Jump to content

AP fibre Grid project

Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply
తెలుగునేలపై సాంకేతిక సుఫలాలు
నేటినుంచి ఇంటింటికీ ‘ఫైబర్‌ నెట్‌’
ap-opinion1a.jpg

‘ఏదో ఒక నెపంతో రేపటి బాధ్యతల నుంచి మనం ఈ రోజు తప్పించుకోలేం’ అంటారు అబ్రహాం లింకన్‌. ప్రభుత్వాలు, పాలకులు, వ్యక్తులు ఎవరికైనా సరే... ఇది అనుసరణీయమైన హితోక్తి. సాంకేతిక విప్లవం దేశాల సరిహద్దులు చెరిపేసింది. ప్రపంచమొక కుగ్రామంగా మారిపోయి మనమంతా ఎల్లలు లేకుండా మమేకమవుతున్నాం. అంతర్జాల ఆవిష్కర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు. సాంకేతికత ప్రతిరోజూ కొత్తపుంతలు తొక్కుతోంది. సుపరిపాలన కోసం దాన్నో ప్రభావవంతమైన సాధనంగా ప్రభుత్వాలు వినియోగిస్తున్నాయి. మూడు వసంతాల నవజాత నవ్యాంధ్రప్రదేశ్‌ సుపరిపాలన ఆవిష్కారంలో మొదటినుంచీ ముందే ఉంటోంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు అందిపుచ్చుకొంటోంది. సాంకేతిక క్రతువులో మరో కీలక ఘట్టం దిశగా నవ్యాంధ్ర ఉరకలేస్తోంది. దేశంలో మరే ఇతర రాష్ట్రానికీ సాధ్యంకాని ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును సాకారంచేసి- ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ ప్రజలందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ‘ఫైబర్‌ నెట్‌’ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా చంద్రబాబు సర్కారు ఇవాళ జాతికి అంకితం చేస్తోంది. ఒకేసారి 1.10 లక్షల ఆవాసాలను ఫైబర్‌ నెట్‌తో అనుసంధానించడంతోపాటు- ఇళ్లవద్ద ఉన్న ప్రజలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నేరుగా పలకరించి పులకింపజేయనున్నారు. ఆ మధుర క్షణాలకోసం రాష్ట్ర ప్రజానీకం ఎంతో అతృతతో ఎదురు చూస్తోంది. ఈ ఫైబర్‌ నెట్‌ ద్వారా కేవలం రూ.149లకు అంతర్జాలం, 250కి పైగా టెలివిజన్‌ ఛానెళ్లు, ల్యాండ్‌లైను టెలిఫోన్‌ సదుపాయం కల్పించనున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో మరెక్కడా ఇంత తక్కువ ధరకు ఇన్ని సేవలు అందించే బ్రాడ్‌బ్యాండ్‌ వ్యవస్థ ఉంటుందనుకోవడం లేదు. ఏపీ ఫైబర్‌ నెట్‌ తరవాతి దశ వినియోగదారులకు 500 టెలివిజన్‌ ఛానెళ్లు అందించడం!

ap-opinion1b.jpg సాంకేతికతే ఆయుధంగా...
నాయకుడికి ఎప్పుడూ ముందుచూపు ఉండాలి. రేపటి సవాళ్లను నేడే పసిగట్టగలగాలి. ఆ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహరచన తెలియాలి. అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం ఉండాలి. అదృష్టవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో ఆ దార్శనికత పాళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్‌ ‘సైబరాబాద్‌’గా విఖ్యాతిగాంచిందంటే అది ఆయన దార్శనికత ఫలితమే అంటే అతిశయోక్తి కాదు! అదే స్ఫూర్తిని ఆయన నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగిస్తున్నారు. కోర్‌ డ్యాష్‌ బోర్డు, ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు, ప్రజా పంపిణీ వ్యవస్థలో డిజిటల్‌ చెల్లింపులు, జాతీయ ఉపాధి హామీ పథకం, పరిష్కార వేదిక వంటివాటిలో అనేక వినూత్న సాంకేతిక పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగోడలు చెరిపేశారు. ప్రజల ఇళ్లవద్దకే పౌర సేవలను తీసుకువెళుతున్నారు. సమస్యలన్నింటికీ సాంకేతికతే సమాధానం కాకపోవచ్చు. కానీ, అది క్లిష్ట సమస్యల పరిష్కారానికి దోహదపడే బలమైన సాధనం అనడంలో సందేహాలు లేవు. అలాంటి సాంకేతిక సుపరిపాలన పథంలో రాష్ట్రం వేస్తున్న మరో ముందడుగు ఈ ఫైబర్‌నెట్‌!

