Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
కృష్ణానదిలో చక్కర్లు కొట్టిన బస్‌ బోట్
19-03-2018 08:08:53
 
636570437323682146.jpg
విజయవాడ: పర్యాటకులకు మజానిచ్చే జెట్‌ స్పీడ్‌ బస్‌ బోట్‌ కృష్ణానదిలో చక్కర్లు కొట్టింది. కొద్దిరోజుల నుంచి నిర్వహిస్తున్న ట్రయల్‌ రన్‌ విజయవంతంగా ముగియటంతో ఆదివారం పర్యాటకశాఖ ఈ బోటును ప్రారంబించింది. రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్‌ జయరామిరెడ్డి ప్రారంభించారు. రూ. 1.17 కోట్లతో కొనుగోలు చేసిన ఈ లగ్జరీ క్రూయిజ్‌ చూడటానికి జలాంతర్గామిలా, లోపల బస్సులా ఉంటుంది. ఏపీటీడీసీ దీనిని బెంగళూరు నుంచి కొనుగోలు చేసింది. ఏసీ, లగ్జరీ సీటింగ్‌, ఆడియో, వీడియోకోచ్‌ సదుపాయాలు ఉన్నాయి. పై భాగంలో గ్లాస్‌ ఉంటుంది. సోమవారం నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.
 
భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేస్తాం : పర్యాటక శాఖ
భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఎండీ శుక్లా, చైర్మన్‌ జయరామిరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం భవానీ ఐలెండ్‌ వద్ద బస్‌బోటు, లగ్జరీ బోటు, భవానీ ఐలాండ్‌ లోపల కొత్తగా నిర్మించిన రెస్టారెంట్‌, బ్యాటరీ వాహనాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ జయరామిరెడ్డి మాట్లాడుతూ భవానీ ఐలాండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టిసారించిందని చెప్పారు. ఎండీ శుక్లా మాట్లాడుతూ గత ఏడాది 95 శాతం అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. పర్యాటక శాఖ సిబ్బంది సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి జలాల్లో ‘ఫార్ములా1’
26-03-2018 02:19:17
 
636576275539303810.jpg
  • రాజధానిలో ‘ఎఫ్‌1హెచ్‌2వో’ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌
  • భవానీ ఐలాండ్‌కు ఎఫ్‌1హెచ్‌2వో ప్రతినిధులు ఓకే
  • నవంబరు 22 నుంచి 24 వరకూ పోటీల నిర్వహణ
  • తీవ్రంగా కృషి చేసిన సీఎం..
  • పర్యాటక శాఖకు ప్రతిష్ఠాత్మకం
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు మరో అవకాశం దక్కింది. ఫార్ములా1 పవర్‌బోట్‌ రేసింగ్‌లో ప్రసిద్ధి చెందిన ఎఫ్‌1హెచ్‌2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిచ్చే గొప్ప అవకాశం భారత్‌లోని అనేక నగరాలను కాదని అమరావతికి దక్కింది. అమరావతిలోని భవానీ ఐలాండ్‌లో ‘ఎఫ్‌1హెచ్‌2వో’ ప్రపంచ చాంపియన్‌షి్‌పను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు ఎనిమిది ప్రతిష్ఠాత్మక వేదికల్లో భారత్‌ పేరుని కూడా చేరుస్తూ శనివారం షెడ్యూల్‌ను ప్రకటించారు. 2018 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఎఫ్‌1 వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది. పోర్చుగల్‌, లండన్‌, ఫ్రాన్స్‌, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత్‌కు కూడా చోటు కల్పించారు. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలయ్యే ఈ చాంపియన్‌షిప్‌ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది. నవంబరు 22 నుంచి 24 వరకూ అమరావతి వేదికగా నిలవనుంది. ఇది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అమరావతికి వస్తారు. దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పర్యాటక శాఖ వారికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు స్టార్‌ హోటల్‌ రూమ్స్‌, అంతర్జాతీయ స్థాయి ఫుడ్‌కోర్టులు ఏర్పాటుపై దృష్టిపెట్టింది.
 
