Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply

విజయవాడ ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కల్పించేందుకు పున్నమిఘాట్‌ నుంచి పవిత్రసంగమం వరకు సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌లను నిర్మించేందుకు సర్వే చేస్తున్నామని, రిఫర్‌ ఫ్రంట్‌ పేరుతో దీనిని అభివృద్ధి చేస్తున్నామన్నారు

Link to comment
Share on other sites

  • 1 month later...
కృష్ణమ్మకు సాగరమాల 
భవానీ ఘాట్‌ వద్ద భారీ జెట్టీ నిర్మాణం 
ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం 
భవానీపురం(విజయవాడ), న్యూస్‌టుడే 
amr-sty4a.jpg

విజయవాడ నగరంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణానికి పర్యాటక శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. కృష్ణా నదిపై బోటింగ్‌ కార్యకలాపాలను పెంపొందించేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీలుగా భారీ జెట్టీ నిర్మాణానికి సంకల్పించారు. నిర్మాణ పనులను కూడా కొన్ని రోజుల క్రితం ప్రారంభించారు. సముద్రాలు, నదిపై బోటింగ్‌ కార్యకలాపాలు చేపట్టాలంటే జెట్టీలు ఎంతో అవసరం. అవి లేకుంటే బోట్లను నిలపడం సాధ్యపడదు. సందర్శకులు, పర్యాటకులు జెట్టీ మీదుగా నడుచుకుంటూ వెళ్లి బోట్లను ఎక్కే వీలుంటుంది. వివిధ రకాల బోట్లను దానికి ఇరువైపులా నిలిపి ఉంచుకునే సౌకర్యం ఉంటుంది. అటువంటి దానినే భవానీ ఘాట్‌ వద్ద నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌ల వద్ద చిన్నపాటి జెట్టీలు మాత్రమే ఉన్నాయి. వాటిని మించి భవానీ ఘాట్‌ వద్ద జెట్టీ నిర్మిస్తున్నారు. మరొక ఆరు నెలల వ్యవధిలో అందుబాటులోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నారు. నిర్మాణం పూర్తయితే కృష్ణానదికి కొత్తరూపు వచ్చే అవకాశం ఉంది.

రూ.10 కోట్ల వ్యయంతో.. 
కేంద్ర ప్రభుత్వం సముద్ర, నదీ తీర ప్రాంతాలను సాగరమాల ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించింది. కార్గో రవాణాకు, పర్యాటక రంగం అభివృద్ధికి నిధులు కేటాయించి జెట్టీల నిర్మాణానికి సంకల్పించింది. ఆ ప్రాజెక్టులో భాగంగా భవానీ ఘాట్‌ వద్ద జెట్టీ నిర్మాణానికి రూ.10 కోట్లు నిధులు కేటాయించింది. ఆ నిధులతో భవానీ ఘాట్‌ వద్ద 60 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్‌ జెట్టీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవానీ ద్వీపం ఒడ్డున ఉన్నది 30 మీటర్ల పొడవున్నది మాత్రమే. అక్కడ నది ఒడ్డున పొడవుగా నిర్మించడంతో ఒక వైపునే బోట్లను నిలిపే సౌలభ్యం ఉంది. భవానీ ఘాట్‌ వద్ద మాత్రం నదిలోకి నిర్మిస్తున్నారు. అలా కట్టడం వల్ల రెండు వైపులా బోట్లను నిలిపే వీలుంటుంది. దీనికి ఇరువైపులా 50కి పైగా వివిధ రకాల బోట్లను నిలిపి ఉంచుకోవచ్చు. కొన్ని రోజుల క్రితం ప్రయోగాత్మకంగా పరిశీలించిన సీ ప్లెయిన్‌ని కూడా నిలపొచ్చు. సీ ప్లెయిన్‌ కోసం అప్పుడు తాత్కాలికంగా నదిపై తేలియాడే జెట్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శాశ్వతంగా నిర్మిస్తుండటంతో దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్లి సీప్లెయిన్‌ ఎక్కే వీలుంది.

