Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

ఢిల్లీ: విభజన చట్టంలోని మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అలాగే జాతీయ ఉక్కు విధానం -2017కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Link to comment
Share on other sites

ల్యాండ్‌ ఆఫ్ విక్టరీ అంటూ విజయవాడపై మోదీ ట్వీట్
 
636294411318808485.jpg
న్యూఢిల్లీ: ల్యాండ్ ఆఫ్ విక్టరీ అంటూ విజయవాడపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాల క్లబ్‌లో చేరిందన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరించే అవకాశం అందరికీ కల్పించనుందని చెప్పారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్రం తీర్చిదిద్దనుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.
Link to comment
Share on other sites

gannavaram-airport-03052017.jpg
share.png

విభజన చట్టంలోని మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు విజయవాడ ఎయిర్ పోర్ట్ కు తప్పకుండా అంతర్జాతీయ హోదా వస్తుందని గతంలో పలుమారు పేర్కొన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇక్కడి ఎయిర్ పోర్ట్ కు ప్రాధాన్యం ఇస్తుండడంతో కేబినెట్ లో సానుకూల నిర్ణయం వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోని విమానాశ్రయమే అంతర్జాతీయ స్థాయి కలిగి ఉండేది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. విభజన తర్వాత నవ్యాంధ్రలో ఈ స్థాయి ఎయిర్ పోర్ట్ లేదు.

 

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా విస్తరిస్తోంది. రన్వే, మౌలిక సదుపాయాలు, టెర్మినల్ బిల్లింగ్ సాంకేతిక పరిజ్ఞానం, పార్కింగ్ బే, ఇలా అన్నింట్లోనూ విజయవాడ ఎయిర్ పోర్ట్ రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలోని ఏ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్ట్ సాధించని వృద్ధిని విజయవాడ ఎయిర్ పోర్ట్ మూడేళ్లుగా సాధిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిలియన్ ప్రయాణికుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్లో ఎయిర్పోరుకు అంతర్జాతీయ హోదా కల్పించటం సంతోషించాల్సిన విషయం.

Link to comment
Share on other sites

విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా

కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు అద్భుత అవకాశాలు తెస్తుందని మోదీ ఆకాంక్ష

నాలుగు నెలల్లో అంతర్జాతీయ సేవలు ప్రారంభం

రూ.560 కోట్లతో కొత్త టెర్మినల్‌ నిర్మాణానికి చర్యలు

గంటకు 1200 మంది ప్రయాణికులు రాకపోకలు!

3ap-main8a.jpg

ఈనాడు, దిల్లీ, అమరావతి: విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాజధాని అమరావతికి మరింత విమాన అనుసంధానం ఏర్పడనుంది. ప్రపంచదేశాల నుంచి నేరుగా రాకపోకలు సాగించడానికి వీలుకలుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడంవల్ల పోటీ పెరిగి తక్కువ ధరకే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకం వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ ప్రయాణికులు, కార్గో ట్రాఫిక్‌ పెరగడం ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థికాభివృద్ధికి బాటలు పరుస్తుందని కేంద్రం పేర్కొంది.

విజయాల నేల: ప్రధాని

విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్‌ద్వారా స్పందించారు. ఇకమీదట విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ దేశాల ప్రజలకు ఆహ్వానం పలకడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను తరచిచూసే భాగ్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ‘‘విజయవాడ అంటే విజయాల నేల. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇప్పుడు దేశ అంతర్జాతీయ విమానాశ్రయాల క్లబ్‌లో చేరింది’’ అని మోదీ పేర్కొన్నారు.

వెంకయ్యనాయుడు హర్షం

విజయవాడకు అంతర్జాతీయ విమానాశ్రయహోదా కల్పనపట్ల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తంచేశారు. దీనివల్ల రాజధాని ప్రాంతానికి ప్రపంచ నలుమూలల నుంచి అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే కొత్త టెర్మినల్‌ ప్రారంభించారని, రన్‌వేను 2,386 మీటర్ల నుంచి 3,360 మీటర్లకు పెంచుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే తిరుపతిని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు.

