Jump to content

NTR Amaravati International Airport

Recommended Posts

Airport expansion: Rs. 20 cr. sanctioned for R&R

STAFF REPORTER VIJAYAWADA: DECEMBER 23, 2016 00:35 IST

The total package is estimated to be Rs.56 crore

The State on Thursday sanctioned Rs.20 crore to meet relief and rehabilitation expenses while expanding the Gannavaram airport.

This was stated in a G.O. issued by the Energy, Infrastructure and Investment Department. The package covers 401 beneficiaries identified by the enumerator, Chirala-based Rakshana.

The R&R package, which is based on micro-plans prepared by the NGO, is estimated to cost approximately Rs.56 crore.

The Roads and Buildings Department has prepared estimates for construction of the R&R Colony in 49.35 acres under the Pradhan Mantri Awas Yojana.

Davajigudem village has the highest number of affected families at 203, followed by Buddhavaram 83, Rajendra Nagar 56, Pamarthi Nagar 26, Ajjampudi 24 and Pedavutapalli 9.

The Government will provide all facilities required for the package such as houses, transportation, rental value, subsistence allowance and grants for kiosks and cattle sheds.

Other amenities are drinking water, drainage and parks. District Collector A. Babu would draw and make the money available in Public Account Deposits.

http://www.thehindu.com/news/cities/Vijayawada/Airport-expansion-Rs.-20-cr.-sanctioned-for-RR/article16927152.ece

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply
ఘనంగా గగనయానం
 
636185811743128462.jpg
  • అంతర్జాతీయ స్థాయికి గన్నవరం..ఏఏఐకి 700 ఎకరాలు
  • 12న కొత్త టర్మినల్‌ ప్రారంభం.. 12-14 వరకు ఎయిర్‌ షో
  • భోగాపురం నిర్మాణానికి సర్వం సిద్ధం.. 98 శాతం భూసేకరణ పూర్తి
  • రాజమండ్రికి ఏ320 ఎయిర్‌బ్‌సలు.. ఓర్వకల్లు, దగదర్తిపై దృష్టి
అమరావతి/న్యూఢిల్లీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గగనంలో ఘనంగా దూసుకుపోయేందుకు ఏపీ సిద్ధమవుతోంది. పౌర విమానయానానికి కొత్త రెక్కలు తొడుగుతోంది. నవ్యాంధ్రలో తొలిసారిగా విజయవాడలో విమానయాన శాఖ ‘ఎయిర్‌ షో’ నిర్వహించనుంది. నేలపై రంగురంగుల సంక్రాంతి ముగ్గులు పరుచుకునే జనవరి 12 నుంచి 14 తేదీల్లోనే... నింగిలో వైమానిక విన్యాసాలతో హరివిల్లులు కనువిందు చేయనున్నాయి. ఏపీ ప్రభుత్వం, ఫిక్కీలతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ ఎయిర్‌షోలో అనేక ప్రత్యేక అంశాలను చేర్చినట్లు విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. 12వ తేదీనే గన్నవరంలో రూ.160కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన టెర్మినల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని అనంతరం ఎయిర్‌షో జరుగుతుందని తెలిపారు. ప్రాంతీయ అనుసంధానానికి కావాల్సిన భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా షో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలోని దుర్గా ఘాట్‌ వద్ద మూడు రోజులపాటు ఉదయం 11 గంటల నుంచి 11.45వరకూ, సాయంత్రం 4.30గంలనుంచి 4.45 గంటలవరకూ ఎయిర్‌ షో ఉంటుందని తెలిపారు. బ్రిటన్‌కు చెందిన ఏరోబ్యాటిక్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు జరుగుతాయని అశోక్‌ గజపతి తెలిపారు. మోదీ సర్కారు చేపట్టిన విధానాలతో 2020 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌గా భారత రూపుదిద్దుకుంటుందని, 2030 నాటికి తొలిస్థానంలో ఉంటుందని తెలిపారు. విజయవాడలో జరిగే ఎయిర్‌షో సందర్భంగా నిర్వహించే సదస్సులో విమానయానరంగంలోని ఆపరేటర్లు, వివిధ ఏజెన్సీలు, నిపుణులు కూడా పాల్గొంటారని తెలిపారు.
 
