Jump to content

Chintalapudi Lift Irrigation Project


Recommended Posts

చింతలపూడి’కి టెండర్లు ఖరారు
02-07-2017 01:35:04

 
  • మేఘా, నవయుగకు పనులు
 
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖరారయ్యాయి. స్టేజ్‌-1 నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 3, 4 నిర్మాణాల కోసం పిలిచిన టెండర్లను మేఘా ఇంజనీరింగ్‌, నవయుగ కన్సార్షియం దక్కించుకున్నాయి. ఫైనాన్స్‌ బిడ్లను శనివారం నాడు జల వనరుల శాఖ ఓపెన్‌ చేసింది. ఈ టెండర్లలో ప్యాకేజీ-3 కోసం మేఘా ఇంజనీరింగ్‌, నవయుగ కన్సార్షియం బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో రూ.652 కోట్లతో జిల్లేరు రిజర్వాయరు వద్ద చేపట్టే పనులను మేఘా ఇంజనీరింగ్‌ దక్కించుకుంది. 4.40 శాతం అధికంగా బిడ్‌ను మేఘా కోట్‌ చేసింది. ప్యాకేజీ 3లో పంప్‌ హౌస్‌, పైపు లైన్‌ పనులను మేఘా పూర్తి చేస్తుంది. అదేవిధంగా జిల్లేరు రిజర్వాయరు వద్ద 68వ కిలోమీటరు నుంచి 106వ కిలోమీటరు వరకూ కాలువ పనులతో పాటు జిల్లేరు, గుడ్డిగూడెంల వద్ద రెండు పంప్‌ హౌజ్‌లను రూ.1608 కోట్లకు నవయుగ కన్సార్షియం దక్కించుకుంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
మేఘా, నవయుగకు ‘చింతలపూడి’ పనులు
20-07-2017 02:06:18
 
  • ఆర్కే ఇన్‌ఫ్రాకు వెలిగొండ.. ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం
 
అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): చింతలపూడి మూడో దశ పనులను మేఘా ఇంజనీరింగ్‌కు, నాలుగో దశ పనులను నవయుగ ఇంజనీరింగ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం తీర్మానించింది. అదేవిధంగా వెలిగొండ టన్నెల్‌కు సంబంఽధించిన పనులు ఆర్కే ఇన్‌ఫ్రాకు అప్పగించాలని నిర్ణయించారు. చింతలపూడి మూడో దశ పనులకు ఇంటర్నల్‌ బెంచ్‌ మార్కు ధర రూ. 652.5 కోట్లకు 4.4ు అధికంగా రూ.681.21 కోట్లకు మేఘా టెండరు వేసింది. చింతలపూడి నాలుగో దశ పనులకు ఇంటర్నల్‌ బెంచ్‌ మార్కుగా నిర్ధారించిన రూ.1608.50 కోట్లకు నవయుగ 4.49ు అధికంగా టెండరు వేసింది. వెలిగొండ టన్నెల్‌ పనులకు సంబంధించి బెంచ్‌ మార్క్‌గా నిర్ధారించిన రూ.91.15 కోట్లకు 4.71ు అదనంగా 95.44 కోట్లకు టెండరు దాఖలు చేసిన ఆర్కే ఇన్‌ఫ్రా కంపెనీకి పనులు అప్పగించాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...

Chintalapudi is very important project, it will have effect in almost 10 backward constituencies in West Godavari & Krishna districts.

 

What is the deadline for this project? Idi complete ayithe before election Uma will win with highest majority in Krishna. 

 

Navayuga belongs to Kavuri/Rayapati, should have given this as well to Megha, work completion is important in time evadu capable ayithe vaallake ivvali.

Link to comment
Share on other sites

మెట్ట రైతు వరప్రదాయిని ‘చింతలపూడి’
21-08-2017 02:59:20
 
  • ఎత్తిపోతలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నూజివీడు: చింతలపూడి ఎత్తిపోతల పథకం మెట్టప్రాంతాలకు వరప్రదాయిని అని రిటైర్డ్‌ ఎన్‌ఎస్‌పీ డీఈ జి.వి.హెచ్‌ చలపతిరావు అన్నారు. ఆదివారం నూజివీడు అమర్‌భవన్‌లో చింతలపూడి ఎత్తిపోతల పథకంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతలను ఫేజ్‌ -2 ద్వారా రూ.4,900 కోట్లతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. నాగార్జునాసాగర్‌ థర్డ్‌జోన్‌ స్థిరీకరణ ద్వారా 2.10లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు మరో 70వేల ఎకరాలకు అదనంగా నీరిచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎఫెక్స్‌కమిటీ రాష్ట్రసభ్యులు ఆళ్ళగోపాలకృష్ణ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ టైల్యాండ్‌ ప్రాంతాలకు ఆరు టీఎంసీలు వచ్చినా నీటిని పూర్తిస్థాయిలో అందించ లేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో జీవో 94ద్వారా థర్డ్‌జోన్‌ను స్థిరీకరించేందుకు చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్‌ -2కి ఈ నెలాఖరున ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారని తెలిపారు.
Link to comment
Share on other sites

ee project complete ayithe Jaggayyapeta thappa migatha anni constituencies ki Godavari water ichhinatlu by next year through Pattiseema (Polavaram) & Chintalapudi. Jaggayyapeta constituency lo kooda konni places ki vasthundi emo water.