చంద్రబాబు కృషి వల్లే..
అంతర్జాతీయ ఎఫ్‌1హెచ్‌2వో చాంపియన్‌షి్‌పను ఏపీకి రప్పించేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేశారు. ఎఫ్‌1హెచ్‌2వో ప్రతినిధులతో ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు చర్చించారు. అమరావతికి ఉన్న విశిష్టిత, ముఖ్యంగా పోటీలు నిర్వహణకు ఉన్న మౌలిక సదుపాయాల గురించి వివరించారు. ఎఫ్‌1హెచ్‌2వో ప్రతినిధులు భవానీ ఐల్యాండ్‌తో పాటు సమీపంలోని 11 ఐల్యాండ్స్‌ను పలుమార్లు పరిశీలించారు. చివరకు శనివారం అమరావతికి ఓకే చెప్పారు. ‘అమరావతిలో అద్భుతమైన 11 ఐల్యాండ్స్‌తో పాటు 23 కిలోమీటర్ల వాటర్‌ స్టోరేజ్‌ ఉంది. ఇది అంతర్జాతీయ వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణకు అనువుగా ఉంటుంది. కాబట్టి మా టీమ్‌ అంతా ఏపీ రాజధాని అమరావతికి వెళ్లేందుకు సిద్ధమయ్యామ’ని పోటీల నిర్వాహకుల్లో ఒకరైన అలెక్స్‌ ప్రకటించారు.
gfxp.jpg 
Link to comment
Share on other sites

  • 4 weeks later...
ఆక్రమణలో ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్స్‌
07-05-2018 08:04:35
 
636612770743400716.jpg
  • కాలి వంతెన మీద బోట్ల కోసం పర్యాటకుల ఎదురుచూపులు
  • ఏపీటీడీసీ ఖాళీ చేయమంటున్నా .. ఖాతరు చేయటం లేదు !
  • గుంటూరు నుంచి వచ్చే పర్యాటకులకు మోటెల్‌ దగ్గర నిత్య నరకం
 
ఈ దృశ్యం చూశారా? కృష్ణవేణి మోటెల్‌ దగ్గర ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌ ఇది! కృష్ణానదిలో కర్రలు కట్టిన చెక్క వంతెన మీద ఎంతమంది పర్యాటకులు బోటు కోసం చూస్తున్నారో చూడండి! ఇది ఏ మాత్రం రక్షణ లేని చెక్క వంతెన! తాడులతో కట్టిన ఈ చెక్క వంతెన ఖర్మకాలి కూలిందా.. ఇక అంతే సంగతులు! ఏపీటీడీసీకి పటిష్టమైన కాంక్రీట్‌ జెట్టీ పాయింట్‌ ఉన్నా ప్రైవేటు బోటింగ్‌ సంస్థ చాంపియన్‌ యాచ్‌ క్లబ్‌ దానిని ఖాళీ చేయటం లేదు. తమ భారీ బోటును ఇక్కడ ఉంచి ఏపీటీడీసీ దీనిని ఉపయోగించుకోనీయకుండా చేస్తోంది. దీంతో ఏపీటీడీసీ గతి లేని పరిస్థితుల్లో ప్రమాదభరితమైన ఈ చెక్క వంతెననే ఉపయోగించుకుంటోంది. ఫలితమే ఈ ప్రమాదకర దృశ్యం !
 
 
విజయవాడ: భవానీ ఐల్యాండ్‌ను దర్శించడానికి గుంటూరు జిల్లా నుంచి వచ్చే పర్యాటకులు కృష్ణవేణి మోటెల్‌ దగ్గర ఉన్న బోటింగ్‌ పాయింట్‌ నుంచే చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌ను ప్రైవేటు బోటింగ్‌ క్లబ్‌ ఆక్రమించటంతో ఏపీటీడీసీ మెకనైజ్డ్‌ బోట్లు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. చెక్క వంతెన మీద ఏపీటీడీసీ స్పీడ్‌ బోట్లకోసం పర్యాటకులు నిరీక్షించాల్సి వస్తోంది. పక్కనే ప్రైవేటు బోటింగ్‌ పాయింట్‌ ఉన్నా.. ధరలు భారీగా ఉంటాయన్న ఉద్దేశంతో ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌కు ఎక్కువ మంది వస్తుంటారు. ఇక్కడి పరిస్థితి దయనీయంగా ఉంది. కృష్ణానదిలో బోటు దుర్ఘటన జరిగిన తర్వాత కూడా ప్రైవేటు బోటింగ్‌ సంస్థల తీరు మారటం లేదు! ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్లను కబ్జా చేసిన ప్రైవేటు సంస్థలు వాటిని ఖాళీ చేయటం లేదు.
 
   కొత్త నిబంధనలు వచ్చినా పట్టించుకోవటం లేదు! ఏపీటీడీసీ అధికారులు పదేపదే ఖాళీ చేయమని చెబుతున్నా తలకెక్కించుకోవటం లేదు. నోటిమాటలు, నోటీసులు ఇవ్వటం కాకుండా బోటింగ్‌ పాయింట్లను స్వాధీనం చేసుకునే పనిని బోటింగ్‌ విబాగ అధికారులు చేపట్టాల్సి ఉంది. కృష్ణానదిలో బోటు ప్రమాదం ఎంత విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే! ప్రైవేటు సంస్థలు నిబంధనలను ఉల్లంఘించటం ద్వారా జరిగిన ప్రమాదం ఇది! ప్రమాదం జరిగిన తర్వాత యంత్రాంగాలన్నీ స్పందించాయి. వాటర్‌ సేఫ్టీకి శ్రీకారం చుట్టాయి. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనేక శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి.
 
