Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

ala jaragali ante, hyderabad ki vunnanni connections/destinations Gannavaram nunchi kuda vundali kada. 25 lakhs kakapoyina kontha ayina shift avutaru.

masteru just middle east and east asia ki oka pedha airline service start cheyani reality ento thelusthadi

 

anni connections avasaram ledhu ani naa feeling .

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply

masteru just middle east and east asia ki oka pedha airline service start cheyani reality ento thelusthadi

 

anni connections avasaram ledhu ani naa feeling .

 

yeah true. Dubai/middle east, Singapore/Hong Kong ki "daily" flights vunte maximum shift avutaru.

Link to comment
Share on other sites

గన్నవరం విమానాశ్రయానికి మిలియన్ మార్చ్ మార్క్
 
636271485556312191.jpg
  • 2017-18 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులే లక్ష్యం
  • పెరగనున్న విమానయాన సర్వీసులు
  • తొలి అర్ధ సంవత్సరం నాటికి అందుబాటులోకి నూతన రన్ వే
  • కస్టమ్స్‌ హోదా వస్తే ఆసియా దేశాలకు విమానాలు
నూతన ఆర్థిక సంవత్సరం (2017 - 18) చివరి నాటికి మిలియన్ మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయడం లక్ష్యంగా విజయవాడ ఏఏఐ అధికారులు నిర్దేశించుకున్నారు. వచ్చే మార్చి మాసాంతానికి 10 లక్షల మంది ప్రయాణికులను అందిపుచ్చుకుని తిరుగులేని వృద్ధిని సాధించాలన్నది లక్ష్యంగా ఉంది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి ఈ ఏడాది గరిష్టంగా 32 విమానాలు నడవటం, 6.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) విజయవాడ ఉన్నతాధికారుల ఆలోచన అంతా ‘మిలియన మార్చ్‌’పైనే ఉంది. వాస్తవానికి ఈ ఏడాదే ఏడున్నర లక్షల మార్క్‌ను అందుకునే అవకాశా లు ఉన్నప్పటికీ అంతర్గత కారణాలతో స్పైస్‌జెట్‌ సంస్థ తమ విమానాలను కుదించా ల్సి రావటం, ఎయిర్‌ కోస్తా విమానాలను నడపకపోవటంతో టార్గెట్‌ను చే రుకోలేని పరిస్థితి నెలకొంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరంలో 32 విమాన సర్వీసులు తిరిగాయి. 2017-18లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అనేక నూతన విమానయాన సం స్థలు విజయవాడ ఎయిర్‌పోర్టు మీదుగా రాకపోకలు సాగించనున్నా యి. నూతన ఆర్థిక సంవత్సరంలోనే ముంబాయి, జైపూర్‌లకు విజయవాడ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. దేశంలో పేరెన్నిక గన్న ‘జూమ్‌ ఎయిర్‌లైన్స’ ఇక్కడి నుంచి వి మానాలు నడపటానికి ఇప్పటికే అన్ని అనుమతులు తీసుకుంది. మే నుంచి ఈ రెండు ప్రాంతాలకు ఈ సంస్థ విమానాలను ప్రారంభిస్తుంది.
 
