Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply
వేగంగా స్పందిస్తే భవిత బంగారం
 
636202375604297114.jpg
  • అంతర్జాతీయ స్థాయికి సమయమిదే..
  • రనవే పొడిగింపుతో సంబంధం లేదు
  • రన్‌వే విస్తరణతో పాటే ప్రక్రియ పూర్తి కావాలి
  • క్యాబినెట్‌లో ప్రతిపాదించి కేంద్రానికి పంపాలి
  • వరల్డ్‌ డెస్టినేషన్ ఎయిర్‌పోర్ట్స్‌కు ఇక్కడి నుంచే దగ్గర
 
రాజధాని అమరావతికి తలమానికంగా మారిన విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించడానికి అడుగులు పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎయిర్‌పోర్టు భవిష్యత్తు బాగుండాలంటే తక్షణం అంతర్జాతీయ స్థాయి హోదా రావాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితులలో అంతర్జాతీయ హోదాకు ఏ మాత్రం ప్రతిబంధకం అయినా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కార్యరంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో హోదాకు సంబంధించిన ప్రతిపాదనను ప్రవేశపెట్టి ఆమోదించిన తీర్మానాన్ని వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే అంతర్జాతీయ హోదాకు బీజం పడుతుంది. ఈ లోపు కస్టమ్స్‌ హోదా వచ్చినా విజయవాడ ఎయిర్‌పోర్టు దశ తిరుగుతుంది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్నాళ్ళ నుంచో కలలు కన్న నూతన టెర్మినల్‌ కల సాకామైంది. రనవే విస్తరణకు భూమి పూజ కూడా జరిగింది. ఇక మిగిలింది ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ హోదా దక్కించుకోవటం ఒక్కటే. విమానాశ్రయం అంతర్జాతీయ హోదా దక్కించుకోవటానికి ఇప్పుడున్న వనరుల కంటే అదనంగా కావాల్సినవి ఏమీ లేవు. ప్రజ ప్రతినిధులు క్యాబినెట్‌లో ప్రతిపాదనను ఆమోదించటమే మిగిలి ఉంది. విశాఖ ఎయిర్‌పోర్టులో మనకంటే తక్కువ నిడివి కలిగిన రనవే ఉంది. అయినప్పటికీ ఆసియా దేశాలకు విమానాలు నడుస్తున్నాయి. కస్టమ్స్‌ హోదా కూడా వచ్చేసింది. దీనిని బట్టి చూస్తే ఆసియా దేశాలకు నేరుగా విమానాలు నడవటానికి, కస్టమ్స్‌ హోదా ఇవ్వటానికి విజయవాడ విమానాశ్రయానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నది స్పష్టమవుతోంది. నూతన టెర్మినల్‌ మరికొద్ది రోజుల్లో వినియోగంలోకి కూడా రానుంది. 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్థ సంవత్సర ఫలితాలు చూస్తే.. రానున్న రోజుల్లో నూతన ఎయిర్‌పోర్టు కిక్కిరిసిన ప్రయాణికులతో కళకళలాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది ప్రతి ఒక్కరి మాట.
 
ప్రమాణాలు ఇలా ..
అంతర్జాతీయ స్థాయి హోదా రావాలంటే ఎక్కడైనా వృద్ధి రేటునే ప్రధానంగా గమనంలోకి తీసుకుంటారు. వృద్ధిరేటుకు సంబంధించి చూస్తే విజయవాడ ఎయిర్‌పోర్టు దేశంలోని మెట్రో నగరాల ఎయిర్‌పోర్టులను కూడా తలదన్నేస్తోంది. స్థానిక ఎయిర్‌పోర్టు నుంచి వి దేశాలకు ఎంత ఫ్లీట్‌ ఉం టుందన్నది రెండో అం శం. విజయవాడ నుంచి బయలుదేరే వారిలో సగ భాగం విదేశాలకు వెళుతున్నారన్నది ఏఏఐ, ప్రభుత్వ సర్వేలలో కూడా వెల్లడైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ (సివిల్‌ ఏవియేషన), ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కూడా విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రగతి చూసి అచ్చెరువొందుతున్నాయి. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధికి వందలాది కోట్ల రూపాయలను పెట్టుబడులు పెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదించి ప్రతిపాదన పంపితేనే.. కేంద్ర క్యాబినెట్‌లో చర్చకు వచ్చి అంతర్జాతీయ హోదాపై నిర్ణయం తీసుకుంటుంది.
 
