Jump to content

AP fibre Grid project


Recommended Posts

విభజనను అవకాశంగా మలచుకున్నాం!
28-12-2017 02:39:50
ఫైబర్‌ గ్రిడ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాం
2018కి ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్‌: లోకేశ్‌
పోలవరం నుంచి పోలీసింగ్‌ వరకు రాష్ట్రపతికి వివరణ
రాష్ట్రపతి సహా అందరినీ ఆకట్టుకున్న లోకేశ్‌ ప్రసంగం
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్రంగా బాధించింది. దాన్ని అధిగమించి ప్రతి సమస్యనూ.. చివరకు విభజననూ అవకాశంగా మలచుకుని ఏపీ ముందుకు వెళుతోంది. ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే రికార్డు సృష్టించాం’ అని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఫైబర్‌గ్రిడ్‌, గూగుల్‌ ఎక్స్‌తో ఒప్పందంలో భాగంగా లోకేశ్‌ తీసుకొచ్చిన ఫ్రీస్పేస్‌, ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ ప్రాజెక్టులను రాష్ట్రపతి బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన అనంతరం ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఆ ఐదు.. విద్యుత్‌, తాగునీరు, గ్యాస్‌, రోడ్‌, ఫైబర్‌ గ్రిడ్‌లు. వీటిని ఏర్పాటు చేసేందుకు నిధుల్లేకున్నా వినూత్నంగా ఆలోచించి పనులు చేస్తున్నాం. ఒక గిగాబైట్‌ డేటా వినియోగం పెరిగితే ఒక శాతం జీడీపీ పెరుగుతుంది.’ అని వివరించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు రూ.4,700 కోట్లు ఖర్చు అవుతుంది, అయితే అంత డబ్బు రాష్ట్రం వద్ద లేకపోవడంతో సీఎం వినూత్నంగా ఆలోచించి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేలా చూశారని తెలిపారు. కేబుల్‌ ఆపరేటర్లకు ఫైబర్‌నెట్‌తో మూడురెట్ల ఆదాయం పెరుగుతుందన్నారు. గూగుల్‌ ఎక్స్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని రాష్ట్రానికి అందించనుందని, 20 జీబీపీఎస్‌ వేగంతో నెట్‌ సేవలు అందిస్తుందని తెలిపారు. అది కూడా వైర్‌లెస్‌ విధానంలో డేటాను అందిస్తుందన్నారు. ఇలాంటి టెక్నాలజీని ప్రపంచంలోనే మొదటిసారి ఏపీలో వినియోగంలోకి తెస్తున్నట్లు తెలిపారు.
ఇంట్లోనే సమస్త ప్రపంచం!
ఫైబర్‌నెట్‌, డ్రోన్‌ కెమెరాలు తదితర ప్రాజెక్టుల గురించి లోకేశ్‌ రాష్ట్రపతికి లైవ్‌లో వివరించారు. ఫైబర్‌నెట్‌ అంటే కేవలం ఇంటర్‌నెట్‌ ఒక్కటే కాదని తెలిపారు. ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఇల్లంతా వైఫై ఉంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేదికపై ఉన్న భారీ వీడియో స్ర్కీన్‌పై రాష్ట్రపతికి చూపించారు. పోలవరం పనులను డ్రోన్‌ కెమెరా తీస్తుండగా.. దాన్ని రియల్‌టైమ్‌లో లైవ్‌లో రాష్ట్రపతి వీక్షించారు. అనంతరం విద్యార్థులకు ఉపయోగపడేలా పాఠ్యాంశాలనూ ఫైబర్‌నెట్‌ కనెక్షన్‌ ద్వారా వీక్షించవచ్చన్న లోకేశ్‌.. ప్రాణుల్లో శ్వాసప్రక్రియ గురించి వీడియో పాఠాలు ప్రదర్శించారు.
దృశ్యం సాయంతో నేర్చుకునేందుకు వీలున్నందున చదువులో నాణ్యత పెరుగుతుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా సకురు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఉండి ఈ కార్యక్రమం చూస్తున్నవారిని రాష్ట్రపతికి లైవ్‌లో చూపించారు. వైద్యరంగంలో టెలిమెడిసిన్‌ విధానానికి ఫైబర్‌నెట్‌ను ఎలా ఉపయోగించుకోవచ్చో డెమో ఇచ్చారు. రాష్ట్రంలో 20 వేల సీసీ కెమెరాలను అమరుస్తామని, ఇప్పటికే 3,500లకు పైగా వివిధ చోట్ల అమర్చామని లోకేశ్‌ రాష్ట్రపతికి వివరించారు. లోకేశ్‌ ప్రసంగంలోని అంశాలు, ఆయన ఆంగ్లం మాట్లాడిన తీరు రాష్ట్రపతి సహా అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం బాగా ప్రసంగించారంటూ పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.

