Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

ఒకప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్టు చూసినప్పుడు, రేకుల షెడ్డులో ఒక పల్లెటూరు బస్టాండు మాదిరిగా ఉండేది. వర్తక, వాణిజ్యానికి, సాంస్కృతికానికి, విద్య, వైద్యానికి రాజధానిగా ఉండే విజయవాడలో ఇలాంటి ఎయిర్‌పోర్టు ఉండటం ప్రజల అందరినీ బాధించేది. రాష్ట్ర విభజన జరగటం, అమరావతి రాజధాని అవ్వటంతో, గన్నవరం ఎయిర్‌పోర్టు దశ మారిపోయింది. ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్టు చూస్తుంటే, దేశంలో ఉన్న టాప్ ఎయిర్‌పోర్టు లకి ఏ మాత్రం తీసిపోని విధంగా తయారు అయ్యింది.


మీరు వింటుంది నిజమే...కలకాదు.. విజయవాడ విమానాశ్రయం నవ్యాంధ్రప్రదేశ్‌కే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందు కోవటంలో తొలి అడుగు పడింది. అత్యాధునిక హంగులతో గన్నవరం ఎయిర్‌ పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ సిద్ధమైంది. ఇప్పుడు, విజయవాడ ఎయిర్‌పోర్టు రాష్ట్రానికే ఐకానిక్‌ సింబల్‌.


చరిత్రలోకి వెళ్తే, గన్నవరం విమానాశ్రయం బ్రిటీష్ కాలంలో ఏర్పాటైంది. 1940లో ఇక్కడ నుంచి యుద్ధ విమానాలు నడిచేవి. 1962-89 మధ్య ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాలను నడిపింది. ప్రయాణీకుల ఆదరణ తగ్గడం, కారణంగా 1989-2002 వరకూ ఎలాంటి సర్వీసులు నడపలేదు. 2002లో డెక్కన్ సంస్థ హైదరాబాద్ కు విమాన సర్వీసును పునర్ద్ధించింది. 2002-2003 లో కేవలం 359 మంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి, రాకపోకలు చేసారు. ఇప్పుడు సంగతి చుస్తే, 2016 ఏప్రిల్ నుంచి నవంబర్ దాక, దాదాపుగా 4.50 లక్షల మంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి, రాకపోకలు చేసారు.



 


అమరావతిలో రాజధాని ఏర్పాటు తరువాత అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక్కసారిగా దేశం లోనే విజయవాడ ఎయిర్‌పోర్టు స్థాయి పెరిగి పోయింది. జీ ప్లస్‌ 1 విధానంలో అత్యాదునిక డిజైన్‌తో రూపొందించిన ఈ నూతన టెర్మినల్‌ తో దేశంలోనే సమున్నత స్థానంలో నిలిచింది. వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానం లో ఉన్న ఈ ఎయిర్‌పోర్టు తాజాగా నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌తో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఎయిర్‌పోర్టుగా భాసిల్లనుంది.


నూతన టెర్మినల్‌ రాకతో.. అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు మార్గం సుగమమైనట్టే... దీనికంటే అధునాతనమైనది, ఏటా 50లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండేలా మరో శాశ్వత టెర్మినల్‌ను గన్నవరంలో నిర్మించనున్నట్టు ఏఏఐ అధికారులు తెలిపారు. దానిని వచ్చే రెండేళ్లలోనే నిర్మించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంటే మరో రెండేళ్లలో భవిష్యత్తుకు తిరుగులేని విధంగా విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం నిర్మించిన టెర్మినల్‌ భవనాన్ని కార్గోకు వినియోగించనున్నారు.


ఇక మిగిలింది రన్‌వే విస్తరణ...అంతర్జాతీయ స్థాయి హోదాను అందుకునేలా.. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణ పనులకు రంగం సిద్ధమైంది.