రన్‌వేకు ఇబ్బంది లేదు
రన్‌వే విస్తరణ పూర్తి కాకపోయినా ప్రస్తుత రనవే ఆధారంగా కూడా అంతర్జాతీయ స్థాయి విమానాలు నడవటానికి అవకాశం ఉంటుంది. బోయింగ్‌ 707, ఎయిర్‌బస్‌ 380 వంటి భారీ విమానాలు తప్ప మిగిలిన స్థాయి అంతర్జాతీయ విమానాలన్నీ ల్యాండింగ్‌, టేకాఫ్‌ కావటానికి ఇబ్బంది లేదు. చాలా దేశాలకు సాధారణ ఫ్లైట్స్‌ అంతర్జాతీయ షెడ్యూల్స్‌గా నడుస్తున్నాయి. బోయింగ్‌ 707 విమానాలు పెద్దగా ఉంటాయి. ఇవి కూడా దిగేందుకు వీలుగా ప్రస్తుతం రనవేను అదనంగా విస్తరిస్తున్నారు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయి హోదా సాకారం కావాలంటే ఇప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైతే చాలా వేగంగా ఆచరణలో కూడా సాకారం అవుతుంది. ప్రస్తుతం 3600 మీటర్ల స్థాయిని అందిపుచ్చుకునేలా రనవేను విస్తరిస్తున్నారు. ఈ పనులు కొలిక్కి రావటానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఈ లోపే హోదా వస్తే రనవే పూర్తయిన తర్వాత బోయింగ్‌ 707 విమానాలు కూడా దిగటానికి ఆస్కారం ఉంటుంది. ఎయిర్‌బస్‌ 380 విమానాలు దిగాలంటే మాత్రం రనవేను 4400 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంటుంది.
 
చేంజ్‌ ఓవర్‌కు దగ్గర ..
ప్రపంచంలో వరల్డ్‌ డెస్టినేషన ఎయిర్‌పోర్ట్స్‌ ఉంటాయి. ఆయా ఎయిర్‌పోర్టుల నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు నిరంతరాయంగా విమానాల కనెక్టివిటీ ఉంటుంది. ఉదాహరణకు హాంకాంగ్‌, దుబాయ్‌, కౌలాలంపూర్‌లను చెప్పుకోవచ్చు. ఇక్కడి ఎయిర్‌పోర్టుల నుంచి అమెరికా, సిడ్నీ, ఇంగ్లాండ్‌ తదితర అన్ని దేశాలకూ, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు కూడా కనెక్టివిటీ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలంటే హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు వెళ్ళాల్సి వస్తోంది. దీనిని చేంజ్‌ ఓవర్‌ అంటారు. ఈ ఛేంజ్‌ ఓవర్‌ గణనీయంగా తగ్గటానికి విజయవాడ ఎయిర్‌పోర్టు కేంద్రంగా ఉంది. హాంకాంగ్‌, కౌలాలంపూర్‌, దుబాయ్‌ వెళ్ళటానికి అతి దగ్గర ఎయిర్‌పోర్టుగా విజయవాడ ఉంది. దీంతో విమాన ప్రయాణికులకు దూరాభారంతో పాటు వ్యయ ప్రయాసలు కూడా తగ్గుతాయి.
 
తాత్కాలికంగా పాత టెర్మినల్‌..
నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి వచ్చే నెలలో అడుగుపెడుతున్న తరుణంలో ఖాళీ అవుతున్న పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ విమానాల టెర్మినల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ టెర్మినల్‌ ఒక్కసారి 750 మంది విదేశీ ప్రయాణికులకు సరిపోతుంది. విశాలంగా ఉంటుంది కాబట్టి తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించుకోవచ్చు.
 
