Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

  • Replies 685
  • Created
  • Last Reply
మళ్లీ.. ట్రాఫిక్‌ గండం!
ప్రారంభం కానున్న పిల్లర్ల పనులు
ఇరుకుగా మారనున్న కనకదుర్గ ఆలయ మార్గం
ప్రత్యామ్నాయాలపై పోలీసుల దృష్టి
ఈనాడు - విజయవాడ
amr-gen3a.jpg

నకదుర్గ ఆలయం మార్గంలో మళ్లీ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. పైవంతెనకు సంబంధించి రెండు పిల్లర్ల నిర్మాణ పనులు ప్రారంభం కానుండడమే. అసలే ఇరుకు రోడ్డు. దీనికి తోడు ఆ ప్రాంతంలోని భాగాన్ని బ్లాక్‌ చేసి పనులు మొదలు పెడితే గతంలో సమస్యలు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే కుమ్మరిపాలెం, భవానీపురం మార్గంలో రెండు వైపులా వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. దీని వల్ల వన్‌టౌన్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తప్పాయి. రోడ్డుపైన మళ్లీ పనులు ప్రారంభమైతే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో హైదరాబాద్‌ మార్గంలో వాహన రద్దీ బాగా పెరిగింది. మళ్లీ.. ఇక్కడ ఆంక్షలు విధిస్తే నగరానికి రావడానికి గంటన్నర పైగా సమయం పట్టే పరిస్థితులు రానున్నాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తేనే ఫలితం ఉంటుంది.

* విజయవాడ - హైదరాబాద్‌ మార్గంలో వన్‌టౌన్‌ కీలకం. ప్రకాశం బ్యారేజి నుంచి భవానీపురం వరకు రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. దీని వల్ల గతంలో హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు నగరం దాటాలంటే గంట పైగా పట్టేది. అది కూడా రద్దీ లేకుండా సాఫీగా సాగితేనే. నవ్యాంధ్ర ఏర్పాటు తర్వాత రాజధాని ఇక్కడే వచ్చింది. దీంతో రెండు రాజధానుల మధ్య జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో కనకదుర్గ పైవంతెన మంజూరైంది. కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి అవుతుందని చెప్పినా కాలేదు. నిర్మాణం ప్రారంభం అయి మూడేళ్లు అవుతోంది. ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ ఏడాది తొలి నాళ్ల వరకే దుర్గగుడి మార్గంలో వాహనాల రాకపోకలను అనుమతించలేదు. నగరంలోకి వచ్చే వాటిని కూడా చుట్టుతిరిగి రావాల్సి వచ్చేది. ముఖ్యంగా రాష్ట్ర కార్యాలయాలు, సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు ఇంకా హైదరాబాదులోనే ఉన్నాయి. ప్రతి సోమవారం హైదరాబాద్‌ నుంచి ఈ మార్గంలోనే వస్తున్నారు. వారికి విధులకు సకాలంలో హాజరు కాలేకపోయే వారు. స్థానికులు, భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెండు వైపులా రాకపోకలను అనుమతిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు చాలా వరకు తీరాయి. మళ్లీ ఇప్పుడు పిల్లర్ల నిర్మాణం ప్రారంభించడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ మళ్లింపుపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ రవిశంకర్‌రెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు.

Link to comment
Share on other sites

రైట్‌.. రైట్‌...!
29-12-2018 10:54:37
 
636816776766393471.jpg
  • సోమాకు తొలగిన కష్టాలు
  • ఇక సాఫీగా ‘దుర్గా’ ఫ్లైఓవర్‌
  • కేంద్రం సహకరించకున్నా... రాష్ట్రం చొరవ
  • సీఎంవో నుంచి పిలుపు !
  • కాంట్రాక్టు సంస్థ ఇబ్బందులపై చర్చ
  • ఆర్థిక సాయానికి హామీ
విజయవాడ,(ఆంధ్రజ్యోతి): కనకదుర్గా ఫ్లై ఓవర్‌ భవితవ్యంపై నెలకొన్న చిక్కుముడి వీడింది. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ను ఒడ్డున వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. కేంద్రం నుంచి నిధుల విడుదలకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు చెల్లించేందుకు మార్గం సుగమం చేసింది. మరోవైపు కార్మికులు కూడా పూర్తి స్థాయిలో సమ్మెను విరమించి విధులకు హాజరు కావటంతో దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు తిరిగి పట్టాలెక్కాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దుర్గా ఫ్లై ఓవర్‌ కాంట్రాక్టు సంస్థ కొద్దినెలలుగా కార్మికులకు సరిగా జీతాలు చెల్లించలేకపోతోంది. వరుసగా నాలుగునెలల నుంచి జీతాలను చెల్లించకపోవటంతో ఓపిక పట్టిన కార్మికులు మెరుపు సమ్మెకు దిగటంతో దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి.
 
ఈ ఘటనను ఆంధ్రజ్యోతి ‘అయ్యో.. దుర్గా’ శీర్షికన వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో సోమా ప్రతినిధులను ఆగమేఘాల మీద గురువారం సాయంత్రం సచివాలయానికి పిలిపించారు. రాజధానిలో శంకుస్థాపనలు ఉన్నందున సీఎం వారితో సమావేశం కాలేకపోయారు. సీఎం పాల్గొనలేకపోయినా వ్యక్తిగత కార్యదర్శి రాజమౌళి సమక్షంలో అధికారులతో సమావేశం కావాలని సూచించారు. సోమా ఆర్థిక ఇబ్బందుల గురించి సీఎంవో అధికారులు ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.6 కోట్ల బిల్లులకు సంబంధించి నిలిచిపోయాయని సోమా ప్రతినిధులు తెలిపారు. దీనిపై రీవాల్యుయేషన్‌ త్వరగా పూర్తిచేసి కేంద్ర స్థాయిలో మాట్లాడి త్వరగా బిల్లు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
శనీశ్వరాలయం దగ్గర చేపట్టిన వయాడక్ట్‌ పనులకు సంబంధించిన రూ.6.50 కోట్ల బిల్లులకు కూడా తమకు స్పష్టత లేదని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ పనుల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని గతంలో నిర్ణయించటంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణం బిల్లులు పెట్టి క్లెయిమ్‌ చేసుకోవాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సూచించారు. దీంతో సోమా సంస్థకు గొప్ప ఊరట లభించినట్టు అయింది.అతి త్వరలో కాంట్రాక్టు సంస్థకు అటు కేంద్ర బిల్లులు, ఇటు రాష్ట్ర బిల్లులు కలిపి రూ.12 కోట్లు సర్దుబాటయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు మరో ఊరట లభించింది. మెరుపు సమ్మెలోకి దిగిన కార్మికులు కూడా పట్టు సడలించారు. సోమా ప్రతినిధులు పండుగ లోపు అంటే జనవరి 10 వ తేదీన రెండు నెలల జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వటంతో పూర్తి స్థాయిలో 450 మంది కార్మికులంతా సమ్మె విరమించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...