Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • 4 weeks later...
  • Replies 458
  • Created
  • Last Reply
రివర్‌ ఫ్రంట్‌కు సన్నాహలు
 
 
635946614372272685.jpg
  •  సైన్స్ సెంటర్‌ నుంచి భవానీ ఘాట్‌ వరకు ముస్తాబుకు సన్నాహాలు 
  • 20 ఎకరాల ప్రభుత్వ భూమి, 38 ఎకరాల ప్రైవేట్‌ భూమి 
  •  స్థానికంగా 1100 కుటుంబాలకు జక్కంపూడిలో నివాసాలు 
 విజయవాడ : విజయవాడలో రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శనివారం మునిసిపల్‌ కమిషనర్‌ వీరపాండియన తన క్యాంప్‌ కార్యాలయంలో విజయవాడ సబ్‌కలెక్టర్‌ సృజన, అర్బన తహసీల్ధార్‌ శివరావు, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో పాటు చైనా సంస్థ ప్రతినిఽధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్‌ వీరపాండియన రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలోని నివాసాలు, నిర్మాణాలపై అధ్యయనం చేశారు. సైన్స సెంటర్‌ నుంచి భవానీ ఘాట్‌ వరకు 2.5 కిలోమీటర్ల నిడివిలో రివర్‌ ఫ్రంట్‌ను రూపొందించడానికి అక్కడున్న అడ్డంకులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఇక్కడ 20 ఎకరాల ప్రభుత్వ భూమి, 38 ఎకరాల ప్రైవేట్‌ భూములు ఉన్నాయి. కాగా ఇక్కడ సుమారు 1100 నివాసాలు ఉన్నాయి. ఈ నివాసాలను తొలగించాల్సి ఉంది. ముందుగా రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని సర్వే చేయనున్నారు. త్వరలోనే ఇక్కడి పనులను ప్రారంభించే అవకాశం ఉండడంతో నివాసాలను తొలగించి వారికి జక్కంపూడిలో ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించారు.
రివర్‌ ఫ్రంట్‌ను చైనా సంస్థ రూపొందించనున్నందున ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి స్థలాన్ని రివర్‌ ఫ్రంట్‌కు అప్పగించనున్నారు. 2.5 కి.మీ రివర్‌ ఫ్రంట్‌కు సంబంధించి జలవనరులశాఖ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని సమాచారం. అయితే నీరు కలుషితం కాకుండా చూడడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని సమాచారం. రివర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుతో సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా. త్వరలో నదికి దగ్గర్లోనే ఫ్లై ఓవర్‌ కూడా రానున్నందున ఆ ప్రాంతం అందంగా తయారు కానున్నది.
Link to comment
Share on other sites

Science center nunchi bhavani ghat varaku river front cheyatam waste.....

 

science center daata gaane berm park vundi. Daaniki entry fees vundi....plus park and hotel already vunnai andulo....

 

Berm park daata gaane smasanam vundi.....I dont think people will visit that place.....

 

Adi daata gaane head water works vundi.....adi restricted place....and dangerous place.....

 

Adi daatagane kottaga vache flyover....and daani pakkane road....and road ki river ki chaala height difference vuntadi....

 

Adi daatagaane bhavani ghat....

 

Inka veellu cheyagaligedhi emi ledu akkada....

 

River ki atu vaipu cheyatam best.....or....river madyalo islands chaala uneven ga vunnai....dredging chesina isukatho aa island height penchi varadalaki munagakunda pedda park chestey super....

Link to comment
Share on other sites

Guest Urban Legend

occupy chesi houses lepina andhariki houses istunnara ..good ...gola lekunda vuntadhi

Link to comment
Share on other sites

krishna-river-front-beautificaiton-04052

As a part to beautify Vijayawada city and to have a riverfront to the city, VMC is making arrangements to beautify the Krishna riverfront from Prakasam Barrage to Bhavani Island of around 2.5 KM. With the concept of Blue and Green City, VMC is taking all measures to beautify the city. It starts from Model Guest House near Indrakeeladri and passes through Durgha Ghat, Punnami Ghat to Bhavani Ghat near Bhavanipuram. All the encroachments have been removed to beautify this area. With beautification, this will also have entertainment, food courts etc...

Vijayawada Municipal Commissioner Veerapandian has held a review in his office with China GICC Delegates and discussed about beautifying the riverfront in the city. Sub-Collector G.Srujana also has participated in the meeting.

Veerapandian has asked the officials to prepare a blueprint of the design and handover to GICC. Also, he asked to remove the encroachments and also any private lands in the riverfront and asked to pay the required compensation.