నైట్‌ ల్యాండింగ్‌ సౌకర్యం
విజయవాడ ఎయిర్‌పోర్టులో నైట్‌ ల్యాండింగ్‌ సదుపాయం ఉంది కాబట్టి రాత్రుళ్ళు కూడా విమానాలు ల్యాండ్‌ కావటానికి, టేకాఫ్‌ కావటానికి ఇబ్బంది లేదు. విదేశాలకు వెళ్ళే విమానాలు ఎక్కువగా రాత్రుళ్ళు బయలుదేరుతుంటాయి. రాత్రి 11 గంటల నుంచి ఆ తర్వాతే విదేశాలకు విమానాలు బయలు దేరుతుంటాయి. కాబట్టి సాధారణ ఫ్లైట్స్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Link to comment
Share on other sites

తాత్కాలికంగా పాత టెర్మినల్‌..

నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి వచ్చే నెలలో అడుగుపెడుతున్న తరుణంలో ఖాళీ అవుతున్న పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ విమానాల టెర్మినల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ టెర్మినల్‌ ఒక్కసారి 750 మంది విదేశీ ప్రయాణికులకు సరిపోతుంది. విశాలంగా ఉంటుంది కాబట్టి తాత్కాలిక అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించుకోవచ్చు. 

 

Patha terminal ni international flights ka :wall: Evadu saami eedu :ready2fight:

Link to comment
Share on other sites

sariga kanapatala bro, anduke malli post chesa

Good. Thanks brother. 

 

How did you do that? This is what i did.

1) downloaded the article in PDF format

2) converted to JPEG

3) uploaded to posimage.org

4) posted here like a pic using direct link from postimage.org.

 

I see the article clearly in PDF but became unreadable after conversion.

Link to comment
Share on other sites

Good. Thanks brother. 

 

How did you do that? This is what i did.

1) downloaded the article in PDF format

2) converted to JPEG

3) uploaded to posimage.org

4) posted here like a pic using direct link from postimage.org.

 

I see the article clearly in PDF but became unreadable after conversion.

 bro. JPEG format lone download chevacchuga,

Link to comment
Share on other sites

గన్నవరం నుంచి జైపూర్ కు కొత్త విమాన సర్వీస్ Super User 20 January 2017 Hits: 379  
 

gannavaram-jaipur-20012017.jpg

గన్నవరం విమానాశ్రయం సుంచి రాజస్తాన్ రాజధాని జైపూర్ కు మార్చి నుంచి విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. బెంగళూరు మీదుగా జైపూర్ కు రోజువారి విమాన సర్వీస్ సడిపేందుకు ఎయిర్ కోస్తా సంస్థ ముందుకొచ్చింది.

ఈ ఏడాది మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభంకాసున్న ఈ విమాన సర్వీసుకు సంబంధించిన ప్రయాణ షెడ్యూల్ ఎయిర్ కోస్టా విడుదల చేసింది. ఈ విమాన సర్వీసు ఉదయం 7 గంటలకు గస్నవరం నుంచి బయల్దేరి 8 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. ఆర్థ గంట విరామం తర్వాత అక్కడి నుండి బయల్దేరి 10.40కు జైపూర్ చేరుకుంటుంది.

 

తిరిగి సాయంత్రం 6.20కు జైపూర్ నుంచి బయల్దేరి రాత్రి 8.25కు బెంగళూరుకు, అక్కడి నుంచి 8.45కు బయల్దేరి రాత్రి 9.40కు గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుంటుంది.

దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు పొందిన ఎయిర్ కోస్టా మరిన్ని విమాన సర్వీసులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఎయిర్పోర్టులో నూతన టెర్మినల్ ప్రారంభంతో కొత్త విమాన సర్వీస్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

Link to comment
Share on other sites

మన రాజధాని ఎయిర్ పోర్టు ఎంత అందంగా ఉందో చూడండి

 

 

 

gannavaram-airport-video-20012017.jpg

అమరావతికి ఎయిర్ పోర్ట్ అంటే ఎలా ఉండాలి ? గన్నవరం ఎయిర్ పోర్ట్, ఆ రాజధాని ఠీవి చూపించే విధంగా సిద్ధం అయ్యింది.

