Jump to content

Vijayawada- Amaravati seed capital access way


Recommended Posts

  • 4 weeks later...
ఆ దారి రహదారి
 
636052645635168055.jpg
  • రాజధానికి 4 లేన్లు కాదు.. 8 లేన్ల రోడ్డు 
  • మధ్యలో మెట్రో రైలు కోసం స్థలం 
  • తొలి దశలో 18.3 కి.మీ రోడ్డు 
  • ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయం 
  • బెజవాడ ఇన్నర్‌ రింగ్‌కు ప్రారంభోత్సవం 
  • ఐకానిక్‌ వంతెన నిర్మాణం: చంద్రబాబు 

అమరావతి, జూలై 27, (ఆంధ్రజ్యోతి): అటు నాలుగు వరుసలు.. ఇటు నాలుగు వరుసలు! మొత్తం 200 అడుగుల వెడల్పు రోడ్డు. మధ్యలో మెట్రో కోసం కొంత స్థలం కేటాయింపు. అటూ ఇటూ పచ్చదనానికి మరికొంత స్థలం. పాదచారులకు, సైక్లింగ్‌ చేసేవారికి ప్రత్యేకమైన ట్రాక్‌లు!! వెరసి.. రాజధాని దారి.. ఎనిమిది వరుసల రహదారిగా ఉండబోతోంది!! రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు సంబంధించి అటూ, ఇటూ రెండు వరుసల చొప్పున మొత్తం నాలుగు వరుసల రహదారి వేయాలని ఇన్నాళ్లూ భావించారు. ఈ మేరకు టెండర్లు పిలిచి రూ.206 కోట్లకుఎన్‌సీసీకి కాంట్రాక్టు కూడా ఇచ్చారు. అయితే, దీన్ని 8 లేన్‌ వేగా తీర్చిదిద్దాలని సీఎం బుధవారం నిర్ణయించారు. అదనపు నాలుగు లేన్ల కోసం అవసరమైన టెండర్లు పిలవాలని ఆదేశించారు. 9 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. ఈ రోడ్డు చూస్తే రాజధాని భవిష్యత్తు అర్థం కావాలని అభిప్రాయపడ్డారు. కాగా.. తొలిదశలో ఉండవల్లి నుంచి దొండపాడు వరకు 18.3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మిస్తారు. ఈ రహదారి మధ్యలో 16.3 కిలోమీటర్ల స్థలం వదిలేస్తారు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణానికి దీన్ని ఉపయోగిస్తారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు రెండో ప్యాకేజీలో భాగంగా 3.2 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారు. ఈ రోడ్డు మార్గంలో కృష్ణా డెల్టా పశ్చిమ కాలువ ఉంది. దీనిపై నిర్మించే ఎలివేటెడ్‌ హైవే(ఫ్లైఓవర్‌) 1.5 కిలోమీటర్లు ఉంటుంది. కాలువపై నిర్మించే వంతెన ఐకానిక్‌గా ఉండాలని సీఎం సూచించారు. మరికొన్ని నెలల్లో ఈ ప్యాకేజీకి కూడా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారని సీసీడీఎంసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి పేర్కొన్నారు.

 

  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సీడ్‌ క్యాపిటల్‌ సంధానం 

‘‘రాజధాని అమరావతిలో బెజవాడ కేంద్ర బిందువుగా ఉండేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం. జీవనది కృష్ణా నదికి ఆనుకొని ఉండటంతోపాటు నగరంలో మూడు కాల్వలు ప్రవహిస్తున్నాయి. వీటితో ప్రపంచంలోనే సుందర నగరంగా బెజవాడను తీర్చిదిద్దవచ్చు’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ నగరానికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న.. రూ.123.35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అమరావతి రాజధాని సీడ్‌ క్యాపిటల్‌ను ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానం చేస్తామని.. దాని ద్వారా నేరుగా రాజధానికి చేరుకోవచ్చని వెల్లడించారు. ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల గురించి ప్రస్తావించిన సీఎం..సందండంతా బెజవాడలోనే ఉంటుందన్నారు. నగరంలోని ప్రతి ఇల్లూ పుష్కర యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

