Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
ఎగిరొస్తున్న.. ఎక్స్‌ప్రె‌స్
08-12-2017 08:19:07
 
636483179490235786.jpg
  • విజయవాడకు తొలి అంతర్జాతీయ సర్వీసు ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’
  • ముంబై - విజయవాడ - దుబాయ్‌ - షార్జా సర్వీసు
  • విదేశీ క్లియరెన్స్‌ తీసుకున్న ఏఏఐ ఎక్స్‌ప్రెస్‌
  • జనవరి ఆఖరు నుంచి ప్రారంభం?
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని ప్రాంతంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి అంతర్జాతీయ సర్వీసుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తన సర్వీసును ప్రారంభిం చబోతోంది. విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత ఏ విమానయాన సంస్థ మొదటిసారిగా విమానం నడుపుతుందా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విదేశాలకు విమాన సర్వీసులు నడపాలంటే.. ముందుగా విదేశీ విమానయాన సంస్థలే ఆసక్తి చూపిస్తాయని భావించగా.. దీనికి భిన్నంగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ముందుకు రావటం గమనార్హం. ఎయిర్‌ ఇండియా సంస్థకు అనుబంధంగా ఎయిర్‌ ఇండియా అలయాంజ్‌, ఎయిర్‌ ఇండియి ఎక్స్‌ప్రెస్‌ విమాన సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తొలి విదేశీ విమానాన్ని ఇక్కడినుంచి నడపటానికి సంసిద్ధమైంది. ఈ సంస్థ రెండు నెలల కిందటే విజయవాడ ఎయిర్‌పోర్టులోను, వివిధ వర్గాలలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ముంబై, దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసులు కావాలన్న డిమాండ్‌ వచ్చింది.
 
ఈ మేరకు ముంబై నుంచి నేరుగా విజయవాడ సర్వీసును నడిపి అదే సర్వీసును విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసుగా దుబాయ్‌, షార్జాలకు నడపాలని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నిర్ణయించింది. జనవరి నుంచే విమాన సర్వీసులు నడపాలని ఈ సంస్థ నిర్ణయించింది. జనవరి నెలాఖరుకు కానీ, ఫిబ్రవరి మొదటివారంలో కానీ సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించింది. విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు చొరవను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎయిర్‌ ఇండియా సంస్థతో ఆయన చాలాకాలంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ విదేశీ క్లియరెన్స్‌ తీసుకుంది.
 
ఇమ్మిగ్రేషన్‌ రావటమే తరువాయి
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ చాలా స్పీడ్‌గా ఉన్నా.. క్షేత్ర స్థాయిలో స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపటానికి ప్రధానంగా ఇమిగ్రేషన్‌ ఏర్పాటు జరిగి ఉండాలి. విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ ముస్తాబైంది. అయితే ఇమ్మిగ్రేషన్‌ ఇంకా ఏర్పాటు కావాల్సిఉంది. ఇమ్మిగ్రేషన్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రవీణ్‌ బోరాసింగ్‌ అనే ఉన్నతాధికారిణి ఇటీవల విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చి అంతర్జాతీయ టెర్మినల్‌ను పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం, కౌంటర్లను కూడా పరిశీలించారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఆమె సానుకూలంగా రిపోర్టు ఇచ్చారు. ఇమ్మిగ్రేషన్‌ నోటిఫికేషన్‌ వెలువడితే .. మిగిలిన ప్రక్రియ ప్రారంభమౌతుంది. జనవరి 15 నాటికి ఇమ్మిగ్రేషన్‌ రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ నుంచి అనుమతి రాకపోతే కేవలం ముంబై వరకు మాత్రమే విమాన సర్వీసును ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నడుపుతుంది. వచ్చిన తర్వాత ఆయా దేశాలకు నడుపుతుంది. విదేశీ డెస్టినేషన్‌ ఎయిర్‌ పోర్టులకు... విజయవాడ అతి దగ్గరగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విమాన కనెక్టివిటీ ఉండే ఎయిర్‌పోర్టు.. విజయవాడ నుంచి సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌, హాంగ్‌కాంగ్‌లకు దగ్గరగా ఉంది. విదేశాలకు వెళ్లే వారికి మరింత సౌలభ్యంగా ఉంటుంది. డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్టులకు చేరుకున్నవారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించటానికి అవకాశం ఉంటుంది. విమాన ప్రయాణికుల శాతం కూడా పెరుగుతుంది.
Link to comment
Share on other sites

