Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
కృష్ణా నదిలో జలక్రీడలు
 
636198649745731133.jpg
  • ఫిబ్రవరి 2 నుంచి నేవల్‌ ప్రదర్శన
  • 4 నుంచి 6దాకా గ్లోబల్‌ డాన్స-మ్యూజికల్‌ ఫెస్టివల్‌
  • ప్రజల బ్యాటరీ చార్జింగ్‌ కోసమే ఇవన్నీ: బాబు
  • విజయవాడ పున్నమిఘాట్‌లో ఎయిర్‌షో ప్రారంభం
విజయవాడ/విద్యాధరపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘భవిష్యత్తులో బెజవాడ మంచి ఆతిథేయి (హోస్ట్‌)గా తయారుకావాలి. రాబోయే రోజుల్లో కృష్ణా నదిలో జలక్రీడలు (వాటర్‌ స్పోర్ట్స్‌) నిర్వహిస్తాం. ఫిబ్రవరి 2 నుంచి ఐదో తేదీ వరకు ఇక్కడే నేవల్‌ షో నిర్వహిస్తున్నాం. ఇక నుంచి ప్రతి నెలా ఓ ఈవెంట్‌ జరుగుతుంది. ప్రజలంతా శారీరక ఆరోగ్యంతో ఆనందంగా గడపాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మూడు రోజులపాటు విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరిగే ఎయిర్‌ షోను చంద్రబాబు ప్రారంభించారు. ఆరు విమానాల్లో పైలట్లు చేసిన విన్యాసాలను వీక్షించారు. ‘హ్యాపీ సండేను మొదలుపెట్టి పైసా ఖర్చు లేకుండా ప్రజల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాం. ఇటీవల నిర్వహించిన మారథానలో 12 వేల మందికి పైగా పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఇరవై వేల మంది పాల్గొంటారు.
 
పవిత్ర సంగమం దగ్గర అద్భుత విన్యాసాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. రూ.2.30 కోట్లతో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నాం. అమరావతిని టూరిజం హబ్‌గా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చే నెలలో మహిళా పార్లమెంటును పవిత్ర సంగమం దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఫిబ్రవరి నాలుగు నుంచి ఆరో తేదీ వరకు అమరావతి గ్లోబల్‌ డ్యాన్స అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నాం. మీ మైండ్‌, బ్యాటరీ చార్జింగ్‌ చేయడానికే నేను ఈవెంట్స్‌ ఏర్పాటు చేస్తున్నా’ అని అనడంతో వీక్షకులు పెద్దగా నవ్వారు. కార్యక్రమంలో పౌరవిమానయాన శాఖ కార్యదర్శి సౌబే, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు కామినేని శ్రీనివాస్‌, ప్రత్తిపాటి పుల్లారావు, జడ్పీ చైర్‌పర్సన గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.
RAF_5317.jpg air-show.jpg
Link to comment
Share on other sites

నావికా దళం ముందస్తు విన్యాసాలు

సందడిగా నదీ తీరం... మరో రెండు రోజులు కొనసాగింపు

amr-gen3a.jpg

విజ‌య‌వాడ‌: నగర ప్రజలను అలరించేందుకు మరొక సారి నదీ తీరం వేదికైంది. భారత నావికా దళం కృష్ణా నదిపై ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నావికా విన్యాసాలను చేయనుంది. పున్నమి, భవానీ స్నాన ఘాట్‌ల వేదికగా విన్యాసాలు జరగనున్నాయి. అందులో భాగంగా సోమవారం ముందస్తు విన్యాసాలు ప్రారంభించారు. మరో రెండు రోజుల పాటు రిహార్సల్స్‌ కొనసాగుతాయి. మొదటి రోజున తెర చాప, జెమిని బోట్లతో విన్యాసాలు చేపట్టారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సిబ్బంది రాకతో పున్నమి ఘాట్‌ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. మొత్తం 300 మంది ఇందులో పాలుపంచుకోనున్నారు. నావికా దళం స్పెషల్‌ఫోర్స్‌, మెరైన్‌ కమెండోలు, డ్రైవర్లు, విభాగ అధిపతులు కూడా నగరానికి రానున్నారు. ఇప్పటికే అనేక మంది చేరుకోగా, మరికొందరు రెండు రోజుల్లో చేరుకోనున్నారు. వారంతా పర్యాటకశాఖకు చెందిన భవానీ ద్వీపం, పున్నమి కాటేజీల్లో బస చేయనున్నారు.

వేదిక సిద్ధం

నావికా దళ సిబ్బంది ఎప్పుడూ విశాఖపట్నం వేదికగా సముద్రంలోనే విన్యాసాలు చేస్తుంటారు. నదులపై అరుదుగా చేస్తుంటారు. అయితే ఇక్కడి వాతావరణం అలవాటు పడేందుకు వీలుగా మూడు రోజుల పాటు రిహార్సల్స్‌ చేయనున్నారు. తెరచాప బోట్లు 20, జెమినీ బోట్లు 12 వచ్చాయి. మంగళ, బుధవారాల్లో మరికొన్ని బోట్లు, హెలికాఫ్టర్లతో రిహార్సల్స్‌ చేయనున్నారు. పున్నమి ఘాట్‌లో స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి. 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు హాజరయ్యే అవకాశం ఉండటంతో వేదికను కూడా సిద్ధం చేస్తున్నారు.

అధికారుల భాగస్వామ్యం

నావికా విన్యాసాలు విజయవంతం కావడానికి వివిధ శాఖల అధికారులను భాగస్వామ్యం చేశారు. పర్యాటకశాఖ, జలవనరుల శాఖ, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపకశాఖ, తాడేపల్లిలోని పీడబ్ల్యూడీ వర్క్‌షాపు తదితర శాఖల వారికి బాధ్యతలు అప్పగించారు. విన్యాసాలను తిలకించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేల మంది వచ్చినా కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నావికాదళానికి చెందిన ఏపీ ఇన్‌ఛార్జి కమడోర్‌ ఇస్సర్‌, విన్యాసాల కోఆర్డినేటర్‌ సుజిత్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...