Jump to content

AP fibre Grid project


Recommended Posts

  • Replies 610
  • Created
  • Last Reply

దేశంలో రాష్ట్రాలవారీగా ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. 2.94 కోట్ల కనెక్షన్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు (2.80 కోట్లు), ఆంధ్రప్రదేశ్‌ (2.48 కోట్లు), కర్ణాటక (2.26 కోట్లు) రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం వద్దనున్న గణాంక సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి మాసాంతానికి దేశం మొత్తంమీద 34.26 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేస్తున్నాయి. అత్యల్పంగా హిమాచల్‌ప్రదేశ్‌లో కేవలం 30 లక్షల మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉంది. దేశం మొత్తం మీద 67%పైగా కనెక్షన్లు నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా నగర ప్రాంత వినియోగదారులు తమిళనాడులో ఉన్నారు. దిల్లీలో 2కోట్ల మంది, ముంబయిలో 1.56కోట్లు, కోల్‌కతాలో 92లక్షల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు.

 

15094517_1475660585780861_39489050024554

Link to comment
Share on other sites

  • 2 weeks later...

సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు ఫైబర్‌ గ్రిడ్‌ సేవలుap-fiber-grid-09122016.jpg

సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలకు ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా రూ.149 కే నెట్‌, కేబుల్‌, టెలిఫోన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో జనవరి 14న సంక్రాంతి పండుగ రోజు నుంచి ఈ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా లక్ష కుటుంబాలకి ఈ సేవలు మొదలు పెడతారు. ఈ సేవలకు అవసరం అయ్యే, ఐపీ-టీవీ, ఇంటర్నెట్‌ మోడెమ్‌ల కోసం, విదేశీసంస్థలకు ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. ఈ నెలలోనే, మొదటిగా లక్ష వరకు ఈ పరికరాలు అందించనున్నారు.

ఫ్రీ ఫోన్
ఫైబర్‌ గ్రిడ్‌ పరిధిలో కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు ఒకరితో ఒకరు ఇంటర్‌కమ్‌ తరహాలో ఎంతసేపైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదే ఇతర ఆపరేటర్లకు ఫోన్ చెయ్యాలి అంటే, ల్యాండ్‌ లైన్లకు ఫోన్‌ చేస్తే నిమిషానికి 50 పైసలు, మొబైల్‌ ఫోన్లకు ఫోన్‌ చేస్తే నిమిషానికి రూపాయి చొప్పున చార్జీని వసూలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ నంబర్లు.. 72తోనూ .. 50 నుంచి 59 వరకు ఉన్న సంఖ్యల సిరీ్‌సతో ప్రారంభమవుతాయి.

టీవీ

  • 250 చానల్స్ అందిస్తారు. ఇందులో 30 వరకు తెలుగు చానల్స్ కూడా ఉంటాయి.
  • వీడియో ఆన్ డిమాండ్ సేవలతో, మీకు నచ్చిన సినిమా చూడవచ్చు, మీకు నచ్చిన పాటలు వినవచ్చు.
  • టీవీ కార్యక్రమాలు రికార్డింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది
  • టీవీ సీరియల్స్ మీకు నచ్చినప్పుడు, పాత ఎపిసోడ్స్ కూడా చూడవచ్చు
  • టీవీ ద్వారా స్టడీ మెటీరియల్, ఆన్లైన్ కోర్సులు, ఇంకా అన్ని రకాల శిక్షణా సదుపాయాలు ఉంటాయి
  • టీవీ ద్వారా దూర ప్రాంతాల్లోని వారికి, వైద్యు సేవలు పొందే అవకాసం
  • పైసా ఖర్చు లేకుండా, బంధు మిత్రులలతో వీడియో కాల్ చేసుకోవచ్చు
  • ఏపి యాప్ స్టోర్ ద్వారా, చాలా సదుపాయాలు ఉంటాయి.
  • టీవీనే కంప్యూటర్ గా వాడుకోవచ్చు

ఇంటర్నెట్

  • 15 MBPS వేగంతో 5 GB వరకు ఇంటర్నెట్ వాడుకోవచ్చు
  • 5 GB కంటే ఎక్కువ రావాలి అంటే, వేరే ప్లాన్ తీసుకోవాలి
  • ఇంటర్నెట్, టీవి కి కనెక్ట్ చెయ్యటం ద్వారా, మీ టీవీనే కంప్యూటర్ గా వాడుకోవచ్చు

