Jump to content

DURGA GUDI FLYOVER


Recommended Posts

దుర్గా ఫ్లైఓవర్‌కు సరికొత్త సమస్య
17-09-2018 09:55:48
 
636727749446890919.jpg
  • రోడ్డు అలైన్‌మెంట్‌లోకి చొచ్చుకు వచ్చేలా నిర్మించిన ఘాట్లు
  • ధ్వంసం చేస్తేనే నదివైపు అప్రోచ్‌ పనులు
  • అలా చేస్తే బ్యారేజీవైపు రాకపోకలు బంద్‌
  • తలలు పట్టుకుంటున్న ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవే అధికారులు
 
ఆరు వరసల కనకదుర్గా ఫ్లై ఓవర్‌కు.. నాలుగు వరసల రోడ్డు అనుసంధానం. పుష్కరాలకు ముందు హడావిడిగా పని మొదలెట్టేసి, ఇంతకాలం తరువాత ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అధికారులు. రాజీవ్‌గాంధీ పార్కు సమీపంలో ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌, జాతీయ రహదారితో కలిసే చోట.. ఇవతల రోడ్డు మార్జిన్‌! అవతల ఘాట్‌. ముందుకు సాగితే రహదారి నదివైపు మూసుకు పోతుంది. బ్యారేజీ మీదుగా రాకపోకలు సాగించే వారికి, ఫ్లై ఓవర్‌ కింద నుంచి వెళ్లే వారికి దారెలా అన్నది అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 
విజయవాడ: కృష్ణా పుష్కరాల సమయంలో ఉన్నతాధికారుల చర్యలు ఇప్పుడు దుర్గా ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో కొత్త సమస్యలను సృష్టిస్తు న్నాయి. దుర్గ ఫ్లైఓవర్‌కు... నాలుగు వరుసల రోడ్డు అనుసంధానం చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దారి కల్పించడానికి ఘాట్లు పగలగొట్టాల్సి వచ్చేలా ఉంది. పుష్కరాల సమయంలో వందల కోట్ల రూపాయల వ్యయంతో ఆగమేఘాల మీద భారీ రివర్‌ ఫ్రంట్‌ ఘాట్ల నిర్మాణాన్ని తలపెట్టారు. ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి జాతీయ రహదారి సమీపం వరకు కృష్ణ, పద్మావతి ఘాట్‌ నిర్మాణాలను చేపట్టారు. ఇలా నిర్మించడం తగదన్న వాదనలు అప్పట్లోనే వచ్చాయి.
 
నాడు ఫ్లై ఓవర్‌ కమ్‌ రోడ్డు పోర్షన్‌ అలైన్‌మెంట్‌ మీద పెద్దగా ఎవరికీ అవగాహన లేకపోవడం, ఫ్లై ఓవర్‌ పనులు ప్రారంభ దశలో ఉండటంతో లోతుగా ఎవరూ అధ్యయనం చేయలేదు. అయితే అలైన్‌మెంట్‌పై అప్పట్లో జిల్లా, స్థానిక యంత్రాంగాలకు తెలుసు. పుష్కర పనులు చేసిన నాటి అధికారులకూ దీనిపై అవగాహన ఉంది. అయితే ఆ పనులు ఇప్పుడే శాపమవుతున్నాయి. పైన వచ్చే ఆరు వరసల రోడ్డుకు దిగువన ఎనిమిది వరుసల రోడ్డు ఉంటే వీలుగా ఉంటుంది. ఫ్లై ఓవర్‌, కింద ఉండే నాలుగు వరుసల రోడ్డుకు అనుసంధానం కావాలంటే ఇబ్బంది ఉంటుంది. రోడ్డు నిడివి కంటే ఆ రోడ్డుపై దిగబోయే ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌ నిడివి ఎక్కువగా ఉన్నప్పుడు, అప్రోచ్‌ రెండు వైపులా రోడ్డుకు ఇబ్బంది కరంగా ఉంటుంది.
 
స్థలముంటే సమస్య ఉండదు కానీ
రెండు పక్కల తగినంత స్థలం ఉంటే సమస్య ఉండదు. దుర్గా ఫ్లై ఓవర్‌కు రాజీవ్‌గాంధీ పార్కు వద్ద ఫ్లైఓవర్‌ అప్రోచ్‌, రోడ్డును తాకేచోట క్లిష్టమైన సమస్య ఏర్పడింది. అప్రోచ్‌కు ఒకవైపు రాజీవ్‌ గాంధీ పార్కు, మరోవైపు రివర్‌ ఫ్రంట్‌ ఘాట్లు సమస్యాత్మకంగా మారాయి. రాజీవ్‌గాంధీ పార్కు మొదలు నుంచి పద్మావతి ఘాట్‌, శనీశ్వరాలయం వరకు కృష్ణాఘాట్‌ వెంట దారి మూసుకు పోతోంది. అయితే ఫ్లై ఓవర్‌ అశోక స్తంభం నుంచి కెనాల్‌ మీదుగా వస్తుంది కాబట్టి బ్యారేజీ ప్రాంతంలో ఇబ్బంది లేదు. శనీశ్వరాలయం వద్ద ఫ్లై ఓవర్‌ యూటర్న్‌ ఉంటుంది. రాజీవ్‌గాంధీ పార్కు వద్ద పద్మావతి ఘాట్‌ వెంట కొంత మేర రోడ్డుకు అనుబంధంగా వేసిన ఘాట్‌ కాంక్రిట్‌ను పగలగొట్టి గోడ నిర్మాణానికి గోతులు తవ్వారు.
 