సులభతరంగా వైఫై
ap-opinion1c.jpg
ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ వేగంతో అంతర్జాల సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వంద ఎంబీపీఎస్‌ వేగంతో ఈ సేవలు అందిస్తుంది. వచ్చే ఏప్రిల్‌నాటికి 25 లక్షల కుటుంబాలను ఫైబర్‌ నెట్‌ ఛత్రం కిందకు తీసుకురానున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ ఒక ‘వైఫై’ కేంద్రంగా మారుతుంది. ఇంట్లోనివారు ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రత్యేకించి ఎలాంటి మోడెం అవసరం లేకుండా- సెట్‌టాప్‌ బాక్సు ద్వారానే వైఫై సదుపాయం పొందవచ్చు. వైఫై అందుబాటులోకి రావడంతో ప్రతి ఇంట్లోనూ ఇ-కార్యకలాపాలు పెరుగుతాయి. డిజిటల్‌ అక్షరాస్యత ఇనుమడిస్తుంది. టీవీ తెరనే మాధ్యమంగా చేసుకొని ప్రజలు ప్రభుత్వం నుంచి తమకు అందాల్సిన సేవలు పొందనున్నారు. తమకు ఏమి కావాలో ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. అవసరమైతే ఇంటిని చిన్నపాటి ఏటీఎం కేంద్రంగానూ మార్చుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, వలసలను తగ్గుముఖం పట్టించగల విధానాలివి.

సవాళ్లతో సమరం
ఫైబర్‌ గ్రిడ్‌ను ప్రభుత్వం ప్రకటించినప్పుడు యావత్‌ దేశం మనవైపు ఆశ్చర్యంగా చూసింది. డిజిటల్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని 2.50 లక్షల పంచాయతీ కార్యాలయాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించాలని సంకల్పించింది. వినూత్న ఆలోచనలే విప్లవాత్మక పరిణామాలకు అంటుకడుతుంటాయి. పంచాయతీల వద్దే ఎందుకు ఆగిపోవాలి? ప్రజల ముంగిళ్లను ఫైబర్‌నెట్‌తో డిజిటల్‌ లోగిళ్లుగా మార్చి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎందుకు ఒక వాహకం కాకూడదన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే- ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు! ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలోని 1.40 కోట్ల ఆవాసాలకు; వేల సంఖ్యలోని వాణిజ్య, వ్యాపార, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకే ‘ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌’ (ఓఎఫ్‌సీ) ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే కనెక్షన్‌తో మూడు ప్రధాన సేవలు, ఇతర అనుబంధ సేవలు కల్పించాలనే ఆశయంతో ఆగస్టు 2015న ‘ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ’ ఆవిష్కృతమైంది. నిజానికి ఇది అనుకున్నంత సులభమైంది కాదు. కారణం ఓఎఫ్‌సీ. దేశంలో 1.55 లక్షల కిలోమీటర్ల మేర