అమరావతి కేంద్రంగా...
హైదరాబాద్‌ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశాకే.... ప్రపంచంతో అనుబంధం పెరిగింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోనూ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా విస్తరణ కార్యక్రమాలను కూడా చేపట్టింది. రాష్ట్రంలో విమనాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వ కార్యాచరణను ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి బుధవారం వివరించారు. ‘‘గన్నవరం (విజయవాడ) విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు వీలుగా.. ఇప్పటికే 700 ఎకరాలను భారత విమానయాన సంస్థకు అప్పగించాం. ప్రస్తుతం ఉన్న ప్రవేశ భవనం, టెర్మినల్‌లను అభివృద్ధి చేశాం. వీటిని జనవరి 12న సీఎం ప్రారంభిస్తారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యతోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. అదే రోజున విజయవాడ విమానాశ్రయం రన్‌వే విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా ఉంటుందని వివరించారు. రాజమండ్రి విమానాశ్రయం కూడా విస్తరిస్తున్నామని .. ఇందుకోసం 350 కోట్ల రూపాయల విలువైన 857 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించామని అజయ్‌జైన్‌ వివరించారు. ఎ320 ఎయిర్‌బస్‌ కూడా రాజమండ్రిలో దిగేందుకు అనువుగా రన్‌వేను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టనున్నామని అజయ్‌జైన్‌ వివరించారు. దగదర్తి విమానాశ్రయం నిర్మాణం కోసం జవనరి 5న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని వెల్లడించారు. ఇక... రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించదలచిన భోగాపురం (విశాఖ) విమానాశ్రయానికి 98 శాతం భూసేకరణ పూర్తయిందని తెలిపారు. కేవలం ఇద్దరు వ్యక్తుల నుంచి 400 ఎకరాలు సేకరించాల్సి ఉందని .. ఇది కూడా త్వరితగతిన సమీకరిస్తామని అజయ్‌ జైన్‌ ధీమా వ్యక్తం చేశారు. జనవరి 11న భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉందని అజయ్‌జైన్‌ చెప్పారు.

Kevalam iddari deggara 400 acres aaa :blink:

Link to comment
Share on other sites

విజయవాడ ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు
 
636187636619810276.jpg
కలకాదు.. నిజమే.. విజయవాడ విమానాశ్రయం నవ్యాంధ్రప్రదేశ్‌కే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందు కోవటంలో తొలి అడుగు పడింది. నూతన సంవ త్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకునేందుకు ఎయిర్‌ పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ సిద్ధమవుతోంది. విజయవాడ ఎయిర్‌పోర్టు రాష్ట్రానికే ఐకానిక్‌ సింబల్‌.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ)
అమరావతిలో రాజధాని ఏర్పాటు తరువాత అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక్కసారిగా దేశం లోనే విజయవాడ ఎయిర్‌పోర్టు స్థాయి పెరిగి పోయింది. జీ ప్లస్‌ 1 విధానంలో అత్యాదునిక డిజైన్‌తో రూపొందించిన ఈ నూతన టెర్మినల్‌ తో దేశంలోనే సమున్నత స్థానంలో నిలిచింది. వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానం లో ఉన్న ఈ ఎయిర్‌పోర్టు తాజాగా నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌తో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఎయిర్‌పోర్టుగా భాసిల్లనుంది. ఇక మిగి లింది రన్‌వే విస్తరణ ఒక్కటే. నూతన సంవత్స రంలో ఆ ముచ్చట కూడా తీరబోతోంది. దాదా పు 700 ఎకరాల్లో అదనంగా 3500 మీటర్ల మేర రన్‌వే విస్తరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. నూతన ఎయిర్‌ పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌ పను లు దాదాపు పూర్త య్యా యి. ఫి నిషింగ్‌ పను లను పూర్తి చేస్తు న్నారు.

