Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply
ఏపీని ఆదర్శంగా తీసుకోండి
12-07-2017 03:25:02
 
  • అక్కడి ఫైబర్‌ గ్రిడ్‌, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ భేష్‌
 
 
అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాన్యులకు అతి తక్కువగా రూ.149కే టెలివిజన్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ వంటి పైబర్‌ అప్టిక్‌ సేవలను అందిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే అన్ని రాష్ట్రాలూ ఫైబర్‌ గ్రిడ్‌ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది. భారత్‌ నెట్‌ కింద దేశ వ్యాప్తంగా ఫైబర్‌నెట్‌ సేవలను అందించాలని నిర్ణయించామని.. ఏపీలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలంటే.. రూ.5000 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు వేశామని వివరించింది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి.. కేవలం రూ.333 కోట్లనే వ్యయం చేసిందని కేంద్రం ప్రశంసించింది. ఢిల్లీలో మంగళవారం నాడు నీతి ఆయోగ్‌, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ ట్రాన్ప్‌ఫర్మేషన్‌ ఇండెక్స్‌’పై రాష్ట్రాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ఐటీ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తోన్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పైనా చర్చ జరిగింది. ఇదే సమయంలో ఏపీలో అమలవుతున్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, పైబర్‌ అప్టిక్‌ సేవలను గురించి పలు రాష్ట్రాలు ఆసక్తిగా తెలుసుకున్నాయి. రాష్ట్రంలో పర్యటించి ప్రత్యక్షంగా వాటి గురించి తెలుసుకుంటామని చెప్పాయి. ఇతర రాష్ట్రాల కార్యదర్శులను రాష్ట్రానికి రావాల్సిందిగా అహ్మద్‌బాబు ఆహ్వానించారు.
Link to comment
Share on other sites

 

ఏపీని ఆదర్శంగా తీసుకోండి

12-07-2017 03:25:02

 

 

 

  • అక్కడి ఫైబర్‌ గ్రిడ్‌, రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ భేష్‌

 

అమరావతి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాన్యులకు అతి తక్కువగా రూ.149కే టెలివిజన్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ వంటి పైబర్‌ అప్టిక్‌ సేవలను అందిస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే అన్ని రాష్ట్రాలూ ఫైబర్‌ గ్రిడ్‌ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది. భారత్‌ నెట్‌ కింద దేశ వ్యాప్తంగా ఫైబర్‌నెట్‌ సేవలను అందించాలని నిర్ణయించామని.. ఏపీలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలంటే.. రూ.5000 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు వేశామని వివరించింది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి.. కేవలం రూ.333 కోట్లనే వ్యయం చేసిందని కేంద్రం ప్రశంసించింది. ఢిల్లీలో మంగళవారం నాడు నీతి ఆయోగ్‌, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘డిజిటల్‌ ట్రాన్ప్‌ఫర్మేషన్‌ ఇండెక్స్‌’పై రాష్ట్రాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ఐటీ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ బాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలు చేస్తోన్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పైనా చర్చ జరిగింది. ఇదే సమయంలో ఏపీలో అమలవుతున్న రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, పైబర్‌ అప్టిక్‌ సేవలను గురించి పలు రాష్ట్రాలు ఆసక్తిగా తెలుసుకున్నాయి. రాష్ట్రంలో పర్యటించి ప్రత్యక్షంగా వాటి గురించి తెలుసుకుంటామని చెప్పాయి. ఇతర రాష్ట్రాల కార్యదర్శులను రాష్ట్రానికి రావాల్సిందిగా అహ్మద్‌బాబు ఆహ్వానించారు.

Consultant charges vasool cheyali andari deggara :child:

Link to comment
Share on other sites

199కే ఫైబర్‌ సేవలు
21-07-2017 04:11:47
 
636362071312333475.jpg
  • ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, టీవీ ప్రసారాలకు రూ.149
  • ఐపీటీవీ, జీపాన్‌ బాక్సులకు నెలకు రూ.50: లోకేశ్‌
 
