Jump to content

AP fibre Grid project


Recommended Posts

12 minutes ago, sonykongara said:

bro,net ledu ani annadi ma mother

Wifi router configuration cheyyali anukonta. Setup box ne wifi router emo. Tv lo ne inbuilt apps unnai YouTube dhi and some movies dhi govt dashboard dhi. YouTube lo major chandra kanth chusa

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 610
  • Created
  • Last Reply
అలాంటి చిత్రాలు ఫైబర్‌ టీవీలో ప్రసారం:  దిల్‌రాజు 

03330513BRK99-DILRAJU.JPG

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్‌తో అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌ ఆఫ్‌ తెలుగు లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  విజయవాడలోని ఫైబర్ నెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సినీ నిర్మాతలు దిల్‌రాజు, కె.ఎస్.రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కంటెంట్‌ అభివృద్ధిలో భాగంగా ఫైబర్‌ గ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు దిల్‌రాజు వెల్లడించారు. విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రసారం చేయనున్నట్టు చెప్పారు. వాటితో పాటు కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనల్నీ ఫైబర్ టీవీ ద్వారా ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే సందేశాత్మక లఘు చిత్రాలను ఫైబర్ నెట్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తామన్నారు. ఫైబర్ నెట్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సినీ నిర్మాత కె.ఎస్.రామారావు అభినందనలు తెలిపారు. ఫైబర్ నెట్ సౌకర్యాన్ని సినీరంగం అభివృద్ధి కోసం వినియోగించుకునేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రస్తుతం ఏపీ ఫైబర్ నెట్‌కు 2లక్షల మంది వినియోగదారులు ఉన్నారని.. భవిష్యత్తులో కోటి మంది వినియోగదారుల్ని చేరుకుంటామని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి దినేష్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు.
Link to comment
Share on other sites

మంత్రి నారా లోకేష్‌తో సినీ పెద్దల భేటీ.. పలు అంశాలపై చర్చ Updated : 13-Apr-2018 : 13:52
 
 
636592243514090113.jpg
అమరావతి: మంత్రి నారా లోకేష్ తో తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు కెఎస్ రామారావు, దిల్ రాజు, ఠాగూర్ మధు తదితరులు భేటీ అయ్యారు. ఫైబర్ గ్రిడ్ కంటెంట్ అభివృద్ధిలో భాగంగా ఫైబర్ గ్రిడ్‌తో ఒప్పందం చేసుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా థియేటర్లలో రిలీజ్‌కి నోచుకోని చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, కేబుల్ టీవీ లో ప్రసారమయ్యేలా చర్యలు తీసుకోవడమే కాకుండా సినిమా టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం లాంటి సేవలు ఈ ఒప్పందం ద్వారా ప్రజలకు అందించబోతున్నాం అని చెప్పారు.
 
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో సినీ ప్రరిశ్రమ అభివృద్ధి, స్టూడియోల నిర్మాణం, ఫిల్మ్ నగర్ లాంటి వాతావరణం ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రణాళికతో వస్తామని, దీనికి ప్రభుత్వ సహకారం కావాలని నారా లోకేష్‌ని కోరారు నిర్మాతలు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Link to comment
Share on other sites