Link to comment
Share on other sites

రైతులకు పాదాభివందనం..మీకు అన్యాయం జరగదు : చంద్రబాబు
13-01-2017 06:48:51
636198869332017174.jpg
  • అతిత్వరలో మూడు నాలుగు రెట్ల విలువ చేసే ప్లాట్ల కేటాయింపు 
  • మల్లవల్లిలో ఫ్రైట్‌ స్టేషన్‌ ఏర్పాటుకు 100 ఎకరాలు 
  • ముఖ్యమంత్రి చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ గన్నవరం): ‘నాకు ఇప్పుడు సంతృప్తి, సంతోషంగా ఉంది. శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌, అంతర్జాతీయ విమానాలు తిరిగే పరిస్థితి వచ్చింది. అమరావతి రాజధానికి ఖ్యాతి తెచ్చేలా విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు నా పాదాభివందనం. మీకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. వ్యవసాయం చేసుకుంటే లేదా అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుందో దానికి మూడు నాలుగు రెట్ల ఆదాయం వచ్చేలా అమరావతి రాజధానిలో అతి త్వరలో మీకు ప్లాట్లు కేటాయిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం రన్‌వే విస్తరణకు భూమిపూజ నిర్వహించిన తర్వాత విజయవాడ విమానాశ్రయ నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విమానాశ్రయ విస్తరణకు రైతులు 750 ఎకరాల భూములను అప్పగించారని, ఒక్కో ఎకరం ఖరీదు రూ.3 కోట్ల చొప్పున.. అక్షరాలా రూ.2,250 కోట్ల ఆస్తిని మీ చేతుల్లో పెడుతున్నామని ఏఏఐ, సివిల్‌ ఏవియేషన్‌ ఉన్నతాధికారులకు తెలిపారు. రహదారుల కోసం బుద్దవరం గ్రామాల్లో స్థలాలను తీసుకోవాల్సి వచ్చిందని ప్రత్యామ్నాయ రహదారులను ఏర్పాటు చెప్పారు. కుటీర పరిశ్రమలు పోయాయని, వారికి కూడా ప్రత్యామ్నాయం కల్పిస్తామన్నారు. ఇళ్ళు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. మల్లవల్లిలోని 100 ఎకరాలను ఎయిర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌కు కేటాయించటానికి సిద్ధంగా ఉన్నామని ఏఏఐ, సివిల్‌ ఏవియేషన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. రన్‌వే పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకునే నాటికి శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు కూడా మొదలౌతాయని తెలిపారు. ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయి హోదాను దక్కించుకోవటమే మిగిలి ఉందని, సాధ్యమైనంత త్వరగా కేంద్రం దీనిని ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాసరావు, పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌, కొణకళ్ళ నారాయణరావు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, జడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు పాల్గొన్నారు.
 
అప్పుడు సిగ్గు వేసేది.. ఇప్పుడు ఆనందంగా ఉంది..
ఒకప్పుడు ఈ ఎయిర్‌పోర్టుకు వచ్చినపుడు కూనాలమ్మ బస్టాండు మాదిరిగా ఉండటం చూసి నాకు సిగ్గు వేసేది. వర్తక, వాణిజ్యానికి, సాంస్కృతికానికి, విద్య, వైద్యానికి రాజధానిగా ఉండే విజయవాడలో ఇలాంటి ఎయిర్‌పోర్టు ఉండటం నన్ను బాధించేది. నేనెన్నో సార్లు ముఖ్యమంత్రికి దీనిని అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పేవాడిని. భూసేకరణ ఎంతో సమర్ధంగా చేశారు. నాగరికత అభివృద్ధి చెందటంతో పాటు పర్యాటకం, విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు కలగటానికి రవాణా కనెక్టివిటీ దోహదపడుతుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విమాన యాన ప్రగతి ఎంతగానో దోహదపడుతుంది. ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. 
- ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
 
ఫెడెక్స్‌ కార్గో విమానాలు త్వరలో వస్తాయి..
విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి చెందటం వల్ల ధనికులకే ప్రయోజనమన్న అపోహలకు తావివ్వవద్దని ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేసుకోవచ్చు. ఇక్కడ టమాటాలు ఒక రూపాయికి అమ్ముకుంటే ఢిల్లీలో రూ.20ల ధర పలుతుంటే చాలా బాధగా ఉంటుంది. రన్‌వే విస్తరణ జరిగితే అంతర్జాతీయ స్థాయిలో కేవలం సరుకు రవాణా చేపట్టే ఫిడెక్స్‌ విమానాలు రావటం పెద్ద కష్టమేమీ కాదు. 
- పి.అశోక్‌గజపతిరాజు, పౌర విమానయాన శాఖ మంత్రి
Link to comment
Share on other sites

ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు అమరావతి టెర్మినల్‌గా ఇక ఖ్యాతి !
13-01-2017 06:50:44
636198870458042194.jpg
  • అన్నా.. నీకు వందనం!
  • ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన 
  •  ఏఏఐ, సివిల్‌ ఏవియేషన్‌ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి 
  • ఆమోదం తెలిపిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణాజిల్లాలో పుట్టి.. తెలుగు కళామ తల్లిలో ఒదిగి.. తెలుగు చలన చిత్రసీమలో రారాజుగా వెలుగొంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా పని చేసిన ధృవతార అన్న నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) పేరుతో అమరావతిగ టెర్మినల్‌గా ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ భాసిల్లబోతోంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ అంగీకారం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అన్న ఎన్టీఆర్‌ పేరుతో, అమరావతి పేరును జోడించుకుని చరితార్థం కాబోతోంది. విజయవాడ నూతన ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు. సభా వేదికపై సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. అంతకు ముందు ఉదయం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో జరిగిన ఏవియేషన్‌ సమ్మిట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు అమరావతి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయనున్నట్టు సూచన ప్రాయంగా తెలిపారు. ఆ తర్వాత టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవ కార్య క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ అన్న ఎన్టీఆర్‌ పేరును ముందు ఉదహరిస్తూ అమరావతిని కూడా కలుపుతూ ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు అమరావతి టెర్మినల్‌గా నామకరణం చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులందరిదీ ఒకటే మాట, ఒకటే బాట అని చెబుతూ ముక్తకంఠంతో తామంతా ఈ పేరును ప్రతిపాదిస్తున్నట్టు సివిల్‌ ఏవియేషన్‌, ఏఏఐ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సభా వేదికపైనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేవారు. దీనిపై కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనను చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుందని, అసెంబ్లీ తీర్మానం వచ్చిన తర్వాత పార్లమెంట్‌ ఆమోదం పొందిన వెంటనే దీనికి సంబంధించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
Link to comment
Share on other sites

NTR Airport, Amaravati

 

Remember ...

 

We didn't ask for this to be named after NTR ... make sure another ysr fuuuck doesn't change this ...

 

still can't digest how ysr changed NTRs name on hyd airport ... 

 

everytime I think about it ... it just churns my stomach and confirms  ... 

Link to comment
Share on other sites

Remember ...

 

We didn't ask for this to be named after NTR ... make sure another ysr fuuuck doesn't change this ...

 

still can't digest how ysr changed NTRs name on hyd airport ... 

 

everytime I think about it ... it just churns my stomach and confirms  ... 

CBN vunnappudu official ga papers midha pettaro ledho correct ga telvadu gani... bayata ekkada Hyd airport ki NTR name pettinattu CBN cheppaledhu... In some ways, CBN ni anali... Congi gallu vachharante Nehru family names pedatarani telusu... mundhe jagratta padalisindhi

Link to comment
Share on other sites

CBN vunnappudu official ga papers midha pettaro ledho correct ga telvadu gani... bayata ekkada Hyd airport ki NTR name pettinattu CBN cheppaledhu... In some ways, CBN ni anali... Congi gallu vachharante Nehru family names pedatarani telusu... mundhe jagratta padalisindhi

 

I remember NTRs name on the airport ... may be I only remember after ysr came to power.

 

What's striking is ... ysr abruptly changed it from NTR to ragiv gandhi ... the only instance I know where a CM went above and beyond to rename a deceased leader's name on anything. It was just despicable ... beyond my comprehension. I can't imagine BJP renaming indira gandi airport in delhi ... as much as I hate to land there with that tag ig on my passport.

 

this ysr fuuck had no conscience or decency whatsoever ... we should deal with them likewise.

Link to comment
Share on other sites

I remember NTRs name on the airport ... may be I only remember after ysr came to power.

Only the national terminal was named after NTR. International terminal was named after Rajiv Gandhi. Vadu poyyinappudu Congress power lo undiga AP lo...Delhi xxxxx nake batch vadi peru pettesaru. Every state lo valla leaders perlu pettukunte mana daggara matram Delhi vallani kaka pattataniki valla perlu pedatham.

Link to comment
Share on other sites

Every state lo valla leaders perlu pettukunte mana daggara matram Delhi vallani kaka pattataniki valla perlu pedatham.

 

idi mathram mana dhourbhagyam saami  :(

 

Hyd digalante aa ragiv gandhi peru passport lo permanent ga padathadani vellanu ... I divert to Bangalore or Chennai or Mumbai.

 

I'd proudly carry Chatrapati Shivaji name.

Link to comment
Share on other sites

ఫిబ్రవరి మొదటివారంలో వినియోగంలోకి నూతన టెర్మినల్‌!
 
