Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

Tirupati and Vijayawada airports choosanu. Super vunnai. Vijayawada ki ekkuva chaala chinna flights nadustunnai. Tirupati to Vijayawada, Vijayawada to Bangalore and Bangalore to Vijayawada nenu vellina Flights anni full passengers tho nadichai.

 

Runway expansion works jarugutunnai. Next year summer ki complete avvavachhu.

Link to comment
Share on other sites

విజయవాడ నుంచి సింగపూర్‌కు విమానాలు

వచ్చే ఏడాది వేసవి నుంచి అందుబాటులోకి

విశాఖ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప నుంచి పలు నగరాలకు త్వరలో..

సేవల రంగంపై సమీక్ష

ఈనాడు, అమరావతి: విజయవాడ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు విమాన సేవలు వచ్చే ఏడాది వేసవి నుంచి అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం నుంచి జగదల్‌పూర్‌, రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌, కడప నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు- తిరుపతి నుంచి హైదరాబాద్‌, బెంగళూరులకు ఈ ఏడాది డిసెంబరు నుంచి విమాన సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు వివరించారు. విమానాశ్రయాల్లో వెయ్యి క్యాబ్‌లు అందుబాటులో ఉంచేలా ఓలా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఆ సంస్థ విశాఖపట్నంలో తమ ప్రాంతీయకేంద్రాన్ని కూడా ప్రారంభించిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో సేవల రంగంపై దినేష్‌కుమార్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సేవల రంగం వృద్ధికి తమ ప్రణాళికలను ఆయా శాఖల అధికారులు నివేదించారు.

Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్ట్‌కు పర్యాటక సొబగులు

636441687460930517.jpg

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు పర్యాటక అడుగులు వేస్తోంది. దేశీయంగా మెట్రో పాలిటన్‌ విమానాశ్రయాలను తలదన్ని వృద్ధిని సాధిస్తున్న విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ ఆర్థిక సంవత్సరానికి మిలియన్‌ ప్రయాణికులను చేరవేయటమే లక్ష్యంగా నిర్దేశించుకుని ప్రణాళికగా ముందుకు వె ళుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా వృద్ధి రేటును మెరుగుపరుచుకునే దిశగానే అడుగులు వేస్తున్న

ఎయిర్‌పోర్టు అధికారులు తాజాగా పర్యాటక ఆకర్షణ దిశగా ప్రయత్నాలు చేపడుతున్నారు.

 


  •  ఎయిర్‌పోర్ట్‌కు పర్యాటక సొబగులు
  •  ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌లో మార్పులు
  •  లాంజ్‌లో అలంకరణలు
  •  విద్యుదీకరణతో రాత్రిళ్లు కాంతులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, హాంగ్‌కాంగ్‌ వంటి దేశాల్లో ఎయిర్‌పోర్టులను చూస్తే అచ్చెరువొందాల్సిందే. టెర్మినల్‌ బిల్డింగ్స్‌ అంతర్గత సొగసు అత్యద్భుతంగా ఉంటుంది. రోజుకో అలంకరణ చేపడతారు. రోజువారీ విమాన ప్రయాణికులు ఈ అలంకరణను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. అంతర్జాతీయ యాత్రికులు ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఎక్కువసేపు గడుపుతారు. ఫలితంగా లాంజ్‌లలో ఉన్న రెస్టారెంట్స్‌, కాఫీ బఫెట్స్‌ , బేకరీ స్టాల్స్‌, బ్రాండెడ్‌ మాల్స్‌లో కూడా సందర్శకులు కిటకిటలాడుతుంటారు. ఇలాంటి వాతావర ణాన్ని విజయవాడ విమానాశ్రయంలో కూడా కల్పించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రూ.148 కోట్ల వ్యయంతో ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను నిర్మించారు. ఈ బిల్డింగ్‌ ఎంతో అందంగా ఉంటుంది. దీంతో పాటు అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత..