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ప్రసారాలను ప్రైవేటు ఆపరేటర్ల కంటే తక్కువ ధరకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, 250 చానెళ్ల ప్రసారానికి రూ.149 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రసారాల కోసం ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌ (ఐపీటీవీ), జిగాబైట్‌ యాక్టివ్‌ పాసివ్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ (జీపాన్‌) బాక్సులను అందజేస్తారు. ఇతర ప్రైవేటు ఆపరేటర్లు అందించే సెట్‌టాప్‌ బాక్సుల కంటే.. ఏపీ ఫైబర్‌ నెట్‌ అందించే ఐపీటీవీ, జీపాన్‌ బాక్సులు అత్యంత సమర్థవంతమైనవి. అందువల్ల ఈ బాక్సుల ధర రూ.4000 దాకా ఉంటుంది. ఇంత భారాన్ని సామాన్యులపై ఒకేసారి వేయడం సరికాదని భావించిన ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌.. నెలకు రూ.100 చొప్పున 40 నెలల్లో వసూలు చేయాలని నిర్ణయించింది. కానీ ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో నెల వాయిదాను రూ.50కు కుదించాలని సూచించారు. దీంతో రూ.199కే ఫైబర్‌ సేవలు అందనున్నాయి. కాగా, రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌ సేవల వేగాన్ని పెంచాలని ఏపీఎస్ఎఫ్ ఎల్‌ చైర్మన్‌ అజయ్‌జైన్‌, ఎండీ ఎ.బాబులను ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఆదేశించారు. ఫైబర్‌ సేవలపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ 23,304 ఇళ్లకు కేబుల్‌ కనెక్షన్‌ ఇచ్చామని, మరో 38,969 ఇళ్లకు కనెక్షన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. చెట్ల కొమ్మలు వైర్లకు తగలకుండా, కొమ్మలు నరికే సమయంలో వైర్లు కూడా తెగిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఫైబర్‌ నెట్‌ సేవల వేగాన్ని పెంచాలని లోకేశ్‌ ఆదేశించారు. కాగా, వైద్య సేవలను ఆందించడంలో కీలకమైన పైకేర్‌ సెంటర్‌ను శుక్రవారం మంగళగిరిలో లోకేశ్‌ ప్రారంభించనున్నారు. ఈ సంస్థలో 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయి. 24న మంగళగిరిలో పైడేటా సెంటర్‌ను ప్రారంభిస్తారు. 31న విశాఖలో గ్లోబన్‌ ఇన్‌ హౌస్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
Link to comment
Share on other sites

ట్‌టాప్‌ బాక్సు అద్దెతో కలిపి రూ.234కే ఫైబర్‌ నెట్‌!

బాక్సు అద్దె ఎనిమిదేళ్లు సులభవాయిదాల్లో వసూలు

త్వరలో ఆదేశాలు జారీ చేయనున్న ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఫైబర్‌ నెట్‌ ప్రాథమిక అద్దె శ్లాబులో ప్రభుత్వం స్వల్ప సవరణలు చేయనుంది. కొత్త విధానం ప్రకారం ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ నెలవారీ అద్దె, సెట్‌టాప్‌ బాక్సు అద్దె, పన్నులతో కలిసి రూ.234.82 అవుతుంది. సామాన్యులకు తక్కువ ధరకే కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌, వైఫై, టెలిఫోన్‌ కనెక్షన్‌ సదుపాయాలు కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ వినియోగదారులకు ఆరు రకాల శ్లాబుల విధానంలో కనెక్షన్లు ఇస్తోంది. తాజాగా సెట్‌టాప్‌ బాక్సుల అద్దెలో రూ.49లు తగ్గిస్తూ, సులభ వాయిదా కాలపరిమితిని ఎనిమిదేళ్లకు పెంచుతూ ఫైబర్‌ నెట్‌ కొత్తగా నిర్ణయం తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్‌ నెట్‌ అద్దెలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్త అద్దెను త్వరలో ప్రకటించనున్నారు. ఫైబర్‌ నెట్‌ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే 23,800 ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చింది. మరోపక్క రాష్ట్రంలో ఫైబర్‌ నెట్‌ పనులు సాగుతున్న తీరుపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు బిల్లింగ్‌ కూడా ప్రారంభించాలని మంత్రి సూచించారు.

మంగళగిరికి ఐటీ కంపెనీ

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని మంగళగిరికి ఐటీ కంపెనీల ఆగమనం ప్రారంభమైంది. వైద్య రంగంలో ఐటీ సొల్యూషన్స్‌ అందించే ‘పైకేర్‌ సొల్యూషన్స్‌’ సంస్థ శుక్రవారం ఇక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించనున్నారు. రూ.10 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ సంస్థ ఇక్కడ 500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.