7 hours ago, sonykongara said:

gann5.jpg

:super:

Its a good beginning...however, US nundi AirIndia lo ravadaniki evaru prefer cheyaru cause of worst seating experience. this airline is a common choice for elderly people, who are not fluent with English.

may be dubai varaku emirates lo vachi..baggage claim chesukuni, ee connection catch cheyyalemo..

gotta see how airindia treats connections with other airlines.:dream:

Link to comment
Share on other sites

16 minutes ago, LION_NTR said:

seating parvaledu, reclining and tv's pani cheyyanidi row ki okati vuntundi

but journey timings wise - super from JFK and SFO , Vijayawada ki dinner time ki intlo vundotchu, malli tinesi ekkatchu

return lo VJA lone baggage check-in upto your destination.

Link to comment
Share on other sites

3 hours ago, rk09 said:

yeh..naa uddesam kooda reclining gurinche.

last year travelled from JFK to Delhi. had a horrible back ache cause of those seats.

food kooda worst! 

But travel time maatram takkuve!

dubai nunchi US ki air india flights levu kbatti. most likely emirates tho tie up avutharemo.

Link to comment
Share on other sites

ఇమిగ్రేషన్‌కు ఓకే
13-12-2017 03:11:48
 
636487315131823838.jpg
  • ఇక విజయవాడ నుంచే విదేశాలకు.. కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌
  • ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ద్వారా తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు
విజయవాడ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి):విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇమిగ్రేషన్‌ హోదా వచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇక గెజిట్‌ నోటిఫికేషన్‌ రావడం లాంఛనమే. విజయవాడ నుంచి విదేశాలకు విమానాలు నడపటానికి అతి ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌లోనే ఇమిగ్రేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకు కావాల్సిన వసతులను, చెకింగ్‌ కౌంటర్లను విమానాశ్రయ అధికారులు సిద్ధం చేశారు.
 
ఈ మధ్య ఇమిగ్రేషన్‌ శాఖకు చెందిన ఉన్నతాధికారి ప్రవీణ్‌ బోరాసింగ్‌ గన్నవరం వచ్చి ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆమె నేరుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సానుకూలంగా నివేదిక ఇవ్వటం, నోటిఫికేషన్‌ రావడం చకచకా జరిగిపోయింది. ఇమిగ్రేషన్‌ తరపున తక్షణం వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌, ఇంటర్‌నెట్‌ కేబులింగ్‌ వంటివి తమకు కేటాయించిన కార్యాలయాలు, చెకింగ్‌ పాయింట్లలో ఏర్పాటు చేసుకుని, తగినంత మంది సిబ్బందిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సహకరిస్తామని డీజీపీ నండూరి సాంబశివరావు ఇప్పటికే చెప్పారు.
 
కస్టమ్స్‌ హోదా లాంఛనమే!
విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ హోదా అందుకున్నప్పటికీ కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ హోదా రాకపోవడంతో ఇన్నాళ్లూ కొంత నిరుత్సాహం నెలకొంది. కనీసం కస్టమ్స్‌ హోదా వచ్చినా దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు విమానాలు నడపవచ్చని విమానాశ్రయ అధికారులు భావించారు. అయితే కస్టమ్స్‌ హోదా రాకముందే ఇమిగ్రేషన్‌ హోదాపై ప్రకటన జారీ కావడంతో అధికారులు ఉబ్బి తబ్బి బ్బు అవుతున్నారు. ఈ విషయాన్ని వెంటనే సీఎంవో కార్యాలయానికి విమానాశ్రయ డైరెక్టర్‌ గిరి మధుసూదనరావు తెలిపారు.
 
