Jump to content

Chintalapudi Lift Irrigation Project


Recommended Posts

Chintalapudi project dwara ee Sep-Oct lo water emanna release cheyyochha?

West Godavari-Krishna lo ee project valla baaga use vundi indirectly it will benefit Rayalseema as well by saving some water in Srisailam.

 

Link to comment
Share on other sites

  • 2 months later...
  • 2 weeks later...
  • 4 weeks later...
24 minutes ago, sonykongara said:

chintalapudi lift irrigation phase 2 works ela jargutunnayi videos unte post cheyyandi

abbayi.g brother konchem cheppandi

Sunday vellam. Canals almost done. Structures work peddaga start cheyyaledu. Right canal laga, temporary gaa chestaremo.

Guddigudem Lift visit cheyyaledu. So no idea.

Link to comment
Share on other sites

23 minutes ago, AbbaiG said:

Sunday vellam. Canals almost done. Structures work peddaga start cheyyaledu. Right canal laga, temporary gaa chestaremo.

Guddigudem Lift visit cheyyaledu. So no idea.

tfs bro ,water vadile chance udha bro August 15 antunadu uma

Link to comment
Share on other sites

54 minutes ago, raghu6 said:

Dwaraka Tirumala area lo compensation eppudu istharu farmers ki emann idea Vunda 

Compensation entha ki oppukunnaru. Any idea?

Polavaram RMC tho equal ga compensation ivvamani adugutunanaru ani telusu. Godava settle ayyindaa?

Link to comment
Share on other sites

31 minutes ago, AbbaiG said:

Compensation entha ki oppukunnaru. Any idea?

Polavaram RMC tho equal ga compensation ivvamani adugutunanaru ani telusu. Godava settle ayyindaa?

acre ki 20 lakhs isthunnaru ani matrame telusu and government rate vachi 7 lakhs per acre 

godava settle ayyindo ledo teliyadu but ma bank account details teesukonnaru 

Link to comment
Share on other sites

1 hour ago, raghu6 said:

acre ki 20 lakhs isthunnaru ani matrame telusu and government rate vachi 7 lakhs per acre 

godava settle ayyindo ledo teliyadu but ma bank account details teesukonnaru 

farmers in yerraguntapalli met devineni uma . he said that govt will give 28 lakh/acre in august

Link to comment
Share on other sites

ఆగస్టు 15న ‘చింతలపూడి’ ప్రారంభం: దేవినేని
16-07-2018 03:03:37
 
విజయవాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గోదావరి, పశ్చిమ కృష్ణా రైతులకు ఉపయుక్తమయ్యేలా నిర్మించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ఆగస్టు 15న ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో జరిగిన కేఎల్‌.రావు 116వ జయంతి సభలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. పోలవరం కాంక్రీట్‌ పనులను 2019 ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 44,357 మంది రైతులు పోలవరం ప్రాజెక్టును సందర్శించారని తెలిపారు.
Link to comment
Share on other sites

ఎత్తిపోతల.. నత్తనడకలా..! 
చింతలపూడి.. తప్పని చింతలు 
40శాతం కూడా జరగని పనులు 
వచ్చే ఫిబ్రవరికి పూర్తయ్యేనా? 
weg-top2a.jpg

చింతలపూడి ఎత్తిపోతల వివరాలు 
ఒప్పంద విలువ : రూ. 4909 కోట్లు 
అంచనా విలువ : రూ. 4062.50 కోట్లు 
సాగునీరు   : 4.80 లక్షల ఎకరాలకు 
తాగునీరు   : 21 లక్షల మందికి 
* జిల్లాలో కాలువ ప్రవహించే గ్రామాలు : తాడిపూడి, గుడ్డిగూడెం, కన్నాపురం, దర్భగూడెం, బుట్టాయగూడెం, ఎర్రగుంటపల్లి, చింతలపూడి, 
* లబ్ధి పొందే మండలాలు: తాళ్లపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, ద్వారకాతిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, పెదవేగి, దెందులూరు, పెదపాడు 
ప్యాకేజీలు : 4 
ఒకటో ప్యాకేజీ : రూ. 1202.62 కోట్లు 
రెండో ప్యాకేజీ : రూ. 497.95 కోట్లు 
మూడో ప్యాకేజీ : రూ. 681.21 కోట్లు 
నాలుగో ప్యాకేజీ : రూ. 1680.72 కోట్లు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు

జిల్లాలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద మొదట లిప్టు నిర్మిస్తున్నారు. 18 పంపులు ఏర్పాటు చేసి 33 మీటర్లు ఎత్తిపోసి కాలువకు మళ్లిస్తారు. అక్కడ్నుంచి 13.22 కిలోమీటర్లు ప్రవహించి గుడ్డిగూడెం చేరుకుంటుంది. అక్కడ రెండో లిప్టు నిర్మాణం జరుగుతోంది. అక్కడ 14 పంపులతో నీటిని ఎత్తిపోసి ప్రధాన కాలువలోకి మళ్లిస్తారు. కొవ్వాడ, ఎర్రకాలువ, తమ్మిలేరు కాలువలకు లింకు కాలువల ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో సాగుకు నీరందిస్తారు. అక్కడి నుంచి 85కిలోమీటర్లు ప్రవహించిన తరవాత చీపురుగూడెం వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవహిస్తోంది. అక్కడ నాగార్జునసాగర్‌ ఉప ఎడమకాలువకు మళ్లిస్తారు. నూజివీడు బ్రాంచి, జమలాపురం మేజర్‌, గానుగపాడు మేజర్‌, మైలవరం బ్రాంచి కాలువ ద్వారా కృష్ణా జిల్లాలో ఆయకట్టుకు నీరందిస్తారు. తొలుత రెండు ప్యాకేజీల్లో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. చింతలపూడి వరకే దీనిద్వారా నీటిని సరఫరా చేయాలనుకున్నారు. పశ్చిమలోని 15 మండలాల్లో 2.80 లక్షల ఎకరాలకు నీటిని పంపిణీ చేయాలనుకున్నారు. ఈ కాలువ ద్వారా 56 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలనుకున్నారు. రెండో దశలో 196 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత కృష్ణా జిల్లాలోని 18 మండలాలకు కూడా నీరందించాలని అనుకున్నారు. ఫేజ్‌-1 పనులు 50 నుంచి 60 శాతం పూర్తయ్యాయి. ఫేజ్‌-2 పనులు మాత్రం చాలా వెనుకబడి ఉన్నాయి.

ప్యాకేజీలు.. పనులు.. 
ప్యాకేజీ-1 : స్టేజ్‌-1, స్టేజ్‌-2 పంపుహౌస్‌లు, తుపాకుల గూడెం నుంచి గుడ్డిగూడెం వరకు 13.2 కిలోమీటర్ల లీడింగు ఛానల్‌, 0 నుంచి 36 కిలోమీటర్ల వరకు ప్రధానకాలువ, పంపిణీ వ్యవస్థ నిర్మాణం ఈ ప్యాకేజీలో చేపడుతున్నారు. పంపుహౌస్‌ - 1, 2 పురోగతిలో ఉన్నాయి. జల్లేరు వాగుపై  1725 మీటర్ల వయాడక్టు నిర్మాణంలో ఉంది. 13 కట్టడాలు పనులు జరుగుతున్నాయి. ఒక నిర్మాణం పూర్తయ్యింది.

ప్యాకేజీ-2: 36 నుంచి 68 కిలోమీటర్ల వరకు ప్రధాన కాలువ, పంపిణీ వ్యవస్థ నిర్మాణం ఈ ప్యాకేజీలో చేపడుతున్నారు. కాలువ తవ్వకం పనులు, 7 కట్టడాలు నిర్మాణాలు జరుగుతున్నాయి.

