Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
సప్త సమ్మోహనం
23-11-2018 09:16:06
 
636785613682110432.jpg
  • పావుగంట నిడివి.. ఏడు ప్రదర్శనాంశాలు
  • గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌ ఎయిర్‌ షో విన్యాసాలు
  • వీక్షకుల కోసం ప్రత్యేకంగా లవ్‌ సింబల్‌
  • నేటి నుంచి కృష్ణా తీరాన ఎయిర్‌ షో - 2018
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): ఏడు అద్భుతాలు.. పావుగంట నిడివిలో ‘సెవన్‌ వండర్స్‌’ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి.. ఒక్కో విన్యాసం ఒక్కో ప్రత్యేకత! వీక్షకులను కట్టిపడేసాలా.. ఊపిరి బిగబట్టి.. రోమాలు నిక్కబొడుచుకునేలా విన్యాసాలు ఆవిష్కృతం కానున్నాయి. నేటినుంచి ప్రారంభం కానున్న అమరావతి ఎయిర్‌ షో-2018లో ‘గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌’ విన్యాసాలు ఆషామాషీ కావు. ఏరోబాటిక్‌ ఫ్లయింగ్‌ డిస్‌ప్లేలో అద్భుతమైన విన్యాసాలుగా పేరుగాంచిన వాటిని కెప్టెన్‌ మార్క్‌ జెఫ్రీస్‌ నాయకత్వంలోని టామ్‌ క్యాసెల్స్‌ , క్రిస్‌ బర్కెట్‌, స్టీవ్‌ కార్వర్‌లు ప్రదర్శించనున్నారు.
 
నేటినుంచి మూడురోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో 15 నిమిషాల నిడివిలో ప్రధానంగా ఏడు ప్రదర్శనాంశాలుంటాయి. అవి ఎయిర్‌ డిస్‌ప్లే ఫార్మేషన్‌, సోలో ఎయిర్‌ డిస్‌ప్లే, బారెల్‌ రోల్స్‌ డిస్‌ప్లే, క్యూబన్స్‌ ఏరోబాటిక్‌ డిస్‌ప్లే, టర్న్స్‌ ఏరోబాటిక్‌ డిస్‌ప్లే, లవ్‌ సింబల్‌ డిస్‌ప్లే వంటి అంశాలు. గన్నవరంలోని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్‌ తీసుకున్నది మొదలు గంటకు కనిష్టంగా 250 కిలోమీటర్ల వే గం నుంచి గరిష్టంగా 450కిలో మీటర్ల వేగంతో నాలుగు ఏరోబాటిక్‌ విమానాలు సామూహికంగా, వ్యక్తిగతంగా విన్యాసాలు చేస్తాయి.
 
ఎయిర్‌ డిస్‌ప్లే ఫార్మేషన్‌
4wrW.jpgసాధారణ విన్యాసం. క్రమపద్ధతిలో నాలుగు విమానాలు నిర్ణీత దూరాన్ని మెయింటెయిన్‌ చేస్తూ అతిదగ్గరగా కలిసి ఎగురుతాయి. కృష్ణానది గగనతలం మీదుగా విమానాలు డైమండ్‌ ఆకారంలో, వీ ఆకారంలో తిరుగుతాయి. తొలుత వ్యాసార్ధ కోణంలో, తర్వాత పైకి, కిందకు అంతే క్రమపద్ధతిలో ముందుకు సాగుతాయి. రెండు నిమషాలు తర్వాత విమానాలు విడిపోతాయి.
 
బారెల్స్‌ రోల్స్‌ డిస్‌ప్లే
EFEFDFas.jpgఇది అద్భుత విన్యాసం. దీనిని నాలుగు విమానాలు కలిసి చేస్తాయి. గ్రేటర్‌ దేన్‌ ఆకారంలో విమానాలు పొజిషన్‌ తీసుకుంటాయి. నాలుగు విమానాలు ఈ విన్యాసాన్ని చేయటానికి నది గగనతలంలో రౌండ్లు వేస్తాయి. నది మధ్యకు రాగానే ఒక్కసారిగా రంగురంగుల పొగను వెదజల్లుతూ పైకి దూసుకుపోతాయి.. అంతే వేగంతో మళ్లీ నదిలోకి దూకుతున్నట్టుగా పొజిషన్‌ మార్పుకుని కిందకు దూసుకువస్తాయి. మళ్లీ వెంటనే పైకి లేస్తాయి. ఈ విన్యాసాలలో విమానాలు అత్యంత దగ్గరగా వస్తాయి.
 
సోలో ఎయిర్‌ డిస్‌ప్లే
RAWERFWEDFWF.jpgపార్మేషన్‌ డిస్‌ప్లేలో విడిపోయిన నాలుగు విమానాల పైలట్లు సోలోగా విన్యాసాలు చేస్తారు. ఒకరు విమానాన్ని అమాంతం రాకెట్‌ మాదిరి ఆకాశంలోకి నిటారుగా పొగ వెదజల్లుతూ తీసుకు వెళతారు. ఆకాశాన్ని చీల్చినట్టుగా పైకి వెళ్ళిన తర్వాత విమానం కిందకు పడిపోతున్న భ్రమ కలిగించేలా అడ్డదిడ్డంగా చక్కెర్లు కొట్టిస్తారు. ఆ తర్వాత సాధారణ స్థితికి తీసుకు వచ్చి రింగురింగులుగా విమానాన్ని నడుపుతారు.
 
క్యూబన్స్‌ ఏరోబాటిక్‌ డిస్‌ప్లే
AScas.jpgక్యూబన్స్‌ ఏరోబాటిక్‌ డిస్‌ప్లే ప్రత్యేకంగా ఉంటుంది. ఒక దానిమీద ఒకటి ఉన్నట్టుగా భ్రమ కలిగిస్తారు. మరో విమానం దానికి ఎత్తున, ఇంకో విమానం దానికి ఎత్తున నిలిచి తాడును ఊపితే ఎలా కదులుతాయో ఇవి గగనతలంలో అలా విన్యాసాలు చేస్తాయి. వీక్షకులకు అతిదగ్గరగా విమానాలు వస్తాయి.
 
లూప్‌ ఎయిర్‌ డిస్‌ప్లే
aweawefef.jpgఈ విన్యాసంలో విమానాలు తలకిందులుగా ఎగురుతాయి. నాలుగు విమానాలు గ్రూపుగా, విడిపోయి ఇలా తలకిందులుగా విన్యాసాలు చేస్తాయి. మళ్ళీ పొజిషన్‌ మార్చుకుని సాధారణ స్థితికి వస్తాయి. రంగుల పొగను వెదజల్లుతూ ముందుకు దూసుకు వెళతాయి. వీటిలో ఒక విమానం విడిపోయి.. మిగిలిన విమానాలు వదిలే పొగను తాను వదిలే పొగతో తాడుతో కట్టినట్టుగా చేస్తుంది.
 
వీక్షకులకు ప్రేమతో..
aefsdf.jpgఎయిర్‌ షో వీక్షించటానికి వచ్చే వేలాది మంది వీక్షకులకు ప్రేమతో ‘గ్లోబల్‌ స్టార్స్‌ టీమ్‌’ షెడ్యూల్‌లో లేకపోయినా ఒక ప్రదర్శనను చేర్చింది. అదే లవ్‌ సింబల్‌ డిస్‌ప్లే! వీక్షకుల కోసం నాలుగు విమానాలు నాలుగు దిశల నుంచి వస్తూ రెండు లవ్‌ సింబల్స్‌ను తమ రంగుల పొగతో ఆవిష్కృతం చేసి తిరుగు ముఖం పడుతాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...