ఇతర సేవలు

  • కొత్త సినిమాలు ఇంట్లో నుంచి చూడవచ్చు. కొంత చార్జీ పే చెయ్యాల్సి ఉంటుంది
  • కోరుకున్న వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు
  • కోరుకున్న పాటలు వినవచ్చు
  • వంటావార్పు కార్యక్రమాల ద్వారా గృహిణులు, మీకు కావలసిన వంటలు నేర్చుకోవచ్చు

వివిధ రకాల ప్లాన్స్, వాటి చార్జీలు
బేసిక్ ప్లాన్

 
  • ఇంటర్నెట్
    స్పీడ్ - 15 MBPS
    FUP పరిమితి - 5 GB
    FUP పరిమితి తరువాత - 1 MBPS
  • టీవీ చానల్స్ - 250
  • ఫోన్ - ఫ్రీ
  • చార్జీ - 149/-

స్టాండర్డ్ ప్లాన్

  • ఇంటర్నెట్
    స్పీడ్ - 15 MBPS
    FUP పరిమితి - 25 GB
    FUP పరిమితి తరువాత - 1 MBPS
  • టీవీ చానల్స్ - 250
  • ఫోన్ - ఫ్రీ
  • చార్జీ - 399/-

ప్రీమియం ప్లాన్

  • ఇంటర్నెట్
    స్పీడ్ - 15 MBPS
    FUP పరిమితి - 50 GB
    FUP పరిమితి తరువాత - 1 MBPS
  • టీవీ చానల్స్ - 250
  • ఫోన్ - ఫ్రీ
  • చార్జీ - 599/-

కనెక్షన్ కావలి అంటే
మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ను సంప్రదించాలి (జవనరి 14 తరువాత)
మీ పాత ల్యాండ్ లైన్ ఫోన్ వాడుకోవచ్చు, లేదా కొత్తది కొనుక్కోవచ్చు
సెట్ అప్ బాక్స్ కొత్తది కొనుక్కోవాలి. సెట్ అప్ బాక్స్ ధరకు సంభందించి, పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది

Link to comment
Share on other sites

Guest Urban Legend

ktr gadu india lo first fibre grid project TG lo chesthunamu ani ekkada padithe akkda sollu chebuthunnadu

 