ప్యాకేజీ-3: స్టేజ్‌-1ఎ పంపుహౌస్‌ పనులు జరుగుతున్నాయి. ప్రెజరు మెయిన్‌ పనులు, 7 వరుసల్లో 2.85 కిలోమీటర్ల ప్రెజరు మెయిను పనులకుగాను 2 వరుల్లో  1.248 కిలోమీటర్ల ప్రెజరు మెయిను పనులు పూర్తయ్యాయి.

ప్యాకేజీ -4: స్టేజ్‌-2ఎ, స్టేజ్‌-3ఎ నిర్మాణం, ప్రధాన కాలువ 68 నుంచి 106 కిలోమీటర్ల వరకు, కొవ్వాడ, ఎర్రకాలువ, తమ్మిలేరు లింకు కాలువ ఈ ప్యాకేజీలో చేపడతారు. పంపుహౌస్‌-2ఎ ప్రెజరు మెయిను పనులు, కాలువ తవ్వకం, తమ్మిలేరు ఆక్విడక్టు పునాది నిర్మాణం, వేంపాడు మేజరు కాలువ తవ్వకం పనులు పురోగతిలో ఉన్నాయి. 7 కట్టడాలు పనులు జరుగుతున్నాయి.

* కృష్ణా జిల్లాలో కాలువ ప్రవహించే గ్రామాలు: చీపురుగూడెం, కోటపాడు, గంటిపాడు, బూరుగగూడెం

* కృష్ణా జిల్లాలో లాభపడే మండలాలు: చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఎ.కోడూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ గ్రామీణం.

వచ్చే నెలలో సాధ్యమయ్యేనా 
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు నెమ్మదిగానే సాగుతున్నాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలంటే అద్భుతమే జరగాల్సి ఉంది. వచ్చే నెలలో పోలవరం కుడి ప్రధానకాలువకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వనున్నామని జలవనరులశాఖామంత్రి ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం కుడిప్రధానకాలువ సామర్ధ్యం 17500 క్యూసెక్కులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే ఈ నీరు తరలిస్తారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా 8500 క్యూసెక్కులు మాత్రమే పారిస్తున్నారు. అయితే 9వేల క్యూసెక్కుల నీటిని చింతలపూడి పథకం నుంచి తోడి లోటును భర్తీ చేయాలని అనుకుంటున్నారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామం వద్ద 14.7 కిలోమీటర్ల వద్ద చింతలపూడి పథకం నీటిని పోలవరం కుడికాలువలో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

గడువులోగా పూర్తయ్యేనా? 
వచ్చే ఏడాది పిబ్రవరి 26నాటికి ఈ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు అన్ని పనులు చూస్తే 40శాతం కూడా జరగలేదు. ఫేజ్‌-1 పనులు 50 నుంచి 60 శాతం పనులు జరిగాయి. ఫేజ్‌-2 పనులు చాలా వెనుకబడి ఉన్నాయి. 20 శాతం కూడా జరగలేదు. దానికి తోడు భూసేకరణ ఇంకా కొన్నిచోట్ల జరగలేదు. మొత్తం భూసేకరణ 11700 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు 9255 ఎకరాలు సేకరించారు. ఇంకా 1500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కొన్నిచోట్ల రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు పరిష్కారం కావు. అయితే పట్టిసీమ తరహాలో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. న్యాయవివాదాలను పరిష్కరించేందుకు ఆయా పరిధి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తాం 
నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే వేగవంతంగానే పనులు చేస్తున్నారు. భూసేకరణలో న్యాయవివాదాలను పరిష్కరించనున్నాం. - వీరకుమార్‌, పర్యవేక్షక ఇంజినీరు, పోలవరం కుడిప్రధాన కాలువ, చింతలపూడి ఎత్తిపోతల పథకం

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...