మొదటిది ఇదే... 
పర్యాటకరంగం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని కాకినాడ, కళింగపట్నం, భీమునిపట్నం, మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌, భవానీ ద్వీపం, భవానీ ఘాట్‌ల వద్ద జెట్టీల నిర్మాణానికి నిర్ణయించారు. అవన్నీ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలని భావించారు. అందులో భాగంగా మొట్టమొదట భవానీ ఘాట్‌ వద్ద నిర్మిస్తున్నారు. కృష్ణా నదిలో 60 ఫైల్స్‌ను నిర్మించి జెట్టీ నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో ఫైల్‌ను 120 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు. జెట్టీ దిగువ భాగాన కృష్ణానది పారుతూ ఉంటుంది. భారీ కట్టడం కావటంతో కృష్ణానది అందాలను తిలకించే వీలుంది. ఆకట్టుకునే విద్యుత్తు వెలుగులతో పాటు సందర్శకులు కాసేపు నదీతీరం వెంబడి ఉండేలా అందంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభమైన దృష్ట్యా కొన్ని నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పర్యాటకరంగానికి చెందిన బోట్లను నిలిపి ఉంచుకోవటంతో పాటు సరకు రవాణాకు కూడా ఉపయోగపడే అవకాశముంది.

Link to comment
Share on other sites

బస్‌బోట్‌లో దూసుకుపోదామా...
11-03-2018 12:16:49
 
636563680351416662.jpg
  • బయట చూస్తే .. జలాంతర్గామి !
  • లోపల చూస్తే.. బస్‌లా.. !!
  • ఏసీ క్రూయిజ్‌ , డిజిటల్‌ డాల్బీ సరౌండ్‌ సిస్టమ్‌
  • బస్‌ తరహాలో.. లగ్జరీ సీటింగ్‌ ఈ బోటు ప్రత్యేకత
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణానదిలో ... బస్‌బోట్‌ సర్‌ర్‌ర్‌ర్‌ మంటూ దూసుకుపోనుంది! దీని లుక్‌ చూస్తే జలాంతర్గామిలా కనిపిస్తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ డివిజన్‌ బోటింగ్‌ యూనిట్‌కు ఈ సరికొత్త క్రూయిజ్‌ చేరింది. దీని ధర రూ. 1.17 కోట్లు. ప్రైవేటు నిర్వాహకుల దగ్గర కూడా ఇలాంటి క్రూయిజ్‌ లేదు. లిట్మస్‌ మెరైన్‌ సంస్థ నుంచి ఏపీటీడీసీ ఈ బస్‌బోటును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ బోట్‌ ఇంకా ప్యాకింగ్‌లోనే ఉంది. పొడవుగా ఉండే ఈ బోటులో ఇంజిన్‌ బిగించాల్సి ఉన్నందున ఇంకా ప్యాకింగ్‌ విప్పలేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఈ బోటుకు సంబంధించి ఇన్నర్‌ ఫొటోలను క్లిక్‌ మనిపించింది. లోపల మాత్రం అచ్చు ఏసీ బస్సులో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బయటి నుంచి చూస్తే మాత్రం జలాంతర్గామిలా కనిపిస్తుంది. మూతి చూస్తే బుల్లెట్‌ ట్రెయిన్‌లా కనిపిస్తుంది.
 
పైన ఉన్న అద్దాలను అటు ఇటు కదిలించవచ్చు. ఓపెన్‌ ఎయిర్‌ కావాలనుకుంటే అద్దాలను జరుపుకోవచ్చు. రూఫ్‌కు మధ్యలో అద్దాల డోర్లు ఉంటాయి. వీటిని పైకెత్తవచ్చు. రెండు డోర్ల వెంబడి మెట్ల మార్గాలు ఉంటాయి. ముందు భాగంలో పైలట్‌ కాక్‌పిట్‌ ఉంటుంది. ఆర్టీసీ బస్సు తరహాలోనే స్టీరింగ్‌ కనిపిస్తుంది. డ్రైవర్‌ సీటు పై భాగంలో ఎల్‌ఈడీ టీవీ ఉంటుంది. క్రూయిజ్‌ లోపల అంతా ఫుల్లీ ఎయిర్‌ కండీషనింగ్‌ సదుపాయం ఉంటుంది. ఇందులో వైఫై సేవలు కూడా ఉంటాయి.
Link to comment
Share on other sites