 

అంతర్జాతీయ విమానాలు నడపటానికి గతంలోనే ఆధునికీకరించిన పాత టెర్మినల్‌ను మళ్ళీ విస్తరిస్తున్నారు. ఈ రెండు టెర్మినల్స్‌ను అంతర్గతంగా దేశీయంగా, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందులు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో పర్యాటకశాఖ సహకారం కూడా తీసుకుని ఇప్పటికే నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే అద్భుతమైన కళాఖండాలను ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయ లాంజ్‌లో ప్రత్యేక అలంకరణలు చేపడుతున్నారు. ఎక్కువుగా ఫ్లోరల్‌ డెకరేషన్‌ చేపడుతున్నారు. పండుగలు వచ్చినపుడు వాటికి థీమ్‌కు అనుగుణంగా అలంకరణ చేపడు తున్నారు. తాజాగా దీపావళిని పురస్క రించు కుని ఎయి ర్‌పో ర్టు ను వి ద్యుదీ పాల ంకర ణతో దేదీప్య మా నంగా అలం కరించారు. దీపావళి సందర్భంగా ఎయిర్‌పోర్టు ధగ ధగలాడిపోతుంటే.. సందర్శకులు ఈ లైటింగ్‌ను ఆస్వాదిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు ఎయిర్‌పోర్టు అధికారులు మరికొద్ది రోజులు ఈ లైటింగ్‌ను ఉంచాలని భావిస్తున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టులో ఇటీవల నిర్మించిన నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ ఇటీవల కాలంలో ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ మాదిరిగా మారింది. ప్రభుత్వ శాఖల అధికారులు, కార్పొరేట్‌ పీపుల్‌ కూడా సమయం కలిసి వస్తుందన్న ఉద్దేశ్యంతో తమ సమావేశాలను కూడా వీఐపీ లాంజ్‌లో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే పర్యాటక

 

ఆతిథ్యం కల్పించాల్సిన అవసరాలను తెలియచెబుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలకు విమాన ఆపరేషన్స్‌ జరుగుతున్న విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి కొద్ది కాలంలో తూర్పు, దక్షిణ ఆసియా దేశాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత సింగపూర్‌, అరబ్‌ ఎమిరేట్స్‌కు విమానాలు తిరగటానికి మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే సింగపూర్‌, చైనా, జపాన్‌ దేశాల నుంచి ఎక్కువుగా వస్తున్నారు. ఆఫ్రికా ఖండ దేశాల నుంచి ఎక్కువుగా విజయవాడలో చదువుకునేందుకు విద్యార్థులు ఎక్కువుగా వస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో, విమానాశ్రయ అధికారులు పర్యాటకంగా కూడా ముందుకు వెళ్ళాలన్న ప్రణాళికలతో ఉన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వినూత్న ఆలోచనలతో విజయవాడ ఎయిర్‌పోర్టును పర్యాటక ఐకానిక్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. విమానాశ్రయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఎయిర్‌పోర్టు అధికారులు దీనికి సంబంధించి పర్యాటక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం కూడా ఉంది.

Link to comment
Share on other sites

విమానాశ్రయానికీ దీపావళి
21-10-2017 03:39:31
 
636441539721497487.jpg
అంతర్జాతీయ స్థాయిని అందుకున్న తర్వాత తొలిసారి వచ్చిన దీపావళికి విజయవాడ విమానాశ్రయం విద్యుత్‌ కాంతులతో కొత్త అందాలు అద్దుకుంది. నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ లాంజ్‌లో ఫ్లోరల్‌ డెకరేషన్‌ చేసి.. ప్రవేశ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. - ఆంధ్రజ్యోతి, విజయవాడ
Link to comment
Share on other sites

  • 4 weeks later...
‘ఇమ్మిగ్రేషన్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌?!
18-11-2017 01:18:38
 
విజయవాడ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఎయిర్‌పోర్టులో అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. మరికొద్ది రోజుల్లో ఈ సేవలు అందించటానికి వీలుగా నోటిఫికేషన్‌ వెలువరించటానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. చెన్నై నుంచి ఎయిర్‌పోర్టు అథారిటీ జనరల్‌ మేనేజర్‌, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ రమణకుమార్‌, డీసీపీ గజరావు భూపాల్‌ ఈ బృందంలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు.
 
ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్స్‌, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన తమ కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. అదనపు పనులకు సంబంధించి చిన్నపాటి సూచనలు చేసింది. ఆ తర్వాత వీరు డీజీపీ సాంబశివరావుతో భేటీ అయ్యారు. ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్‌ స్టాఫ్‌ కావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు.
Link to comment
Share on other sites


విజయవాడ-సింగపూర్‌ మధ్య విమానాలు
వారంలో 3 రోజులు నడపాలని నిర్ణయం
ఈనాడు అమరావతి: విజయవాడ, సింగపూర్‌ మధ్య నేరుగా వారంలో కనీసం మూడు రోజులు విమానాలు నడపనున్నారు. సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్దేశించిన సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నట్టయితే, ఆ మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నందున కొన్ని సంస్థలు ముందుకు రావడం లేదు. వాటి అంచనా తప్పని, ఒకసారి విమాన సర్వీసు మొదలైతే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు సమాచారం.

Link to comment
Share on other sites

ఊపందుకున్న ‘అంతర్జాతీయ సర్వీసుల’ ప్రక్రియ
ఇమ్మిగ్రేషన్‌, ఎన్‌ఐసీ డైరెక్టర్ల బృందం సందర్శన
గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్ల పరిశీలన
ఈనాడు, అమరావతి: గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అవసరమైన చర్యలు ఊపందుకున్నాయి. ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ హోరా సింగ్‌, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) టెక్నికల్‌ డైరెక్టర్‌ మాదవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు దిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం చేరుకున్నారు. ఇటీవల విమానాశ్రయంలో అభివృద్ధి చేసిన పాత టెర్మినల్‌ భవనం, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయం ఏర్పాటుకు వీలుగా సిద్ధమైన సౌకర్యాలను వారు పరిశీలించారు. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లూ ఇక్కడ ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీజీపీ నండూరి సాంబశివరావును కలిశారు. తమకు ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు 55 మంది అవసరమని కోరగా ఆయన దానికి సానుకూలంగా స్పందించారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతంసవాంగ్‌ను కూడా కలిశారు. కస్టమ్స్‌ సేవలు అందించేందుకు ఇప్పటికే అనుమతి లభించింది.  ఈ బృందం దిల్లీకి చేరుకుని నివేదిక ఇచ్చిన అనంతరం ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రారంభమవుతాయి. తద్వారా అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అనుమతులూ లభించినట్లవుతుంది. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చి నాలుగైదు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఆ ఊసే లేదని ‘ఈనాడు’లో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీనిపై స్పందించి ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను త్వరితంగా పూర్తి చేయాలని హోంశాఖ సెక్రటరీ రాజీవ్‌కు ఆదేశించగా ఆయన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Link to comment
Share on other sites

గన్నవరం టు సింగపూర్‌!
18-11-2017 01:21:09

    త్వరలో ఛార్టర్డ్‌ విమానాలు
    తొట్టతొలి సర్వీసు నడిపేందుకు సీఎం చంద్రబాబు సంసిద్ధత

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి త్వరలోనే తొట్టతొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మధ్య శుక్రవారం జరిగిన చర్చల్లో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది! అయితే ఇవి రెగ్యులర్‌ సర్వీసులు కాదు.. ఛార్టర్డ్‌ విమాన సర్వీసులు! అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వం, అక్కడి పలు సంస్థలు చురుకైన పాత్ర పోషిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుని సింగపూర్‌ నుంచి విజయవాడకు ఇంటర్నేషనల్‌ ఫ్లైట్లను ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా కోరుతోంది. ఈ విషయమై ఆ దేశానికి చెందిన కొన్ని ప్రముఖ విమానయాన సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపింది. ఇదే అంశం శుక్రవారం నాటి భేటీలో మరోసారి ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.
 