ఇప్పటికే ప్రైవేటు, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల ఓఎఫ్‌సీ వ్యవస్థ ఉంది. పైగా అదంతా భూగర్భంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ రంగంలో ఏ మాత్రం అనుభవంలేని ప్రభుత్వం సొంతంగా రాష్ట్రవ్యాప్తంగా 24 వేల కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ కేబుల్‌ ప్రధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అంత తేలిక కాదు. అందుకోసం అయిదు వేలకోట్ల రూపాయలకుపైగా నిధులు వెచ్చించాల్సి వస్తుంది. రూ.16 వేలకోట్ల ఆర్థిక లోటుతో ఏర్పడిన రాష్ట్రం తాహతుకు మించిన పని అది. ఇక్కడే ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. భూగర్భ ఓఎఫ్‌సీ వ్యవస్థకు బదులుగా ఉపరితలంమీదే దాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకరకంగా అది సాహసమే! ప్రభుత్వ విద్యుత్తు రంగ సంస్థలకు ఉన్న కరెంటు స్తంభాలపైనే ఓఎఫ్‌సీ కేబుళ్లు ఏర్పాటు చేయడంతో అయిదువేల కోట్ల రూపాయల భారమయ్యే ప్రాజెక్టును కేవలం రూ.333 కోట్లతో పూర్తి చేయగలిగాం. దేశంలో మరెక్కడా ఈ తరహా ఓఎఫ్‌సీ వ్యవస్థ లేదు. ఇప్పుడు పలు రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలూ మన బాటను అనుసరించడానికి ఆసక్తి చూపుతుండటం సంతోషం కలిగిస్తోంది. అంతర్జాలం కేవలం సాంకేతిక విజయమే కాదు. వివిధ దేశాల ఆర్థిక పటిష్ఠతకు దోహదం చేసే మహత్తర సాధనమది. అంతర్జాల వినియోగం, సేవలు- స్థూల దేశీయోత్పత్తిలో పదిశాతం వాటా ఆక్రమిస్తున్నాయి. అంతర్జాల అనుసంధానం (కనెక్టివిటీ డెన్సిటీ) పెరిగే కొద్దీ వృద్ధిరేటు మరింత పెరుగుతుందన్నది నిపుణుల అంచనా. అంతర్జాల మార్కెట్లకు ఇప్పుడు భారత్‌ ఓ కీలక వనరు. దేశం డిజిటల్‌ భారత్‌గా మారే క్రమంలో పరుగులు పెడుతోంది. ‘నీతి ఆయోగ్‌’ తాజా విశ్లేషణ ప్రకారం భారతీయులు రోజులో 200 నిమిషాలు అంతర్జాలంలోనే గడుపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో వినియోగిస్తున్న డేటా ఏకంగా 150 కోట్ల గిగాబైట్లను దాటుతోంది. భారతీయ టెలికాం నియంత్రణ మండలి (ట్రాయ్‌) గణాంకాల ప్రకారం దేశంలో 43.11 కోట్ల అంతర్జాల వినియోగదారులున్నారు. ప్రపంచంలోని మొత్తం 342 కోట్ల వినియోగదారుల్లో భారత్‌ వాటా 13.5 శాతం. ప్రతి వంద మందిలో సుమారు ముప్ఫై ముగ్గురు అంతర్జాల వినియోగదారులే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 37.29గా ఉంది. అంకెలు ఘనంగా ఉన్న మాట నిజమే. అయితే ఇక్కడ కొన్ని విషయాలను అవలోకించుకోవాల్సి ఉంది. వేగం (ఇంటర్నెట్‌ స్పీడ్‌) అంతర్జాలానికి ప్రాణం!

