

Sounds like oke flight ni atu itu tipputunnafu ga every day......okkati schedule thappina mottam dobbinatte aa roju.....

yes - poddunne hyd lo start ayithe ratri ki malli 10.30 PM ki hyd velthundi

most of the time alane vuntayi - yemanna climate changes/equipment issues vatchina - aa roju dobbinatle

 

Link to comment
Share on other sites

ఏపీ నుంచి థాయ్‌ ఎయిర్‌వేస్‌ సేవలు

అమరావతి: ఏపీ నుంచి సేవలందించేందుకు థాయ్‌ ఎయిర్‌వేస్‌ సంసిద్ధత వ్యక్తంచేసింది. విశాఖ లేదా విజయవాడ నుంచి త్వరలో సేవలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు థాయ్‌లాండ్‌ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపింది. ఈ మేరకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును థాయ్‌లాండ్‌ ప్రతినిధులు కలిశారు. విజయవాడ నుంచి సేవలు ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం వారికి  సూచించారు.  
 

Link to comment
Share on other sites

Kadapa flight set to resume under UDAN from march 1st. First route from VGA under RCS UDAN. Previously this route was served by AP state government's RCS scheme. VGA-HYD flight time going to change.

HYD-VGA-CDP-VGA-HYD

At present both VGA - CDP and VGA - HYD timings are show same in booking engine.
Link to comment
Share on other sites

IndiGo to connect 3 major cities with Vijayawada

IndiGo authorities said that it would also consider the Vijayawada-New Delhi ticket fares to be economical, most likely between Rs 4,000 to Rs 5,000.

https://dc-cdn.s3-ap-southeast-1.amazonaws.com/dc-Cover-gnq063a685ju8u9nsjhob1uge2-20161006173151.Medi.jpeg

IndiGo operates flights to Bengaluru and Chennai also, from Vijayawada at 8 am and 3.15 pm, and the fares will be Rs 1,826 and Rs 1,179 respectively.

Vijayawada: Private airlines, IndiGo,  has entered the competetive market by offering throwaway fares to the air passengeres travelling from Vijayawada to various domestic destinations, like Hyderabad, Chennai, and Bengaluru.

IndiGo authorities said that it would also consider the Vijayawada-New Delhi ticket fares to be economical, most likely between Rs 4,000 to Rs 5,000.

Sharing details with  Deccan Chronicle, IndiGo Chief Commercial officer (CCO) Sanjay Kumar said that Indigo is even considering initiating flights from Vijayawada to Varanasi, via Hyderabad and Bengaluru.

The air passengers from Vijayawada are catching their New Delhi flights, from Shamshabad airport in the early hours, due to heavy fares for New Delhi bound flights from Vijayawada, in the night timings.

“We promise IndiGo fares to New Delhi will be economical,” said Mr Sanjay Kumar. Speaking about IndiGo’s operations from March 2, from Vijayawada airport, the fare of the Vijayawada-Hyderabad first flight on March 2 would be Rs 1,246 per ticket, inclusive of all taxes, and three flights would be there from Vijayawada to Hyderabad -- at 12.10 pm, 6.45  pm and 9.35 pm. “The ticket fare from Hyderabad to Vijayawada would be Rs 1,799, inclusive of all taxes, from 6.30 am, 1.50 pm and 8.10 pm,” he added.

IndiGo operates flights to Bengaluru and Chennai also, from Vijayawada at 8 am and 3.15 pm, and the fares will be Rs 1,826 and Rs 1,179 respectively.

“There will be five flights from Vijayawada to Hyderabad, Chennai and, Bengaluru daily.” Apart from this Vijayawada will also be connected to many new cities on IndiGo’s existing network of Airbus 320s and ATRs.

IndiGo will connect Vijayawada to Delhi, Mumbai, Kolkata, Dubai, Singapore, Sharjah among other cities via Bengaluru, Hyderabad and Chennai.The IndiGo airline has also inducted a brand new Airbus A320 NEO aircraft into its fleet.

Link to comment
Share on other sites

ఎగిరిపోదాం 
రెండేళ్లలో 4 లక్షల ప్రయాణికుల పెరుగుదల 
విమాన సర్వీసులు ఏటా పది వేలకు పైగా పెంపు 
గన్నవరం నుంచి ఏ నగరానికైనా 80-90శాతం ఆక్యుపెన్సీ 
ఈనాడు, విజయవాడ 
kri-top2a.jpg

గన్నవరం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య  రెండేళ్ల వ్యవధిలోనే రెట్టింపైంది. 2015-16లో ఏటా సర్వీసులు 7596 నడవగా.. 3.96 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రస్తుతం ఏటా 17,520 సర్వీసులు.. 7.5 లక్షల నుంచి 8 లక్షల మంది ప్రయాణికులకు పెరిగింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఏ నగరానికి సర్వీసులు ప్రారంభించినా.. అనూహ్యంగా మొదటి నెల నుంచే 80-90 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. దీంతో విమానయాన సంస్థలు సైతం ఇక్కడి నుంచి సర్వీసులను నడిపేందుకు పోటీపడి మరీ ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌, ఎయిరిండియా సంస్థలు విమానాశ్రయం నుంచి సర్వీసులను నడుపుతున్నాయి. తాజాగా మార్చి 2 నుంచి ఇండిగో సంస్థ ఒకేసారి రోజుకు పది సర్వీసులను నడిపేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వీటికి సంబంధించిన టిక్కెట్లు సైతం హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