Link to comment
Share on other sites

  • Replies 610
  • Created
  • Last Reply

డిజిటల్‌ ఏపీ భేష్‌
28-12-2017 02:31:41

ఇది మరో సాంకేతిక విప్లవం
ఫైబర్‌ గ్రిడ్‌తోపాటు నాలుగు ప్రాజెక్టులు ప్రారంభం
‘ఎపి’టైజరే సూపర్‌.. అమరావతితో అద్భుతమే
దేశంలోనే అత్యద్భుత టెక్నోపోలిస్‌ అవుతుంది
ఈ నాలుగు ప్రాజెక్టులు దేశానికే ఆదర్శం
దేశమంతా అమలు చేస్తే ‘డిజిటల్‌ ఇండియా’
రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ చాలా బాగుంది
ప్రధాని మోదీకీ ఈ ప్రజెంటేషన్‌ ఇవ్వండి
ప్రణాళికలు, అమలులో చంద్రబాబు బెస్ట్‌
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసల వర్షం
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆరంభమే అదిరిపోతోంది. ఇక... అమరావతి పూర్తయితే అద్భుతమే అవుతుంది’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన అమరావతిలో సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ వేదిక నుంచి... ఏపీ ఫైబర్‌నెట్‌, ఏపీ సర్వైలెన్స్‌, ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌, ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ ప్రాజెక్టులను ప్రారంభించారు. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమని కొనియాడారు.
 
‘‘ఈ నాలుగు ప్రాజెక్టులు దేశానికే ఆదర్శం. రూ.149కే ఇంటింటికీ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సౌకర్యం, వీడియో కాలింగ్‌, 250 టీవీ చానళ్ల ప్రసారాలు అందించడం సమాచార విప్లవం. ఆసియాలోనే అతిపెద్ద రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అనుసంధానం చేయడంలో ముందుంటారు. ప్రణాళిక వేయడమే కాకుండా... అమలులోనూ వేగం ప్రదర్శిస్తారు. ఒక్క మాట చెబుతున్నా. ఇదంతా ఎపిటైజర్‌ (విందుకు ముందు ఆకలిని పెంచేందుకు తీసుకునేది) మాత్రమే! ఇదే ఇలా ఉంటే... అమరావతి మొత్తం నిర్మాణమైతే అది దేశంలోనే టెక్నోపోలీస్ గా అవతరిస్తుంది’’ అని రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు.
 
‘‘ఫైబర్‌నెట్‌తో హైస్పీడ్‌ డాటా అందుబాటులోకి వస్తుంది. కేబుల్‌ వేసే ఖర్చు తగ్గించేందుకు అప్పటికే ఉన్న విద్యుత్‌ స్తంభాలను వినియోగించుకోవడం వినూత్న ఆలోచన. ఫైబర్‌నెట్‌తో పట్టణ విద్యార్థులకు దీటుగా గ్రామీణ విద్యార్థులూ రాణించే అవకాశం లభిస్తుంది. ఇది డిజిటల్‌ ఏపీకి నాంది. డిజిటల్‌ భారత్‌కూ పునాది. కేంద్రం భారత్‌నెట్‌ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ ఇవ్వాలని ముందుకెళ్తోంది. విద్య, వైద్యం, విజ్ఞానం, ఇతర రంగాలకు సంబంధించిన పనులను టెక్నాలజీ సులువు చేస్తుంది. ఇంటింటికీ నీరు, విద్యుత్‌, గ్యాస్‌లతో డాటాను కూడా ఇవ్వాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుని... దీనిని సాధించడం అభినందనీయం’’ అని రాష్ట్రపతి కోవింద్‌ ప్రశంసించారు.
 
ఇప్పుడంతా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానం నడుస్తోందన్నారు. దీనిని ఏపీ అందిపుచ్చుకుంటోందని అభినందించారు. ఇది మరో సాంకేతిక విప్లవమని, సమూల మార్పు దిశగా వెళ్లేందుకు ఉపకరిస్తుందని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ కోవింద్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
 
ఆర్టీజీ ఎంత బాగుందో...
రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న ‘రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌’ (ఆర్టీజీ) కేంద్రాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. ఈ కేంద్రం పనితీరు, కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇదంతా పరిశీలించిన రాష్ట్రపతి... ‘‘ఇది అద్భుతం. చాలా చాలా సంతోషంగా ఉంది! ఇదే ప్రజంటేషన్‌ను ప్రధానికి కూడా ఇవ్వండి’’ అని సూచించారు. ప్రధానికి ఆర్టీజీఎస్‌ గురించి ఇప్పటికే చెప్పామని సీఎం బదులివ్వగా... ‘‘చెప్పడమే కాదు... ప్రజంటేషన్‌ కూడా ఇవ్వాలి. నేను కూడా ఈ విషయాన్ని ఆయనకు చెబుతాను. టెక్నాలజీపరంగా ఏపీ ముందుకు దూసుకెళ్లడం శుభపరిణామం. అదే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా పయనిస్తేనే... డిజిటల్‌ ఇండియా సాకారమవుతుంది’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
 
ఆర్‌టీజీ వ్యూహ బృందం చాంబర్‌లో సీఎం కూర్చుని అధికారులతో సమీక్షించే కుర్చీలో రాష్ట్రపతిని, పక్క సీటులో గవర్నర్‌ నరసింహన్‌ను కూర్చోబెట్టారు. తాను నిలబడి 20 నిమిషాలపాటు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఐటీని ఐవోటీతో అనుసంధానం చేసి జలాశయాల్లో నీటి నిల్వలు, ఉద్యోగుల పనితీరు, సీఎం డ్యాష్‌బోర్డు, ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారం, రోడ్ల నిర్వహణ, దొంగతనాల కేసులను పరిష్కరించడం తదితరాలన్నీ ఎలా చేస్తున్నామో వివరించారు.
 