మరో నాలుగు నెలల సమయం

విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు మొదలు పెట్టడానికి నాలుగు నెలల సమయం పడుతుందని సమాచారం. కేబినెట్‌ ఆమోదం తర్వాత దీనిపై పౌరవిమానయానశాఖ అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. తొలుత హబ్‌ అండ్‌ స్పోక్‌ విమానాలు ప్రారంభమవుతాయి. అంటే విజయవాడలో కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసుకుని, ముంబయి, దిల్లీలాంటి విమానాశ్రయాలనుంచి విదేశీ కనెక్టింగ్‌ విమానాల ద్వారా వెళ్లడానికి వీలవుతుంది. మళ్లీ అక్కడ తనిఖీలు లేకుండా, లోపల నుంచే వెళ్లిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ విమానాల కూడలిగా ఉన్న దుబాయ్‌కి విజయవాడ నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్లు పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపారు.

* మూడేళ్లలో విజయవాడ విమానాశ్రయం నుంచి ట్రాఫిక్‌ రద్దీ సగటున 47% పెరిగింది. గత ఏడాది 6 లక్షలమంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 2014-15లో 2,31,931 మందిఉన్న ప్రయాణికుల సంఖ్య 2015-16లో 3,98,643కి, 2016-17లో 6,22,354కి పెరిగింది.

* ప్రస్తుతం 13వేల చదరపు మీటర్లు ఉన్న దేశీయ టెర్మినల్‌లో గంటకు గరిష్ఠంగా 500 మంది ప్రయాణికులకు సేవలు అందించడానికి వీలుంది. పాత దేశీయ టెర్మినల్‌ను అంతర్జాతీయ విమానసర్వీసులకు అనుగుణంగా తీర్చిదిద్దుతారు. ఇందుకు రెండు, మూడునెలల సమయం పడుతుంది. 3,200 చదరపు మీటర్ల పరిధిలో ఉండే ఈ టెర్మినల్‌ నుంచి పీక్‌అవర్‌లో 300 మంది ప్రయాణికుల రాకపోకలు సాగించవచ్చు.

* ఇప్పటికే ఇన్‌స్ట్రుమెంటల్‌ ల్యాండింగ్‌ సిస్టం ఏర్పాటుచేసి అమల్లోకి తీసుకొచ్చారు.

* ఏ-320 టైప్‌ విమానాల రాకపోకలకు తగ్గట్లు రూ.18 కోట్లతో యాప్రాన్‌ విస్తరణ పూర్తిచేశారు.రూ.162 కోట్లతో తాత్కాలిక దేశీయ విమాన టెర్మినల్‌ నిర్మించారు.

* బి-747-400, బి-777-300 ఈఆర్‌ టైప్‌ విమానరాకపోకలకు అనుగుణంగా రన్‌వేని 2,286 మీటర్లనుంచి 3,360 మీటర్లకు పొడిగించాల్సి ఉంది.

* రూ.99 కోట్ల వ్యయంతో లింక్‌ ట్యాక్సీ ట్రాక్‌తోకూడిన ఐసోలేషన్‌ బే నిర్మాణపనులను మొదలుపెట్టారు. 2018 నవంబర్‌ నాటికి ఈ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* విమానరాకపోకలకు అడ్డంకిగా ఉన్న హైటెన్షన్‌ విద్యుత్తు వైర్ల తొలగింపును ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం మొదలుపెట్టింది.

* గంటకు గరిష్ఠంగా 1200 మంది ప్రయాణికుల అవసరాలు (400 అంతర్జాతీయ, 800 దేశీయ) తీర్చే విధంగా 30,360 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.560 కోట్లతో కొత్త ప్యాసెంజర్‌ టెర్మినల్‌ నిర్మించనున్నారు.

ఇదీ నేపథ్యం

ప్రయాణికుల రద్దీ, అంతర్జాతీయ విమానసర్వీసులు నడపడానికి విమానయాన సర్వీసులు కనబరిచే ఆసక్తిని బట్టి దేశంలోని విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పిస్తుంటారు. అలాగే రాత్రిసమయాల్లో విమానరాకపోకలకు అనువైన గ్రౌండ్‌ లైటింగ్‌ సౌకర్యం, ఇన్‌స్ట్రుమెంట్‌ ల్యాండింగ్‌ వ్యవస్థ, తగినంత పొడవైన రన్‌వే ఉంటేనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదాకు పరిగణనలోకి తీసుకుంటారు. దీనికితోడు కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌, ఆరోగ్యసంబంధమైన సేవలు తప్పనిసరి. ఇందులో దాదాపు అన్ని లక్షణాలు విజయవాడ విమానాశ్రయానికి ఉన్నందునే ఇప్పుడు అంతర్జాతీయ హోదా కల్పించారు.