  బోట్లకు అనుమతులు ఇచ్చే విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అన్నీ బాగున్నా... ఇదిగో ఇలాంటివి చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఏపీటీడీసీకి చెందిన బోటింగ్‌ పాయింట్లు కాకుండా వారికి నిర్దేశించిన చోట నుంచే బోట్లను నడపాల్సిన ప్రైవేటు సంస్థలు పక్కాగా నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఏపీటీడీసీకి చెందిన బోటింగ్‌ పాయింట్లను ఆక్రమించటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది.
 
భవానీ ఐల్యాండ్‌ టవర్‌ వద్ద..
ఇప్పటికే ఇదే ప్రైవేటు సంస్థ భవానీ ఐల్యాండ్‌ టవర్‌ దగ్గర ఉన్న ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌ను ఆక్రమించుకుంది. ఫలితంగా ఏపీటీడీసీ బోట్లు ఈ వైపుగా రాలేని పరిస్తితి ఏర్పడింది. రెండో మార్గం దగ్గరకు బోట్లను నడపాల్సి వస్తోంది. ఇక్కడ బోటింగ్‌ పాయింట్‌ను ఆక్రమించిన ఇదే సంస్థ మళ్లీ క్రిష్ణవేణి మోటెల్‌ దగ్గర ఉన్న బోటింగ్‌ పాయింట్‌ను కూడా ఆక్రమించింది. మోటల్‌ దగ్గర ఈ సంస్థ రెస్టారెంట్‌ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
 
   మోటెల్‌ దగ్గర బోటింగ్‌ పాయింట్‌ లో పెద్ద బోటును అడ్డంగా ఉంచింది. ఈ బోటును పార్టీలకు అద్దెకు ఇస్తుంది. అలాగే .. బోటు ప్రయాణానికి వచ్చే వారిని ఈ పెద్ద బోటులోకి తీసుకు వెళతారు. పెద్దబోటు వెంబడే మైక నైజ్డ్‌ బోటు ఉంచుతారు. పెద్ద బోటు నుంచి పర్యాటకులను ఈ మెకనైజ్డ్‌ బోటులోకి ఎక్కిస్తారు. బోటింగ్‌ పాయింట్‌ ఆక్రమణలో ఉండటంతో చెక్కలు, గుంజలతో ఒక తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. బోటింగ్‌ పాయింట్‌ లేకపోవటం వల్ల ఈ చెక్క వంతెన దగ్గరకు బోధిసిరి డబుల్‌ డెక్కర్‌ వంటి బోటు రాలేదు. దీంతో పాటు భవానీ వంటి 50 సీట్లు కలిగిన మెక నైజ్డ్‌ బోట్లు కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంది.
 
   కేవలం ముగ్గురు, నలుగురు ప్రయాణించే స్పీడ్‌ బోట్లు మాత్రమే రాగలవు. వేసవి సెలవులు కావటంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరిని భవానీ ఐల్యాండ్‌కు తరలించటానికి చిన్నపాటి స్పీడ్‌ బోట్లు సరిపోవటం లేదు. వస్తున్న పర్యాటకుల ఫ్లోటింగ్‌కు అనుగుణంగా ఏపీటీడీసీ అధికారులు మెకనైజ్డ్‌ బోట్లను నడపాలంటే తక్షణం... తమ బోటింగ్‌ పాయింట్‌ను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆపరేషన్స్‌ ప్రారంభించాల్సి ఉంటుంది.
 
రూ.కోట్ల వ్యయంతో బోటింగ్‌ పాయింట్స్‌
పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కృష్ణానది వెంబడి పలు చోట్ల రూ.కోట్ల వ్యయంతో బోటింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది. లోతు ఎక్కువుగా ఉండే చోట బోటింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. పున్నమి, భవానీ ఐల్యాండ్‌ దగ్గర రెండు, మోటెల్‌ దగ్గర ఒకటి చొప్పున మొత్తం నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ల దగ్గర కాంక్రీట్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తారు. నది లోపల నుంచి పిల్లర్లు వేసి ఈ ప్లాట్‌ఫామ్స్‌ను నిర్మించారు.
 