వారానికి కనీసం 2, 3 సర్వీసులనైనా విజయవాడ- సింగపూర్‌ల మధ్య నడిచేలా చూడాలని చంద్రబాబు కోరగా, రెగ్యులర్‌ ఫ్లైట్లకు సరిపడా ప్రయాణికులు ఉండరేమోనన్న ఉద్దేశ్యంతో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సుముఖత వ్యక్తం చేయడం లేదని సింగపూర్‌ ప్రతినిధులు చెప్పారని తెలిసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అతి త్వరలోనే విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవ్వాలన్న పట్టుదలతో ఉన్న సీఎం, ప్రత్యామ్నాయ మార్గాలేమిటని ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వమే ఛార్టర్డ్‌ విమానాలను నడపాలని సింగపూర్‌ ప్రతినిధులు బదులిచ్చారని సమాచారం.
 
ఒక్కొక్క సర్వీసు నడిపేందుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చవుతుందని చెప్పిన వారు, ఒకవేళ ప్రయాణికులు తగినంతమంది ఉంటే ఆ మొత్తం ప్రభుత్వానికి తిరిగి వస్తుందని, లేకుంటే ఆ లోటును భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొన్నాళ్లపాటు కొనసాగిస్తే చెన్నై లేదా హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌ చేరుకుంటున్న ప్రయాణికులు క్రమంగా గన్నవరంలో విమానాలు ఎక్కడానికి అలవాటు పడతారని తెలిపారు.

Link to comment
Share on other sites

విజయవాడ ‘ఇమ్మిగ్రేషన్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌..!
18-11-2017 07:09:30
విజయవాడ: విజయవాడ ఎయిర్‌పోర్టులో అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. మరికొద్ది రోజుల్లో ఈ సేవలు అందించటానికి వీలుగా నోటిఫికేషన్‌ వెలువరించటానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది.
 
చెన్నై నుంచి ఎయిర్‌పోర్టు అథారిటీ జనరల్‌ మేనేజర్‌, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ రమణకుమార్‌, డీసీపీ గజరావు భూపాల్‌ ఈ బృందంలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్స్‌, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన తమ కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.
 
అదనపు పనులకు సంబంధించి చిన్నపాటి సూచనలు చేసింది. ఆ తర్వాత వీరు డీజీపీ సాంబశివరావుతో భేటీ అయ్యారు. ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్‌ స్టాఫ్‌ కావాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు. అనంతరం ఇమ్మిగ్రేషన్‌ బృందంతో ఎయిర్‌పోర్టు అధికారులు నగరంలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. అన్నీ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి నివేదిక పంపిస్తామని, ఆ తర్వాత నోటిఫికేషన్‌ వెలువరిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

విజయవాడ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ ఏర్పాట్లు!
ఈనాడు, దిల్లీ : విజయవాడ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిసింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి కేంద్రహోంశాఖ కార్యదర్శి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో విజయవాడ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ కేంద్రం ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ యాత్రికులు హైదరాబాద్‌ నుంచి వెళ్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ ఉత్తర్వులు వచ్చిన తర్వాత విజయవాడ నుంచే హజ్‌ యాత్రకు బయలుదేరే అవకాశం కలుగుతుంది.

Link to comment
Share on other sites

 ఎట్టకేలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు, ఇమ్మిగ్రేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌...

    Super User    
    23 November 2017 
    Hits: 61 

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కావటానికి, అవసరమైన ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది... అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. మరో రెండు రోజుల్లో ఈ సేవలు అందించటానికి వీలుగా కేంద్రం నోటిఫికేషన్‌ వెలువరించటానికి రంగం సిద్ధమైంది...

gannavaram 23112017 2

పోయిన వారం, ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. చెన్నై నుంచి ఎయిర్‌పోర్టు అథారిటీ జనరల్‌ మేనేజర్‌, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ రమణకుమార్‌, డీసీపీ గజరావు భూపాల్‌ ఈ బృందంలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్స్‌, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.

gannavaram 23112017 3

ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్‌ స్టాఫ్‌ కావాలని, ఈ బృందం డీజీపీ సాంబశివరావుని కోరింది.. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు... ఈ నేపధ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి కేంద్రహోంశాఖ కార్యదర్శి, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో విజయవాడ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ కేంద్రం ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