Link to comment
Share on other sites

విజయవాడ ఎయిర్‌పోర్టు కార్గో టెండర్‌ ఖరారు
 
636294857557867299.jpg
  • శ్రీప లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు దక్కిన కాంట్రాక్టు
  • మూడు సంవత్సరాల పాటు నిర్వహణ
  • కార్గో సేవలకు సంసిద్ధంగా టెర్మినల్‌ బిల్డింగ్‌
విజయవాడ: నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి మరి కొద్ది రోజల్లో కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. రెండు వందల చదరపు మీటర్ల విస్తీర ్ణంలో కార్గో టెర్మినల్‌ బిల్డింగ్‌ ఇప్పటికే సిద్ధమైంది. ఈ బిల్డింగ్‌ నుంచి కార్గో నిర్వహణ బాధ్యతలు చూడటానికి ప్రైవేటు సంస్థను నియమించుకోవాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడి అధికారులు కొద్ది రోజుల కిందట టెండర్లు పిలిచారు. టెండర్లలో శ్రీప లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏఏఐ అధికారులు ఎంపిక చేశారు. శ్రీప సంస్థ నెల రోజుల్లో కార్గో టెర్మినల్‌ బిల్డింగ్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించనుంది. కార్గో సేవలకు సంబంధించి ఇటు వినియోగదారులు, వ్యాపార వర్గాలు, అటు ఎయిర్‌లైన్స్‌ సంస్థల మధ్య వారధిలా కాంట్రాక్టు సంస్థ శ్రీప పనిచేస్తుంది. వ్యాపార వర్గాలు, కాంట్రాక్టు సంస్థ, విమానయాన సంస్థలు పరస్పరం సమన్వయంతో పనిచేస్తాయి. వ్యక్తిగత, వ్యాపార వర్గాలు సరుకు రవాణా చేయటానికి ముందుగా కాంట్రాక్టు సంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. విజయవాడ విమానాశ్రయానికి వచ్చే ప్రతి విమానానికి నిర్దిష్టమైన లగేజి పరిమితి ఉంటుంది. ఈ ప్రకారం తిరుగుతున్న విమానాలను బట్టి విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రస్తుతం ఎంత పరిమాణంలో కార్గో రవాణాకు అవకాశం ఉంటుందో కాంట్రాక్టు సంస్థ ముందుగా అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసిన తర్వాత ఆ పరిమాణం మేరకు కార్గో సేవలను అందిస్తుంది. వ్యాపార సంస్థల నుంచి వచ్చే ప్రతిపాదనలను బట్టి కార్గో బుకింగ్‌ జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా ఎవరైనా ఇక్కడికి వచ్చి బుకింగ్‌ చేసుకోవచ్చు.
 
ఫిడెక్స్‌ దృష్టి
ప్రస్తుతం ప్రయాణికులతో నడిచే విమానాల ద్వారానే కార్గో సేవలు నిర్వహించటం జరుగుతుంది. పెద్ద మొత్తంలో కార్గో సేవలు అందించాల్సి వస్తే ప్రత్యేక కార్గో విమానాల అవసరాన్ని పరిశీలిస్తారు. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రముఖ కార్గో ఎయిర్‌లైన్స్‌ సంస్థ ‘ఫెడెక్స్‌’ విజయవాడ విమానాశ్రయంపై దృష్టి సారించింది. విజయవాడకు అంతర్జాతీయ హోదా వస్తే ’ ఫెడెక్స్‌ ’ సం స్థ విదేశాలకు కార్గో విమానాలను తిప్పాలన్న ఆలోచన లో ఉంది. విజయవాడ నుంచే నేరుగా సరుకు రవాణా విదేశాలకు పెద్ద స్థాయిలో ఉండకపోయినా.. దేశీయంగా చూసుకుంటే డిమాండ్‌ ఉంటుంది. అంతర్జాతీయ డెస్టినేషన్‌ఎయిర్‌పోర్టులకు విజయవాడ అతి దగ్గరగా ఉంది. మలేషియా, సింగపూర్‌, హాంకాంగ్‌, ఆస్ర్టేలియా, అమెరికాలకు వెళ్లటానికి డెస్టినేషన్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు ఇక్కడి నుంచి తక్కువ దూరంలో చేరుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని విజయవాడపై ‘ఫెడెక్స్‌ ’ దృష్టి సారించింది.
 