aadento naaku ardham kaadu e rojuki ...intha false propaganda ela chesukuntado

Link to comment
Share on other sites

ప్రజలకు చేరువకానున్న ఫైబర్‌ నెట్‌ సేవలు
 
636169483088888635.jpg
  •  వినియోగదారుల ఎదురు చూపులకు తెర
  • కేబుల్‌ ఆపరేటర్లతో అగ్రిమెంట్‌లు
  • అందుబాటులోకి సెట్‌ టాప్‌ బాక్సులు
డిజిటల్‌ ఇండియాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు వినియోగదారులకు చేరువ కానున్నాయి. ఫైబర్‌ టు ద హోమ్‌ (ఎఫ్‌టీటీహెచ్‌) పద్ధతిలో టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌, కేబుల్‌ టీవీ రూ. 149కే ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తొలుత ట్రిపుల్‌ ప్లే (కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్‌నెట్‌) సౌకర్యాలు మాత్రమే కల్పించాలని తలపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం మల్టీ ప్లే సర్వీసులు అందజేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఈ కనెక్షన్‌ ఉంటే టీవీ, ఫోన్‌, నెట్‌ సౌకర్యాలతో పాటు అన్ని రకా ల బిల్లులు, ఆన్‌లెన్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు. మేడికొండూరు: టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌, కేబుల్‌ టీవీ మూ డు సదుపాయాలు తక్కువ ధరకే అందుతున్నాయని తెలుసుకున్న వినియోగదారులు ఏపీ ఫైబర్‌ కోసం ఎదురు చూ స్తున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ వర్క్‌తో కలసి పనిచేసేందుకు ఆన్‌లైన్‌లో ఎన్‌రోల్‌ చేసుకోవాలని కేబుల్‌ ఆపరేటర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది, గుంటూరు జిల్లా నుంచి వెయ్యికి పైగా ఆపరేటర్లు ఎన్‌రోల్‌ అయ్యారు. ఫైబర్‌గ్రిడ్‌ విజయవంతంపై ఆప రేటర్లు అనేక సందేహాలు వ్యక్తం చేయగా గత నెలలో రెం డు దఫాలుగా జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ మేనేజర్‌ సాంబశివరావు నివృత్తి చేశారు.
అధునాతన సెట్‌టాప్‌ బాక్స్‌లు..
ఇటీవల పెద్దనోట్ల రద్దు అనంతరం నగ దు రహిత లావాదేవీల పై పూర్తి స్ధాయిలో దృష్టి సారించిన సీఎం చంద్రబాబునాయుడు వీలైనంత త్వరగా పైబ ర్‌ గ్రిడ్‌ కనెక్షన్‌ ద్వారా ప్రజలు లావాదేవీలు జరిపే విధంగా ప్రణాళిక రూపొందించారు. తొలుత ట్రిపుల్‌ ప్లే (కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్‌నెట్‌) సౌకర్యాలు మాత్రమే కల్పించాలని తలపెట్టిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుం మల్టీ ప్లే సర్వీసులు అంద జేసేందుకు కసరత్తు పూర్తి చేసిం ది. ఈ కనెక్షన్‌ ఉంటే టీవీ, ఫోన్‌, నెట్‌ సౌకర్యాలతో పాటు అన్ని రకాల బిల్లులు, ఆన్‌లైన లా వాదేవీలు నిర్వహించవ చ్చు. ఇందుకు తగ్గట్టుగా డ్యాష్‌బోర్డు లో మార్పులు చేశారు. అత్యం త అధునాతన సెట్‌టాప్‌ బా క్సులను విదేశాల నుంచి ప్రభు త్వం కొనుగోలు చేసింది. కొద్ది రోజుల్లో రూ.4 వేలకు ప్ర జలకు అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకు సెట్‌ టాప్‌ బాక్సులు దొరికితే వినియోగదారులు వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. వాటి పనితీరును ఏపీ ఫైబర్‌తో పరీక్షించుకోవా ల్సి ఉంటుంది.
విశాఖలో నెలాఖరు నాటికి ..
డిసెంబరులో స్ధానిక కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా మారు మూ ల గ్రామాలలోని ఇంటింటికి ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌పీ) ద్వారా కనెక్షన్‌లు ఇవ్వా లని ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే విశాఖపట్నంలోని ఫైబర్‌ గ్రిడ్‌ నుంచి జిల్లాలోని అన్ని మండలాల ప రిధిలో ఉన్న సబ్‌ స్టేషన్‌లలో సాంకేతిక పరికరాలను అమ ర్చారు. సబ్‌స్టేషన్‌ల నుంచి ఆపరేటర్లకు ఎమ్మే స్వోలు కనెక్షన్‌లు ఇస్తున్నారు. అనేక గ్రా మాల్లో ఆపరేటర్లు ఫైబర్‌ కేబు ల్‌ వేసి ఉండడంతో అవే కేబుళ్లలో ఫైబర్‌గ్రిడ్‌ సేవలు అం దించనున్నారు. సెట్‌ బాక్సు లు అందుబాటులోకి వస్తే ఈ నెలాఖరులోగాఅన్ని గ్రామాల కు దాదాపుగా ఫైబర్‌ గ్రిడ్‌ కనెక్షన్‌లు ఇచ్చే అవకాశం ఉంది.
నగదు రహితం .. సులభం
ఈ సేవలు ముందుగా రేష న్‌ దుకాణదారులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు ఇవ్వనున్నారు. దీంతో రేషన దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు మరింత సుల భం కానున్నాయి. ప్రజలు కూడా తమ ఇళ్లలో నుంచే నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకొనేందుకు తేలికపాటి సా ఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్టు ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ అధికారులు చెబుతున్నారు. ఫైబర్‌గ్రిడ్‌ సే వలు అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామంలోను సి గ్నల్‌ పని లేకుండా నెట్‌ సౌ క ర్యం వినియోగించుకోవచ్చ ని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రతి ఇంటికి ఫైబర్‌ కేబుల్‌ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి నే రుగా ఫైబర్‌ కేబుల్‌ వేయనున్నారు. సబ్‌స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరికరా ల నుంచి నేరుగా ప్రతి ఇంటికి ఫైబర్‌ కేబు ల్‌ ఉపయోగించే కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటంది. గతంలో కేబుల్‌ టీవీ ప్రసారాల పంపిణీకి నోడ్‌లు, ట్రాన్స్‌మీటర్లు, యాంప్లిప్లయర్‌లు వాడేవారు. ఎక్కడ సమస్య తలెత్తినా ప్రసారాలలో అంతరాయం కలిగేది. ఎటువంటి ప రికరాలు వాడకుండా సబ్‌స్టేషన్‌ల నుంచి నే రుగా ఫైబర్‌ కేబుల్‌ ద్వారా అందనున్నందు న నాణ్యత కలిగిన ప్రసారాలు అందుతాయ ని ఫైబర్‌ గ్రిడ్‌ అధికారులు చెబుతున్నారు.
ఆపరేటర్ల పాత్ర కీలకం..
ఫైబర్‌గ్రిడ్‌ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆప రేటర్లు కీలకం. నగ దు రహిత లావాదేవీలు నిర్వహణకు ఫైబర్‌గ్రిడ్‌ కీలకంగా మారనుంది. ప్రతి గ్రామంలో కేబుల్‌ కనెక్షన్‌ ఇవ్వడంతోపాటు ఫైబర్‌గ్రిడ్‌ వాడకంపై గ్రామీణులకు అవగాహన కల్పిస్తాం. ఫైబర్‌ గ్రిడ్‌ రాకతో కేబుల్‌ ఆపరేటర్లకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్‌ ఉం టుంది.
Link to comment
Share on other sites