ఆంధ్రజ్యోతి, విజయవాడ : అంతర్జాతీయస్థాయిలో రూపుదిద్దుకున్న విజయవాడ ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ బిల్దింగ్‌లోకి ఫిబ్రవరి మొదటివారం నాటికి షిఫ్ట్‌ అయ్యేందుకు గన్నవరంలోని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తటెర్మినల్‌లోకి షిఫ్ట్‌ అవుతున్న నేపథ్యంలో, ఏమేమి సమకూర్చుకోవాల్సి ఉన్నాయో వాటన్నింటిపైనా ఏఏఐ అధికారులు కసరత్తులు చేశారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు విమానయాన సంస్థల ప్రతినిథులతో సమావేశం నిర్వహించారు. సాంకేతిక వ్యవస్థలను కొత్త టెర్మినల్‌లోకి మార్చాల్సిందిగా సూచించారు. దీంతోపాటు కంప్యూటర్లు, కౌంటర్ల వంటి వాటికి సంబంధించి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. విమానయాన సంస్థలకు లేఖలు రాయటం కూడా జరిగింది. ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌లోకి షిప్ట్‌ అవుతున్న దశలోనే మిగిలిపోయిన ఫినిషింగ్‌ పనులు కూడా పూర్తి చేయించేందుకు కాంట్రాక్టు సంస్థ ప్రతినిథులతో చర్చించారు. మిగిలిన ఇంటీరియర్‌ వర్క్స్‌ పూర్తి చెయ్యాల్సిందిగా సూచించటంతో పాటు పాత టెర్మినల్‌లోని సాంకేతిక వ్యవస్థను కొత్త టెర్మినల్‌కు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. టవర్‌ అనుసంధాన సాంకేతిక పనులు కూడా చేపట్టవలసి ఉంటుంది. వీటన్నింటినీ ఈ నెలాఖరు నాటికి ఒక కొలిక్కి తీసుకు వచ్చిన మీదట ట్రయల్‌ రన నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో లాంఛనంగా సేవలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

త్వరలోనే నవ్యాంధ్రకు ‘ఫెడెక్స్‌’
 
636201511988434746.jpg
ప్రపంచ దిగ్గజ కార్గో ఎయిర్‌లైన్స్ సంస్థ ‘ఫెడెక్స్‌’ తమ విమానాన్ని విజయవాడ ఎయిర్‌పోర్టుకు నడిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనికి భూ, జల, వాయు మార్గాల్లో పార్శిల్స్‌, సరుకు రవాణా, భారీ యంత్ర పరికరాలను తరలించగల సామర్ధ్యం ఉంది. వర్తక, వాణిజ్యానికి పేరుగాంచిన బెజవాడ నుంచి భారీ స్థాయిలో సరుకు రవాణా ఉండవచ్చని ఈ సంస్థ అంచనా వేస్తోందని సమాచారం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రవాణా రంగానికే గుండెకాయ బెజవాడలో అతిపెద్ద లారీ ట్రాన్సపోర్ట్‌ రంగం ఉంది. ఆటోమొబైల్‌ వ్యాపారం ఇక్కడ భారీస్థాయిలో జరుగుతుంది. వర్తక, వాణిజ్య గురించి సరేసరి! విదేశాల నుంచి సరుకు, ఫర్నిచర్‌, పేపర్‌, రంగులు వంటివి ఈ ప్రాంతానికి ఎక్కువుగా దిగుమతి అవుతుంటాయి. విజయవాడలో వర్తక, వాణిజ్యం వెల్లివిరుస్తోందంటే ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి భారీఎత్తున వివిధ ఉత్పత్తులు, ఉపకరణాల వంటివి దిగుమతి చేసుకోవటమేననితెలుస్తోంది. విజయవాడలో 90శాతం కార్గో రవాణా అన్నది ప్రైవేటు ట్రాన్సపోర్టులు, రైల్వేల ద్వారా జరుగుతున్నాయి. మిగిలిన 10శాతం ఇటీవల కాలంలో విజయవాడకు ఎయిర్‌ కనెక్టివిటీ ఉండటంతో.. ఎయిర్‌ ఇండియా విమానాల ద్వారా ఎక్కువుగా కార్గో రవాణా అవుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో సంస్థగా ఉన్న ‘ఫెడెక్స్‌’ ఫర్నిచర్‌, రంగులు వంటి వాటిని విజయవాడకు చేరవేసే అవకాశాలపై ఎక్కువగా సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ఈ సంస్థ ఇక్కడకు విమానాలు నడపాలంటే తగిన పరిమాణంలో రనవే ఉండాలి. కనీసం 3వేల మీటర్ల రనవే అయినా ఉండాలి. భారీ కార్గో విమానాలు కాబట్టి ఈ పరిమాణంలో రనవే అవసరమని తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడలో రనవే 2,600 మీటర్లు మాత్రమే ఉంది. దీనికి మరో 1,600 మీటర్లు అదనంగా విస్తరిస్తున్నారు. ఇటీవలే దీనికి భూమిపూజ జరిగింది. మరో రెండువారాల్లో టెండర్లను ఖరారు చేయవచ్చు. రనవే పూర్తికావటానికి ఏడాది సమయం పడుతుంది. అప్పటి వరకు ఫెడెక్స్‌ సంస్థ విమానాలు ల్యాండింగ్‌కి అవకాశం లేదు. ఈ లోపు విజయవాడలో కార్గో టెర్మినల్‌ కూడా ప్రారంభం కాబోతోంది. కార్గో టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత.. పాసింజర్‌ విమానాల్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని కార్గో రవాణా పెద్దఎత్తున చేపడతారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థ కార్గోసేవల కోసం ఏఏఐపై ఒత్తిడి తెస్తోంది. ఫెడెక్స్‌ ఎయిర్‌లైన్స సంస్థ విదేశానికి సంబంధించినది కాబట్టి.. విజయవాడకు కస్టమ్స్‌ హోదా కూడా రావాల్సి ఉంటుంది.
 