 
ఖాళీ చేయిస్తాం..
ప్రైవేటు సంస్థ వినియోగంలో ఉన్న ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్స్‌ను స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికి పలుసార్లు వారికి చెప్పటం జరిగింది. ఇంకా ఖాళీ చేయలేదు. పర్యాటకులకు ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం ప్రైవేటు సంస్థల వినియోగంలో ఉన్న వాటిని ఖాళీ చేయించటానికి
అవసరమైన చర్యలు తీసుకుంటాం.
- సుదర్శనరావు, ఏపీటీడీసీ, విజయవాడ ఇన్‌చార్జి డీవీఎం
Link to comment
Share on other sites

వేడుకలకు బెర్మ్‌పార్క్‌.. ఏపీటీడీసీ ప్రయోగం..!
11-05-2018 07:17:14
 
636616198338388348.jpg
  • ఓపెన్‌ లాన్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఓకే
  • బయటి ఫుడ్‌కు కూడా అనుమతి
  • అద్దెలు నిర్ణయించిన ఏపీటీడీసీ
  • కోరిన విధంగా సెట్టింగ్స్‌
  • ఓపెన్‌ గ్రీన్‌ లాన్‌ రూ.50 వేలు
  • ఓపెన్‌ డ్రై ల్యాండ్‌ రూ.25 వేలు
  • సెక్యూరిటీ, శానిటేషన్‌, క్లీనింగ్‌ కల్పించనున్న ఏపీటీడీసీ
 
కృష్ణమ్మ అలలపై నుంచి అలా అలా తేలివచ్చే చల్లగాలులు.. నదీతీరం వెంబడి పచ్చగా ఆహ్లాదాన్ని పంచే బెర్మ్‌పార్క్‌.. పర్యాటకుల మనసు దోచే అటువంటి వాతావరణంలో ఆత్మీయులందరి మధ్యా ఆనందాలను పంచుకోవడాన్ని ఇష్టపడని వారెవరుంటారు? అటువంటి సంతోషాలను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు బెర్మ్‌పార్క్‌ ఓపెన్‌ లాన్‌ను వివాహ వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు కేటాయించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.
 
 
విజయవాడ: వివాహ వేడుకలకు, ఇతర శుభకార్యాలకు హరిత బెర్మ్‌పార్క్‌ ఓపెన్‌ గ్రీన్‌, డ్రై లాన్‌లను ఇవ్వటానికి నిర్ణీత ప్యాకేజీలను ఏపీటీడీసీ నిర్ణయించింది. గతంలో అడపా దడపా ఫంక్షన్లకు ఇచ్చినప్పటికీ బయటి ఫుడ్‌ను అనుమతించే వారు కాదు. ఇప్పుడు బయటి ఫుడ్‌ను కూడా అనుమతిస్తూ ఏపీటీడీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానది తీరాన.. పచ్చటి ప్రకృతి నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న బెర్మ్‌పార్క్‌ను శుభకార్యాలకు అందుబాటులో ధరల్లో ఉపయోగించుకునే విధంగా ప్యాకేజీలకు రూపకల్పన చేశారు.
 
  హరిత బెర్మ్‌పార్క్‌లో కాటేజీల వెనుక కృష్ణానది తీరం మధ్యన సువిశాలమైన గ్రీన్‌లాన్‌ను రోజుకు రూ.50 వేల ప్రాతిపదికన అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కాటేజీలకు ఈవల దుర్గా ఫ్లై ఓవర్‌కు మధ్యన ఉన్న ఓపెన్‌ డ్రై ల్యాండ్‌ను రోజుకు రూ.25 వేల చొప్పున అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మైదానాలను అద్దెకు తీసుకునే వారికి ఏపీటీడీసీ శానిటేషన్‌, సెక్యూరిటీ, క్లీనింగ్‌ సేవలను ఉచితంగా అందిస్తుంది. ఓపెన్‌ లాన్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కొంత వరకు డెకరేషన్‌ కూడా ఏపీటీడీసీ చేపడుతుంది.
 
  కార్యక్రమాలకు తగ్గట్టు అద్దెదారులు కోరిన విధంగా డెకరేషన్‌ చేసి ఇవ్వటానికి కూడా ఏపీటీడీసీ సిద్ధంగా ఉంది. దీనికి మాత్రం చార్జీ చేస్తారు. ఇంటీరియర్‌ డెకరేషన్‌తో పాటు, ఫ్లవర్‌ డెకరేషన్‌, మ్యూజిక్‌ అరేంజ్‌మెంట్స్‌, లైటింగ్‌ వంటివన్నీ ఏర్పాటు చేస్తారు. వివరాలకు భవానీపురం హరిత బెర్మ్‌పార్క్‌లోని ఫ్రంట్‌ ఆఫీసును సందర్శించాల్సి ఉంటుంది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...