ఇమిగ్రేషన్‌ హోదా రావటంతో ఇక కస్టమ్స్‌ హోదా కూడా లాంఛనమే. కాగా విజయవాడ నుంచి ముంబాయికి అక్కడి నుంచి దుబాయ్‌, షార్జాలకు విమాన సర్వీసు నడపటానకి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఇటీవలే ఆసక్తి చూపించింది. ఇమిగ్రేషన్‌ హోదా రాకపోతే ముంబాయి వరకు నడపాలని భావించింది. ఇప్పుడు తొలి అంతర్జాతీయ సర్వీసుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి దుబాయ్‌, షార్జాలకు విమానాన్ని నడపనుంది.

http://www.andhrajyothy.com/artical?SID=505759

గన్నవరం నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు: అశోక్‌
13-12-2017 13:06:02
 
636487671670961379.jpg
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయం విస్తరణ పూర్తయ్యాక అంతర్జాతీయ విమానాలను ప్రారంభిస్తామన్నారు. అలాగే ఈనెల 19వతేదీన గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా... మధ్యాహ్నం 1.30 సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొననున్నారు.
Link to comment
Share on other sites

ఇమిగ్రేషన్‌ హోదాతో.. అంతర్జాతీయ సర్వీసులకు శ్రీకారం
14-12-2017 08:20:41
 
636488371581013206.jpg
  • తొలి అంతర్జాతీయ సర్వీసుగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌
  • విజయవాడ - ముంబయి - దుబాయ్‌ - షార్జా
  • జనవరి 19 నుంచి ముంబయికి ముందుగా సర్వీసు
  • ఇమ్మిగ్రేషన్‌ ఏర్పడిన 45 రోజులకు తొలి అంతర్జాతీయ సర్వీసు
 
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇలా ఇమిగ్రేషన్‌ హోదా వచ్చిందో లేదో.. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ అంతర్జాతీయ షెడ్యూల్‌ సర్వీసులు ప్రారంభించటానికి సమాయత్తమైంది. విజయవాడ నుంచి ముంబయి, అక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లి మళ్లీ అక్కడి నుంచి షార్జా తిరిగి ముంబయి నుంచి విజయవాడ షెడ్యూల్‌కు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ నిర్ణయించింది. జనవరి 19వ తేదీ నుంచి ముందుగా విజయవాడ - ముంబయికి తమ షెడ్యూల్స్‌ను నడపనున్నట్టు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ బుధవారం ప్రకటించింది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఇమిగ్రేషన్‌ హోదాకల్పిస్తూ రెండురోజుల కిందటే నోటిఫికేషన్‌ వెలువడింది. అయితే ఇమిగ్రేషన్‌ ఇక్కడ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించటానికి కొంతసమయం పడుతుంది. ఈలోపు కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కూడా రావాల్సివుంది. దీనికి నెల రోజుల సమయం పడుతుంది. దీనికితోడు ఇమిగ్రేషన్‌ శాఖ ఇక్కడ ఏర్పాటైన తర్వాత 45 రోజుల వరకు అంతర్జాతీయ సర్వీసు నడపకూడదన్నది ఎయిర్‌ ఇండియా నిబంధనావళిలో ఉంది. దీనిని విధిగా అమలు చేయాలి. అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి ఎంతలేదన్నా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అధికారులు ముందుగా విజయవాడ నుంచి ముంబయి వరకు నాన్‌స్టాప్‌ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించారు. వారంలో మంగళ, శుక్ర, ఆదివారాలలో మూడురోజులపాటు ఈ విమాన సర్వీసు ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అమ్ములపొదిలోని అత్యాధునిక విమానాలలో ఆరవదైన బోయింగ్‌ 737-800 ఎన్‌జీ ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానాన్ని ముంబయి - విజయవాడ సర్వీసుగా నడుపుతున్నారు. ఉదయం 8 గంటలకు ముంబయి నుంచి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ బయలుదేరి 9.45 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి ఉదయం 10.30 గంటలకు ఈ విమానం ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు ముంబయి చేరుకుంటుంది.
 
‘ఎయిర్‌ ఇండియా’ రాకతో ప్రత్యేక గుర్తింపు
విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశరాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ సంస్థకు చెందిన విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే సింహభాగం ఆపరేషన్స్‌ ఎయిర్‌ ఇండియావే కావటం గమనార్హం! ప్రైవేటు సంస్థ స్పైస్‌ జెట్‌ ఒక్కటి మాత్రమే హైదరాబాద్‌, బెంగళూరులకు విమాన సర్వీసులు నడుపుతోంది. రీజనల్‌ కనెక్టివిటీలో భాగంగా ట్రూజెజ్‌ సంస్థ హైదరాబాద్‌, తిరుపతి, కడపలకు సర్వీసులు నడుపుతోంది. ఎయిర్‌ ఇండియా వంటి ప్రధాన వియానయాన సంస్థ దేశంలోని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు విస్తృత స్థాయిలో నడపటం వల్ల కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతోంది. కస్టమ్స్‌ హోదా రావటానికే అష్టకష్టాలు పడుతున్న విజయవాడ ఎయిర్‌పోర్టుకు ఇమిగ్రేషన్‌ ఇంత త్వరగా రావటానికి ఎయిర్‌ ఇండియా ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలన్న ఆసక్తి చూపటమే ప్రధాన కారణమని తెలుస్తోంది.
 