రంగంలోకి ప్రముఖ సంస్థలు
వర్తక, వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న విజయవాడకు విదేశాల నుంచి, దేశీయంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల నుంచి కార్గో రవాణా జరుగుతుంది. విజయవాడకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీహెచ్‌ఎల్‌, బ్లూ డార్డ్‌, డీటీడీసీ వంటి సంస్థలు రంగంలోకి దిగాయి. ఇవన్నీ కార్గో సేవలను అందిస్తున్నాయి. దూర ప్రాంతాలకు రవాణా చేయాలంటే రైళ్లు, బస్సులపైనే ఆధారపడాల్సి వస్తోంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుస్తుండటంతో ఈ సంస్థలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ప్రముఖ ఆన్‌ లైన్‌ వ్యాపార దిగ్గజం ‘ఫ్లిఫ్‌కార్ట్‌ విజయవాడ నుంచి పెద్ద ఎత్తున సరుకు ఎగుమతి చే యటానికి వీలుగా గోడౌన్‌ పాయింట్‌ కావాలని ఎప్పటి నుంచో అడుగుతోంది.
Link to comment
Share on other sites

త్రి మిలియ‌న్ టార్గెట్
 
636295671736979705.jpg
అంతర్జాతీయ హోదా ఆనందం మరువక ముందే విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారులు మరో తీపి కబురు వినిపించారు. ఎయిర్‌పోర్టు మాస్టర్‌ ప్లాన్ లో భాగంగా రూ.516 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెర్మినల్‌ బిల్డింగ్‌కు సమీపంలో పార్కింగ్‌ బేలు, విమానాల దగ్గరకు నేరుగా చేరుకోవటానికి వీలుగా ఏ8రో బ్రిడ్జిలతో ప్ర తిపాదనలను రూపొందించి ఢిల్లీలోని ఏఏ ఐ ఉన్నతాధికారులకు పంపించారు.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో ఏఏఐ రూ.1000 కోట్లతో విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు కూడా నిధులు కేటాయిస్తామని ఏఏఐ పేర్కొంది. మాస్టర్‌ ప్లాన ప్రకారం రెండో దశలో ఇంటిరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం నూతన ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్దింగ్‌ అందుబాటులోకి వచ్చింది. పదేళ్ళ అవసరాలను ఇది తీర్చుతుందని ముందుగా ఏఏఐ అంచనా వేసింది. నూతన ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం పూర్తయ్యి అర్ధ సంవత్సరం కూడా కాకముందే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కూడా శ్రీకారం చుట్టడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం విషయంలో కూడా వేగవంతంగా చేపట్టమని ఒత్తిడి, మూడేళ్ళుగా సాధిస్తున్న వృద్ధిని ఏఏఐ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకోవటం, ఐటీతో పాటు అనేక పరిశ్రమల రాక, సచివాలయం, అసెంబ్లీ ఏర్పాటు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టడం వంటి చర్యలతో రానున్న అవసరాలకు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను కూడా చేపట్టాలని నిర్ణయించారు.
 
రెండేళ్లలోనే అవసరం ..
మూడేళ్లుగా విమానాశ్రయానికి వి మానాలు, ప్రయాణికుల రాకపోక లు గణనీయంగా పెరిగాయి. ప్రస్తు తం ఎయిర్‌పోర్టు నుంచి సగటున 23 సర్వీసులు నడుస్తున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరం లో 7.5 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈఆర్థిక సంవత్సరంలో మిలియన ప్ర యాణికులు రాకపోకలు సాగిస్తారని ఏఏఐ అంచనా వేస్తోంది. నూతన ఇంటీరియ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ 1.5 మిలియన ప్రయాణికుల సామర్ధ్యానికి అనుగుణంగా నిర్మించారు. ఈ సంఖ్య దాటినపుడు ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను ఏర్పాటు చేయాల ని అధికారులు భావించారు. ఈ లెక్కన చూ స్తే మరో రెండేళ్ళలోనే ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ఆవశ్యకత ఏర్పడుతోంది. ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను 3 మిలియన్ల ప్రయాణికుల సా మర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది.
Link to comment
Share on other sites

విదేశాలకు.. ఎగిరిపోవచ్చిక..!