 

 
Link to comment
Share on other sites

Gateway.jpg

అమరావతిలో రోడ్లు, మెట్రో నిర్మిస్తాం
 
  • చైనా, బ్రిటన కంపెనీల ఆసక్తి 
  • సీఎం చంద్రబాబుకు లేఖ 
 
అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిలో అంతర్గత రోడ్లు, విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు నిర్మాణానికి చైనా, బ్రిటన కంపెనీలు సంయుక్తంగా ఆసక్తి చూపించాయి. చైనాకు చెందిన సీఆర్‌-3 కంపెనీ, బ్రిటనకు చెందిన సైనోఫోర్టోన కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్టులు చేపడతామని ప్రతిపాదించాయి. త్వరలోనే తమ బృందాన్ని అమరావతికి పంపించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబు కొన్ని నెలల క్రితం చైనా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద 500 కంపెనీల్లో 71వ స్థానంలో ఉన్న చైనా రైల్వేనెంబర్‌-3(సీఆర్‌-3) ఇంజనీరింగ్‌ కంపెనీని సందర్శించారు.
 
ఏపీలో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. అనంతరం సీఆర్‌-3 కంపెనీ.. బ్రిటనకు చెందిన సైనోఫోర్టోన కంపెనీలు సంయుక్తంగా సీఎం చంద్రబాబుకు ఇటీవల ఒక లేఖ రాశాయి. ఏపీకి సంబంధించి రెండు ప్రాజెక్టులపై తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నాయి. అమరావతిలో అంతర్గత రోడ్లు, ఇబ్రహీంపట్నం దగ్గరి నుంచి రాజధానికి కృష్ణానదిపై నిర్మించే వంతెన.. విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో ప్రాజెక్టులపై ఆసక్తిగా ఉన్నట్టు తెలిపాయి. సైనోఫోర్టోన కంపె నీ బ్రిటనతో పాటు చైనాలోను పలు ప్రభు త్వ పనులను చేస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం విజయవాడ మెట్రోను కేంద్ర ప్రభుత్వ నిధులతోను, విశాఖపట్నం మెట్రోను పీపీపీ పద్ధతిలోను నిర్మించే ఆలోచనలో ఉంది. మరోవైపు ఇబ్రహీంపట్నం-గొల్లపూడి నుంచి కొత్త రాజధాని అమరావతికి నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఈ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి.
 
అంతర్గత రోడ్ల నిర్మాణంపైనా తాము ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. ఈ కంపెనీల ప్రతిపాదనపై పరిశీలించాలని సీఎం చంద్రబాబు మెట్రో కార్పొరేషన, సీసీడీఎంసీలకు సూచించారు. మరోవైపు ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు అమరావతికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీల ప్రతినిధులను కోరింది. త్వరలోనే తమ కంపెనీల తరఫున నిపుణుల బృందాన్ని పంపిస్తామని సదరు కంపెనీలు పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Seed capital access road okkatey start chesthunnaru. Aa tharvatha aa migilina roads vestham annaru

మౌలికమే ముఖ్యం...