 
పరిష్కారం ఎంతశాతం?
ఆర్టీజీపై చంద్రబాబు ప్రజంటేషన్‌ ఇస్తుండగా రాష్ట్రపతి కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘ప్రజలే ముందు’ అనే విధానంలో 1100 ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న తీరును చంద్రబాబు వివరిస్తుండగా... ఎంత శాతం సమస్యల్ని పరిష్కరించగలుగుతున్నారని రాష్ట్రపతి ప్రశ్నించారు. 90-95శాతం సమస్యల్ని పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, ఆర్థిక సమస్యలను నిధుల లభ్యతను బట్టి పరిష్కరిస్తున్నామని వివరించారు.
 
దొంగ ఇలా దొరికాడు!
దొంగతనానికి వచ్చిన దొంగ... ఆ ఇంట్లో ఉండగానే పట్టుకోవడం! లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా ఇది సాధ్యం. కడపలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి వచ్చిన చోరుడిని పట్టుకున్న వీడియోను రాష్ట్రపతికి చూపించారు. ఇంటికి తాళం వేసి వెళ్లినప్పుడు... పోలీసులకు సమాచారం అందిస్తే అక్కడ రహస్యంగా కెమెరాలు పెడతారు. దొంగలు ఎవరైనాలోపలికి వస్తే... ఆ దృశ్యాలు ఆర్‌టీజీ కేంద్రానికి వచ్చేస్తాయి. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి దొంగలను పట్టేస్తారు.
 
80శాతం సంతృప్తి లక్ష్యం
ప్రభుత్వంలోని అన్ని సేవలను సమగ్ర నిర్వహణ వ్యవస్థ కిందికి తీసుకొచ్చామని చంద్రబాబు రాష్ట్రపతికి తెలిపారు. ఈ-ప్రగతి, ఈ-ఫైలింగ్‌ అమలు చేస్తున్నామన్నారు. వచ్చే మార్చినాటికి కాగితరహిత పాలన అమల్లోకి వస్తుందన్నారు. ఈ విధానాల ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల్లో సంతృప్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు 58-60 శాతం సంతృప్తి స్థాయి ఉందని, దాన్ని 80శాతం పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వర్చువల్‌ క్లాస్‌రూంల ద్వారా నాలుగువేల ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేసే ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. ఆయా కార్యక్రమాల్లో గవర్నర్‌ నరసింహన్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామసబ్రమణ్యం, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 
 
 

Link to comment
Share on other sites

SHivraj chouhan gadiki mudindi Boodi gadi chetilo....already Gujju gang paga battaru  chouhan meda

 

http://indiatoday.intoday.in/story/madhya-pradesh-cm-shivraj-singh-chouhan-returns-home-gujarat-without-attending-rupani-swearing-in-ceremony/1/1118074.html

 

http://www.news18.com/news/politics/after-skipping-gujarat-himachal-cms-swearing-in-shivraj-chouhan-meets-pm-narendra-modi-in-new-delhi-1616431.html :blink: boodi gadi face chudandi.....

The fact that Prime Minister Narendra Modi and party president Amit Shah do not particularly like Chouhan is one of the worst kept secrets of the BJP. Modi would like nothing better than to remove Chouhan, a mass leader from MP, and bring him to Delhi as part of the fairly powerless Union Cabinet.

 

https://www.dailyo.in/politics/shivraj-chouhan-fast-mandsaur-farmers-modi-amit-shah/story/1/17760.html

 

 

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
దావోస్ నుంచి గిరిజనులతో మాట్లాడిన సీఎం
23-01-2018 17:55:33
 
636523269346126226.jpg
తూర్పుగోదావరి: దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జిల్లాలోని రంపచోడవరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజివలస గిరిజనులతో మాట్లాడారు. గూగుల్ ఎక్స్ ద్వారా జాజివలసకు టెలిఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఏర్పాటుచేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించడంతో గిరిజనులు పులకరించిపోయారు. ఫ్రీ స్పేస్ ఆప్టిక‌ల్ క‌మ్యూనికేష‌న్ ద్వారా గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో జాజివలసకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
దావోస్ నుంచి గిరిజనులతో మాట్లాడిన సీఎం
23-01-2018 17:55:33
 
636523269346126226.jpg
తూర్పుగోదావరి: దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. జిల్లాలోని రంపచోడవరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజివలస గిరిజనులతో మాట్లాడారు. గూగుల్ ఎక్స్ ద్వారా జాజివలసకు టెలిఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఏర్పాటుచేశారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించడంతో గిరిజనులు పులకరించిపోయారు. ఫ్రీ స్పేస్ ఆప్టిక‌ల్ క‌మ్యూనికేష‌న్ ద్వారా గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో జాజివలసకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు

:terrific:

Link to comment
Share on other sites

మొన్నటి వరకు సమాచార వ్యవస్థ లేని గిరిజన గ్రామం... ఈ రోజు ఏకంగా దావోస్ తోనే మాట్లాడుతుంటే, వారి ఆనందం చూడండి...