14 నెలల్లోనే..

ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ కేవ లం 14 నెలల్లోనే పూర్తి కావటం గమ నార్హం. ఈ పనులను సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. రూ. 128 కోట్ల వ్య యంతో టెర్మినల్‌ బి ల్డింగ్‌ పనులను ఈ సంస్థ చేపట్టిం ది. దీంతో పాటు అనుబంధ పనుల ను కూడా చేపట్టిం ది. అక్టోబర్‌ 8, 2015లో సింప్లెక్స్‌ సంస్థ పనులను చేప ట్టింది. జనవరి 7, 2017 నాటికి తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ఎయిర్‌పోర్టు అథా రిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) కు అప్పగించాల్సి ఉంది.
 
పెను తుపాన్లను తట్టుకునేలా..
విశాఖను వ ణికించిన హు ద్‌హుద్‌ తుపా నును దృష్టిలో ఉంచుకుని, ఎం తటి పెను తుపా నులు వచ్చినా తట్టు కోగలిగేలా నిర్మాణాన్ని చేపట్టారు.
 
విజయవాడ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా ..
విజయవాడ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నూతన టెర్మినల్‌ బి ల్డింగ్‌ను రూపొందిస్తున్నారు. సెర్మోనియల్‌ లాంజ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దు తు న్నారు. ఆకర్షణీయమైన కళా ఖండాలు, వాటర్‌ ఫౌంటె యిన్స్‌తో తీర్చిదిద్దను న్నారు. ప్రతి హాల్‌లో నూ విజయవాడ చరిత్రను తెలి యచెప్పే కళా ఖం డాలు, జానపద కళాఖండాలను ఏ ర్పాటు చేస్తారు. టెర్మినల్‌ బిల్డింగ్‌ లోప ల ఇంటీరియరి ల్యాం డ్‌ స్కేపింగ్‌ ఉంటుంది.
 
అత్యాధునిక సదుపాయాలు :
నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌లో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. అరైవల్‌ డిపార్చర్‌ బ్లాక్‌లలో సరికొత్త సాంకేతిక పరి జ్ఞానంతో పనిచేసే లగేజీ కన్వేయర్‌ బెల్ట్‌ మెషీన్లను ఏర్పాటు చేశారు. డిపార్చర్‌ బ్లాక్‌ నుంచి బ్యాగేజి చెకింగ్‌ పూర్తి కాగానే.. కన్వే యర్‌ బెల్ట్‌పై అరైవల్‌ బ్లాక్‌ మీదుగా ఏకంగా ఎయిర్‌లైన్స్‌ క్యారేజీ ట్రక్కుల దగ్గరకు వెళ్ళేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఎలక్ర్టిల్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. డీజిల్‌ జనరేటర్లను సిద్ధం చేశారు. సీవేజి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు రూపకల్పన చేశారు. అత్యాధునిక ఫైర్‌ఫైటర్స్‌ను సిద్ధంగా ఉంచారు.
 
జిగేల్‌ .. జిగేల్‌
ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ బిల్డింగ్‌ను లోపల, బయ ట అత్యంత ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. బయట పాలిథీన్‌ పైకప్పుతో ఏర్పాటు చేసే లాంజ్‌ లు, ఆగమన, నిర్గమన మార్గాల ప్రదేశంలో బయ ట వైపు గాజుతో కూడిన పైకప్పు ప్రత్యేకంగా ఉం టుంది. టెర్మినల్‌ బయట వాల్స్‌పైన కూడా పచ్చ దనంతో తీర్చిదిద్దుతున్నారు. టెర్మినల్‌ బయట సాధారణ ప్రజలు కూర్చోవటానికి ప్రత్యేకంగా మరో నిర్మాణం చేపట్టారు. విశాలమైన గార్డెన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. విమానాశ్రయం ప్రధాన గేట్‌ నుంచి కుడివైపు టర్న్‌ తీసుకుని నేరుగా కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌కు వెళ్ళేలా డబుల్‌ లేన్‌ రోడ్డును అభివృద్ధి పరిచారు.
Link to comment
Share on other sites