‘‘రాజధాని నిర్మిస్తారనే నమ్మకం మాకుంది. కానీ, జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రం తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. సకాలంలో రాజధాని పూర్తి కావాలంటే మౌలిక వసతులు మొట్టమొదట అవసరం. రెండు మూడేళ్లలో రోడ్లు పూర్తి చేయాలి’’ అని రాజధాని ప్రాంత రైతు బెల్లంకొండ నరసింహారావు పేర్కొన్నారు. శ్రీధర్‌ స్పందిస్తూ... ‘‘రాజధాని పరిధిలో తాగునీరు, మురుగునీరు, భూగర్భ విద్యుత లైన్లు ఏ గ్రామంలో ఎంత లోతులో ఏర్పాటు చేయాలనే సవివరమైన ప్రణాళిక పూర్తయింది’’ అని తెలిపారు. అంతేకాదు... రాజధాని చుట్టూ మొత్తం 90 కిలోమీటర్ల పొడవునా 8 రోడ్లు నిర్మిస్తామన్నారు. ‘‘ఇందులో నాలుగు 8 లైన్ల రహదారులు. మరో నాలుగు ఫోన్‌లైన్‌ రోడ్లు. ఫోర్‌లైన్‌ రోడ్లను కూడా భవిష్యత్తులో 8 లైన్లుగా మార్చే వెసులుబాటు ఉంటుంది. మొత్తం 1300 కోట్లతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. వీటికి సంబంధించి డిటైల్డ్‌ ఇంజనీరింగ్‌ పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలుస్తాం’’ అని శ్రీధర్‌ వివరించారు. పనులు ప్రారంభమైన తర్వాత 8 నెలల నుంచి ఏడాదిలోపే రోడ్ల పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కీలక రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే ఈ రహదారుల్లో (సీడ్‌ యాక్సెస్‌ రోడ్స్‌) మూడు నార్త్‌-సౌత, నాలుగు ఈస్ట్‌-వెస్ట్‌ దిశల్లో సాగుతాయన్నారు. ఈ రహదారుల్లో ఒకదాని గరిష్ఠ పొడవు 22 కిలోమీటర్లు అని శ్రీధర్‌ చెప్పారు.
 

ఇప్పటి నుంచే జాగ్రత్త

రోడ్లపై వర్షపు నీరు నిలబడకుండా ‘స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్స్‌’ను ఇప్పుడే నిర్మించాలని ప్రొఫెసర్‌ పాండురంగారావు సూచించారు. శ్రీధర్‌ స్పందిస్తూ... ఎలాంటి వాతావరణంలోనైనా మనగలిగే (ఆల్‌ వెదర్‌) విధంగా రహదారులు నిర్మిస్తామన్నారు. ‘‘ రోడ్ల నిర్మాణంతోపాటు వర్షపు నీరు తరలే వ్యవస్థను కూడా సమాంతరంగా చేపడతాం’’ అని తెలిపారు. అదే సమయంలో... ప్రతి రోడ్డు కింద సొరంగాలు నిర్మించి... వేర్వేరు స్థాయుల్లో కేబుల్స్‌, మంచినీటి పైప్‌లైన్లు, మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ‘మార్కెట్‌ రోడ్స్‌’ కూడా ప్లాన్‌ చేశామన్నారు. ‘‘రైతులకు ఇచ్చిన ప్లాట్లలోనే ఇవి ఏర్పాటవుతాయి. వాటిని వాకిన్‌ మార్కెట్స్‌ అంటారు. ఇందులో 50 శాతం రహదారి, 50 శాతం ఫుట్‌పాత ఉంటుంది’’ అని తెలిపారు. అలాగే... 62 ఎకరాలను ఒక గ్రిడ్‌గా ఏర్పాటు చేస్తున్నామని... ప్రతి గ్రిడ్‌లో ఒక స్కూలు, ఆస్పత్రి, మార్కెట్‌ వంటివి వస్తాయని శ్రీధర్‌ వివరించారు.
Link to comment
Share on other sites

 

మౌలికమే ముఖ్యం...

‘‘రాజధాని నిర్మిస్తారనే నమ్మకం మాకుంది. కానీ, జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రం తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. సకాలంలో రాజధాని పూర్తి కావాలంటే మౌలిక వసతులు మొట్టమొదట అవసరం. రెండు మూడేళ్లలో రోడ్లు పూర్తి చేయాలి’’ అని రాజధాని ప్రాంత రైతు బెల్లంకొండ నరసింహారావు పేర్కొన్నారు. శ్రీధర్‌ స్పందిస్తూ... ‘‘రాజధాని పరిధిలో తాగునీరు, మురుగునీరు, భూగర్భ విద్యుత లైన్లు ఏ గ్రామంలో ఎంత లోతులో ఏర్పాటు చేయాలనే సవివరమైన ప్రణాళిక పూర్తయింది’’ అని తెలిపారు. అంతేకాదు... రాజధాని చుట్టూ మొత్తం 90 కిలోమీటర్ల పొడవునా 8 రోడ్లు నిర్మిస్తామన్నారు. ‘‘ఇందులో నాలుగు 8 లైన్ల రహదారులు. మరో నాలుగు ఫోన్‌లైన్‌ రోడ్లు. ఫోర్‌లైన్‌ రోడ్లను కూడా భవిష్యత్తులో 8 లైన్లుగా మార్చే వెసులుబాటు ఉంటుంది. మొత్తం 1300 కోట్లతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. వీటికి సంబంధించి డిటైల్డ్‌ ఇంజనీరింగ్‌ పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలుస్తాం’’ అని శ్రీధర్‌ వివరించారు. పనులు ప్రారంభమైన తర్వాత 8 నెలల నుంచి ఏడాదిలోపే రోడ్ల పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కీలక రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే ఈ రహదారుల్లో (సీడ్‌ యాక్సెస్‌ రోడ్స్‌) మూడు నార్త్‌-సౌత, నాలుగు ఈస్ట్‌-వెస్ట్‌ దిశల్లో సాగుతాయన్నారు. ఈ రహదారుల్లో ఒకదాని గరిష్ఠ పొడవు 22 కిలోమీటర్లు అని శ్రీధర్‌ చెప్పారు.

