Jump to content

టీడీపీలోకి కొడాలి నాని.కీలక నేతతో భేటీ.


Kiriti

Recommended Posts

అధికారం ఒక తిరుగులేని ఆయుధం. కొంతమంది అధికారానికి దూరంగా ఉండలేరు. కార్యకర్తలు కూడా అదే కోరుకుంటారు. అధికారానికి, నేతలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కలిసి పయనించాలని కోరుకుంటారు. అందుకే అధికారం వైపుకొచ్చేందుకు ఆరాటపడుతుంటారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు. అందుకు ఉదాహరణే.. కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం కృష్ణాజిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ ఆయన. మళ్లీ తెలుగుదేశం వైపు కొడాలి నాని చూస్తున్నారని జరుగుతున్న ప్రచారం అప్పుడే తెలుగుదేశంలో వేడి పుట్టించడం ప్రారంభించింది.
 
రాజకీయాల్లో ఈ క్షణం వరకే మనది. మరుక్షణం మనదికాదు. అందుకే ఆచితూచి అడుగేయాలంటారు. ఈ అనుభవసారాన్ని రంగరించారేమో తెలియదు కాని.. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి గాని.. హత్యలుండవంటారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీలో కొనసాగినట్లైతే.. ఈ రోజు తూర్పు కృష్ణాలో తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి ఎన్టీఆర్ కుటుంబంతో ముఖ్యంగా నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అధినేతపై విమర్శలు గుప్పించేవారని ఇవన్నీ కూడా చంద్రబాబు వరకు వెళ్లాయని చెబుతుండేవారు. పరిస్థితులు ఏం ప్రేరేపించాయో తెలియదు కాని ఆకస్మాత్తుగా కొడాలి నాని 2014 ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కామ్ గా చేరిపోయారా అంటే అదీ లేదు. రాజీనామా చేయకముందే జైల్లో ఉన్న జగన్మోహన్‌ రెడ్డిని కలిసొచ్చారు. రాజీనామా చేసిననంతరం చంద్రబాబును ఆడి పోసుకున్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అంతే కాదు నాని రాజీనామా సెగ జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా తగిలింది.
 
నాని రాజీనామాతో తనకు సంబంధంలేదని జూనియర్ ఎన్టీఆర్‌ హైద్రాబాద్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పాల్సి వచ్చింది. అప్పట్నుంచి తెలుగుదేశం పార్టీకి కొడాలి నానికి మధ్య జిల్లాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది. నాని 2014 ఎన్నికల్లో గుడివాడ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా నానికి టీడీపీకి మధ్య ఉప్పు,నిప్పుగా పరిస్థితి మారింది. గుడివాడలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఖాళీ చేసే విషయంలో కూడా వివాదం చెలరేగింది. అప్పుడు కూడా నాని చంద్రబాబు కుటుంబంపై విమర్శలు గుప్పించారు. తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ నేతలు నేరుగా గుడివాడలో నాని స్థావరం వద్దకే వెళ్లి తొడగొట్టారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే తేల్చుకుందాం రా అంటూ గుడివాడ వీధుల్లో నానికి సవాల్ విసిరారు. నానిపై నాటి నుంచే తెలుగుదేశం పార్టీ అన్నీ రకాలుగా అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఉక్కపోతను నాని భరించలేని దశకు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కో ఎమ్మెల్యే జగన్‌ను వదిలి చంద్రబాబు చెంతకు చేరటం ప్రారంభించారు. ఈ వరుసలోనే కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది.
 
నాని ఏదైన పనిచేశారు అంటే దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. బొత్తిగా వార్తల్లో లేని నాని ఒక్కసారిగా బెజవాడలో రాజకీయ వేడి పుట్టించారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కారులో ఎన్టీఆర్ సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాల ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఇవ్వటంతో మీడియా ఫోకస్ నానిపైకి వెళ్లింది. ఇంకేముంది నాని తెలుగుదేశంలోకి వస్తున్నారని ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది లేదంటూ నాని చెప్పినప్పటికీ, కాదు కాదు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని, దేవినేని ఉమ, బొండా ఉమ, మంత్రి అచ్చెన్నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇంకా తెలుగుదేశం పార్టీ నేతలు మరిచిపోలేదని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శాసనసభలో కూడా కొడాలి నాని మెడపై కత్తి వేలాడుతోంది. శాసనసభలో అచ్చెన్నాయుడిపై చేసిన వ్యాఖ్యలకు ప్రివిలేజ్ కమిటీ పిలిపించి వివరణ కోరగా, క్షమాపణ చెప్పినప్పటికీ నిర్ణయం ఇంకా పెడింగ్ లో ఉంది. నాని ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఒక కీలక నేతతో హైద్రాబాద్ లో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగానే తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై చర్చ ప్రారంభమైంది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిందేనని ఆ నేత బలంగా కోరుకుంటున్నారు.
 