రెక్కలు తొడిగి.. రివ్వున ఎగిరి

రూ.137 కోట్ల టెర్మినల్‌ 12న ప్రారంభం

రన్‌వే విస్తరణకూ ఫిబ్రవరిలో పనులు

అంతర్జాతీయ సర్వీసులు, కార్గోకు మార్గం

amr-top1a.jpg

రాజధానిలో 2017కు శుభారంభం గన్నవరం విమానాశ్రయంతో జరగబోతోంది. రూ.137 కోట్లతో నిర్మిస్తున్న అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం 12న ప్రారంభిస్తారు. రాజధాని పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఆరంభమిది. 2015 అక్టోబరు 25న నిర్మాణం ప్రారంభించి.. 2016 డిసెంబరు నాటికి పూర్తి చేసి.. 2017లో పూర్తి చేయాలనేది లక్ష్యం. అనుకున్నట్టుగానే.. పనులు చేపట్టి లక్ష్యాన్ని ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు.

ఈనాడు, అమరావతి

రెండేళ్ల కిందటి వరకూ నిత్యం రెండు సర్వీసులు.. వంద మంది ప్రయాణికులన్నట్టుగా ఉన్న విమానాశ్రయం పరిస్థితి.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పతాకస్థాయికి చేరుకుంది. నిత్యం 24 సర్వీసులు దేశంలోని ప్రధాన నగరాలకు నిత్యం తిరుగుతున్నాయి. మరికొన్ని సర్వీసులను రద్దీని బట్టి ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా విజయవాడ నుంచి కాశీకి సైతం సర్వీసును ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ టెర్మినల్‌ ప్రారంభమయ్యాక.. విదేశాలకు సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విమానయాన సంస్థలతో ఇప్పటికే దీనికి సంబంధించి పలు దఫాలుగా అధికారులు చర్చలు జరుపుతున్నారు. తొలుత దుబాయ్‌, సింగపూర్‌ వంటి సమీప దేశాలకు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదే ఈ కల కూడా సాకారం కానుంది. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూసేకరణ సైతం తాజాగా పూర్తవ్వడంతో రన్‌వే పొడిగింపునకు మార్గం సుగమమైంది.

గన్నవరం విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ భవనం 3200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటా 2.5లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా ఉంది. నూతనంగా నిర్మించినది 9520 చదరపు మీటర్లలో ఏటా కనీసం 10లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుంది. రెండు ఫ్లోర్లతో నిర్మిస్తున్న నూతన టెర్మినల్‌లో ఒక గంటకు 500 మంది ప్రయాణికులు వేచి ఉండేందుకు, రాకపోకలు సాగించేందుకు వీలుంది. 16 చెక్‌ఇన్‌ కౌంటర్లు, బ్యాగేజీ కన్వేయర్‌ బెల్ట్‌లు, బ్యాగేజీ క్లైమ్‌ కరౌజల్స్‌, అధునాతన సీసీ కెమెరాలతో భద్రత, 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు పార్కింగ్‌ వంటివి అందుబాటులోనికి రానున్నాయి. స్టీల్‌ అండ్‌ గ్లాస్‌ నమూనాతో వెలుపలి వైపు ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. విమానాశ్రయాలు 12-15మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల నమూనా చూసేందుకు సరిగా కనిపించదు. కానీ.. ఇక్కడ 9మీటర్ల ఎత్తులో నిర్మించారు. చూసేందుకు ఆకర్షణీయంగా.. కన్పిస్తోంది. దీని ఎదుట ఓ గోడపై గ్రీనరీతో విజయవాడ విమానాశ్రయమని పేరును తీర్చిదిద్తుతున్నారు. పక్కనే మూడు నీటి ఫౌంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖలతో పోలిస్తే.. మరింత అధునాతనంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణ లోపలి వైపున చేస్తున్నారు. ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులు హాజరై నూతన టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు వారాల్లో పాత టెర్మినల్‌ భవనం నుంచి దీనిలోనికి కార్యకలాపాలను పూర్తిగా తరలిస్తారు.