 

 

ఇప్పటి నుంచే జాగ్రత్త

రోడ్లపై వర్షపు నీరు నిలబడకుండా ‘స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్స్‌’ను ఇప్పుడే నిర్మించాలని ప్రొఫెసర్‌ పాండురంగారావు సూచించారు. శ్రీధర్‌ స్పందిస్తూ... ఎలాంటి వాతావరణంలోనైనా మనగలిగే (ఆల్‌ వెదర్‌) విధంగా రహదారులు నిర్మిస్తామన్నారు. ‘‘ రోడ్ల నిర్మాణంతోపాటు వర్షపు నీరు తరలే వ్యవస్థను కూడా సమాంతరంగా చేపడతాం’’ అని తెలిపారు. అదే సమయంలో... ప్రతి రోడ్డు కింద సొరంగాలు నిర్మించి... వేర్వేరు స్థాయుల్లో కేబుల్స్‌, మంచినీటి పైప్‌లైన్లు, మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ‘మార్కెట్‌ రోడ్స్‌’ కూడా ప్లాన్‌ చేశామన్నారు. ‘‘రైతులకు ఇచ్చిన ప్లాట్లలోనే ఇవి ఏర్పాటవుతాయి. వాటిని వాకిన్‌ మార్కెట్స్‌ అంటారు. ఇందులో 50 శాతం రహదారి, 50 శాతం ఫుట్‌పాత ఉంటుంది’’ అని తెలిపారు. అలాగే... 62 ఎకరాలను ఒక గ్రిడ్‌గా ఏర్పాటు చేస్తున్నామని... ప్రతి గ్రిడ్‌లో ఒక స్కూలు, ఆస్పత్రి, మార్కెట్‌ వంటివి వస్తాయని శ్రీధర్‌ వివరించారు.

Watching all videos from the debate :cheers:
Link to comment
Share on other sites

  • 2 weeks later...

రాజధాని దారి రహదారి

6 వరుసల రహదారులు మూడు

మిగతావి 4 వరుసలుగా...