Once VMC has handed over the blue print, China based GICC will do further refinement according to their requirement and start the works to beautify the riverfront in Vijayawada city.

As Kanakdurga Flyover also is being ready, the spot would be very good looking with the riverfront beautification.

Link to comment
Share on other sites

Guest Urban Legend

e china GIIC company AP lo full force lo digindhi ga

kakinada SEZ lo industrial park

machilipatanam Industrial corridor

vijayawada beautification and ippudu ghats works

poor people ki houses construction project near jakkampudi(bezawada)

amaravati construction

 

ila anni projects lo vundhi

...

Link to comment
Share on other sites

e china GIIC company AP lo full force lo digindhi ga

kakinada SEZ lo industrial park

machilipatanam Industrial corridor

vijayawada beautification and ippudu ghats works

poor people ki houses construction project near jakkampudi(bezawada)

amaravati construction

 

ila anni projects lo vundhi

...

amaravati construction velle mainga untaru.

Link to comment
Share on other sites

Venice: City of Dreams
 
see this it is the best water front city tourism with 20 million visitors a year
 
We need to develop Amaravati in lines of  

Venice

 

Not exactly same but if anyone comes need to stay for long hours and need come back again and again

 

Even if we see Goa it is earning 50000+ crores alone from tourism

Link to comment
Share on other sites

We need to construct waterfront resorts/rooms in 1000's it will be boost to tourism in AP.

 

For example 12hrs slots and 24hrs slots kinda rooms ivali

 

Main thing tourism for water sports they want to stay and enjoy but main thing is they don't have that many rooms available so many people returning back.

 

Once water sports boosts up it will be key for AP tourism

 

Even rajahmundry too we can develop water front sports it will boost AP income

Link to comment
Share on other sites

గుజరాత్‌ తరహా అందాలు
కృష్ణా నది ఒడ్డున భారీ ప్రాజెక్టు
చైనా సంస్థల సహకారం
దీనికి అనుగుణంగా పుష్కర ఘాట్లు
అందం.. ఆరోగ్యం.. ఆహ్లాదం ఇక సొంతం

కృష్ణమ్మ అందాలు మాటల్లో వర్ణించలేనివి. స్వర్ణకాంతుల విరజిమ్ముతూ బిరబిరా సాగే ఆ తల్లి నడకలు వింటేనే మనసు పులకించిపోతుంది. రాజధానికి ఈ నదీమతల్లే కొండంత బలం. ఇప్పుడు ఈ బలాన్ని ఉపయోగించుకునేందుకు సర్కారు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనికి నది అభివృద్ధి ప్రణాళికల్లో ముందంజలో ఉన్న చైనా సంస్థల సహకారం.. గుజరాత్‌ సబర్మతి నది తీర అందాలను స్ఫూర్తిగా తీసుకోనున్నారు.

నవ్యాంధ్ర రాజధానికి బెజవాడే కీలకం. ఈ నగరం వెంట పరవళ్లు తొక్కుతూ జాలువారే కృష్ణమ్మ అందాలకు మరింత మెరుగులు దిద్దనున్నారు. కృష్ణమ్మ చెంత ఉన్న నదీపరివాహక ప్రాంతం ఇక సరికొత్త అందాలతో ముస్తాబు కానుంది. దీనికోసం బృహత్‌ ప్రణాళిక వేగంగా సిద్ధమవుతోంది. నగరవాసులు, సందర్శకులు, పర్యాటకుల కోసం విలువైన ప్రాజెక్టు రూపొందుతోంది.

నది వెంట అలలు అలలుగా సాగే జలసిరులు ఒకవైపు.. పరవళ్లు తొక్కే పచ్చిక బయళ్లు మరోవైపు, ఆహ్లాదాన్ని పంచే పార్కులు, నిర్మాణాలు ఇంకోవైపు.. మొత్తంగా చూపరులను అమితంగా ఆకట్టుకునే ఏర్పాట్లు, పర్యాటకులను స్వర్గదామంగా తీర్చిదిద్దేలా చర్యలు, కృష్ణానది తీరాన్ని రాష్ట్రంలోనే ‘శాశ్వత పర్యాటక ప్రదేశం’గా మలిచేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం కొలిక్కి వస్తున్నాయి. దీనికి సంబంధించిన భారీ ప్రాజెక్టుకు చైనా సంస్థల ప్రతినిధులు ఒక ప్రణాళికను రూపొందించి ఇప్పుటికే అధికారులకు ఇచ్చారు. మొత్తం నది తీర ప్రాంతాన్ని పరిశీలించి... సాధ్యాసాధ్యాలను పరిశీలించిన చైనా బృందం ఏ ప్రదేశంలో ఎలాంటి వసతులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు వస్తే బాగుంటుందో ఇప్పుటికే ఒక అంచనాకు వచ్చింది. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే పూర్తిస్థాయి ప్రణాళిక చార్టులను అందించింది.