ఎక్స్‌-యాప్‌
రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ఆవాసాలకూ ఈ సదుపాయం కల్పించాలన్నది ప్రభుత్వ ఆశయం. అక్కడ ఫైబర్‌ కేబుళ్లు వేయడానికి వీలుకాని పరిస్థితులున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా అక్కడ ‘గూగుల్‌’ సాయంతో ‘ఎక్స్‌-యాప్‌’ ఉపయోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ‘హాట్‌ స్పాట్‌’ బాక్సులు ఏర్పాటు చేసి గిరిజన ఆవాసాలకు వైఫై, ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించనున్నారు.

బహుళ ప్రయోజనాలు
అమెరికాలోని ‘అకమయ్‌’ క్లౌడ్‌ డెలివరీ సంస్థ ప్రపంచ దేశాల అంతర్జాల వేగంపై రూపొందించిన నివేదికలో ప్రపంచ సగటు అంతర్జాల వేగం 7.2 ఎంబీపీఎస్‌ (మెగాబైట్స్‌ పర్‌ సెకండ్‌)గా వెల్లడించింది. అయితే భారత్‌లో ఆ సగటు 2.8 ఎంబీపీఎస్‌ మాత్రమే. 28.6 ఎంబీపీఎస్‌ సగటు అంతర్జాల వేగంతో ముందువరసలో నిలిచిన దక్షిణ కొరియా భారత్‌కు ఆదర్శం కావాలి. దక్షిణ కొరియాలోని చియాంగ్‌జూ నగరంలో ప్రజలకు ఏకంగా 124.5 ఎంబీపీఎస్‌ సగటు వేగంతో అంతర్జాల సేవలు అందిస్తున్నారు. అగ్రరాజ్యమైన అమెరికా సైతం ఇటీవలే ఈ జాబితాలో పదో స్థానానికి చేరింది. భారత్‌లో ఇప్పటికీ 13 కోట్లమంది న్యారో బ్యాండ్‌ వినియోగదారులకు ఏదైనా డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే లభిస్తున్న వేగం 512 కేబీపీఎస్‌ (కిలోబైట్స్‌ పర్‌ సెకండ్‌) మాత్రమే. అంతర్జాల వేగానికి సంబంధించి భారత్‌ ముందున్న లక్ష్యం ఎంత సుదూరమైనదో వెల్లడిస్తున్న వాస్తవాలివి. ప్రజలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం కావలసిన, ప్రతి ఇంటికీ అంతర్జాల సదుపాయం అందుబాటులోకి రావలసిన అవసరాన్ని తెలియజెబుతున్న గణాంకాలివి. ‘ఏపీ ఫైబర్‌ నెట్‌’ ద్వారా రాష్ట్రాన్ని డిజిటల్‌ బాట పట్టించడంతోపాటు పౌరసేవలను మరింత సులభంగా ప్రజల దరికి చేర్చేందుకు వీలవుతుంది. టీవీలో తరగతి పాఠాల ప్రసారం మొదలు, రైతులకు పొలం పాఠాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెలీమెడిసిన్‌ సదుపాయం వరకూ ఎన్నో బహుళ ప్రయోజనాలు దీనిద్వారా సిద్ధించనున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఉన్న టీవీ తెరలు విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. ప్రజల ఆర్థిక ప్రగతికి దోహదపడనున్నాయి. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు తదితర అంశాలపై ప్రజలు తమ ఇళ్లనుంచి; తాము రోజూ చూస్తున్న టీవీ తెర ద్వారానే ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలపవచ్చు. ప్రతి ఇంటికీ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ఉంటుంది. దాంతో అవసరమైనప్పుడల్లా ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖాముఖి మాట్లాడటానికి ప్రభుత్వానికి వీలవుతుంది. రాబోయే రోజుల్లో ఫైబర్‌ నెట్‌ ద్వారా మరెన్నో విప్లవాత్మక మార్పులు చూడనున్నాం. విశ్వవేదికపై ఆంధ్రప్రదేశ్‌ సాంకేతికంగా సుసంపన్నమైనదిగా ఎదగనుంది. ఆ లక్ష్యసాధన పథంలో ప్రస్తుతం పడుతున్నవి తొలి అడుగులు మాత్రమే. చేరాల్సిన గమ్యం మరెంతో దూరంలో ఉంది. అయితే ప్రస్తుత వేగాన్ని కొనసాగిస్తే లక్ష్యసాధన అసాధ్యం కాదనిపిస్తోంది. వేల క్రోసుల ప్రయాణమైనా ఆరంభమయ్యేది తొలి అడుగుతోనే!

Link to comment
Share on other sites

32 minutes ago, Yaswanth526 said:

Lokesh nice write up ?