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 1 month later...
  • 4 weeks later...

భూసేకరణకు అద]నం! 
సమస్య పరిష్కారం దిశగా చర్యలు 
ఎకరానికి రూ.3 లక్షలు ఇచ్చేలా ప్రణాళిక
ఈనాడు, అమరావతి: చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణలో కొన్ని చోట్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా జలవనరులశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అదనపు మొత్తాలను చెల్లించి సేకరించాలని భావిస్తోంది. గోదావరి జలాలను వరద సమయంలో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు ఈ ఎత్తిపోతల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రారంభం కాగా... గత ఏడాది ఈ పథకం స్వరూపం మొత్తం మార్పుచేసి తిరిగి టెండర్లు పిలిచారు. ఇందులో భాగంగా ఇంకా దాదాపు 5వేల ఎకరాల భూమి వరకు రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. దీంతో పాటు 9560 ఎకరాల అటవీభూమి అవసరమవుతుంది. 
4 ప్యాకేజీలుగా పనులు: తొలి ప్యాకేజీలో 13.22 కిలోమీటర్ల లీడింగ్‌ ఛానల్‌ తవ్వకం పనులు, మరో 36 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ పనులు ఉన్నాయి. జల్లేరు జలాశయం నిర్మించాలి. ఇక్కడ అటవీభూమి అవసరమవుతుంది. పంపుహౌస్‌లు నిర్మిస్తున్నారు. బీ రెండు, మూడు ప్యాకేజీ పనుల్లో భాగంగా 32 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు చేపట్టారు. పంపుహౌస్‌లు ఉన్నాయి. బీ నాలుగో ప్యాకేజీలో పంపుహౌస్‌తో పాటు 38.3 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు ఉన్నాయి. ఈ అన్ని పనులకు సంబంధించి భూ సేకరణ జరుగుతోంది.
2013 చట్టానికి అదనంగా... పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, పోలవరం టి.నరసాపురం మండలాల్లో దాదాపు 4,300 ఎకరాల భూసేకరణకు సంబంధించి రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి 2013 భూసేకరణ చట్టంతో పాటు వివిధ అంశాల ప్రకారం ఎకరానికి రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు అందుతోంది. అయితే ఆ ధరకు భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించడం లేదు. తమవి విలువైన భూములని, వాణిజ్య పంటలు పండిస్తుంటామని, ఆ ధరకు ఇవ్వలేమని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అదనంగా ఎకరానికి రూ. 3 లక్షల వరకు ప్రత్యేకంగా ఏకమొత్తంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు రూ.138 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుందని అధికారులు లెక్కించారు. ఈ అంశాన్ని వచ్చే మంత్రిమండలి సమావేశం ముందుంచి..ఆమోదం పొందాక ముందుకెళ్లాలని నిర్ణయించారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
చింతలపూడి-2 కాల్వ పనులు ప్రారంభం
11-03-2018 08:15:16
 
636563529147667314.jpg
చాట్రాయి, కృష్ణా: చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 కాల్వ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. చాట్రాయి మండలం చీపురుగూడెంలో నూజివీడు ఆర్డీవో రంగయ్య, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రైతులు బొట్టు ప్రసాద్‌, బొట్టు విజయచౌదరి భూముల్లో పనులు మొదలయ్యాయి. అనంతరం తహసీల్దార్‌ బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆర్డీవో మాట్లాడుతూ జిల్లా మెట్టప్రాంత రైతులకు ఈ పథకం గొప్ప వరమన్నారు. ఐదు నియోజకవర్గాల్లో 2.40 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలమవుతాయని, కాల్వ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కాల్వ నిర్మాణం జరిగే గ్రామాల్లో తహసీల్దార్ల ఆధ్వర్యంలో భూ సమీకరణ ఆవార్డు విచారణ జరుగుతున్నదని రైతులు తమ హక్కు పత్రాలు చూపించి వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. పిత్రార్జితంగా వచ్చిన భూములకు పత్రాలు లేకపోయినా విచారణ జరిపి నష్టపరిహారం చెల్లిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
 
   చీపురుగూడెం లో పేద కుటుంబం రోడ్డు మార్జిన్‌లో పూరిల్లు నిర్మించుకుని ఉంటోందని, ఆ ఇల్లు కాల్వలో పోతున్నందున ఆ కుటుంబానికి ఇంటి స్థలం ఇప్పించాలని స్థానిక నేతలు కోరగా, పరిశీలించి ఆ కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని ఆర్డీవో, తహసీల్దార్‌ను ఆదేశించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం సాగునీటి ఇబ్బందులు తలెత్తనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారన్నారు. జలవనరులశాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషితో చింతలపూడి ఫేజ్‌-2 పథకానికి సీఎం ఆమోదం తెలిపి బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించడం శుభపరిణామ మన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రమేష్‌, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చిట్నేని శివరామకృష్ణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మందపాటి బసవారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బొట్టు రామచంద్రరావు, సర్పంచ్‌ ఘంటసాల మన్మధరావు, నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, నక్కా రాము, తొమ్మండ్రు శ్రీనివాసరావు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...