   
fiber-24012018-1.jpg
share.png

జాజివ‌ల‌స‌... కొండ‌లు, కోన‌ల న‌డుమ మారుమూల జ‌నజీవ‌న స్ర‌వంతికి దూరంగా, క‌నీసం ఫోను స‌దుపాయానికి కూడా నోచుకోకుండా ప్ర‌కృతి ఒడిలో మారుమూల అట‌వీ ప్రాంతాంలో అల‌రారుతున్న అందాల సీమ‌. తూర్పు గోదావ‌రి జిల్లా వై.రామ‌వ‌రం మండ‌లం, క‌నివాడ పంచాయ‌తి ప‌రిధిలోని ఈ గ్రామానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వెళితే క‌నీసం మాట్లాడ‌టానికి ఎలాంటి ఫోను స‌దుపాయం, నెట్ క‌నెక్ష‌న్ ఉండేది కాదు... అలాంటి గిరిజ‌న ప్రాంతాన్ని అక్క‌డ ప్ర‌జ‌లు ఏమాత్ర ఊహించ‌ని విధంగా దావోస్ నుంచి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా వీడియో ఫోను ద్వారా ప‌లుక‌రించి, వారి యోగ‌క్షేమాలు అడిగే స‌రికి జాజివ‌ల‌స ప్ర‌జ‌లు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో పుల‌కించిపోయారు. రంప‌చోడ‌వ‌రం నుంచి దాదాపు 80 కిలో మీట‌ర్ల దూరంలో ఉండే ఈ ప‌ల్లెను తొలిసారిగా మంగ‌ళ‌వారం ఫోను, ఇంట‌ర్‌నెట్‌, కేబుల్ టీవీ స‌దుపాయాలు ప‌లుక‌రించాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబ‌ర్ నెట్ సంస్థ వ్య‌వ ప్ర‌యాసాల‌కు ఓర్చి ఈ మారుమూల గిరిజ‌న గ్రామాన్ని సాధార‌ణ జ‌నంతో మ‌మేక‌య్యేలా క‌నెక్టివిటీ క‌ల్పించింది. జాజివ‌ల‌స‌కు క‌ల్పించిన ఈ స‌దుపాయాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దావోస్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. జాజివ‌ల‌స‌కు క‌ల్పించిన న‌వ సాంకేతిక స‌దుపాయం ప‌నితీరు ఎలా ఉందో స్వ‌యంగా అక్క‌డ గిరిజ‌నుల‌తో మాట్లాడి తెలుసుకున్నారు.

 

జాజివ‌ల‌స ప్ర‌జ‌ల‌తో ఫోను ద్వారా వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించి అక్క‌డ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఏమ‌మ్మా ఈ స‌దుపాయం ఎలా ఉంది, దీనిద్వారా ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయ‌ని అనుకుంటున్నారు అని ఆయ‌న గిరిజ‌న‌లు అడిగారు. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క‌ల‌లో ఊహించ‌నివిధంగా , స్వ‌యంగా ఇలా ముఖ్య‌మంత్రి త‌మ‌ను ప‌లుక‌రించే స‌రికి ప్రజ‌లు ఆనంద‌డోలిక‌ల్లో తేలిపోయారు. సారూ..చాలా సంతోషం సారూ, మీరు మాతో ఇలా మాట్లాడ‌టం, మా ఊరికి ఫోను ఇచ్చినారు మీరు, మీకు కృతజ్ఞ‌త‌లు అని జాజివ‌ల‌స మ‌హిళ‌లు తెలిపారు. త‌మ ఊరికి తాము ఊహించ‌ని విధంగా రోడ్డు కూడా వేస్తున్నార‌ని అది త‌మ‌కెంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. దానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... ఒక్క ఫోను ఏంట‌మ్మా మీ ఊరికి ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌, కేబుల్ టీవీ అన్నీ వ‌చ్చాయి. టెలీమెడిసిన్ ఒక్క‌టేమిటీ దీనివ‌ల్ల మీకు తెలినీ ప్ర‌యోజ‌నాలు మీకు ఎన్నో క‌ల‌గ‌బోతున్నాయి అన్నారు. జాజివ‌ల‌సకు ఫైబ‌ర్ నెట్ స‌దుపాయం క‌ల్పించ‌డం త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