అమరావతి సంస్కృతి ఉట్టి పడేలా, ఇంటీరియర్ రెడీ అయిపోతుంది. కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణ లోపలి ఇంటీరియర్ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. 18 చెక్‌ఇన్‌ కౌంటర్లు, బ్యాగేజీ కన్వేయర్‌ బెల్ట్‌లు, బ్యాగేజీ క్లైమ్‌ కరౌజల్స్‌, అధునాతన సీసీ కెమెరాలతో భద్రత, 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు పార్కింగ్‌ వంటివి, నూతన టెర్మినల్‌లో అందుబాటులోనికి రానున్నాయి.

ఈ వీడియో చూడండి, మన గన్నవరం ఎయిర్ పోర్టేనా అని మీరు ఆశ్చర్యపోతారు అంటే అతిశయోక్తి కాదు..

 

 

 
Link to comment
Share on other sites

విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి ముందడుగు
 
636211821708500007.jpg
  • భాగస్వామ్య సదస్సులో నేడు విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఎంవోయూ
  • ఏఏఐ రూ.785 కోట్ల పెట్టుబడులు! 
  • రూ.560 కోట్లతో టెర్మినల్‌ బిల్డింగ్‌ 
  • రూ.160 కోట్లతో రన్ వే విస్తరణ 
  • రూ.65 కోట్లతో టాక్సీవే, అప్రాన్ పనులు
దేశంలోనే అత్యుత్తమ వృద్ధిని సాధిస్తూ, నవ్యాంధ్రప్రదేశకు తలమానికంగా నిలిచిన విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి హోదాను అందుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రూ.785 కోట్ల మేర పెట్టుబడులకు ఏఏఐ ముందుకొచ్చింది. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సులో శనివారం ఏఏఐ, సీఆర్‌డీఏతో ఈ మేరకు ఎంఓయూ చేయబోతోంది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్థిపై దృష్టి నిలిపిన ఏఏఐ ఇప్పటికే దాదాపుగా రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టింది. విమానాశ్రయ విస్తరణ కోసం ఇటీవలే ప్రతిపాదిత (ఫేజ్‌ - 1) 700 ఎకరాలను ప్రభుత్వం నుంచి ఏఏఐ స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి హోదాకు అవసరమైన ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ దిశగా విమానాశ్రయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఏఏఐ సంసిద్ధమైంది. ఈ క్రమంలో పెట్టుబడుల సదస్సులో తాము ఏ ఏ అంశాలలో పెట్టుబడి చేయదలచుకున్నామో ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వటానికి సీఆర్‌ డీఏతో ఎంఓ యూ కుదుర్చుకోబోతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ ప్లానింగ్‌ బోర్డు సభ్యులు ఎస్‌కే బిస్వాల్‌తో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మదుసూధనరావు విశాఖ వెళ్లారు. శుక్రవారమే ఎంఓయూ చేసుకోవాల్సి ఉన్నా.. శనివారానికి వాయిదాపడింది. ఏఏఐ ఏపీడీ మధుసూదనరావు, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌లు ఎంఓయూపై సంతకాలు చేస్తారు.
 

