Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply

manollu chese panulu ilane vuntay mundu hungaama chestharu correct gaa ae time ki em avutunda ani

Cisco chairman tho opening ​cheyyincharu hadavidi hadavidi chesaru 2 years saga thesaru. Next election ki mundhu estharu emo. Ee kongara bro kontha kalam ee post ni hide chesthe manam kuda marchipovachu

Link to comment
Share on other sites

Cisco chairman tho opening ​cheyyincharu hadavidi hadavidi chesaru 2 years saga thesaru. Next election ki mundhu estharu emo. Ee kongara bro kontha kalam ee post ni hide chesthe manam kuda marchipovachu

konni chotlla isthunaru ga

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

ఇంటింటా డిజిటల్‌ బాజా!

జులైకల్లా 2 లక్షల ఇళ్లకు ఏపీ ఫైబర్‌ కనెక్షన్‌..

డిసెంబరు నాటికి 10 లక్షల ఇళ్లకు..

బాక్సుల సమస్య కొలిక్కి...

ఈనాడు - అమరావతి

13ap-main4a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జులై నుంచి ఇంటింటా డిజిటల్‌ బాజా మోగించేందుకు రంగం సిద్ధమవుతోంది. కేబుల్‌ టీవీ (ఐపీ టీవీ), ఇంటర్‌నెట్‌, ఫోన్‌ సౌకర్యాల్ని ఒకే బాక్సుతో, అతి తక్కువ ధరకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఇందుకోసం ఉపయోగించాల్సిన ట్రిపుల్‌ ప్లే బాక్సుల సరఫరాలో జాప్యం కారణంగా ఆలస్యమైన ఈ ప్రాజెక్టు ఇక వేగంగా పట్టాలెక్కనుంది. రాష్ట్రంలోనే బాక్సుల తయారీ యూనిట్లు రావడం, చైనా నుంచి బాక్సులు రానుండటం, శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్‌ వీటి తయారీకి మొగ్గు చూపడం వంటి కారణాలతో రెండు నెలల్లో అవసరాలకు సరిపడా బాక్సుల పంపిణీ ప్రారంభం కానుంది. ఆ తరువాత నుంచి రోజూ కొన్ని వందల కనెక్షన్లు ఇచ్చేందుకు వీలవుతుంది.

అల్లుకున్నదిలా!

విద్యుత్తు స్తంభాల ద్వారా 33/11కేవీ సబ్‌స్టేషన్ల వరకూ ప్రతి పట్నం, మేజరు పంచాయతీల వద్దకు 23వేల కిలోమీటర్ల పొడవునా ఓఎఫ్‌సీ వేయడం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా కేబుళ్ల అమరిక, ప్రసారాలన్నీ ఒక రింగ్‌ విధానంలో ఉంటాయి. ఒకచోట కేబుల్‌ కట్‌ అయితే... రెండో వైపు నుంచి ప్రసారం కొనసాగుతుంది. ఇలా 60 శాతం రింగ్‌ రూపంలో ఉంది. మారుమూల ప్రాంతం, అడవులతోకూడిన ఏజెన్సీని రింగ్‌ పరిధిలోకి తీసుకురాలేదు. వీటినీ రింగ్‌లోకి తెచ్చేందుకు గూగుల్‌ రూపొందించిన ఫ్రీస్పేస్‌ ఆప్టిక్స్‌ కమ్యూనికేషన్‌ విధానంలో కేబుళ్లు లేకుండా ఒకచోటి నుంచి 24 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి రూపంలోనైనా సులువుగా సమాచారాన్ని పంపగలిగే సరికొత్త ట్రాన్స్‌మిటర్లు- రిసీవర్ల సాంకేతికతను పదిచోట్ల వినియోగించుకోనున్నారు. ఇప్పటిదాకా అమెరికాలోని కాలిఫోర్నియాలోనే ఈ సాంకేతికత వాడారు. ఏపీ ఫైబర్‌లో విశాఖ కేంద్రంగా మొత్తం ప్రసారాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి జిల్లాలకు అనుసంధానంలో ఎక్కడైనా అవాంతరం ఎదురైతే... మరమ్మతు చేసేవరకు ఇబ్బంది లేకుండా భూగర్భ కేబుళ్లద్వారా సేవలందించే రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ నుంచి ప్రత్యామ్నాయ కనెక్షన్లు తీసుకున్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒడిశా సరిహద్దు వరకు ఉన్న కొన్ని వందల గిరిజన గూడేలకు సేవలందించేందుకు అడవులు, కొండలపై నుంచి ఓఎఫ్‌సీ వేయడం పూర్తయింది. లంబసింగి, డుబ్రిగూడ, మంచింగిపట్టు, అనంతగిరి, పెదబయలు వంటి గ్రామాలకు ఏపీ ఫైబర్‌ సేవలందనున్నాయి. ఇప్పటికే దారకొండలాంటి మారుమూల ప్రాంతంలో ఏపీ ఫైబర్‌ ఫోన్లు పని చేస్తున్నాయి.