ఫైబ‌ర్ నెట్‌కు అభినంద‌న‌లు... జాజివ‌ల‌స గిరిజ‌న గ్రామానికి వైర్‌లెస్ నెట్ స‌దుపాయాన్ని దిగ్విజ‌యంగా క‌ల్పించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబ‌ర్ నెట్ సంస్థను, ఆ సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి (సీఈఓ) అహ్మ‌ద్ బాబు, అధికారులు, సిబ్బందిని ముఖ్య‌మంత్రి అభినందించారు. గుడ్ చాలా బాగా చేశారు, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇలా ఏమాత్రం క‌నెక్టివిటీ లేని ప్రాంతాల‌కు ఇదే త‌ర‌హా క‌నెక్టివిటీని క‌ల్పించాలి అని సూచించారు. జాజివ‌ల‌కు ఈ స‌దుపాయం ఎలా క‌ల్పించిందో ఫైబ‌ర్‌నెట్ సీఈఓ ఎ.బాబు వివ‌రించారు. ప్ర‌పంచంలోనే తొలిసారి... ఏ మాత్రం క‌మ్యూనికేష‌న్ స‌దుపాయం క‌ల్పించ‌డానికి అవ‌కాశం లేని మారు మూల ప్రాంతాల‌కు కూడా ఇలా ఏకంగా టెలిఈఫోను, కేబుల్ టీవీ, ఇంట‌ర్‌నెట్ స‌దుపాయాన్ని వైర్‌లెస్ ద్వారా క‌ల్పించ‌డం ప్ర‌పంచంలోనే ఇదే తొలిసారి అని ఫైబ‌ర్ నెట్ వ‌ర్గాలు తెలిపాయి. దీనికోసం ఫైబ‌ర్ నెట్ సంస్థ గూగుల్ ఎక్స్ సంస్థ స‌హ‌కారం తీసుకుని ఎఫ్‌.ఎస్‌.ఓ.సి ద్వారా ఈ స‌దుపాయం క‌ల్పించింది. దీనికోసం ఏపీ ఫైబ‌ర్ నెట్ చేసిన ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి.

ఏమిటీ ఎఫ్‌.ఎస్‌.ఓ.సి... ఫ్రీ స్పేస్ ఆప్టిక‌ల్ క‌మ్యూనికేష‌న్‌..(ఎఫ్‌.ఎస్‌.ఓ.సి) అనేది గూగుల్ ఎక్స్ సంస్థ అందిస్తున్న స‌రికొత్త సాంకేతిక స‌దుపాయం. ప్ర‌పంచంలోనే ఇది అత్యుత్త‌మ సాంకేతిక స‌దుపాయం. ఏ మాత్రం సెల్ ఫోను సిగ్న‌ళ్లు లేని, కేబుల్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ స‌దుపాయం క‌ల్పించ‌డానికి వీలులేని మారుమూల ప్రాంతాల‌కు వైర్‌లెస్ ద్వారా అన్ని ర‌కాల క‌నెక్టివిటీ క‌ల్పించ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌. 20 కిలోమీట‌ర్ల ప‌రిధిలో దీని ద్వారా 20 జీబీపీఎస్ (గిగా బైట్స్ ప‌ర్ సెకండ్‌) వేగంతో ఇంట‌ర్‌నెట్ స‌దుపాయం క‌ల్పించ‌వ‌చ్చు. ఎలాంటి కేబుల్ లేకుండానే ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు టెలిఫోను, అంత‌ర్జాలం, కేబుల్ టీవీ ప్ర‌సారాల‌ను క‌ల్పించ‌వ‌చ్చు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలు, స‌ల‌హాలు, సూచ‌న‌ల ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబ‌ర్ నెట్ సంస్థ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఈ త‌ర‌హా స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది. తొలిసారిగా తూర్పు గోదావ‌రి జిల్లా వై.రామ‌వ‌రం మండ‌లం, క‌నివాడ పంచాయ‌తీకి చెందిన జాజివ‌ల‌స‌కు ఈ స‌దుపాయం క‌ల్పించింది. ద‌శ‌ల వారీగా మిగిలిన ప్రాంతాల‌కు కూడా ఈ స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్లు ఏపీ ఫైబ‌ర్ నెట్ సీఈఓ ఎ.బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇంట‌ర్నెట్‌, అంత‌ర్జాలం, కేబుల్ టీవీ స‌దుపాయం లేని ఆవాసాలు అనేవి ఉండ‌కూడ‌ద‌నేదే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్య‌మ‌ని, ఈ ల‌క్ష్య సాధ‌న‌కు ఫైబ‌ర్ నెట్ సంస్థ పున‌రంకిత‌మ‌వుతోంద‌ని తెలిపారు.

Link to comment
Share on other sites

జాజివలస పులకింత
24-01-2018 01:41:53
 
636523588183688863.jpg
  • గిరిజనులకు చేరువైన ఫోన్‌, కేబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ సేవలు
  • దావోస్‌ నుంచి ప్రారంభించిన సీఎం
రంపచోడవరం, అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): అది.. తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలోని జాజివలస. కొండలు... కోనల మధ్య ఉండే ఓ మారుమూల గ్రామం. కనీసం ఫోను సదుపాయం కూడా లేదు. ఇక ఇంటర్‌నెట్‌ అంటే ఊహకే అందదు. అలాంటి గిరిజన ప్రాంతానికి అక్కడ ప్రజలు కలలోనూ ఊహించని విధంగా దావోస్‌ నుంచి వీడియో ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘బ్రదర్‌... నేను నారా చంద్రబాబు నాయుడిని... మీ ముఖ్యమంత్రిని... దావోస్‌ నుంచి మాట్లాడుతున్నాను... ఎలా ఉన్నారు?’’ అని అడిగారు! ఏకంగా ముఖ్యమంత్రే తమ యోగక్షేమాలు కనుక్కోవడం, అందులోనూ దావోస్‌ నుంచి మాట్లాడుతున్నానని చెప్పడంతో స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు! రంపచోడవరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పల్లెను తొలిసారిగా ఫోను, ఇంటర్నెట్‌, కేబుల్‌టీవీ సదుపాయాలు పలకరించాయి.
 