అంతర్జాతీయ సర్వీసులకు ఇక.. ఇక్కడే వేదిక
విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడవటానికి బీజం పడింది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుకాకుండా... సింగపూర్‌కు విమాన సర్వీసును నడిపేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగా సింగపూర్‌ ప్రభుత్వంతో ఇప్పటికే ఏపీ సంప్రదింపులు జరిపింది. సింగపూర్‌కు కూడా అతి త్వరలో విమాన సర్వీసు ప్రారంభం కావటానికి ఎంతో సమయం లేదు. టాటా గ్రూపునకు చెందిన ఎయిర్‌ ఆసియా చూపు కూడా విజయవాడపై ఉంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రతన్‌టాటాను కూడా ఎయిర్‌ ఆసియా సర్వీసులకు సంబంధించి మాట్లాడారు. విదేశీ విమానాలు నడపటానికి అనువైన వాతావరణం ఇక్కడ వచ్చాక.. తప్పకుండా నడుపుతామన్న హామీఇచ్చింది. ఇమిగ్రేషన్‌ రావటంతో ఇక ఆశాఖ కూడా దీనిపై ఆలోచన చేయాల్సివుంది. విశాఖపట్నంలో అంతర్జాతీయస్థాయిలో విమానయాన సంస్థలతో నిర్వహించిన సందర్భంలో గల్ఫ్‌దేశాలకు చెందిన పలు విమానయాన సంస్థలు విజయవాడకు సర్వీసులు ప్రారంభించటానికి ఆసక్తి చూపించాయి. అయితే ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ హోదాలు రాకపోవటం, రన్‌వే ఆ దిశగా విస్తరించకపోవటం వంటి కారణాలను ప్రస్తావించి ఇవన్నీ పూర్తయితే తాము రెడీ అన్న సంకేతాలు కూడా ఇచ్చాయి. గల్ఫ్‌ దేశాలకు చెందిన విమానయాన సంస్థలతో తక్షణం ఇక్కడి అధికారులు సంప్రదింపులు జరపాల్సిన సమయం కూడా ఆసన్నమైంది.
 
రన్‌వే విస్తరణ పూర్తయితే..
విజయవాడ ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం రన్‌వే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 10,500 అడుగులుగా ఉన్న రన్‌వేను 13వేల అడుగులుగా విస్తరించటానికి ఇటీవలే టెండర్లు పిలిచారు. రన్‌వే విస్తరణ పనులకు ఇటీవలే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. అంతకుముందే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులు పూర్తయ్యాయి. దీనిపై ఆరు రకాల లేయర్లతో సీసీ వేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి కాంట్రాక్టు సంస్థ పీఆర్‌ఎల్‌ దీని పనులు పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది. రన్‌వే విస్తరణ పనులు పూర్తయితే అంతర్జాతీయ విమానాలు పూర్తిస్థాయిలో నడవటానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ విమానాలు భారీ సైజులో ఉంటాయి. భారీ విమానాలు నడవాలంటే రన్‌వే విస్తరణ తప్పనిసరి. ఇక్కడికి విమాన సర్వీసును ప్రారంభించాలన్న ఆలోచనను అరబ్‌ ఎమిరేట్స్‌ చేస్తోంది. అరబ్‌ ఎమిరేట్స్‌ భారీ విమానాలనే నడుపుతుంది. అలాంటపుడు ఇక్కడ రన్‌వే విస్తరణ మరింత అవసరం.