Link to comment
Share on other sites

కిరణమే కేబుల్‌!
27-12-2017 03:47:30

 సూర్యుడే ఆధారంగా ఇంటర్నెట్‌
 రాష్ట్రానికి గూగుల్‌ ఎక్స్‌ ప్రాజెక్టు
 తీగలు అక్కర్లేకుండానే కనెక్షన్‌
 2వేల రూఫ్‌టాప్‌ బాక్స్‌లు ఏర్పాటు
 విశాఖ కేంద్రంలో ఆధునిక ఆవిష్కరణ
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ప్రయోగాలు, ఆధునాతన టెక్నాలజీ, అనంతమైన వనరులు... ఇదీ గూగుల్‌! ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ విశాఖపట్నంలో తన డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. అది... గూగుల్‌ ఎక్స్‌! ఏమిటీ గూగుల్‌ ఎక్స్‌? ఏం చేస్తుంది? ఎవరి కోసం? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది...
ఐటీ కంపెనీలు ప్రాథమికంగా నాలుగు రకాలు. బీపీఓలు, కేపీఓలు, ఐటీఈఎస్‌ తదితరాలన్నీ బ్యాక్‌ ఆఫీసు వ్యవహారాలు నిర్వహిస్తాయి. ఇందులో సాధారణ స్థాయి ఉద్యోగులు ఉంటారు. టీసీఎస్‌, విప్రో, యాక్సెంచర్‌ వంటివి సర్వీస్‌ బేస్డ్‌ కంపెనీలు. ఇవి రెండో రకం! ఇవి... ఇతర సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ తయారీ వంటి సేవలు అందిస్తాయి. ఇందులో... నిపుణులు ఉంటారు. మూడో రకం స్టార్టప్‌ కంపెనీలు. ఇవి వెంచర్‌ కేపిటల్‌ ఫండింగ్‌తో నడుస్తాయి. కొత్త ఆలోచనలతో వస్తాయి. ఇక... అత్యంత అధునాతన పరిశోధనలు చేస్తూ హైఎండ్‌ టెక్నాలజీని ఉపయోగించేవి నాలుగో రకం కంపెనీలు. వీటిలో కనీస వేతనం... నెలకు రూ.5 లక్షలు. అది కోటిదాకా కూడా వెళ్తుంది. ఇలాంటి కంపెనీల్లో అగ్రశ్రేణి కంపెనీ... గూగుల్‌. దీనికి అనుబంధంగా అనేక కంపెనీలు ఉన్నాయి. అందులో ఒకటి గూగుల్‌ ఎక్స్‌. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడమే లక్ష్యంగా గూగుల్‌ ఎక్స్‌ పరిశోధనలు సాగుతాయి. ఆయా సమస్యలకు ఇప్పటివరకు ఎక్కడా అందుబాటులో లేని కొత్త టెక్నాలజీ (బ్రేక్‌ త్రూ)ని జోడిస్తూ గూగుల్‌ ఎక్స్‌ వినూత్నమైన ఆవిష్కరిస్తుంది. ‘ఇలా కూడా చేయవచ్చునా!’ అనే స్థాయిలో విప్లవాత్మకమైన పరిష్కారాలు సూచిస్తుంది. అదే... అదే గూగుల్‌ ఎక్స్‌ ప్రత్యేకత! డ్రైవర్‌లేని కారు... కూడా గూగుల్‌ ఎక్స్‌ ఆవిష్కరణే!
 
ఏపీలో ఏం చేస్తుంది?
ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల (ఓఎ్‌ఫసీ)ను భూగర్భంలో వేస్తే ఖర్చు ఎక్కువవుతుంది. అందుకే, విద్యుత్‌ స్తంభాలను వాడుకుంటున్నారు. అయితే... విద్యుత్‌ సౌకర్యం అంతగాలేని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఈ పనులు కూడా చేపట్టలేని పరిస్థితి. మరోవైపు... అందరికీ ఇంటర్నెట్‌ అనే ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లి... వేగవంతమైన ఇంటర్నెట్‌ను, అత్యధిక బ్యాండ్‌ విడ్త్‌తో అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దాన్ని సాకారం చేయడానికి ‘గూగుల్‌ ఎక్స్‌’ ముందుకు వచ్చింది. గతంలో రూపొందించిన ‘లూన్‌’ ప్రాజెక్టు (బెలూన్ల ద్వారా ఇంటర్నెట్‌) ద్వారా పరిమితమైన ప్రాంతంలో, పరిమిత సంఖ్యలో ఇంటర్నెట్‌ సేవలను గూగుల్‌ ఎక్స్‌ అందించింది. ఇప్పుడు... పెద్ద సంఖ్యలో వినియోగదారులకు శక్తివంతమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ అందించేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించింది. అదే వైర్‌లెస్‌ టెక్నాలజీ. అంటే... కేబుళ్ల అవసరమే లేదు. విద్యుత్‌ కిరణాలు చాలు. దీనినే... ‘ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌’ (ఎఫ్‌ఎ్‌సఓసీ)గా పిలుస్తారు. విద్యుత్‌ కిరణాల ద్వారా డేటా ట్రాన్స్‌మిట్‌ (సమాచార మార్పిడి) అవుతుంది. సెకనుకు 20 జీబీ వేగంతో డేటాను పంపుతుంది. ఈ విధానంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక రూఫ్‌టాప్‌ బాక్స్‌ను ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో కేబుల్‌ వ్యవస్థ లేని ప్రాంతాల్లో రెండు వేల బాక్స్‌లు పెడతారు. వాటి ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తారు. ఇవి సెల్‌ఫోన్‌ ఆపరేటర్లకు కూడా ఉపయోగపడతాయి. ఎఫ్‌ఎ్‌సఓసీ అందుబాటులోకి వస్తే అవన్నీ 3జీ, 4జీ సేవలు అందించే సామర్థ్యం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా 5.3 కోట్లు. వారిలో 1.5 కోట్ల మంది హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. మరో 1.2 కోట్ల మందికి ఇంకా హైస్పీడ్‌తో కూడిన అన్‌ ఇంటరెప్టెడ్‌ ఇంటర్నెట్‌ అందించడానికి ఏపీ ప్రభుత్వం గూగుల్‌ ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది.
 