ఆయన ద్వారానే వస్తేనే పని అవుతుందని నాని వర్గీయులు భావిస్తున్నారు. ఈలోగా పది రోజుల నుంచి గుడివాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని నాని అనుచరవర్గమంతా ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని బలంగా కోరుతున్నారు. జగన్ తో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తు అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ ఉందని, అందువల్ల అక్కడ కొనసాగటం రాజకీయంగా మంచిది కాదని ఆయన అనుచరవర్గం గుడివాడలో నానిపై ఒత్తిడి తెస్తోంది.
 
కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోకి వెళితేనే బాగుంటుందని ఆయన అనుచరవర్గం బలంగా కోరుకుంటోంది...వారు ఎంతగా అభిలషిస్తున్నా... తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం నాని చేసిన విమర్శలను పదే పదే గుర్తు చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబుపైనే నాని వ్యక్తిగత విమర్శలు చేశారు. అవి అప్పట్లో చంద్రబాబును కూడా తీవ్రంగా బాధించాయి.. తెలుగుదేశం పార్టీ తరపున గుడివాడలో పోటీచేసిన గెలుపొందిన కొడాలి నానికి అప్పట్లో ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఆర్థికంగా కూడా తోడ్పాటునందించింది. నాని విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఇంతచేసినా కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లటమే కాకుండా అధినేతపై చేసిన విమర్శలు టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
 
దూకుడు మనస్తత్వం, నోటి దురుసు.. రెండు కూడా నానికి రాజకీయంగా క్రేజ్ ను సంపాదించి పెట్టగా....రెండోవైపు అదే స్థాయిలో నష్టాన్ని కూడా తెచ్చిపెట్టాయి. అనుచరవర్గం తెలుగుదేశంలోకి వెళ్లాలని బలంగా కోరుతుండగా, వచ్చేందుకు మాత్రం తెలుగుదేశం నేతలు ససేమిరా అంటున్నారు. విచిత్ర పరిస్థితుల్లో గుడివాడ నాలుగు రోడ్ల కూడలిలో నాని నిలబడిపోయారు. అందుకే రాజకీయ నాయకులకు మాట పెదవి దాటకూడదంటారు. పెదవి దాటని మాట మన సొంతం.. పెదవి దాటిన మాట ప్రజల్లో వెళుతోంది. అదే శాపమై మారుతుంది.

 

Link to comment
Share on other sites

అందుకే రాజకీయ నాయకులకు మాట పెదవి దాటకూడదంటారు. పెదవి దాటని మాట మన సొంతం.. పెదవి దాటిన మాట ప్రజల్లో వెళుతోంది. అదే శాపమై మారుతుంది.

Link to comment
Share on other sites

Keelaka neta ante vallabhaneni vamsi aa?

 

Vallabhaneni vamsi tho roju mandu bheti untundi kada.. Kothaga bheti em untundi.

 

Ee XX gaallani dooramga unchatame better

Link to comment
Share on other sites

అందుకే రాజకీయ నాయకులకు మాట పెదవి దాటకూడదంటారు. పెదవి దాటని మాట మన సొంతం.. పెదవి దాటిన మాట ప్రజల్లో వెళుతోంది. అదే శాపమై మారుతుంది.

Link to comment
Share on other sites

vamsi ni endhuku dhooram ga unchali bro

nenu dooram ga unchaali ani ekkada annanu.

 

Adigaaru kabatti cheptunna... Entho mandini edavalni bharistunnamu.. eedu kooda vaallalo okadu  anukoni sardukupovatame.

 

Gati leka undipoyaadu kaani.. ye maathram chance unna first goda dooke candidates list lo veedu kooda untaadu.

Link to comment
Share on other sites

veenni teesu kuntey - inka CBN gaaru oka saari paiki choosi - yaak thupuk anukovadam better - Nani gaadu kharcheef isthaadu - eee nani gaadu - monnati ki monna - assembly lo kooda annaadu - NTR ni champinollu sir veellu - eelu pedda yedhavalu sir ani - Veenni ranivvadam antey CBN garu deni ki ayinaa ready anna maatey - intha kannaa rajakeeya vyabhichaaram inkoti vundadu -  :buttkick:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...