మూడు నెలల్లో అంతర్జాతీయస్థాయి వసతులు

విశాఖ కంటే విజయవాడకే విదేశీ అవకాశమెక్కువ

నెల రోజుల్లో ప్రారంభంకానున్న కార్గో సేవలు

గన్నవరానికి అంతర్జాతీయహోదాతో అందరిలోనూ ఆనందం

ఈనాడు, అమరావతి

amr-gen5a.jpg

గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో ఓ కల నెరవేరింది. విశాఖ తరువాత హోదా వచ్చిన రెండో విమానాశ్రయం గన్నవరమే. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఏటా లక్షల మంది దేశ, విదేశాలకు వెళ్తుంటారు. వీరంతా హైదరాబాద్‌, చెన్నై, ముంబయి వంటి నగరాలకు వెళ్లి అక్కడి విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. కేవలం హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్తున్న వాళ్లలో 25శాతం ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే. ఇక విదేశాలకు నేరుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. పర్యటకంగా ఎంతో మేలు జరగబోతోంది.

ఏ స్థాయి ఇచ్చారనే దాన్నిబట్టి.. విమానాశ్రయానికి కస్టమ్స్‌ స్థాయి కల్పించారా లేక అంతర్జాతీయస్థాయి ఇచ్చారా అనే విషయాన్ని బట్టి సర్వీసులను తొలుత ప్రారంభిస్తారు. కస్టమ్స్‌ విమానాశ్రయ స్థాయి ఇస్తే సింగపూర్‌, మలేషియా వంటి ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం లేని ఆసియా దేశాలకు తొలుత సర్వీసులు నడుస్తాయి. అదే అంతర్జాతీయస్థాయి అయితే.. ప్రపంచంలోని ఏ దేశానికి అయినా సర్వీసులను వెంటనే నడపొచ్చు. ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మరికొంత సమయం అదనంగా పడుతుంది. అయితే.. కనీసం దుబాయి, సింగపూర్‌, మలేషియా నగరాలకు ఇక్కడి నుంచి వెంటనే సర్వీసులు నడపాల్సి ఉంది. అక్కడికి వెళ్లిపోతే.. ప్రపంచంలోని ఎక్కడికైనా తేలికగా వెళ్లిపోయేందుకు కనెక్టివిటీ ఉంటుంది. రాజధానికి వస్తున్న విదేశీ అతిథులు, ప్రముఖులు ఎవరైనా ఇప్పటివరకూ హైదరాబాద్‌లోనే దిగి తర్వాత ఇక్కడికి రోడ్డు మార్గంలో వస్తున్నారు. దీంతో ఆతిథ్య రంగం కూడా ఇక్కడ అవకాశం లేకుండా పోతోంది. ఉదయం వచ్చి.. సాయంత్రం మళ్లీ వాహనాల్లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి హోటళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ సర్వీసులు ఇక్కడి నుంచి ప్రారంభమైతే.. నేరుగా వారంతా విజయవాడలోనే దిగి ఇక్కడే ఉండొచ్చు.

కార్గో సేవలకు సన్నాహాలు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో కార్గో సేవలు అందిస్తున్న శ్రీప లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గన్నవరంలోనూ టెండర్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ప్రయాణికుల సర్వీసుల్లోనే సరకును సరఫరా చేయనున్నారు. శ్రీప సంస్థకు వచ్చే ఆదాయంలో 32శాతం విమానాశ్రయానికి చెల్లిస్తారు. కార్గోకు అవసరమైన భవన నిర్మాణాన్ని ఇప్పటికే విమానాశ్రయంలో చేపట్టారు. తొలుత ప్రయాణికుల విమానాల్లోనే కార్గో సేవలను అందించనున్నారు. విమానానికి కింది భాగంలో సామర్థ్యాన్ని బట్టి ఒక్కోదానిలో 300 కిలోల వరకూ సరకును తరలించేందుకు వీలుంటుంది. కార్గో బుకింగ్‌లు పెరిగిన తర్వాత అసరాన్ని బట్టి పూర్తిస్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ముగిసినందున మరో నెల రోజుల్లో అన్ని ఏర్పాట్లూ చేసుకుని కార్గో సేవలను అందించనున్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

ముందుగానే సిద్ధమై ఉన్నాం..

అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు వీలుగా ముందే సిద్ధమై ఉన్నాం. గత రెండేళ్లుగా విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తూ వస్తున్నాం. భవిష్యత్తులో వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకునే మేం అన్నిరకాలుగానూ సిద్ధమై ఉన్నాం. అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అవసరమైన మిగతా ఏర్పాట్లనూ మూడు నెలల్లోగా పూర్తిచేస్తాం. దీనికి అవసరమైన టెండర్లను సైతం ఆహ్వానించాం.