740 ఎకరాల భూసేకరణ పూర్తి..: విమానాశ్రయం విస్తరణకు సైతం ఈ ఏడాదే జరగనుంది. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం 535 ఎకరాల్లో ఉండగా.. మరో 740 ఎకరాల భూమిని విస్తరణ కోసం సేకరించారు. విమానాశ్రయ అధికారులకు ఈ భూమిని అప్పగించడంతో 1275 ఎకరాల్లో బృహత్తర ప్రణాళికను అమలు చేయనున్నారు. తొలుత రన్‌వేను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 2886 మీటర్ల రన్‌వే ఉంది. దీనిని 3360 మీటర్లకు పొడిగించనున్నారు. భారీ 747 బోయింగ్‌ విమానాలు సైతం రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. అప్పుడే అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకొస్తాయి. గత దశాబ్దకాలంగా విమానాశ్రయ విస్తరణకు సంబంధించి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయి.. ఈ ఏడాది వాస్తవ రూపంలోనికి రానుంది. నూతన టెర్మినల్‌ భవనం ప్రారంభోత్సవం రోజునే రన్‌వే విస్తరణకు భూమి పూజ చేయనున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రన్‌వే విస్తరణ పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే రన్‌వేకు అనుబంధంగా పది పార్కింగ్‌ బేస్‌మెంట్లను నిర్మించారు. అంతకుముందున్న ఆరుతో కలిపి ప్రస్తుతం 16 విమాన సర్వీసులను ఇక్కడ నిలిపేందుకు కూడా సౌకర్యం ఉంది.

అన్ని నగరాలతో అనుసంధానం.. : విజయవాడ నుంచి నేరుగా దేశంలో ఎక్కడికైనా చేరుకునేలా ఒక్కో విమాన సర్వీసును గన్నవరం నుంచి పెంచుకుంటూ వెళుతున్నారు. గత ఏడాదిన్నర వ్యవధిలోనే సర్వీసుల సంఖ్య రెట్టింపు పెరిగింది. ప్రయాణికులు గత రెండేళ్లలో ఏటా మూడు రెట్లు పెరుగుతున్నారు. ఏ నగరానికి సర్వీసును ప్రారంభించినా.. 80-90శాతం ఆక్యుపెన్షీ ఉంటుండడంతో విమానయాన సంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. 2015-16 కంటే.. 2016-17 తొలి అర్థ సంవత్సరంలోనే గత ఏడాది కంటే ప్రయాణికుల సంఖ్య 71.38శాతం పెరిగింది. ఏడాది కిందట దిల్లీకి తొలుత సర్వీసును ప్రారంభించిన సమయంలో కొంత సందిగ్ధం ఉండేది.. ప్రస్తుతం అసలు టిక్కెట్లే దొరకనంత రద్దీ విజయవాడ-దిల్లీ సర్వీసుకు నెలకొంది. దీంతో తాజాగా.. విజయవాడ నుంచి కాశీకి నేరుగా వెళ్లేలా సర్వీసును ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత నుంచి కేవలం నాలుగు గంటల్లో హైదరాబాద్‌ మీదుగా కాశీకి ఇక్కడి నుంచి చేరుకోవచ్చు. ఇలాగే దేశంలోని అన్ని ప్రధాన నగరాలకూ సర్వీసులను ఏర్పాటు చేసే విషయంపై దృష్టిసారించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, కడప, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి కాశీకి సైతం విమానం అందుబాటులోనికి వస్తుంది.