ఫైబర్‌నెట్‌లో కోరుకున్న సినిమాలు!
14-04-2018 04:22:00
 
636592765220966022.jpg
  •  నిర్మాతల మండలితో ఒప్పందం
  •  సినీ పరిశ్రమ అభివృద్ధికీ చేయూత: లోకేశ్‌
  •  పూర్తి ప్రణాళికతో వస్తామన్న నిర్మాతలు
అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): నెలకు రూ.149లకే టీవీ, ఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్ ఎఫ్ ఎల్‌)... ఇకనుంచి ప్రేక్షకులు కోరుకున్న సమయంలో, నచ్చిన సినిమాలు చూసే అవకాశాన్నీ (మూవీ ఆన్‌ డిమాండ్‌) అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం సినీ నిర్మాతల మండలితో ఒప్పందం చేసుకుంది. సినీ ప్రముఖులు కేఎస్‌ రామారావు, దిల్‌ రాజు, ఠాగూర్‌ మధు తదితరులు శుక్రవారం సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ను కలిశారు. ఫైబర్‌గ్రిడ్‌ కంటెంట్‌ అభివృద్ధిలో భాగంగా ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌-నిర్మాతల మండలి మధ్య ఒప్పందం కుదిరింది. నిర్మాతల మండలి తరఫున దిల్‌ రాజు, ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌ తరఫున ఈసీవో దినేశ్‌కుమార్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా దినేశ్‌కుమార్‌ మాట్లాడుతూ... ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌కు 12,000 మంది కేబుల్‌ ఆపరేటర్లు, 1200 మంది ఎంఎ్‌సవోలతో కూడిన నెట్‌వర్క్‌ ఉందని, దాన్ని ఇంకా పెంచుకుంటామన్నారు. అనంతరం దిల్‌ రాజు మాట్లాడుతూ... ఏపీఎస్‌ఎ్‌ఫఎల్‌తో చేసుకున్న ఒప్పందం తెలుగుచిత్ర పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలుగు సినిమాలు, డాక్యుమెంటరీలను ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌కు ఇస్తే నిర్మాతకు ఆర్థికంగానూ కలిసి వస్తుందని అన్నారు. కేఎస్‌ రామారావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, స్టూడియోల నిర్మాణం, ఫిల్మ్‌ నగర్‌లాంటి వాతావరణం ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్రణాళికతో వస్తామన్నారు. దీనికి ప్రభుత్వ సహకారం కావాలని లోకేశ్‌ను కోరగా... ఆయన సానుకూలంగా స్పందించారు.
 
డిసెంబర్‌ నాటికి కోటి ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్లు
మే నెలకల్లా 10 లక్షలు, డిసెంబరు నాటికి కోటి కనెక్షన్లు ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని మంత్రి లోకేశ్‌... అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఫైబర్‌గ్రిడ్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అందిస్తున్న చానళ్ల సంఖ్యను 250 నుంచి 500కు పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ, ఎలకా్ట్రనిక్‌ శాఖల్లో ప్రస్తుతం ఇతర కంపెనీలు ఇంటర్నెట్‌ అందిస్తున్నాయని, వీటిల్లో తక్షణమే ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
9 hours ago, Yaswanth526 said:

This is how our lives changed.This is called development.. What a transformation..Kudos to u CM sir.

For making us to witness these wonderful things when we are alive..Thank u APfibernet..!!

https://pbs.twimg.com/media/DcFWGABV0AEwsG6.jpg

Great to hear. Kudos to CBN and Govt

Link to comment
Share on other sites

  • 3 weeks later...

సాంకేతిక అభివృద్ధికి చిహ్నంగా నిమ్మకూరులో ఇళ్లకు ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు, డిజిటల్ డోర్ నంబర్లు దర్శనమిస్తాయి

https://pbs.twimg.com/media/DeDMnz5VMAUgJcn.jpg

https://pbs.twimg.com/media/DeDMn00U0AABTWk.jpg

https://pbs.twimg.com/media/DeDMro1V0AEUb51.jpg

Link to comment
Share on other sites

Good response to AP FiberNet services

THE HANS INDIA |    Jun 01,2018 , 02:38 AM IST
      

grabon.jpg

Good response to AP FiberNet services
Good response to AP FiberNet services
 
 
Tirupati: Internet, phone, television channels and other services being offered through a broadband connection by Andhra Pradesh State FiberNet Limited (APSFL) for Rs 149 per month to every house is getting good response from the people of Chief Minister’s home district. 
 
The APSFL gave 25,000 connections in two months in the district. The State government is providing the FibreNet services through high-end technology by laying Optic Fibre Cables (OFCs) from the local electric sub-stations and HT electrical lines are used for data transmission with high quality.     
 
 
 
 
 
 
 
 
 
 
Two days ago, District Collector PS Pradyumna had reviewed the progress of FiberNet services. He directed the MPDOs to ensure FiberNet connections were given to every household in their jurisdiction. 
 
 
 
He asked the Multi-System Operators (MSOs) to explain the benefits of FiberNet to people especially in villages. The government had appointed MSOs and Local Cable Operators (LCOs) to provide broadband connections in the district. 
 
Speaking to The Hans India, Tirupati-based MSO N Pravallika said that there was good response from all sections of the society for services being offered by the FibreNet.
 
“We have crossed more than 5,000 connections in the last two months. My target is to reach 10,000 connections in the next two months,” she stated.
 
