Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
కృష్ణానదిలో బోటు షికారు...ఎంతో ఆహ్లాదకరం..

విజయవాడ: విజయవాడ టూరిస్ట్ హబ్‌గా మారుతోంది. పర్యాటకశాఖ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వాటర్‌స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాట్లు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

కృష్ణానదిలో బోటు షికారు... వాటర్‌ స్పోర్ట్స్‌తో ఎంజాయ్‌మెంట్. బెజవాడలో కృష్ణానదిపై కనిపిస్తున్న మార్పులివి. ఒకప్పుడు వాటర్ స్పోర్ట్స్ గానీ, బోటింగ్ లాంటివి ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ , గోవా, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇలాంటివన్నీ విజయవాడలోనే అందుబాటులోకి వచ్చేశాయి. పర్యాటక శాఖ తీసుకుంటున్న చర్యలతో బెజవాడ టూరిస్ట్‌ హబ్‌గా మారబోతోంది.

 

రాష్ట్ర విభజన తర్వాత భవానీ ఐలాండ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం తర్వాత పర్యాటకులు చూడాలని ఇష్టపడే ప్రదేశం భవానీ ఐలాండే. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవలే అద్భుతమైన అనుభూతి కలిగించే బోటు షికారుకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత ఆలయం ఎదురుగానే ఉన్న దుర్గా ఘాట్‌లో బోట్లు పర్యాటకులను ఆహ్వానిస్తాయి.

 

రెండు గంటల పాటు సాగే నదీయానంలో తొలుత పున్నమి ఘాట్‌కి బోటు చేరుకుంటుంది. అక్కడి నుంచి భవానీ ఐలాండ్‌కు అటు నుంచి మడ అడవుల మీదుగా పయనం సాగుతుంది. ఈ దారిలో రకరకాల పక్షులను చూస్తుండగానే గొల్లపూడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ దర్శనాలు అయిన తర్వాత నేరుగా పవిత్ర సంగమం చేరుకుంటారు. ఇది కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరిగే ప్రదేశం. టూరిజం కోణంతో పాటు ఈ సంగమం ప్రాంతాన్ని ప్రతిఒక్కరూ చూసేలా బోటు మార్గాన్ని ఏర్పాటు చేశారు. 20 కిలోమీటర్ మేర ఎనిమిది ప్రాంతాలను చుట్టుకుంటూ ఈ బోటు షికారు సాగుతుంది. అటు ఆధ్యాత్మికం, ఇటు ఆహ్లాదం. రెండూ కలబోసిన ఈ పడవ ప్రయాణం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మనం కృష్ణానదిలో ఉన్నామా గోదావరి పాపికొండలను దర్శిస్తున్నామా అన్న విధంగా ఈ యాత్ర సాగుతుందని పర్యాటకులు చెబుతున్నారు.

 

ప్రతి గంటకు ఓ బోటు ఈ దుర్గా ఘాట్‌లో సిద్దంగా ఉంటుంది. ఒక ట్రిప్‌లో వంద మంది ప్రయాణించే వీలు ఉంటుంది. ఒక్కొక్కరికీ మూడు వందల రూపాయలు టిక్కెట్ ధర నిర్ణయించారు. ఈ బోటు షికారు నిర్వహణ మొత్తం అమరావతి బోటింగ్ క్లబ్ ఆద్వర్యంలో సాగుతుంది. ఇక వారాంతాల్లో మ్యూజిక్‌తో పాటు, బుర్రకథ తదితర వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదీ బెజవాడలో టూరిస్టులను ఆకట్టుకుంటున్న పడవ ప్రయాణం. ప్రకృతి అందాలను ఆహ్వానిస్తూ కృష్ణమ్మ పరవళ్లను పలకరిస్తూ సాగే ఈ ప్రయాణానికి మరి మీరు సిద్ధంకండి....

Link to comment
Share on other sites

  • 1 month later...
రాజధానిలో వాటర్‌ పోలీసింగ్‌
03-12-2017 07:33:18
 
636478831962014514.jpg
 రాజధానిలో వాటర్‌ పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే విధానంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఛీఫ్‌ ట్రైనింగ్‌ అధికారి జాకబ్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ వద్ద కృష్ణాది రాష్ట్రవిపత్తుల నిర్వహణ సిబ్బందికి నీటిలో విపత్తులు ఎదుర్కొనే అంశంపై శనివారం శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఛీఫ్‌ ట్రైనింగ్‌ అధికారి జాకబ్‌ విజయ్‌కుమార్‌ మాట్లడుతూ విపత్తుల సిబ్బందికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలుత రాజధాని ప్రాంతంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో శిక్షణ ఇ్తామని, అనంతరం గోదావరి బేసిన్‌, సీమ ప్రాంతంలోని తుంగభద్రానది తదితర ప్రాంతాలలో సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 800 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. అత్యంత నైపుణ్యంతో కూడిన స్కూబా డైవింగ్‌, క్లిష్టమైన ప్రాంతాలలో రోప్‌ సహాయంతో భాదితులను కాపాడే విధానంపై శిక్షణ ఇస్తున్నామన్నారు. రెస్క్యూ పరికరాలు తయారు చేసే ఐటెస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ సహకారంతో ఆరు నెలల పాటు ఫైలెట్‌ ప్రాజెట్లు ప్రభుత్వ ఆదేశాలతో డిజిపి సాంబశివరావు, ఫైర్‌ డిజి. సత్యనారాయణల పర్యవేక్షణలో ఈ శిక్షణ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
సీ-ప్లేన్‌లో చక్కర్లు కొట్టిన చంద్రబాబు
13brk110a.jpg

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సీ-ప్లేన్‌లో విహరించారు. కృష్ణా నదిలో నిర్వహించిన ట్రయిల్‌ రన్‌లో భాగంగా ముఖ్యమంత్రి పున్నమి ఘాట్‌ నుంచి సీప్లేన్‌లో చక్కర్లు కొట్టారు. సీఎంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల, ఓ విద్యార్థిని ఉన్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ ప్రచారం ముగింపు సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది వద్ద సీప్లేన్‌లో ప్రయాణించిన సంగతి తెలిసిందే.

13brk110b.jpg
Link to comment
Share on other sites

Guest Urban Legend
13 minutes ago, AnnaGaru said:

India's BIGGEST FLOATING FOUNTAIN :fireworks2:

 

enta sepu SEAPLANE meda edo chupincharu kani background lo ready avutunna dani gurinchi okkadu cheppaledu ippati varaku

C-Plane-Trial-Run-Kri-08.jpg

 

C-Plane-Trial-Run-Kri-06.jpg

 

ETv lo bhavani island deggara fountain videos vesadu awesome vundhi fountain and laser lights lo durgamma nd mana culture gurinchi etc etc 

It will be major tourist attraction 

Link to comment
Share on other sites

5 minutes ago, Urban Legend said:

 

ETv lo bhavani island deggara fountain videos vesadu awesome vundhi fountain and laser lights lo durgamma nd mana culture gurinchi etc etc 

I will be major tourist attraction 

 

Yes bro, too good undi adi kooda....India's biggest floating fountain&Laser show...

Best part of this is you can see it from any location&even from VIjayawada

 

dc-Cover-652ovhkibhg82kh6on274ihkn1-2017

 

 

 

 

Link to comment
Share on other sites

Guest Urban Legend
On 12/16/2017 at 1:14 AM, AnnaGaru said:

 

Yes bro, too good undi adi kooda....India's biggest floating fountain&Laser show

 

dc-Cover-652ovhkibhg82kh6on274ihkn1-2017

 

 

 

 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...