- జి.మధుసూదనరావు, గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్‌

విమానయాన సంస్థలను ఒప్పిస్తాం..

విమానయాన సంస్థలు ముందుకు రావాల్సి ఉంది. దీనికోసం మేం ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా దుబాయి, సింగపూర్‌, మలేషియాకు సర్వీసులను వెంటనే ఏర్పాటు చేసేలా విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతాం. ఇక్కడి నుంచి ఇతర నగరాలకు వెళ్లి విమానాలను ఎక్కేవారంతా ఇక గన్నవరం నుంచి రాకపోకలు సాగించనున్నారు. పర్యాటకంగానూ, వ్యాపార పరంగానూ ఇక విజయవాడకు అవకాశాలు పెరగనున్నాయి. అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌లు, సెమినార్లు ఇక్కడే జరుగుతాయి. ఉదయం అక్కడి నుంచి వచ్చి మళ్లీ సాయంత్రం వెళ్లిపోయే అవకాశం ఏర్పడుతుంది.

- ముత్తవరపు మురళీకృష్ణ, ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు

అలనాడు అలా...!

గన్నవరం విమానాశ్రయాన్ని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక విమానాల కోసం ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో దీనిని పౌరసేవల కోసం మార్చారు. 2003లో తొలిసారి విజయవాడ, హైదరాబాద్‌ మధ్య ఒక్క సర్వీసును నిత్యం ఇక్కడి నుంచి ప్రారంభించారు. తరువాత 2011 వరకు కేవలం నాలుగు సర్వీసులు మాత్రమే రాకపోకలు సాగిస్తుండేవి. అమరావతి రాజధానిగా మారిన తర్వాత పరిస్థితిలో ఒక్కసారిగా మార్పొచ్చింది. 2015లో విమానాశ్రయంలో పాత రేకుల షెడ్లతో కూడిన టెర్మినల్‌ భవనం ఉండేది. నిత్యం 11 సర్వీసుల వరకు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం ఐదారు వందల మంది వచ్చి, వెళ్లే వాళ్లుండేవారు. విమానాశ్రయాన్ని సందర్శించిన మంత్రి అశోక్‌గజపతిరాజు ఇది బస్టాండ్‌ కంటే అధ్వానంగా ఉందని, త్వరితగతిన అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

రెండేళ్లలోనే అధునాతన రూపు..

పాత టెర్మినల్‌భవనాన్ని రూ.2 కోట్ల నిధులతో రెండు నెలల్లో ఆధునికీకరించారు. దీంతో విమానాశ్రయానికి ఓ రూపు వచ్చింది. తర్వాత.. రూ.160 కోట్ల నిధులను విమానయానశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరిలో నూతన టెర్మినల్‌ ప్రారంభమైంది. ఏటా 15లక్షల మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా నూతన టెర్మినల్‌లో వసతులున్నాయి. 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా రూ.వెయ్యి కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి చేపడుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయం 537 ఎకరాల్లో ఉండగా.. మరో 700 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇచ్చింది. ప్రస్తుతం దిల్లీ, బెంగళూరు, వారణాశి, చెన్నై, హైదరాబాద్‌, తిరుపతి, విశాఖలకు నిత్యం 32 సర్వీసులు నడుస్తుండగా.. ఏటా 6.50లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మే నెల నుంచి ముంబయికి సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

భవితంతా బంగారమే

అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం పచ్చజెండా వూపినందున మరో నాలుగు నెలల్లో ఇక్కడి నుంచి విదేశాలకు విమానాలు ఎగరనున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్‌ను దేశీయ ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నూతన టెర్మినల్‌ భవనం నుంచి కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రస్తుతం పాత టెర్మినల్‌భవనం ఖాళీగా ఉంది. దీనిని అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాత్కాలికంగా ఆధునికీకరించనున్నారు. ఈ భవనం సైతం రెండేళ్ల కిందటే ఆధునికీకరించినది కావడంతో మరో రూ.2 కోట్లతో అంతర్జాతీయస్థాయి అవసరాలకు తగ్గట్టుగా మార్చనున్నారు. దీనికి అవసరమైన టెండర్లను సైతం ముందస్తుగా ఇప్పటికే ఆహ్వానించారు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ విభాగాల ఏర్పాటు, మూడంచెల తనిఖీ విధానం, పటిష్ఠ రక్షణ ఏర్పాట్లను పాత టెర్మినల్‌లో ఏర్పాటు చేయనున్నారు.

  •  
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...