Regarding the broadband speed and quality, Rukmangada Raju of LS Nagar in Tirupati said the picture and sound quality is very good and he is enjoying unlimited net facility. “I have been viewing the YouTube and other social media content on TV screen without a computer or mobile,” he stated.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
సాంకేతిక విప్లవానికి సమస్యల వైరస్‌
లక్ష్యం దిశగా సాగని ఫైబర్‌ నెట్‌ సేవలు
ఇప్పటివరకూ ఇచ్చిన కనెక్షన్లు 2.70 లక్షలే
సమస్యల పరిష్కారంలో విఫలం
16ap-story1a.jpg
ఈనాడు, అమరావతి: ఇంటింటా నెట్‌ విప్లవం నీరసించిపోతోంది. కోటి ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్ల లక్ష్యం ఆదిలోనే ఆపసోపాలు పడుతోంది. మొదటి దశ లక్ష్యమైన 10 లక్షల కనెక్షన్లలో ఇప్పటిదాకా కేవలం రూ.2.70 లక్షలే ఇచ్చారు. దీంతో వచ్చే మార్చి నాటికి కోటికి చేరుకోవడమనేది అసాధ్యంగా మారింది. పరిమిత నిధులు, భారీ లక్ష్యం, క్షేత్ర స్థాయిలో ఆపరేటర్ల సహకారలేమి వంటి అనేక సమస్యలు సాంకేతిక విప్లవానికి అవరోధంలా నిలుస్తున్నాయి. దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నెలకు రూ.149కే కేబుల్‌ ప్రసారాలు, టెలిఫోన్‌, అంతర్జాల సదుపాయాన్ని కల్పించే ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు మూడేళ్ల క్రితమే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో ‘నెట్‌ వర్క్‌ ఆపరేషన్‌ సెంటర్‌’ను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 23,800 కిలో మీటర్ల పొడవునా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లు వేశారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.300 కోట్లు ఖర్చు చేశారు. ఇళ్లకు వేసే ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లకు అనుసంధానించే జీపాన్‌, ఐపీటీవీ బాక్సుల కోసం మరో రూ.170 కోట్లకుపైగా వెచ్చించారు.

ఏం లాభం?
* రాష్ట్రంలో 15వేల మందికిపైగా ఉన్న ఆపరేటర్లు (ఎంఎస్‌వో/ఎల్‌సీవో) ఫైబర్‌ నెట్‌వర్క్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. కానీ కేబుల్‌ ప్రసార రంగంలో పైచేయిగా ఉన్న ఆపరేటర్లు కొందరు ఫైబర్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.

* ఇంకొందరు ఆసక్తిగా ఉన్నా వీరి పరిధిలోని కనెక్షన్లకు తగ్గ కీలకమైన ఓఎల్‌టీలు సమకూర్చే పరిస్థితిలో ఫైబర్‌ నెట్‌ సంస్థ లేదు.

* కోటి ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఇవ్వాలంటే అదనంగా ఓఎల్‌టీలు ఏర్పాటు చేయాలి. ఒక్కో పరికరం కోసం రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుందని, ఇందుకోసం మరో రూ.600 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.

* మూడు రకాల సేవలు అందించే జీపాన్‌, ఐపీటీవీ బాక్సుల కొరత చాలా చోట్ల ఉంది. 4.50 లక్షల బాక్సులను కాంట్రాక్టు సంస్థలు ఇంకా సరఫరా చేయాలి.

16ap-story1b.jpg
సమస్యల మాటేమిటి¨?
* ఇప్పటికే ఇచ్చిన ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లలో తలెత్తే సమస్యలకు పరిష్కారాన్ని చూపే వ్యవస్థ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటు.

* సాంకేతికంగా తగిన అవగాహన లేని ఆపరేటర్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* ఫైబర్‌ నెట్‌ నుంచి రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. జీబీ వినియోగం ఆధారంగా వీటి ధరలు నిర్ణయించారు. ఒక ప్యాకేజీ నుంచి మరో ప్యాకేజీకి వినియోగదారులు వెళ్లాలంటే గ్రామ స్థాయిలో ఆపరేటర్లు చేతులెత్తేస్తున్నారు.

* ముఖ్యమంత్రి గత ఏడాది డిసెంబరు 29న తూర్పు గోదావరి జిల్లా మోరిలో ఫైబర్‌ నెట్‌ సేవలను ప్రారంభించగా చాలా ఇళ్లలో కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలకు తగిన పరిష్కారం చూపని కారణంగా చాలామంది విరమించుకుని ఇతర మార్గాలు చూసుకుంటున్నారు.