20ap-state3a.jpg

Link to comment
Share on other sites

Maa inti dhaggara ACT Fiber vaadu LCO/MSO

Almost 9 months follow-up chesa, last month kuda boxes levu annadu. Also, only cable istham annadu. Internet ippudu provide cheyyalem annadu. inka wait chesi waste ani 10 days back HD connection theesukunna SunDirect dhi

 

Actual ga ila TV+Internet connection Govt iste ACT lanti private operators ki loss. Mari veellu direct competitors tho tie up ayite ilage vuntundhi

Link to comment
Share on other sites

ఫైబర్‌ గ్రిడ్‌ వచ్చేస్తోంది..!
 
 
636364570270569411.jpg
  • ఆగస్టు నుంచి ఇంటింటికీ డిజిటల్‌ సేవలు.. విజయవాడ, గుంటురు నగరాల్లో కేబులింగ్‌ పూర్తి.. బేసిక్‌ సర్వీస్‌ ప్యాకేజీ రూ.149కే
 
విజయవాడ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఫైబర్‌ డిజిటల్‌ సేవలు కూతవేటు దూరంలోకి వచ్చేశాయి. ఆగస్టు నుంచి ప్రతి ఇంటికీ ఫైబర్‌ గ్రిడ్‌ను అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో కేబులింగ్‌ పనులు పూర్తయ్యాయి. గ్రిడ్‌ అనుసంధానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రెండు అసెంబ్లింగ్‌ యూనిట్లలో ఒకటి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలకు ఈ యూనిట్‌ నుంచి సేవలు అందుతాయి. గ్రిడ్‌ నుంచి డిజిటల్‌ సేవలు పొందేందుకు అవసరమైన సెట్‌టాప్‌ బాక్సుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఆగస్టులో సెట్‌టాప్‌ బాక్సులు రాగానే రోజుకు వెయ్యి చొప్పున లక్ష్యంగా ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
 
పైబర్‌ గ్రిడ్‌ ఉద్దేశం ఇదీ..
అత్యంత శక్తిమంతమైన ఇంటర్నెట్‌ ఆధారిత సేవలను అందించడమే ఫైబర్‌ గ్రిడ్‌ ముఖ్య ఉద్దేశం. అత్యుత్తమ కేబుల్‌ ద్వారా అందించే ఈ సేవలతో ఇంటర్నెట్‌ వేగాన్ని గరిష్టంగా పెంచవచ్చు. గృహావసరాలకు 15 ఎంబీపీ ఎస్‌, గృహేతర వినియోగదారులకు 100 ఎంబీపీఎస్‌ వేగంతో వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్యాకేజీని బట్టి 5జీబీ నుంచి 250జీబీ వరకు ఎఫ్‌పీయూ (ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ) లిమిట్‌ ఉంటుంది.
 
ట్రిపుల్‌ ప్లే, విలువ ఆధారిత సేవలు
ఫైబర్‌గ్రిడ్‌ పథకంలో భాగంగా ట్రిపుల్‌ ప్లే సర్వీసు, విలువ ఆధారిత సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ట్రిపుల్‌ ప్లే సర్వీసుల కింద వాయి్‌స(టెలిఫోన్‌), వీడియో(టీవీ చానల్స్‌), డేటా(ఇంటర్నెట్‌) సేవలు అందిస్తారు. దీనిలో ఐపీ టెలివిజన్‌ (250 చానల్స్‌- హెచ్‌డీ చానళ్లతో సహా), అన్‌ లిమిటెడ్‌ హైస్పీడ్‌ వైఫై (గృహాలకు 15 ఎంబీపీఎస్‌, గృహేతరాలకు 100 ఎంబీపీఎస్‌), ఉచిత టెలిఫోన్‌ కనెక్షన్‌ (ఏపీ ఫైబర్‌ ఖాతాదారుల మధ్య ఉచిత అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌) ఉంటాయి. ఇక విలువ ఆధారిత సేవల విభాగంలో కోరుకున్న సినిమాలు, వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం, ఇ-కామర్స్‌, చదువు, వైద్యం, వ్యవసాయ సంబంధిత సమాచారం, టెలిమెడిసిన్‌, ప్రోగ్రామ్‌ రికార్డింగ్‌, ఆన్‌లైన్‌ బిల్‌ పేమెంట్స్‌, క్యాచప్‌ టీవీ, ఆండ్రాయిడ్‌ అప్లికేషన్స్‌, క్లౌడ్‌ ఆధారిత సేవల వంటివి అందిస్తారు.
 