 
ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ ఈ మారుమూలనున్న గిరిజన గ్రామానికి సాధారణ జనంతో మమేకమయ్యేలా కనెక్టివిటీ కల్పించింది. సీఎం చంద్రబాబు మంగళవారం దావోస్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దినేశ్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌లు అక్కడి గిరిజనులను, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిని ముఖ్యమంత్రితో మాట్లాడించారు. సీఎం తమకు ఫోన్‌ చేయడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ‘ఒక్క ఫోన్‌ ఏంటమ్మా? ఇప్పుడు మీ గ్రామానికి కేబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ సదుపాయాలు కూడా వచ్చాయి. మీరు ఇక నుంచి నేరుగా నాతో మాట్లాడే అవకాశం కలిగింది. మీ సమస్యలను నేనే స్వయంగా పరిష్కరిస్తాను. అధికారులు మీకు అందించే సేవలపై నేరుగా మీతోనే మాట్లాడతాను’ అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
 
 
ఎలాంటి కమ్యూనికేషన్‌ సదుపాయమూ లేని మారుమూల ప్రాంతాలకు కూడా టెలిఫోన్‌, కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌ సదుపాయాలను వైర్‌లెస్‌ విధానంలో కల్పించడం ప్రపంచంలో ఇదే తొలిసారి! గూగుల్‌ ఎక్స్‌ సంస్థ సహకారం తీసుకుని ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌(ఎఫ్ఎస్ ఓసీ) ద్వారా ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ ఈ సదుపాయం కల్పించింది. కాగా, వై.రామవరం మండలంలోని మరో ఏజెన్సీ గ్రామమైన చాపరాయి గిరిజనులతో సీఎం చంద్రబాబు బుధవారం దావోస్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. వీలైతే ప్రధాని మోదీతోనూ ఇక్కడి గిరిజనులను మాట్లాడించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
Link to comment
Share on other sites

ఫైబర్‌.. కట్‌ ఫట్‌!
25-01-2018 03:01:25
 
636524460894238511.jpg
  • అంపశయ్యపై తొలి పైలట్‌ ప్రాజెక్టు..
  • వినియోగదారులకు అరకొర సేవలు
  • మొరాయిస్తున్న సెట్‌టాప్‌ బాక్సులు
  • కనెక్షన్లు తీసుకున్న వారికి తిప్పలు
  • ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు
  • మళ్లీ పాత కేబుల్‌ వ్యవస్థవైపు జనం
  • 400కు పడిపోయిన కనెక్షన్లు
  • జగ్గయ్యపేటలో ఇదీ పరిస్థితి
 
జగ్గయ్యపేట, జనవరి 24: ‘ఏంటి.. 149 రూపాయలకే కేబుల్‌, నెట్‌, ఫోన్‌ కనెక్షన్‌ ఇచ్చేస్తారా? మన ఊళ్లోనే మొట్టమొదటిసారిగా ప్రాజెక్టు అమలు చేస్తున్నారా! అయితే మనమూ ఓ కనెక్షన్‌ తీసుకుందాం’.. అంటూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చాలామంది ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు తీసుకున్నారు. ఇప్పుడు వీరిలో అత్యధికులు ఉసూరుమంటున్నారు. ఫైబర్‌నెట్‌ సేవలపై గంపెడాశలు పెట్టుకున్న వినియోగదారులకు అధికారులు, ఆపరేటర్లు నరకం చూపిస్తున్నారు. ‘మాకు కనెక్షన్‌ వద్దు మొర్రో’ అని జనం వారంతట వారే అనేలా చేస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ పైలట్‌ ప్రాజెక్టుకు జగ్గయ్యపేటను ఎంపిక చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎమ్మెల్సీ టీడీజనార్దన్‌ చొరవ తీసుకుని సీఎంను ఒప్పించారు. నెలకు రూ.149 చెల్లిస్తే కేబుల్‌ ప్రసారాలతోపాటు, ఒక జీబీ డేటాతో ఇంటర్నెట్‌, నెట్‌వర్క్‌ పరిధిలో ఉచిత ఫోన్‌కాల్స్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకానికి తొలుత కేబుల్‌ ఆపరేటర్లు విస్తృత ప్రచారం కల్పించారు. పట్టణంలో కనీసం 8వేల కనెక్షన్లు వస్తాయని అంచనా వేశారు. విద్యుత్‌ స్తంభాలను ఉపయోగించుకుంటూ కేబుల్‌ లైన్లు వేసుకుంటూ వచ్చారు. అయితే.. గతంలో ఒకే గొడుగు కింద ఉన్న కేబుల్‌ ఆపరేటర్లలో విభేదాలు రావటం, మేనేజ్‌మెంట్‌ మార్పిడితో పనులు నిలిచిపోయాయి. తొలుత కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ఫైబర్‌ నెట్‌ అధికారులు, ఆపరేటర్లు సత్వర సేవలు అందించటంలో విఫలమయ్యారు. దీనికి తోడు రూ.4వేలు వెచ్చించి తీసుకున్న సెట్‌టాప్‌ బాక్సుల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వీటిని సవరించే టెక్నీషియన్లు స్థానిక ఆపరేటర్ల వద్దలేరు. అటు.. ఫైబర్‌ నెట్‌ అధికారులూ దీనిని పట్టించుకోవడంలేదు. దీంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. నెలల తరబడి సర్వీసు లేకపోయినా ఆపరేటర్లు బిల్లులు వసూలు చేస్తూనే ఉన్నారు. టెక్నీషియన్‌ అదిగో వస్తాడు.. ఇదిగో వస్తాడు అంటూ కాలం గడుపుతున్నారు. దీంతో వినియోగదారులు అధికారులకు, కేబుల్‌ ఆపరేటర్లకు ఫోన్లు చేసి, విసిగి వేసారి ఇతర మార్గాల్లోకి వెళ్లిపోతున్నారు. మొత్తం జగ్గయ్యపేట పట్టణంలో ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు 400కు పడిపోయాయి.
 