అమరావతి నిర్మాణంలో విద్యార్థులనూ భాగస్వాములను చేయండి

మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడకూడదు: చంద్రబాబు

ఈనాడు - అమరావతి

1ap-main5a.jpg

రాజధాని అమరావతిలో వేసే ఏడు ప్రధాన రహదారుల్లో మూడింటిని ఆరు వరుసల రహదారులుగా, మిగతావి నాలుగు వరుసల రహదారులుగా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధాని పనుల పురోగతిని ఆయన శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఇకపై ప్రతి బుధవారం అమరావతి నిర్మాణ పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. రాజధానిలో రహదారులు ఎంత ఎత్తు(కాంటూర్‌ లెవెల్స్‌) ఉండాలో నిర్ణయించేందుకు, కొండవీటి వాగు వరద నియంత్రణ, రాజధానిలో జల మార్గాలు, కాలువల అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల కోసం ‘బ్లూ కన్సల్టెంట్‌’గా నియమించిన ఆర్కాడిస్‌-టాటా సంస్థ నివేదిక ఇవ్వనుందని, అది అందగానే ఏడు రహదారులకు టెండర్లు పిలుస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని, అత్యుత్తమ ఆర్కిటెక్ట్‌ల సహకారంతో భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ‘‘రాజధాని నిర్మాణ ప్రక్రియలో చుట్టుపక్కల ఉన్న కళాశాలల్లోని ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులను భాగస్వాములను చేయాలి. ఇంత భారీ ప్రాజెక్టు నుంచి వారు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన చోట విద్యార్థుల సేవలనూ వినియోగించుకోవాలి. రాజధాని సలహా కమిటీ సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాల నాణ్యతలో రాజీ పడకూడదు. అమరావతి నిర్మాణం స్థిరాస్తివ్యాపారంలా ఉండరాదు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి జరగాలన్నదే లక్ష్యం. రాజధాని నిర్మాణంలో పురోగతిని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించడం ద్వారా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి’’ అని ఆదేశించారు. అమరావతిలో కాలుష్య రహిత రవాణా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు తెలిపారు. నిర్మాణ వ్యవహారాల్లో ప్రజలనూ భాగస్వాములను చేయాలన్నారు. వెలగపూడిలోని సచివాలయం పనుల పురోగతినీ సమీక్షించారు.

రోడ్లను పదేపదే తవ్వే పరిస్థితి ఉండకూడదన్నారు: నారాయణ.. రాజధానిలో రహదారుల నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రధానంగా సమీక్షించారని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ‘‘నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్కాడిస్‌, టాటా గ్రూపుల సంయుక్త భాగస్వామ్య కంపెనీని ‘బ్లూ కన్సల్టెంట్‌’గా ఎంపిక చేశాం. నెదర్లాండ్స్‌లో 65 శాతం భూభాగం సముద్రమట్టానికి దిగువన ఉంటుంది. వరదల నియంత్రణలో వాళ్లు నిపుణులు. ఆ కన్సల్టెన్సీ ప్రతినిధులు సీఆర్‌డీఏ, నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. రాజధానిలో ఏ రహదారుల ఎత్తు ఎంతుండాలో గతంలో వచ్చిన వరదల వివరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తారు. అక్టోబరు 7కు ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ వెంటనే ఏడు ప్రధాన రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. కొండవీటివాగు, పాలవాగు వరద నియంత్రణకు సంబంధించిన డిజైన్లు, భారీ వర్షాలు కురిసినా ఎక్కడా నీరు నిలవకుండా బయటకు పంపించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపైనా వాళ్లే సూచనలు ఇస్తారు. రహదారులు నిర్మించే క్రమంలో తాగునీరు, విద్యుత్‌ సరఫరా, వర్షపు నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను సమీకృతం చేసుకుని ముందుకెళ్లాలని, రోడ్లను పదేపదే తవ్వే పరిస్థితులు ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు’’ అని నారాయణ తెలిపారు.

రాజధానిలో పనుల పురోగతిని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సమావేశంలో వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సతీష్‌ చంద్ర, సాయిప్రసాద్‌, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లు మల్లికార్జున, రామమనోహర్‌రావు, చైనాకు చెందిన జీఐఐసీ ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు.

1ap-main5b.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Andhra Pradesh government has decided to construct an eight lane road between Amaravati and Vijayawada. According to plan, it is four lane road from Kanakadurga Varadhi to Amaravati. Later it is changed to six lane, but finally decided to go with eight lane road, with the instructions of Chief Minister.


The Amaravati Development Board and Capital Regional Development Authority, with the help of IIT - Madras are planning for the design.


 

This is named as seed axis road, as it is the main entrance for the capital Amaravati. Already the works has been started with a cost estimate of Rs.600 crores, which would be completed in two phases, including an iconic flyover. The first phase would be between Dondapaadu and Undavalli, and these works are already started. The second phase, would be between Undavalli and Kanakadurga Varadhi.


According to the new plan, CRDA has to acquire more land and also a tunnel road would be required at Seethanagaram Hill. The first phase is going to be completed within 6 months and immediately the second phase of road works would be taken.


Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...