@Vulavacharu 

http://www.eenadu.net/district/inner.aspx?dsname=Krishna&info=kri-top1

గన్నవరం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్‌ హోదా 
ఈనాడు, విజయవాడ 
kri-top1a.jpg

గన్నవరం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్‌ హోదాను ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిచేందుకు ఇక మార్గం సుగమమైనట్టే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి అంతర్జాతీయ సర్వీసుల ప్రక్రియను వేగవంతం చేయాలని హోంసెక్రటరీ రాజీవ్‌కు సూచించారు. దీంతో గత నెలలో ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ హోరా సింగ్‌, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) టెక్నికల్‌ డైరెక్టర్‌ మాధవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలోని బృందం వచ్చి వసతులను పరిశీలించింది. ఇప్పటికే విమానాశ్రయంలో రూ.3 కోట్లతో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు టెర్మినల్‌ భవనాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖకు చెందిన 55మందిని నియమించనున్నారు. ఇతర దేశాలకు విమానాలు నడపాలన్నా.. అటునుంచి రావాలన్నా.. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా.. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అత్యంత కీలకం.

Link to comment
Share on other sites

Amaravati Voice
 
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, ఒకే సారి పది కొత్త సర్వీసులు ప్రారంభం..:

gannaram-23122017.jpg
share.png
whatsapp.png

ఇండిగో ఎయిర్ లైన్స్, చెప్పినట్టే, మన రాష్ట్రంలో భారీ ప్రణాళికతో అడుగు పెడుతుంది... ఇప్పటికే తిరుపతి, రాజమహేంద్రవరం షడ్యుల్ ప్రకటించిన ఇండిగో, గన్నవరం నుంచి భారీ షడ్యుల్ ప్రకటించింది. ఎట్టకేలకు గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 2వ తేదీ నుంచి దేశంలోని మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నుండి ఇక్కడికి రోజుకు పది విమాన సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రయాణ షెడ్యుల్‌ను విడుదల చేయడంతోపాటు టికెట్‌ బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. ఇండిగో నూతనంగా కొనుగోలు చేసిన 74 సీటింగ్‌ కెపాసిటి కలిగిన ఏటీఆర్‌ 72–600 విమానాలను నడపనుంది.

gannaram 23122017

ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ గతేడాది కాలంగా సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలోనే సర్వీసులు ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సర్వీసులను నడిపేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇండిగో ఏటీఆర్‌ రాకతో గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులు గణనీయంగా పెరగడంతోపాటు ప్రయాణికుల ఆదరణ కూడా పెరుగుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

gannaram 23122017

సర్వీసుల వివరాలు: హైదరాబాద్‌ నుంచి ఉదయం 7.35కు, మధ్యాహ్నం 13.50, రాత్రి 20.10కు విమానాలు ఇక్కడికి చేరుకుంటాయి. తిరిగి ఇక్కడి నుండి మధ్యాహ్నం 12.10, సాయంత్రం 18.45, రాత్రి 21.35కు హైదరాబాద్‌కు బయలుదేరతాయి. ఇక్కడి నుంచి ఉదయం 8 గంటలకు విమానం బయలుదేరి 9.35కు బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి 10.15కు బయలుదేరి 11.50కు ఇక్కడికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి ఉదయం 15.15కు విమానం బయలుదేరి 16.35కు చెన్నైకు చేరుకుంటుంది. తిరిగి చెన్నై నుంచి 16.55కు బయలుదేరి 18.25కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు.

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి ఇండిగో విమాన సర్వీసులు
23-12-2017 19:45:09
 
636496551190061801.jpg
ఢిల్లీ: మార్చి 2 నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విజయవాడ-హైదరాబాద్‌ మధ్య మూడు విమాన సర్వీసులు, విజయవాడ-బెంగళూరు మధ్య రెండు విమాన సర్వీసులు, చెన్నై-విజయవాడ మధ్య ఒక విమాన సర్వీసును ఇండిగో నడపనుంది.
Link to comment
Share on other sites

విజయవాడ నుంచి ఇండిగో సర్వీసులు 
23brk130-indigo.jpg

అమరావతి: విజయవాడ నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు విమాన సేవలను నడిపేందుకు ప్రముఖ విమాన యాన సంస్థ ఇండిగో సిద్ధమైంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైకు విమాన సర్వీసులను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి ప్రారంభించనుంది. విజయవాడ - హైదరాబాద్‌ మధ్య రెండు సర్వీసులు, బెంగళూరు - విజయవాడ మధ్య రెండు సర్వీసులు, చెన్నై- విజయవాడ మధ్య ఒక విమాన సర్వీసును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...