ఆక్యుపెన్సీలో ఆకాశమంత!
29-11-2017 01:37:03
 
636475162240896187.jpg
  • 95 శాతానికి ఏపీ విమాన సామర్థ్యం
  • అమరావతి నుంచి అన్ని నగరాలకు విమానాల పెంపునకు కేంద్రానికి వినతి
  • విశాఖలో 746కోట్లతో ‘లులూ’మాల్‌
  • మౌలికరంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి నడుస్తున్న విమానాల ఆక్యుపెన్సీ 90-95శాతం ఉందని, అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులను పెంచాలని కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల చివరినాటికి కొవ్వూరుతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లోని 20పట్టణాలకు పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ను అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారమిక్కడ మౌలిక రంగాలు, విద్యుత్‌, పోర్టులు, విమానాశ్రయాలు తదితర రంగాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోనే నౌకల రవాణా విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని సీఎం అన్నారు.
 
 
ఈ త్రైమాసికంలో నౌకల రవాణా విషయంలో 9.7శాతం వృద్ధి సాధించామని తెలిపారు. గంగవరం పోర్టు నౌకా రవాణా వృద్ధి రేటు 46శాతం, కాకినాడ యాంకర్‌పోర్టు 19.3శాతంగా ఉన్నాయన్నారు. భావనపాడు, మచిలీపట్నం నౌకాశ్రయాలు భూసమీకరణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏపీజెన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అనంతపురం జిల్లాలోని అలా్ట్ర మెగా సోలార్‌ విద్యుత్‌ పార్కుతో 750మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందన్నారు. కడపలోని 400మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ 2018మార్చినాటికి ప్రారంభమవుతుందన్నారు. చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే 12ప్లాంట్‌ల కోసం భూ కేటాయింపు జరిగిందని, పనులు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఎయిర్‌ కనెక్టివిటీని పెంచాలని కేంద్రంతో మాట్లాడాలని నిర్ణయించారు. ఓర్వకల్లు, దగదర్తి, భోగాపురం విమానాశ్రయాల పనులను సమీక్షించారు.
 
 
కాకినాడ నుంచి విశాఖపట్నంకు వేసే మొదటి దశ గ్యాస్‌ పైప్‌లైన్‌ 13ప్యాకేజీలకు టెండర్ల దశ నడుస్తోందని, డిసెంబరు నాటికి ఇది పూర్తవుతుందన్నారు. 2018డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. సముద్రంలో 100మీటర్ల వరకే మన జాలర్లు మత్స్యసంపదను పడుతున్నారని, అంతకంటే కింద రూ.వెయ్యికోట్ల విలువైన 1,16,320మెట్రిక్‌ టన్నుల మత్స్య సంపద ఉందన్నారు. డీప్‌ సీ వెస్సెల్స్‌ ద్వారా ఈ సంపదను పట్టుకునేందుకు పీపీపీ పద్ధతిలో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
 
సముద్రతీరంలో విలువైన జిర్కాన్‌, కియనైట్‌, రుటైల్‌, ఇల్మనైట్‌ లాంటి ఖనిజాలు ఉన్నాయని, వీటిని తీస్తే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. వాటర్‌ టూరిజం, షిప్‌ బిల్డిండ్‌, రీసైక్లింగ్‌ వంటి వాటిని కూడా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు విశాఖలో లులూ గ్రూప్‌ అంతర్జాతీయ షాపింగ్‌మాల్‌ను నిర్మించనుందని.. తక్షణ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎనర్జీ యూనివర్సిటీని తాత్కాలికంగా జేఎన్‌టీయూ అనంతపురంలోను, లాజిస్టిక్స్‌ యూనివర్సిటీని ఐడియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాకినాడలోను ఏర్పాటుచేయనున్నారు.
Link to comment
Share on other sites

On 10/16/2017 at 4:21 AM, Vulavacharu said:
On 10/15/2017 at 2:17 PM, sonykongara said:

vulavacharu bro, land isthara a side

Chaala kastam. Metro kosam Nidamanuru lo emi jarigindo choosamuga.

road ki land acquisition leda flyover edi takuva avuthundo adi chestharu anta brother

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...