పాడైన బాక్సులకు పరిష్కారం ఏదీ?
16ap-story1c.jpg
‘మరమ్మతులకు గురైత జీపాన్‌, ఐపీటీవీ బాక్సులను సరి చేయాలని ఏడాది కాలంగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కేబుల్‌ కనెక్షన్‌ ఇచ్చాక చాలా రోజులు సక్రమంగానే ప్రసారాలు వచ్చాయి. టెలిఫోన్‌, ఇంటర్నెట్‌ సదుపాయాన్నీ ఉపయోగించుకున్నాం. బాక్సులు పాడయ్యాక ఎవరూ పట్టించుకోకపోవడంతో టీవీని పక్కన పెట్టాం.’
- వీఎస్‌ఎస్‌ శైలజ, గృహిణి, మోరి, తూర్పు గోదావరి జిల్లా
సాంకేతిక సమస్యలకు పరిష్కారం అవసరం
16ap-story1d.jpg
‘ప్రసారాలు బాగానే ఉన్నా సాంకేతికంగా చిన్నాచితకా సమస్యలు తలెత్తుతున్నాయి. టీవీ ఆన్‌ చేసిన వెంటనే కనెక్ట్‌ కావడం లేదు. ప్రత్యేకించి వర్షాలు కురిస్తే అంతరాయం ఏర్పడుతోంది. సాంకేతికంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ఫైబర్‌ నెట్‌ పరంగా తగిన చొరవ అవసరం.’
- జి.కృష్ణమూర్తి, విశ్రాంత ఉద్యోగి, మురళీనగర్‌, విశాఖపట్నం
లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ
16ap-story1e.jpg
‘గడువులోగా మొదట 10 లక్షల ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు జారీ చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నాం. వచ్చే మార్చి నాటికి 1.20 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు జారీ చేయాలన్నది లక్ష్యం. కొన్ని సమస్యలు ఎదురవుతున్నా పరిష్కరించుకుంటూ ముందుకెళుతున్నాం. అదనంగా ఓఎల్‌టీ పరికరాల అవసరమైతే ఉంది. ఇందుకోసం అదనపు నిధులు అవసరమని నివేదికలు సిద్ధం చేశాం. అవసరమైన జీపాన్‌, ఐపీటీవీ అదనపు బాక్సులు తెప్పిస్తున్నాం. సాంకేతికంగా క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తాం.’
- దినేశ్‌ కుమార్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ
 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...

one week back my parents got connection from ap fibernet . it is good . government have tie up with local cable tv operator. options in ap fibernet is super.

vod - video on demand , shows useful videos on education , farming,

tv can be used for skype

i forgot to list out other features in the project

internet, wifi also good . it dents monopoly of bsnl , local internet operators.  we used to pay 200 per month for cable operators. now cable+internet+telephone is available at 150+18% gst

we are thankful to cbn for this connectivity project.

 

Link to comment
Share on other sites

9 minutes ago, ravindras said:

one week back my parents got connection from ap fibernet . it is good . government have tie up with local cable tv operator. options in ap fibernet is super.

vod - video on demand , shows useful videos on education , farming,

tv can be used for skype

i forgot to list out other features in the project

internet, wifi also good . it dents monopoly of bsnl , local internet operators.  we used to pay 200 per month for cable operators. now cable+internet+telephone is available at 150+18% gst

we are thankful to cbn for this connectivity project.

 

Ekkada brother..

Link to comment
Share on other sites

we live in remote location and we dont have any cable operator how can we get the service ? :donno:   

Kindly help and advice. 

Link to comment
Share on other sites

This will bring lot of changes in future..

Like virtual meetings of govt officials..

Virtual inspections

Group Conferences

Virtual identification

Virtual education/training classes

Sharing/broadcasting agriculture info

Live feeds of Amaravati/Polavaram/irrigation projects/roads

Installing motion detection cc cameras at homes

And many more..

Link to comment
Share on other sites

6 minutes ago, John said:

we live in remote location and we dont have any cable operator how can we get the service ? :donno:   

Kindly help and advice. 

http://apsfl.in/  -> network -> select your district-> it will show the map of the network(you can zoom in ) , locate electricity substation in the map nearest to your village. contact that substation people.

government  laying internet lines in phased manner . it will take time to connect remote areas. 

http://apsfl.in/connection-request-form/

Link to comment
Share on other sites

Just now, ravindras said:

http://apsfl.in/  -> network -> select your district-> it will show the map of the network(you can zoom in ) , locate electricity substation in the map nearest to your village. contact that substation people.

government  laying internet lines in phased manner . it will take time to connect remote areas. 

http://apsfl.in/connection-request-form/

Thank you brother 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...