ఈ విమానాశ్రయం నుంచి మూడేళ్ల కిందటి వరకూ ఒకటీ అరా విమాన సర్వీసులు వస్తూ పోతూ ఉండేవి. ఇక్కడి నుంచి ఏ నగరానికి వెళ్లాలన్నా.. నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి విమానాలను ఎక్కేవారు. రాజధాని నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులను పెంచాల్సి వచ్చింది. విమానయాన సంస్థలు సైతం మొక్కుబడిగా ఇక్కడి నుంచి ప్రారంభించేవి. అనూహ్యంగా ఏ సర్వీసును ప్రారంభించినా.. ఆక్యుపెన్సీ ఊహించని విధంగా ఉంటుండడంతో.. గన్నవరంపై అంచనాలు ఒకేసారి పెరిగిపోయాయి. గత మూడేళ్లుగా ఈ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ పెరుగుదలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. రెండేళ్ల కిందటి వరకూ హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు మాత్రమే సర్వీసులు నడిచేవి. క్రమంగా ఒక్కో ప్రధాన నగరాన్ని కలుపుతూ.. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, విశాఖ, తిరుపతి, కడపకు గన్నవరం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోనికి వచ్చాయి. అప్పట్లో రోజుకు 20 సర్వీసులు నడుస్తుండగా.. ప్రస్తుతం రన్‌వే ఖాళీ లేనంతగా.. ప్రతి గంటకూ రెండు సర్వీసులు ఏదో ఒక నగరానికి నడుస్తూనే ఉన్నాయి. గతంలో ఒక్కటి నడిపేందుకు సైతం ఆసక్తి చూపని విమానయాన సంస్థలు పోటీపడి మరీ స్లాట్లకు దరఖాస్తులు చేసుకుంటూ సర్వీసుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. తాజాగా కడప నుంచి సైతం విజయవాడకు ఓ సర్వీసును ట్రూజెట్‌ సంస్థ నడిపేందుకు షెడ్యూల్‌ను ప్రకటించింది.

మార్చి నుంచి మరింత ఊపు.. 
గన్నవరం నుంచి మార్చి ఒకటి తర్వాత సర్వీసుల సంఖ్య మరింత పెరగబోతోంది. ప్రస్తుతం 38 వరకూ నిత్యం నడుస్తుండగా.. మార్చి ఒకటి తర్వాత 11 అదనంగా చేరుతున్నాయి. వీటికి సంబంధించిన టిక్కెట్లు సైతం ప్రస్తుతం అమ్ముడైపోతున్నాయి. ఇండిగో పది, ట్రూజెట్‌ కడపకు నూతన సర్వీసును నడపబోతోంది. ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ కూడా మరిన్ని సర్వీసులను పెంచే అవకాశం ఉంది. మార్చి చివరి నాటికి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సైతం సర్వం సిద్ధమైపోతుంది. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కేబుళ్ల ఏర్పాట్లు సాగుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ  దుబాయ్‌, సింగపూర్‌, షార్జా వంటి నగరాలకు విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులకు కనెక్టివిటీని అందుబాటులోనికి తెచ్చింది. అవసరాన్ని బట్టి.. విదేశాలకు నేరుగా సర్వీసులను నడిపే అవకాశాన్ని త్వరలో పరిశీలిస్తామంటూ.. ఇండిగో చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ సంజయ్‌కుమార్‌ బుధవారం ప్రకటించారు.

ఊహించని విధంగా... 
విజయవాడ నుంచి ముంబయి, దిల్లీ నగరాలకు సర్వీసులను ఏర్పాటు చేయమని ఇక్కడి పారిశ్రామిక, వాణిజ్య, రాజకీయ వర్గాలు రెండేళ్ల పాటూ తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. అయినా.. ఏ సంస్థా ముందుకొచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఎయిరిండియా ముందుకొచ్చి ముంబయి, దిల్లీ నగరాలకు సర్వీసులను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ రెండు సర్వీసులకూ భారీ డిమాండ్‌ ఉంటోంది. ఆక్యుపెన్షీ 80 శాతం పైనే ఉంటోంది. మొదట్లో నేరుగా సర్వీసులను నడిపితే.. ఆక్యుపెన్షీ ఉండదేమోనంటూ.. వయా హైదరాబాద్‌ నడిపేవాళ్లు. ప్రస్తుతం ఆ పరిస్థితి అవసరం లేకుండా.. మరో మూడు నాలుగు సర్వీసులను ఏర్పాటు చేసినా.. సరిపోయేంత రద్దీ పెరిగేందుకు అవకాశం ఉంది.

ఇంకా ఎంతో అవకాశం.. 
విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ఏటా 8 లక్షల మంది ప్రయాణికులు వచ్చి, వెళ్తుండగా.. ఇక్కడ దీనికి రెండు రెట్లు ఆక్యుపెన్షీకి అవకాశం ఉంది. రెండేళ్ల కిందటి వరకూ ఏటా కనీసం 25 లక్షల మంది కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను అందుకునేవాళ్లు. ఈ నాలుగు జిల్లాల నుంచి విదేశాలు, ముంబయి, దిల్లీ నగరాలకు వెళ్లి స్థిరపడిన వాళ్లు లక్షల్లో ఉన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...