ఫెడెక్స్‌ వస్తే లాభమేమిటి?
ఫెడెక్స్‌ కార్గో ఎయిర్‌లైన్స వస్తే ప్రపంచస్థాయిలో మనం ఎగుమతులు చేసుకోవటం సులభమౌతుంది. కృష్ణాజిల్లా వ్యవసాయ ప్రధానమైన జిల్లా. ఇక్కడి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. నెట్‌ ద్వారా విదేశీ సంస్థలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకుని ఫెడెక్స్‌ విమానాల ద్వారా సరుకును పంపించి లాభాలను ఆర్జించటానికి దోహదపడుతుంది. విదేశాల నుంచి కొనుగోలు చేసిన వస్తువులను కూడా అతి సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. ఎలక్ర్టానిక్స్‌, ఆటోమొబైల్స్‌, పుస్తకాలు, బేకరీ ఉత్పత్తులు, నిత్యావసరాలు, కంప్యూటర్‌ విడిభాగాలు, మొబైల్స్‌ ఇలా.. ఏవైనా ఎగుమతి, దిగుమతి చేసుకోవటానికి వీలు చిక్కుతుంది. ఇంటర్‌నెట్‌ ద్వారా మార్కెటింగ్‌ చేసుకునే తెలివి తేటలు ఉంటే చాలు.. ఫెడెక్స్‌ విమానాల ద్వారా మంచి రాబడి పొందవచ్చు.

ఏడాది లోపు స్టోరేజ్‌ గోడౌన్స్
ఏఏఐ అధికారులు ఏడాదిలోపు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో స్టోరేజ్‌ గోడౌన్స ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పీపీపీ విధానంలో కోల్డ్‌ స్టోరేజ్‌ గోడౌన్ల నిర్మాణాన్ని చేపడితే బాగుంటుందన్న ఆలోచనను చేస్తున్నారు. ఏఏఐ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పీపీపీ విధానంలో వీటిని నిర్మించటానికి చర్యలు చేపడుతున్నారు.

కార్గో రవాణా ఇలా
ఫెడెక్స్‌ విమానాలు కేవలం కార్గో రవాణా కోసం ఉద్దేశించినవి. లోపల ఎలాంటి సీట్లుండవు. అంతా డొల్లగా ఉంటుంది. కార్గో బాక్స్‌లను ఇందులో ఉంచి ఎటూ కదలకుండా బెల్టులు బిగిస్తారు. విమానాలలోకి భారీ బాక్సులను కూడా అవలీలగా లోపలికి తీసుకు వెళతారు. కార్గో విమానం ముందు భాగం, రెండు పక్కల, పై భాగాల నుంచి కార్గో బాక్సులను అవలీలగా క్రేన్ల సహాయంతో లోపలికి దింపుతారు. తిరిగి తీసేటపుడు కూడా అలాగే తీస్తారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...