ఫైబర్‌ నెట్‌ సేవలతో టీవీ, ఫోన్‌, ఇంటర్‌నెట్టే కాదు, ఆన్-లైన్ లావాదేవీలు కూడా చెయ్యవచ్చు

 

fiber-net-set-up-box.jpg

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్ట్, వచ్చే నెలలోనే ప్రజలకు చేరువ కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద, టెలిఫోన్‌, ఇంటర్‌నెట్‌, కేబుల్‌ టీవీ రూ. 149కే ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మరిన్ని సేవలు ఇందులో పొండుపరచనుంది. తొలుత ట్రిపుల్‌ ప్లే (కేబుల్‌ టీవీ, ఫోన్‌, ఇంటర్‌నెట్‌) సౌకర్యాలు మాత్రమే కల్పించాలని అనుకున్న ప్రభుత్వం, ప్రస్తుతం మల్టీ ప్లే సర్వీసులు అందజేసేందుకు కసరత్తు పూర్తి చేసింది.

మల్టీ ప్లే సర్వీసులు అంటే ?

మల్టీ ప్లే సర్వీసులు అంటే, అధునాతన సెట్‌టాప్‌ బాక్స్‌లు... టీవీ, ఫోన్‌, నెట్‌ సౌకర్యాలతో పాటు అన్ని రకా ల బిల్లులు, ఆన్‌లెన్‌ లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇందుకు తగ్గట్టుగా డ్యాష్‌బోర్డు లో మార్పులు చేశారు. అత్యం త అధునాతన సెట్‌టాప్‌ బా క్సులను విదేశాల నుంచి ప్రభు త్వం కొనుగోలు చేసింది. ప్రజలు కూడా తమ ఇళ్లలో నుంచే నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకొనేందుకు తేలికపాటి సా ఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్టు ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ అధికారులు చెబుతున్నారు.

ఈ సెట్‌టాప్‌ బాక్స్‌ ఖరీదు ఎంత ?

ఈ సెట్‌టాప్‌ బాక్స్‌ దాదాపుగా 4 వేల వరకు ఉంటుంది. వీటిని EMI పద్దితిలో కూడా కొనవచ్చు. 1700 ముందుగా కట్టి, నెలకు 99 రూపాయలు , 36 నెలలు కట్టాలి. ఇంకో పద్ధతి, 500 ముందుగా కట్టి, నెలకు 99 రూపాయలు , 48 నెలలు కట్టాలి.

బహిరంగ మార్కెట్లో ఇంత కన్నా తక్కువ ధరకు సెట్‌ టాప్‌ బాక్సులు దొరికితే వినియోగదారులు వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. వాటి పనితీరును ఏపీ ఫైబర్‌తో పరీక్షించుకోవా ల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

For consumer, this is an incredible deal ... Rs 150 per month  ... damn ...

 

Is it operational yet? Anyone here using it?

 

yup, Rs->USD 1:1 conversion. I hope they maintain decent reliability.

 

I heard it will be operation around Sankranthi in cities/urban areas, will spread to rural areas slowly.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...