స్థానికంగానే సెట్‌టాప్‌ బాక్సుల తయారీ!

ట్రిపుల్‌ ప్లే బాక్సుల పంపిణీలో అసాధారణ జాప్యం జరుగుతోంది. పది లక్షల ట్రిపుల్‌ ప్లే బాక్సుల కోసం టెండర్లు పిలిచి నాలుగు సంస్థలకు సరఫరా బాధ్యత అప్పగించారు. ఇవన్నీ చైనా నుంచి రావాలి. సాధారణంగా సెట్‌టాప్‌ బాక్సు ఒక జీబీ ర్యామ్‌తో ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం 2 జీబీ ర్యామ్‌తో సెట్‌టాప్‌ బాక్సు ఇవ్వాలనుకున్నారు. ఇటీవల డాలర్‌ విలువ పెరగడంతో ఈ బాక్సు ఖరీదు పెరిగింది. ధర పెంచకపోవడంతో పంపిణీలో జాప్యమైంది. తాజాగా డాలర్‌ ధర తగ్గటంతో సరఫరా పుంజుకోనుంది. ఇప్పటిదాకా 23వేల బాక్సుల పంపిణీ జరగ్గా... 10వేల మంది వినియోగదారులకే సేవలందుతున్నాయి. 5వేల ప్రభుత్వ కార్యాలయాలకు నెట్‌ కనెక్షన్లు ఇచ్చారు. జాప్యాన్ని తొలగించడానికి కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కోటి చొప్పున బాక్సుల తయారీ యూనిట్లను ప్రోత్సహించారు. ఇక్కడ రెండు వారాల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ముందుగా పెట్టిన ఆర్డర్‌ మేరకు జూన్‌ ఆఖరు నాటికి రెండు లక్షలు, డిసెంబరు నాటికి మొత్తం 10లక్షల బాక్సులు రానున్నాయి.

సాధారణ వినియోగదారులకు ప్రయోజనం...

* స్మార్ట్‌ ఫోన్లలో యాప్‌ల మాదిరిగా సెట్‌టాప్‌ బాక్స్‌ ద్వారా యాప్‌లు అందించి సాధారణ టీవీని స్మార్ట్‌ టీవీగా ఈ బాక్సు మారుస్తుంది.

* యూట్యూబ్‌, స్కైప్‌ వంటి యాప్‌లను పదుల సంఖ్యలో నేరుగా టీవీలోనే చూడొచ్చు. బ్లూటూత్‌తో అనుసంధానించి కీబోర్డు, మౌస్‌తో కంప్యూటరు మాదిరిగా అన్ని పనులూ చేయొచ్చు.

* టీవీలో వచ్చే కార్యక్రమాల్ని ఎంతసేపైనా ఉచితంగా రికార్డు చేయొచ్చు.

* మూవీ ఆన్‌ డిమాండు పేరిట ఉచితంగా సినిమాలు, కుటుంబ అవసరాలకనుగుణంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు చెందిన సమాచారాన్ని అందించేందుకు వీలు.

* భవిష్యత్తులో కొత్త సినిమాల్ని నేరుగా టీవీలోనే చూసే అవకాశం.

* ఏపీ ఫైబర్‌ వినియోగదారులందరితో ఎంతసేపైనా ఫోన్లో ఉచితంగా మాట్లాడుకోవచ్చు.

* హెచ్‌డీ, సాధారణ అనే తేడా లేదు. అన్నీ కలిపి అదనపు రుసుం లేకుండా 250 ఛానళ్ల ప్రసారం.

వాణిజ్య ప్రాతిపదికన..

* 100ఎంబీపీఎస్‌ వేగంతో డేటా బదిలీకి వీలు.

* వివిధ కార్యాలయాల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్‌.

* మార్కెటింగ్‌లో భాగంగా వినియోగదారుల అభిరుచిని తెలుసుకునేందుకు సర్వేల నిర్వహణ.

ప్రభుత్వ అవసరాలకు..

* అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 100 ఎంబీపీఎస్‌ వేగంతో కూడిన నెట్‌.

* 4వేల పాఠశాలల్లో వర్చువల్‌ క్లాస్‌రూంల ఏర్పాటుకు ఫైబర్‌గ్రిడ్‌ తోడ్పాటు.