అత్యాధునిక టెర్మినల్‌

విజయవాడ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్‌ / డొమెస్టిక్‌ ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ చేపట్టడానికి ఏఏఐ రూ.560 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. ఇప్పటికే రూ.150 కోట్ల వ్యయంతో నూతన ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కోసం ఏఏఐ పెట్టుబడులు పెట్టింది. ప్రారంభోత్సవ సభ సందర్భంగా విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చినపుడు పూర్తిగా సంతోషిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ క్రమంలో సివిల్‌ ఏవియేషన మరో అడుగు ముందుకు వేసి అంతర్జాతీయ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు చేపట్టడానికి కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆ దిశగా ఏఏఐ వెంటనే కదిలింది. ఇంటర్నేషనల్‌ కమ్‌ డొమిస్టిక్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ను ఏర్పాటు చేయటానికి నిధులు కేటాయించింది. ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ తిరగటానికి అనుమతి రావటమే ఇక మిగిలి ఉంది. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ చేపట్టడానికి సంబంధించిన మాస్టర్‌ ప్లానకు ఏఏఐ రూపకల్పన చేస్తుంది. దీనిని ఎక్కడ నిర్మించాలన్నది నిర్ణయించిన తర్వాత దీనికి తగిన డిజైన్సను రూపొందిస్తుంది. ఆ తర్వాత.. టెండర్లు పిలిచి పనులు అప్పగించనుంది.
రన్ వే విస్తరణ పనులు :

విమానాశ్రయ విస్తర ణకు సంబంధించి ఏఏఐ రూ. 160 కోట్లను రనవే విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టనుంది. రన్ వే విస్తరణ కోసం ఈ నెలలోనే ఏఏఐ భూమి పూజ పనులు చేపట్టింది. ముఖ్యమం త్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి టెండర్లను ఏఏఐ పిలిచింది ఈ టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. రనవే విస్తరణ కోసం ఏఏఐ రూ. 160 కోట్లను పెట్టుబడి పెట్టబోతోంది. టాక్సీవే, ఆఫ్రాన్ పనులు
విమానాశ్రయంలో టాక్సీవే, ఆఫ్రాన్ నిర్మాణ పనులు చేపడితే పరిపూర్ణత వస్తుందని ఏఏఐ భావిస్తోంది. అంతర్జాతీయ స్థాయి టెర్మినల్‌ బిల్డింగ్‌కు శ్రీకారం చుట్టే నేపథ్యంలో, ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టవలసి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టాక్సీవే, ఆఫ్రాన పనులు చేపట్టాలని ఏఏఐ నిర్ణయించింది. పార్కింగ్‌ స్టాండ్‌ వంటి పనులు కూడా ఇందులో అంతర్భాగంగా ఉంటాయి. వీటిన్నింటి కోసం ఏఏఐ రూ. 65 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది

Link to comment
Share on other sites

ఎయిర్‌పోర్టు అభివృద్ధికి వడివడిగా అడుగులు
 
636213638979213012.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో విజయవాడ ఎయిర్‌పోర్టుకు రూ.785 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ), రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది.
 
భారీగా పెట్టుబడులు
ఏఏఐ గత ఏడాదిన్నర కాలంలో రూ.400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. రూ.127 కోట్ల వ్యయంతో నూతన ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కే ఖర్చు చేసింది. ఇటీవలే దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఇంకా నూతన టెర్మినల్‌ బిల్దింగ్‌లోకి షిఫ్ట్‌ కాకుండానే.. రూ.560 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్‌/డొమిస్టిక్‌ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు గ్రీనసిగ్నల్‌ ఇస్తామని సంకేతాలు ఇచ్చింది. ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న సందర్భంలో విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ స్థాయి హోదా వస్తేనే పూర్తి సంతృప్తిగా ఫీలవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ విజయవాడ ఎయిర్‌పోర్టుపై ఏఏఐ, సివిల్‌ ఏవియేషనఅధికారులు దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి అనుగుణంగా ఏఏఐ చాలా వేగంగా అడుగులు వేసింది. అంతర్జాతీయ స్థాయి టెర్మినల్‌ బిల్డింగ్‌కు నిధులు కేటాయించింది. దీనిని డొమిస్టిక్‌ పర్పస్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆప్రానకు దగ్గరగా ఏరోబ్రిడ్జిలతో దీనిని ఏర్పాటు చేయటానికి రూ.560 కోట్లను కేటాయించింది. ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న 16 పార్కింగ్‌ బేలకు తోడుగా మరో 15 పార్కింగ్‌ బేలతో కూడిన ఆప్రాన్‌ను, టాక్సీ వే నిర్మించానికి కూడా రూ.65 కోట్లను కేటాయించింది. అంతర్జాతీయ స్థాయి విమానాలు దిగేందుకు వీలుగా రనవేను పొడిగించటానికి రూ.160 కోట్లను ఇప్పటికే కేటాయించింది.
 