 
ఆచరణలో విఫలం...
జగ్గయ్యపేటలో కేబుల్‌ ఆపరేటర్లు ఫైబర్‌నెట్‌ను తీసేసి... వినియోగదారులకు పాత కేబుల్‌ కనెక్షన్లనే ఇచ్చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ అడిగితే... ‘అబ్బే లాభంలేదు. మీరు ఇబ్బంది పడతారు. మామూలు కేబులే బెటర్‌. ఆ తర్వాత మీ ఇష్టం’ అని సూటిగానే చెబుతున్నారు. గతంలో ఒకే గొడుగు కింద ఉన్న ఆపరేటర్లు తిరిగి చీలిపోయి ప్రాంతాల వారీగా ఆపరేటర్ల అవతారం ఎత్తి పాత కనెక్షన్లను పునరుద్ధరించుకుంటున్నారు. కేబుల్‌ ఆపరేటర్లు పూర్వవైభవం పొందుతుండగా, ఫైబర్‌నెట్‌ మాత్రం మూసివేత దశకు చేరుకుంది. ఇంత జరుగుతున్నా ఫైబర్‌ నెట్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. నిజానికి ఆపరేటర్లతో అధికారులు కొందరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు పలుసార్లు అధికారులకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవటం లేదు. అధికారులు వివరణ కోసం ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా... ఎవరికి వారు తమ పైఅధికారి అడగాలంటూ తప్పించుకున్నారు. ఓ అధికారి అయితే విజయవాడలోని తమ కార్యాలయానికి వచ్చి సమాచారం కనుక్కోవాలని ఉచిత సలహా ఇచ్చారు.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

 

ఫైబర్‌.. కట్‌ ఫట్‌!
25-01-2018 03:01:25
 
636524460894238511.jpg
  • అంపశయ్యపై తొలి పైలట్‌ ప్రాజెక్టు..
  • వినియోగదారులకు అరకొర సేవలు
  • మొరాయిస్తున్న సెట్‌టాప్‌ బాక్సులు
  • కనెక్షన్లు తీసుకున్న వారికి తిప్పలు
  • ఫిర్యాదులు పట్టించుకోని అధికారులు
  • మళ్లీ పాత కేబుల్‌ వ్యవస్థవైపు జనం
  • 400కు పడిపోయిన కనెక్షన్లు
  • జగ్గయ్యపేటలో ఇదీ పరిస్థితి
 
జగ్గయ్యపేట, జనవరి 24: ‘ఏంటి.. 149 రూపాయలకే కేబుల్‌, నెట్‌, ఫోన్‌ కనెక్షన్‌ ఇచ్చేస్తారా? మన ఊళ్లోనే మొట్టమొదటిసారిగా ప్రాజెక్టు అమలు చేస్తున్నారా! అయితే మనమూ ఓ కనెక్షన్‌ తీసుకుందాం’.. అంటూ కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చాలామంది ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు తీసుకున్నారు. ఇప్పుడు వీరిలో అత్యధికులు ఉసూరుమంటున్నారు. ఫైబర్‌నెట్‌ సేవలపై గంపెడాశలు పెట్టుకున్న వినియోగదారులకు అధికారులు, ఆపరేటర్లు నరకం చూపిస్తున్నారు. ‘మాకు కనెక్షన్‌ వద్దు మొర్రో’ అని జనం వారంతట వారే అనేలా చేస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ పైలట్‌ ప్రాజెక్టుకు జగ్గయ్యపేటను ఎంపిక చేయాలంటూ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, ఎమ్మెల్సీ టీడీజనార్దన్‌ చొరవ తీసుకుని సీఎంను ఒప్పించారు. నెలకు రూ.149 చెల్లిస్తే కేబుల్‌ ప్రసారాలతోపాటు, ఒక జీబీ డేటాతో ఇంటర్నెట్‌, నెట్‌వర్క్‌ పరిధిలో ఉచిత ఫోన్‌కాల్స్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకానికి తొలుత కేబుల్‌ ఆపరేటర్లు విస్తృత ప్రచారం కల్పించారు. పట్టణంలో కనీసం 8వేల కనెక్షన్లు వస్తాయని అంచనా వేశారు. విద్యుత్‌ స్తంభాలను ఉపయోగించుకుంటూ కేబుల్‌ లైన్లు వేసుకుంటూ వచ్చారు. అయితే.. గతంలో ఒకే గొడుగు కింద ఉన్న కేబుల్‌ ఆపరేటర్లలో విభేదాలు రావటం, మేనేజ్‌మెంట్‌ మార్పిడితో పనులు నిలిచిపోయాయి. తొలుత కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ఫైబర్‌ నెట్‌ అధికారులు, ఆపరేటర్లు సత్వర సేవలు అందించటంలో విఫలమయ్యారు. దీనికి తోడు రూ.4వేలు వెచ్చించి తీసుకున్న సెట్‌టాప్‌ బాక్సుల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. వీటిని సవరించే టెక్నీషియన్లు స్థానిక ఆపరేటర్ల వద్దలేరు. అటు.. ఫైబర్‌ నెట్‌ అధికారులూ దీనిని పట్టించుకోవడంలేదు. దీంతో తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం సతమతమవుతున్నారు. నెలల తరబడి సర్వీసు లేకపోయినా ఆపరేటర్లు బిల్లులు వసూలు చేస్తూనే ఉన్నారు. టెక్నీషియన్‌ అదిగో వస్తాడు.. ఇదిగో వస్తాడు అంటూ కాలం గడుపుతున్నారు. దీంతో వినియోగదారులు అధికారులకు, కేబుల్‌ ఆపరేటర్లకు ఫోన్లు చేసి, విసిగి వేసారి ఇతర మార్గాల్లోకి వెళ్లిపోతున్నారు. మొత్తం జగ్గయ్యపేట పట్టణంలో ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు 400కు పడిపోయాయి.
 