* నేర నియంత్రణ, పరిశోధన, వాహనాల రాకపోకల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా అమర్చబోతున్న 20వేల సీసీ కెమెరాలను అనుసంధానించడం.

* సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రత్యక్ష పర్యవేక్షణ.

* విద్యుత్తు మీటర్లు, గ్యాస్‌ మీటర్లను స్మార్ట్‌గా మార్చడం. కార్యాలయాల నుంచే వినియోగదారులకు సరఫరా నియంత్రణ

Link to comment
Share on other sites

బిల్లు కట్టకపోతే డిస్కమ్‌ నుంచే కరెంటు కట్‌

ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా స్మార్ట్‌ మీటరింగ్‌

విశాఖలో ప్రయోగం విజయవంతం

ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకొని వినియోగదారుడి విద్యుత్‌ వాడకాన్ని తెలుసుకునేందుకు తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) విశాఖపట్నంలో చేసిన ప్రయోగం విజయవంతమైంది. స్మార్ట్‌ మీటరు మాదిరిగానే ఈ వ్యవస్థ పని చేస్తుందని వెల్లడైంది. ప్రతి యూనిట్‌ విద్యుత్‌ లెక్కలోకి వచ్చే విధంగా చూసుకోవడంతోపాటు చౌర్యాన్ని అరికట్టడం, ఆదాయాన్ని పెంచుకోవడం లక్ష్యంగా స్మార్ట్‌ మీటర్లు తెరపైకి వచ్చాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌) నుంచే వినియోగదారుడు వాడుకునే విద్యుత్‌ను దీని ద్వారా తెలుసుకోవచ్చు. సమన్వయానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో స్మార్ట్‌ మీటర్లను పెట్టాలని రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తోంది. దిల్లీలో ఇటీవల జరిగిన విద్యుత్‌ మంత్రుల సమావేశంలో ఇది ఒక ప్రధాన అంశం. స్మార్ట్‌ మీటరు పెట్టాలంటే ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చాలి. ఒక్కో మీటరు ఖరీదు సుమారు రూ.10 వేలు. ఇంత ఖర్చు భరించే స్థితిలో డిస్కమ్స్‌ లేవు. ఈ దశలోనే రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్‌ రావడంతో దాన్ని ఉపయోగించుకోవాలన్న నిర్ణయానికి విద్యుత్‌ అధికారులు వచ్చారు. దీనిలో భాగంగానే విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీ, మురళీనగర్‌లలో వెయ్యి మంది విద్యుత్‌ వినియోగదారుల ఇళ్లలో ఈపీడీసీఎల్‌ ప్రయోగం చేపట్టింది. ఇప్పటికే 500 ఇళ్లలో ఈ సౌకర్యాన్ని నెలకొల్పారు. ఫైబర్‌గ్రిడ్‌ కోసం టీవీ, ఫోను, ఇంటర్నెట్‌ సౌకర్యానికి వినియోగదారుడి ఇంట్లో సెట్‌టాప్‌ బాక్స్‌ ఉండాలి. అక్కడే విద్యుత్‌ పరంగా ఒక చిప్‌ను రూపొందించి పెట్టారు. అది మీటరు రీడింగ్‌ను స్కాన్‌ చేసి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి డిస్కమ్‌కు వివరం పంపుతుంది. వినియోగదారుడు ఒక వేళ బిల్లు కట్టకపోతే డిస్కమ్‌ నుంచే నిలిపివేయవచ్చు. బిల్లును చెల్లించిన 3 సెకన్లలోనే తిరిగి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించవచ్చు. ఫైబర్‌గ్రిడ్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారుల ఇళ్లలోనే దీని ఏర్పాటుకు అవకాశముంది.

విస్తృతపరుస్తాం...

ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా మూడు విషయాలు- మీటర్‌ రీడింగ్‌, విద్యుత్‌ లోడ్‌తోపాటు వినియోగదారుడికి వెళ్లే విద్యుత్‌ను బిల్లు కట్టకపోతే ఆపి వేయవచ్చు. మళ్లీ ఇవ్వొచ్చు. ఇందు కోసం ఉపయోగించే ఇంటర్‌ప్రెటర్‌, బాక్స్‌కు రూ.1,500-2,000 వరకూ అవుతుంది. దీన్ని పరిశీలించిన తరువాత మరింత మెరుగుపరిచి విస్తృత పరుస్తాం.

-ఎం.ఎం.నాయక్‌, సీఎండీ, ఈపీడీసీఎల్‌
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...