23 నుంచి నేవీ షో.. తారల రాక..!
11-03-2018 07:13:46
 
636563492249235868.jpg
  • ఈ నెల 23, 24, 25 తేదీల్లో సందడే సందడి
  • బెర్మ్‌పార్క్‌లో మ్యూజికల్‌ మస్త్‌ !!
  • నేవీ షోలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు
  • వార్‌ సీన్‌ డెమో నేవీ సైనికుల విన్యాసాలు
  • మ్యూజికల్‌ మస్త్‌కు ప్రిన్స్‌ మహేష్‌బాబు రాక !
  • గ్లామర్‌ క్వీన్స్‌... పూజాహెగ్దే, రాశీ ఖన్నాల అట్రాక్షన్‌
 
విజయవాడ: ఈ వేసవిలో అడ్వెంచర్‌, మ్యూజికల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించటానికి ఏపీ టూరిజం రెడీ అవుతోంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో కృష్ణానదిలో నేవీ షో ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. కిందటి ఏడాది విజయవంతమైన ఈ ఈవెంట్‌ను ఈసారి మెగా ఈవెంట్‌గా నిర్వహించటానికి పర్యాటకశాఖ సన్నాహాలు చేస్తోంది. యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్ల విన్యాసాలు ఈ సారి మరింత ఆకట్టుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు. విశాఖపట్నం తూర్పు నావికాదళం సహకారంతో ఈ సారి మరిన్ని విమానాలు, హెలికాప్టర్లు తెప్పించటానికి పర్యాటకశాఖ అధికారులు కృషి చేస్తున్నారు.
 
   నేవీ యుద్ధ విమానాలు, నేవీ ఓడలు నేవీకి సంబంధించిన సబ్‌మెరైన్‌లు, నేవీ యుద్ద ఆపరేషన్‌కు సంబంధించిన మాన్యుమెంట్స్‌తో ఎగ్జిబిషన్‌ కూడా నిర్వహించనున్నారు. సముద్రాలలో బందిపోట్ల, చొరబాటుదారులను ఎలా ఎదుర్కొంటారో వాటి డెమో చూపిస్తారు. కిందటి సారి కృష్ణానదిలో నిర్వహించిన డెమోలో బాంబు ఆపరేషన్‌ ప్రయోగించారు. ఈసారి ఇలాంటి వినూత్నమైన డెమోలను మరికొన్నింటి ని ప్రవేశపెట్టడానికి ఏపీ టూరిజం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యుద్ధ విమానాల విన్యాసాలు, హెలికాప్టర్ల విన్యాసాలు పిల్లలను అమితంగా ఆకట్టుకోవడంతో ఇలాంటి ఆపరేషన్స్‌ మరిన్ని నిర్వహించటానికి చర్యలు చేపడుతున్నారు. ఈ సారి నేవీ షో కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు కూడా పాల్గొననున్నట్టు సమాచారం.
 
తారలు దిగివస్తున్న వేళ..
నేవీ షోకు అనుబంధంగా 24, 25వ తేదీల్లో ఒక రోజు హరిత బెర్మ్‌పార్క్‌లో మ్యూజికల్‌ మస్త్‌ కార్యక్రమాన్ని నిర్వహిం చాలని నిర్ణయించారు. ఈ మేరకు బెర్మ్‌పార్క్‌లో ఉపయోగించని స్థలాన్ని చదును చేసి బాగు చేస్తున్నారు. భారీ సంగీత కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా తారలు నిలవబోతున్నారు.టాలీవుడ్‌ ప్రముఖ హీరో ప్రిన్స్‌ మహేష్‌బాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దాదాపుగా మహేష్‌బాబు వస్తున్నట్టు సమాచారం. ప్రముఖ హీరోయిన్లు గ్లామర్‌ క్వీన్స్‌ పూజా హెగ్డే, రాశీ ఖన్నాలు కూడా మ్యూజిక్‌ మస్త్‌ కార్యక్రమంలో పాలు పంచుకోబోతున్నారు. నేవీ షోకు కూడా వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
Link to comment
Share on other sites