శరవేగంగా అడుగులు..
భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టుకు ఇప్పటి నుంచే శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందున్న కృష్ణా పుష్కరాలకు సంబంధించి ఘాట్ల నిర్మాణం ఎలా ఉండాలో కూడా చైనా సంస్థ ప్రతినిధులే డిజైన్లు చేస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే టూరిస్ట్‌ స్పాట్‌లకు ఘాట్లు ఇబ్బంది కలిగించకుండా ఉండేలా ప్రణాళికలు, డిజైన్లు రూపొందించారు.

నది వెంట స్థలం
* అధికారుల రికార్డుల ఆధారంగా స్థలం మొత్తం - 64.23 ఎకరాలు

* ప్రస్తుతం అందుబాటులోని స్థలం - 55.18 ఎకరాలు * నదిలో మునిగిన స్థలం 5.55 ఎకరాలు, * ప్రభుత్వపు స్థలం-38.05 ఎకరాలు, * పట్టాభూమి-20.63 ఎకరాలు * 60:40 నిష్పత్తిలో 60 శాతం వెనక్కువచ్చే స్థలం-12.37 ఎకరాలు * శ్మశానవాటిక స్థలం-078 సెంట్లు * పున్నమి రిసార్ట్సు, ప్రాంతీయ సైన్సు సెంటర్‌ ఉన్న స్థలం - 10.53 ఎకరాలు

గుజరాత్‌ సబర్మతీ తరహాలో..
నగరపాలక సంస్థ అధికారుల ఆలోచనలు.. గుజరాత్‌లోని సబర్మతి నది అందాలు.. చైనా బృందం సహకారం.. ఇలా ఓ మొత్తం కలబోతగా కృష్ణానది ఒడ్డున పెద్ద థీమ్‌పార్కు రావాలనేది అధికారుల ఆలోచన. ఇలా చేస్తే నగరవాసులకు, వచ్చే పర్యాటకులకు విజయవాడ సరికొత్తగా కనిపిస్తుంది. వారిని ఆకట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డును అందంగా తీర్చిదిద్దిన తీరును వీరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అక్కడ ఎలా చేశారో.. దానికి రెట్టింపు అందాలతో కృష్ణానది ఒడ్డును తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్నారు.

40:60 నిష్పత్తిలో ప్రయివేటు భాగస్వామ్యం
ఇక ప్రాజెక్టును పట్టాలపైకి ఎక్కించేందుకు స్థానికంగా ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. అక్కడున్న 1300 మంది ఆక్రమణదారులకు నగరపాలక సంస్థ అధికారులు ఇళ్లు కేటాయించి పంపుతున్నారు. ఇక స్థానికంగా ఉన్న ప్రైవేటు స్థలాల యజమాన్యాన్ని సైతం భాగస్వామ్యం చేయాలని నిర్ణయించడంతో అందుకు అనువైన చర్చలు సాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల స్థలాలు సేకరించి 40:60 నిష్పత్తిలో వారికి భాగస్వామ్యం కల్పించాలని భావిస్తుండగా, 50:50 నిష్పత్తిలో భాగస్వామ్యాన్ని ప్రైవేటు వ్యక్తులు కొరుకుంటున్నారు. ఇలా నూతన రాజధాని అమరావతి స్థలాల సేకరణ తరహాలోనే తమకూ భాగస్వామ్యాన్ని కల్పించాలంటూ ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిన పలువురు ప్రైవేటు వ్యక్తులు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అయితే వారందరిని ఒప్పించి ప్రాజెక్టు సజావుగా పూర్తిచేసేందుకు యత్నిస్తున్నారు.