 
ఆచరణలో విఫలం...
జగ్గయ్యపేటలో కేబుల్‌ ఆపరేటర్లు ఫైబర్‌నెట్‌ను తీసేసి... వినియోగదారులకు పాత కేబుల్‌ కనెక్షన్లనే ఇచ్చేస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ అడిగితే... ‘అబ్బే లాభంలేదు. మీరు ఇబ్బంది పడతారు. మామూలు కేబులే బెటర్‌. ఆ తర్వాత మీ ఇష్టం’ అని సూటిగానే చెబుతున్నారు. గతంలో ఒకే గొడుగు కింద ఉన్న ఆపరేటర్లు తిరిగి చీలిపోయి ప్రాంతాల వారీగా ఆపరేటర్ల అవతారం ఎత్తి పాత కనెక్షన్లను పునరుద్ధరించుకుంటున్నారు. కేబుల్‌ ఆపరేటర్లు పూర్వవైభవం పొందుతుండగా, ఫైబర్‌నెట్‌ మాత్రం మూసివేత దశకు చేరుకుంది. ఇంత జరుగుతున్నా ఫైబర్‌ నెట్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. నిజానికి ఆపరేటర్లతో అధికారులు కొందరు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు పలుసార్లు అధికారులకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవటం లేదు. అధికారులు వివరణ కోసం ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా... ఎవరికి వారు తమ పైఅధికారి అడగాలంటూ తప్పించుకున్నారు. ఓ అధికారి అయితే విజయవాడలోని తమ కార్యాలయానికి వచ్చి సమాచారం కనుక్కోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

ela ga pattichukokapothe chesindi antha xxxx avuthundi

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఏపీ ఫైబర్‌నెట్‌ సేవల్లో రాజీ పడొద్దు: సీఎస్‌
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీ ఫైబర్‌నెట్‌ సేవలు నిర్దేశిత గడువులోగా అందాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఏపీ ఫైబర్‌నెట్‌(భారత్‌ ఫేజ్‌-2) అమలుపై భారత్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌ సీఎండీ సంజయ్‌ సింగ్‌తో సోమవారం సచివాలయంలో రాష్ట్రస్థాయి ఇంప్లిమెంటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. భారత్‌నెట్‌ ఫేజ్‌-2కు సంబంధించి ఇది మొదటి రాష్ట్రస్థాయి సమావేశమని.. రూ.861 కోట్లతో చేపట్టిన ఆ ప్రాజెక్టును 2019 మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రియల్‌ టైం గవర్నెన్స్‌ సీఈవో అహ్మద్‌ తెలిపారు.
ఏపీ హెచ్‌ఆర్డీఐ డీపీఆర్‌ పరిశీలించాకే భూ కేటాయింపు: ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఏపీ హెచ్‌ఆర్డీఐ)కు రాజధాని అమరావతిలో 25 ఎకరాల స్థలం కేటాయించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ చక్రపాణి కోరారు. అయితే పరిపాలనా భవనం, రెసిడెన్షియల్‌ క్వార్టర్లు, శిక్షణా కేంద్రాలు, ఇతర వసతులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సీఆర్డీఏ ప్లానింగ్‌ విభాగంతో పరిశీలించాక స్థలం కేటాయింపు అంశంపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
46 minutes ago, sonykongara said:

ma ouri lo mottam fibre grid ichharu kakpothe only tv matrame

Net ledha. Maa sonth uru nellore lo kuda only tv echaru. 149+50 rs. 

Vizag lo apply chedadham ani online lo chusthe area cable operator name and number anta.

Link to comment
Share on other sites

16 minutes ago, sagarkurapati said:

Net ledha. Maa sonth uru nellore lo kuda only tv echaru. 149+50 rs. 

Vizag lo apply chedadham ani online lo chusthe area cable operator name and number anta.

bro,net ledu ani annadi ma mother

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...