అప్రోచ్‌కు గోడను నిర్మించిన తర్వాత దీని పక్కగా రోడ్డు వేయాలంటే పద్మావతి ఘాట్‌ను పగల గొట్టాల్సిన పరిస్థితి. ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ అధికారులు ఒక మీటర్‌ వర కు అలైన్‌మెంట్‌ ఏరియాలోకి ఘాట్‌ వచ్చిందని చెబు తున్నారు. రోడ్డు కోసం ఇంకాస్త పగల గొట్టాల్సి ఉంటుంది. నాడు అధికారుల అనాలోచితన చర్యల కారణంగా ప్రభుత్వంపై అదనపు భారం పడేలా ఉంది. అప్రోచ్‌కు రెండో వైపు రాజీవ్‌గాంధీ పార్కు వెంట స్థలాభావం ఏర్పడటంతో ఈ ప్రాంతంలో ముందస్తుగా భూ సేకరణ ప్రతిపాదన చేశారు. దీంతో పార్కు లోపల కొంత మేర రోడ్డు కోసం విస్తరిస్తున్నారు. ఈ స్థలం సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. సబ్‌స్టేషన్‌, టవర్స్‌, హెచ్‌టీ లైన్స్‌ వంటివి తొలగించాల్సిన అవసరముందంటున్నారు.
 
ప్రభుత్వం దృష్టికి..
ఈ సమస్యపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పద్మావతి, కృష్ణా ఘాట్ల వైపు రోడ్డు కోసం కొంత మేర తొలగించక తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనికి ఆ శాఖల నుంచి సానుకూల సంకే తాలు రావాల్సి ఉంది. ఈ సమస్యను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావి స్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్ర బాబుకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
 
 
దారేది..
రాజీవ్‌గాంధీ పార్కు నుంచి శనీశ్వరాలయం వరకు దుర్గా ఫ్లై ఓవర్‌ అప్రోచ్‌ ప్రాంతానికి కృష్ణానది వైపు దారి మూసుకుపోతే అమరావతి రాజధాని ప్రాంతానికి వెళ్లేవారికి ఇబ్బందులు తప్పవు. నగరం నుంచి అమరావతికి దగ్గర మార్గం ఇదే ! ప్రకాశం బ్యారేజీ మీదుగా వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ దారి మూసుకుపోతే బ్యారేజీ మీద నుంచి ఒక వైపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగనుంది. అన్ని వాహనాలు ఫ్లై ఓవర్‌ మీద నుంచి వెళ్లవు. ఆర్టీసీ దూర ప్రాంతాల బస్సులు మినహాయిస్తే సిటీ బస్సులన్నీ దుర్గగుడి మీదుగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి, మైలవరం వరకు వెళుతుంటాయి.
 
ఇవన్నీ బస్‌స్టాప్‌ల వద్ద ఆపాల్సి రావడంతో ఫ్లైఓవర్‌ కింద నుంచి ప్రయాణించాలి. పీఎన్‌బీఎస్‌ నుంచి వచ్చే దారిలో సమస్య ఉండటంతో సిటీ బస్సులు తుమ్మలపల్లి కళాక్షేత్రం, మార్కెట్‌ వైపు నుంచి వెళ్లాల్సి వస్తుంది. ట్రాఫిక్‌ సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాంతంలో మరిన్ని ట్రాఫిక్‌ కష్టాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కృష్ణలంక వైపు నుంచి హైవే మీదుగా పశ్చిమ నగరానికి రాకపోకలు సాగించే వారికి కూడా ఇబ్బందులు తప్పవు.
Link to comment
Share on other sites

  • Replies 685
  • Created
  • Last Reply
5 minutes ago, Dravidict said:

04:22 - 04:25 dhaggara kanisam pillar construction kuda complete avvaledu. Inka idhi ayinatte Sankranthi ki :sad:

akkada pillar pillar ki madya gap ekkuva vasthundi anta,andukani Y shape chesthunaru,monnati daka pillar design ki approval ivvaledu anta,emadya ne approval ichharu anta.

Link to comment
Share on other sites

54 minutes ago, sonykongara said:

akkada pillar pillar ki madya gap ekkuva vasthundi anta,andukani Y shape chesthunaru,monnati daka pillar design ki approval ivvaledu anta,emadya ne approval ichharu anta.

Y design pillars already 3 vunnayi kada. Temple entrance dhaggara 2. Radham Center dhaggara inkokati. Ikkada inkoka Y design pillar vasthundha?

Link to comment
Share on other sites

  • 2 weeks later...
2 hours ago, gnk@vja said:

Janalu bothulu thenguthunnaru govt ni .

Ninna bavani la valla one town motham block ayinndi....mamulga ledu janam frustration. Chivariki ambulance vellataniki kuda 3 hrs pattindi from kummaropalem to puspa hotel .

 

Who cares it is delayed because of centre/state, finally everyone will blame state govt. as it is the one who is on ground. If it is completed also state govt. only will take credit.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...