గూగుల్‌ ఎక్స్‌ ఆవిష్కరణలు ఇవి...
ప్రాజెక్ట్‌ లూన్‌: ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ప్రాంతాలకు బెలూన్‌ ద్వారా సేవలు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కొండలు, అటవీ ప్రాంతాల్లో కేబుల్‌ వేయడం కుదరదు కాబట్టి... అక్కడ ఇంటర్నెట్‌ సేవలు అందడం లేదు. దీనికి గూగుల్‌ ఎక్స్‌ ‘లూన్‌’ ప్రాజెక్టు ద్వారా పరిష్కారం చూపింది. ఆ ప్రాంతంలో బెలూన్‌ ఎగుర వేసి దాని ద్వారా అక్కడ పరిమితమైన జనాభాకు ఇంటర్నెట్‌ అందిస్తుంది.
 
ప్రాజెక్ట్‌ మకాని: గాలిలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దీని ఉద్దేశం. సంప్రదాయేతర విధానంలో అతి తక్కువ వ్యయంతో విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్టును తయారు చేసింది. ఇందులో భాగంగా... ఓ భారీ గాలిపటాన్ని ఎగురవేస్తూ, దానికే జనరేటర్లు అమర్చుతారు. ఒక్క గాలిపటం ద్వారా 600 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది.
 
ఇది... 300 ఇళ్ల అవసరాలను తీరుస్తుంది.
ప్రాజెక్ట్‌ వింగ్‌: డ్రోన్ల ద్వారా డెలివరీ సేవలు అందించడమే ‘ప్రాజెక్ట్‌ వింగ్‌’. ఈ-కామర్స్‌ సంస్థలన్నీ డ్రోన్ల ద్వారానే వస్తువులను డెలివరీ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి.
ప్రాజెక్ట్‌ ఫాగ్‌ హార్న్‌: సముద్రపు నీటి నుంచి ఇంధనం తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. వాహనాల వల్లే 14 శాతం కాలుష్యం ఏర్పడుతోంది. కాలుష్య రహితమైన ఇంధనాన్ని సముద్రపు నీటితో తయారు చేసే ప్రయోగం విజయవంతమైంది.
 
ఇది అదృష్టమే
గూగుల్‌ ఎక్స్‌ విశాఖలోడెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అదృష్టమే. గూగుల్‌ ఎక్స్‌తో ‘మాల్టా’ ప్రాజెక్ట్‌ కోసం ఒప్పందం కుదుర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తును ఉప్పులో నిల్వ చేసే ఈ సరికొత్త ప్రయోగం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- ఓ.నరేశ్‌కుమార్‌, రుషికొండ ఐటీ పార్క్‌ ఉపాధ్యక్షుడు

Link to comment
Share on other sites

ఇంటర్‌నెట్ ఫైబర్ కేబుల్‌ని కట్‌చేసిన దుండగులు..

27-12-2017 18:27:16

తూర్పుగోదావరి: రాష్ట్రపతి కోవింద్ అమారవతి పర్యటన కార్యక్రమ ప్రసారం కాకుండా దుండగులు ఇంటర్‌నెట్ ఫైబర్ కేబుల్‌ని కట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. 6 చోట్ల కేబుల్‌ని కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే కేబుల్ కట్ చేసినప్పటికీ.. అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పర్యటనను నిరంతరాయంగా ప్రసారం చేశారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేస్ సీరియస్ అయ్యారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు. తక్కువ ధరకే ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కొంత మంది వ్యక్తులు దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:

కిరణమే కేబుల్‌!
27-12-2017 03:47:30

 సూర్యుడే ఆధారంగా ఇంటర్నెట్‌
 రాష్ట్రానికి గూగుల్‌ ఎక్స్‌ ప్రాజెక్టు
 తీగలు అక్కర్లేకుండానే కనెక్షన్‌
 2వేల రూఫ్‌టాప్‌ బాక్స్‌లు ఏర్పాటు
 విశాఖ కేంద్రంలో ఆధునిక ఆవిష్కరణ
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
కొత్త ఆవిష్కరణలు, సరికొత్త ప్రయోగాలు, ఆధునాతన టెక్నాలజీ, అనంతమైన వనరులు... ఇదీ గూగుల్‌! ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ విశాఖపట్నంలో తన డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతోంది. అది... గూగుల్‌ ఎక్స్‌! ఏమిటీ గూగుల్‌ ఎక్స్‌? ఏం చేస్తుంది? ఎవరి కోసం? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది...
ఐటీ కంపెనీలు ప్రాథమికంగా నాలుగు రకాలు. బీపీఓలు, కేపీఓలు, ఐటీఈఎస్‌ తదితరాలన్నీ బ్యాక్‌ ఆఫీసు వ్యవహారాలు నిర్వహిస్తాయి. ఇందులో సాధారణ స్థాయి ఉద్యోగులు ఉంటారు. టీసీఎస్‌, విప్రో, యాక్సెంచర్‌ వంటివి సర్వీస్‌ బేస్డ్‌ కంపెనీలు. ఇవి రెండో రకం! ఇవి... ఇతర సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ తయారీ వంటి సేవలు అందిస్తాయి. ఇందులో... నిపుణులు ఉంటారు. మూడో రకం స్టార్టప్‌ కంపెనీలు. ఇవి వెంచర్‌ కేపిటల్‌ ఫండింగ్‌తో నడుస్తాయి. కొత్త ఆలోచనలతో వస్తాయి. ఇక... అత్యంత అధునాతన పరిశోధనలు చేస్తూ హైఎండ్‌ టెక్నాలజీని ఉపయోగించేవి నాలుగో రకం కంపెనీలు. వీటిలో కనీస వేతనం... నెలకు రూ.5 లక్షలు. అది కోటిదాకా కూడా వెళ్తుంది. ఇలాంటి కంపెనీల్లో అగ్రశ్రేణి కంపెనీ... గూగుల్‌. దీనికి అనుబంధంగా అనేక కంపెనీలు ఉన్నాయి. అందులో ఒకటి గూగుల్‌ ఎక్స్‌. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడమే లక్ష్యంగా గూగుల్‌ ఎక్స్‌ పరిశోధనలు సాగుతాయి. ఆయా సమస్యలకు ఇప్పటివరకు ఎక్కడా అందుబాటులో లేని కొత్త టెక్నాలజీ (బ్రేక్‌ త్రూ)ని జోడిస్తూ గూగుల్‌ ఎక్స్‌ వినూత్నమైన ఆవిష్కరిస్తుంది. ‘ఇలా కూడా చేయవచ్చునా!’ అనే స్థాయిలో విప్లవాత్మకమైన పరిష్కారాలు సూచిస్తుంది. అదే... అదే గూగుల్‌ ఎక్స్‌ ప్రత్యేకత! డ్రైవర్‌లేని కారు... కూడా గూగుల్‌ ఎక్స్‌ ఆవిష్కరణే!
 