రూ.10 కోట్లతో భవానీ ఘాట్‌లో బోటింగ్‌ జట్టి
12-03-2018 06:26:36
 
636564327947194687.jpg
విజయవాడ: భవానీ ఐలాండ్‌ అభివృద్ధిలో భాగంగా భవానీ ఘాట్‌ వద్ద ఏపీ టూరిజం శాఖ అధికారులు రూ.10 కోట్ల వ్యయంతో ప్రత్యేక బోటింగ్‌ జట్టి ఏర్పాటుకు నిర్మాణ పనులు చేపట్టారు. భవానీ ఐలాండ్‌కు వచ్చే పర్యాటకులకు అందుబాటులో ఉండే విధంగా భవానీ ఘాట్‌ నుంచి సుమారు 60 మీటర్లు (200 అడుగులు) కృష్ణానది లోపలకి బోటింగ్‌ జట్టి నిర్మాణం జరగనున్నది. రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్న భవానీ ఐలాండ్‌కు వచ్చే పర్యాటకుల తాకిడి పెరగనున్న దృష్ట్యా నదిలో మరిన్ని వివిధ రకాల కొత్త బోట్లు నడపడానికి అనుకూలంగా భవానీ ఘాట్‌ వద్ద మరో బోటింగ్‌ జట్టి నిర్మాణం చేపట్టారు.
 
    ప్రస్తుతం పున్నమి ఘాట్‌లో ఉన్న బోటింగ్‌ జట్టి వద్ద నుంచి ఐలాండ్‌ వైపు, నదిలో తిరుగుతున్న బోట్లు అన్ని భవానీఘాట్‌ వద్ద నిర్మాణం చేపడుతున్న బోటింగ్‌ జట్టి వద్ద నుంచి తిరుగుతాయని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు. భవానీఘాట్‌లో చేపట్టిన బోటింగ్‌ జట్టి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి సంబంధిత అధికారులు, సదరు కాంట్రాక్టర్‌ తగు చర్యలు చేపడుతున్నారు. భవానీఘాట్‌ వద్ద బోటింగ్‌ జట్టి నిర్మాణం పూర్తయితే స్వాతి సెంటర్‌లోని మసీద్‌ రోడ్డు నుంచి భవానీ ఐలాండ్‌కు వచ్చే పర్యాటకుల రాకపోకల తాకిడి పెరగనుంది
Link to comment
Share on other sites

కృష్ణా నదిలో బస్సు బోటు రెడీ!
15-03-2018 09:14:27
 
636567020682130369.jpg
విజయవాడ: రాజధాని అమరావతికి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ టూరిజం అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న పక్షి ఆకారంలో ఉన్న బస్సు బోటు.. కృష్ణా నదిలో చక్కర్లు కొట్టేందుకు సిద్ధమైంది. దీన్ని దాదాపు రూ.1.17 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. బుధవారం ఇంజనీరింగ్‌ అధికారులు దీనికి ప్రత్యేకంగా ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. మరో నాలుగైదు రోజుల్లో కృష్ణా నదిలో ఇది చక్కర్లు కొట్టనుంది. ఇందులో 30 లగ్జరీ సీట్లు ఉంటాయి. సెంట్రలైజ్‌డ్‌ ఏసీ సిస్టమ్‌ ఉంటుంది. ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. ఇది చాలా స్పీడ్‌గా వెళుతుంది. ప్రయాణికులు లోపల కూర్చుని నదిలో వెళ్లేటప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే విధంగా అత్యాధునిక ఏర్పాట్లు చేశారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...