ఈసారి హజ్‌ యాత్రకు ..
విజయవాడ నుంచి ఢిల్లీ, బెంగళూరు, చెన్నె, విశాఖపట్నం, వారణాసి ప్రాంతాలతో పాటు తిరుపతి, కడప వంటి రీజనల్‌ ప్రాంతాలకు కూడా విమానయాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈసారి ముస్లింలు హజ్‌ యాత్రకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచే వెళ్లేందుకు అవకాశం రానుంది. కస్టమ్స్‌ అధికారులు కూడా పరిశీలన చేయగా, ఇమ్మిగ్రేషన టీమ్‌ తో కూడా ఏఏఐ అధికారులు సమావేశమయ్యారు. ఆధునీకరించిన పాత టెర్మినల్‌ బిల్డింగ్‌ను దీనికి ఉపయోగించుకోవాలని కూడా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలలో సుమారు లక్షల్లో హజ్‌ యాత్రకు వెళతారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా మరికొన్ని నూతన సర్వీసులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇండిగో వంటి దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇప్పటికే విజయవాడపై ఆసక్తి చూపుతోంది. నూతన రన్‌వే అందుబాటులోకి వచ్చాక ఈ సంస్థ తన ఆపరేషన్స ప్రారంభించే అవకాశం ఉంది.కస్టమ్స్‌ హోదాపై ఆసక్తి విమానయాన శాఖ అధికారు లు కస్టమ్స్‌ హోదాపై కూడా ఆ సక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కస్టమ్స్‌ హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కస్టమ్స్‌ హోదా వస్తే.. దక్షిణ, తూర్పు ఆసి యా దేశాలకు ఇక్కడి నుంచే విమానాలు రాకపోకలు సాగించే అవకా శం ఉంది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స సంస్థ గతంలో విజయవాడకు విమానాన్ని నడిపే అంశాన్ని పరిశీలించింది. ఇక్క డి అధికారులు ఎయిర్‌పోర్టుకు సం బంధించి వివరాలను అందచేశారు. మలేషియా, సింగపూర్‌, హాంకాంగ్‌, గల్ఫ్‌దేశాలకు ఈ ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉండటం వల్ల ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నై ఎయిర్‌పోర్టులకు వెళ్ళి మళ్ళీ ఇదే గగనతలం మీదుగా వెళ్ళే అవకాశం తప్పుతుంది. నేరుగా విజయవాడ నుంచే అవకాశం ఉండటంతో ఇతర ఆసియా దేశాలు కూడా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే వాటిపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
Link to comment
Share on other sites

brother, none of eenadu links are working (they are not direct links).

 

brother. do as below to see the shared content.

 

first). go to epaper.eenadu.net and click AP edition. Second), come back here and click eenadu link.

Link to comment
Share on other sites

విజయవాడ ఎయిర్‌పోర్టు రన్ వే విస్తరణ పనులు
 
636277590346957793.jpg
  • ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టితో ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులు
  • ప్రస్తుతం 60వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఫిల్‌
  • 70 శాతం ల్యాండ్‌ లెవలింగ్‌ సర్వే పూర్తి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :
నవ్యాంధ్రప్రదేశ రాజధాని అమరావతికి అత్యంత తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.160కోట్ల వ్యయంతో రన్ వే విస్తరణను గడువులోగా పూర్తి చేసేలా ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. కాంట్రాక్టు సంస్థ పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ శీఘ్రగతిన పనులు చేస్తోంది. కాంట్రాక్టు సంస్థ ఫిబ్రవరి 19న పనులు ప్రారంభించింది. నవంబర్‌ 19, 2018 నాటికి విస్తరణ పనులను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం పనులు పదిశాతం పైగా పురోగతిలో ఉండటం విశేషం. విస్తరణకు సంబంధించి ఎర్త్‌ఫిల్లింగ్‌, సర్వే ఆఫ్‌ లెవలింగ్‌ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. విస్తరణకు కృష్ణాజిల్లా యంత్రాంగం అప్పగించిన 468 ఎకరాల భూముల్లో ప్రస్తుతం ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా మట్టిలైనింగ్‌కు ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి అవసరం కాగా జిల్లా యంత్రాంగం గొల్లనపల్లి సమీపంలోని బ్రహ్మయ్యలింగం చెరువు దగ్గర నుంచి మట్టి తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు అరవై వేల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టితోలకం జరిగింది. భూమి లెవలింగ్‌కు సంబంధించి సర్వే పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. పనులను వేగవంతంగా నిర్వహించటానికి వీలుగా కాంట్రాక్టు సంస్థ పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ కాంక్రీట్‌ మిక్సింగ్ యూనిట్‌ను కూడా సన్నద్ధం చేసుకుంటోంది. బుద్ధవరం సమీపంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చిప్స్‌ కోసం క్రషర్‌ను ఏర్పాటు చేశారు. మట్టిలెవలింగ్‌ పనులు పూర్తికాగానే హాట్‌మిక్స్‌ పనులు ఆతర్వాత వెట్‌మిక్స్‌ పనులు చేపట్టాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన రెడీ మిక్స్‌ ప్లాంట్‌ను కూడా సన్నద్ధం చేసే పని ప్రారంభించారు.
 