కాల్‌ చార్జీలు ఇలా...
ఏపీ ఫైబర్‌ ఖాతాదారుల మధ్య కాల్స్‌ పూర్తిగా ఉచితం. ల్యాండ్‌లైన్‌కి నిమషానికి 50 పైసలు, మొబైల్‌ ఫోన్లకు నిమషానికి రూ.1 చొప్పున చార్జి చేస్తారు. ఐఎ్‌సడీ కాల్స్‌కు ప్రస్తుతం బీఎ్‌సఎన్‌ఎల్‌ చార్జీల ఆధారంగా వసూలు చేస్తారు.
 
ఈ సేవలను పొందాలంటే..
ఏపీ ఫైబర్‌ సేవలను పొందాలంటే ముందుగా రెండు రకాల సెట్‌ టాప్‌ బాక్సులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి జీపీఓఎన్‌ బాక్స్‌ కాగా, రెండోది ఐపీటీవీ బాక్స్‌. వీటిని ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ రూ.4000కు అందిస్తుంది. ఒకేసారి రూ.4000 చెల్లించవచ్చు. లేదా ముందుగా రూ.1700 చెల్లించి నెలకు రూ.99 చొప్పున మూడేళ్లపాటు సులభ వాయిదాల్లోనూ చెల్లించవచ్చు. రూ.500 ముందు కట్టేవారికి నెలకు రూ.99 చొప్పున నాలుగేళ్లు వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం 1800-599-5555 టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫోన్‌ చేయాలి.
 
ప్యాకేజీలు... ధరలు
బేసిక్‌: పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ ప్యాకేజీని రూ.149కే అందిస్తోంది. దీనిలో 250 టీవీ చానల్స్‌, 15 ఎంబీపీఎస్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌, ఎఫ్‌యూపీ పరిమితి 5జీబీ, పరిమితి తర్వాత 1ఎంబీపీఎస్‌ ఉంటుంది.
 
స్టాండర్డ్‌: దీనిలో 250 టీవీ చానల్స్‌, 15 ఎంబీపీఎస్‌ ఇంటర్‌నెట్‌ స్పీడ్‌, ఎఫ్‌యూపీ పరిమితి 25 జీబీ, పరిమితి దాటిన తర్వాత 1 ఎంబీపీఎస్‌ ఇస్తారు. దీనిధర రూ.399గా ఉంటుంది.
ప్రీమియం: దీనిలో 250 టీవీ చానల్స్‌, 15 ఎంబీపీఎస్‌ ఇంటర్‌నెట్‌ స్పీడ్‌, ఎఫ్‌యుపీ పరిమితిలో 50 జీబీ, పరిమితి దాటిన తర్వాత 1 ఎంబీపీఎస్‌ ఇస్తారు. దీని ధర రూ.599.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

ఐపీటీవీ’ బాక్సులకు మినహాయింపు

ఈనాడు, అమరావతి: ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ సంస్థ చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఐపీటీవీ-ఆండ్రాయిడ్‌ బాక్సుల భద్రత ప్రమాణాల(సేఫ్టీ స్టాండర్డ్స్‌)పై ఈ ఒక్కసారికే కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ఫైబర్‌నెట్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎ.బాబుకు సమాచారం అందింది. ఏపీ ఫైబర్‌నెట్‌ కార్యకలాపాల్లో భాగంగా దిగుమతిచేసిన ఆండ్రాయిడ్‌ బాక్సులపై బీఐఎస్‌ ప్రమాణాలు పాటించకపోవడంపై ఈనెల 6న చెన్నై ఓడరేవుకు వచ్చిన కంటైనర్‌ను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది వరకే కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం రాసిన లేఖపై ఎలక్ట్రానిక్‌, ఇనఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ స్పందిస్తూ డిసెంబరు 31లోపు ఐపీటీవీ-ఆండ్రాయిడ్‌ బాక్సుల దిగుమతులపై భద్రతా ప్రమాణాల అంశంపై మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...