ఎంతెంత దూరం.. ఎంత సమయం

రైలు, బస్సులతో పోలిస్తే ఏడో వంతు సమయంలోనే విమానంలో చేరుకుంటుండడంతో ఏ నగరానికి నూతన సర్వీసును ఏర్పాటు చేసినా డిమాండ్‌ భారీగా ఉంటోంది. విమాన ఛార్జీలు సైతం అందుబాటులోనికే రావడం, బస్సు, రైలుతో పోలిస్తే మరీ భారీగా తేడా లేకపోవడంతో ఇప్పటికే చాలామంది ఆకాశయానానికి ఆసక్తి చూపిస్తున్నారు.

విదేశీ యాత్రికులకు కీలకం..: గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపాలనే డిమాండ్‌ ఈ ఏడాది ఫలించనుంది. సమీపంలో ఉన్న దేశాలకు తొలుత అంతర్జాతీయ సర్వీసులు ప్రవేశపెట్టనున్నారు. వీటి రాకతో గుంటూరు, కృష్ణా సహా చుట్టుపక్కల మూడు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి ఏటా విమానాలను ఎక్కుతున్న 25 లక్షల మంది ఇక గన్నవరం బాట పట్టనున్నారు. వీరితో పాటూ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే ప్రవాసభారతీయులు, ఇతర దేశాల వాళ్లకు వెసులుబాటు పెరుగుతుంది. హైదరాబాద్‌లో అర్థరాత్రి దిగి తెల్లవారుజాము వరకూ అక్కడే వేచి ఉండి.. ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఉదయం ఇక్కడ వాలిపోయి.. సాయంత్రానికి మళ్లీ వారి దేశాలకు వెళ్లిపోయేందుకు అవకాశం ఉంటుంది. ప్రపంచ స్థాయి ప్రసిద్ధి చెందిన అమరావతి, చుట్టుపక్కల ఉండే బౌద్ధ విశేషాలను చూసేందుకు ఇప్పటికే ఏటా కనీసం రెండు లక్షల యాత్రికులు వస్తున్నారు. అయితే వచ్చినవారు వచ్చినట్టే మళ్లీ సాయంత్రానికి తిరుగుబాట పడుతున్నారు. ఇక్కడ ఉండేందుకు సరైన వసతి లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వచ్చి.. తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్యను ఏటా 20 లక్షలకు పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో 15 లక్షలు స్వదేశీయులు, 5 లక్షలు విదేశీయులు. దీనికి అవసరమైన వసతిని ఏర్పాటు చేయడంపై తొలుత దృష్టిసారిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలతో పాటూ విదేశాల నుంచి వచ్చే వీరందరికీ ప్రధానమైన రవాణా వసతి విమానాశ్రయమే. అందుకే వచ్చే రెండు మూడేళ్లను దృష్టలో పెట్టుకుని ఇప్పటినుంచే సిద్ధంగా ఉండేందుకు విమానాశ్రయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందస్తుగానే రన్‌వే విస్తరణను త్వరితగతిన చేపట్టనున్నారు.

అంకెల్లో విమానాశ్రయం..

విమానాశ్రయ విస్తీర్ణం: 535 ఎకరాలు

కొత్తగా సేకరించిన భూమి: 740 ఎకరాలు

మొత్తం విస్తీర్ణం: 1275 ఎకరాలు

పాత టెర్మినల్‌ విస్తీర్ణం: 3200 చదరపు మీటర్లు

ప్రయాణికుల సామర్థ్యం: ఏటా 2.5లక్షలు

నూతన టెర్మినల్‌ విస్తీర్ణం: 9520 చదరపు మీటర్లు

ప్రయాణికుల సామర్థ్యం: ఏటా 10లక్షలు

ప్రస్తుత రన్‌వే: 2886 మీటర్లు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...