11,023 అడుగులకు చేరనున్న రన్‌వే
విజయవాడ ఎయిర్‌పోర్టు రనవే ఇప్పటికి రెండు దఫాలుగా విస్తరించారు. మూడవసారి గరిష్ట స్థాయిలో విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 7,500 అడుగుల మేర రన్‌వే ఉంది. తాజాగా 3523 అడుగుల మేర విస్తరిస్తున్నారు. మొత్తంగా 11,023 అడుగుల మేర రన్‌వేను విస్తరిస్తున్నారు. ప్రస్తుతం రన్‌వే విస్తరణకు సంబంధించి చూస్తే రాష్ట్రంలోని విశాఖ, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‌పోర్టుల కంటే కూడా అతిపెద్ద రన్‌వే ఉన్న ఎయిర్‌పోర్టుగా విజయవాడ ఎయిర్‌పోర్టు నిలవబోతుంది.
 
ప్రత్యామ్నాయ సేవల కోసం కలెక్టర్‌కు లేఖ
రన్‌వే విస్తరణ పనుల నేపథ్యంలో, పురోగతికి రెండు సమస్యలు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. బుద్ధవరం గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుతో పాటు, పొలాల నుంచి వెళుతున్న ఎల్‌టీ విద్యుత్ లైన్లు ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిని తక్షణం మరోచోటకు బదలాయించాల్సి ఉంది. బుద్ధవరం గ్రామానికి యుద్ధప్రాతిపదికన ప్రస్తుతం పొడిగింపు రన్‌వే చివరి నుంచి రోడ్డు మార్గాన్ని కల్పించాల్సి ఉంటుంది. ఎల్‌టీ విద్యుత లైన్లను కూడా అదేవిధంగా నూతన రోడ్డు మార్గం వెంబడిగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ తక్షణం ప్రత్యామ్నాయాలు కల్పించాల్సిందిగా విమానాశ్రయ అధికారులు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయటం జరిగింది. రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్‌అండ్‌బీ రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా విమానాశ్రయ అధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

nenu vinnadi enti ante AP commerce and lorry association vaallu addam padutunnaru ani...not sure how true it is....paiki oka laaga lona oka laaga vuntunnaru anta...

vetillo nijam entho abaddam entho evadiki telvadu. nijam anukunna don't think they have the strength to stop. but as usual permissions ravatani ki it takes its own time

Link to comment
Share on other sites

 

గన్నవరం విమానాశ్రయంలో దుర్గగడి రాజగోపుర నమూనా...!

 

Super User

 

 

14 April 2017

 

Hits: 593

 

 

gannavaram-airport-14042017.jpg

share.png

గన్నవరం విమానశ్రయంలో త్వరలో దుర్గగుడి నమూనా రాజగోపురాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దుర్గగుడి రాజగోపురం నమూనా మోడల్ తయారు చేసి సియం దృష్టికి తీసుకువెళ్లి అనుమతులిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

దుర్గగుడి ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఇప్పటికే ఒక నమూనా తయారు చేసినట్లు తెలిసింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దుర్గగుడి బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేందుకు ఎయిర్ పోర్ట్ లో అమ్మవారి రాజగోపుర నమూనను ఏర్పాటు చేయనున్నారు.

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
Guest Urban Legend

Union Cabinet likely to take up proposal to grant international status to #VijaywadaAirport at a meeting tomorrow

Link to comment
Share on other sites

విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా!!

నేడు పరిశీలించనున్న కేంద్ర కేబినెట్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ బుధవారం పరిశీలించే అవకాశం ఉంది. బుధవారం నాడిక్కడ కేంద్రకేబినెట్‌ సమావేశమౌతోంది. విభజన అనంతరం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణా రాష్ట్రపరిధిలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే విజయవాడకు అంతర్జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన తలెత్తింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లోని ప్రస్తుత విమానాశ్రయాలను విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం(2014) చెబుతున్న విషయం గమనార్హం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...