కస్టమ్స్‌ హోదా సాధించాలి..
అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగించటానికి తగిన రనవే ఉన్నా.. విశాఖ దక్కించుకున్న కస్టమ్స్‌ హోదా కూడా విజయవాడ ఎయిర్‌పోర్టుకు లేకపోవటం ఆలోచించాల్సిన విషయం. కస్టమ్స్‌ హోదా వస్తే ఆసియా దేశాలకు ఇక్కడి నుంచి నేరుగా విమాన సర్వీసులు రాకపోకలు సాగించటానికి మార్గం సుగమం అవుతుంది. కస్టమ్స్‌ హోదా వస్తే సింగపూర్‌ ఎయిర్‌లైన్స నేరుగా విమాన సర్వీసు నడపటానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. కస్టమ్స్‌ సాధించటానికి విజయవాడ ఎయిర్‌పోర్టుకు అన్ని అర్హతలు ఉన్నాయి. విశాఖ కంటే పెద్ద రనవే ఉంది. రూ.165 కోట్ల వ్యయంతో ఇటీవలే ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అంతర్జాతీయ విమానాలు తిరిగేందుకు వీలుగా రూ.160 కోట్ల వ్యయంతో 3600 మీటర్ల వరకు రన్‌వేను విస్తరించటానికి భూమి పూజ కూడా జరిగింది. పనులు చేపడితే రనవే విస్తరణ ఏడాదిలోపే జరిగిపోతుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల ఎయిర్‌పోర్టులు సాధించలేని వృద్ధి (76 ు)ని విజయవాడ ఎయిర్‌పోర్టు సాధించింది. దీంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కూడా విజయవాడ ఎయిర్‌పోర్టుపై దృష్టి సారించింది.
 
ఒత్తిడంతా రాష్ట్ర ప్రభుత్వం పైనే..
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే.. ఏఏఐ పరంగా చేయాల్సిందంతా చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోదా తీసుకు వచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరగాల్సి ఉంది. ఏఏఐ తన బాధ్యత తాను పూర్తి చేయటం వల్ల.. ఒత్తిడంతా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా సాధించటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా శ్రీకారం చుట్టాల్సి ఉంది. రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించి ఎంత త్వరగా కేంద్రానికి పంపిస్తే అంత త్వరగా అంతర్జాతీయ స్థాయి సాధించుకోవచ్చు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖమంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధి విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు తక్షణం చేయాల్సిందల్లా.. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా కేబినెట్‌లో ఆమోదించటమే. ప్రభుత్వం కేబినెట్‌లో దీనికి సంబంధించి ప్రతిపాదనను ఆమోదించకపోవటంపై విమర్శలు కూడా వస్తున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధిని జీఎంఆర్‌ సంస్థ అడ్డుకుంటోందన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం జాప్యం చేస్తే అదే నిజమనుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అంతర్జాతీయస్థాయి విజయవాడకు వస్తే.. విదేశాలకు వెళ్ళేవారికి అతి దగ్గర ఎయిర్‌పోర్టుగా విజయవాడ ఉంటుంది. ప్రపంచ దేశాలకు విస్తృత విమానయాన అనుసంధానం ఉండే హాంకాంగ్‌, కౌలాలంపూర్‌, దుబాయ్‌ వంటి డెస్టినేషన ఎయిర్‌పోర్ట్స్‌కు అతి దగ్గరగా విజయవాడ ఎయిర్‌పోర్టు ఉంటుంది. అంతర్జాతీయ హోదా తీసుకు వచ్చే విషయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ కంటే ఇప్పుడు ప్రభుత్వంపైనే ఎక్కువుగా ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...