ఏపీలో ఏం చేస్తుంది?
ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఎ్‌ఫఎల్‌) సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి అవసరమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల (ఓఎ్‌ఫసీ)ను భూగర్భంలో వేస్తే ఖర్చు ఎక్కువవుతుంది. అందుకే, విద్యుత్‌ స్తంభాలను వాడుకుంటున్నారు. అయితే... విద్యుత్‌ సౌకర్యం అంతగాలేని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఈ పనులు కూడా చేపట్టలేని పరిస్థితి. మరోవైపు... అందరికీ ఇంటర్నెట్‌ అనే ఆలోచనను మరింత ముందుకు తీసుకెళ్లి... వేగవంతమైన ఇంటర్నెట్‌ను, అత్యధిక బ్యాండ్‌ విడ్త్‌తో అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దాన్ని సాకారం చేయడానికి ‘గూగుల్‌ ఎక్స్‌’ ముందుకు వచ్చింది. గతంలో రూపొందించిన ‘లూన్‌’ ప్రాజెక్టు (బెలూన్ల ద్వారా ఇంటర్నెట్‌) ద్వారా పరిమితమైన ప్రాంతంలో, పరిమిత సంఖ్యలో ఇంటర్నెట్‌ సేవలను గూగుల్‌ ఎక్స్‌ అందించింది. ఇప్పుడు... పెద్ద సంఖ్యలో వినియోగదారులకు శక్తివంతమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ అందించేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించింది. అదే వైర్‌లెస్‌ టెక్నాలజీ. అంటే... కేబుళ్ల అవసరమే లేదు. విద్యుత్‌ కిరణాలు చాలు. దీనినే... ‘ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌’ (ఎఫ్‌ఎ్‌సఓసీ)గా పిలుస్తారు. విద్యుత్‌ కిరణాల ద్వారా డేటా ట్రాన్స్‌మిట్‌ (సమాచార మార్పిడి) అవుతుంది. సెకనుకు 20 జీబీ వేగంతో డేటాను పంపుతుంది. ఈ విధానంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక రూఫ్‌టాప్‌ బాక్స్‌ను ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలో కేబుల్‌ వ్యవస్థ లేని ప్రాంతాల్లో రెండు వేల బాక్స్‌లు పెడతారు. వాటి ద్వారా హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందిస్తారు. ఇవి సెల్‌ఫోన్‌ ఆపరేటర్లకు కూడా ఉపయోగపడతాయి. ఎఫ్‌ఎ్‌సఓసీ అందుబాటులోకి వస్తే అవన్నీ 3జీ, 4జీ సేవలు అందించే సామర్థ్యం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా 5.3 కోట్లు. వారిలో 1.5 కోట్ల మంది హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారు. మరో 1.2 కోట్ల మందికి ఇంకా హైస్పీడ్‌తో కూడిన అన్‌ ఇంటరెప్టెడ్‌ ఇంటర్నెట్‌ అందించడానికి ఏపీ ప్రభుత్వం గూగుల్‌ ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది.
 
గూగుల్‌ ఎక్స్‌ ఆవిష్కరణలు ఇవి...
ప్రాజెక్ట్‌ లూన్‌: ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ప్రాంతాలకు బెలూన్‌ ద్వారా సేవలు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కొండలు, అటవీ ప్రాంతాల్లో కేబుల్‌ వేయడం కుదరదు కాబట్టి... అక్కడ ఇంటర్నెట్‌ సేవలు అందడం లేదు. దీనికి గూగుల్‌ ఎక్స్‌ ‘లూన్‌’ ప్రాజెక్టు ద్వారా పరిష్కారం చూపింది. ఆ ప్రాంతంలో బెలూన్‌ ఎగుర వేసి దాని ద్వారా అక్కడ పరిమితమైన జనాభాకు ఇంటర్నెట్‌ అందిస్తుంది.
 
ప్రాజెక్ట్‌ మకాని: గాలిలోనే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దీని ఉద్దేశం. సంప్రదాయేతర విధానంలో అతి తక్కువ వ్యయంతో విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్టును తయారు చేసింది. ఇందులో భాగంగా... ఓ భారీ గాలిపటాన్ని ఎగురవేస్తూ, దానికే జనరేటర్లు అమర్చుతారు. ఒక్క గాలిపటం ద్వారా 600 కిలోవాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది.
 
ఇది... 300 ఇళ్ల అవసరాలను తీరుస్తుంది.
ప్రాజెక్ట్‌ వింగ్‌: డ్రోన్ల ద్వారా డెలివరీ సేవలు అందించడమే ‘ప్రాజెక్ట్‌ వింగ్‌’. ఈ-కామర్స్‌ సంస్థలన్నీ డ్రోన్ల ద్వారానే వస్తువులను డెలివరీ చేసే రోజులు త్వరలోనే రానున్నాయి.
ప్రాజెక్ట్‌ ఫాగ్‌ హార్న్‌: సముద్రపు నీటి నుంచి ఇంధనం తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. వాహనాల వల్లే 14 శాతం కాలుష్యం ఏర్పడుతోంది. కాలుష్య రహితమైన ఇంధనాన్ని సముద్రపు నీటితో తయారు చేసే ప్రయోగం విజయవంతమైంది.
 
ఇది అదృష్టమే
గూగుల్‌ ఎక్స్‌ విశాఖలోడెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అదృష్టమే. గూగుల్‌ ఎక్స్‌తో ‘మాల్టా’ ప్రాజెక్ట్‌ కోసం ఒప్పందం కుదుర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. సౌర, పవన విద్యుత్తును ఉప్పులో నిల్వ చేసే ఈ సరికొత్త ప్రయోగం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- ఓ.నరేశ్‌కుమార్‌, రుషికొండ ఐటీ పార్క్‌ ఉపాధ్యక్షుడు

Nice article..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...