ఇక్కడి నుంచి మొదలు
ప్రకాశం బ్యారేజీ మొదలు కృష్ణానది వెంట దుర్గాఘాట్‌ నుంచి గొల్లపూడి గ్రామ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని శాశ్వత ప్రాతిపదిక పర్యాటక ప్రాజెక్టును చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం నదీతీరం వెంట 2.01 కిలోమీటర్ల పొడవునా నదివైపున ముందుగా పుష్కరాల కోసం స్నానఘాట్‌ నిర్మాణం చేపట్టనుండగా, ఆపై స్నానఘాట్‌ను ఆనుకొని అదే పొడవునా పచ్చదనంతో కూడిన టూరిస్ట్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. కరకట్టకు దిగువన ఉన్న ప్రస్తుతం ఉన్న 20 అడుగుల రహదారిని 60 అడుగుల రహదారిగా విస్తరిస్తారు. ఆపై ఆ రహదారికి స్నానఘాట్‌కు మధ్యలోని మొత్తం స్థలాన్ని లేఅవుట్‌ ఆధారంగా రహదార్లు, పార్కులు, పచ్చదనంతో కూడిన స్థలాలుగా విభజించి అభివృద్ధి చేస్తారు. మిగిలిన స్థలంలో పర్యాటకుల కోసం వివిధ నిర్మాణాలు, కమర్షియల్‌ మాల్స్‌, థియేటర్లు, ఆటస్థలాలు, రిసార్టులు, ఇతర కట్టడాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, ముఖ్యమైన కట్టడాలు, నిర్మాణాలు, విశ్రాంతి భవనాలు, పర్యాటకుల కోసం ప్రత్యేక సందర్శన ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తారు.

2.01 కిలోమీటర్ల మేర...
విద్యాధరపురం, భవానీపురం ప్రాంతాల పరిధిలో కరకట్ట ప్రాంతంలో ఉన్న 55.18 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు స్థలాలను ఆసరాగా తీసుకొని సరికొత్త ‘టూరిస్ట్‌ స్పాట్‌’ ఏర్పాటునకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అక్కడ 38.05 ఎకరాల ప్రభుత్వ భూమి, 20.63 ఎకరాల పట్టా భూములున్నాయి. 5.55 ఎకరాలు భూమి ఉన్నా, అది నదిలో మునిగిపోయి ప్రస్తుతం అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఈ భూమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొత్తం భూమిని కలుపుకుని నదివెంట 2.01 కిలోమీటర్ల మేర శాశ్వత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అందుకు చైనాకు చెందిన జీఐఐఎస్‌ సంస్థ సభ్యులు కన్సల్టెంట్లుగా నూతన ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్నారు. ప్రాజెక్టు కన్సల్టెంటుగా వ్యవహరిస్తున్న చైనా బృందం ఉచితంగా తన సహకారాన్ని అందిస్తోంది. మరోవైపు ప్రైవేటు స్థల యజమానుల భాగస్వామ్యం సైతం తీసుకుంటున్నారు. ఇలా నది ఒడ్డున ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలాన్ని సుదూర ప్రాంతాల పర్యాటకులను సైతం ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి..? ఏ తరహా సౌకర్యాలు నెలకొల్పాలి.. ఏఏ నిర్మాణాలు చేపట్టాలి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

విశేషంగా ఆకర్షించేలా
అన్ని వర్గాల సందర్శకులను విషేశంగా ఆకర్షించేందుకు, చూపరులకు కనువిందు చేసేందుకు, ఆహ్లాదాన్ని పంచేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నదీతీరం వెంట చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బోటు షికార్లు, సేద తీరేందుకు ఏర్పాట్లు అనేక హంగులు అక్కడ కనువిందు చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

- విజయవాడకార్పొరేషన్‌, న్యూస్‌టుడే
Link to comment
Share on other sites

We need to construct waterfront resorts/rooms in 1000's it will be boost to tourism in AP.

 

For example 12hrs slots and 24hrs slots kinda rooms ivali

 

Main thing tourism for water sports they want to stay and enjoy but main thing is they don't have that many rooms available so many people returning back.

 

Once water sports boosts up it will be key for AP tourism

 

Even rajahmundry too we can develop water front sports it will boost AP income

kadatru ankunta.

Link to comment
Share on other sites

We need to construct waterfront resorts/rooms in 1000's it will be boost to tourism in AP.

 

For example 12hrs slots and 24hrs slots kinda rooms ivali

 

Main thing tourism for water sports they want to stay and enjoy but main thing is they don't have that many rooms available so many people returning back.

 

Once water sports boosts up it will be key for AP tourism

 

Even rajahmundry too we can develop water front sports it will boost AP income

edi akkade untundi anukunta

 

http://www.nandamurifans.com/forum/index.php?/topic/369498-haritha-berm-parklo-convention-center/

Link to comment
Share on other sites

విజయవాడ నగర సుందరీకరణకు రూ. 300 కోట్లు
 
విజయవాడ : త్వరలో జరిగే కృష్ణా పుష్కరాలను పురష్కరించుకుని విజయవాడ నగర సుందరీకరణకు ప్రభుత్వం రూ. 300 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో దుర్గాఘాట్‌, బస్‌స్టేషన్‌, భవానీపురం, బందరురోడ్‌ సహా పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు నిర్వహిస్తారు. అలాగే రివర్‌ ఫ్రంట్‌ వ్యూను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఇక నగరంలో అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేయనున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...